Books / in_ernet_dli_2015_394440_2015_394440_English-Jaateeyamulu

1. in_ernet_dli_2015_394440_2015_394440_English-Jaateeyamulu

Page 1

IDIOMS & PHRASES

IN ENGLISH

ఇంగ్లీష్ జాతీయవాక్యములు మరియు

వాడుకబాటలు

T. రవికుమార్ B.Sc.

సరస్వతి పబ్లికేషన్

సత్యనారాయణ పురం, విజయవాడ - 11

Page 2

IDIOMS & PHRASES IN ENGLISH

by T. Ravikumar B.Sc.

PUBLISHERS

FIRST EDITION :

2002

PAGE MAKERS :

VISWA DIGITALS

Annapurna devi Street,

Gandhinagar, Vijayawada - 3

Ph. 400 023

COVER DESIGN :

N.V. Ramana

PRINTED AT :

Ph : 664458, 664457

KAMAKSHI WEB OFF SET

VENKATESWARA RAO STREET, ELURU ROAD,

VIJAYAWADA - 2.

PUBLISHED BY :

SARASWATI PUBLICATION

Satyanarana puram,

Vijayawada- 11

Price: Rs. 20/-

Page 3

IDIOMS & PHRASES

IN ENGLISH

ఇంగ్లీష్ జాతీయములు మరియు పదబంధములు

  1. ABOVE ALL అన్నింటి కన్నా

'Above all' character is a great virtue

అన్నింటి కంటే వ్యక్తిత్వం (శీలం) గొప్పగుణము (సంపద)

  1. AFTER ALL ఇంతకీ, ఎంతైనా

After all blood is thicker than water, forgive her she is your daughter

ఎంతైనా ఆమె నీ కూతురు, మన్నించు.

  1. ABOVE BOARD ఎటువంటి లోపంలేని నిజాయితీ

Very few politicians are 'above board'

కొంతమంది రాజకీయవేత్తలు మాత్రమే నిజాయితీ గలవారు.

  1. 'ALPHA' & 'OMEGA' ప్రధాన ఉద్దేశం

The 'Alpha' & 'omega' of our party is to remove.

poverty and thus usher a new era

మాపార్టీ ప్రధానధ్యేయం పేదరికాన్ని రూపుమాపి నూతన శకాన్ని ప్రారంభించడమే.

  1. ALL IN ALL అన్నీ ఒకరే

'Basha is all in all' in the office

బాషా ఆఫీసులో సర్వాధికారి.

  1. A TO Z సమగ్రమైన జ్ఞానం, లేక అవగాహన కలిగి యుండుట

He knows from 'A to Z' in Astrology

అతను జ్యోతిషంలో మంచి ప్రావీణ్యం పున్నవాడు.

ఇంగ్లీష్ జాతీయములు మరియు పదబంధములు 3

Page 4

  1. 'ABC' OF ANY THING సరియైన పరిచయం లేకుండట.

Vasu does not know 'ABC' in politics

వాసుకి రాజకీయాలు అంతగా తెలియవు.

Leela is just learning 'ABC' in music

లీల యిప్పుడిప్పుడే సంగీతం నేర్చుకుంటుంది.

  1. AT THE TOP OF ONE'S VOICE ఎలుగెత్తి చాటు

Tilak slowted Independence at the top of one's voice

స్వాతంత్ర్యం కోసం తిలక్ ఎలుగెత్తి నినదించాడు.

  1. AT THE RISK OF ప్రమాదం లెక్క చెయ్యక

Soldiars save the country 'At the risk of their lives'

సైనికులు తమ ప్రాణాల్ని త్యాగం చేసి దేశాన్ని రక్షిస్తారు.

  1. A VAIL ONESELF OF AN OPPORTUNITY

అవకాశమును ఉపయోగించుకొను.

He always avails himself of an opportunity

అతను ఎల్లప్పుడూ అవకాశాన్ని వినియోగించుకుంటాడు.

  1. AT THE HEIGHT OF ZENITH

ఉచ్ఛ(అత్యున్నత మైన) స్థితిలో ఉండు

Now Abdul Kalam is 'at the height of zenith'

ఇప్పుడు అబ్దుల్ కలామ్ ఉచ్ఛస్థితిలో ఉన్నారు.

  1. AT ARM'S LENGTH దూరంగా ఉంచు.

Keep internal enemies 'at arm's length'

అంతః శత్రువుల్ని ఆమడ దూరంలో ఉంచు

  1. ACQUAINT ONE SELF WITH పరిచయము కలిగివుండు.

He is not 'acquainted' with litigations.

వివాదాలతో అతనికి పరిచయంలేదు.

  1. AT ONE'S FINGER'S TIPS ఒక విషయంలో పరిపూర్ణమైన జ్ఞానం కలిగియుండీ.

The mathematics is at my finger's tips.

గణిత శాస్త్రంలో నేను నిష్ణాతుడిని

  1. AT ONE'S WIT'S ENDS కలవరపడు

Madan was 'at his wits ends' when be saw the bos sun expectedly.

యజమానిని అనుకోకుండా చూడగానే మదన్ కలవరపడ్డాడు.

Page 5

Idioms & Phrases in English

  1. AT ALL EVENTS ఏదీఏమైనానప్పటికీ

'At all events I must reach school before the bell

ఏ పరిస్థితిలోను గంట కొట్టక ముందే బడికి చేరాలి.

  1. AT ANY COST ఎలాగైనా సరే,

You must get over the hurdles 'at any cost'

ఎలాగైనా సరే, నీవు ఈ అవరోధాల్నొండి బయట పడాలి.

  1. AT ANY RATE ఎలాగైనా సరే

They have to finish the work 'at any rate'

ఎలాగైనా సరే, వారు పనిని పూర్తిచేయాల్సి వుంటుంది.

  1. BURN ONE'S OWN FINGER నష్టపోవు, చేతులు కాల్చుకొను

He burn his finger by depending on others

ఇతరులపై ఆధారపడి అతను చేతులు కాల్పుకున్నాడు.

  1. BED OF ROSES గులాబీల పాన్పు (సుఖమయం)

You have known that 'life is not a bed of roses'

జీవితం గులాబీలపాన్పుకాదు అని మీరు తెలుసుకోవాలి.

  1. BENT UPON నిర్ణయించుకొను.

He was bent upon to take a wrong step despite his well wishers

శ్రేయోభిలాషుల సలహాను లెక్కించకుండా తప్పటడుగు వేశాడు.

  1. BY AND LARGE మొత్తం మీద

By and large the game was a success

మొత్తం మీద ఆట విజయవంతం అయింది.

  1. 'BY AND BY' క్రమంగా

Patient has been improving 'by and by'

రోగి క్రమంగా కోలుకుంటున్నాడు.

  1. BE AT A LOSS ఎమీ తోచని పరిస్థితి

I am 'at loss' to understand what he say.

అతను ఏమంటున్నాడో నాకు అర్థం కావటం లేదు.

  1. BLACK SHEEP నమ్మక ద్రోహులు

There are black sheep in the organisation

ఆ సంస్థలో నమ్మక ద్రోహులున్నారు.

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు 5

Page 6

  1. ALL ROUND DEVELOPMENT అన్ని రంగాలలో అభివృద్ధి

India acheived all round development after independence.

భారతదేశం స్వాతంత్ర్యానంతరం అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది.

  1. AT SIXES AND SEVENS గందరగోళ పరిస్థితి

Every thing was at sixes and sevens when teacher entered the class.

ఉపాధ్యాయుడు తరగతికి చేరే సరికి అంతా గందర గోళంగా ఉంది.

  1. ACT UP TO మాట నిలబెట్టుకొను

At last he ‘Acted upto’ his promises

చివరకు అతను మాట మీద నిలబడ్డాడు.

  1. BY HOOK OR CROOK ఎలాగైనా సరే

I should get first class in exams by hook or crook.

ఎలాగైనా సరే నేను పరీక్షలలో ప్రథమ శ్రేణి సాధించాలి.

  1. BREAK DOWN అస్తవ్యస్త పరిస్థితి

There was break down in the Factory after the death of owner

యజమాని మరణించడంతో ఫాక్టరీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది.

  1. LAVISHLY దుబారాగా,విచ్చల విడిగా

Murali spends his earnings ‘lavishly’ on tours

మురళి తన సంపాదనను విహార యాత్రలకు విచ్చల విడిగా ఖర్చు పెడతాడు.

  1. BE UNDER A CLOUD సందేహాస్పదంగా ఉండటం

His words are be under a cloud

అతని మాటలు సందేహాస్పదంగా ఉన్నాయి

  1. BLOW ONE'S OWN TRUMPET ఆత్మస్తుతి

It is a bad habit to blow one’s own trumpet

ఆత్మస్తుతి చేసుకోవడం దురలవాటు

  1. BE A TOOL IN THE HANDS ఒకరి చేతిలో కీలుబొమ్మ

The king has be come a tool in the hands of the minister.

రాజు మంత్రి చేతిలో కీలుబొమ్మ అయ్యాడు.

  1. BY LEAP AND BOUNDS త్వరగా, వేగంగా

Tejpal is progessed by leaps and bounds in profession

తేజ్‌పాల్ వృత్తిలో మంచి అభివృద్ధిని సాధించాడు.

Page 7

  1. BEAT ABOUT THE BUSH జంక తిరుగుడు సమాధానం

Don’t beat about the bush, tell me the truth

జంక తిరుగుడు మాని నాకు నిజం చెప్పు.

  1. BURN MIDNIGHT OIL తెల్లవారు కష్టపడి చదువు

Pupil generally burn their mid night oil at the time of exams.

సాధారణంగా పరీక్షల సమయంలో విద్యార్థులు తెల్లవారు చదువుతారు.

  1. BURN THE CANDLE AT BOTH ENDS విపరీతంగా ఖర్చు చేయు

It is hazardions to burn the candle at the both ends of the money

యిష్టం వచ్చినట్లు డబ్బు ఖర్చుచేయడం ప్రమాదకరం

  1. BRING TO BOOK చట్టరీత్యా చర్యగైకొను

It is important to bring to book all militants to get peace in Kashmir

కాశ్మీరలో శాంతి కోసం తీవ్రవాదుల మీద చట్టరీత్యా చర్య తీసుకోవడం ముఖ్యం

  1. BY THE BY అన్నట్లు

By the by what is your opinion

అన్నట్లు నీ ఉద్దేశ్యం ఏమిటి?

  1. BY ALL MEANS అన్ని విధముల

I wished his progress by all means.

నేను అన్ని విధాలా అతని అభివృద్ధిని కాంక్షించాను.

  1. BREAK THE ICE చొరవచూపు, మౌనము వీడి మాటలు ప్రారంభించు

When every one is silent we must break the ice by taking the initiative.

అంతా మౌనంగా ఉన్నప్పుడు మనమే చొరవ చూపాలి

  1. BONE OF CONTENTION తగాదాకు ప్రధానమైన కారణం

This site is the ‘bone of contention’ between them

వారి మధ్య తగాదాకు ఈ స్థలమే ప్రధానమైన కారణం.

  1. BAG AND BAGGAGE సరంజామా, మూటముట్లు

The British left our country with their ‘bag and baggage’ after independence.

స్వాతంత్ర్యానంతరం (ఆంగ్లేయులు) తమ సరంజామా సర్దుకొని దేశం విడిచి వెళ్ళారు.

Page 8

  1. BY FITS AND STARTS మధ్యమధ్య, ఆగిఆగి

If you do any work by fits and starts it is not possible to succeed.

పని మధ్యమధ్య ఆపచేస్తూ ఉంటే, నీవు విజయం సాధించడం సాధ్యంగాదు.

  1. BRING TO LIGHT వెలుగులోనికి వచ్చు, వెల్లడియగు

His mistakes were brought to light.

అతని తప్పులన్నీ బయటపడ్డాయి.

  1. BUILD CASTLES IN THE AIR ఊహా సౌధాలు (గాలిమేడలు) నిర్మించు

Pakisthan is building castles in the air to occupy the kashmir.

కాశ్మీర్‌ను ఆక్రమిద్దామని పాకిస్థాన్ గాలి మేడలు కడుతోంది.

  1. BECK & CALL చెప్పచేతలో వుండు

He is not at your 'beck & call' as he is not your servant.

అతను నీ చెప్పచేతలో వుండటానికి నీ సేవకుడు కాడు

49.* BREAD AND BUTTER జీవనాధారం (ఆహారం)

The poor fellow struggling for ‘bread and butter.

ఆ బీదవాడు ఆహారం కోసం పరితపిస్తున్నాడు

  1. WITH A SILVER SPOON సంపన్న కుటుంబంలో జన్మించు.

Abdul kalam was not born with a silver spoon in his mouth

అబ్దుల్ కలామ్ సంపన్న కుటుంబంలో జన్మించలేదు.

  1. BODY AND SOUL మనస్పూర్తిగా

Put your ‘body and soul’ in your studies in order to get good marks.

మంచి మార్కులు సాధించాలంటే మనస్పూర్తిగా చదువు

  1. BEYOUD DOUBT నిస్సందేహంగా

It is beyond doubt of his victory in elections.

అతను ఎన్నికల్లో నిస్సందేహంగా గెలుచును.

  1. BEYOND MEASURE వర్ణించలేనంతగా

Kiran was jubilant beyond measure when he won the international chess title.

అంతర్జాతీయ చెస్ టైటిల్ గెలిచినందుకు కిరణ్ అంతులేని సంతోషంగా ఉన్నాడు.

Page 9

  1. BLACK & BLUE తీ|పంగా

The thief was beaten 'black & bule' by the people.

జనం చేత దౌ|గ చావచితకొట్టబడ్డాడు.

  1. BE ALL AND END ALL పరమావధి

Earning money only is not be all and end all

డబ్బు సంపాదన ఒక్కటే పరమావధి కాదు.

  1. CALL ON ముర్యాదగా కలుసుకొను

The Chief minister called on the Saibaba one his visit to Puttaparthy.

పుట్టపర్తికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి సాయిబాబాను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.

  1. POT CALLS THE KETTLE BLACK

తమలో లోపం పెట్టుకొని యితరులను విమర్శించు

Some people who have blemishes of their own criticise other like 'Pot calls the kettle black'

తమలో లోపాలు ఉంచుకొని యితరులను విమర్శించటం అంటే కుండ టీ కాచే పాత్రను నలిగా ఉంది అనటం లాంటిది.

  1. CALL A SPADE A SPADE ఉన్నది ఉన్నట్లుగా చెప్పు

Ravi is not afraid to Call a spade a spade.

ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి రవి ఎన్నడూ వెనకాడడు.

  1. CHIP OF THE OLD BLOCK అన్ని విధాలా పోలివుండు

Calf is not Chip of the old block she is alike cow in all respects.

దూడ అన్ని విధాలా ఆవును పోలివున్ది.

  1. COME TO BLOWS పోట్లాటకు సిద్ధపడు

The brothers Come to blows over a tiny mis under standing.

చిన్న అవగాహన లోపం వల్ల సోదరులు తగాదాలకు సిద్ధపడ్డారు.

  1. EYE WASH కం|టి తుడుపు

The contribution of the rich for orphans is only an Eye wash.

ధనికులు అనాథలకు చేసే సాయం కం|టి తుడుపు మా|తమే.

  1. CROCODILE TEARS మొసలి కన్నీరు (నటిం చు)

Some people 'shed crocodile tears' over others sufferings.

కొందరు యితరుల కష్టాలు చూసి మొసలి కన్నీరు కారుస్తారు.

Page 10

  1. CALL IN QUESTION విమర్శించు

Patel was never called in Question of his honesty.

పటేల్ ఎన్నడూ తన నిజాయితీ విషయంలో విమర్శలకు గురికాలేదు.

  1. BE TAKEN ABACK నిరాఘాత పో

I was taken aback when the Rat caught the snake.

ఎలుక పామును పట్టుకుంటే నేను ఆశ్చర్యపోయాను.

  1. CUT A SORRY FIGURE సిగ్గుపడు, చిన్న బుచ్చికొను

The student cut a sorry figure when he was found copying

ఒక విద్యార్థి కాపీ చేస్తూఉండగా, పట్టుబడి తెల్లమొగం వేశాడు.

  1. ON THE SPOT అక్కడక్కడే

Take right step on the spot

అక్కడక్కడే సరైనచర్య తీసుకో

  1. CATCH RED HANDED నెరం చేస్తూ ఉండగా పట్టుకొను

The thief was caught red handed by the police

దొంగ పోలీసులకు దొంగతనం చేస్తూ దొరికిపోయాడు.

  1. CRY IN THE WILDERNESS అరణ్యరోదనము

The demand of an enquiry on the misuse of rice by the Congress

was a Cry in the wilderness.

ధాన్యం అక్రమ వినియోగం విషయంలో విచారణ జరపాలని చేసిన కాంగ్రెస్ డిమాండ్ అరణ్యరోదనం అయింది.

  1. COME ROUND తొంగిపోవు

Militants come round before the army with their arms.

తీవ్రవాదులు తమ ఆయుధాలతో సైన్యం ముందు తొంగిపోయారు.

  1. COME ABOUT సంభవించు

It's a mystery how this has come about

ఇది ఎలా సంభవించిందో అర్థం కావటంలేదు.

  1. CARRY OUT నెరవేర్చు

Carry out your duties & obligations with dedication

నీ విధులు, బాధ్యతలు అంకిత భావంతో నిర్వహించు.

  1. CARRY ON కొనసాగించు

Carry on your business.

నీ వ్యాపారాన్ని కొనసాగించు.

10

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు

Page 11

Idioms & Phrases in English

  1. CALL FOR అడుగు, కోరు (అధికారపూర్వంగా)

Rajesh was Called for an explanation for the negligence.

నిర్లక్ష్యం వల్ల రాజేష్‌ను సంజాయిషీ అడిగారు.

  1. DO AWAY WITH వదిలించుకొను.

The dowry system, a social evil should be done away with

సామాజిక దురాచారం అయిన కట్నాన్ని నిర్మూలించాలి.

  1. DASH ONE'S HOPES ఆశ నిరాశ అగు

Chandu's hopes were dashed upon when he failed in entrance test.

ప్రవేశ పరీక్షలో తప్పినందువల్ల చందూ ఆశలన్నీ నిరాశలయ్యాయి.

  1. TO CRAM IN కంఠస్థము చేయు

Students cram in just before the answers.

విద్యార్థులు పరీక్ష ముందు హడావిడిగా జవాబులు కంఠస్థం చేస్తారు.

  1. CAST A SLUR UPON పరువు నష్టం కలిగించు

Some people won't hositate to cast a slur upon prominent persons.

కొంతమంది పేరు ప్రతిష్టలు ఉన్నవారిని అపఖ్యాతి పాలుచేయటానికి వెనుకాడరు.

  1. CHEW THE CUD ఆలోచించు, నెమరు వేయు

Genious people often chew the cud.

మేధావులు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు.

78 CAPITAL PUNISHMENT మరణ శిక్ష

The culprits who have assasinated Rajiv Gandhi, were awarded capital punishment.

రాజీవ్ గాంధీ హత్య చేసిన వారికి మరణ దండన విధించబడింది.

  1. CAPITAL ERROR (BLUNDER) పెద్ద తప్పు

You can escape punishment even after making a capital error.

ఎంత పెద్ద తప్పు చేసినా నీ దగ్గర అధికారం ఉంటే తప్పించుకోగలవు.

  1. COCK & BULL STORY కాకమ్మ కథ, కట్టుకథ

Don't tell me cock & bull story.

కాకమ్మ కథలు చెప్పకు

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు

11

Page 12

  1. CALL NAMES నిందించు

Don't call your parents

మీ తల్లి దండ్రులను నిందించకు

  1. CUT ONE SHORT మాట్లాడుతూ ఉండగా అడ్డుతగలడం

The minister was forced to cut short his speech by the unruly

mob agitating on some issues.

కొన్ని సమస్యలపై ఆందోళన జరుపుతున్న ఆందోళన కారుల కారణంగా మంత్రి

తన ఉపన్యాసాన్ని విరమించెను.

  1. FLASH BACK జరిగిపోయిన సంఘతి.

Don't bore me with flash back stories

జరిగిపోయిన కథలు చెప్పి నన్ను విసిగించకు.

  1. FOR WANT OF కొరత, అవసరం

I could not attend the marriage for want of meeting

సమావేశం వున్నందు వల్ల నేను పెళ్ళికి హాజరుకాలేకపోయాను.

  1. ANOTHER FISH TO FRY వేరే పని ఉండు

He has another fish to fry let him go

అతనికి వేరే పని వుంది వెళ్ళనీ!

  1. FISH OUT OF WATER ఆసక్తి లేక పోవు, ఆసక్తి కనబరచకపోవు

I have no Fish out of water of politics.

నాకు రాజకీయాలపై ఆసక్తిలేదు.

  1. FISH IN TROUBLED WATER తాబం తీయు

Some people try to Fish in troubled waters.

కొంతమంది యతరల యిబ్బందుల నుండి లాభం పొందాలని చూస్తారు.

  1. SMOKE WITH OUT FIRE నిప్పు లేకుండా పొగరాదు

There is no Smoke with out fire.

నిప్పు లేకుండా పొగరాదు.

  1. END IN SMOKE వృధా అగు, తుస్సుమను

All his efforts ended of smoke to become Boxer.

బాక్సర్ కావాలనే అతని ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి.

  1. ELEVENTH HOUR చివరి క్షణంలో

We the reached the rialway station at the eleventh hour.

మేము చివరి నిముషంలో రైల్వే స్టేషన్ చేరుకున్నాము.

12

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు

Page 13

  1. DEFEAT THE PURPOSE అరచిన ప్రయోజనం దెబ్బతిను

Some schemes launched by the Goverment defeated the very purpose of helping the poor due to lack of proper implemenation.

తగిన చర్యలు తీసుకోని కారణంగా, ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు వాటి ప్రయోజనమే దెబ్బతింటున్నది.

  1. GO THROUGH పరిశీలించు, (చదువు)

Go through the text you can know better

పాఠ్య పుస్తకాన్ని చదువు నీకు మరింత బాగా అర్థం అవుతుంది.

  1. GET THROUGH ఉత్తీర్ణత సాధించు

Rani got through the examination

రాణి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది.

  1. FROM FRYING PAN IN TO THE FIRE ఒక ఆపద నుండి మరొక

His condition is now as from frying pan in to the fire

అతని పరిస్థితి యిప్పుడు పెనుమీంచి పొయ్యిలో పడ్డట్టుగా వుంది.

  1. FAR AND WIDE అంతటా, ఎల్లెడలా

His fame spread far and wide

అతని ఖ్యాతి దశదిశలా వ్యాపించింది.

  1. FACE TO FACE ముఖా ముఖీ

We are discussintg our lesson Face to face.

మేము మా పాఠాన్ని ముఖాముఖీ చర్చించుకుంటున్నాము.

  1. TO FACE ఎదుర్కొను

We have to face any challenge.

మనం ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోవాలి.

  1. FROM HEAD TO TOE నఖ శిఖ పర్యంతం (పూర్తిగా)

He was hot (drenched) From head to toe

అతను నఖశిఖ పర్యంతం కోసంతో రగిలిపోతున్నాడు.

  1. FROM HAND TO MOUTH కష్టంగా, చాలీచాలని

He is living with salary from hand to mouth

అతను చాలీచాలని జీతంతో జీవిస్తున్నాడు.

Page 14

  1. FALL A PREY TO బలి అగు

Don't Fall a prey to others traps

ఇతరుల వలలో పడి మోసపోవద్దు.

  1. IN THE NICK OF TIME సమయానికి (సరియైన)

They went In the nick of time

వాళ్ళు సరిగ్గా సమయానికి వెళ్ళారు.

  1. In vain futile వృధా ప్రయాస, వ్యర్థప్రయత్నం

All his efforts went In vain futile

అతని ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి.

  1. HITHER & THITHER అక్కడక్కడ, చెల్లాచెదురుగా

Why are you wandering Hither & thither?

ఎందుకు నువ్వు అటుయిటు తిరుగుతావు?

  1. TAKE THE BULL BY THE HORN అవకాశమును వినియోగించుకో

Take the bull by the horn other wise you have to loose the

chance.

అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే అవకాశాన్ని వదులుకోవలసి వస్తుంది.

  1. HOLD GOOD (WATER) వర్తించు, బలం

Your argument has Hold good (water)

నీ వాదనలో బలం ఉంది.

  1. HIT THE NAIL ON THE HEAD ఖచ్చితంగా వ్యవహరించు

Chairman has the talent to Hit the nail on the head in the house.

సభలో ఖచ్చితంగా వ్యవహరించే నేర్పు చైర్మన్‌గారికి ఉంది.

  1. HIDE & SEEK దాగుడుమూత

Life is a game of Hide & seek.

జీవితం ఒక దాగుడుమూతలాట.

  1. HEAVY HEART వేదనతో, భారముగా

Rafi went to Vizag with Heavy heart.

రఫీ బాధగా వైజాగ్ వెళ్ళాడు.

  1. HAVE AN AXE TO GRIND లాభము పొందు

Every one has his axe to grind.

ప్రతివాడికి స్వలాభం (స్వార్థం) ఉంటుంది.

Page 15

  1. HARD NUT TO CRACK కొరుకుడుపడని

His son is a Hard nut to crack.

అతని కొడుకు మహోమంది.

  1. HAVE A HAND IN ప్రమేయము ఉండు

Swathi has a Have a hand in the dealing.

స్వాతికి వ్యవహారంలో ప్రమేయం ఉంది.

  1. INTRUDE UPON లోనికి చొరపడు

Don't Intrude upon other effaris.

ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకు.

  1. SUPERIORITY COMPLEX ఆధిక్యతాభావము

Superiority complex ultimately leads to 'ego'

ఆధిక్యతాభావం, చివరికి ‘అహం’గా పరిణమిస్తుంది.

  1. INFERIORITY COMPLEX న్యూనతాభావం

Inferiority complex mars your personality.

న్యూనతాభావం, వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది.

  1. INS & OUTS రహస్యములు

The Ins & outs of the whole affair should come to light.

ఆ వ్యవహారం అంతా బట్టబయలు కావాలి.

  1. IN A NEET SHELL సంక్షిప్తంగా

Tell me In a nut shell of the incident happened.

ఆ సంఘటన గురించి క్లుప్తంగా చెప్పు.

  1. IN THE AIR అమలుకాకపోవు

New propose has not been implemented, still it is in the air.

కొత్త ఆలోచన అమలుకాలేదు. ఇంకా అమలుకు నోచుకోలేదు.

  1. GIVE VENT TO యిచ్చు, లోనగు

Don't Give vent to emotion.

భావావేశానికి లోనుగా కు.

  1. IN THE EVENT OF సందర్భంలో

In the event of your birth day we congratulate you.

నీ జన్మదిన సందర్భంగా మేము నిన్ను అభినందిస్తున్నాము.

Page 16

  1. IN THE WAKE OF వెంటనే, సమయంలో

Srinu was disappointed in the wake of results.

ఫలితాలు వెలువడిన సందర్భంలో శ్రీను నిరాశ చెందాడు.

  1. IN HIGH SPIRITS ఉల్లాసంగా

He is In high spirits.

అతను మంచి ఉత్సాహంగా ఉన్నాడు.

  1. IN THE LONG RUN చివరలో, ఆఖరుకు

There will may be good results In the long run.

చివరకు మంచి ఫలితాలు వుంటాయి.

  1. HAND IN GLĒVE ఒక్కటిగా, కలిసిపోవు

Hasan & Hussain are in Hand in gleve.

హసన్, హుస్సేన్‌లకు ఒప్పందంలో సంబంధం వుంది.

  1. KEEP UP కొనసాగించు

Keep up the same spirit.

అదే ఉత్సాహాన్ని కొనసాగించు.

  1. KEEP AN EYE ON దృష్టిని కేంద్రీకరించు

Keep an eye on the border orered the major.

సరిహద్దుపైన దృష్టిని కేంద్రీకరించండి అని మేజర్ ఆనుజ్ఞ యిచ్చాడు.

  1. KEEP THE BALL ROLLING సంప్రదింపులు కొనసాగించు

Both parties should Keep the ball rolling to get a settlement.

ఒక ఒడంబడిక కుదరటానికి యిదరు పక్షాలు చర్చలు కొనసాగించటం అవసరం.

  1. KEEP ABREAST - KEEP PACE WITH ముందంజవేయు

The player is unable to Keep abreast - keep pace with other players.

ఆ ఆటగాడు ఇతర ఆటగాళ్ళతో పోటీ పడలేకపోతున్నాడు.

  1. KNOW NO BOUNDS ఆనందానికి హద్దులేకపోవు

His joy knew no bounds when he came to know of the results.

అతని ఫలితాలు తెలియగానే సంతోషానికి అవధులు లేవు.

  1. SPELL BOUND మంత్రముగ్ధులు

The audiences were Spell bound when Iswarya Rai gave them audiance.

ఐశ్వర్యరాయ్‌ని చూడగానే ప్రేక్షకులు మంత్రముగ్ధులైనారు.

16

ఇంగ్లీష్ జాతీయములు మరియు పదబంధములు

Page 17

  1. JACK OF ALL TRADES అన్ని పనులు చేసేవాడు

Jack of all trades is like a 'rolling stone'.

అన్ని వ్యాపారాల్లో వేలు పెట్టేవాడు తిరిగే బండలాంటి వాడు.

  1. INSPIT OF ధునప్పటికినీ

Inspite of his hard work he could not pass the exam.

ఎంతో కష్టించి పనిచేసినా, అతను పరీక్షలో పిజయం పొందలేక పోయాడు.

  1. IRONY OF FATE విధివిలాసం

No body can change the 'Irony of fate'.

విధిని ఎవరూ మార్చలేరు.

  1. LOOK DOWN UPON తక్కువగా చూచు

Juniors feel that they were looked down upon by the seniors.

చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు తక్కువగా చూస్తున్నారని భావిస్తున్నారు.

  1. LET OFF వదిలివేయు

The thief was let off after grabbing

చివాట్లు పెట్టిన అనంతరం దొంగని వదిలేశారు.

  1. LEAVE NO STONE UNTURNED అన్ని విధముల ప్రయత్నించు

Pavan left no stone unturned to secure a job.

ఉద్యోగం సంపాదించటానికి పవన్ చెయ్యని ప్రయత్నమంటూ లేదు.

  1. KNOW WHAT IS WHAT వాస్తవమును గ్రహించు

First Know what is what before you come to a conclusion.

ఒక నిర్ణయానికి వచ్చే ముందు అసలు విషయాన్ని తెలుసుకో

  1. KILL TIME కాలక్షేపం చేయు

Some people watch movies just to kill time.

కొందరు కేవలం కాలక్షేపానికి సినిమాలు చూస్తారు.

  1. KEEP ONE'S WORD మాటనిలబెట్టుకొను

King Harischandra kept his word given to rishi Viswamitra.

హరిశ్చంద్ర మహారాజు విశ్వామిత్రకు యిచ్చిన మాటనిలబెట్టుకొనెను.

  1. KEEP IN TOUCH WITH సంబంధం కలిగియుండు

Keep in touch with the innocent friend.

అమాయకుడైన ఈ స్నేహితునితో సంబంధం కల్గివుండు.

Page 18

  1. KITH & KIN బంధువులు, పిల్లాజల్లు

He came to marriage with his kith & kin.

అతను తన పిల్లా జల్లుాతో సహా పెళ్ళికి వచ్చాడు.

  1. MORE OR LESS ఇంచుమించు

It is More or less the same

ఇంచుమించుగా అది ఒకటే.

  1. MICE MATRTERS నీళ్ళు నమలు

Don't Mice matrtres come straight to the point.

నీళ్లు నమలకు తిన్నగా అసలు విషయానికిరా.

  1. MAKE AMENDS సరిదిద్దుకొను

There is no time to make amends.

పొరపాట్లు సరిదిద్దుకోవటానికి సమయం లేదు.

  1. MAKE A FUSS హంగామా, రాద్దాంతంచేయు

Don't make a fuss over silly things.

చిన్న విషయాల విషయంలో రాద్దాంతంచేయు.

  1. NONE OF YOUR BUSINESS నీకు సంబంధంలేదు

None of your business keep quite.

నీకు ఎటువంటి సంబంధంలేదు, మాట్లాడవద్దు.

  1. MEND YOUR WAYS పద్దతులు మార్చుకొను

It is to mend your ways the right time.

నీ పంధా (పద్దతి) మార్చుకోవటానికి ఇది సరైన సమయం.

  1. MIND ONE'S BUSINESS తన పని తాను చూసుకొను

Mend your own business Don't interfere in this issue.

నీ పని నీవు చూసుకో ఈ విషయంలో కల్పించుకోవద్దు.

  1. AS A MATTER OF FACT వాస్తవానికి, నిజానికి

As a matter of fact he was not there when the incident happend.

వాస్తవానికి, ఈ సంఘటన జరిగినప్పుడు అతను అక్కడలేడు.

  1. MAKE BOTH ENDS MEET ఖర్చు తగ్గించుకొను

It is difficult to make both ends meet.

ఈ పరిస్థితిలో ఖర్చు తగ్గించుకోవడం కష్టం.

Page 19

  1. LET THE CAT OUT OF THE BAG FIRST

అసలు విషయము బయట పడనీ

Let the cat out of the bag first Don't get irritated.

ముందు పిల్లిని సంవిలోనుంచి బయటికిరానీ, అసలు సంగతి తెలియనీ అప్పటి వరకు ఆవేశపడకు.

  1. LOOK FORWARD TO ఎదురుచూచు, నిరీక్షించు

He is looking forward eagerly to see her.

ఆమెను చూడాలని అతను ఆతృతతో ఎదురుచూస్తున్నాడు.

  1. NIP IN THE BUD మొగ్గలోనే (తుంచివేయు

Every hurdle must be nipped in the bud.

ప్రతి అపరోధాన్నీ మొగ్గలోనే (తుంచివేయాలి.

  1. LACK OF UNDERSTANDING అవగాహనలేకపోవు

Lack of understanding is root of problems between wife and husband.

భార్యభర్తల మధ్య సమస్యలకు మూలం అవగాహనలోపం.

  1. NO LOVE LOST ద్వేషించు

There is no No love lost between them

వారి మధ్య సత్సంబంధాలులేవు.

  1. MATTER OF COURSE మామూలు విషయం

It's Matter of course

అది మామూలు విషయం.

  1. MAN OF PRINCIPLES సిద్ధాంతాలకు కట్టుబడి యుండు

Ganghdiji was a Man of principle in politics.

గాంధీజీ రాజకీయాల్లో సిద్ధాంతాలకు కట్టుబడేవారు.

  1. MAN OF WORD నిజాయితీగల, మాటతప్పని.

He is a Man of word.

అతను మాటమీద నిలబడే వ్యక్తి.

  1. MAKE MUCH OF అతిశయోక్తిచేయు

Don't Make much out of nothing.

ఏమీలేనిదానికి, గొరంతలు కొండంతచెయ్యకు.

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు

19

Page 20

  1. MAKE OUT చదవటం, అర్థం చేసుకొను

I could not make out your letter.

నీ ఉత్తరంలోని సంగతులు నాకు అర్థంకాలేదు.

  1. MOVE HEAVEN & EARTH విశ్వప్రయత్నము చేయు

He moved heaven & earth to get the work done.

అతను ఆపని పూర్తి చెయ్యడానికి విశ్వప్రయత్నం చేశాడు.

  1. MAKE A FOOL OF దద్దమ్మను చెయ్యకు

Don't make fool others

ఇతరులను తెలివి తక్కువ దద్దమ్మలుగా చెయ్యకు.

  1. OF A HIGH ORDER మిక్కిలి ప్రధానమైన

India's Himalayas is of a high order in the world.

భారతదేశపు హిమాలయాలకు ప్రపంచంలో మంచి పేరుంది.

  1. ON THE EVE OF సందర్భంగా

Huge Vinayaka Idols were installed on the eve of Vinayaka chavithi.

వినాయక చవితి సందర్భంగా భారీ వినాయక విగ్రహాలు ప్రతిష్ఠింపబడ్డాయి.

  1. ONCE FOR ALL శాశ్వతంగా

The case was closed once for all.

ఆ కేసు శాశ్వతంగా మూసివేయబడింది.

  1. HELTER & SKELTER చిందర వందరగా

Every thing was Helter & skelter when we went there.

మేము అక్కడికి వెళ్ళేసరికి అంతా అస్తవ్యస్తంగా ఉంది.

  1. OVER HEAD & EARS తలమునిగ, నిండుగా, పూర్తిగా

The trader is over head & ears in debts.

ఆ వ్యాపారి అప్పుల్లో నిండా మునిగి ఉన్నాడు.

  1. OUT OF THE CONTEXT అసందర్భం

Pakistans insistence on only Kashmir issue is Out of the context.

కాశ్మీర్ సమస్యపైనే పాకిస్థాన్ పట్టుపట్టడం అసందర్భం.

  1. OUT OF QUESTION అసాధ్యం

Settlement between the two parties is Out of question.

ఆ రెండు వర్గాల మధ్య ఒప్పందం కుదరడం అసాధ్యంగా కనిపిస్తోంది.

20 ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు

Page 21

  1. CLOSE THE CHAPTER అధ్యాయం ముగింపు

The discussions between India and Pakistan is not a Closed chapter

భారత - పాకిస్తాన్ల మధ్య కాశ్మీర్ సమస్య ముగిసిన అధ్యాయం కాదు.

  1. OPEN A NEW CHAPTER కొత్త అధ్యాయం (జీవితం) ప్రారంభించు

He opened a new chapter by starting a new business.

అతను కొత్త వ్యాపారం మొదలుపెట్టి నూతన జీవితాన్ని ప్రారంభించాడు.

  1. NEITHER HEAD NOR TAIL అర్థం పర్థం లేని, తలతోక

His letter carries (conveys) Neither head nor tail.

అతని ఉత్తరానికి తలాతోక లేదు.

  1. PRIME OF LIFE యౌవన దశ

The youg girl died in her prime of life.

ఆ యువతి తన యవ్వన దశలో చనిపోయింది.

  1. PUT THE CART BEFORE THE HORSE బండిని గుర్రం ముందు వంచు

Some times he puts the cart before the horse.

అతను ఒకోసారి ఆలోచనలేని పనులు చేస్తుంటాడు.

  1. PULL TOGETHER కొనసాగించు

The newly marries Vani and Kishore are Pulling together.

కొత్తగా పెళ్ళయిన వాణి కిషోర్‌లు మంచిగా సంసారాన్ని లాగుతున్నారు.

  1. PUT UP WITH భరించు, సహించు

He Put up with the insult meted out to him.

అతనికి జరిగిన అవమానాన్ని భరించాడు.

  1. PICK HOLES దోషములు ఎంచుట

Don't Pick holes in another's coat.

ఇతరులలో లోపములు ఎంచవద్దు.

  1. PART & PARCEL అంతర్భాగము

Kashmir is a Part & parcel of India.

కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగము.

  1. NAKED FACT నగ్న సత్యం

It is a Naked fact that prices are increasing day by day.

రోజురోజుకూ ధరలు పెరుగుతున్నాయనేది నగ్న సత్యం

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు

21

Page 22

179 OPEN SECRET బహిరంగ రహస్యం.

It is a Open secret that he has second family.

అతనికి మరో కుటుంబం వుందన్నది బహిరంగ రహస్యం.

  1. OPEN HEART దాపరికం లేకుండా

Vajapayie had talks with Pervez Mushraff with Open heart.

ప్రధాని వాజ్‌పేయి పెర్‌వేజ్ ముష్రాఫ్‌తో చాలాసార్లు దాపరికం లేకుండా చర్చలు జరిపారు.

  1. ON THE OTHER HAND అందుకు భిన్నంగా

He has many other engegements on the other hand.

అతనికి మరో వైపు చాలా వ్యాపకాలు వున్నాయి.

  1. RUN SHORT తగ్గిపోవు

Water resources are running short due to draught

కరువు వల్ల నీటి వనరులు తరిగిపోతున్నాయి.

  1. RANK & FILE సామాన్యజనం

This custom of bribe is prevalent among the Rank & file.

లంచం అనే దురాచారం అందరిలోను ఉంది.

  1. RAISE A HUE & CRY గగ్గోలు పెట్టు

She oftenly Raise a hue & cry.

ఆమె తరచుగా గగ్గోలు పెడుతున్నది.

  1. THE DEVIL QUOTES THE SERIPTURES దయ్యాలు వేదాలు వల్లించినట్లు

His advice is like the devil quotes the seriptures.

అతని సలహా ‘దయ్యాలు వేదాలు వల్లించినట్లు’ ఉంది.

  1. IN QUEST OF అన్వేషణలో

Ravi went to Bombay In quest of an employment.

రవి ఉద్యోగ అన్వేషణలో బొంబాయి వెళ్ళాడు.

  1. PULL ON కొనసాగించు

He is Pulling on well with his business.

అతను బాగానే వ్యాపారం చేస్తున్నాడు.

  1. PUT UP బసచేయు

I Put up my self in Brindavan hotel when I went to Ooty.

నేను ఊటీ వెళ్ళినప్పుడు ‘బృందావన్’ హోటల్‌లో బసచేసితిని

22 ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు

Page 23

Idioms & Phrases in English

  1. PAY IN ONE'S OWN COIN గుణపాఠం చెప్పు

The rabbit Paid the lion in its own cion.

కుందేలు సింహానికి తగిన గుణపాఠం చెప్పింది.

  1. POKE ONES NOSE ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకొను

Don't poke your nose in others affairs.

ఇతరుల వ్యవహారంలో తలదూర్చకు.

  1. BOLT THE STABLE AFTER THE HORSES FLED గత జలసేతు బంధనం (నీరు పోయిన తర్వాత అడ్డుకట్ట వేయడం)

His deed was just like Bolt the stable after the horses fled.

అతని చర్య గుర్రాలు శాలలో నుంచి బయటికి వెళ్ళిపోయినతర్వాత శాలకు గడియ పెట్టటంలాగా ఉంది.

  1. PICK UP వేరుకొను, అభివృద్ధి పొందు

Your girl is picking up slowly.

మీ అమ్మాయి నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్నది.

  1. SQUARE MEAL సంతృప్తి కరమైన భోజనం

You can satisfy a person eith a square meal

సంతృప్తి కరమైన భోజనం పెట్టి ఒక వ్యక్తిని మీరు తృప్తిపరచవచ్చు.

  1. SET ASIDE తోసిపుచ్చు

The Supreme Court set aside the judgement of lower court.

సుప్రీంకోర్టు క్రింది కోర్టు తీర్పును తోసిపుచ్చెను.

  1. SCOT FREE స్వేచ్ఛగా తిరుగు

Criminals should not scot free in our society.

మన సమాజంలో నేర చరిత్రగల వారు స్వేచ్ఛగా తిరగరాదు.

  1. RIDE ROUGH SHOD దౌర్జన్యముగా, ఇష్టము వచ్చినట్లుగా

Leaders who are in power those are riding round shod.

అధికారంలో ఉన్న నాయకులు తమ యిష్టం ప్రకారం ప్రవర్తిస్తున్నారు.

  1. TURNING POINT ప్రధానమైన మార్పు (మైలురాయి)

'Quit India' movement was the 'Turning point' of the freedom struggle of our country.

'క్విట్ యిండియా' ఆందోళన (ఉద్యమం) స్వాతంత్ర్య పోరాటంలో ఒక మలుపు

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు 23

Page 24

  1. MILE STONE ప్రధానమైన

26 Janury, 1950 is the mile stone for India.

1950, జనవరి 26 భారతదేశానికి ఒక మైలు రాయి.

  1. RED LETTER DAY మరిపోలేని రోజు

15th August, 1947 is the Red letter day for Indians.

భారతీయులకు 1947, అగస్టు, 15వ తేదీ మరుపురాని సంఘటన

  1. REAP THE CONSEQUENCES ఫలితం అనుభవించు

Every body must Reap the consequences of their actions.

ప్రతి ఒక్కరు తమ చర్యల ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది.

  1. RUN THE RISK OF తెగించు, ధైర్యము చేయు

Climbing the mountain is nothing but run the risk of.

ఆ పర్వతాన్ని అధిరోహించడం ప్రాణాలకు తెగించడమే!

  1. RISE TO THE OCCASIONసమయం,సందర్భాన్ని అందుకోవాలి

We must rise to the occasion

మనం అవకాశాన్ని అందుకోవాలి.

  1. THROUGH THICK AND THIN కష్టసుఖాల్లో

Husband and wife are expected to go a long way Through thick and thin.

భార్యాభర్తలు కష్టసుఖాలు పంచుకొని ఎంతో దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

  1. TAKE PLACE సంభవించు

A earth quake took place in Maharastra recorded on rectorscale cousing heavy loss in catcer.

మహారాష్ట్రలో (లాతూర్) జరిగిన భారీ భూకంపం తీవ్రనష్టం కలిగించింది.

  1. TO AND FRO రానుపోను

He paid the fare To and fro at a time.

అతను రానుపోను రుసుమును ఒకేసారి చెల్లించాడు.

  1. STONE'S THROW సమీపంలో, దగ్గర్లో, అందుబాటులో

The Hospital is a Stone's throw.

హాస్పటల్ దగ్గరలోనే వుంది.

24 ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు

Page 25

  1. WEAR & TEAR అరుగుదల

The period of wear and tear of some articles does not lastlong.

కొన్ని వస్తువుల నాణ్యత ఎక్కువ కాలం ఉండదు త్వరలోనే అరుగుదలకు గురి అవుతాయి

  1. WHITE ELEPHANT వ్యర్థాఖర్చు, భారమైన పథకం

Some departments have become white elephant to Government.

కొన్ని శాఖలు ప్రభుత్వానికి భారంగా పరిణమించినాయో.

  1. WIND UP రద్దుచేయు

It is better to wind up your business.

నీ వ్యాపారం మూసి వేయడం మంచిది.

  1. WELL TO DO సంపన్నమైన

Relianice is a well to do company in India.

రిలయన్స్ కంపెనీ భారతదేశంలో సంపన్నమైనది.

  1. PANDRE'S BOX సమస్యల పుట్ట

Don't open the pandre's box.

సమస్యల పుట్టని తెరవ వద్దు.

  1. GOOD SAMARITAN ఆపద్భాంధవుడు

When he is in trouble a good samaritan came to his rescue.

అతను కష్టాల్లో, ఉన్న సమయాల్లో ఒక ఆపద్భాంధవుడు వచ్చి రక్షించాడు.

  1. SWORD OF DAMOCLES మెడమీద కత్తి

A Sword of Damocles is hanging on the head of Salman Rashdi.

సల్మాన్‌రష్దీ మెడమీద కత్తి త్రేలాడుతూ ఉంది.

  1. PUT IN COLD STORAGE అమలుకాకుండా అటకేక్కొంచు.

33 percent seats reservation for women in parliament was put in cold storage.

సీట్లకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో అమలుకు నోచుకోలేదు.

  1. HUSH MONEY కేసు మాఫీ చేయుటకు చెల్లించు డబ్బు

He spent hush money to hush up thecase.

అతను కేసు మాఫీకి డబ్బు ఖర్చు చేశాడు.

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు 29

Page 26

  1. HEN PECKED భార్యా విధేయులు

Hen pecked husband is always an unsucessful loves.

భార్యావిధేయులు మేమ వ్యవహారాల్లో సాధారణంగా విజయం సాధించలేరు.

  1. TO GIVE THE DEVIL HIS DUE (SHARE) లాభంలో కొంత అవతల వానికి యిచ్చు

The partner gave other his the due (share)

ఆ భాగస్వామి ఇంకొక భాగస్వామికి లాభంలో వాటాయించాడు.

  1. TO TIE THE GORDIAN KNOT మూడుముళ్లుప్రేయు

Finally the lovers tied the Gordian knot.

ఆ ప్రేమికులు చివరికి మూడుముళ్లు వేసి ఒక యింటివారైనారు.

  1. A THORN IN ONE'S FLESH మింగుడుపడని, అబ్బుర్తగులు

Kasmir is a thorn in Pakistan's flesh (meat)

పాకిస్థాన్ ఆహారంలో కాశ్మీర్ ముల్లులాంటిది. (అవరోధం)

  1. A HERCULEAN TASK ఎంతో శ్రమతో కూడిన

It is a herculean task to swim the black sea.

నల్ల సముద్రాన్ని ఈదడం ఎంతో కష్టంతో కూడిన పని.

  1. TO BEAT A RETREAT వెనుకకు మరలు

Pakistan solodiers beat a retreat when our Jawans answered suitably.

మన జవాన్లు తగిన జవాబు యిచ్చినందున పాకిస్థాన్ సైనికులు వెనుకకు తగ్గారు.

  1. TO HAVE TOO MANY IRONS IN THE FIRE ఎన్నో పనులు ఉండు

We have too many irons in the fire.

మాకు యింకా ఎన్నో పనులున్నాయ్.

  1. TO BURY THE HATCHET రాజీపడు

They buried their hatchet and became friends again.

వారు తమ పగ మరిచిపోయి తిరిగి స్నేహితులైనారు.

  1. TO TURN OVER A NEW LEAF కొత్త జీవితం ప్రారంభించు

He has abstained from drinking and atleast a turned over a new

leaf.

అతను త్రాగుడు మాని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు.

Page 27

Idioms & Phrases in English

  1. TO DIE IN HARNESS పనిచేస్తూ (విధిలో) చనిపోవు

Lal Behadur died in harness.

లాల్ బహదూర్ శాస్తి దేశసేవలో చనిపోయెను.

  1. A MILLION DOLLAR QUESTION అంతుపట్టని సమస్య

It is a million dollar question that why he has become mad.

అతను పిచ్చి వాడిగా ఎందుకు అయ్యాడో పెద్ద ప్రశ్నార్థంగా వుంది.

  1. HIMALAYAN BLUNDER పెద్ద తప్పు

Hari feels that he has done (committed) a Himalayan blunder after he got married.

పెళ్ళి చేసుకొని తను పెద్ద తప్పు చేశానని హరి యిప్పుడు బాధపడు తున్నాడు.

  1. A BOTTLE NECK ఆటంకము

For every scheme started (launched) by the Government there is certainly A bottle neck.

ప్రభుత్వం ప్రారంభించిన ప్రతి పథకానికి ఏదో అవరోధం ఏర్పడుతున్నది.

  1. BETWEEN THE DEVIL AND DEEP SEA ముందు గొయ్య వెనక గాయ్య (సందిగ్ధపస్థ)

I was stuck Between the devil and deep sea whether to go to Australia or not.

నేను ఆస్ట్రేలియా వెళ్ళటమా లేక వెళ్ళకపోవటమా అనే సందిగ్ధంలో పడ్డాను.

  1. GET RID OF వదిలించుకొను, దూరంగా ఉండు

You should Get rid of bad habits.

నీవు చెడ్డ అలవాట్లను వదిలించుకోవాలి.

  1. DIE HARD త్వరగాపోవు

Bad habits die hard.

చెడ్డ అలవాట్లు త్వరగా పోవు

  1. AFFORD TO BUY స్తోమత కలిగి ఉండు

A common man cannot Afford to buy a four wheeler.

మధ్య తరగతి వ్యక్తికి కారు కొనే స్తోమత ఉండదు.

  1. AT HOME జ్ఞానము కలిగియుండు

I am at home in french.

ఫ్రెంచి భాషలో నాకు మంచి పరిజ్ఞానం ఉంది

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు

31

Page 28

  1. RED HANDED నేరం చేస్తూండగా పట్టుపడ్డాడు

నేరస్తుడు, నేరం చేస్తూ పట్టుపడ్డాడు.

  1. RAINY DAY కష్టకాలం

కష్ట కాలంలో ఉపయోగపడే విధంగా కొంత సొమ్మును పోదుపు చేయాలి.

  1. HELL (CHAIS) గందరగోళం

ఇక్కడ గందరగోళం జరుగుతున్నది.

  1. A LION'S SHARE సింహభాగం

నా చెల్లి తను పూర్వకుల ఆస్తిలో తనకు సింహ (అధిక) భాగం కోరుతున్నది.

  1. A FOOLS PARADISE ఊహలోకంలో విహరించ వద్దు

ఊహాలోకంలో విహరించవద్దు

  1. TO EAT HUMBLE PIE ఓటమిని అంగీకరించు

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు ఓటమిని పొందిరి.

  1. PLAY DUCKS AND DRAKES డబ్బును విచ్చల విడిగా ఖర్చుచేయు

అతను తన తండ్రి సంపాదనను విచ్చల విడిగా ఖర్చుచేస్తున్నాడు.

  1. ADD FUEL TO THE FIRE అగ్నికి ఆజ్యంఒడైట్లు

దయచేసి, వాళ్ళ ఆంతరంగిక విషయాల్ని మరీభతగా విషమింపచెయ్యొద్దు.

  1. DAGGERS DRAWN కత్తులు సూరు

అన్నదమ్ములు ఇరుపురువుహకరై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు.

Page 29

  1. SPILT OF THE TONGUE పోరబాటున

The quarrel was due to spit of the tongue.

పోట్లాటంతటికి మూలం పోరపాటున నాలిక జారటం.

  1. STANDING IN THE WAY ఆటంకము, అవరోధము కల్గించు

Caste and religion stand in the way of our country's progress and development.

కులం, మతం దేశ ప్రగతికి అడ్డుగోడలు.

  1. SEND FOR పిలువనంపు, కబురుచేయు

The doctor was sent for treatment to the patient.

రోగికి చికిత్స నిమిత్త డాక్టరుకు కబురు పంపారు.

  1. AT THE MOST మహా అయితే

At the most he can spend hundred rupees.

మహా అయితే అతను వంద రూపాయలు ఖర్చు చేయగలడు.

  1. ALMOST ALL దాదాపుగా

We the four friends got Almost all same marks.

మా నలుగురు స్నేహితులకూ దాదాపుగా సమానమైన మార్కులు వచ్చాయి.

  1. SOONER OR LATER ఏదో ఒకరోజు (ఒకనాడు)

Every body must die sooner or later.

ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు ఈలోకాన్ని వదిలి వెళ్లిపోతారు.

  1. TAKE STOCK OF THE SITUATION పరిస్థితిని అంచనావేయు

The Prime Minister took stock of the situation in Gujarat with higher authorities.

ప్రధాన మంత్రి గుజరాత్‌లో పరిస్థితిని ఉన్నతాధికారులతో సమీక్షించెను.

  1. TAKE EXCEPTION తీవ్రంగా భావించు

He took the adverse remarks of his boss to exception.

అతను యజమాని చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించెను.

  1. TAKE TO TASK చివాట్లు పెట్టు

The teacher took the student to task for the negligence.

విద్యార్థి అశ్రద్ధకు ఉపాధ్యాయుడు తీవ్రంగా మందలించెను.

  1. TURN UP తిరిగివచ్చు

The servant boy has not turned up so far.

పనివాడు యింతవరకు తిరిగిరాలేదు.

Page 30

  1. TURN DOWN తిరస్కరించు

The Boss Turned down his request to sanction me permission.

యజమాని అతనికి అనుమతి యివ్వడానికి నిరాకరించెను.

  1. TELL UPON వ్యతిరేక పరిణామం చూపు

Raghu is hard work told upon his health.

రఘు ఆరోగ్యంమై పని తీవ్రత ప్రభావం చూపించింది.

  1. TURN A DEAF EAR పెడచెవిని పెట్టెను

He turned a deaf ear to his elder's advice.

అతను పెద్దల సలహాను పెడచెవిని పెట్టెను.

  1. TAKE TO HEART మనోవ్యధచెందు

He died taking to heart of his son's demise.

కొడుకు మృతివల్ల మనోవ్యధ చెంది అతను మరణించెను.

  1. TAKE PART పాల్గొను

Children took part in the independence celebrations.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పిల్లలు పాల్గొన్నారు.

231 UNTIL AND UNLESS తప్పనిసరిగా, అంత వరకు

My brother wants to remain unmarried until and unless he gets a job

తనకు ఉద్యోగం వచ్చేవరకు నా సోదరుడు వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు.

  1. UP TO THE EARS పూర్తిగా

The cotton growers are in heavy debts upto the ears and resorting to suicides.

పత్తిరైతులు అప్పుల బాధపడలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

  1. TURN TURTLE తలక్రిందులకు

I turn turtle with my engagements.

నేను నా వ్యవహారాలతో తలక్రిందులవుతున్నాను.

  1. DEFEAT THE PURPOSE ఆశయము నెరవేరకపోవు

The prohibition implementation in Andhra Pradesh defeated the very purpose.

ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టిన మద్యనిషేధం యొక్క ప్రయోజనమే దెబ్బతిన్నది.

26 ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు

Page 31

Idioms & Phrases in English

  1. DELIVER THE GOODS ఆశయము నెరవేరు, ఉపయోగపడు

The central schemes should deliver the goods

కేంద్ర ప్రభుత్వ పథకాలు ఫలితాలుయివ్వాలి.

  1. TO NO PURPOSE నిరుపయోగం

Many Government departments serve no purpose.

చాలా ప్రభుత్వ శాఖలు నిరుపయోగమైనవి.

237 TAKE INTO ACCOUNT పరిగణలోనికి తీసుకొను

Experience will be taken into account at the time of appointment.

ఉద్యోగాల నియామకాలకు అనుభవానికి ప్రాధాన్యత యిస్తారు.

  1. TAKE TO HEELS పారిపోవు

The thief took to heels as soon as he saw the police.

పోలీసులను చూడగానే దొంగ పారిపోయెను.

  1. SORT OUT DIFFERENCES సమస్యను పరిష్కరించుకొను

Let's Sort out differences amicably.

మన మధ్యన వున్న బేదాభిప్రాయాలను సామరస్యంగా పరిష్కరించుకుందాం

  1. WILD GOOSE CHASE వృధాప్రయాస

Searching for morality in the present generation is a Wild goose chase.

నేటితరంలో నైతిక విలువలు కనుగొనడం వృధాప్రయాస.

  1. HATS OFF అభినందనలు

Hats off to Pullela Gopichand who won badminton championship.

బాడ్మింటన్లో ఛాంపియన్షిప్ సాధించినందుకు పుల్లెలగోపీచంద్కు అభినందనలు.

  1. A FEATHER IN ONE'S CAP కలికితురాయి

Indian cricket teams success over Pakisthan will be a feather in Indian's team's cap.

పాకిస్తాన్పై భారత క్రికెట్ జట్టు సాధించే విజయం భారత్కు కలికితురాయి.

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు 27

Page 32

  1. WIN LAURELS కీర్తి, ప్రతిష్టలు సంపాదించు

He brought win laurels to India by winning world cup.

పరల్డ్‌కప్ సాధించడం ద్వారా అతను దేశానికి కీర్తి తెచ్చాడు.

  1. VIS A VIS పోల్చి చూచు

Don't Vis a vis Ram with Rahim.

రామ్‌ను రహీం‌తో పోల్చవద్దు.

  1. KEEP IN VIEW దృష్టిలో ఉంచుకొను

Keep my advice in view before you ask.

నీవు అడిగే ముందు నాసలహాను దృష్టిలో పెట్టుకో

  1. IN VIEW OF అందువల్ల, ఆ కారణముచేత

In view of incurring losses the A.P.Government wants to wind

up some favctories (companies).

నష్యాల కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని పెట్రేటు కర్మాగారాలను

మూసివేస్తున్నది.

  1. ULTRA VIRES చట్టవిరుద్ధము

To arrest any person with out suffcient evidence is ultravires.

తగినంత సాక్ష్యాధారాలు లేకుండా ఏ వ్యక్తినైనా అరస్టు చేయడం చట్ట విరుద్ధము.

  1. TURN THE CORNER స్వస్థత చెందు, కోలుకొను

At lest Jagan has turned the corner.

చివరికి జగన్ జబ్బు నుంచి కోలుకున్నాడు.

  1. AT LEAST కనీసం

At least you have to give respect to his age.

అతని వయస్సుకైనా నీవు కనీసం మర్యాద యివ్వాలి.

  1. AT LAST చివరకు

At last the naxallites surrendered to the police.

చివరికి నక్సలైట్లు పోలీసులకు లొంగిపోయారు.

  1. A WARM WELCOME ఘనస్వాగతం

Our students gave a warm welcome to the DEO.

మండల విద్యాధికారిగారికి మా విద్యార్థులు ఘన స్వాగతం యిచ్చారు.

Page 33

  1. A BOLT FROM THE BLUE గోరుచుట్టుపై రోకలి పోటు

The sudden demise of Subba rao's wife came as a bolt from the blue.

blue.

భార్య ఆకస్మిక దుర్మరణం సుబ్బారావుకు గోరుచుట్టుమీద రోకలిపోటుగా పరిణమించెను.

  1. AT LOGGERHEADS శీఖపట్ల గొ(త్రం (విరోధం)

They were at logger heads since some time.

వారు కొంత కాలంగా విరోధులుగా ఉంటూ ఉన్నారు.

  1. AT SIXES AND SEVENS చిందరవందరగా

All his belongings were at sixes and sevens when he was away from room.

గదిలో లేనప్పుడు అతని సామాన్లు చిందరవందరంగా వాడు ఉండెను.

  1. GIVE AWAY అందచేయు

The minister gave away the Crit cards to the farmers.

మంత్రి రైతులకు బుణ పత్రాలు అందచేశారు.

  1. KEEP AT ARM'S LENGTH దూరంగా ఉంచు

He is a rogue Keep at arm's length.

వాడు దుష్టుడు వాడిని తగినంత దూరంలో ఉంచు.

  1. AS WELL AS పనలేవే, మాదిరిగా

Raju is reliable As well as Ranga.

రంగా మాదిరిగా రాజు కూడా నమ్మకస్తుడు.

  1. STRAIN EVERY NERVE కష్టపడు, శ్రమించు

Sundar strain every nerve to get a job.

సుందర్ ఉద్యోగం సంపాదించటానికి ఎంతో శ్రమించాడు.

  1. RIGHT IN THE CRADLE చిన్నతనం నుండి

His life started with adversity Right in the cradle.

అతని జీవితం చిన్నతనం నుంచే కష్టాలతో ప్రారంభమైంది.

  1. ABIDELY కట్టుబడి ఉండు

We must abide ly law.

చట్టానికి కట్టుబడి వుండాలి.

Page 34

  1. CATS & DOGS - HEAVILY తీవ్రంగా

It has been raining Cats & dogs for two days.

ఇందు రోజుల్లొనే కుండపోతగా వర్షం కురుస్తున్నది.

  1. SEE EYE TO EYE ఒకరి ముఖం ఒకరు చూసుకొను

The two friends do not See eye to eye these days.

ఆ ఇద్దరు స్నేహితులు ప్రస్తుతం ఒకరి ముఖం ఒకరు చూసుకోపడం లేదు.

  1. HANG IN THE AIR అనిశ్చిత పరిస్థితిలో కొనసాగు

His fortune is hanging in the air.

అతని భవిష్యత్తు ఆయోమయంగా ఉంది.

  1. FROM BAD TO WORSE క్షీణించు

His progress went From bad to worse

అతని అభివృద్ధి మరింత తగ్గముఖం పట్టింది (నష్టాలలో నడుస్తున్నది).

  1. CRY OVER SPILT MILK ఒలికిపోయిన పాలకు విచారించు

Don't cry over spilt milk.

నెలపాలైన పాలకు విచారించకు

  1. ADD INSULT TO INJURY అగ్నికి ఆజ్యం పోయు

He added insult to injury by abusing her.

ఆమెను అవమానించటం ద్వారా అతను అగ్నికి ఆజ్యం పోశాడు.

  1. BY DINT OF వలన

He acheived success by dint of hard work.

అతను కష్టపడటం ద్వారా విజయాన్ని సాధించాడు.

  1. EXEMPLARY ఆదర్శంగా నిలుచు

Gandhiji was an Exemplary to other by his simple living.

గాంధీజీ తన నిరాడంబర జీవితంతో ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.

  1. SET OUT బయలు దేరు

They set out in the morning and returned midnight.

వారు తెల్లవారకముందే వెళ్లి అర్ధరాత్రి తిరిగి వచ్చారు.

  1. SET AN EXAMPLE ఆదర్శంగా ఉండు

A teacher must Set an example to the students.

ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి.

Page 35

  1. ON HAND ప్రస్తుతం

He don't have money on hand to help you.

నీకు సహాయం చేయడానికి అతని దగ్గర డబ్బులేదు.

  1. EXPRESS REGRETS విచారం వెలిబుచ్చు

The neighbour expressed his regrets to his misbehaviour.

అమర్యాదగా ప్రవర్తించినందుకు పక్కింటాయన క్షమాపణ చెప్పాడు.

  1. LOOK AFTER మంచి చెడ్డ చూచు, కనిపెట్టియుండు

The nurse look after the patients.

రోగిని నర్సు కనిపెట్టి ఉంటుంది.

  1. ON BEHALF OF ఒకరి తరపున

The P.A. spoke On behalf of the minister.

మంత్రిగారికి ప్రతినిధిగా ఆయన వ్యక్తిగత సహాయకుడు మాట్లాడాడు.

  1. SO FAR వరకు

So far my knowledge goes, he in not a doctor.

నాకు తెలిసినంత వరకు అతను డాక్టర్ కాదు.

  1. AS FAR AS POSSIBLE సాధ్యమైనంత వరకు

He will help you As far as possible.

సాధ్యమైనంతవరకూ అతను నీకు సహాయం చేస్తాడు.

  1. TAKE AFTER పోలియుండు

The boy taken after his mother.

ఆ బాబు అచ్చం తల్లిని పోలి ఉన్నాడు.

  1. KEEP OFF దూరంగా ఉంచు

Take preventive measures to keep off diseases.

వ్యాధులను దూరంగా ఉంచడం కోసం ముందు జాగ్రత్త తీసుకోవాలి.

  1. COME TO LIGHT బయటికి వచ్చు

After the police enquiry cause if the mistery came to light.

పోలీసు విచారణ తర్వాత ఆ రహస్యం వెలుగులోకి వచ్చింది.

  1. INS AND OUTS అన్ని విషయాలు, దాపరికం లేకుండా

I know all the ins and outs of the operation.

చర్యకు సంబంధించిన అన్ని విషయాలు నాకు తెలుసు.

Page 36

  1. HOLE WATER నిలబడు, ప్రాముఖ్యత కలిగియుండు

The agreement does not Hold water in letter and spirit.

ఈ ఒప్పందం ఏవిధంగా చూసినా నిలబడదు.

  1. SIT ON THE FENCE గోడమీద పిల్లవాటం

Politicians generally Sit on the fence waiting for an opportunity.

రాజకీయనాయకులు సాధారణంగా అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు.

  1. THROW COLD WATER నిరుత్సాహపరచు

My friends threw cold water on his plans he expressed his decision to start a busuness.

అతను వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటే అతని స్నేహితులు అతన్ని నిరుత్సాహపరిచిరి.

  1. HARD & FAST RULES కఠిన నిబంధనలు

There will be hard and fast rules in militry.

సైన్యంలో కఠినమైన నిబంధనలు వుంటాయి.

  1. SEE OFF వీడ్కోలు చెప్పు

I have seen off my friend at the railway station.

నేను నా స్నేహితునికి వీడ్కోలు యివ్వటానికి రైల్వేస్టేషనుకు వెళ్ళితిని.

  1. SET UP ప్రారంభించు

The Advocate set up his practice in Bar Association it self.

న్యాయవాది న్యాయవాది సంఘ కోర్టుయందు (బార్ అసోషియేషన్) ప్రాక్టీసు ప్రారంభించెను.

  1. SEND OFF వీడ్కోలు

The commissioner of police was given a send off by his personel.

పోలీసు సిబ్బంది చేత కమీషనర్ ఘనమైన వీడ్కోలు పొందెను.

  1. TOOTH & NAIL గట్టిపట్టదలతో

We should fight Tooth & nail to safe guard the interests of back word communities and down trodden.

మనం వెనుకబడిన అణగారిన జాతులవారి అభివృద్ధికి గట్టిగా కృషిచేయాలి.

  1. RENDER YEOMAN SERVICE विशिष्टమైన సేవచేయు

The army units Render yeoman service during the earth quake situation.

భూకంప సమయంలో సైన్యం చెప్పుకోదగిన సేవచేసిరి.

Page 37

  1. IN A BLUE MOON పౌర్ణమికీ, అమావాస్యకి

We get a good chance or opportunity once In a blue moon.

మనకు మంచి అవకాశం అరుదుగా వస్తుంది.

  1. TRACE OUT గుర్తించు

The police could Trace out the culprit from the mob and nabbed him.

గుంపులో వుండి వేషధారులు నేరస్తుణ్ణి గుర్తించి పట్టుకున్నారు.

  1. PUT DOWN అణచివేయు

The Government wants to put down to child labour with an iron hand.

ప్రభుత్వం బాలకార్మిక వ్యవస్థను ఉక్కుపాదంతో అణచివేయ్యాలని భావిస్తోంది.

  1. PUT OUT ఆర్పివేయు, తీసివేయు

Put out the candle

కొవ్వొత్తిని ఆర్పుము.

  1. DONE TO DEATH చంపబడెను

He was Done to death by his wife her self.

అతను తన భార్య చేతిలోనే హతమైనాడు.

  1. DO AWAY WITH రద్దుచేయు

The A.P. Government has Done away with Allwyn Industry.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్విన్ సంస్థను ఎత్తివేసింది.

  1. EVERY INCH పూర్తిగా

He is Every inch a snake.

అతను ఆపాదమస్తకం (అంగళం అంగళం) పామువంటివాడు.

  1. LOOSE HEART నిరాశ, నిస్పృహలకు లోనుగావడం

It is not good to Loose heart at any event.

ఏ సందర్భంలోనూ నిరాశ, నిస్పృహలకు లోనుకాకూడదు.

  1. LEAVE IN THE LURCH కష్టదశలో విడిచిపెట్టు

A true friend never Leaves his friends in lurch.

నిజమైన స్నేహితుడు ఎన్నడూ తన మిత్రులను కష్టంలో వదిలివేయడు.

  1. FITTING REPLY సరియైన సమాధానం

India gave a Fitting reply to Pakistan.

పాకిస్థాన్‌కు భారతదేశం దీటుగా జవాబిచ్చింది.

Page 38

  1. FIGHT A LOOSE BUTTLE చివరి దశలో పోరాడు

The naxallites in A.P are Fighting a loose buttle.

ఆంధ్రపదేశ్‌లో నక్సలైట్లు అంతిమ పోరాటం సాగిస్తున్నారు.

  1. BURNING PROBLEM ప్రధాన సమస్య

Terrorism in Kashmir valley is a Burning problem to India.

కాశ్మీర్‌లో ఉగ్రవాదం, భారతదేశానికి ఒక తీవ్ర సమస్యగా వుంది.

  1. ORDER OF THE DAY మామూలు విషయం

Bribe has become the Order of the day.

లంచం ఈ రోజు సాధారణ విషయం అయిపోయింది.

  1. GREEK & LATIN మృతభాషలు, వాడుకలోలేని

English grammar is no more Greek & Latin to some students.

ఇంగ్లీష్ గ్రామర్ కొందరికి గ్రీక్ మరియు లాటిన్ భాషల మాదిరిగా అంత మాత్రం కొరకుడు పడనిదిగా ఉంది.

  1. BREAK OFF తెగతెంపులు చేసుకొను

India broke off its relations with Pakistan.

భారతదేశం పాకిస్తాన్‌తో తన సంబంధాలను తెగతెంపులు చేసుకుంది.

  1. LOOK UP ఎదురుచూచు

We must look up our elders for their guidancy.

మనం, మన పెద్ద వాళ్ళ సలహాలకై ఎదురుచూడాలి.

  1. PULL THROUGH బయటపడు, కృతత్వడగు

Inspite of ill health, he pulled through the exams.

ఆతను అనారోగ్యంతో ఉన్నా, పరీక్షలో పాసయ్యాడు.

  1. MAKE UP ONES MIND నిర్ణయించుకున్నాను

I have made up my mind to take responsibility

నేను బాధ్యత తీసుకోవాలని నిర్ణయించుకున్నాను.

  1. WELL OFF అభివృద్ధిచెందు

Janardhan has a lucrative business and he is well off

జనార్ధన్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతున్నది.

  1. BREAK INTO జొరబడు

The culprits broke into our neighbour's house.

దొంగలు మాపక్కింటిలో జొరబడ్డారు.

38 ఇంగ్లీష్ జాతీయములు మరియు పదబంధములు

Page 39

  1. A VAIL వినియోగించుకొను

I must avail this opportunity.

నేను ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలి.

  1. BREAK THE ICE చర్చ ప్రారంభించు

We should Break the ice to establish confidence.

మన మధ్య నమ్మకం ఏర్పడడానికి మనం చర్చలు ప్రారంభించాలి.

  1. MEDDLE WITH జోక్యం చేసుకొను

We should not meddle with the affair of other.

ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకూడదు.

  1. EXHIBIT RESTRAINT నిగ్రహం ప్రదర్శించు

While accusing me you must Exhibit restraint

నన్ను నిందించే ముందు నీవు నిగ్రహం పాటించడం అవసరం.

  1. PLAY WITH FIRE నిప్పుతో చెలగాటమాడు

Alighting from a moving train is to Play with fire.

కదులుతున్న రైల్లో నుంచి దిగటం ప్రాణాలతో చెలగాటం ఆడటమే.

  1. LOOK FOR ఎదురు చూచు

I am looking for a suitable bride.

నేను తగిన భార్య కోసం అన్వేషిస్తున్నాను.

  1. TAKE UP తీసుకొను MAKE UP సరిచేయు

The Botony lecturer took up extra classes to make up the syllabus.

జీవశాస్త్ర ఉపన్యాసకుడు సిలబస్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక తరగతులు తీసుకొన్నాను.

  1. A BOLT FROM THE BLUE గోరుచుట్టు మీద రోకలిపోటు

The POTA Act came as a bolt from the blue.

పోటా చట్టం తీవ్రవాదుల పాలిట గోరుచుట్టు మీద రోకలిపోటులా వచ్చింది.

  1. AT FINGER TIPS వేల్మీద

He is a very good teacher in Engilsh language is at his finger tips.

అతను ఆంగ్లంలో చాలా మంచి ఉపాధ్యాయుడు ఆ భాష అతనికి కరతలామలకం.

Page 40

  1. IN A NUT SHELL సంక్షిప్తంగా, సంక్షిప్తంగా

The teacher has put In a nut shell of the lesson.

ఉపాధ్యాయుడు పాఠమును సంక్షిప్తంగా వివరించెను.

  1. COME UPTO వచ్చు, చేరు

He came upto in life with in short time.

అతను జీవితంలో అతి తక్కువ కాలంలో పైకి వచ్చెను.

  1. FALL SHORT OF అంచనాకు తగ్గిపోవు

The employee Fell short of my expectation.

ఆ ఉద్యోగి నా అంచనాలకు తగ్గట్టుగా పనిచేయలేదు.

  1. CELEBRATED ప్రసిద్ధిచెందిన

Tajmahal is celebrated as pride of India.

భారతదేశపు గర్వకారణంగా తాజ్‌మహల్ ప్రసిద్ధిచెందినది.

  1. FOUND GUILTY OF నేరము చేసినట్లు తెలుసుకొను

He was (suspected) Found guilty of theft.

అతను దొంగతనం చేసినట్లుగా కనుగొన్నారు.

  1. TAKE OFF పైకిపోవు, ఎగురు

The plane take off at 1.50 a.m to Mexico.

మెక్సికో వెళ్లే విమానం ఉదయం 1.50 నిలకు బయలుదేరెను.

  1. AWARE OF ఎరిగియుండు, తెలిసియుండు

I am aware of the book of Bhagavathgita.

నాకు భగవద్గీత పుస్తకం గురించి తెలుసు.

  1. RECONCILE WITH రాజీపడు

The father & son Reconcile with each other

తండ్రీ కొడుకులు తిగిరి రాజీపద్దారు.

  1. NULL & VOID చెల్లుబాటు కాకుండా చేయు

The central Govt made the state government order Null & void.

కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ ఆదేశరును చెల్లనిదని చెప్పెను.

  1. AT THE WIT'S END సమాధానం దొరకకపోవు

When a question was raised by me he was at the wit's end.

నేను వేసిన ప్రశ్నకు అతను సమాధానం దొరక్క తికమకపడెను.

40 ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు

Page 41

Idioms & Phrases in English

  1. GIVE UP వదిలిపెట్టు

He has decided to give up drinking.

అతను తాగుడు విరమించాలని నిశ్చయించుకున్నాడు.

  1. PUT UP WITH సరిపెట్టుకొను, భరించు

We can't put up with mosquito menance.

మనం దోమల బాధ భరించలేము.

  1. STICK UP కట్టుబడి వుండు

You must Stick up to your promise.

నీవు నీ వాగ్దానానికి కట్టుబడి ఉండాలి.

  1. COPE WITH నిభాయించు, నిర్వహించు

He is able to Cope with others.

అతను ఇతరులతో కలిసి పోతాడు.

  1. PUT OFF వాయిదావేయు, వాయిదాపడు

The cricket match has been put off due to rain weather.

వర్షం కారణంగా క్రికెట్ ఆట వాయిదాపడెను.

  1. ALL AND SUNDAY అందరికీ, సర్వజనానికీ

Govt order applies to all and sunday.

ప్రభుత్వ ఉత్తరువు అందరికీ సమానంగా వర్తిస్తుంది.

  1. MAKE A BLUNDER పొరపాటుచేయు

Don't make a blunder by rejecting his offer.

అతను ఇచ్చిన అవకాశాన్ని తిరస్కరించి పెద్ద తప్పుచేశాడు.

  1. ADOPT అనుసరించు

Our company adopted the Swedish technology.

మా కంపెనీ స్వీడన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంచుకున్నది.

  1. ADAPT TO సరిపెట్టుకొను

He has finally adapted the right course of action.

చివరికి అతను మంచి మార్గాన్ని సరిపుచ్చుకున్నాడు.

  1. NO EFFECT ఫలితం లేకపోవు

His father advice had no effect on him.

అతని తండ్రి సలహా అతని చెవి వెక్కలేదు.

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు 41

Page 42

  1. SORRY STATE OF AFFAIRS దయనీయం

The condition of victims in cyclone is in a Sorry state of affairs.

తుఫాను బాధితుల పరిస్థితి కడు దయనీయంగా ఉంది.

  1. IN HIGH SPIRITS ఉత్సాహంగా

He is in high spirits as he got placement in U.S.A.

అతను అమెరికాలో ఉద్యోగం లభించినందుకు ఎంతో ఉత్సాహంతో ఉన్నాడు.

  1. AT RANDOM అట్రం వచ్చినట్లు, అక్కడక్కడ

I turned the pages of the book at random.

నేను పుస్తకంలో అక్కడక్కడ కొన్ని పేజీలు తిరగవేసాను..

  1. BED RIDDEN అబ్బుతో

His father has been bed ridden for a long time due to illness.

అతని తండ్రి దీర్ఘకాలంగా బాలాకాంతంగా తీవ్రకుంటున్నాడు.

  1. BRING TOGETHER ఒకచోటుకు చేర్చు

Wealth Bring together separated relatives.

సంపద విడిపోయిన బంధు వర్గాన్ని దగ్గరికి చేరుస్తుంది.

  1. WORSE THAN అసహ్యకరంగా

The old dog's barking is warse than its biting.

ముసలి కుక్క అరుపు అది కరవటం కన్నా ఎక్కువగా ఉంది.

  1. BANK UPON ఆధారపడు, నమ్ము

You can bank upon that gentle man.

నీవు ఆ పెద్ద మనిషిని వమ్మవచ్చు.

  1. SET THE BALL ROLLING కొనసాగించు

I Set the ball rolling by going a short speech.

నేను మౌనంగా వీడి కొద్ది ఉపన్యాసం యిచ్చాను.

  1. HALF BAKED పరిపూర్ణజ్ఞానం లేని, మిడిమిడి జ్ఞానం గల

It is bad talk with Half baked knowledge.

విషయ అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడటం తప్పు.

  1. ABOVE APPREHENION అర్థం కాని, అంతుపట్టని విషయం

Your opinion is above my apprehension.

నీవు ఉద్దేశం నాకు అంతుపట్టటం లేదు.

42 ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు

Page 43

Idioms & Phrases in English

  1. TAKE AMISS తప్పుగా భావించు

When you are taken the advise from him don't take it amiss.

మీరు అతని సలహా తీసుకొంటే తప్పుగా భావించకు.

  1. MAKE AMENDS సరిదిద్దుకొను

The Govt had Make amends to the ordinance.

ఆర్డినెన్సును ప్రభుత్వం సవరించింది.

  1. KEEP ALOOF దూరంగా నుండు

It is better to keep aloof from bad habi:s.

దురలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.

  1. PLAY PRANKS AND PRICKS చతురోక్తులు, జోకులు

He played pranks and pricks upon himself.

అతను తన మీద జోకులు వేసుకున్నాడు.

  1. TO CALL INTO A QUESTION అభ్యంతరము తెలుపు

The POTO bill was called into question by concerns and left parties in the Parliament.

ఉగ్రవాద వ్యతిరేక చట్టం పోటోకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో కాంగ్రెస్, వామపక్షము అభ్యంతరం లేవదీశారు.

  1. IN COLD BLOOD నిర్దాక్షిణ్యంగా, గుట్టుచప్పుడు

The Villain murdered his own brother cold bloodedly

ఆ దుర్మార్గుడు తన సొంత తమ్ముడినే అతి నమ్మకంగా హత్యచేశాడు.

  1. BIRD'S VIEW విహంగావలోకనలు (చర్చించు) దృష్టి సారించు.

Let's have a birds view of this beautiful city.

ఈ సుందర నగరాన్ని విహంగ వీక్షణ చేద్దాం.

  1. KILL TWO BIRDS WITH ONE STONE ఒకేసారి రెండు పనులు సాధించు.

Politicians are well versed in killing two birds one stone.

రాజకీయ నాయకులు ఒకే దెబ్బతో (రాయితో) రెండు పిట్టల్ని కొడతారు.

(రెండు పనులు సాధిస్తారు)

  1. BEYOUND MEASURE వర్ణించలేనంతగా

My happiness is beyond measure (unbounded)

నా ఆనందానికి అవధిలేదు

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు

43

Page 44

  1. BETWEEN THE DEVIL AND THE DEEP SEA

రెండు ప్రమాదాల వాట్లు

Osama bin Laden was fallen between the devil and deep sea.

ఒసామా బిన్‌లాడెన్ చిక్కుల్లో పడ్డాడు.

  1. SLIP BETWEEN A CUP AND LIPపోరపాటు

There is many a slip twist between the cup and the lip.

తాగే గిన్నెకు, పెదవికి మధ్య ఎంతో తేడా ఉంది.

  1. Hit below the beltఅన్యాయంగా ఆడు

He won the match by hitting below the belt.

అతను అన్యాయంగా ఆడి ఆటను గెలిచాడు.

  1. FALL BEHIND వెనకబడు, వెనకడుతగ్గ

When the brave went to battle, the cowards fall behind.

వీరులు యుద్ధానికి వెడితే వెనకడుగు వేశారు.

  1. TO BEGIN WITH చెప్పాలంటే

To begin with he is not a politician.

విషయం చెప్పాలంటే, అతను రాజకీయవేత్తకాడు.

  1. BOSOM FRIEND ప్రాణ స్నేహితుడు

Sudhakar is my Bosom friend.

సుధాకర్ నా ప్రాణ స్నేహితుడు.

  1. FROM CRADLE TO THE GRAVE పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు

His attitude will never change form cradle to the grave.

అతని ప్రవర్తన పుట్టిన దగ్గర్నించి మరణించే వరకూ మారదు.

  1. BRING TO BOOK నేరారోపణచేయు

The dishonest servant was brought to book.

మోసగాడైన (అవినీతికి పాల్పడిన) సేవకునిపై నేరారోపణ చేయబడింది.

  1. IN GOOD LOOKS దృష్టిలో మంచిగా ఉండు

He is in the good looks of his neighbours.

అతను యిరుగు పొరుగు వారి దృష్టిలో మంచి అభిప్రాయం కలిగి ఉన్నాడు.

  1. TAKE A NEW LEAF ప్రణయొందు

Many young men of our country take a new leaf from Vivekananda's literature.

మనదేశంలో చాలామంది యువకులు వివేకానందుని సాహిత్యం నుండి ఎంతో ఉత్తేజాన్ని పొందుతున్నారు.

44 ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు

Page 45

Idioms & Phrases in English

  1. BONE OF CONTENTION తగాదాకు ప్రధానమైన కారణము

Kashmir is the bone of contention between India and Pakistan.

భారత, పాకిస్థాన్ దేశాల మధ్య కాశ్మీర్ ప్రధాన కారణంగా తయారైంది.

  1. SAIL IN THE SAME BOAT ఒకే ఓడ (ప్రయాణం చేయు, ఒకే స్థితిలో ఉండు

Karuna and Kamakshi are sailing in the same boat.

కరుణ, కామాక్షి ఒకే రకమైన సమస్యను ఎదుర్కొంటున్నారు.

  1. DEPART FROM LIFE మరణించు

Rajiv Gandhi was departed from life by human bomb blast.

మానవబాంబు విస్ఫోటనం కారణంగా రాజీవ్‌గాంధీ మరణించారు.

  1. FLAT DENIAL గట్టిగా నిరాకరించు

We can't depend on him even his flat denial about the theft.

అతను దొంగతనం చెయ్యలేదని గట్టిగా నిరాకరించినా మనం అతని మీద ఆధారపడలేం.

  1. EXTORT CONFESSION వాస్తవాలు రాబట్టు

Police extort confessed from the militant.

ఆ తీవ్రవాది నుండి పోలీసులు వాస్తవాలు రాబట్టారు.

  1. FORTUNE SMILER UPON అదృష్టం వరించు

Fortune smiler upon him, he won the lattery.

అతన్ని అదృష్టం వరించింది లాటరీ గెలుకున్నాడు.

  1. BRUSH UP సమీక్ష చేయు, మెరుగు పరచుకొను

Students generally brush up their knowledge just before the exams.

విద్యార్థులు సాధారణంగా పరీక్షల ముందు తమ జ్ఞానానికి మెరుగులు దిద్దుకుంటారు.

  1. MAKE A CLEAN BREAST OF నిర్దోషిగా నిరూపించుకొను

Gopal made a clean breast of his criminal activities to the police.

గోపాల్ తన నేరసంబంధ చరిత్రనుండి, పోలీసులనుండి నిర్దోషిగా నిరూపించుకొనెను.

  1. BREAD AND BUTTER ఆహారం (తిండి)

Life is an endless struggle for bread and butter.

జీవితం ఆహారం కోసం చేసే అంతులేని పోరాటం.

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు 45

Page 46

  1. TO CUDGEL తీ|ప్రంగా ఆలోచించు

Let's cudgel our brains to find a way to escape from here.

ఇక్కడి నుండి తప్పించుకోడానికి మనం తీ|ప్రంగా ఆలోచించాలి.

  1. TO HANKER AFTER వెంటాడు, వెంపరలాడు

Ramesh hankering a job since 2000

2000 సంవత్సరం నుంచి రమేష్ ఉద్యోగం కోసం వెటాడుతున్నాడు.

  1. MUCH ADO ABOUT NOTHING ఆరబాటం (అల్పవిషయం పైన)

He makes much ado about nothing of any thing.

ప్రతీ చిన్న విషయానికి అతను అతిగా ఆరబాటం చేస్తాడు.

  1. TO PUT INTO ACTION (PRACTISE) ఆచరణలోపెట్టు

Put into action before giving adwise.

యితరులకు బోధించే ముందు ఆచరణలో పెట్టు.

  1. SIDE TRACK THE ISSUE సమస్యను పక్కదారి పట్టించు

The lawyer is side tracking the issue.

ఆ న్యాయవాది సమస్యను ప్రక్కదారి పట్టిస్తున్నాడు.

  1. DRAG THE ISSUE సమస్యను సాగదీయటం

Don't drag on the issue. It is waist of time.

విషయాన్ని సాగదీయవద్దు. అది సమయాన్ని వృధాచేయడం.

  1. HAND DOWN అందజేయు

The transfered officer handed down the official files to the new Incombent.

బదిలీ అయిన అధికారి కొత్తగా వచ్చిన వారికి కార్యాలయ ఫైల్స్ అందజేశారు.

  1. DOOM'S DAY ఆఖరి (అంతిమ) రోజు

Remember 'Death' is a doom's day in every man's life.

ప్రతి మనిషి జీవితంలో 'మరణం' అనేది చివరి రోజు అని గుర్తుంచుకో.

  1. A BLESSING IN DISGUISE చెదులో మంచి

It is a blessing in disguise that he lost every thing in flood but survived.

వరదల్లో సర్వం కోల్పోయినా చెదులో మంచి జరిగినట్లు బతికి బయట పడ్డాడు.

  1. TO KICK THE BRECKET మరణించు

Every body must kick the brecket oneday.

ప్రతి ఒక్కరు ఏదో ఒకరోజున మరణించక తప్పదు.

46

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు

Page 47

Idioms & Phrases in English

  1. TO BRUSH AWAY నిరాకరించు, కొట్టి (త్రసి) వేయు

I brushed away the Presentation.

నేను బహుమతులను నిరాకరించాను.

  1. TO BRING HOMEనమ్మకం కలుగచేయు

We can not bring this home to the teacher

(I failed to bring this home to him)

మేము ఉపాధ్యాయుడికి నమ్మకం కలిగించలేపోయాము.

  1. TO BRING ABOUT సంభవించు

The disastor brought about due to the draught.

కరువువల్ల ఆ ఉత్పాతం సంభవించింది.

  1. TO BREATHE ONES LAST మరణించు

Gandhiji Breathed his lost on Jan, 30, 1948.

గాంధీజీ 1948, జనవరి, 30వ తేదీన కన్నుమూశారు.

  1. BIRDS OF A FEATHER ఒకే గూటికి చెందిన వ్యక్తులు

Birds of a feather the friends are.

ఆ స్నేహితులందరూ ఒకే గూటికి చెందిన పక్షులు.

  1. BAD BLOOD వైరోధ భావము, వైరము

It is not good to have bad blood between brothers.

అన్నదమ్ముల మధ్య వైరభావం మంచిది కాదు.

  1. TO GO AWRY వృథా అగు, ఫలించకపోవు

All my plans went awry.

నా ఆలోచనలు అన్నీ వృథా అయ్యాయి.

  1. TO AVAIL ONE SELF OF లాభము పొందు

We must avail ourself of this contract.

మనం కాంట్రాక్టు నుండి లాభం పొందాలి.

  1. TO COUNT THE CHICKENS BEFORE THEY ARE HATCHED అమితమైన ఆశీర్వాదం కలిగియుండు

Don't count the chicken before they are hatched.

పిల్లలు పొదగకమునుపే లెక్కపెట్టకు.

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు 47

Page 48

  1. TO CATCH A GLIMPSE OF చూచి ఆనందించు

He caught a glimpse of 'Taj Mahal' from the hotel where he stayed at Agra.

అతను ఆగ్రా హోటల్‌లో బసచేసినప్పుడు తాజ్‌మహల్‌ను దర్శించాడు.

  1. ON THE CARPET అమలులోకి రాకుండా నిలిపివేయబడి

33 percent reservation quota in parliament and anemblier for women is on the carpet.

లోక్‌సభలో అసెంబ్లీలలో (శాసనసభలు) స్త్రీలకు 33 శాతం రిజర్వేషన్ కోటా అమలుకాకుండా ఆగిపోయింది.

  1. CAPITAL ERROR (HIMALAYAN BLUNDER) పెద్ద తప్పు

The attact on Kashmir by Pakistan is a capital error.

కాశ్మీరు పై పాకిస్తాన్ దాడి చెయ్యడం పెద్ద తప్పు.

  1. TO CALL IN QUESTION ప్రశ్నించు, అభ్యంతరం లేవనెత్తు

The president called in the clerk and questioned about the stolen money.

తస్కరించిన డబ్బు గురించి ప్రెసిడెంటుగారు గుమాస్తాను పిలిచి ప్రశ్నించారు.

  1. CAKE WALK సల్లేరు మీద నడక

Assembly elections in Kashmir is not a cake walk for the central Government.

కాశ్మీరు అసెంబ్లీ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వానికి సల్లేరునడక కాదు.

  1. DROP IN THE OCEAN సముద్రంలో నీటి బిందువు

What we know is like drop in the ocean.

మనకు తెలిసింది సముద్రంలో నీటిబొట్టు లాంటిది.

  1. HAVE TO DO WITH సంబంధం కలిగియుండు

I have nothing to do with my old firm.

నా పాత సంస్థలో నాకు సంబంధం లేదు.

  1. TO CURRY FAVOUR ముఖస్తుతి చేయు

He is fond of curry favour.

అతను ముఖస్తుతి ప్రియుడు.

Page 49

  1. AT THE COST OF ఖర్చుపైన, పణంగా పెట్టు

Don't play with (work) at the cost of my life.

నా జీవితాన్ని పణంగా పెట్టి ఆటలాడవద్దు.

  1. TO TURN THE CORNER కోలుకొను, స్వస్థతచెందు

The doctor said that the lady had turned the corner.

ఆ స్త్రీకి ప్రమాదం తప్పిపోయినట్లు డాక్టరు చెప్పెను.

  1. TO COME OFF WITH FLING COLOURS విజయం సాధించు

Rehman come off with flying colour from elligations against him.

రెహ్మాన్ అవినీతి ఆరోపణలనుంచి విజయవంతంగా బయటపడెను.

  1. TURN COAT నిలకడ, స్థిరత్వములేని (పార్టీలు చోక్కాల మాదిరి మార్చే)

Selfish politicians are mere turn coats.

స్వార్థపరులైన రాజకీయనాయకులు నిలకడలేని వారు. పార్టీలు మార్చటంలో సమర్దులు.

  1. UNDER A CLOUD ఆరోపణలు ఎదుర్కొను

Jayalalitha the Chief Minister of Tamilnadu is under a cloud

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోపణలను ఎదుర్కొనుచున్నది.

  1. TO CUT ONE'S COAT ACCORDING TO THE CLOTH ఆదాయాన్ని బట్టి ఖర్చు చేయు

It is better cut their coats according the the cloth.

ఆదాయానికి తగ్గట్గా ఖర్చు చేయడం మంచిది.

  1. ROUND THE CLOCK 24 గంటలూ.

Some hotels run round the clock.

కొన్ని హోటళ్ళు 24 గంటలూ పనిచేస్తాయి.

  1. ENTER INTO ప్రవేశించు

He entered into an agreement.

అతను ఒక ఆంగీకారానికి వచ్చాడు.

  1. ENGROSSED IN లీనమగు

I am engrained in music.

నేను సంగీతంలో నిమగ్నమైయున్నాను.

ఇంగ్లీషు జాతీయముఖి మరియు పదబంధములు 49

Page 50

  1. TO PUT AN END TO అంతమొందించు

Put an end to the play.

ఈ ఆటకు ఉండక ముగింపు పలకండి.

  1. COME TO AN END చివరికి చేరు, ముగింపుకు వచ్చు

My efforts have come to an end.

నా ప్రయత్నాలు ముగింపుకొచ్చాయి.

  1. ELIXIR OF LIFE జీవామృతం (సంజీవిని)

'Love' is elixir of life to lovers.

ప్రేమికులకు ప్రేమ సంజీవి.

  1. EL DORADO బంగారు నిల్వలతో నిండిన

His Life is an El Dorado (gold mine).

అతని జీవితం బంగారుగని.

  1. TO EKE OUT సంపాదించు

He went to America to eke out money.

అతను డబ్బు సంపాదించడానికి అమెరికా వెళ్ళాడు.

  1. TO EAT THE HUMBLE PIE ఓడిపోవు, అవమానంపాలగు

Many times Pakistan eat the humble pie before India.

భారతదేశం ముందు ఎన్నోసార్లు పాకిస్థాన్ ఓడిపోయింది.

  1. WALLS HAVE EARS గోడలకు చెవులుంటాయి

Be cautious Never talk here 'walls have ear'.

ఇక్కడ మాట్లాడకు - గోడలకు చెవులుంటాయి.

  1. DRAW BACK లోపము

He has a draw back. He cannot convince others.

అతనికి ఒక లోపం వుంది. ఇతరులను సమాధానపర్చలేడు.

  1. FAIR SEX స్త్రీ, ఆడది

A fair sex will be behind every man.

ప్రతి పురుషుని వెనుకా ఒక స్త్రీ వుంటుంది.

  1. FAIR PLAY న్యాయము, ధర్మము

Let there be justice and fair play in the country.

దేశములో న్యాయము ధర్మము విలసిల్లుగాక !

Page 51

  1. WITH OUT FAIL తప్పని సరిగా

I will meet you at Rajiv Park by evening 6 pm without fail.

నేను నిన్ను రాజీవ్ పార్క్ దగ్గర సాయంత్రం 6 గంటలకు తప్పకుండా కలుసుకుంటాను.

  1. EYE WASH కంటి తుడుపు

Promises before elections by the parties and politicians are an eye wash.

eye wash.

ఎన్నికల ముందు పార్టీలు, నాయకులు చేసే వాగ్దానాలు కేవలం కంటి తుడుపు.

  1. EYE OPENER కనువిప్పు

This incident is an eye opener to him.

ఈ సంఘటన అతనికొక కనువిప్పు.

  1. TO TAKE EXCEPTION TO ఆక్షేపణ తెల్పు

He took (an) exception to my complaints.

నా ఫిర్యాదులకు అతను ఆక్షేపణ తెల్పాడు.

  1. THE EVENING OF LIFE జీవితంలో చివరిదశలో ఉండాలి

He is in the evening of life.

అతను జీవితపు మలి సంధ్యలో ఉన్నాడు.

  1. TO GO ON ERRAND వార్త, సమాచారం తీసుకొవెళ్ళు

We went on errand to the leader pertaining to some problems.

మేముకొన్ని సమస్యలను వివరించడానికి నాయకుఱ్ణి కలిశాము.

  1. FEW AND FAR BETWEEN అరుదుగా, అప్పుడప్పుడు

We used to come few and far between.

మేము అప్పుడప్పుడు వస్తుండే వాళ్ళము.

  1. TO FALL BEHIND వెనకబడు

Krishna has fallen behind in X class.

కృష్ణ 10వ తరగతిలో వెనకపడి ఉన్నాడు.

  1. TO FALL INTO ERROR పొరబాటు, తప్పిదము చేయు

We fell into an error and made mistakes.

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు 51

Page 52

మేము పోరబాటు పడి తప్పులు చేశాము.

  1. TO FALL A PREY TO ఒకరి మోసానికి గురి అగు

Don't fall a prey to the words of the wicked fellow.

ఆ మోసగాని మోసాలకు, వంచనలకు లోను కావద్దు.

  1. COMEDY OF ERRORS AND TRAGEDY OF PEARLS

పోరపాట్లు తప్పిదము ఆనందం, ముత్యాలతో నిండిన విషాదం.

Life is a not only comedy of errors but a tragedy of pearls.

జీవితం తప్పిదముల (పోరపాట్ల) సుఖాంతమేకాదు ముత్యాల (రత్నాల) దుఃఖాంతం కూడా.

  1. OF HOPE AND DESPAIR ఆశ, నిరాశలనడుమ

Her Life is a beautiful dream of 'hope' and 'despair'.

ఆమె జీవితం అందమైన ‘ఆశ నిరాశ’ ల రంగులకల.

  1. TO PIN ONE'S FAITH UPON ఆధారపడు, నమ్ముకం ఉంచు

Do not pin your faith upon superstitions

మూఢాచారాలను నమ్మరాదు.

  1. BY FAIR MEANS నిజాయితీగా, న్యాయంగా

I got success by fain means.

నేను న్యాయంగా, ధర్మంగా విజయం సాధించాను.

  1. FAIR - WEATHER FRIENDS స్వార్థ పరులైన స్నేహితులు.

Don't entertain the fair - weather friends.

స్వార్థపరులైన స్నేహితుల్ని దరిచేరనీయవద్దు.

  1. BETTER HALF భార్య (అర్ధాంగి)

She is my better half

ఆమె నా భార్య.

  1. SET THE THAMES ON FIRE గొప్ప (ఘన) కార్యము సాధించు

Late V.K. Krishna Menon set the thames on fire by his fiery speeches at the U.N. General Assembly.

వి.కె. కృష్ణమీనన్ తన చురుకైన, పదునైన ఉపన్యాసాలతో ఐక్యరాజ్యసమితిలో శోతలను మంత్రముగ్ధులను చేసెను.

52 ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు

Page 53

  1. NO SMOKE WITHOUT FIRE నిప్పులేకుండా పొగరాజు.

There can not be so much smoke without some fire I do not wholly disbeleive your love affair with that fair lady.

నిప్పులేకుండా అంతగా పొగరాజు (రాదు) నీవు అందమైన ఆమెతో ప్రేమాయణం సాగిస్తున్నావని నేను నమ్మకుండా ఉండలేను.

  1. ON ONE FINE MORNING ఒక శుభ ఉదయాన

On one fine morning, I met my dearest friend.

ఒక శుభోదయాన నా ప్రాణస్నేహితుని కలుసుకున్నాను.

  1. ONE FINE DAY ఏదో ఒకరోజు

One fine day you will realise.

ఏదో ఒకరోజు నీవు తెలుసుకుంటావు.

  1. NOT TO CARE A FIG ఏ మాత్రం లెక్కచెయ్యకపోవు

He do not care a fig for his son.

అతను తన కొడుకు గురించి ఏ మాత్రం పట్టించుకోడు.

  1. TO PLAY THE FIRST FIDDLE అన్నింటిలో ప్రధాన పాత్రవహించు

Tendulkar playing the first fiddle cricket.

టెండుల్కర్ క్రికెట్‌లో ప్రధానమైన పాత్ర వహిస్తున్నాడు.

  1. FETCHING ఆకర్షించు, ఆకర్షణీయమైన

The beggar maids 'fetching' stunning, enchanting beauty of captivated the king's heart.

మతిపోగొట్టే బిచ్చగత్తె అందం రాజుగారి హృదయాన్ని దోచుకుంది.

  1. WITHOUT FEAR OF FAVOUR నిష్పాక్షికంగా

The judges act with fear or favour.

న్యాయమూర్తులు, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తారు.

  1. FAR REACHING అంతటావ్యాపించు

His talent is far reaching in the society.

అతని ప్రతిభ సమాజం అంతటా వ్యాపించింది.

  1. DOOR FLEW OPEN తలుపులు తటాలున తెరుచుకొను

The door flew open, I shivered with affride.

తలుపులు తటాలున తెరుచుకున్నయ్ నేను భయంతో వణికిపోయాను.

ఇంగ్లీష్ జాతీయములు మరియు పదబంధములు

53

Page 54

  1. HIGH FLOWN గట్టిపదాలతో కూడిన, సులభంగా అర్థంకాని

Our lecturers uses high flown English (bombnastic) language.

మా లెక్కచర్ కరినపదాలతో కూడిన ఆంగ్ల భాషను ఉపయోగిస్తారు.

  1. FLOWING WITH MILK AND HONEY సమృద్ధిగానుండు

By God's grace our House is with milk and honey.

దేవుని దయవలన మా యిల్లు సమృద్ధిగా వుంది.

  1. TO FISH IN TROUBLED WATER విపత్కర పరిస్థితుల్లో లాభాన్ని పొందగోరు

Selfish people always try to fish in troubled waters.

స్వార్థపరులు ఎప్పుడూ యితరుల యిబ్బందుల నుండి లాభ పొందాలని చూస్తారు.

  1. THROUGH THICK AND THIN అన్ని సమయాలలో, కష్టసుఖాలను

I vow that I will be with you through thick and thin

అన్ని కష్ట సుఖాలలోనూ నీకు తోడుగా వుంటానని ప్రమాణం చేస్తున్నాను.

  1. GO THROUGH FIRE AND WATER అన్ని కష్టాలు, బాధలుభరించు

You must go through fire and water when you are committed.

ఒప్పుకొన్న తర్వాత ఎన్ని కష్టాలనైనా నీవు భరించాలి.

  1. GALA DAY సంతోషకరమైన రోజు

Today is a gala day for me.

ఈ రోజు నాకు సంతోషకరమైన రోజు.

  1. TO GAIN THE UPPER HAND పైచేయిగా ఉండు

Curruption gaining the upper hand in modern India.

ఆధునిక భారతంలో అవినీతిది పై చేయిగా వుంటోంది.

  1. TO ENJOY FRENCH LEAVE అనుమతి లేకుండా గైర్హాజరగు

He often enjoy 'French leave'

అతను తరచుగా అనుమతి లేకుండా గైర్హాజర్ అవుతాడు.

  1. FRANK STEIN భయంకరమైన రాక్షసుడు (భస్మాసురుడు)

Aids is a 'Frank stein' in modern society.

ఎయిడ్స్ ఆధునిక సమాజంలో (బ్రహ్మరాక్షసుడులాంటిది.

54 ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు

Page 55

Idioms & Phrases in English

  1. MAKE A GOOD FORTUNE ధనవంతుడగు

Kamesh went to Canada and made a good fortune.

కామేష్ కెనడా వెళ్ళి బాగా సంపాదించాడు.

  1. FOOL'S PARADISE ఊహలోకంలో విహరించు

Don't be in a fool's paradise.

ఊహలోకంలో జీవించకు.

  1. GO ON A FOOL'S ERRAND లాభం లేనిపని (వృథా శ్రమ)

In life, some times we go on fool's errand.

మనం జీవితంలో ఒకోసారి తెలివితక్కువ పనులు చేస్తుంటాం.

  1. IN A FOG కలవరపెట్టు

I was enterely in a fog about the out come of the issue.

సంగతి ఏమైందో నాకు తెలియక కలవరపడ్డాను.

  1. TO GET THROUGH కృతార్థుడగు, ఉత్తీర్ణడగు

He not only got through the exams but also got distinction.

అతను పరీక్షలో పాసవటమే కాక అత్యుత్తమ శ్రేణి మార్కులు సాధించాడు.

  1. TO GET RID OF వదిలించుకొను, విడిచిపెట్టు

It is hard to get rid of bad habits.

చెడు అలవాట్లు వదలటం కష్టం.

  1. IN GENERAL సాధారణంగా

In general I prefer coffee

సాధారణంగా నేను కాఫీని కోరుకుంటాను.

  1. TO TAKE UP THE GAUNT LET ఛాలెంజిని స్వీకరించు

I took up the gaunt let threw down by Prakash.

నేను ప్రకాష్ విసిరిన 'సవాలను' స్వీకరించాను.

  1. TO THROW THE GAUNTLET కయ్యానికి కాలు దువ్వు

America throw down the gauntlet, to Osama bin Laden.

అమెరికా, ఒసామా బిన్ లాడెన్‌కు 'సవాలు' విసిరింది.

  1. TO PLAY A LOSING GAME ఆట ఓడిపోవు

Tallibans are playing a losing game in Afghanistan.

తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో ఓటమి పోరాటం కొనసాగిస్తున్నారు.

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు 55

Page 56

  1. TO GAMBLE AWAY పోగాట్టుకొను, నష్టపోవు

He gambled away all his properties in gambling

అతను తన ఆస్తులన్నిటినీ జూదంలో పోగాట్టుకున్నాడు.

  1. TO GLANCE AT వ్యంగ్య విమర్శ చేయు

Shankar drew cartoons in his famous illustrated weekly glanced at Nehru.

శంకర్ తన ప్రసిద్ధ వార పత్రికలతో నెహ్రూజీపై వ్యంగ్య చిత్రాలను చిత్రించెను.

  1. TO CAST A GLAMOUR OVER సమ్మోహపరచు

The actress cast a glamour over the audience with her beauty.

నటి తన సౌందర్యంతో ప్రేక్షకులను సమ్మోహితులను చేసెను.

  1. TO GIRD UP ONE'S LOINS సమాయత్తమగు, సిద్ధపడు

The freedom fighters girded up their loins and plunged in to the movement responding to Gandhiji call.

స్వాతంత్ర్య సమరోధులు నడుములు బిగించి గాంధీజీ పిలుపుకు స్పందించి ఉద్యమంలో దూకారు.

  1. GHASTLY INCIDENT భయంకరమైన సంఘటన

The ghastly scene of accident (incident) has left indelible print on my mind.

ఘోర సంఘటన నా మనస్సుపై శాశ్వత ముద్ర వేసింది.

  1. TO GET OUT OF HAND అదుపుతప్పి పోవు, చెప్పినట్లు వినకపోవు,

The boy got out of hand due to the negligence of his parents.

తల్లిదండ్రుల అశ్రద్ధ వలన పిల్లవాడు పాడైపోయినాడు.

  1. TO GET AWAY WITH తప్పించుకొను

The thief got away with the booty.

దొంగ సొమ్ముతో పారైనాడు.

  1. GET TOGETHER కలుసుకొను

These will be a get - together of Bank employees this evening at the function hall.

ఈ రోజు సాయంత్రం బ్యాంక్ ఉద్యోగస్తులు ఒక ఫంక్షన్‌లో కలుసుకుంటారు.

  1. TO GET ALONG నెట్టుకొచ్చు, రాణించు

He is getting along well with the company.

అతను ఆ కంపెనీలో బాగానే రాణిస్తున్నాడు.

56 ఇంగ్లీష్ జాతీయములు మరియు పదబంధములు

Page 57

  1. TO GET OVER అధిగమించు, బయటపడు

Venkat got over all his financial difficulties finally.

వెంకట్ తన ఆర్థిక సమస్యల నుండి ఎలాగో బయట పడ్డాడు.

  1. HARMER AND TONGS శక్తివంతమైన కరినమైన

Do your work hammer - and - tongs.

నీ శక్తి యుక్తులను వినియోగించి చెయ్యి.

  1. HALL MARK ప్రధానలక్షణం

Self less service is the hall mark of nobility.

జీవనత్యాగానికి ప్రధానంగా ఉండాల్సిన లక్షణం నిస్వార్థసేవ.

  1. HAIR SPLITTING అనవసరపు గొడవలు, వ్యర్థప్రయాస

The unnecessary hair splitting leacks to complications.

అనవసరపు గొడవలు, ఉద్రిక్తతలకు దారితీస్తాయి.

  1. GUTTER POLITICS మురికి (దుర్గంధపు) రాజకీయాలు

Don't play Gutter Politics.

కంపు రాజకీయాలను చెయ్యవద్దు.

  1. TO HAVE AN AXE TO GRIND స్వార్థం (స్వలాభం)

Every one has his own axe to grind.

ప్రతివాడు తన స్వప్రయోజనాలక ప్రాధాన్యతనిస్తాడు.

  1. GOLDEN KEY (డబ్బు - ధనం)

The golden key (Money opens every lock (door).

బంగారు చెవి అన్ని తాళాలను తెరుస్తుంది.

  1. GOLD FEVER (డబ్బు, డబ్బు అనే జబ్బు)

Every body is suffering from gold (money) fever.

ప్రతివారు బంగారు (డబ్బు) జ్వరంలో బాధ పడుతున్నారు.

  1. THE STORY GOES చెప్పబడింది; అనుకుంటున్నారు

The story goes that the Advocate had committed suicide.

ఆ న్యాయవాది ఆత్మహత్యకు పాల్పడ్డాడని అందరూ చెప్పుకుంటున్నారు.

  1. HAVES AND HAVE NOTS ధనికులు, నిర్ధనులు (పేదవారు)

The society is divided in to haves and have noto.

సమాజం ఉన్నవారు, లేనివారుగా విభజించబడింది.

Page 58

  1. HAVEN OF REST శరణాలయం

There is not haven of rest on earth only hell.

ఈ భూమిమైన సుఖంగా విశ్రాంతి పొందే ప్రదేశం ఎక్కడా లేదు.

  1. TO BERY THE HATCHET వైరం మరిచిపోయి, తిరిగి కలసి ఉండు

They bery the hatchet and be friends once again.

వారు పాత కక్షలు మరిచిపోయి, తిరిగి స్నేహితులుగా ఉండాం.

  1. HARD NUT TO CRACK పరిష్కరించజాలని విషయం

To regulate population increase is a hard nut to crack

జనాభా పెరుగుదల, క్రమబద్దం చెయ్యడం అసాధ్యం.

  1. HANKY - PANKY లోపాయకారి వ్యవహారము

We cannot succeed by hanky - panky tricks.

లోపాయకారి, చిల్లర మల్లర వ్యవహారాల ద్వారా మనం విజయం సాధించలేము.

  1. TO WIN HANDS DOWN సులభముగా గెలుపొందు

Indian cricket team won hands down against England in one day match.

ఇంగ్లాండ్‌పై వన్‌డే మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది.

  1. TO TAKE ILL తప్పుగా భావించు

Please do not take ill of his words (advice).

అతని మాటలు (సలహా) తప్పుగా భావించకు.

  1. CUT NO ICE పని చేయక పోవు, ఫలితము లేకపోవు

Your arguments will cut no ice.

నీ వాదనలో పసలేదు.

  1. HOWS AND WHYS కారణములు, ఫలితములు

We don't know the hows and whys of the accident.

ఆ ప్రమాదం ఎందుకు ఏలా జరిగిందో మాకు తెలీదు.

  1. BY HOOK OR BY CROOK అరుసూరైనా

I will do your work by hoork or by crook.

నేను నీ పనిని ఏదో విధంగా ఆరుసూరైనా చేస్తాను.

  1. TO PLAY HIDE AND SEEK మోసగించు, కళ్ళు గప్పు

Don't play hide and seek with your friend.

నీ స్నేహితులతో దాగుడు మూతలు ఆడకు.

58 ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు

Page 59

Idioms & Phrases in English

  1. HEY DAY యౌవనం, శక్తి

He is in his hey day (happy).

అతను యౌవనం, శక్తి కలిగి ఉన్నాడు.

  1. HECTIC FEVER భావోద్రేకమును పెంపొందించు

Elections are one of the causes for hectic fever.

ప్రజల్లో భావోద్రేకాలకు కారణాలలో ఎన్నికలు ఒకటి.

  1. HAZARD ప్రమాదము

Pollution has become health hazard.

కాలుష్యం ఆరోగ్యానికి ప్రమాదంగా పరిణమించింది.

  1. TO PLAY HAVOC WITH విపరీతమైన నష్టము కలిగించు

The recent cyclone played havoc with Agriculture.

ఈ మధ్య సంభవించిన తుఫాను, వ్యవసాయ రంగానికి విపరీత నష్టం కలిగించింది.

  1. LACK LUSTER ఆనందము, కాంతి (కళ) లేని

Rohini's career has been a lack luster career

రోహిణి జీవితంలో ఆనందము, కాంతి కరువైనది.

  1. TIME KILLER టైం గడిపేందుకు పనికి వచ్చేది

He is a notorious time killer.

అతను భయంకరంగా కాలయాపన చేస్తాడు.

  1. JUSTICE న్యాయము చేయు

Your must do justice to your duty (profienion)

నీవు నీ విధ్యుక్తధర్మాన్ని నిర్వర్తించాలి.

  1. JAW BREAKER ఉచ్చరించుటకు వీలు పడని (సాధ్యం కాని)

Words of unknown language are jaw broken.

తెలియని భాషా పదాలు ఉచ్చారణకు వీలు కావు.

  1. JACK OF ALL TRADER అన్ని వ్యవహారాలలో జోక్యం చేసుకొను

Jack of all trader is usually a fool.

అన్నింటిలో వేలు పెట్టేవాడు మూర్ఖుడు.

  1. TO INTRUDE UPON జోక్యం చేసుకొను

The Pakistan intruded upon Indian teritory

భారత భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించింది పాకిస్తాన్.

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు 59

Page 60

  1. VISTED INTERESTS ధనిక (సంపన్న) దేశాల (ప్రభావం

We should not be ruled by some visted interests.

మనం సంపన్న దేశాల ప్రభావానికి లోను కారాదు.

  1. IN PURSUANCE OF చేయ్యాలనే సంకల్పం

Kapoor went to Dubai in pursuance of a job.

కపూర్ ఉద్యోగం సంపాదించాలనే ఆశతో దుబాయ్ వెళ్ళాడు.

  1. IMPREGNATED WITH పూర్తిగా

Your argument was impregnated with imagination and fabrications.

నీ వాదన పూర్తిగా అసత్యం, కల్పనలతో, ఊహాగానాలతో కూడి ఉంది.

  1. TO BE TAKEN ILL జబ్బు పడు

She was taken ill with AIDS.

ఆమె ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నది.

  1. A MATTER OF LIFE AND DEATH చావు (జీవిత సమస్య

It is a matter of life and death for Ravi.

రవికి యిది జీవన్మరణ సమస్య.

  1. LICK THE DUST ఓడిపోవు, అపజయము పొందు

Karna liked the dust in the battle of kuruksetra against Arjuna.

కర్ణుడు, అర్జునుడి చేతిలో ఓటమిని పొందెను.

  1. MAN OF LETTERS పండితుడు, విద్యావంతుడు

S. Radha Krishnan was a man of letters(scholar).

సర్వేపల్లి రాధాకృష్ణ గొప్ప పండితుడు.

  1. CAN A LEOPORD CHANGE ITS SPOTS

చిరుతపులి తన మచ్చలు పోగొట్టుకోగలదా?

A leapord can not change its spots so as the same case with him.

చిరుత పులి తన మచ్చలు మార్చుకోనట్లే, అతనికి విషయం కూడా అటువంటిదే.

  1. TO STAND ON ONES OWN LEGS తన కాళ్ళపైన తాను నిలబడు

Every one should stand on his own legs.

ప్రతి ఒక్కరూ తమ కాళ్ళపై తాము నిలబడాలి.

Page 61

  1. THE MERCURY IS RISING ఉష్ణోగ్రత పెరుగుతున్నది

The mercury is rising please stop arguing.

వాతావరణం వేడెక్కుతోంది దయ చేసి వాదులాడటం ఆపండి (పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది)

  1. A MASTER MIND కుట్రదారుడు

He is a master mind in politics.

రాజకీయాల్లో అతను కుటిలత్వంగలవాడు.

  1. BAD LOT చెడ్డ పేరున్నవాడు

Osamabin Laden is a bad lot.

ఒసామా బిన్ లాడెన్ మహా దుర్మార్గడు.

  1. LOSING GAME ఓటమి చెందే ఆట

Why should we play a loosing game ?

మనం ఓడిపోయే ఆటను ఎందుకు ఆడాలి ?

  1. LOSE PATEINE కోపంతో చిరచిర లాడు

Do not lose pateine in any circumstance.

ఎట్ల పరిస్థితిలోను సహనాన్ని కోల్పోకు.

  1. MUSICAL CHAIRS కుర్చీల చుట్టూ తిరిగే ఆట

Life is a kind of musical chair.

జీవితం ఒక రంగుల రాట్నం వంటిది.

  1. MOUTH FILLING నోటితో పలక లేని (కలిన) పదాలు ఉచ్చరించు

The drumcard speaking mouth filling words.

ఆ తాగుబోతు బూతులు మాట్లాడుతున్నాడు.

  1. MOHAMMED WILL GO TO THE MOUNTAIN, OTHER WISE

ఇది సాధ్యం కానప్పుడు, అది (రెండవది).

If the mountain will not come to Mohammed, Mohammed must go to the mountain.

పర్వతం మొహమ్మద్ దగ్గరికి రాకపోతే (రాదు గనక) మొహమ్మదే పర్వతం దగ్గరికి వెళ్లాలి.

  1. TO MAKE A MOUNTAIN OF A MOLE HILL

గోరంతలు కొండంతలుగా చేయు

Dont make a mountain, of a mole hill for a petty thing.

స్వల్ప విషయాన్ని భూతద్దంలో చూపకు.

62 ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు

Page 62

  1. A WOLF IN LAMBS CLOTHING గోముఖవ్యాఘ్రము, (గొర్రె తోలు కప్పుకొన్న తోడేలు)

He is that kind of a wolf in lambs clothing.

అతను గోముఖ వ్యాఘ్రము వంటి వాడు.

  1. BLACK BUSTER విజయవంతమైన (ఆదరణపొందిన)

Subhash Ghai produced many black buster films in Hindi.

హిందీలో సుభాష్‌ఘయ్ ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు.

  1. LOOSE TONGUE నోరు పారేసుకోవటం

It is dangerous sometimes to talk with loose tongue.

నోటి దురుసుతో మాట్లాడటం ఒకోసారి ప్రమాదకరం.

  1. TO LOOK UP TO ఎదురు చూచు

Ramana looks upto his wife for every thing

ప్రతి దానికీ రమణ భార్య మీద అధార పడతాడు.

  1. TO LOOK DOWN UPON తక్కువగా చూచు

You should not look down upon him.

నీవు అతనిని తక్కువగా చూడకూడదు.

  1. LOAVES & FISHES స్వలాభము (స్వార్థప్రయోజనము)

Don't live for loaves and fishes.

స్వార్థం కోసం బతకవద్దు.

  1. THROW LIGHT UPON వివరించు

Indian Penal code throws light upon rules of law

భారత చట్టం న్యాయ నిబంధల్ని వివరిస్తుంది.

  1. TO WASH ONE'S DIRTY LINEN IN PUBLIC బహిరంగంగా నిస్పిగ్గుగా ప్రవర్తించు

Political heads will not hesitate to wash their dirty linen in public.

రాజకీయ వేత్తలు మలినమైన (అవినీతితో) తమ చేతులను ప్రజల ముందు శుభ్రం చేసుకోవటానికి వెనకాడరు (సిగ్గుపడరు)

  1. TO LAY DOWN ONE'S LIFE (ప్రాణత్యాగం చేయు

Bhagat singh laid down his life for the sake of his motherland.

భగత్ సింగ్ దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసెను.

Page 63

Idioms & Phrases in English

  1. MIX UP WITH లీనమగు

I am mixed up with my studies.

నేను నా చదువులో లీనమైపున్నాను.

  1. TO BE ON ONES METTLE ఎక్కువగా కష్టపడు

He will be on the mettle in the eleventh hour.

అతను ఆఖరు నిముషాల్లో తెగ కష్టపడతాడు.

  1. TO MAKE A MESS OF చికాకు చేయు

Don't make a mess of whole thing.

మొత్తం వ్యవహారం చెడగొట్టకు.

  1. HOSNETS NEST తేనెపట్టు

Politics are hosnets nest.

రాజకీయాలు తేనెపట్టాంటిది.

  1. TO GET ONE'S NERVES ఇబ్బంది పెట్టు, విసిగించు

Some wives get on their husband's nerves.

కొంత మంది భార్యలు భర్తలను వేధిస్తూ ఉంటారు.

  1. TO STRAIN EVERY NERVE సాధ్యమైనంతగా కృషి చేయు

He is straining every nerve for the cause of helping the poor

పేద వాళ్లకు సేవ చేసేందుకు అతను అన్ని విధాల ప్రయత్నిస్తున్నాడు.

  1. TO SOT AT NAUGHT నిరాకరించు

Rani set at naught my proposal (marriage) to her.

నేను చూసిన వివాహ ప్రతిపాదనను రాణి నిరాకరించెను.

  1. IN TUNE WITH NATURE ప్రకృతికి అనుగుణంగా

Many a human problem can be solved if we start living in tune with nature.

ప్రకృతితో సంబంధం కలిగియుండి సామాన్య నిరాడంబర జీవితానికి అలవాటు పడితే మనం ప్రకృతికి అనుగుణంగా జీవిస్తే. ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయి.

  1. AGAINST NATURE ప్రకృతి విరుద్ధంగా

It is against the nature to cut the wood.

అడవులను నరకటం ప్రకృతి విరుద్ధమైనది.

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు 63

Page 64

  1. BY NATURE స్వభావసిద్ధంగా

By nature he is gentle man.

స్వభావరీత్యా పెద్దమనిషి ఆయన.

  1. TO POUR OIL ON TROUBLED WATERS ఉద్రిక్తలను నివారించు

C.M. Chandra Babu naidu poured oil on troubled waters of naxatism.

నక్సలిజం ఉద్రిక్తలను నివారించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేశారు.

  1. ON OFFER అమ్మకానికి

This T.V. is on offer. Purchase soon.

ఈ టి.వి. అమ్మకానికి పెట్టబడింది. త్వరగా కొనండి.

  1. OFF AND ON అప్పుడప్పుడు

Surya comes to his house off and on for chit chatting.

సూర్య అతని యింటికి బాతాఖానీ కోట్టడానికి అప్పుడప్పుడు వస్తుంటాడు.

  1. TO TAKE OCCASION BY THE FORE LOCK పచ్చిన అవకాశాన్ని వెంటనే

We have to take every occasion by the fore lock.

మనం వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

  1. TO TAKE OCCASION అవకాశమును వినియోగించుకొను

I took the occasion to reveal the truth.

నిజాన్ని విప్పి చెప్పడానికి ఆ అవకాశం ఉపయోగించుకొన్నాను.

  1. TO TAKE AN OATH ప్రమాణం చేయు (స్వీకరించు)

The minister took the oath on Bhavad Githa

మంత్రి భగవద్గీత మీద ప్రమాణం చేశారు.

  1. COME TO NOTHING వృథా అగు

All Gopal's efforts have come to nothing.

గోపాల్ ప్రయత్నాలన్నీ వృర్థమైనవి.

  1. IN THE NICK OF TIME సరియైన సమయానికి

He went to the station in the nick of time.

అతను సరిగ్గా సమయానికి స్టేషన్‌కు వెళ్లాడు

64

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు

Page 65

  1. ON THE QUIT ధ్యానంలో ఉండు

We are on the quiet these days as the abhyasis of 'Sahaja Marg'.

మేము సహజ మార్గంలో (ధ్యానములో) అభ్యాసులుగా చేరిన తరువాత ధ్యానం ద్వారా ప్రశాంత జీవితం గడుపుతున్నాము.

  1. TO QUEUE UP FOR వరుసలో (క్యూ) నిలబడు

Young men queue up for a Government Job.

యువకులు ప్రభుత్వ ఉద్యోగానికి క్యూ కడుతున్నారు.

  1. TO CALL INTO A QUESTION ప్రశ్నార్థకము ?

Life is a big question mark.

జీవితం పెద్ద ప్రశ్నార్థకము.

  1. RELEGATE విస్మరించు

Lets us relegate our difference of opinion.

మన అభిప్రాయ భేదాలను మనం మరచి పోదాం.

  1. REIGN OF TERROR భయభ్రాంతుల్ని చేయు

The ferocious storm made the people reign of terror.

ఆ కృరమైన తుఫాను ప్రజలను భయభ్రాంతులను చేసింది.

  1. REDUCE TO ASHES వృధా(అగు, కుప్పకూలు

All his ambitions were reduced to ashes like a pack of cards (shattered).

అతని ఆశలు, ఆశయాలు ఏకమడల్లో కుప్పకూలి పోయాయి.

  1. REDEEMING FEATURE తప్పుకు నష్టపరిహారం

Even criminals have some redeeming features.

నేరస్తులు సైతం తప్పుకు నష్టపరిహారం చెల్లిస్తారు.

  1. TO BREAK A RECORD విజయం సాధించు

Karanam Malliswari broke a record in weight lifting in 'Sydney Olympics'.

కరణం మల్లేశ్వరి సిడ్నీ ఒలంపిక్ క్రీడల్లో బరువు ఎత్తే పోటీలో రికార్డు స్థాపించింది.

  1. TO RECKON ON (RELY) ఆధారపడు

I cannot reckon you.

నేను నీ మీద ఆధారపడలేను.

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు 69

Page 66

  1. RECIPROCAL ఉిచ్చి పుచ్చుకొనే ధోరణి (UNDERSTANDING)

There should be reciprocal (understanding) in between the

two business partners.

వ్యాపార భాగస్వాముల మధ్య యిచ్చి పుచ్చుకొనే ధోరణి అవసరం.

  1. GOLDEN HOOK బంగారు గాలం

You cannot catch a golden fish with a golden hook.

బంగారు గాలంతో బంగారు చేపను పట్టలేవు.

  1. RULES OF THE ROAD రోడ్డు నియమాలు, నిబంధనలు

If you want to make the best of your life, you must learn and

follow the rules of road buring civic sense.

నీవు జీవితాన్ని చక్కదిద్దుకోవాలనుకుంటే, ముందుగా రోడ్డు నియమనిబంధనలు పాటించటం నేర్చుకోవాలి.

  1. RIP VAN WINKLE పాతకాలపు పద్దతులు అనుసరించువాడు

There are some Rip van winkles dozing in parliament during

'zero' hour.

కొంత మంది లిప్‌వాన్ వింకిల్స్ (ప్రభుద్దులు) పార్లమెంటు జీరో అవర్‌లో కునికి పాట్లు పడుతూ ఉంటారు.

  1. WITHOUT A RESTRAINT అదుపు, ఆజ్ఞ లేకుండా స్వేచ్చగా

The children generally act without restraint.

పిల్లలు సాధారణంగా, అదుపు (నిగ్రహం) లేక ఉంటారు.

  1. TO SHOULDER THE RESPONSIBILITY బాధ్యతను చేపట్టు.

Parents must shoulder the responsibility of their children.

తమ పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యత వహించాలి.

  1. A STORE HOUSE OF REPARTEE హాస్యచతురోక్తులకు నిలయం

My friend is a store hourse of repartee.

నా స్నేహితులు హాస్యోక్తులు భాండాగారం.

  1. TO PAY ONE'S RESPECTS గౌరవభావాన్ని తెలియచేయు

Pay my respects to your father.

మీ నాన్న గారికి నా గౌరవాభినందనలు తెలుపు.

70

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు

Page 67

Idioms & Phrases in English

  1. TO RELIEVE ONE OF బోగాట్టుకొను

I was relievered of my bag in Delhi while I was travelling in local train.

నేను ఢిల్లీలో రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు నా బ్యాగ్ పోతాట్టుకొన్నాను.

  1. TO PUT TO ROUT హోర్తిగా ఓడించు

American cannot put to rout the Saddam Hussain inspite of severe attacks.

అతి తీవ్రమైన దాడులు జరిపినప్పటికీ అమెరికా సద్దామ్ హుస్సేన్ ను హోర్తిగా ఓడించలేకపోయింది.

  1. TO BE NOT ALL ROSE గులాబీలమయం కాదు

Life is not all roses. It has thorns also.

జీవితం మంటే, అంతా గులాబీలు కాదు ముళ్లు కూడా ఉంటాయి.

  1. TO BUILD AN IVORY TOWER (CASTLE) IN THE ROSE GARDEN దోకల కలలు కను.

It is the privilege of the youth, to build an ivory towers in the rose garden.

గులాబీ తోటల్లో దంతాల మేడలు (గాలి మీద) యువకుల స్వాధికారము.

  1. TO STRIKE ROOTS వేళ్ళను (స్థిరంగా ఉండు)

Democracy has struck roots in our country despite many odds (draw backs).

ఎన్ని అవరోధాలు ఎదురవుతున్నప్పటికీ, మన దేశంలో ప్రజాస్వామ్యం స్థిరంగా ఉంది.

  1. TO RULE THE ROOST యజమానిగా నిర్వహించు

In some houses mother rule the roost instead of father.

కొన్ని ఇళ్ళలో తండ్రికి బదులు, తల్లి పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది.

  1. AT ROOST మంచం (పక్క) మీద

Lamboo is at roost when the sun rises.

తెల్లవారిన తర్వాత కూడా లంబూ నిద్రపోతూనే వున్నాడు.

  1. GO TO ROOST నిద్రపోవు

The children should go to the roost early and rise early.

పిల్లలు పెందలాడే నిద్రపోవాలి, త్వరగా నిద్ర లేవాలి.

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు 71

Page 68

  1. MUCH BOAST, LITTLE ROAST మాటలు ఎక్కువ, చేతలు తక్కువ

His deeds and actions were much boast and little roast.

అతని చర్యలు మాటలు ఎక్కువ, చేతలు తక్కువగా ఉన్నాయి.

  1. SAND WITCH ఎంటి మధ్య నలుగు, బాధపడు

Chalapathi is a sand witch between his mother and wife.

అటు భార్యకూ, ఇటు తల్లికీ చెప్పలేక చలపతి మధ్యలో నలుగుతున్నాడు.

  1. A GOOD SAMARITAN పరోపకార పరాయణుడు

The king was good samaritan. He helps those who are in difficulties.

రాజుగారు పరోపకార పరాయణులు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకుంటాడు.

  1. TO TAKE WITH A PINCH OF SALT నమ్మకం లేకపోవు

The officer was taken his statement with a pinch of salt.

అతని స్టేట్‌మెంట్‌ను ఆఫీసరు నమ్మలేదు.

  1. WORTHS HIS SALT కృతజ్ఞత వెల్లడించు

The sevant is working for the last ten years, and he is worth his salt.

పనివాడు గత పది సంవత్సరాలుగా యజమానికి నమ్మకంగా పనిచేస్తున్నాడు.

  1. IN THE SADDLE అధికారంలో కొనసాగు

At seventy years Atal Behari Vajapayee was still firmly in the saddle as prime minister.

డెబ్బై సంవత్సరాల వయస్సులో కూడా అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధాని పదవిలో స్థిరంగా కొనసాగుతున్నారు.

  1. TO GET A SACK ఉద్యోగము నుండి తొలగించు

All that some ministers got from the cabinet of Chandra Babu Naidu a sack in the name of face lift.

చంద్రబాబు నాయుడు మంత్రివర్గం నుండి ఉద్వాసన పొందిన మంత్రులు అంతా అసమర్థత కారణంగానే తొలగించబడ్డారు.

  1. TO BRING TO RUIN నాశనం చేయు

Idleness brings to ruin.

సోమరితనం వినాశనానికి హేతువు.

72 ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు

Page 69

  1. COME TO PASS సంభవించు

Many things have came to pass in between the two years.

ఈ రెండు సంవత్సరాల మధ్య ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి.

  1. PASS AWAY మరణించు

Krishna Kanth passed away suddenly.

కృష్ణకాంత్ అకస్మాత్తుగా మరణించారు.

  1. OF PARAMOUNT IMPATANCE అధిక ప్రాధాన్యత

Now a days the AP Govt is of paramount importance to education.

ఇటీవల ఆంధ్రపదేశ్ ప్రభుత్వం చదువుకు అత్యుత్తమ ప్రాధాన్యత ఇస్తోంది.

  1. TO DRAW A PARALLEL పోల్చిచూడు

It is foolish to draw a paralled between Gandhi and Godse.

గోథ్సేను గాంధీజీతో పోల్చడం పిచ్చితనం.

  1. TO TAKE PAINS కష్టపడు

He took pains for the marriage of his sister.

చెల్లెళ్ళి పెళ్ళి కోసం అతను చాలా కష్టపడ్డాడు.

  1. OPEN HEART నిడు హృదయం

He speaks every thing with an open heart (mind).

అతను ప్రతి విషయం మనస్సు విప్పి మాట్లాడతాడు.

  1. TO LOAD OUT THE OBIVE BRANCH శాంతి సంకేతం తెలియచేయు

After a prolonged war, the Taliban heldout the obive branch to the Norther alliance army.

సుదీర్ఘ పోరాటం అనంతరం తాలిబాన్లు నార్తరన్ అలయెన్స్ సైన్యానికి శాంతి సంకేతం పంపారు (లోఁగిపోయారు)

  1. KEEP MUM మెదలకుండా ఉండు

It is better if you keep mum when you don't know the answer.

నీకు సమాధానం తెలియనప్పుడు మౌనంగా వుండటం మంచిది.

  1. TO KNOW WHERE THE SHOE PINCHERS

ఎక్కడ చెప్ప నొక్కుతున్నదో తెలుసుకోను

Richmen never know where the shoe pinches the poor.

పేదవారి బాధలు డబ్బుగల వారికి ఎన్నడూ తెలియవు.

Page 70

  1. TO BE DRIVEN FROM PILLAR TO PAST

ఒక్కోటి నుండి యొక్క చోటికి తిరుగు

He is being driven from pillar to past for suitable Job.

అతను తగిన ఉద్యోగానికి ప్రతి ఒక్కరి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు.

  1. TO PICK A QUARREL తగాదాపడు, గొడవపడు

Do not pick a quarrel with neighbours.

ఇరుగు పొరుగుతో తగాదా పెట్టుకోకు.

  1. TO ROB PETER TO PAY PAUL కాకుల్ని కొట్టి, గద్దలకు వేసినట్లు

The government always robs peter to pay paul.

ప్రభుత్వం ఎప్పుడూ కాకుల్ని కొట్టి, గద్దలకు వేస్తుంటుంది.

  1. AT YOUR PEVIL (OWN RISK) స్వంత పూచికత్తు

I do what ever I want to do at failed my pevil I don't blame any body.

నేను ఏది చేయదలకుంటే అది నా స్వంత పూచి మీద చేస్తాను. విఫలం చెందితే ఎవరినీ నిందించను.

  1. TO PAY ONE BACK IN HIS OWN COIN ఒకరికి అదే విధమైన సమాధానం చెప్పు

Sivaji paid back Aurangajeb in his own coin.

శివాజీ ఔరంగజేబుకు తగిన గుణ పాఠం చెప్పెను.

  1. HAVE PATIENCE WITH ఓర్పు, సహనం ప్రదర్శించు

I have no patience with your behaviour.

నీ వ్యవహారాన్ని భరించే సహనం నాకు లేదు.

  1. TO SET A PRICE ON ONE'S HEAD ఒకరిని పట్టుకోవడానికి ఆచూకీ తెలిపిన వారికి ఇచ్చే బహుమానం.

The T.N. State Govt. set a price or fifty lakhs on the head of sandal smuggler Veerappan.

చందనాన్ని దొంగ రవాణా చేసే వీరప్పన్ తలకు తమిళనాడు ప్రభుత్వం 50 లక్షల రూపాయల వెలు కట్టింది.

66 ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు

Page 71

Idioms & Phrases in English

  1. THE POT CALLS THE KETTLE BLACK

గురివింద తన నలుపు ఎరగనట్లు

His attitude is like pot call the kettle black

అతని ప్రవర్తన కుండ, కిటిల్ (టీకాచే పాత్ర) ను నల్లగా ఉన్నదని అనటం లా వుంది.

  1. TO TAKE THE PLUNGEE కొరవచూపించు (ధైర్యము చేయు)

What ever work Saran want to do, he takes the plunge in order to get success.

శరన్ ఏ పని చేయ్యాలన్నా ధైర్యం చేసి, విజయం సాధించడం కోసం కొరవ చూపుతాడు.

  1. TO PLUME ONE SELF ON గొప్పలు, బడాయిలు పలుకు

Do not plume yourself on your beauty.

నీ అందానికి మరింతగా గొప్పలు చెప్పుకోకు.

  1. TO PLAY ONE'S CARDS WELL అవకాశాల్ని వినియోగించుకొను

Wise people play their cards well.

తెలివి గలవాళ్ళు అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకుంటారు.

  1. FROM ALL QUARTERS అన్ని వైపుల నుండి

Relatives came to our house from all quarters on the occasion of Sailesh's birthday.

శైలేష్ పుట్టిన రోజు సందర్భంగా అన్నివైపుల నుండి బంధువులు వచ్చారు.

  1. NEGLIGIBLE QUANTITY - A PERSON WHO NEED NOT BE RECK ONED WITH లెక్కలోకి రాని (అప్రధానమైన)

Retired people are treated as negligible quality.

ఉద్యోగ విరమణ చేసిన వారు ప్రాధాన్యత లేని వారుగా పరిగణింపబడతారు.

  1. IN A QUANDARY అయోమయ (తోచని) పరిస్థితి

When he missed the train, he was in a Quandary.

రైలు తప్పిపోతే, ఏం చేయాలో తోచని పరిస్థితిని అతను ఎదుర్కోవలసి వచ్చింది.

  1. IN THE QUAG MIRE ఇబ్బందులు ఎదుర్కొను

Middle class families are in the quag mire these days of rising prices in racket speed.

మధ్య తరగతి ప్రజలు ఆకాశానికి అంటుతున్న ధరలకు తట్టుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు 67

Page 72

  1. TO FEEL ONE'S PULSE నాడి (అభిప్రాయం) తెలుసుకొను

A leader should be able to feel the pulse of fellow workers.

నాయకుడు అన్న వాడికి తోటి పనివాళ్ళ అభిప్రాయాలు తెలిసి ఉండాలి.

  1. TO PULL UP మందలించు

The Teacher pulled up the student for his mis behaviour.

అతని చెడు నడత కారణంగా ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని మందలించారు.

  1. TO PULL THROUGH OR TO GET THROUGH

కృతార్థుడగు / ఉత్తీర్ణత సాధించు

His son pulled through the examination some how or the other.

అతని కొడుకు ఏదో విధంగా పరీక్షలో బయట పడగలిగాడు.

  1. REAPING HOOK అదృష్టము

Every body falls a prey to the reaping hook.

'అదృష్టము' అనే గాలానికి అందరూ బలైవుతారు (చిక్కకుంటారు).

  1. REAP THE FRUITS OF ఫలితము అనుభవించు

Every on must reap the fruits (Comequees) of one's actions according to 'Gita'.

'భగవద్గీత' ననుసరించి ప్రతి ఒక్కరు తమ 'కర్మ' లను ఫలితం అనుభవించాల్సి ఉంటుంది.

  1. RANSOM ఒక వ్యక్తి నుంచి సమాచారం రాబట్టుకు బంధించు

The taliban regime in Afghanistan held a British Journalist to ransom.

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వం బ్రిటన్ కు చెందిన పత్రికా విలేఖరిని సమాచారం రాబట్టుకై నిర్బంధించిరి.

  1. RADICAL (THOUGH) CHANGE సమూలమైన మార్పు

Computer brought a radical change in our lives.

మన జీవితాల్లో కంప్యూటర్లు సమూలమైన మార్పు తెచ్చాయి.

  1. RADICAL ERROR (ప్రధానమైన (ముఖ్యమైన) తప్పు

Ego is a radical error.

అహంకారం ప్రధాన శత్రువు.

68

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు

Page 73

  1. TO RUB SHOULDERS WITH సంబంధము కలిగియుండు

Light rubs shoulders with darkness

వెలుగు వెంటే చీకటి వుంటుంది.

  1. SWEET SEVENTEEN యుక్త వయస్కురాలైన

Sadaf is now sweet seventeen.

సదాఫ్ యిప్పుడు 17 సంవత్సరాల అందగత్తె.

  1. TO SET APART ప్రత్యేకించు

I have set apart this room for guests and friends.

నేను ఈ గదిని అతిథులకు, స్నేహితులకు ప్రత్యేకించాను.

  1. SET AGAINST బ్యాలెన్స్ (మిగిలి ఉన్న) ఒక దానికొకటి పోటీ

If you set your joys against your sorrows you will find that your band balance in nill.

నీ ఆనందాన్ని (సుఖాన్ని) నీ దుఖానికి బదులుగా పెడితే, అప్పుడు నీ బ్యాంక్ (జీవితం) బ్యాలెన్స్ (మిగులు) ఏమీ ఉండదు (నిల్).

  1. ALL SERENE అంతా మంచి

All serene in your lie here after.

నీ జీవితంలో యిక్కడిన్చి అంతా మంచే !

  1. TO SEE THE LIGHT ప్రచురణకు నోచుకొను (వెలుగుచూడ)

My writings have at last seen the light (published)

చివరికి నా రచనలు వెలుగుచూసినాయి (అచ్చు అయినాయి).

  1. TO PLAY THE SECOND FIDDLE TO వంతపాడు

Friends play a second fiddle to him.

స్నేహితులు అతనికి వంతపాడతారు.

  1. GENTLEMAN OF THE OLD SCHOOL సంకుచిత భావాలు గల

Thakaray is gentleman of the old school.

థాకరే పాత కాలం కోల్పు పెద్దమనిషి.

  1. SCHOOL OF ADVERSITY పేదరికంలో

Many great people were educated in the school of adversity.

గొప్పవాళ్ళదరూ కష్టాల ఒడిలో (బడి) నుంచి పైకి వచ్చిన వాళ్ళే.

Page 74

  1. TO SAY ONE NAY ఏదైనా నిరాకరించు

I cannot say him nay (no).

ఏది అడిగినా నేను కాదనలేను.

  1. TO SAY A GOOD WORD FOR మంచి మాట

Say a good word for me to him.

నా గురించి అతనికి ఒక మంచి మాట చెప్పు.

  1. THE LONG AND THE SHORT సంక్షిప్తంగా, సంక్రహంగా

To say the long and short of the incident is he had stolen money.

ఆ సంఘటన సంక్షిప్తంగా/సంగ్రహంగా ఏమిటంటే అతను డబ్బు దొంగలించాడు.

  1. TO MAKE SHIP WREEK నాశనమై పోవు, చెడిపోవు

Shyamala made a ship wreak of my hopes.

శ్యామల నా ఆశల్ని నాశనం చేసింది.

  1. TO STEP INTO SOME ONE'S SHOES అవతలివాని బాధ్యతలు చేపట్టు

That TDP in the state has stepped into the shoes of the congress.

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టింది.

  1. THE SHIFTS AND CHANGES OF ఒడిదుడుకులు, కష్టసుఖాలు

We have to face bravely in the shifts and changes of life.

మనం జీవితంలో ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కోవాలి.

  1. ON THE SHELF అమలుకు నోచుకోని

His file (proposal) is still on the shelf.

అతని ఫైలు యింకా అమలుకు నోచుకోలేదు.

  1. SHEEP THAT HAVE NO SHEPPERD మంచి కాపరి లేని గొర్రెలు

Indians are like sheep that have no a good shepperd.

భారతీయులు మంచి కాపరి లేని గొర్రెల్లా ఉన్నారు.

  1. TO FOLLOW LIKE SHEEP గొర్రెల మాదిరిగా అనుసరించు

Public (people) follow the politicians like sheep.

ప్రజలు రాజకీయ వేత్తలను గొర్రెల మందలా అనుసరిస్తారు.

  1. TO PLAY A SHABBY TRICK హీనంగా ప్రవర్తించు

It does not pay to play a shabby trick.

హీనంగా ప్రవర్తించినందువల్ల ఉపయోగం లేదు.

Page 75

Idioms & Phrases in English

  1. TO SHARK FOR A LIVING మోసముతో జీవించు

It does not pay to play a sharks for a living.

చాలామంది వ్యాపారులు మోసంతో జీవిస్తూ ఉంటారు.

  1. THE SHACKLES OF CONVENTION

ఆచారాల (సంప్రదాయాల) సంకెళ్లు

Youth is chained in the shackles of conventions.

యువత ఆచారాల అనే సంకెళ్లతో బంధించబడింది.

  1. TO SPIN A YARN కట్టు కథలల్ల

Raji is an expert in Spinning Yarn.

కట్టు కథలు అల్లటంలో రాజు గట్టివాడు.

  1. IN THE SOUP చిక్కుల్లో యిరుకొను

Narendra Modi is now in the soup of Gujarath's Communal aggravations

గుజరాత్ మత ఉద్రిక్తతల కారణంగా నరేంద్రమోడీ యిప్పుడు చిక్కుల్లో వున్నాడు.

  1. THE SKY IS THE LIMIT హద్దు లేదు

There is no limit to the ambitions of man. The sky is the only limit for him.

మనిషి ఆశకు హద్దు అంటూ లేదు, ఆకాశమే హద్దు.

  1. TO SAVE ONE'S SKIN ఆరోపణలనుండి బయట పడు

Exprime minister P.V. Narasimha Rao saved his skin from all elections put upon him.

తన మీద మోపబడిన ఆరోపణలన్నిటి నుండి మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు బయటపడ్డారు.

  1. TO SKIM THE CREAM OFF సారమును గ్రహించు

Nehru skimmed the cream off all honours.

నెహ్రూ గారు అన్ని గౌరవాలను (భారతరత్నతో సహా) పొందారు.

  1. TO HAVE A SKELETON IN ONE'S CUP BOARD ప్రతిష్ట దిగజార్చు

Every pclitician has a skeleton in the cup board.

ప్రతి రాజకీయ నాయకుడి ప్రతిష్టను దిగజార్చే అవినీతి ఆరోపణలు ఉంటాయి.

  1. SKELETON AT A FEAST ఆనందాన్ని పాడుచేయు

An ugly quarrel is a skeleton at a feast.

అనవసరమైన (అసహ్యకరమైన) తగాదా భోజనానికి ఆటంకంగా పరిణమిస్తుంది.

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు

75

Page 76

  1. TO COME TO TERMS రాజీకి వచ్చు, అంగీకారమునకు వచ్చు

India and Pakistan failed to come to terms at Agra summit on Kashmir issue.

భారత-పాకిస్తాన్ దేశాలు రెండూ, ఆగ్రా సమావేశంలో కాశ్మీరు సమస్యపై ఒక అంగీకారానికి రాలేక పోయినవి.

  1. TO TENDER RESIGNATION రాజీనామా చేయు

There who did not get berths in the reorganised cabinet of Chandra babu Naidu are gettin ready to tender their resignation to express their resentment.

చంద్రబాబునాయుడి మంత్రి మండలిలో పదవులు దొరకని వారు రాజీనామా చేసేందుకు సిద్ధపడుతున్నారు.

  1. TO TELL A LIE అబద్ధమాడు

Don't tell me a lie

నాకు అబద్ధం చెప్పకు.

  1. TO TELL UPON చెడ్డ ఫలితము నిచ్చు, నష్టము కలిగించు

Hard work told upon his healthy severely.

అధిక పరిశ్రమ అతని ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.

  1. TEDDY BEAR పిల్లలు ఆట వస్తువు (ఎలుగుబంటి)

Many your people treat life as teddy bear not real bear, that is the real problem with them

చాలా మంది యువకులు జీవితాన్ని ఆట ఎలుగుబంటిగా భావిస్తారే కాని, నిజమైన ఎలుగుబంటిలా భావించక పోవటం పెద్ద లోపం.

  1. TEAM WORK ఉమ్మడి కృషి

Success is the result of tearm work.

సమిష్టి కృషి, ఫలితమే విజయం.

  1. TO TAKE INTO ONE'S CONFIDENCE విశ్వాసంలోకి తీసుకొను

Chandra Babu Naidu never took the opposition into confidence.

చంద్రబాబునాయుడు ప్రతి పక్షాలను ఎన్నడూ విశ్వాసంలోకి తీసుకోలేదు.

  1. THREAD BARE పూర్తిగా చినిగి పోయిన, నగ్నముగా

The begger is with thread bare.

ఆ బిచ్చగాడు పూర్తిగా చినిగిన బట్టలతో నగ్నంగా వున్నాడు.

76

Page 77

Idioms & Phrases in English

  1. ONE IN A THOUSAND అరుదు, వెయ్యికొకడు

Good people are one in a thousand.

మంచివాళ్ళు నూటికో, కోటికో ఒకళ్ళుంటారు.

  1. THOUSAND AND ONE లెక్కలేవన్ని

Children generally choose thousand and one excuses to hide their mistaken.

పిల్లలు తమతప్పుల్ని కప్పి పెట్టటానికి సహజంగా లెక్కలేనన్ని కారణాలు ఎంచుకుంటారు.

  1. A THORN IN ONE'S FLESH తినే ఆహారంలో ముల్లు గ్రుచ్చుకొను

Kashmir is thorn in flesh for India.

కాశ్మీరు భారత దేశానికి భోజనంలో ముల్లులా గుచ్చుకునేదిగా ఉంటుంది.

  1. THICK SKINNED సందించకపోవు

Some wealth power makes a man thick skinned.

కొంతమంది ఐశ్వర్యం, అధికారంతో మదించినవాళ్ళు రాతి గుండె కలిగి వుంటారు.

  1. THEN AND THERE అక్కడికక్కడే (ON THE SPOT)

Then and there I paid the fees.

అక్కడికక్కడే నేను ఫీజు కట్టేశాను.

  1. TESTING TIME పరీక్షా సమయం

India is pasing through a testing time.

భారత దేశంకు యిది గట్టి పరీక్షా సమయం.

  1. NEAT AND TIDY పరిశుభ్రంగా

The children should be seen neat and tidy.

పిల్లలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలి.

  1. TO TREAD ON ONES ఒకరిని అగౌరవపరచు, బాధకలిగించు

Do not tread on the toes of your fellows

నీ తోటివారిని అగౌరవపరచకు, కష్టపెట్టకు.

  1. TO TAKE AT THE TIDE అవకాశములు

Take this event at the tide.

అవకాశాన్ని విడవకుండా ఉపయోగం చేసుకోవాలి.

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు 77

Page 78

  1. TIME AND TIDE అవకాశములు

Time and tide waits for no man

అవకాశాలు ఎవరి కోసమూ ఎదురు చూడవు.

  1. TO GO WITH THE TIDE నలుగురితో కలిసిపోవు

I must go with the tide or I will be left behind.

నేను నలుగురితో పాటు కలిసి ముందుకు సాగాలి లేకపోతే, నేను వెనకబడిపోతాను.

  1. UNDER THE THUMB OF వ్రేలి లో బడి (అయిపడి)

The students are no longer under the thumb of their teacher now a days.

విద్యార్థులు ఈ రోజుల్లో ఉపాధ్యాయుల చెప్పుచేతల్లో లేరు.

  1. TO THROW OUT (MAKE OUT) బయటికి నెట్టి (గొట్టి) వేయు

The poor old man was thrown out of his house by his own sonsun ceremoniusly.

నిర్దయగా ఆ ముసలాయన్ని, సొంత కొడుకులే ఇంటి నుండి బయటకు వెళ్ళగొట్టారు.

  1. THROUGH AND THROUGH పూర్తిగా

He is a scoundrel through and through.

అతను నిలువెల్లా దుర్యోర్గుడు.

  1. AN UGLY JOB - TO DANCE TO THE TUNES OF ఒకరి కాలి (క్రింద చెప్పులా వ్యవహరించు

Dancing according to the tuner of other is an ugly Job.

ఒకరి చెప్పినట్ట్లా ఆడటం చాలా అసహ్యకరమైన పని.

  1. TO BECOME THE TOOL OF ఒకరి అడుగులకు మడుగులోత్తు (తొత్తుగా వ్యవహరించు)

He has become the tool of his boss to get his leave sanctioned.

అతను తన యజమాని నుంచి శెలవు మంజూరు కోసం అతని అడుగులకు మడుగులోత్తుతున్నాడు.

  1. TO HOLD ONE'S TONGUE నోరు మూసుకుని కూర్చొను (మెదలకుండా)

It is better to hold your tongue as you have nothing important to say.

నీవు చెప్పవలసిన ముఖ్యమైన విషయం ఏమీ లేనప్పుడు మౌనంగా ఉంటే మంచిది.

Page 79

  1. TO AND FRO ఇటు-అటు, రాను-పోను

What are the to and fro flight charges (fare) to Hyderabad.

హైదరాబాద్‌కు రానుపోను విమానం చార్జీలు ఎంత?

  1. NOT TOMORROW ONLY TODAY రేపు కాదు (రాదు) నేడే

Do not hope to have your was her fulfilled tomorrow remember,

tomorrow never comes but only today.

నీ కోరికలు రేపు తీరతాయనుకోకు, రేపు ఎప్పుడూ రాదు, ఉన్నదల్లా నేడే (ఈ రోజే)

  1. TO TOE THE LINE అడుగు జాడల్లో నడుచు, అనుసరించు

The teachers toe the line of the school Inspector.

ఉపాధ్యాయులు పాఠశాలల తనిఖీ అధికారి చెప్పినట్లు నడుచుకుంటారు.

  1. TO HAVE AT ONE'S FINGER TIPS బాగా జ్ఞాపకం ఉంచుకొను

A good student has his lesson at his finger tips.

మంచి విద్యార్థి పాఠం చక్కగా చదివి జ్ఞాపకం ఉంచుకుంటాడు.

  1. TO BE IN A TIGHT CORNER క్లిష్ట పరిస్థితి నెదుర్కొను

I am in a tight corner with him.

అతనితో నాకు యిబ్బందులు వున్నాయి.

  1. A WALKING ENCYCLOPAEDIA నడిచే విజ్ఞాన సర్వస్వం

Our lecturer is a famous as a walking encyclopaedia.

మా లెక్చరర్ నడిచే విజ్ఞాన సర్వస్వంగా పేరు గాంచాడు.

  1. UTMOST RELUCTANCE మిక్కిలి అయిష్టత

He showed his utmost reluctance to follow me.

అతను నన్ను అనుసరించడానికి పూర్తి అయిష్టత ప్రదర్శించాడు.

  1. UPS AND DOWNS ఒడిదుడుకులు

I have seen many ups and downs in his life.

నేను అతని జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాను.

  1. UNLESS AND UNTIL వరకు (పరతు)

Don't leave this place unless and until he comes.

అతను వచ్చే వరకు యిక్కడి నుంచి కదలవద్దు.

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు 79

Page 80

  1. UNIVERSAL APPLAUSE ప్రశంస, పొగడ్త

Vajapeyes speech draw universal applause in SAARC

ప్రధాని వాజ్‌పేయ్ సార్క్ సదస్సులో ఉపన్యాసానికి మంచి స్పందన కల్పించింది.

  1. TO COME TO AN UNDERSTANDING రాజీ (అంగీకారానికి) వచ్చు

Let us come to an understainging on this issue.

ఈ విషయాల పైన మనం ఒక అంగీకారానికి వద్దాం.

  1. UNDER A CLOUD సందేహాస్పదము

The conduct of some ministers is under cloud as alleged by the opposition.

కొందరు మంత్రులకు నేర చరిత్ర ఉన్నదని ప్రతిపక్షం విమర్శిస్తున్నది.

  1. ULTIMATE CAUSE OF LIFE జీవిత రహస్యం

Man has not yet discovered the ultimate cause of life (soul)

మనిషి ఇంతవరకు జీవిత పరమార్థం ఏమిటి అన్న విషయం తెలుసుకోలేకపోయాడు.

  1. ON THE VERGE OF అంచుమీద

Hand loom weavers in andhra pradesh are on the verge of starvation.

ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికులు ఉపాధిలేక ఆకలి చావులకు లోనవుతున్నారు.

  1. TO TAKE VENGENCE కక్ష (పగ) సాధించు

He took vengence against the clever boy.

అతను ఆ తెలివి గల కుర్రవాని మీద పగబూనాడు.

  1. TO GIVE VENT TO వెలుబుచ్చు, స్పష్టముగా తెలియచేయు

The sorrowful wife gave vent to her suppressed emotions.

దీనురాలైన భార్య తన హృదయంలో అణచబడిన భావోద్రేకాలకు వెలుగ్రక్కింది.

  1. INVAIN నిరూపయోగము, నిరర్థకము

All the efforts to save him proved invain.

అతన్ని బతికించడానికి చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైనాయి.

  1. VAGRANT SPECULATION విచ్చలవిడి ఆలోచనలు

Those who have no aim or goul in life indulge in vagrant speculations.

సరైన లక్ష్యం లేనివారు విచ్చలవిడి ఆలోచనలతో జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు.

Page 81

  1. VACANT FRIVOLITIONS వ్యర్థమైన, విలువలేని పోకడలు

Many youngmen today are given up to vacant frivolities.

చాలామంది యువకులు వ్యర్థమైన విలువలేని వైఖరి పోకడలు పోతున్నారు.

  1. UTTER ABSURDITY పూర్తి మూర్ఖత్వము

It is the utter absurdity to believe every one is a fool.

ప్రతి ఒక్కరూ మూర్ఖులని నమ్మడం పరమ మూర్ఖత్వం.

  1. UTTER MISERY కటిక దారిద్ర్యంలో మగ్గు

Ninety perent (Majority) of India's masses live in utter misery (felow poverty line)

భారత దేశంలో నూటికి తొంబై శాతం ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు.

  1. BY VIRTUE OF కారణము చేత

The criminal was set free by virtue of his good conduct.

నేరస్తుడ్ని, అతని సత్ ప్రవర్తన కారణంగా విడుదల చేశారు.

  1. TO KEEP VIGIL రాత్రంతా నిద్రలేకుండా గడుపు

The mother kept vigil at her ailing daughter.

జబ్బుతో బాధపడుతున్న కూతురు దగ్గర తల్లి రాత్రంతా నిద్ర లేకుండా గడిపింది.

  1. POINT OF VIEW అభిప్రాయము

I cann’t agree with your point of view.

నీ ఉద్దేశం (అభిప్రాయము) తో నేను ఏకీభవించను.

  1. IN VIEW OF కారణం వలన

He was allowed to go home in view of his ill health.

అతని అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నందున ఇంటికి వెళ్ళడానికి అతనికి అనుమతి లభించింది.

  1. TO VIE WITH పోటీపడు

The traders vie with to increase the prices.

వర్తకులు పోటీ పడి ధరలు పెంచుతుంటారు.

  1. TO GAIN VICTORY OVER విజయం సాధించు, గెలుపొందు

We have to gain a victory mainly over our parios and emotions.

మన కోరికలు, ఆశయాలను మన అదుపులో ఉంచుకొని విజయాలు సాధించాలి.

Page 82

  1. TO MOVE IN A VICIOUS CIRCLE ఒక నిర్ణయానికి రాలేక పాతవాదనే కూనసాగించు

Political contavers is move in a vicious circle.

రాజకీయ కక్షలు, తగాదాలు ఒక నిర్ణయానికి రాలేక విషవలయంలో చిక్కుకుంటున్నాయి.

  1. VIA MEDIA మధ్యస్తమార్గం

I find the via media for compromising our differences.

నేను మన అభిప్రాయాలతో రాజీ పడేందుకు మధ్యేమార్గం కనుగొన్నాను.

  1. VESTED WITH కలిగియుండు

The Principal was all in all and vested with full authority.

ప్రిన్సిపాల్ అన్ని అధికారాలు కలిగి అన్నీ తానేగా వ్యవహరిస్తున్నాడు.

  1. TO GIVE WARM RECEPTION (WELCOME) ఘన స్వాగతం

American president Bill Clinton was given a warm reception during his visit in New Delhi.

అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు న్యూఢిల్లీలో ఘనస్వాగతం లభించంది.

  1. TO BE ON THE WAR PATH దాడిచేయుటకు సిద్ధపడు

Pakistan is on the war path against India over Kashmir issue.

కాశ్మీర్ వివాదం పైన పాకిస్థాన్ భారత దేశంతో యుద్ధానికి సిద్ధపడుతుంది.

  1. TO WAGE A WAR దాడి

Hitler waged a war against France.

హిట్లర్ (ప్రాన్స్) పైన దాడిచేశాడు.

  1. COLD WAR ప్రచ్ఛన్న యుద్ధం

There is cold war between India and Pakistan.

భారత్, పాక్ దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది.

  1. IN THE WAKE OF వెనుక

Sufferings come in the wake of sins.

బాధలు, కష్టాలు పాపం కారణంగా వస్తూంటాయి.

  1. LUMINOUS - VOLUMINOUS ప్రకాశవంతం - పెద్ద పరిమాణం

Your report should be luminous but not voluminous.

నీ నివేదిక ఉపయోగకంగా ఉండాలి. పేజీల సంఖ్య ముఖ్యం కాదు.

Page 83

Idioms & Phrases in English

  1. VOLTE FACE ముఖంచాటుచేయు

His resignation as an M.L.A. was an act of volte face.

అతను తన M.L.A. పదవికి రాజీనామా చెయ్యటం ఒక ఎత్తుగడ.

  1. WITH ONE VOICE ఏకగ్రీవంగా, ఐక్య కంఠం

The opposition turned down the proposal with one voice.

ప్రతిపక్షం ఏకగ్రీవంగా తీర్మానాన్ని వ్యతిరేకించింది.

  1. TO GIVE VOICE TO తెలియజేయు

He gave voice to his resent ment.

అతను తన వ్యతిరేక భావాన్ని బహిరంగంగా వ్యక్తపరిచాడు.

  1. TO PAY A VISIT దర్శించు

I paid her a visit yesterday on the eve of her birthday.

నేను ఆమె పుట్టిన రోజు సందర్భంగా నిన్న కలసి అభినందించాను.

  1. VIS-A-VIS వ్యతిరేకంగా

Let's comider the prosperity of India vis-a-vis unemployment.

నిరుద్యోగులకు వ్యతిరేకంగా మన భారత దేశ సౌభాగ్యాన్ని కోరుకుందాం.

  1. A WOLF IN SHEEP'S CLOTHING గొర్రెతోలు కప్పుకున్న తోడేలు లాంటివాడు.

He is a wolf in sheeps clothing.

అతను గొర్రె తోలు కప్పుకున్న తోడేలు లాంటివాడు.

  1. A NINE DAYS WONDER కొద్ది రోజుల ఆనందం

Any thing is a nine days wonder including marriage.

ఏదైనా పెళ్లితో సహా తొమ్మిది రోజుల వింత.

  1. WIPE OUT నిర్మూలించు, తుడిచిపెట్టు

Let us wipe out bad eliments from us.

మనలో వున్న చెడు లక్షణాలను మనం తుడిచి పెట్టేద్దాం.

  1. WILD GOOSE CHASE వ్యర్థప్రయత్నము, కుండేటి కొమ్ము

For giving liquor is a wild goose, chase for the druncard.

మద్యం మానెయ్యడం ఆ తాగుబోతుకు వ్యర్థప్రయత్నం

  1. TO WEIGH THE PROS AND CONS అన్ని వైపులా ఆలోచించు

He resigned his job without weighing the pros and cons with his short tempor.

అతను తాత్కాలిక ఆవేశంతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు 83

Page 84

  1. WEAR OUT పాతబడిపోవు (ఉపయోగపడక పోవు)

The present system of Education has worn out.

ప్రస్తుత విద్యావిధానం పాతబడిపోయింది.

  1. TO PAVE THE WAY FOR మార్గము సుగమం చేయు

The slogan Quit India paved the way for India's Independence.

క్విట్ ఇండియా నినాదం స్వాతంత్ర్య సాధనకు దారి సుగమం చేసింది.

  1. TO GO THE WAY OF THE WORLD మరణించు, చనిపోవు

Every body must go the way of the world one day or other.

ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు మరణించ వలసినదే.

  1. TO WASH ONE'S HANDS OF ఆరోపణలనుండి బయటపడు

The minister washed his hands of alligations.

ఆ మంత్రి ఆరోపణలనుండి బయటపడ్డాడు.

  1. YELLOW JOURNALISM సంచలనాత్మక వార్తా పత్రిక

Pingali Dasardha Ram died due to Yellow Journalism.

సంచలన వార్తల కారణంగా పింగళి దశరధరాం మరణించాడు.

  1. YEARN FOR, AFTER తీవ్రంగా వాంఛించు

The child yearns for the new model toy.

పిల్లవాడు కొత్త బొమ్మను ఎక్కువగా కోరుతున్నాడు.

  1. TO SPIN YARN కథలు అల్లు (చెప్పు)

Madhuranthakam Rajaram could always spin a rice yarn.

మధురాంతకం రాజారాం ఎప్పుడూ మంచి మంచి కథలు అల్లేవాడు.

  1. YARD STICK కోలబద్ద (ప్రయాణము)

Theory should be measured by the yard stick of practice.

సిద్ధాంతాన్ని ఎప్పుడూ ఆచరణతో కొలవాలి.

  1. GO FOR WOOL AND COME HOME SHORN వ్యవహారము వ్యతిరేకంగా

Chandrababu Naidu went to NRIs for investments in state for wool and came home shorn.

చంద్రబాబునాయుడు రాష్ట్రంలో పెట్టుబడులకై ఎన్నారైల దగ్గరికి ఆరాటంగా వెళ్లి నిరాశతో తిరిగి వచ్చారు.

Page 85

  1. MUCH CRY AND LITTLE WOOL నిరాశాజనకమైన పరిణామం

Ambition evsually means much cry and little wool.

విపరీతమైన ఆశ (ఆకాంక్ష) నిరాశాజనకమైన పరిణామం.

  1. TIED TO A WOMAN'S APSON STRINGS చీర కాంగుమడి

Some husbands are tied to the apson strings of their wives.

కొంత మంది భర్తలు, భార్యల కొంగుపట్టుకొని క్షణం వెడికి పెట్టి ఉండరు.

  1. WONDER LAND అందమైన ఊహాలోకం

Disney alnd is a wonder land of human creation.

డిస్నీలాండ్ మానవుడు సృష్టించిన ఊహాలోకం.

  1. SUCCUMB TO చనిపోవు

He succumbed to diabetis.

అతను మధుమేహ వ్యాధితో మరణించాడు.

  1. SUSTAIN INJURIES దెబ్బలు తగులు, గాయపడు

Jakie sustained serious injuries in an accident.

జాకీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.

  1. MELTING POT అగ్ని గుండం

Kashmir is in a melting pot due to terrorist activities.

కాశ్మీర్ ఉగ్రవాదుల చర్యల కారణంగా ప్రమాదస్థితిలో ఉంది.

  1. WALK ON RAJOR EDGE ప్రమాదపు అంచున పయనించు

He saved the child by walking on the rajor edge.

అతను ప్రమాదకరమైన అంచుపై నడుస్తూ పిల్లవాడిని రక్షించాడు.

  1. ACQUIT OF విడుదల పొందు

Dilip was acquitted of the charge from murder M.L.A.

M.L.A. హత్యా నేరం నుండి దిలీప్ నిర్దోషిగా విడుదలపొందాడు.

  1. ACCUSE OF నేరము మోపు

The police accused him of murder.

పోలీసులు అతన్ని హత్యకు నేరస్థుడిగా నిర్దయించారు.

  1. ACE OF చిటికలో క్షణంలో

He was saved with in ace of being run over by a lorry.

అతను లారీ కింద పడకుండా తృటిలో ప్రమాదం తప్పింది.

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు

85

Page 86

  1. COME ACROSS ఎదుర్కొను

The teacher never come across such questions.

ఉపాధ్యాయుడు ఎటువంటి ప్రశ్నను ఎన్నడూ ఎదుర్కొనలేదు.

  1. ACQUANT WITH పరిచయము కలిగియుండు

I am acquainted with a collector.

నాకు కలెక్టర్‌తో కొద్దిగా పరిచయం ఉంది

  1. ACCOMPANY BY అనుసరించు, కూడా ఉండు

The Chief Minister was accompained by state Home Minister during his visit to Krishna district.

ముఖ్యమంత్రి కృష్ణాజిల్లా పర్యటనలో రాష్ట్ర గృహమంత్రి ఆయనను అనుసరించాడు.

  1. OFFER AN AFFRONT ధిక్కరించు, నిర్లక్ష్యము చేయు

The student offered an affront to the teacher.

విద్యార్థి ఉపాధ్యాయుడు పట్ల అగౌరవంగా ప్రవర్తించాడు.

  1. PUT FALSE APPEARANCE దొంగ వేషము వేయు

Beware of rogues who put false appearance like gentle men and swindle other.

మంచిగా నటిస్తూ పెద్ద మనుషులుగా చలామణీ అవుతున్న పెద్ద మనుష్యుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

  1. LIABLE TO BE PUNISHED శిక్షకు పాత్రులుగా

Those who violate the law (rules) are liable for punishment.

చట్టాల్ని అతిక్రమించిన వారు శిక్షార్హులు.

  1. PRUDENT శిక్షకు పాత్రులుగా, ముందు జాగ్రత్త

You should be prudent of bad habits.

చెడు అలవాట్లు పట్ల నీవు ముందు జాగ్రత్తతో ఉండాలి.

  1. DESTINED TO లోబడు (విధికి)

Every man is destined to death.

ప్రతి మనిషీ మరణానికి లోబడిన వాడే !

  1. TAKE UNDUE ADVANTAGE అనుచిత లాభం పొందు

The police take the undue advantage of their power.

పోలీసులు తమ అధికారాన్నించి దుర్వినియోగ లాభం పొందుతూ ఉంటారు.

Page 87

  1. ADHERE TO కట్టుబడి వుండు, అంటి పెట్టుకొని ఉండు.

Always try to adhere to your word.

ఇచ్చిన మాటకు కట్టుబడి వుండేలా ఎప్పుడు ప్రయత్నించు.

  1. ADJACENT అనుకోని, ప్రక్కనే

My house in adjacent to the park.

నా ఇల్లు ఉద్యానవనానికి ప్రక్కనే ఉంది.

  1. IN ADEQUATE చాలని, సరిపడని

The funds raised by the public are in adequate for the construction if an Ashrams here.

ఆశ్రమ నిర్మాణానికి ప్రజలనుండి నిధులు సేకరించాలి.

  1. ADD FUEL TO FIRE పరిస్థితిని విషమింప చేయు

Pakistan is adding fuel to fire by abetting terrorism in kashmir valley.

కాశ్మీర్ లోయలొ ఉగ్రవాదాన్ని పోత్సహిస్తూ పాకిస్తాన్ పరిస్థితులు విషమింప చేయవచ్చు.

  1. TO LEND AM ARM సహాయపడు

It is our duty to lend an arm to the old man

ఆ మదుసలికి చేయూతనివ్వటం మన కర్తవ్యం.

  1. TO LEND AN EAR చెవి వొగ్గు (విను)

It is our duty to lend an ear to the teacher.

ఉపాధ్యాయుడు చెప్పేది వినటం (చెవివొగ్గటం) మనవిధి.

  1. ACCOUNTABLE లెక్క చెప్పవలసి ఉండు.

You will be Accountable for the deal to your boss.

నీ యజమానికి ఈ వ్యవహారంలో నీకు లెక్క చెప్పవలసి వుంటుంది.

  1. TO BE ALERT అప్రమత్తంగా (జాగ్రత్త) ఉండు

One has to be alert at the time of Travelling.

ప్రయాణం చేసే సమయంలో అప్రమత్తంగా ప్రతి ఒక్కరూ ఉండాలి.

  1. MAKE AMENDSసరిదిద్దుకొను

The boy made amends for his rude behaviour.

పిల్లవాడు (బాలుడు) తన ప్రవర్తనను మార్చుకున్నాడు.

Page 88

  1. GO AMISS తప్పు చెయ్యకపోవు

Im pite of the advice of the teachers the boy went a miss and failed in the examination.

ఉపాధ్యాయుని సలహా తప్పుగా భావించి విద్యార్థి లెక్కచెయ్యని కారణంగా పరీక్షలో తప్పాడు.

  1. TAKE A MISS తప్పుగా భావించు

Never take a miss the good words of elders.

పెద్ద వారి మంచి మాటలను తప్పుగా భావించకు.

  1. A STORM IN A TEA CUP అంతగా ప్రాధాన్యత లేని విషయం

Lalu's jail and bail is a storm in a tea cup.

లాలూ జైలు, బైలు మామూలే. దానికింత ప్రాధాన్యత లేదు.

  1. KEEP ALOOF దూరముగా ఉండు

Always keep aloof from Gutkas

ఎల్లప్పుడూ గుట్కాలకు దూరంగా ఉండు.

  1. BEAR THE BRUNT కష్టాన్ని భరించు

I bear the brunt of our family expenditure.

నేను నా కుటుంబాన్ని పోషించడానికి ఎంతో కష్టపడుతున్నాను.

  1. BEAR FRUIT ఫలించు, సత్పలితము నిచ్చు

Your efforts will always bear fruit.

నీ ప్రయత్నం ఎప్పుడూ సత్పలితాన్ని యిస్తుంది.

  1. TURN FROM BAD TO WORSE క్షీణించు

The event is turning from bad to worse day by day.

పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది.

  1. FLATTER ముఖస్తుతి చేయు

A false friend flatters thee to axe his grind.

కపట స్నేహితుడు తన స్వలాభానికి నిన్ను యింద్రుడు, చంద్రుడు అని పొగడుతాడు.

  1. ALIVE తెలివి ఉండు

The Government of Andhra Pradesh is fully alive of the drought situation in the state.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితి బాగా తెలుసు.

88 ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు

Page 89

Idioms & Phrases in English

  1. AVAIL ONE SELF OF వినియోగించుకొను

I availed my self of his relation with minister

నేను మంత్రితో అతనికున్న బంధుత్వాన్ని వినియోగించుకున్నాను.

  1. ALIEN దూరం తెలియని

Cowardice is alien to the Rajaputs.

పిరికితనం రాజపుత్రలకు తెలియదు.

  1. ARCHITECT నిర్మాత

Man is the architest of his own fortune.

ప్రతి మనిషి తన అదృష్టాన్ని తానే నిర్ణయించుకోవాలి.

  1. ASSOCIATE WITH సంబంధము పెట్టుకొను

Never associate your self with bad company.

చెడ్డ వారితో ఎన్నడూ స్నేహం చేయకు.

  1. ENTER INTO ప్రవేశించు

Don't enter into argument with me

నాతో వాదనకు దిగవద్దు

  1. KEEP AT AN ARM'S LENGTH దూరం ఉంచు

Keep him at an arm's length.

అతనిని ఆమడ దూరంలో ఉంచు.

  1. BRING TO BOOK కేసుపెట్టు

Passengers who travel without avalid ticket will brought to book

by the ticket examiner.

సరియైన టిక్కెట్టు లేకుండా ప్రయాణం చేసేవారిని టికెట్ చెక్ చేసే అధికారి పట్టుకొని కేసు పెట్టటం జరుగుతుంది.

  1. STUMBLING BLOCK అవరోధము (ఆటంకము)

Want of proper education is a stumbling block in one's career.

సరియైన విద్యలేకపోవటం ఒకరి జీవితంలో పెద్ద అవరోధం.

  1. BID FARE WELL వీడ్కోలు పలుకు

The staff bade fare well on the eve of my father's retirement.

నా తండ్రి పదవి విరమణ సందర్భంగా స్టాఫ్ వీడ్కోలు యిచ్చారు.

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు

89

Page 90

  1. BEWARE OF అప్రమత్తంగా ఉండు

One should beware of pick pockets.

జేబు దొంగల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.

  1. BETWEEN DEVIL AND DEEP SEA చిక్కుల్లో పడు

Osama bin laden now finds himself in between the devil and deep sea.

ఒసామా బిన్ లాడెన్‌కు ముందు నయ్య వెనుక గొయ్యిలా ఉంది.

  1. BETTER HALF భార్య

She is my better half.

ఆమె నా భార్య.

  1. IMPROVE ONE'S POSITION పరిస్థితిని మెరుగు పరచుకొను

He improved his position in life by sheer industry (hard work)

అతను కేవలం నిరంతర పరిశ్రమ కారణంగానే, జీవితంలో పైకి వచ్చాడు.

  1. BESTOWED అనుగ్రహించిన, దయ చేసిన

Showers of blessing of God bestow the world.

భగవంతుని దీవెనలు లోకాన్ని అనుగ్రహిస్తాయి.

  1. DO ONE'S BEST సాధ్యమైనంత చేయు

We have to do one duty that is best.

మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.

  1. MAKE BELIEVE మోసము, నటన

The tall take of politicians is a make believe.

రాజకీయనాయకుల పెద్ద పెద్ద వాగ్దానాలు నీటి మాటలు.

  1. CARRY AWAY BY నమ్ము, విశ్వసించు

Don't be carried away by rumours.

గాలీ వార్తలు నమ్మవద్దు.

  1. CALL A SPADE A SPADE ఉన్నది ఉన్నట్లుగా చెప్పు

He learned a number of enemies than friends because he called a spade a spade

ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడినందున అతనికి స్నేహితులకన్నా విరోధులే ఎక్కువయ్యారు.

90

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు

Page 91

Idioms & Phrases in English

  1. CALL FOR AN EXPLANATION వివరణ కోరు

The collector called for the explanation from the MRO for his develiction of his duties.

మండల రెవిన్యూ అధికారి విధి నిర్వహణలో అశ్రద్ధ చూపినందున కలెక్టర్ ఆయనను సమాధానం కోరారు.

  1. BY THE BY అన్నట్లు

By the by I forgot to tell you I got a good job.

అన్నట్టు చెప్పడం మరిచా నాకు మంచి ఉద్యోగం దొరికొంది.

  1. BY ALL MEANS అన్ని విధాలా, నిరభ్యంతరంగా

You are by all means welcome to my house at any time.

మీరు ఎప్పుడైనా సరే మా యింటికి నిరభ్యంతరంగా రావచ్చు, స్వాగతం పలుకు.

  1. BURN ONE'S FINGERS చేతులు కాల్టుకొను (నష్టపోవు)

The merchant burn his fingers by dealing in drugs.

మాదక ద్రవ్యాల వ్యాపారంలో వర్తకుడు వేలు కాల్టుకొన్నాడు. (నష్టపోయాడు)

  1. IN BRIEF సంక్షిప్తంగా, సంక్షిప్తంగా

The story of Mahabharata in brief is the moral of victory over the evil.

మహా భారతం కధ సంక్షిప్తంగా చెడు పైన మంచి విజయంగా భావించాలి.

  1. BE WITHIN BOUNDS అదుపులో ఉండు

One must be within bounds in matters in squandering money.

డబ్బు విచ్చల విడిగా ఖర్చు చేసే వాళ్ళు తమ పరిధుల్ని గమనించాల్సి ఉంటుంది.

  1. COINCIDE ఏకకాలంలో సంభవించు

Gandhiji's birth day and lal Bhadur Sastry's birthday coincide every year.

ప్రతి సంవత్సరం గాంధి గారి పుట్టిన రోజు లాల్ బహదూర్ శాస్త్రి పుట్టిన రోజు ఒకే రోజు సంభవిస్తాయి.

  1. FILL THEIR COFFERS పెట్టె నింపుకొను, డబ్బు సంపాదించు

Traders are generally eager to fill their coffers by black marketing.

వ్యాపారులు సాధారణంగా బ్లాక్ మార్కెటింగ్ (వస్తువులను దాచి ఉంచారు) ద్వారా తమ గల్లా పెట్టెలు నింపుకోవాలని చూస్తూంటారు.

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు 91

Page 92

  1. A TERN COAT చొక్కాలు మార్చినట్టు తరుచుగా పార్టీలు మార్చవాడు.

తన స్వప్రయోజనం కోసం కొంతమంది రాజకీయనాయకులు చొక్కాలు మార్చినట్లు పార్టీలు మారుస్తారు.

  1. IN THE CLUTCHES OF కబంధ హస్తాలలో

మాఫియా కబంధ హస్తాల్లో హిందీ చిత్ర పరిశ్రమ ఇప్పుడు చిక్కుకుని ఉంది.

  1. CHALK OUT A PROGRAMME ప్రణాళిక సిద్ధము చేయు

అమరావతి విహార యాత్రకు తగిన ప్రోగ్రాం తయారు చేశాం.

  1. MIX WITH కలియు, చేరు

కపట స్నేహితులతో కలిసి తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

  1. CATCH RED HANDED నేరము, తప్పు చేస్తూ ఉండగా పట్టుకొను

ఒకరికి లాభం చేకూర్చటం కోసం లంచం తీసుకుంటూ ఉండగా ఆహార తనిఖీ అధికారిని నిరోధకశాఖ వారు పట్టుకున్నారు.

  1. INSPIRE OF అయినప్పటికినీ

అడ్డంకులు సంభవించినా నేను నా ప్రయత్నాలు కొనసాగించాలి.

  1. RESORT TO అనుసరించు

ఎట్టి పరిస్థితిలోను మనం హింసకు తావీయరాదు.

  1. BE CONCIOUS OF ఎరిగి యుండు, గ్రహించు

ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల అవసరములు దృష్టిలో పెట్టుకొని, తమ విధుల్ని నిర్వర్తించాలి.

Page 93

  1. CONCERNED FOR ఆందోళన చెందు

He is very much concerned for his sister who is handicaped.

అతను అవిటి దైన తన చెల్లెలు కోసం ఎంతో ఆందోళన చెందుతున్నాడు.

  1. PROVE DISASTROUS తీవ్ర నష్టం కలిగించు

If we jump to a conclusion on some issue some times it may prove disastrous.

మనం ఆలోచన లేకుండా ఒక నిర్ణయం తీసుకున్నపుడు ఒకోసారి అది నష్టదాయకంగా పరిణమించవచ్చు.

  1. COMPLY WITH అంగీకరించు

The collector did not comply with formers request for an appointment.

రైతుల అభ్యర్ధనను కలెక్టర్ తిరస్కరించారు.

  1. COME ABOUT సంభవించు

How did it come about is a mystery.

అది ఎలా జరిగిందో అంతుబట్టకుండా వుంది.

  1. COME OFF WITH FLYING COLOUR విజయం సాధించు

Our Jawans came off with flying colours with Pakistan in Kargil war.

మన జవాన్లు కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ పై విజయం సాధించారు.

  1. DEFEAT THE PURPOSE ఉద్దేశ్యము (ఆశయము) నెరవేరక పోవు

Negligence of character formation defeat the very purpose of education.

వ్యక్తిత్వ (శీల) విలాసానికి దోహదం చెయ్యని విద్య తన ప్రధాన లక్ష్యాన్ని కోల్పోతుంది.

  1. DEAL WITH వ్యవహరించు, చర్య తీసుకొను

The teacher deal with the mischievous boy aptly (brought him round).

ఉపాధ్యాయుడు తుంటరి పిల్లవాని విషయంలో గట్టి చర్యతీసుకున్నాడు.

Page 94

  1. ORDER OF THE DAY సర్వ సామాన్యము

Striks, bandhs, rasta rokos have become the order of the day.

సమ్మెలు, బంధులు, రాస్తారోకోలు సర్వసామాన్యమైనవి.

  1. RED LETTER DAY బంగారు అక్షరాలతో లిఖించ దినము

August, 15th is the red letter day in the history of India.

15 ఆగస్టు భారత చరిత్రలో సువర్ణాధ్యాయం.

  1. A CRY IN THE WILDERNESS అరణ్యరోదన

Her appeals became a cry in the wilderness before the sadist husband.

కృరుదైన భర్త ముందు ఆమె అభ్యర్థనలు అరణ్యరోదన అయ్యాయి.

  1. TO CHEW THE CUD నెమరువేయు

It is quite natural to chew the cud of one's child hood memories.

ప్రతి ఒక్కరూ బాల్య స్మృతులను నెమరువేసుకోవటం ఎంతో సహజం.

  1. CUT A SORRY FIGURE ముఖం చెలాడు (సంతోషం లేకపోవు)

Prabhakar has to cut a sorry figure in an intarview for want of preparation.

ప్రభాకర్ తయారవనందువల్ల ఇంటర్వ్యూలో ముఖం చెలాడేశాడు.

  1. COMING TO అర్పించు

The mortals of NTR the departed leader were coming to flamer.

మరణించిన నాయకుడు ఎన్.టి.ఆర్. పార్ధివ శరీరం అగ్నికి ఆహుతి అయింది.

  1. TO GET AREQUAINTED WITH పరిజ్ఞానము కలిగియుండు

We have to be get arequinted with spoken English in order to lean English.

ఇంగ్లీషును నేర్చుకోవాలంటే ముందుగా ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మాట్లాడటం విధిగా నేర్చుకోవాలి.

  1. AT ONE'S WITS END చలించిపోవు

On reading Antonio's letter, Bansania was at his wit's end.

ఆంటోనియా ఉత్తరం చదివిన బెస్సానియో చలించిపోయాడు (ఆంటోనియా త్యాగానికి)

94 ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు

Page 95

Idioms & Phrases in English

  1. PUT AN END TO అంతమొందించు, నిర్మూలించు

Please put an end to this bledy game.

ఈ దౌర్దపు ఆటని ఊక ఆపెయ్యండి.

  1. EAT HUMBLE PIE ఓటమిని అంగీకరించు

He ate humble pie and agreed to run half nacke'dly.

అతను ఓటమిని అంగీకరించి అర్ధనగ్నంగా పరిగెత్తడానికి ఒప్పుకున్నాడు.

  1. IN DEBTED TO బుణపడి ఉండు

We are greatly indebted to our mother and mother land.

మనం మనకన్న తల్లి, మాతృదేశానికి ఎంతో బుణపడి ఉన్నాము.

  1. GO TO DOGS పాడైపోవు

All arrangements went to dogs due to the rain.

ఆ వర్షం కారణంగా ఏర్పాట్లన్నీ నాశనం అయిపోయాయి.

  1. DELIVER THE GOODS పనిచేయు, ఉపయోగపడు

He is the gentle man who delivers the goods for others

ఇతరులకు ఉపయోగపడేవాడే నిజమైన పెద్దమనిషి.

  1. GO OUT OF HAND చెయ్యజారిపోవు, అదుపుతప్పు

As the situation got out hand principal called upon police

పరిస్థితి చెయ్య జారిపోతుండగా ప్రిన్సిపాల్ పోలీసులకు కబురు చేశారు.

  1. GET OVER అధిగమించు

I got over all my troubles and hurdles with courage and confidence.

నేను నా సమస్యలు, అవరోధాలను ధైర్యంతో విశ్వాసంతో అధిగమించాను.

  1. TAKE TIME BY THE FORELOCK అందుకొను

He who takes times by the forelock is service to get success in life.

వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకున్న వాడు జీవితంలో విజయం తప్పక పొందుతాడు.

  1. A FEAST TO THE EYE కనువిందు చేయు

Beauty of the picture is a feast to the eye.

ఆ చిత్రం యొక్క అందం కనులకు విందుగా వుంది.

ఇంగ్లీషు జాతీయములు మరియు పదబంధములు

95

Page 96

  1. TO FALL IN LINE వరుసక్రమంలో నిలబడు

The NCC Cadets fell in line as per the Instructions of the commandor.

కమాండర్ ఆజ్ఞనుసరించి NCC క్యాడెట్లు వరుసలో నిలబడ్డారు.

  1. FALL IN LOVE ప్రేమలో పడు

Damayanthi fell in love with Nala at first sight.

దమయంతి నలని తొలిచూపులోనే ప్రేమించెను.

  1. FALL SHORT OF తగ్గ (తక్కువగా ఉండు)

Jyothi fell short of one mark in maths to pass the examination.

జ్యోతి ప్యాసవానికి లెక్కల్లో ఒక్క మార్కు తగ్గినది.

  1. TAKE EXCEPTION తప్పుగా భావించు

Don't took exception to my words

నా వ్యాఖ్యలకు తప్పుగా భావించకు.