1. isbn 979-8-88572-639-9
Page 1
Content:
- పరమహంస నిత్యానంద
Content: గణపతి
Content: సర్వకార్య కారిభ జేపుడు, జ్ఞానసిధ్ధోజ్జ్వల
Content: అత్యున్నత చేతనస్థితి యొక్క అద్భుతరూపమే గణపతి, గణపతి రూపం, ఆయన చేతులలోని ఆయుధాల యొక్క లక్ష్యాలని అర్థం చేసుకుంటే, అందులో ఉండే ఆధ్యాత్మిక సత్యాలని తెలుసుకోగలిగితే గణపతి ఆ విధంగా అన్ని కార్యాల ప్రారంభానికి ఆదిదేవుడిగా పూజింపబడుకుంటాడో అర్థమవుతుంది. గణపతి పూజ, గణపతి ధ్యానం ఆ లక్షణాలని మనం మన అంతరంగంలో నిలిపే విధంగా సహాయం చేస్తే మనం ఏపాటి ప్రతి వస్తూ నిశ్చయంగా విజయఫంతంగా పూర్తి చేసే శక్తిని పొందుతాము.
Content:
- పరమహంస నిత్యానంద
Content: Ebook ISBN:
Content: 979-8-88572-639-9
Content: నిత్యానంద ధ్యానపీఠం శ్రీ ఆనందేశ్వరి దేవాలయం పాశంబండ, సాతంరాయ్ విలేజ్, పాశంబండ, రంగారెడ్డి జిల్లా ఫోన్ : 93470 65288, 98665 00350 www.nithyananda.org
Page 2
Content:
- పరమహంస నిత్యానంద గణపతి సర్వకార్య సిద్ధి దేవుడు, ఐశ్వర్యదాయక
Page 3
Content: ఇంటర్ నేషనల్ వేదిక్ హిందూ యూనివర్సిటీ ట్రస్ట్ వారి అనుబంధ సంస్థ ఇండియా ప్రచురణ కాపీరైట్ 2008
Content: ఈ పుస్తకానికి సంబంధించిన అన్ని హక్కులు నిత్యానంద ధ్యానపీఠం యొక్క సొంతం. నిత్యానంద ధ్యానపీఠం నుంచి ప్రాతపూర్వకంగా అనుమతి తీసుకోకుండా బహిరంగంగా లేదా వ్యక్తిగత వినియోగం కోసం ఇందులోని ఏ భాగాన్ని యాంత్రికంగా, ఫోటోగ్రాఫిక్ లేదా ఫోనోగ్రాఫిక్ ప్రక్రియ లేదా ఏ ఇతర ప్రక్రియ ద్వారా పునరుద్దించటం నిషిద్ధం.
Content: ఈ పుస్తకం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం నిత్యానంద ధ్యానపీఠం వారు చేపట్టే ధర్మకర్తృత్వ కార్యక్రమాల కోసం వినియోగించటం జరుగుతుంది.
Content: నిత్యానంద ధ్యానపీఠం శ్రీఆనందేశ్వరి దేవాలయం నిత్యానందగిరి, పాశంబండ, సాతంరాయ్ విలేజ్, పంపాపాడ్, రంగారెడ్డి జిల్లా. ఫోన్ : 93470 65288, 9866500350 www.nithyananda.org
Content: Ebook ISBN: 979-8-88572-639-9
Page 4
Content: పరమహంస నిత్యానంద:
Content: పరమహంసనిత్యానంద ఈ రోజు మనమధ్య ఉన్న జ్ఞానోదయం పొందిన యోగీశ్వరుడు, ఒక అద్భుతమయిన గురుదేవులు. ఆయన జ్ఞానోదయం పొందాలి అనే తపనతో అతి చిన్నవయసులో కోరతపస్సు చేసి భారతదేశం, నేపాల్‌లో గొప్ప గొప్ప ఋషుల దగ్గర ఆధ్యాత్మిక శాస్త్రాలు సహశాస్త్రేయంగా అభ్యసించి తన 22వ ఏట ఆత్మసాక్షాత్కారాన్ని పొంది పరమానంద స్థితికి చేరారు నిత్యానంద. ఆయన ప్రత్యేక లక్షణం - ప్రతి వ్యక్తిలో దాగి ఉన్న అద్భుత శక్తిని తెలుసుకునే విధంగా వారికి సహాయం చేయడం. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిలో మార్పును తెస్తూ సర్వమానవాళి లో మార్పుని తీసుకురావచ్చు అనే ధ్యేయంతో ఆయన తన కార్యక్రమాలని రూపొందించారు. ధ్యానం ద్వారా ప్రతి వ్యక్తిలో మార్పు తీసుకు రావచ్చు అనే సంకల్పంతో ఆయన 2003, జనవరి 1న నిత్యానంద ధ్యానపీఠాన్ని బెంగుళూరు దగ్గర ఉన్న బిడదిలో స్థాపించారు. ఈరోజున ప్రపంచవ్యాప్తంగా 35 దేశాలలో వందకు పైగా ఆశ్రమాలతో 1500 సెంటర్ల ద్వారా పరమహంస తన సందేశాన్ని అందరికీ అందిస్తు కొన్ని లక్షలమందిలో అనుహ్యమయిన మార్పుని తెచ్చారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది శిష్యులు నిత్యానంద ధ్యానపీఠం కార్యక్రమాలతో నిమగ్నమయ్యి అందరికీ వివిధ కార్యక్రమాల ద్వారా ధ్యానంలో శిక్షణ ఇస్తున్నారు.
Content: పరమహంస తన దివ్య స్వర్రూపతో మానసిక, శారీరక అనారోగ్యానికి చికిత్స చేసి లక్షల మందిని ఆరోగ్యవంతులుగా చేశారు. ఆయన చేత శిక్షణ పొంది, దీక్షని పొందిన ఆనందహీలర్, ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో నమ్మకమయ్యారు. అందరికీ ఉచితంగా తమ సేవలని అందిస్తున్నారు.
Content: పరమహంస నేర్పించే ధ్యాన పద్ధతులు, ఆయన ఇచ్చే సూక్ష్మయిన ప్రయోగాత్మకమయిన వివరణ ప్రతి వ్యక్తి భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా విలసించటానికి ఎంతో సహాయం చేస్తుంది. అశాంతి, వెన్నెన్, కోపం, డిప్రెషన్, ఆందోళన మొదలయిన దైవందిన సమస్యలలో చిక్కుకుపోయి జీవించే కళని, జీవితంలోని అందమయిన మాధుర్యాన్ని కోల్పోతున్న ఆధునికుల కోసం, అందరికీ అందుబాటులో ఉండే విధంగా సుభమయిన ధ్యాన పద్ధతులని తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా ఆనందస్సురేణ (రెండురోజుల ధ్యానశిక్షణ), ఆరోగ్య స్పృహరణ మొదలయిన కార్యక్రమాలను అందించుతున్నారు. పరమహంస నిత్యానంద.
Content: ఓం శ్రీ ఆనంద గణపతియే నమః
Content: ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్శుణ్వన్నూతిభి స్సీదసాదనం
Content: హంసహంసాయ విద్మహే తన్నోహంస ప్రచోదయాత్ పరమహంసాయ ధీమహి
Page 5
Content: అత్యున్నత చేతనస్థితి యొక్క అద్భుతమయిన రూపమే గణపతి. గణపతి చవితినాడు ఈ విశ్వంలో ఉదయించాడు. ఆరోజునే మనం వినాయకచవితిని జరుపుకుంటాము. ఆయన సర్వ ప్రారంభాలకు ఆది దేవుడు. విశ్వమేధస్సుకు ప్రతిరూపం. ఆయన గురించి మనం చాలా విషయాలని, విశేషాలని చెప్పుకోవచ్చు.
Content: ఆయన రూపం, ఏవిధంగా అయితే మనం గణపతిని చూస్తామో, ఏ రూపానికైనతే మనం పూజలు చేస్తామో, ఏ రూపం మీద మన ధ్యాస నిలిపి ధ్యానం చేస్తామో, ఆ రూపం అత్యంత శక్తివంతమయినది. మీరు ఆ రూపం యొక్క విశిష్టతని అర్థం చేసుకోగలిగితే, ఆ రూపం ద్వారా వెల్లడి చేసే సత్యాలని తెలుసుకోగలుగుతారు. అలా తెలుసుకున్న సత్యాలని, లక్షణాలని మీరు మీ జీవితాలకి అన్వయించగలుగుతారు. అదే వినాయక పూజ.
Content: వేద సంస్కృతిలో గణపతి రూపం అన్ని రకాల దేవతా రూపాలకన్నా అత్యధికంగా ఆరాధింపబడే రూపం. ఏ దేవతా రూపాన్ని ఎక్కువగా పూజించుతారో, ఏ దేవతా విగ్రహాలని అత్యధికంగా చెక్కుతారో, ఏ రూపాలని ఎక్కువగా రూపొందించుతారో అని ఒక సర్వే నిర్వహించితే అది గణపతి రూపం: ఆ మూర్తి వినాయకుడు అని తెలుసుకోగలుగుతారు. వినాయక చవితి సందర్భంగా ఎన్ని లక్షల వినాయకమూర్తులని తయారుచేస్తారో మనం చూస్తూనే ఉన్నాము.
Content: అంతేకాకుండా భారతదేశంలో వినాయకుని విగ్రహం, వినాయకుని దేవాలయం లేని వీధి ఉండదు అని చెపితే అది అతిశయోక్తి కాదు. అదే విధంగా వినాయకుని బొమ్మగాని, పతంగాని, విగ్రహం కాని లేని ఇళ్లు కూడా మీకు ఎక్కడా కనిపించదు. గణపతి రూపం అత్యధికంగా ప్రేమించే అత్యధికులతో పూజలందుకునే రూపం అనే విషయం సత్యం.
Content: ఆరు సంప్రదాయాల ఆరాధనా దేవుడు గణపతి :
Content: వేద సంస్కృతిలో ఆరు ప్రధాన సాంప్రదాయాలు ఉన్నాయి. వీటినే పరంపరలు అని కూడా అంటారు. అవి శైవ సాంప్రదాయం శక, కుమార, గణపత్య, వైష్ణవ, సౌర సాంప్రదాయాలు. ఒక్కొక్క సాంప్రదాయానికి ఒక్కొక్క దేవతామూర్తి ఆరాధ్యదైవం. శైవుల శివుడుని, కుమార సాంప్రదాయం సుబ్రమణ్యేశ్వరుని, శక సాంప్రదాయం దేవిని, గాణపత్యులు గణపతిని, వైష్ణవులు విష్ణువుని, సౌర సాంప్రదాయులు సూర్యదేవుడిని ఆరాధిస్తారు.
Content: ఇందులో చాలా అంశమయిన అద్భుతమయిన విషయం ఏమిటి అంటే ఈ అన్ని సాంప్రదాయాలలోను గణపతిని ఆరాధిస్తారు.
Content: అన్ని దేవాలయాలలోనూ ప్రధాన సాంప్రదాయ దేవతా మూర్తితోపాటు విఘ్నేశ్వరుని ఆలయం లేదా విఘ్నేశ్వరుని మూర్తి తప్పనిసరిగా ఉంటుంది. గణపతి విగ్రహం లేని దేవాలయం ఉండదు. విశేషమేమిటంటే వైష్ణవదేవాలయంలో కూడా గణపతి విగ్రహం ఉంటుంది. ఆళ్వార్లు అంటారు. ఈ గణపతికి ఉత్పవుండరాలు అంటే వైష్ణవ నామాలు ఉంటాయి. కాబట్టి అన్ని సాంప్రదాయ దేవాలయాలు గణపతిని అర్చించుతాయి. అన్ని రకాలు పూజలతో అయనకి ప్రధానార్చనలు చేస్తారు.
Content: ఆయన అందరి దేవుడిగా అంతటా కొలువుతీరి ఉంటాడు.
Content: భారతదేశంలో ముఖ్యంగా హిందూమతంలో ఎందుకు ఇంత మంది దేవతా రూపాలు ఉంటాయి?
Content: “ఎక్కడ స్వేచ్ఛ ఉంటుందో అక్కడ అద్భుతమయిన అభివృద్ధి ఉంటుంది” - స్వామి వివేకానంద.
Content: పశ్చిమదేశాల సంస్కృతులు ప్రజలకి బైట ప్రపంచంలో అంతులేని స్వేచ్ఛని ఇచ్చారు. వారి సంఘం వారి జీవిత సరళిలో అసలు కలుగచేసుకోదు
Page 6
Content: వారు ఎలా జీవించాలి అంటే అలా జీవించవచ్చు. నచ్చిన దుస్తులు వేసుకోవచ్చు. మూడు నెలలకు ఒకసారి వారు ఇల్లుని, కారుని చివరికి భార్యని మార్చినా సంఘం వారిని తప్పుపట్టదు. వారికి బయటప్రపంచంలో గొప్ప స్వేచ్ఛని ఇచ్చారు. అందుకే వారు బయట ప్రపంచంలో అంతగా అభివృద్ధిచెందారు. సైన్స్, టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందాయి. అక్కడ ఉన్నన్ని సౌకర్యాలు, ఉన్నన్ని రకాల కార్లు మెషిన్లు, మరెక్కడా ఉండవు. స్వేచ్ఛ ఉన్నవోట అంత గొప్ప అభివృద్ధి జరుగుతుంది.
Content: అదే సంస్కృతి వారికి అంతరంగ ప్రపంచంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో అసలు స్వేచ్ఛ లేకుండా చేసింది. సంఘం చెప్పిన విధంగానే నడచుకోవాలి. మత పెద్దలు చూపిన దారిలోనే వెళ్ళాలి. చెప్పిన విధంగా మాత్రమే పూజ చేయాలి. వారికి స్పూన్ ఫీడింగ్ లా ఏవి ఇస్తే దానిని మింగాలి. అది జీర్ణమయితే మంచిదే, లేకపోతే సమస్యలే. వారికి ఆ మార్గం నచ్చనప్పుడు వారు ఆధ్యాత్మిక మార్గాన్ని పూర్తిగా వదిలివేస్తున్నారు. కానీ మరొక మార్గంలో వెళ్ళలేకపోతున్నారు. వారికి ఆ స్వేచ్ఛ లేదు.
Content: తూర్పుదేశాల సంస్కృతులు వారికి బయట ప్రపంచంలోఅసలు స్వేచ్ఛని ఇవ్వలేదు. సంఘం కట్టుబాట్లని అనుసరించి జీవించాలి. స్వేచ్ఛ లేని కారణంగా బయట ప్రపంచం అంతగా అభివృద్ధి చెందలేదు. కానీ వారికి అంతరంగ ప్రపంచంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో అంతులేని స్వేచ్ఛ ఉంది. ఎవరయినా వారి అంతరంగ ప్రపంచంలోనికి వెళ్ళవచ్చు. ఎన్నో పరిశోధనలు చేసి కొత్త కొత్త సిద్దాంతాలని తీసుకురావచ్చు. ఎవరికి నచ్చిన రూపంలో వారు భగవంతుని ఆరాధించవచ్చు. ఎవరికి నచ్చిన మార్గాన్ని వారు ఏర్పరచుకోవచ్చు. అందుకే తూర్పుదేశాలలో ఎన్నో మార్గాలు, ఎన్నో తత్వాలు మరెన్నో రూపాలు. మన వారు ఒక మాట అంటుంటారు. మనకి ముక్కోటి దేవతలు ఉన్నారు అని బహుశః అప్పటి ప్రపంచ జనాభా ముడుకోట్లు అయి
Content: ఉంచవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు. అంతిమ సత్యాన్ని తెలుసుకోవటానికి, అంతిమయిన అత్యుత్తమ స్థితిని చేరటానికి ఎవరికి నచ్చిన పద్దతిని వారు పాటించవచ్చును. అందుకే మనికి ఇన్ని రకాల దేవుళ్ళు. ఇంకా చాలా కొత్త పద్దతులు కొత్త రూపాలు కొత్త పేర్లు కూడా రావచ్చు. ఇది ఆధ్యాత్మికరంగంలో మనకి ఉన్న స్వేచ్ఛకి, మనం సాధించిన అభివృద్ధికి గుర్తు.
Content: పశ్చిమదేశాలలో బయట ప్రపంచానికి సంబంధించిన గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నట్టే తూర్పుదేశాలలో అంతరంగ ప్రపంచానికి సంబంధించి గొప్పగొప్ప అంతరంగపు శాస్త్రవేత్తలు ఉన్నారు.
Content: మనకి కొన్ని లక్షలమంది ఋషులు, జ్ఞానోదయమయిన యోగీశ్వరులు, అవధూతలు, తత్వవేత్తలు ఉన్నారు. మనకి ఉన్న ఆధ్యాత్మిక సాహిత్య సంపద అతి ప్రాచీనమయింది,అత్యంత విలువయింది.
Content: ఈ కారణంగానే మనకి ఇంతమంది దేవతారూపాలు. ఇదేదేవత అనే సిద్దాంతం కేవలం మనకి మాత్రమే ఉన్న గొప్ప సాంప్రదాయం.
Content: విగ్రహారాధన :ఈ సందర్భంలో మీకు మరొక విషయాన్ని కూడా స్పష్టం చేస్తాను. నన్ను చాలామంది ముఖ్యంగా పాశ్చాత్య భక్తులు అడుగుతుంటారు, మీరు హిందూమతంలో విగ్రహారాధన చేస్తారు అది సరియైన పద్దతి కాదు?
Content: అనివిగ్రహారాధన అంటే రాతి విగ్రహాన్ని పూజించటం కాదు. దయచేసి స్పష్టంగా అర్ధం చేసుకొండి. విగ్రహం భగవంతుడు కాదు. విగ్రహం ద్వారా భగవంతుడిని అర్చించుతాము. ఆకాశంలో చంద్రుడ్ని మన ఇంటిలోని కిటికీ ద్వారా ఎలా చూస్తాము. కిటికీ అనేది ఒక మాధ్యమం, అంతేకాని కిటికీకి చంద్రుడు కాదుకదా. విగ్రహం అనే ద్వారం ద్వారా ద్వారా భగవంతుని చేరటానికి ప్రయత్నించటమే విగ్రహారాధన.
Page 7
Content: ఒక విషయం అర్థం చేసుకోండి. రాతి విగ్రహం ముందు నిలబడి, "ఓ విగ్రహమా! నన్ను రక్షించు. నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు, ఓ రాతి విగ్రహమా! నన్ను దీవించు" అని ప్రార్థించం కదా! ఓ దేవా! నన్ను కాపాడు అంటాము. కాబట్టి ఇది విగ్రహాన్ని ఆరాధించటం కాదు విగ్రహం ద్వారా భగవంతుని ఆరాధించటమే. విగ్రహం ద్వారా భగవంతుడిని ఆరాధించటం అంటే ఆధ్యాత్మిక ప్రగతికి ప్రధమ సోపానం.
Content: గణపతి వివాదరహితుడయిన దేవుడు : అన్ని రకాల శాస్త్రాల ఆరాధనలని అందుకొనే గణపతి వివాదరహితుడయిన దేవతామూర్తి. ఆయనని అందరూ ప్రేమిస్తారు, గౌరవిస్తారు అత్యంత భక్తి ప్రపత్తులతో పూజిస్తారు. ఆయన చాలా సామాన్యమయిన అమాయకత్వంతో ఉండే సులభసాధ్యుడయిన దేవతామూర్తిగా పేరుపొందాడు. భక్త సులభుడు, కోరిన కోర్కెలు తీర్చే కరుణామయుడు, విశ్వప్రేమను పంచే ప్రేమమూర్తి.
Content: అశుభదోష దేవతామూర్తి గౌరీ పుత్రుడు : గణపతి అని అనగానే అందరికీ ముందుగా గుర్తు వచ్చే విషయం ఈయన భక్తులకుబుడు. అందుకే ఈయనని అశుభదోషమూర్తిగా ఆరాధించతారు. ఆయన అత్యంత సాధారణమయిన స్వామి. చాలా సులభంగా ఆయనతో సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. శివుడ్ని కూడా అశుభదోషదేవతగా, భక్త సులభునిగా చెబుతారు, కానీ సాధారణ ప్రజలకి మాత్రం గణపతి నిజంగానే భక్త సులభుడు. ఆయనకి దగ్గర అవ్వటం, ఆయన ద్వారా ఆధ్యాత్మికంగానే కాదు లోకిక ప్రపంచంలో కూడా అభివృద్ధిని పొందటం సాధ్యం. ఈ కారణం వలనే గణపతి అందరి దేవుడు అయ్యాడు. ముఖ్యంగా ఆయన సామాన్యులకి సాధారణ ప్రజలకి ప్రియమయిన దేవుడు.
Content: ఆయనని సేవించటానికి, పూజించటానికి లేదా మన ఇంట్లో ఆ విగ్రహం పెట్టుకోవటానికి దేనికీ కూడా పరితలు లేని, నిబంధనలు అవసరం లేని సాధారణ ప్రజల ప్రియతమ మూర్తి గణపతి.
Content: గణపతి సర్వకార్యాలకి ప్రారంభ దేవుడు: ప్రతి ప్రారంభానికి ఆదిదేవునిగా వినాయకుడినే పూజిస్తారు. అందుకే ఆయనని విఘ్నేశ్వరుడు అని అంటారు. అతి చిన్నదయిన నిత్యపూజ నుంచి మహా యాగాల వరకూ, చిన్న చిన్న పనుల ప్రారంభం నుంచి పెద్ద పెద్ద కర్మకాండల ప్రారంభాలలోనూ ముందుగా పూజించేది గణపతినే. ఎందుకంటే ఆయన విఘ్నేశ్వరుడు.
Content: గణపతి రూపం : గణపతి రూపాన్ని ఆయన భరించే ఆయుధాలని ఒకసారి గమనించితే మనకి ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు బోధపడతాయి. ఆయన రూపం మీద ధ్యానం చేసేవారికి ఆ విషయాలు అర్థం అవుతాయి. అలా అర్థమయినప్పుడే మనం ఎందుకు గణపతిని సర్వకార్యాల ప్రారంభాలలో పూజిస్తామో తెలుస్తుంది.
Content: గణపతి అనేకమయిన రూపాలలో దర్శనమిస్తుంటాడు. అదే విధంగా ఆయన మూర్తిని కూడా రకరకాలుగా చెకుతారు. అనేక విధాలుగా చిత్రించుతారు. నాట్యగణపతి, గణపతి విశ్వరూపం, బాల గణపతి, కూర్చుని ఉన్న గణపతి ఇలా చాలా రకాలు మనకి తెలిసిన గణపతి రూపాలు. ఆయన మూర్తి ఏరూపంలో ఉన్నా అది వెల్లడిచేసే భావం మాత్రం స్వచ్ఛమయిన అమాయకత్వం, విశ్వమేధస్సు, తన్మయత్వం. ఆ మూర్తి నిరంతరం ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని, విశ్వమేధస్సుని వెదజల్లుతూ ఉంటుంది. ముఖ్యంగా నాట్య గణపతిలో మనం ఈ భావనలని స్పష్టంగా చూడగలము.
Page 8
Content: బొజ్జగణపయ్య పెద్ద ఉదరం : మనందరం గణపతిని 'బొజ్జ గణపయ్య' అని ప్రార్ధించుటాము. గణపతి రూపంలో ముందుగా మనకి కనిపించేది పెద్దగా ఉండే ఆయన ఉదరం. అది అప్రతిహతమయిన అభివృద్ధికి చిహ్నం. అది అంతులేని దివ్య ఆనందానికి కూడా గుర్తు. అర్ధం చేసుకొండి, ఇది ఊబకాయంతో వచ్చిన పొట్టకాదు. అది గొప్ప ఆనందానికి, అంతులేని అభివృద్ధికి గుర్తు. దీని ద్వారా గణపతి దివ్యమయిన సాధారణత్వాన్ని, ఉన్నతమయిన అమాయకత్వాన్ని ఈ ప్రపంచానికి నిరంతరం తెలియచేస్తూంటాడు.
Content: గణపతి ఉదరాన్ని బ్రహ్మండం అని కూడా అంటారు. శివుని తలని విశ్వంతో పోలుస్తారు. అందుకే ఆయన తల మీద చంద్రుడు ఉంటాడు. గణపతి ఉదరం బ్రహ్మండ విశ్వం. సంపూర్ణ విశ్వం అంతా ఆయన ఉదరంలోనే ఉంది. ఈ బ్రహ్మండమే ఆయన పెద్ద ఉదరం అని అంటారు.సర్వ విశ్వాన్ని ఆయన ఉదరంలో నింపుకొని చిద్విలాసంతో ప్రకాశించే వినాయకుడు, అంతిమస్థితి అయిన నిత్యానంద స్థితికి ఒక నిదర్శనం.
Content: పెద్ద చెవులు : గణపతి స్వామి యొక్క పెద్ద పెద్ద చెవులు వినటంలో ఆయనకి ఉండే అద్భుత నైపుణ్యాన్ని తెలియ చేస్తుంది. ఆయన అత్యంత సూక్ష్మ శబ్ధాన్ని కూడా అదే విధంగా వినగల శక్తివంతుడు. అత్యంత క్లిష్టమయిన విషయాలని, అత్యంత వేగంగా చెప్పగల విషయాలని కూడా ఆయన జాగ్రత్తగా, నైపుణ్యంతో వినగలడు. వినే సమయంలో బక్క అక్షరాన్ని కాని, చిన్న శబ్ధాన్ని కానీ వినాయకుడు వదలడు. గణపతికి ఉండే ఈ సునిశిత వినికిడి లక్షణం వలననే వ్యాసుడు మహాభారత రచనకి వినాయకుడిని ఎంచుకున్నాడు. మహాభారతం చాలా పెద్ద గ్రంథం. వ్యాసుడు చెబుతూ ఉంటే అదే వేగంతో ఎక్కడా
Content: తప్పులేకుండా బ్రాయగల శక్తి కేవలం వినాయకునికే ఉంది. ఆయన సునిశిత వినికిడి నైపుణ్యానికి గుర్తు ఆ పెద్ద చెవులు. అంతేకాదు భక్తుల ప్రార్థనలు, విన్నపాలు చక్కగా వినగల దేవుడు అని కూడా అందుకే భక్తులు నమ్ముతారు. భక్తులు ఏ భాషలో ప్రార్ధించినా, మౌనంతో తమ విన్నపాలు తెలియచేసినా గౌరీ పుత్రుడు అత్యంత జాగ్రత్తగా వినగలడు అని ఆ చెవులు చెబుతున్నాయి. భక్తుల మొరలు ఆలకించే భక్తవత్సలుడు గణపతి.
Content: తొండం : పొడవయిన ఆయన ముక్కు భాగమే తొండము అంటాము. దీని ద్వారానే సూక్ష్మసత్వాలని, అత్యున్నత చేతనస్థితికి సంబంధించిన విషయాలని చక్కగా గ్రహించగలడు. చెవుల ద్వారానే కాకుండా తొండం ద్వారా కూడా ఆయన కొన్ని సత్యాలని గ్రహించగలడు. నిశ్వబ్ధంలో సాగే సంభాషణని గ్రహించ గల శక్తి తొండానికి ఉంది. అంతేకాదు పొడవయిన ముక్కు ద్వారా ఆయన తక్కువ సమయంలో ఎక్కువ విషయాలని గ్రహించగలుగుతాడు. ఇది ఆయన గ్రహింపగల సామర్ధ్యానికి నిదర్శనం.
Content: గణపతి యొక్క ఆయుధాలు : గణపతి తన నాలుగు చేతులతో నాలుగు ఆయుధాలని కలిగి ఉంటాడు. ఆయన రూపాన్ని నాలుగు చేతులతో చూపించుతారు.మీరు ఆ ఆయుధాలని, వాటి లక్షణాలని అర్ధం చేసుకుంటే,అందులో ఉండేఆధ్యాత్మిక సత్యాలని తెలుసుకోగలుగుతారు. ఈ ఆయుధాల ద్వారా గణపతి ప్రపంచానికి ఇచ్చే ముఖ్య సందేశం, మానవులకి అందించే విలువలు తెలుసుకోవచ్చు. ఆయన చేతులలో ఉండే ఆయుధాలు ఇతర దేవతా మూర్తుల చేతులతో ఉండే వాటికి చాలా భిన్నంగా ఉంటాయి.
Page 9
Content: అవి: అంకుశం,పాశం,దంతం,మోదకం.ఈ ఆయుధాలు మనకి నేర్పించే విషయాలు నేటి ఆధునికులకి అత్యవసరమయినవి.అవిఏమిటో చూద్దాము.
Content: అంకుశం :
Content: అంకుశం అంటే చిన్న ఇనుప ఊన. అది ఒక అడుగు పొడవు ఉండే చిన్న ఆయుధం. దీనిని ఏనుగుని నియంత్రించే మావటి ఉపయోగిస్తాడు. ఆ చిన్న అంకుశంతో మావటి అంత పెద్ద ఏనుగుని నియంత్రించలుగుతాడు.
Content: గణపతి చేతిలో ఉండే అంకుశమే బంధాలని ఏర్పరచకుండా ఉండగల శక్తి అనే ఒక చిన్న ఆధ్యాత్మిక సాంకేతిక పద్దతి. ఈ బంధాలు కల్పించకపోవటం అనే ఆధ్యాత్మిక పద్దతి ద్వారా ఏనుగులా అత్యంత పెద్దదయిన మన మనస్సుని నియంత్రించవచ్చు. 'బంధవిముక్తులవటం' అనే ఈ చిన్న ఆధ్యాత్మిక పద్దతి ద్వారా అంత పెద్ద మానసిక స్థితిని మనం నియంత్రించగలము. బంధాలు ఏర్పరచకపోవటం అనే ఈ చిన్న పద్దతి చాలా శక్తివంతమయిన సాంకేతిక పద్దతి. ఇది చూడటానికి చాలా మామూలుగా చిన్నదిగా అనిపిస్తుంది. అయితే ఈ చిన్న పద్దతి మనస్సుని నియంత్రించగల గొప్ప సాధన.
Content: బంధాలని ఏర్పరచకపోవటం అంటే ఏమిటి?
Content: అంటే ఇది మానవ సంబంధాలు లేదా వస్తు సంబంధాలు వీటికి సంబంధించినది కాదు.ఈ విషయం కొంచం సూక్ష్మమయినది. కానీ మిమ్ములని, మీ భావాలని సమతుల్యంగా ఉంచటంలో చాలా ఉపయోగపడుతుంది. మానసిక సమతుల్యం మనకి అత్యవసరం. ఎప్పుడయితే మానసిక సమత్యులత లోపిస్తుందో అది అనేక సమస్యలని సృష్టిస్తుంది. ఈ పద్దతిని సక్రమమైన విధంగా అర్ధం చేసుకొని సాధన చేస్తే పరమానందాన్ని ఇస్తుంది.
Content: ముందుగా మీకు ఈ పద్దతి గురించి, దీని అసలు అర్ధం ఏమిటో వివరించుతాను.
Content: మన మనస్సు అంటే స్వతంత్రమయిన ఆలోచనక్రమము. అంటే స్వతంత్రమయిన మన ఆలోచనలని ఒక గ్రూపుగా ఒక రాశిగా చేసే అది మన మానసిక వ్యవస్థ అవుతుంది. అయితే ఆలోచనలు మనకి కలిసిపోయిన ఒక గొలుసుగా అనిపిస్తాయి. ఎందుకంటే ఆలోచనకి మరొక ఆలోచనకి మధ్య ఉండే ఖాళీ అత్యంత సూక్ష్మమయినది. రెండు ఆలోచనల మధ్య ఉండే నిశ్శబ్దం యొక్క సమయం అత్యల్పమయినది. వాటిని మనం భౌతికంగా గుర్తించలేము.
Content: ఈ ఆలోచనలతో మనకి ఏటువంటి సమస్య ఉండదు. ఎప్పుడయితే ఈ ఆలోచనలని ఒకదానికొకటిని లింకులు ఏర్పరిస్తే, బంధాలు ఏర్పరిస్తే అప్పుడు సమస్యలు ప్రారంభమవుతాయి. కాబట్టి మన సమస్యలకి, కష్టాలకి, బాధలకి ఇదే అసలు మూలం. (అది నిజంగా బాధ కలిగించకపోయినా మనం అది బాధకలిగించే విషయం అని గట్టిగా నిర్ణయించుకొని బాధ పడి, ఆ బాధని మోస్తూ తిరుగుతాము. ఆలోచనకి ఆలోచనకి మధ్య బంధాలు ఏర్పరచటం. ఉదాహరణకి : మీరు ఐదు సంవత్సరాల క్రితం ఇస్క్రీం తిని ఆనందించారు. సంవత్సరం క్రితం ఇస్క్రీం తిని ఆనందించారు అని అనుకుంటారు. నెల క్రితం మరలా నిన్న ఇస్క్రీం తిని నేను ఇస్క్రీం తింటే ఆనందంగా ఉంటాను అని నిర్ణయించుకుంటారు. అందుకే తిరిగి భవిష్యత్లో కూడా ఇస్క్రీం మీకు ఆనందాన్ని ఇస్తుంది అని నిర్ణయించుకొని అది ఆనందాన్ని ఇప్పకపోయినా ఆనందపడతారు. అదే విధంగా ఒక కష్టం కూడా అంటే.
Content: ఏదయినా ఒక సంఘటన 5 సంవత్సరాల క్రితం మనకి బాధ కలిగించినది అనుకుంటాం, అదే సంఘటన 3 సంవత్సరాల క్రితం
Page 10
Content: బాధపడతాం, సంవత్సరం క్రితం జరిగినప్పుడు బాధపడతాం, నెల క్రితం జరిగినప్పుడు బాధ పడతాం. నిన్న జరిగినప్పుడు బాధ పడతాం. ఇవన్నీ స్వాతంత్రమైన ఒకదానితో ఒకటి ఎటువంటి సంబంధం లేని సంఘటనలు. మనం వాటినన్నింటిని కలిపి ఒక బాధల చైను తయారు చేస్తాం. ఇక భవిష్యత్‌లో కూడా ఆ సంఘటన మనకి బాధ కలిగిస్తుంది అని నిర్ణయించుతాము.
Content: అయితే సంతోషమనే గోలుసు, బాధ కలిగించే గోలుసు రెండూ అసత్యాలే. అవి రెండూ ఊహలు మాత్రమే. ఇదంతా ఒకదానితో మరొక దానికీ, ఆసలు సంబంధలేని విషయాలని కలిపి మనం సృష్టించుకున్న ఒక పరిస్థితి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవటమే బంధవిముక్తలవ్వటం అంటే ఇదే బంధాలు కల్పించకుండా ఉండటం అనే పద్దతి. గణపతి అంటేనే అత్యున్నత చేతనస్థితి. ఆయన చేతిలో అంకుశం మనకి ఈ 'బంధవిముక్తి' అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. అది మనకి మన అంతిమ స్థితి అయిన పరమానందం వైపు మన మార్గాన్ని చూపిస్తుంది.
Content: పాశం : గణపతి మరొక చేతిలో పాశం ఉంటుంది. పాశం అంటే తాడు. చేతిలోని పాశం భావావేశాన్ని ఆయన నియంత్రణలో ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఆయన అన్ని దిక్కులకూ వ్యాపించేసరికి అపీతకుడు. ప్రకృతి పురార్థం ఆయన నియంత్రణలోనే ఉంటుంది. అందుకే గణపతిని సమతుల్యతకి ప్రతి రూపంగా భావిస్తారు. ఆయన అత్యుత్తమ సమతుల్యదశలో ఉంటాడు. భావావేశాల సమతుల్యత అంటే ఏమిటి?
Content: మనలో ఉండే ఏడు ప్రధాన శక్తి కేంద్రాలయిన చక్రాలలో శక్తిప్రవాహాన్ని ఈ భావావేశాలే అడ్డుకుంటాయి. దీని వలన సాధారణ మానవులు బలహీనులుగాను, నైపుణ్యం లేని వారుగా అవుతారు. మన నిశ్చలతని, మనలోని శక్తి ప్రవాహాన్ని భంగం పరచే భావావేశాలు కల్పనలలో జీవించటం, భయం, బాధ, ఎడబాటివారి శ్రద్ధని ఆశించటం, అసూయ, అహంకారం, అసంతృప్తి. ఈ భావావేశాలు మనలో భౌతిక,శారీరక, మానసిక సమస్యలని సృష్టించుతాయి. అవి మనలోని సమత్యులని భంగపరుస్తాయి. అయితే ఈ వ్యతిరేకపు భావావేశాలకి ఉనికి ఉండదు. చీకటికి వెలుతురు ఎటువంటి ఉనికి ఉండదు. వాటిని మీరు తీసి బయట పారవేయలేరు.మీరు చేయగలిగినది కేవలం చేతనస్థితి అనే వెలుగుని తీసుకురావటమే. మీరు తెలుసునే తత్వాన్ని మీలోపలికి తీసుకురాగలిగితే, వ్యతిరేకపు భావావేశాలు అనే చీకటి పోక తప్పదు. అప్పుడు ఈ భావావేశాలకీ మీ నియంత్రణలోనే ఉంటాయి. వ్యతిరేకపు భావావేశాలని నియంత్రించగలిగినప్పుడు వాటితో వ్యవహరించగల వద్దతిని తెలుసుకోగలిగినప్పుడు ఈ వ్యతిరేకపు భావావేశాలని ఉన్నతమయిన శక్తిగా మార్చవచ్చు. అప్పుడు మీలోని కోరిక స్వచ్ఛమయిన భగవంతుని ప్రేమగా మారుతుంది. గంభీరత అనేది నిజాయితీగా మారుతుంది.
Content: మీరు ఎక్కడయినా గణపతి చిత్రాన్ని గాని విగ్రహాన్ని గాని గమనించండి. ఆనందపు పారవశ్యం ప్రశాంతతని నిరంతరం వెదజల్లుతూ ఉంటుంది. ఎప్పుడయితే మనలోని భావావేశపు వ్యతిరేక శక్తిని, మీరు తెలుసుకునే తత్వంతో ఉన్నతమయిన స్థితికి తీసుకుళ్ళగలుగుతారో, అప్పుడు మీరు కూడా గణపతి లాగానే ప్రశాంతతని, పారవశ్యాన్ని, పరమానందాన్ని నిరంతరం వెదజల్లుతూ ఉంటారు.
Content: మీలోని వ్యతిరేకపు భావాలని వెల్లడి చేయవద్దు, వాటిని అణచివేయవద్దు. వాటిని ఉన్నతస్థితికి మార్పు చేయండి. ఆ వ్యతిరేకపు శక్తిని ఉన్నత శక్తిగా మార్చండి. గణపతి మూర్తి నుంచి ఆయన చేతిలోని పాశం నుంచి మనం నేర్చుకునే సందేశం ఇదే.
Page 11
Content: బంధవిముక్తి అనే పద్దతి వీ మేధోపరమయిన సమస్యల నుంచి మీకు స్వేచ్చని ఇస్తుంది. మీరు మీలోని భావవేశాల మూలంగా, మీ నిశ్చలతని పోగొట్టుకుంటే, మీరు ఆ స్వేచ్చని పొందలేకపోతే మీరు జీవితంలో సమతుల్యతని సాధించలేరు. భావవేశాల సమతుల్యత మాత్రమే మీరు బంధవిముక్తులు కాగల పద్దతికి ఆధారం అవుతుంది. అది మీలోని మేధోపరమయిన సమస్యలని నియంత్రించగలుగుతుంది. అంటే తెలివితేటల దశలో ఉండే సమస్యలని నియంత్రిస్తుంది.
Content: మోదకం :
Content: మోదకం అంటే తీపి పదార్థం. ఎప్పుడయితే మీరు బంధవిముక్తి అనే పద్దతిని పాటించగలరో, ఎప్పుడయితే మీలోని వ్యతిరేకపు భావాలని నియంత్రించగలరో, అప్పుడు మీ జీవితం ఒక చక్కని తీపి పదార్థంలా ఉంటుంది. గణపతి చేతిలోని మోదకం దీనిని మనకి తెలియచేస్తుంది.
Content: దంతం :
Content: గణపతి మరొక చేతిలో దంతం ఉంటుంది. అది గణపతి దంతమే. మీరు మహాభారతం గురించి ఆ కధ గురించి విని ఉంటారు కదా! వ్యాసమహర్షి ఆ కధని చెబుతుంటే వినాయకుడు రాస్తుంటాడు. ఆకస్మాత్కగా ఆయన చేతిలో కలం విరిగిపోతుంది. ఆయన స్థానంలో మరెవరైనా ఉండి ఉంటే వ్యాసరుషిని ఆగమని కొత్త కలం తెచ్చుకునేవారు లేదా అక్కడ నుంచి నిష్క్రబధంగా లేచివెళ్ళి కొత్త కలం తెచ్చుకునే వారు. ఈ కానేపల్లి పెద్దగా పోయేదేమి లేదులే అని అనుకునేవారు. కాని విఫలేశ్వరుడు ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా తనదంతాన్ని విరగకొట్టి దానితో వ్రాయటం కొనసాగిస్తాడు. ఈ సంఘటన వినాయకుని గురించి రెండు అద్భుత సత్యాలని తెలియచేస్తుంది. మొదటిది సమయసూకూలంగా నిర్ణయం చేయటం,
Content: సమయసూచర్తి. రెండవది త్యాగనిరతి. చేస్తున్న పనిని పూర్తి చేయాలనే ధృడ నంకల్పం. ఆయన అత్యంత సమయసూచర్తితో నిర్ణయం తీసుకొనగలిగినమూలంగా మనకి అద్భుతమయిన మహాభారత కధ సంపూర్ణంగా దొరికింది. తను చేస్తున్న పనికి కట్టుబడి, అది పూర్తి చేయటానికి ఎటువంటి త్యాగాన్ని చేయటానికైనా వెనుకాడని తత్వం. ఈ రెండు లక్షణాలని అలవరచుకుంటే, మనం ఏ పనిని ప్రారంభించినా దానిని విజయవంతంగా, సంపూర్ణంగా పూర్తి చేయగలం. అందుకే గణపతిని విఫలేశ్వరుడు అని, సర్వకార్యసిద్ధి ప్రదాత అని, సర్వకార్య ప్రారంభ దేవత అని మనం పూజ చేస్తాము.
Content: విఫలేశ్వరుని రూపాన్ని ఆయన చేతిలో ఉండే దంతాన్ని చూడగానే మనకి సమయసూచర్తి, త్యాగనిరతి గుర్తుకువస్తాయి. అందుకే ఆయనని త్యాగానికి, సమయసూచర్తికి ప్రతిరూపంగా మనం పూజిస్తాము. ఆ లక్షణాలని గుర్తు చేసుకుంటూ పనిని ప్రారంభిదేముందు ఆయనని పూజిస్తాము.
Content: పాశం : అంకుశం
Content: ఎప్పుడయితే అంకుశం నిరంతరం మీ చేతులలో ఉంటుందో పాశం చాలా ప్రభావంతో పని చేస్తుంది. మీరు బంధాలని ఏర్పరచకుండా ఉండగల పద్దతిని సాధన చేయగలిగితే మీలోని భావవేశాలు మీ నియంత్రణలో ఉంటాయి. పాశం, మనస్సు అనే ఈన్సగుని బంధించే తాడు. మీ దగ్గర పాశం ఉన్నా కూడా అంకుశం అనే బంధవిముక్తి సాధన లేకపోతే ఈన్సగుని నియంత్రించలేరు. ఏన్సగు మీ ఆధీనంలోనికి రాదు. కాబట్టి బంధవిముక్తి అనే అంకుశం మీ చేతులలో లేకపోతే మీరు పాశం అనే భావవేశాలని నైపుణ్యంతో సమతుల్యతతో ఉంచలేరు. దాంతో అతి బలమయిన ఏన్సగు అనే మీ మనస్సు మీ నియంత్రణలోనికి రాదు. కాబట్టి బంధాలు
Page 12
Content: ఏక్‌పరచకపోవటం అనే పద్ధతి,పాశాన్ని చక్కగా ఉపయోగించుకునే విధంగా చేంటుంది. అప్పుడే మనస్సుని మనం నమర్ధవంతంగా నియంత్రించగలుగుతాము. మనస్సు మన బానిస అవుతుంది. మన చేతిలో ఒక పనిముట్టు అవుతుంది.
Content: ఎవరయితే నిరంతరం అంకుశాన్ని తమ చేత ఉంచుకోగలరో అటువంటివారు గణపతిలా ఉండగలరు. అటువంటివారు తమ భావవేశాలని చక్కగా నియంత్రించగలరు. తమ ఆలోచనలకి లింకులు ఏక్‌పరచకుండా ఉండగలరు. మీరు గనుక అటువంటి స్థితిలో ఉండగలిగితే జీవితం మోదకం అనే ఒక తీపి పదార్థంలో ఉంటుంది. అటువంటి వారి జీవితం సమయస్ఫూర్తిని, అంకిత భావాన్ని నిరంతరం వెల్లడి చేస్తూ ఉంటుంది. అప్పుడు జీవితం, జీవనసరళి ఒక మోదకం అవుతుంది. అటువంటి వారి జీవితం ఒక గొప్ప ఉత్సవం. వారి జీవన సరళి ఒక నాట్యహేల అవుతుంది. మీరు అలా ఉండగలిగితే మీ జీవితంలో ప్రతిక్షణం ఒక ఉత్సవంలా గడచిపోతుంది.
Content: గణపతి వాహనం :
Content: గణపతి వాహనం మూషికం, అంటే ఎలుక. వాహనం అనేది ఆయా దేవతల యొక్క లక్షణాలని వెల్లడిచేసే ఒక పద్ధతి. మూషికం యొక్క ముఖ్య లక్షణం అత్యున్నతమయిన ఉత్సాహం. నిరంతరం చైతన్యంలో ఉత్సాహంతో జీవనకళలతో తులతూగుతూ ఉండే శక్తి ఈ మూషికం. గణపతి అత్యున్నత చైతన్యమూర్తి. అత్యుత్సాహపూరితమయిన శక్తి. సూతనోత్సాహానికి ఆయన ప్రతి రూపం. ఆ చైతన్యాన్ని మూషికం ద్వారా వెల్లడి చేస్తారు.
Content: అదేవిధంగా నంది శివుని వాహనం. నంది యొక్క ముఖ్యలక్షణం అద్భుతమయిన ప్రశాంతత. ఆయనలోని అత్యున్నతమయిన శక్తి ప్రశాంతత ద్వారా వెల్లడి చేయబడుతుంది.
Content: ద్వారా వెల్లడి చేయబడుతుంది. ఈ విధంగా వాహనం ఒక్కొక్క లక్షణాన్ని వెల్లడి చేస్తుంది. ఒక్కొక్క శక్తిని వెల్లడి చేయటానికి ఒక్కొక్క వాహనాన్ని చూపిస్తారు. వినాయకుని వాహనం అత్యంత చైతన్యశక్తికి చిహ్నం. ఎందుకంటే గణపతి చైతన్య స్వరూపుడు, చైతన్యశక్తి యొక్క ప్రతిరూపం. ఆయన వాహనం అయిన మూషికం కూడా చైతన్యానికి ప్రతిరూపం.
Content: సర్పం :
Content: మనం వినాయకుని 'నాగరాజయజ్ఞోపవీతాయ నమః' అని పూజిస్తాము. కొన్ని వినాయకుని రూపాలలో ఒక సర్పం కొన్ని రూపాలలో రెండు సర్పాలు ఉంటాయి. ఒక సర్పం ఉంటే అది ఆయన నడుము చుట్టూ ఉంటుంది. ఈ సర్పం అనేది మన వెన్నుముకలో ఉండే నాడులకి ప్రతిరూపం.
Content: నాడులు :
Content: ప్రాచీన వేదకాలం నాటి ఋషులు మనలోపల ఉండే అత్యంత సూక్ష్మమయిన నాడులని గుర్తించారు. అవి మన భౌతిక కళ్ళకి కనిపించవు. అవి మన వెన్నుముక మధ్యభాగంలో ఉంటాయి. మనలో మొత్తం మూడు నాడులు ఉంటాయి. అవి ఇదగళ, పింగళ, సుషుమ్నా నాడులు. ఇదగళ, పింగళ నాడులు మనలో వెన్నుముక చివర ఉండే మూలాధార నుంచి తలపై భాగాన ఉండే సహస్రారకు, సహస్రార చక్రం నుంచి మూలాధార చక్రం వైపుకు శక్తిని ప్రపహించ చేస్తాయి.
Content: సహస్రార నుంచి క్రింద ఉండే మూలాధారకు ప్రపహించే శక్తి భౌతికమయిన కోరికలని ప్రభావితం చేస్తుంది. మూలాధార నుంచి సప్రసారకి వెళ్ళే శక్తి మేధోపరమయిన విషయాలని ప్రభావితం చేస్తుంది. మధ్యలో ఉండే సుషుమ్నానాడి ఈ రెండు విధాలయిన శక్తి ప్రవాహాన్ని చక్కగా నియంత్రిస్తుంది. ఎప్పడయితే ఇదగళ, పింగళ నాడులు సమతుల్యతతో ఉంటాయో, అప్పుడు ఆ వ్యక్తి పరమానందస్థితిలో ఉండగలడు.
Page 13
Content: గణపతి విగ్రహంలోకాని, చిత్రంలోనికి ఉండే ఒక సర్పం సుఘమ్ము నాడికి ప్రతి రూపం : రెండు సర్పాలు ఉంటే ఇదగళ, పింగళ నాడులకి ప్రతిరూపం గణపతిలో నాడులు అత్యున్నతమయిన సమతుల్యతలో ఉంటాయి. అందుకే ఆయన నిరంతరం వరమానందంలో ఆనంద పారవశ్యంలో ఉంటాడు.
Content: గణపతి మూలాధార చక్రం :
Content: మన ప్రాచీన వేదకాలం నాటి యోగిశ్వరులు తమ తమః శక్తితో మానవుల శరీరంలో ఉండే చాలా సూక్ష్మ భాగాలని కనుగొనగలిగారు. అటువంటి సూక్ష్మమయిన శక్తి కేంద్రాలని కూడా వాళ్ళు కనుగొన్నారు.
Content: వీటినే మనం చక్రాలు అంటాము. అవి మనలోని అత్యంత సూక్ష్మ కేంద్రాలు.మనలోని శక్తి ప్రవాహానికి అవి సహాయం చేస్తాయి. అటువంటి ఏడు ప్రధాన శక్తి చక్రాలు ఉన్నాయి అవి.
Content:
- మూలాధార చక్రం : ఇది వెన్నుముక చివరి భాగంలో ఉంటుంది.
Content: 2. స్వాధిష్ఠాన చక్రం : ఇది నాభి ప్రాంతానికి రెండు అంగుళాలు క్రింద ఉంటుంది.
Content: 3. మణిపూరక చక్రం: ఇది నాభి ప్రాంతంలో ఉంటుంది.
Content: 4. అనాహత చక్రం : ఇది గుండె ప్రాంతంలో ఉంటుంది.
Content: 5. విశుద్ధి చక్రం : ఇది గొంతు ప్రాంతంలో ఉంటుంది.
Content: 6. ఆజ్ఞ చక్రం : ఇది కనుబొమ్మల మధ్యలో ఉంటుంది.
Content: 7. సహస్రార చక్రం : ఇది తల శిఖర భాగాన ఉంటుంది.
Content: మూలాధార చక్రం : మూలాధార చక్రం వెన్నుముఖకి చివర ఉంటుంది. సర్వసృష్టికి ఆధారమయిన చక్రం మూలాధార చక్రం. మనలో ఉండే కల్పనలు, ఊహలు ఈ చక్రాన్ని బంధించుతాయి. మనిషిలో ఉండే 80% శక్తి ఈ చక్రంలోనే ఉంటుంది. ఈ చక్రాన్ని శక్తివంతం చేయనవసరం లేదు. ఈ చక్రాన్ని నిక్షిప్తం చేస్తే, చైతన్యవంతం చేస్తే గొప్ప శక్తి ప్రవాహం మనకి అందుబాటులోనికి వస్తుంది. ఈ శక్తి స్వచ్ఛమయిన దివ్యశక్తి. ఆ శక్తి మన జీవితాన్ని సంపూర్తిగా మార్చగలుగుతుంది. ఈ శక్తి మనని ఉన్నతస్థితికి చేర్చుతుంది.
Content: గణపతి మూలాధారకి ఆది దేవుడు. ఆయన స్వచ్ఛమయిన దివ్యదృష్టికి ప్రతిరూపం. ఎప్పుడయితే స్వచ్ఛమయిన దృష్టి ఊహలతో నింపబడుతుందో అదే అన్ని సమస్యలకి కారణం అవుతుంది. అది మరిన్ని
Page 14
Content: ఊహలకి, కల్పనలకి కారణం అవుతుంది. మన దైనందిన జీవితంలో ఉండే అనేక సమస్యలకి ముఖ్యకారణం ఈ ఊహలు కల్పనలు. కల్పనలు లేని దృష్టి మూలాధార యొక్క స్వచ్ఛమయిన శక్తి.
Content: గణపతి స్వచ్ఛమయిన దివ్యదృష్టికి ప్రతిరూపం. అందుకే ఆయనని సర్వకార్యాలకి ప్రారంభదేవుడు అని అంటారు. గణపతితో ఏ పనిని ప్రారంభించినా, విఘ్నాలు లేకుండా ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రారంభించిన పనిని విజయవంతంగా పూర్తి చేయవచ్చు. పని జరుగుతున్న కాలంలో ఎటువంటి అడ్డంకులు రావు. స్వచ్ఛమయిన దూరదృష్టి ఉన్నప్పుడు అడ్డంకులు రావు. అందుకే గణపతిని విఘ్నేశ్వరునిగా పూజించుతారు. ఆయన ఒక శక్తివంతమయిన ప్రణాళికా అధికారి. ఆయన స్వచ్ఛమయిన ఉన్నతమయిన ప్రణాళికా కర్త. స్వచ్ఛమయిన ప్రణాళికకి ఎటువంటి ముందు ప్రణాళికలు అవసరం లేదు. అటువంటి వారికి ప్రణాళిక పని కలసి జరుగుతాయి.
Content: దూర దృష్టికి ఆధారం మేధస్సు. ఎప్పుడయితే మీకు స్వచ్ఛమయిన, స్వచ్ఛమయిన దూరదృష్టి ఉందో అప్పుడు మీరు ప్రణాళికలు వేయాలి. మీకు ఉన్న శక్తిని ప్రణాళికలు తయారు చేయాటానికి సరిపెడతారు. అందుకే స్వచ్ఛమయిన దృష్టి ఉన్నవారికి ప్రణాళికలు అవసరం లేదు. అటువంటి వారికి సమయస్ఫూర్తితో ప్రణాళికలు జరుగుతాయి. చేయవలసిన మార్పులు, అభివృద్ధి అనసకల్పితంగా, వాటంతటవే జరుగుతాయి. ఏవైనా కొత్త మార్పులు ఉన్నా అవి కూడా చాలా చక్కగా సౌకర్యంగా ఇమిడిపోతాయి.
Content: స్వచ్ఛమయిన దూరదృష్టి కల వ్యక్తి మాత్రమే నిజమయిన ప్రణాళికని సృష్టించగలరు. దానిని నిరంతరం ఆధునికపరచగలరు. ఇదంతా మేధస్సుతో, సమయస్ఫూర్తితో మాత్రమే చేయగలరు.
Content: గణపతి స్వచ్ఛమయిన సమయస్ఫూర్తి అనే శక్తి యొక్క ప్రతి రూపం. వైపుణ్యం గల ప్రణాళికా కర్తలు మంచి ప్రణాళికలని వేయవచ్చు, వాటిని అమలు చేయవచ్చు. కానీ ఆలా అమలుపరచే సమయంలో ఎటువంటి మార్పులు వచ్చినా, కొత్త విషయాలు తెలిసినా, వారిలో సమయస్ఫూర్తి లేకపోతే చేసే పనిలో ఆ మార్పులని ఇమడ్చలేరు. ముందుగా వేసిన ప్రణాళికలు, ప్రస్తుతం జరుగుతున్న పనితో కలిసిపోతే వారికి సమయస్ఫూర్తి ఉండాలి.
Content: ప్రస్తుతపు ఆధునిక కాలంలో ఏరంగంలోనైనా అభివృద్ధి చెందాలి అంటే ఈ వైపుణ్యం అత్యవసరం. అది వ్యాపార రంగం కాని, విద్యారంగం కాని లేదా మరే రంగమైనా సమయస్ఫూర్తి, పూర్తిగా పనిలో నిమగ్నమయ్యే నైపుణ్యం అవసరం. ఎవరెవరైతే పోటీ రంగాలో ఉన్నారో, ఎవరైతే విజయం సాధించాలనే లక్ష్యంతోనే ఉన్నారో వారికి గణపతి శక్తి అవసరం. అందుకే గణపతిని సర్వకార్యాలకి ఆదిదేవునిగా పూజిస్తారు. ఆయన మనం చేపట్టిన పనులలో ఆటంకాలని తొలగిస్తాడు. అందుకే ఆయనని విఘ్నేశ్వరునిగా ఆరాధిస్తాము.
Content: మహాభారతం గణపతి :
Content: మహాభారతం భారతదేశంలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన పురాణం. ఇది ప్రపంచంలో చాలా ఆదరణ పొందిన కథ. అంతకొద్దీ మనకే ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్షేత్రాల గ్రంథం. ఇందులో 70,000కి పైగా శ్లోకాలు ఉన్నాయి. ఇది ప్రాచీన పురాణ కథ. దీనిని వ్యాసమహర్షి చెబుతుండగా గణపతి వ్రాసాడు.
Content: వ్యాసుడు జ్ఞానోదయమయిన యోగిశ్వరుడు, మహాజ్ఞాని, మహోమేధావి. ఆయన గొప్ప గ్రంథ కర్త. ఆయన విశ్వమేధోశక్తికి ప్రతిరూపం. ఆయన మహాభారత రచన చేయాలని సంకల్పించారు. ఆయన చెబుతూ ఉంటే, ప్రాయటానికి ఒకరు కావాలి. ఆలా ప్రాయగలిగే వ్యక్తి వ్యాసుడు
Page 15
Content: చెప్పే విషయాన్ని సూక్ష్మంగా గ్రహించి, చెప్పినది చెప్పిన విధంగా ఒక్క శబ్ధంకాని, అక్షరం కానీ తేడా లేకుండా వ్రాయగలగాలి. వ్యాసమహర్షి చెప్పటం మొదలుపెట్టగానే ఆయన అందులోలీనమయిపోతాడు. ఆయన పూర్తిగా ధ్యోకాలని కూర్చి చెప్పటంలో నిమగ్నమయిపోతాడు. ఆయన అత్యంత వేగంగా చెప్పేస్తాడు. ఇటువంటి అన్నివిషయాలు వ్రాసే వ్యక్తి గమనించగలగాలి. అటువంటి వ్యక్తి వ్యాసుడు ఉండే చేతనస్థితిలోనే ఉండాలి. అతను కూడా జ్ఞానోదయమైన యోగిశ్వరుడు, విశ్వమేధస్సు కలిగిన సరోతముడు అయి ఉండాలి. అంతేకాదు బహసూక్ష్మ బుద్ధిశాలి, సూక్ష్మగ్రాహి అయి ఉండాలి. అత్యంత వేగంగా, ఎటువంటి తప్ప లేకుండా వ్రాయగల నేర్పరి అయి ఉండాలి. అయితే ఈ లక్షణాలు ఉన్నవారు చాలామంది ఉండి ఉండవచ్చు. కాని వ్యాసుడు గణపతినే ప్రత్యేకంగా ఎందుకు ఎంచుకున్నాడు? ఎందుకంటే గణపతిలోని అత్యంత ప్రత్యేకమయిన లక్షణాలు ఆయన సమయస్సూర్తి, త్యాగనిరతి, స్పష్టమయిన దృష్టి అందుకు కారణం. అంతేకాదు గణపతి యొక్క భౌతికరూపం కూడా అందుకు అనువుగా ఉంది. ఆయన పెద్ద పెద్ద చెవులు ఎంత సూక్ష్మ శబ్దాన్ని అయినా ఇట్టే పట్టేయగలవు. ఆయన వినికిడి కళ అత్యంత నైపుణ్యమయినది. ఒక్క అక్షరాన్ని కాని ఒక్క శబ్దాన్ని కానీ వదలకుండా వినగల శక్తి ఆ చెవులకి ఉంది. వ్యాసుని వేగానికి, తనకి కావలసిన కచ్చితానికి ఈ విధంగా నైపుణ్యంలో వినగల వ్యక్తి కావాలి. ఆ వినికిడి శక్తి వ్యాసునికి అవసరం. గణపతికి ఉన్న పెద్ద ముక్కు సూక్ష్మాతి సూక్ష్మమయిన, చెవులకి అతీతమయిన విషయాలని కూడా గ్రహించగలుగుతుంది. వ్యాసుడు మౌనంగా ఇచ్చే వివరాలకి కూడా గ్రహించగల శక్తి వినాయకుని పొడవైన ముక్కుకి ఉంది.
Content: ఈ సందర్భంలో నేను మీకు జ్ఞానోదయమయిన యోగిశ్వరుల శక్తి గురించి చెప్పాలి. వారు మౌనంగా, ఇటువంటి శబ్ధాన్ని ఉపయోగించకుండా కూడా విషయాలని తెలియచేయగలుగుతారు. అయితే మౌనంతో తెలిపే విషయాలని మరొక జ్ఞానోదయమయిన వ్యక్తి మాత్రమే గ్రహించగలడు. మీకు ఒక చక్రని లోకం గుర్తు ఉండి ఉంటుంది. దక్షిణామూర్తి (శివుడు)ని ప్రశంసిస్తూ ఆదిశంకరాచార్యులు ఒక అందమయిన శ్లోకాన్ని చెబుతారు. అందులో ఈ విషయం స్పష్టంగా ఉంటుంది. గురుశిష్యుల మధ్య మౌనంలో సాగే సంభాషణ గురించి ఉంటుంది. చిత్రం వటతరోమూలే వృద్ధా శివపురూర్యవః గురోస్త్తు మౌనం వాఖ్యానం శిష్యోస్త్తు చిన్న సంయాతః ఎంత విచిత్రం : మరచెట్టు (క్రింద కనిపించే ఈ దృశ్యం ఎంత అద్భుతం. అక్కడ ఉన్న గురుదేవులు యువకుడు. ఆయన చుట్టూ ఉన్న శివ బృందం వృద్ధులు. గురువు మౌనంగా ఉన్నాడు. కాని శిష్యుల అనుమానాలనీ కరిగిపోతున్నాయి. వ్యాసుడు జ్ఞానోదయమయిన యోగిశ్వరుడు. కాబట్టి ఆయన నిశ్భబ్ధంగా కూడా విషయాలని వెల్లడి చేయగలడు. కాబట్టి ఆయన మౌనంగా చెప్పే విషయాలని గ్రహించగలిగే శక్తి కావాలి. అంతేకాదు తక్కువ సమయంలో ఎక్కువ విషయాలని గ్రహించి, మెరువు వేగంతో ఆ విషయాలని వ్రాయగలగాలి. ఈ సందర్భంలో గణపతి యొక్క పొడవైన ముక్కు చాలా సహాయకారిగా ఉంటుంది. ఈ కారణం వల్లనే వ్యాసమహర్షి గణపతిని తన భారతకథకి లేఖకునిగా ఎంచుకున్నాడు. కేవలం గణపతి మాత్రమే అంత పెద్దదయిన కొన్ని వేల శ్లోకాలతో ఉండి నేటికీ అత్యంత పెద్ద శ్లోకాల గ్రంథంగా ఉన్న మహాభారతాన్ని వ్రాయగల శక్తి.
Page 16
Content: వ్యాసగుహః
Content: ఈ భూమి మీద ఒక అందమయిన, ప్రశాంతమయిన, పవిత్రమయిన స్థలం ఉంది. అది బదరీనాథ్‌కి 10కి.మీ. దూరంలో హిమాలయాల మధ్య ఉన్న వ్యాసగుహ. ఇక్కడే, ఈ స్థలంలోనే వ్యాసుడు చెబుతుండగా గణపతి మహాభారతాన్ని బ్రాసినట్లు మన ప్రాచీనులు చెబుతుంటారు. ఆ పవిత్ర ప్రదేశం అంతా పవిత్రతతో, జ్ఞానంతో నిండి ఉంటుంది. ఆ స్థలంలోనే వ్యాసగుహ, వినాయకుని గుడి ఉన్నాయి. ఆ గుహని చూసిన తాతగారు, శిలాజాలుగా మారి గుహగా అయిపోయినట్టు మనకి కనిపిస్తుంది. అక్కడ ఉన్న ఆ కొండపైట రాళ్ళు మాత్రమే ఒకదాని మీద ఒకటి పెర్చబడ్డ తాళపత్రాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది.
Content: అక్కడ మహాగణపతిని ఏకదంతాయనమః అని ప్రార్ధించి ఆ కథ రాసే సమయంలో ఆయన చేసిన త్యాగాన్ని భక్తితో ప్రేమతో తలచుకుంటారు. ఆయనలోని సమయస్ఫూర్తికి హృదయం పూర్వకంగా అంజలిగటిస్తారు.
Content: వినాయకుని పూజించటమంటే ఆ సమయస్ఫూర్తిని, త్యాగ నిరతిని, పని పూర్తి చేయాలనే సంకల్పాన్ని భక్తితో గుర్తు చేసుకొని ఆ లక్షణాలని అలవరచుకోవాలి అనుకోవటమే. మనం గణపతిని పూజించి ఆ నైపుణ్యాన్ని అలవరచుకొని మన జీవితాలలో అభివృద్ధి సాధించాలి. చేపట్టిన పనిని విజయవంతంగా ముగించాలి. ఇదే మనం ఈ కథ నుంచి తెలుసుకున్న విశేషం. గణపతి పూజ ద్వారా మనం పొందే పూజా ఫలం ఈ నైపుణ్యాలని అర్ధం చేసుకొని మన జీవితాలకి అన్వయించుకోవటమే.
Content: గణపతి అత్యున్నత చేతనస్సిట్టి :
Content: గణపతి అంటే ఏదో సరదాగా చిత్రించిన రూపం కాదు. అది ఒక భౌమ్మ కాదు. అదే విధంగా ఆయన ఏదో ఒక విషయం కాదు. ఈయన అన్నింటికీ అతీతుడు. గణపతి భౌతికంగా, దివ్యత్వంతో జీవించిన ఒక
Content: మహోన్నతమయిన విశ్వచేతనస్సిట్టి. గణపతి అంటేనే సర్వ మంగళ, సర్వ కళ్యాణ, సర్వోత్తమ శక్తికి ప్రతిరూపం. ఆయన పవిత్రతకి, చైతన్యానికి అందమయిన అత్యున్నతమయిన లక్షణాలకి ప్రతిరూపం.
Content: నాట్య గణపతి :
Content: గణపతి రూపాన్ని చాలా రకాలుగా, వివిధ భంగిమల్లో చిత్రించుతారు. వీటిలో కూర్చొని ఉన్న గణపతి, నాట్యం చేస్తున్న గణపతి రూపాలు ప్రముఖంగా ఉంటాయి. ఆయన ఏరూపంలో ఉన్న ఆనంద పారవశ్యాన్ని అమాయకత్వాన్ని విశ్వమేధస్సుని ప్రతిబింబిస్తుంటాడు. ముఖ్యంగా నాట్య గణపతి ప్రతిమ అత్యంత ఆప్యాయకరంగా అందంగా ఉంటుంది. అందులో మనకి పరమానందస్సిట్టిలో ఉండే గణపతి దర్శనమిస్తాడు. గాలికి ఎగురుతున్న పత్రాలు, చాలా అలవోకగా యాదృచ్ఛికంగా పట్టుకున్న ఆయుధాలు ఆయనలోని పారవశ్యాన్ని తెలియచేస్తాయి. ఈ స్థితి జ్ఞానోదయపు స్థితి. ఆరూపం మనకి జీవితం అంటే ఒక ఉత్సవం అనే విషయాన్ని చెబుతుంది. జీవితం ఒక నాట్యమేల అని గుర్తు చేస్తుంది. జ్ఞానోదయపు స్థితిలో ఉండే పరమానందపు ఉత్సవాన్ని చూపిస్తుంది.
Page 17
Content: గణపతి ధ్యానం :
Content: గణపతి ధ్యానం అంటే గణపతి రూపం మీద, గణపతి యొక్క అత్యుత్తమ శక్తి మీద, ఆయన యొక్క విశ్వచేతనస్థితి మీద ధ్యానం చేయటమే. గణపతి ధ్యానం ఆయన వెల్లడిచేసే అత్యున్నతమయిన శుభలక్షణాల మీద, ఆయన వెల్లడిచేసే పవిత్ర లక్షణాల మీద ధ్యానం చేయటం. గణపతి రూపం, గణపతి శక్తి మనకు తెలియచేసే అత్యుత్తమ స్థితి మీద ధ్యానం చేయటం. కొన్ని నిముషాల సమయం తీసుకొని గణపతి రూపం మీద ధ్యానం చేయండి. దేవుని రూపాన్ని ఎందుకు సృష్టించారని ప్రశ్నిస్తే జవాబు మనని ఉత్సాహపరుస్తుంది. ఆ రూపం మనం ధ్యాన స్థితిలోనికి వెళ్ళే విధంగా ప్రోత్సహిస్తుంది. ఆ రూపం తనలోని అత్యుత్తమయిన లక్షణాలని మనం నేర్చుకునే విధంగా మనకి సహాయం చేస్తుంది. ఆ విగ్రహం ప్రపంచానికి వెల్లడి చేసే శుభలక్షణాలని తెలుసుకునే విధంగా మనని ప్రోత్సహపరుస్తుంది. మీరు మీ ఎదురుగా ఉండే గణపతి రూపాన్ని బాగా చూడండి. ఆ రూపాన్ని మీ అంతరంగంలో నింపండి. ఆ రూపాన్ని మీ మూలాధార చక్రం దగ్గర నిలపండి. మీ మూలాధార చక్రం ఆ రూపంతో ప్రకాశించటం గమనించండి. అద్భుతమయిన గణపతి శక్తితో మీ మూలాధార చక్రాన్ని వికసింప చేయండి.
Content: గణపతి అష్టోత్తర శతనామావళి.
Content: గణపతి అష్టోత్తర శతనామావళి అంటే గణపతి యొక్క 108 పేర్లని జపించటం. గణపతి పేర్లు జపించే సమయంలో మీరు కళ్ళు మూసుకొని ఆ పేర్లు వింటూ వాటిని జపించవచ్చు లేదా కళ్ళు తెరచి గణపతి రూపాన్ని చూస్తూ పేర్లు జపించవచ్చు. మీరు కళ్ళు తెరచార లేదా కళ్ళుమూసి జపిస్తున్నారా అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. మీరు ఎంత లోతుగా గణపతితో అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఎంత త్రీవంగా ఆ శక్తిలో మీరు లీనమయ్యారు అన్నది ముఖ్యం.
Content: అష్టోత్తర శతనామావళి జపం మిమ్ములని గణపతి ధ్యానం లోనికి తీసుకువెళ్ళగలగాలి. ఆ రూపంతో, ఆ శక్తితో ఒక బలమయిన అనుబంధాన్ని ఏర్పరచగలగాలి.
Content: నేను చాలా మందిని చూస్తూంటాను. అష్టోత్తర శతనామావళి, సహస్రనామాలు జపిస్తూ ఉంటారు. అయితే అది ఒక ధ్యానంలా, ఒక భక్తి పూర్వకమయిన ఆరాధనలా చేయరు. ఒక యంత్రంలా చాలా యాంత్రికంగా చేస్తుంటారు. వారివెపు చూస్తే వారి పేదాలు చాలా స్పీడుగా నామాలు జపం చేస్తుంటాయి. చేసిలోని జపమాల అంతకంటే స్పీడుగా తిరుగుతుంటుంది.
Content: పేదాలు ఇంకొకస్త స్పీడు అందుకుంటాయి, జపమాలచేతిలో ఉంటే అది తిరుగుతూ ఉంటుంది. మనస్సు మాత్రం పూజ తరువాత చేయవలసిన పనుల లిస్టులు తయారు చేయటంలో మునిగిపోయి ఉంటుంది. అటువంటివారు నామాలు చదవటం ముగించగానే, ఇంట్లో వారికి వారు చేయవలసిన పనులు చెబుతారు. “ఏయ్! ఇంకా ఇక్కడే ఉన్నవా? ముందు వెళ్ళి పని చూడు. ఓరేయ్ చిన్నోడా, నువ్వు షాపుకి వెళ్ళి ఇవి తీసుకురా. మరి నీవు. ఈవిధంగా ఒక ప్రవాహంలో పనులు అప్పచెబుతుంటారు. దీని అర్థం ఏమిటంటే? జపం చేసేసంతే సేపు వాళ్ళు ఈ పనులు ఎవరికి ఎలా చెప్పాలో ఆ కార్యక్రమాన్ని తయారు చేసుకుంటున్నారు అని అర్థం.
Content: ఇది సరియైన పద్దతి కాదు. దీనిని పూజ అనరు. మీరు అష్టోత్తరం చదివినా, సహస్రం చదివినా, పూజ ఆయిపోయాకా, లేదా ఆ జపం ముగించాక మీరు ఏ దేవుని పేరు చదువుతారో ఆ రూపంతో మీ అంతరంగం నిండిపోయి ఉండాలి. ఆ రూపం తాలూకా ఆనందపారవశ్యంతో మీ ముఖం ప్రశాంతంగా,
Page 18
Content: ప్రకాశంగా ఉండాలి. మీరు అద్భుతమయిన, అందమయిన నిష్ఠబ్దాన్ని ప్రశాంతతని మీలో నింపుకొని ఉండాలి. అప్పుడే ఆ జపం యొక్క ఆనందకరమయిన అనుభవపు రుచిని తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు మీరు అష్టోత్తర నామాలు చదవబోతున్నారు. లేదా వినండి. ఆ సమయంలో మీ మనస్సు మీలోనే ఉండాలి. గణపతి తప్ప మరొక ఆలోచన ఉండకూడదు. మీ అంతరంగం మొత్తం గణపతి రూపంతో నిండి ఉండాలి. ప్రతి పేరుని మీ అంతరంగం నుంచి అనాలి. ఎట్టి పరిస్థితిలోనూ మీ ఈ నిష్ఠలతని పాడుచేయవద్దు.
Content: కళ్ళు మూసుకొని పూర్తిగా గణపతి మీలో నిలుపుకోండి. గణపతితో లోతయిన అనుబంధాన్ని ఏర్పరచుకోండి.
Content: గణపతి రూపం మీద ధ్యానం చేయండి. ఏ రూపం అయితే ఒక చేతిలో బంధాలు ఏర్పరచకూడదు అనే పద్ధతిని అంకుశం రూపంలో ధరించినదో, మరొక చేతిలో భావవేశాలు సమతుల్యత అనే పాశాన్ని కలిగి ఉన్నదో, మరొక చేతిలో జీవితం అనే మోదకాన్ని కలిగి ఉన్నదో మరొక చేతిలో త్యాగనిరతికి, సమయస్ఫూర్తికి చిహ్నంగా దంతాన్ని కలిగి ఉన్నదో అటువంటి గణపతి రూపం మీద ధ్యానం చేయండి. ఏ రూపమయితే అద్భుత చైతన్యాన్ని, ఆనందపు పారవశ్యాన్ని, అమాయకత్వాన్ని అత్యుత్తమ స్థితిలో వెల్లడి చేస్తుందో ఆ రూపం మీద ధ్యానం చేయండి. గణపతి మీద ధ్యానం చేయండి. ఆయనకు సంపూర్ణంగా ఆధీనులు అయ్యే ధ్యానం చేయండి. మీ అంతరంగం మీ ఆత్మ ఆయనలో నింపబడి ఉండుగాక. మీ జీవితమంతా ఆయనతో నింపబడి ఉండుగాక. మీ అన్ని పనులను, కార్యక్రమాలని గణపతి ప్రారంభించుగాక ఆయన మీ అన్ని కార్యక్రమాలకి ఆది దేవునిగా ఉండుగాక
Content: అత్యుత్తమ సమయస్ఫూర్తి, విశ్వమేధస్సు మీ జీవితాలలో నింపబడుగాక. ఆనంద గణపతి యొక్క పరమానందస్థితి మీ జీవితాలలో ఉండునుగాక. సరిపడా సమయాన్ని తీసుకొని గణపతి రూపాన్ని మీ అంతరంగంలో నిలుపుకోండి. గణపతి శక్తితో మిమ్మల్ని మీరు అనుసంధానం చేసుకోండి. ధ్యాన గణపతిని మీలో నిలుపుకోండి.
Content: ఓం శ్రీ ఆనందగణపతియే నమః
Content: ఓం వినాయకాయ నమః
Content: ఓం గౌరీ ప్రియాయ నమః
Content: ఓం విఘ్నురాజాయ నమః
Content: ఓం గణేశ్వరాయ నమః
Content: ఓం స్కందాగ్రజాయ నమః
Content: ఓం అవ్యయాయ నమః
Content: ఓం బుద్దాయ నమః
Content: ఓం దక్షాయ నమః
Content: ఓం అధ్యక్షాయ నమః
Content: ఓం ద్విజప్రియాయ నమః
Content: ఓం అగ్నిగర్భచ్ఛే నమః
Content: ఓం ఇంద్రశ్రీ ప్రదాయ నమః
Content: ఓం వాణీప్రదాయ నమః
Content: ఓం సర్వసిద్ధి ప్రదాతాయ నమః
Content: ఓం సర్వనాథాయ నమః
Page 19
Content: ఓం సర్వారి ప్రియాయ నమః
Content: ఓం సర్వాత్మకాయ నమః
Content: ఓం సృష్టికర్తే నమః
Content: ఓం దేవాయ నమః
Content: ఓం అనేకార్చితాయా నమః
Content: ఓం శివాయ నమః
Content: ఓం సుధాయ నమః
Content: ఓం బుద్ధిప్రియాయ నమః
Content: ఓం శాంతాయ నమః
Content: ఓం భీత భయాయ నమః
Content: ఓం కమినేనమః
Content: ఓం శక్తినేనమః
Content: ఓం నిష్టివార్చిహ్యాదినేనమః
Content: ఓం శ్రీకాయ నమః
Content: ఓం అజాయ నమః
Content: ఓం ఉపక్రోఆయాయనమః
Content: ఓం శ్రీపతియే నమః
Content: ఓం శ్రుతి వర్షితాయనమః
Content: ఓం కులాద్రి వేంద్రే నమః
Content: ఓం జరిలాయ నమః
Content: ఓం కాళికాన్మాసకాయ నమః
Content: ఓం చంద్రచకూటాయనే నమః
Content: ఓం కాంతాయ నమః
Content: ఓం పాపహారిణే నమః
Content: ఓం సమాహితాయ నమః
Content: ఓం ఆత్రితాయ నమః
Content: ఓం శ్రీకారాయ నమః
Content: ఓం సౌమ్యాయ నమః
Content: ఓం భక్తపరచిత్ దాయకాయ నమః
Content: ఓం కైవల్య సుకదాయనమః
Content: ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః
Content: ఓం జ్ఞానినే నమః
Content: ఓం బ్రహ్మచారిణే నమః
Content: ఓం గజాననాయ నమః
Content: ఓం వైమాత్రికాయాయ నమః
Content: ఓం మునిస్తుధ్యాయ నమః
Content: ఓం భక్త విఘ్న వినాశాయ నమః
Content: ఓం ఏకదంతాయ నమః
Content: ఓం చతుర్భుహవే నమః
Content: ఓం చతురాయ నమః
Content: ఓం శక్తి సముధామాయ నమః
Content: ఓం లంభోదరాయ నమః
Content: ఓం శూర్వకర్ధాయ నమః
Content: ఓం హరదయే నమః
Content: ఓం బ్రహ్మవిభూతా మయాయ నమః
Content: ఓం కాలాయ నమః
Content: ఓం గణపతియే నమః
Page 20
Content: ఓం కామినే నమః
Content: ఓం సోమ సూర్యాగ్నిలోచనాయ నమః
Content: ఓం పాశాంకుశ ధరాయ నమః
Content: ఓం చంద్రాయ నమః
Content: ఓం గుణతీతాయ నమః
Content: ఓం నిరంజనాయ నమః
Content: ఓం అగన్ వషాయ నమః
Content: ఓం స్వయం భూఃయ నమః
Content: ఓం సిద్ధి పాదాంభోజాయ నమః
Content: ఓం భీజ బలాస్తకాయ నమః
Content: ఓం వరదాయ నమః
Content: ఓం శాశ్వతాయ నమః
Content: ఓం హ్య్రుతినే నమః
Content: ఓం ద్విజప్రియాయ నమః
Content: ఓం దయాయుతాయ నమః
Content: ఓం ధనాయాయ నమః
Content: ఓం బ్రహ్మవేశ్వర్తితాయ నమః
Content: ఓం ప్రమత్త దైత్యవారాయతాయ నమః
Content: ఓం శ్రీకంఠాయ నమః
Content: ఓం విభుదేశ్వరాయ నమః
Content: ఓం రామార్పితాయ నమః
Content: ఓం విధయే నమః
Content: ఓం నాగరాజయజ్ఞోపవీతాయ నమః
Content: ఓం స్ధూల కంఠాయ నమః
Content: ఓం స్వయం కృతే నమః
Content: ఓం నామాగోష విజానమః
Content: ఓం వరస్మై నమః
Content: ఓం స్ధూల కంఠాయ నమః
Content: ఓం అగ్రగణ్యేనమః
Content: ఓం ధీరాయ నమః
Content: ఓం వాగీశాయ నమః
Content: ఓం సిద్దిదాయకాయ నమః
Content: ఓం దూలవ బిల్వ ప్రియాయ నమః
Content: ఓం అవ్యక్త మూర్తయే నమః
Content: ఓం అదృశ్యత మూర్తయే నమః
Content: ఓం సైతేంద్ర నాథాయ నమః
Content: ఓం స్వరావణ్య సుధారాయ నమః
Content: ఓం సమస్త గజధారణే నమః
Content: ఓం మాలినే నమః
Content: ఓం మూషిక వాహనాయ నమః
Content: ఓం వృష్టాయ నమః
Content: ఓం దుష్టాయ నమః
Content: ఓం ప్రసన్నాత్మనే నమః
Content: ఓం నిత్యప్రదీప్తాయ నమః
Content: ఓం సర్వసిద్దిప్రదాయకాయ నమః
Content: ఓం ప్రోం ఆనంద గణపతి యే నమః
Content: శ్రీ గణపతి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం.
Page 21
Content: గణపతి స్తోత్రం :
Content: మనకి ఉన్న ఆధ్యాత్మిక సాహిత్యాన్ని మూడు భాగాలుగా విభజింపవచ్చు. అవి శాస్త్రాలు, సూత్రాలు, స్తోత్రాలు. శాస్త్రాలు అనే గ్రంధాలు మన జీవిత లక్ష్యాన్ని, గమ్యాన్ని స్పష్టంగా వివరించుతాయి. అవి భగవంతుడు అంటే ఏమిటో మేధోపరంగా వివరణ ఇస్తాయి.
Content: రెండవ రకం సాహిత్యం సూత్రాలు. మనం అంతిమ స్థితికి చేరగల పద్దతులని చెబుతాయి. ఉదాహరణకి యోగ సూత్రాలు, శివ సూత్రాలు స్తోత్రం. మహాభక్తులయిన ఆళ్వారులు, నాయినార్లు, చైతన్య ప్రభు, మీరా, అన్నమాచార్యులు, రామదాసు వీరందరూ పాడిన పాటలు స్తోత్రాలే. అందుకే అంటారు స్తోత్రాలు హృదయానికి సంబంధించిన సాహిత్యం అని.
Content: ప్రశ్నలకి జవాబులు :
Content: మనకి సాధారణంగా వచ్చే కొన్ని అనుమానాలకి, ప్రశ్నలకి పరమహంస నిత్యానంద ఇచ్చిన అందమైన, అద్భుతమైన జవాబులు :
Content: ప్రియమయిన స్వామీజీ, స్తోత్రాలని సంస్కృతంలోనే పఠించాలి? జి. అలా అని ఏమి లేదు. స్తోత్రాల అంటే భక్తుల హృదయ స్పందన. నిజానికి దానికి ప్రత్యేకమైన భాషలేదు. భక్తికి తెలిసిన భాష కృతజ్ఞతా భావంతో ప్రేమని వెల్లడి చేయటమే.
Content: అయితే మీరు పఠించే స్తోత్రాలు సంస్కృతం లోనైతే మనకి మరొక ఉపయోగం కూడా ఉంటుంది.
Content: ముందుగా మీకు కొంచెం ఆ భాష గురించి చెబుతాను. సంస్కృతానికి కేవలం ఒక భాషగానే ప్రాముఖ్యత లేదు. సంస్కృత భాషా శబ్దానికి చాలా విశిష్టత ఉంది. సంస్కృత భాషని ఒక విధమయిన శబ్దతరంగాలు సృష్టించటానికి రూపొందించారు. మన ప్రాచీన రుషులు, మహర్షులు, మంత్రాలు, స్తోత్రాలు కానీ పఠించేటప్పుడు అర్ధం తెలియకపోయినా, ఆశబ్దం మనలో కొన్ని శబ్ద తరంగాలని సృష్టిస్తుంది. ఆ తరంగాలు మన శరీరంపైన అంతరంగ పైనా అద్భుతంగా పని చేస్తాయి. అవి మీ వ్యవస్థ మీద బలమయిన ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ భాష సృష్టించే శబ్ద తరంగాలు మీ అంతరంగంలోని చొచ్చుకొని పోతాయి. అవి మీ అంతరంగం మీద పని చేస్తాయి. మీకు వాటి అర్ధాలు తెలియకపోయినా అవి మీ మీద పని చేస్తాయి.
Page 22
Content: సంస్కృత పదాలని ఉచ్చరించినప్పుడు వచ్చే శబ్ద తరంగాలు మీ భౌతిక శరీరాన్ని శుభ్రపరుస్తాయి. ఆ శబ్దాల ద్వారా వచ్చే శక్తి మీ వ్యవస్థని స్వచ్ఛంగా చేస్తుంది. అంతేకాదు అది గొంతుక దగ్గర ఉంటే మీ శబ్దతత్వాన్ని నిర్మలంగా ఉంచి, దానిని శక్తివంతంగా చేస్తుంది. అందుకే మీరు సంస్కృత పదాలని పలరించే కొద్దీ, మీ శబ్దతత్వం మరింత స్వచ్ఛంగా తయారవుతుంది, మరింత శక్తివంతమవుతుంది.
Content: అంతే కాదు సంస్కృతభాషకి శబ్దానికి శక్తిని ఇచ్చే లక్షణం ఉంది. అది ఎలా అంటే, సంస్కృతం బాటర్లని రీచార్జ్చేస్తేనే, ఆ బాటరీలు జనరేటర్ పని చేసేలా చేస్తాయి. తిరిగి జనరేటర్ బాటరీలని రీచార్జ్ చేస్తాయి. ఈ విధంగా సంస్కృతంలో శ్లోకాలు పఠించినా, మాట్లాడినా మనం మరింత శక్తివంతుల మవుతాయి. మీరు ఒకసారి గమనించండి. మీరు ఏ భాషలోనైనా మాట్లాడితే, ఒక్క అరగంటకే నీరసపడతారు. అదే సంస్కృతంలోనైతే మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు. అందుకే మీకు అర్థం తెలియకపోయినా ప్రతి రోజు ఉదయం ఒక అరగంటపాటు సంస్కృత స్తోత్రాలు కానీ, శ్లోకాలు కానీ, నామాలు కానీ పరిచండి. మీ పిల్లలతో కూడ చదివించండి. అది మీ గొంతు నుంచి నాభి ప్రాంతం వరకూ శుభ్రపరుస్తుంది. ఆ ప్రాంతంలో అనారోగ్య సమస్యలు రావు.
Content: అదే స్తోత్రాలని పూర్తిగా ఆ దేవుని రూపంలో నిమగ్నమయ్యి పరిచిన్చితే మీకు అందమైన ఆనందపారవశ్యం కూడా కలుగుతుంది. గౌరవనీయులైన స్వామీజీ, కేవలం ఏవో కొన్ని పేర్లు జపించటం వలన మాకు ఆధ్యాత్మిక అనుభవం జరుగుతుందా?
Content: ఆధ్యాత్మిక అనుభవం పొందటానికి మీకు పేరుతోగాని, రూపంతో కాని అవసరం లేదు. దానిని మీరు కేవలం భక్తితోనే సాధించగలరు. అయితే
Content: ఈ రోజులలోని మనిషి చాలా క్లిష్టతరంగా తయారు అయ్యాడు. అతని అహం అతనికి ఒక పెద్ద ఇనుప కవచంలా ఉంది. దానితో అతని లోనికి భక్తి అనేది ప్రవేశించలేకపోతుంది. అసలు భక్తి అనేది మనలో కలగటం లేదు. మనమే దానిని అడ్డుకుంటున్నాము.
Content: మీరు భక్తిని మీలో కలిగే విధంగా విప్పారి ఉంటే, ఆ భక్తి భావాన్ని పూర్తిగా మీ అంతరంగంలోనికి చొచ్చుకొని పోనియగలితే, అది మీ అంతరంగపు లోతులని స్పుసించగలిగితే మీకు పేరుతో కాని రూపంతోకాని అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు అంటేనే ఇటువంటి వాటికి అతీతమయిన వాడు.
Content: ఇప్పుడు మీ ప్రశ్నలోని మొదటి భాగానికి వద్దాము. దేవుని పేరుని జపించితే ఆధ్యాత్మిక అనుభవం జరుగుతుందా? అవును, జరుగుతుంది. పేరుకి అంత శక్తి ఉంది. కేవలం రెండక్షరాల 'రామ' అనే పేరు కొన్ని లక్షలమందిని అంతిమ స్థితి అయిన పరమానందస్థితికి చేర్చింది. వారికి ఆత్మసాక్షాత్కారం కలిగేలా చేసింది
Content: రామాయణ కధలో హనుమంతుడు రామానామాన్ని జపిస్తూ అంత పెద్ద సముద్రాన్ని అవలీలగా దాటాడు. అదే రాముడు వారధి నిర్మించుకొని దాటాడు. ఆ తరువాత ఎవరో రాముడిని ఈ విషయమే అడిగారట. అప్పుడు రాముడు రామనామం రాముని కంటే గొప్పది అని చెప్పాడట.
Content: అయితే జపించే పేరుని మీ అంతరంగంలో నింపుకోవాలి అలా లేనప్పుడు కోటిసార్లు ఆ పేరు జపించినా ఉపయోగం ఉండదు. మీకు ఎటువంటి ఆధ్యాత్మిక అనుభవం జరుగుతుంది. కేవలం గొంతునొప్పి మాత్రం కలుగుతుంది.
Content: మీరు ఆ పేరుని మీ అంతరంగంతా నింపి జపిస్తే ఎంతో అద్భుతమైన ఆనందపారవశ్యం కలుగుతుంది. దానికి మీ భక్తి అవసరం.
Page 23
Content: గుర్తుంచుకోండి. మీ భక్తి కంటే మీంచిన శక్తివంతమయినది ఎక్కడా లేదు. ప్రియమయిన స్వామీజీ, మరి పూజలు హోమాలు కూడా ఇటువంటివేనా? మతపరమయిన పూజలు, హోమాలు అనేవి ఒక నిర్దిష్టమయిన పద్దతిలో ఉంటాయి. వాటిని ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి అనే విషయాలు కచ్చితంగా ఉంటాయి. అంతేకాదు అవి చేయటం చాలా కష్టం. అందుకే పూజలు విస్మృతంగా అందరి చేతా చేయబదతాయి. ఇవి వారి అహాన్ని తృప్తి పరుస్తాయి. అదే సులభమయినవి చేయమంటే ఇష్టం ఉండదు. అది వారి అహాన్ని తృప్తిపరచదు. అందుకంటే ధ్యానం చేయమంటే ఇష్టపడరు కాని ఒక చెట్టు చుట్టూ లేదా గుడి చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేయమంటే ఆనందంగా చేస్తారు.
Content: అయితే పూజలు అహాన్ని బలపరుస్తున్నంతవరకూ మీకు ఎటువంటి ఆధ్యాత్మిక ప్రగతి ఉండదు. మీరు పూజించేటప్పుడు ఈ సర్వ చైతన్యాన్ని, విగ్రహాలకి అనుసంధానం చేసి, సర్వాంతర్యామితో లోతయిన అనుబంధాన్ని ఏర్పరచుకొని అప్పుడు పూజలు చేయండి. అది మీలో కొంత ఆనంద పారవశ్యాన్ని ఇస్తుంది. అంతేకాని నేను ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాను, వేయిసార్లు పూజ చేసా, లక్షసార్లు జపించాను, ఇన్ని దేవాలయాలు చూసాను అని ప్రచారం చేసుకునేవారికి, అటువంటి వారితో పాటీపడేవారికి మిగిలేది కేవలం అహాన్ని తృప్తిపరచటమే కాని ఆధ్యాత్మిక అనుభవం కాని, ఆనందపు పారవశ్యం కాని కలగదు. చేసేపూజని పూర్తి కృతజ్ఞతా భావంతో, మీ అంతరంగం నిండా ఆమూర్తిని నింపుకొని చేసే పూజ మీకు ఆనందపు పారవశ్యాన్ని ఇస్తుంది.
Content: యాంత్రికంగా పూజలు చేయవద్దు. భగవంతునితో ఒక వ్యాపార వ్యవహారంలా పూజలు చేయవద్దు, మీరు భగవంతుని సమక్షంలో, అది గుడిలో అయినా, ఇంటిలో అయినా పూజ చేయాలి. పూజా మందిరంలో అయినా సరే.
Content: విగ్రహంముందు కాని, ఇంటిలో మీరే కృతజ్ఞతగా మరి భక్తితో ప్రేమతో పూజ చేయండి. అది నిష్పుటంగా మీ అంతరంగపు లోతులనుంచి చేయండి. అప్పుడు మీకు కలిగే మహదానందాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోండి.
Content: గౌరవనీయులైన స్వామీజీ, అర్ధంకాని స్తోత్రాలు, మంత్రాలు యాంత్రికంగా (మెకానికల్‌గా) పటించటం అవసరమా? ఏమీ తెలియకుండా ఎడో మెషిన్ లా పటించవచ్చునా ?
Content: తప్పకుండా పటించండి. మీరు అలా కొన్ని రోజులు చేయగా, చేయగా ఆ శబ్దాలలో అర్థం అయిపోతుంది. మీకు అర్థం కోసం పోయేది ప్రారంభించండి. క్రమంగా మీరు అందులోని ఆనందపు పారవశ్యాన్ని అనుభవించగలుగుతారు. నెమ్మదిగా మీరు వాటి అర్థాలు తెలుసుకోగలుగుతారు. అప్పుడు మీరు వాటి లోపలికి లోతుగా వెళ్లి ఆ ఆనందాన్ని అనుభవించగలుగుతారు. కాబట్టి అర్థం కావటం లేదు అని వదలవద్దు. అలా చేస్తే కొంతకాలానికి వాటిని పూర్తిగా వదిలివేస్తారు. అధ్యాత్మికపు అనుభవాలకి దూరం అవుతారు. ఒకరకమయిన సోమరితనంతో ఎందుకూలే అనుకుంటారు. నేను ఇంతకు ముందు చెప్పినట్లు, మీరు ధ్యాన స్థితికి వెళ్ల గలిగేంతవరకూ పూజలు చేయండి, స్తోత్రాలు జపించండి. ఆ తరువాత మీరే వీటిని వదిలివేసి ఉన్నతమయిన స్థితికి మరొక మెట్టు ఎక్కుతారు.
Content: ప్రియమైన స్వామీజీ! నేను సహస్రనామ స్తోత్రాలు చేసేటప్పుడు ఆ పేర్లపైన ఏకాగ్రతని ఉంచలేకపోతున్నాను? అన్ని నామాలు జపించేవరకూ ఎలా ఏకాగ్రతని ఉంచాలి?
Content: ఇది మరొక సమస్య, ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోండి. మీరు వేయిసపేర్లు చదివే సమయంలో ఏవో కొన్ని పేర్లు లేదా శ్లోకాలు మీకు అవ్యక్తమయిన ఆనందాన్ని ఇవ్వచ్చు. దాంతో మీరు సహస్రనామాలు ప్రతిరోజూ జపించాలి అని నిర్ణయించుకుంటారు. ఎప్పుడయితే మీరు అలా
Page 24
Content: నిర్ణయించుకుంటటాలో అది ఒక దినచర్య అయిపోతుంది. అందులో ఆనంద పారవశ్యాన్ని పొందలేరు. అప్పుడే మీరు ఏకాగ్రతని నిలపలేరు.
Content: మరొకసమస్య కూడా ఉంది. సహస్రనామాలు కాని, అష్టోత్తర శతనామావళి కాని మీరు ముందు చాలా చక్కగా ప్రారంభిస్తారు.
Content: కొద్దిసేపుకాగానే ఇంకా ఎన్ని పేర్లు ఉన్నాయో, ఇంకా ఎన్ని పేర్లు ఉన్నాయో చూసుకోవడం మొదలు పెడతారు. నేనెప్పుడూ ఈ విషయం పదేపదే చెబుతాను. మీరు పూర్తి తన్మయత్వంతో, ఏకాగ్రతతో ఎన్నిపేర్లు చదవగలిగితే అన్ని పేరు మాత్రమే జపించండి. మీ పైన ఏదేవత లేదా దేవుడూ కూర్చుని అకొంటు పుస్తకం పెట్టుకొని మీరు ఎన్ని పేర్లు జపించారు అని అకొంట్లు ప్రాయరు. మీకు బోరు అనిపించగానే, ఏకాగ్రత లేదు అనిపించగానే పుస్తకం మూసి, ఒక నమస్కారం చేసి అక్కడినుంచి లేచివెళ్లండి. అంతే కాని లెక్కలు కదుతూ సమయం వృథా చేయకండి. అది భక్తి కాదు, ఆధ్యాత్మికత కాదు.
Content: మీరు కేవలం లెక్కలు కోసంం అకొంట్లు బాలన్స్లో ఎన్ని సహస్రాలు చదివాను అని ప్రాసుకోవటానికి భగవంతుని పేర్లు జపించవద్దు. అది తప్పు ఎంత ఏకాగ్రతతో ఎంత తన్మయత్వంతో జపించారో చూసుకోండి. అటువంటి జపం మీకు నిజమయిన ఆనందాన్ని ఇస్తుంది.
Content: గౌరవనీయులైన స్వామీజీ, మనకి ఇంతపది దేవతల రూపాలు ఉన్నాయి కదా! ఏ దేవుడిని ఎంచుకోవాలో అయోమయంగా ఉంది?
Content: నేను ఎప్పుడూ ఒక విషయం చెబుతాను, ఏ దేవుని రూపానికి ఏ పద్దతికి మీరు మీ హృదయంలోనుంచి స్పందించినచతారో, ఏ దేవుని రూపంతో మీరు అనుబంధం ఏర్పరుచుకుంటారో, ఆ రూపమే మీ ఇష్టదేవత. ఆ దేవుని రూపంతో మీరు లోతయిన అనుబంధాన్ని ఏర్పరుచుకోగలుగుతారు. మీరు ఈ విధంగా ఏ దేవుని రూపానికి లేదా ఏ పద్దతికి స్పందించలేనపుడు లోతయిన అనుబంధం ఏర్పడనప్పుడు మీ అన్వేషణ కొనసాగించండి. మీ
Content: అన్వేషణ మీ ఇష్టదేవతగా మార్చుకొండి. ఎప్పుడైతే ధ్యానం మీకు అంతర్యాత్మగా మార్పుని కలిగిస్తుందో, అప్పుడే మీ జీవితంలో నిజమైన మార్పు వస్తుంది.
Content: కొన్ని ముఖ్యమయిన గణపతి స్తోత్రాలు
Content: శుక్లాంబరం ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
Content: ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే.
Content: అగజానన పద్మార్కం గజాననమహర్నిశం
Content: అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే.
Content: వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
Content: అవిఘ్నమకురుమే దేవ సర్వకార్యేషు సర్వదా.
Content: గణానాంత్వా గణపతిం హవామహే
Content: కవింకవీనాముపమశ్రవస్తమం
Content: జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
Content: ఆన శ్రీ త్తిస్సేధ సాధనం
Content: వాగేశాద్యనుమా సర్వాదానాముపక్రమే
Content: యంత్రారూధ ప్రకృత్యాన్స్తం నమామి గణనాయకమ్.
Content: ఏకదంతం మహాకాయం తప్కాంచన సన్నిభం
Content: లంభోధరం విశాలాక్షం వందేహం గజనాయకం
Content: మౌంజీ కృష్ణాజిన ధర నాగయజ్ఞోపవీతనం
Content: బాలేందు శకలం మౌళీ వందేహం గణనాయకం
Page 25
Content: భవసంచిత పాపౌఘ విధ్వదంసన విచక్షణం విఘ్నూంధకార భాస్వంతం విఘ్నురాజ మహాంబుజే ఏకదంతం శూర్పకరం గజవక్త్రం చతుర్బుజం పాశాంకుశ ధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకం
Content: ధ్యాయేద్గజాననం దేవమత్ర కాంచనే సన్నిభం చతుర్బుజం మహాకాయం సర్వాభరణ భూషితం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నురాజో వినాయకః దూమకేతాగ్రణాభ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకరో హేరంబో స్పందపూర్వజః షోడ శైతాని నామానియః పరేచ్చుణయాదః విధ్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నుస్తస్య నజాయతే ॥
Content: వక్రతుండాయ హిడంబే తన్మోదంతి ప్రచోదయాత్
Content: ఓంశ్రీఆనంద గణపతియే నమః మీ అందరూ నిత్యానంద స్థితిని పొందురు గాక. నిత్యానందం
Content: Our Nithyananda Meditation Academies (NMA) INDIA: Nithyananda Dhyanapeetam Nithyanandapuri Kallugonahalli, Mysore Road, Bidadi Bangalore - 562 109 Karnataka, INDIA Phone: 91 +80 65591844 / 27202084 Fax: 91 +80 7288207 Email: [email protected] URL: www.nithyananda.org Nithyananda Dhyanapeetam Sri Ananda Rajarajeshwari Temple, Nithyananda Giri Pashambanda Sathamrai Village, Shamshabad Mandal Rangareddy District Andhra Pradesh - 501 218, INDIA Ph.: +91 93470 65288 E-mail: [email protected]
Page 26
Content: Nithyananda Dhyanapeetam
Content: HYDERABAD CENTRE,
Content: Ph : 93910 35463
Content: Nithyananda Dhyanapeetam
Content: VISKHAPATNAM CENTRE
Content: Viskhapatnam District, Andhra Pradesh, INDIA
Content: Nithyananda Dhyanapeetam
Content: ELURU CENTRE,
Content: West Godavari District, Andhra Pradesh - 534 003, INDIA
Content: Ph: 08812 - 250712, Cell : 94908 26692
Content: Nithyananda Dhyanapeetam
Content: BHIMAVARAM CENTRE,
Content: West Godavari District, Andhra Pradesh, INDIA
Content: Ph: 9912144429, 99498 33599