1. isbn 979-8-88572-657-3.pdf
Page 1
Content: స్వేచ్ఛ (Freedom in Telugu) అత్యుత్తమ, అత్యున్నత, అత్యంత శ్రేయమైనది
- పరమహంస నిత్యానంద ప్రవచనాల నుండి
Page 2
Page Number: 01
Content: (అత్యుత్తమ, అత్యున్నత, అత్యంత ప్రియమైన కోరిక) ప్రతి మనిషి నిరంతరం కోరుకునేది స్వేచ్ఛనిమాత్రమే. మనిషి ఒక్కడే కాదు ఈ భూమిమీద జన్మించిన ప్రతి ప్రాణి తహతహలాడేది స్వేచ్ఛ కోసమే. మనిషి చేసే ప్రతి పనివెనుకా అతనికి తెలిసికాని, తెలియకకాని ప్రోత్సాహాన్నిచ్చే బలమైన అంశం స్వేచ్ఛ అనే కోరిక. ప్రపంచం మొత్తం ఏ సత్యం కోసమైతే తన ప్రాణాన్ని తన శక్తిని ధారపోస్తుందో ఆ సత్యమే స్వేచ్ఛ. మనిషి చేలిస్తే స్వేచ్ఛ అనుకుంటాడో, దానిపైవుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడో. మనిషి అంతరంగంలోనికి కొంచం లోతుగా చూడగలిగితే అతని చేతనస్థితి నిరంతరం స్వేచ్ఛవైపుకి ప్రవహిస్తూ ఉంటుందని తెలుస్తుంది. ప్రపంచ దేశాల చరిత్రని, సంస్కృతులను లోతుగా గమనిస్తే మనకి ఒక విషయం అర్థమవుతుంది. వారు దేనిస్తే స్వేచ్ఛ, స్వాతంత్రం అని అనుకుంటారో దాని కోసం వారు తమ శక్తి యుక్తుల్ని ఉపయోగించారు. వారి భావప్రకటనలు, అభిప్రాయాలు, ప్రవర్తనా నియమావళి అన్నీ దానికే అనుగుణంగా ఉంటాయి. ఆస్వేచ్ఛవైపు వారు తమ శక్తిని పూర్తిగా ఉపయోగించారు అని మనకి అర్థమవుతుంది. ఆస్వేచ్ఛ ఏదైనా సరే అది ఐశ్వర్యం కోసమైనా సరే. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఐశ్వర్యాన్ని మరింత సంపాదించాలని కోరుకుంటారు. ఎందుకంటే డబ్బు సంపాదన వెనుక అలా పరిగెడతారు? ఎందుకంటే డబ్బు మనకి స్వేచ్ఛ అనుభవాన్నిస్తుంది. ఎలా అంటే, డబ్బు ఉంటే చాలా వాటినించి మనకి కావలసినవాటిని ఎంచుకోవచ్చు, డబ్బు ఉన్నప్పుడే ఎంపిక సాధ్యమవుతుంది. డబ్బుతో మనం ఎంచుకునేది సమస్యలనే. డబ్బులేకపోతే ఒకటే సమస్య. డబ్బు ఉంటే దానితో చాలా సమస్యల్ని ఎంచుకుంటాము. అది సరే! డబ్బు ఉంటే మనకి స్వేచ్ఛ ఉంటుంది. డబ్బుకోసం తాపత్రయపడడం అంటే స్వేచ్ఛ కోసం తపించటమే. అది ఒకరకంగా స్వేచ్ఛని కోరుకోవటమే. మానవ చేతనస్థితి నిరంతరం స్వేచ్ఛవైపుగా విస్తరిస్తూ ఉంటుంది. ఇవరు దేనిని స్వేచ్ఛ అనుకుంటారో వారు తమ శక్తిని దానిమీద కేంద్రీకరిస్తారు. వారంతా ఆస్వేచ్ఛ దిశగా తమప్రయాణాన్ని సాగిస్తారు. కొందరు రాజకీయ స్వేచ్ఛ అంతిమ స్వేచ్ఛ అనుకొని దానికోసం పనిచేస్తారు. ఎవరైతే ఆర్థిక స్వేచ్ఛ అంతిమం అనుకుంటారో వారు ఆ స్వేచ్ఛకోసం పాటుపడతారు. ఎవరైతే సామాజిక స్వేచ్ఛ ముఖ్యం అనుకుంటారో ఆదిశగా ప్రయాణిస్తారు. ఆధ్యాత్మిక స్వేచ్ఛ అంతిమం అనుకునేవారు, అందుకోసం పనిచేస్తారు. కాబట్టి ఎవరు ఏది స్వేచ్ఛ అని అనుకుంటారో ఆ దిశగా తమప్రయాణాన్ని సాగిస్తారు. ఈవిధంగా కొన్ని సంస్కృతులు రాజకీయ స్వేచ్ఛ కోసం, కొన్ని సంస్కృతులు ఆర్థిక స్వేచ్ఛకోసం పనిచేసాయి. ఈ సందర్భంగా మీకు ఒక విషయాన్ని చెబుతాను. ఈ ప్రపంచంలోని సంస్కృతుల్ని రెండు తరగతులుగా విభజించవచ్చు. అవి బయట ప్రపంచానికి సంబంధించిన స్వేచ్ఛ అంతిమస్వేచ్ఛ అనుకొని దానికోసం పనిచేసేవి, రెండవది అంతరంగపు స్వేచ్ఛ అంతిమస్వేచ్ఛ అనుకొని దానికోసం పనిచేసేవి. బయట ప్రపంచపు స్వేచ్ఛ అంతిమం అనుకునేవారు రాజకీయ, ఆర్థిక, సామాజిక స్వేచ్ఛకి ప్రాధాన్యాన్నిస్తారు. అంతరంగపు స్వేచ్ఛ అంతిమం అనుకునే సంస్కృతులు ఆధ్యాత్మిక అభివృద్ధికి పనిచేస్తాయి. అసలు స్వేచ్ఛ కావాలి అనే భావనకి ఆధారం ఏమిటి? ఏ అనుభవం నుంచి అది బయటకి వస్తుంది? సాధారణంగా ఎటువంటి స్వేచ్ఛ అంతిమస్వేచ్ఛ అని మనిషి ఎలా నిర్ణయిస్తాడు? అసలు స్వేచ్ఛ అంతే ఏమిటి? ఉపనిషత్తులలో ఒక చక్కని మాట ఉంది. ‘एकोनां बहुहृस्याम्’ ఒకరు అనేకరూపాలో ఉంటూ సర్వాంతర్యామిలో ఆనంద ఉత్సవాలు జరుపుకుంటారు. తానే అన్నిరూపాలతో ఉన్నదని, అందరిపైనా ప్రేమ, కరుణ కురిపిస్తూ రెట్టింపు ఆనందాన్ని పొందుతారు. ఈ సందర్భంగా ఉపనిషత్తులలో చెప్పిన ఒక సంఘటన మీకు చెబుతాను. ఒక గురువుగారు శిష్యుడిని పిలచి అతనితో, ‘నీవు, నీ ఐదు జ్ఞానేంద్రియాలతో ఆనందించగలవా?’ అని అడుగుతాడు. శిష్యుడు, 'అవును గురుదేవా! నా ఐదు జ్ఞానేంద్రియాలతో ఆనందాన్ని పొందుతాను' అంటాడు.
Page 3
Page Number: 02
Content: అప్పుడు గురువుగారు, ఒకవేళ నీవు ఒక జ్ఞానేంద్రియాన్ని పొగొట్టుకుంటే, లేదా అది పనిచేయకపోతే, అంతే ఆనందాన్ని పొందగలవా? అని అడుగుతాడు. అప్పుడు శిష్యుడు, లేదు గురుదేవా! నా ఆనందంలో ఇరవైశాతం తగ్గిపోతుంది. అదే విధంగా రెండు జ్ఞానేంద్రియాలు పనిచేయకపోతే నలభై శాతం ఆనందం తగ్గిపోతుంది అని జవాబు ఇస్తాడు. ఆ గురువుగారు శిష్యుడిని, ‘ఒక వేళ నీకు మరొక ఐదు జ్ఞానేంద్రియాలు ఉంటే ఎలా ఉంటుంది?’ అని అడుగుతాడు. గురువుగారి ప్రశ్నకి శిష్యుడు, ‘నా ఆనందం రెట్టింపు అవుతుంది’ అని జవాబు ఇస్తాడు. అదేవిధంగా నేను ఐదు శరీరాలతో ఉండగలితే ఆ ఆనందం ఐదింతలు పెరుగుతుంది అని అంటాడు. ఒక్క నిముషం ఆలోచించండి. మీరు ఈ ప్రపంచంలో అన్ని శరీరాలతో ఉండగలిగితే మీ ఆనంద స్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఆ ఆనందం ఎన్ని కోట్లు రెట్లు పెరుగుతుందో తెలుసుకొండి. ఆ ఆనందాన్ని కొలవలేము. అది నిత్యమైనది, శాశ్వతమైనది. అది ఆనంతమై ఆనంద పారవశ్యపు స్థితి. జ్ఞానోదయమైన యోగులు ఉందేతి ఆ స్థితిలోనే అందుకే వారు నిరంతరం ఆనంద పారవశ్యంలో ఉంటారు. వారు ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తిలో తాము ఉన్నట్టు తెలుసుకుంటారు. ఆ ఆనందస్థితి అత్యుత్తమమైన ఆనంద పారవశ్యపు స్థితి. అది ఒక అద్భుతమైన దివ్య అనుభూతి. అదే నిజమైన స్వేచ్ఛ. దానినే సంపూర్ణమైన, అంతిమస్వేచ్ఛ లేదా విముక్తి అనవచ్చు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తనని తాను అందరిలో చూడగలడో ఆ వ్యక్తి సర్వాంతర్యామిలో ఒకటిగా అయిపోగలడు. అదే పూర్తత్వం, ఏకత్వం. ఆస్థితిలో ఉన్న వ్యక్తి పూర్తి స్వేచ్ఛతో ఉండగలడు. అతనిలో ఉండే ఒకే ఒక భావం కరుణ. ఎప్పుడైతే నేను వేరు ఎమిటివారు వేరు అనే ‘ద్వైత’ భావన వస్తుందో ఆ వ్యక్తిలో భయం ఉంటుంది. అటువంటి వ్యక్తి ఎదుటి వారు ఉంటే తనని స్వేచ్ఛగా చూపగలడు. అంతే ఏకత్వం, సంపూర్ణత్వం అనుకునే వ్యక్తి తాను ఆనందమైన ఆనందపారవశ్యాన్ని తనసుగా తనలో పొందగలడు. అతనికి కరుణతప్పమరొక భావం ఉండదు. అసలు సర్వాంతర్యామికి ఉండే ఒకే ఒక న్యాయసూత్రం కరుణ. అదే భగవంతుని న్యాయసూత్రం. మిగిలినవన్నీ మనుషులు సృష్టించిన న్యాయసూత్రాలు. అసలు ఈ సర్వసృష్టి కరుణ అనే అంశం ఆధారంగానే సృష్టించబడింది. విశ్వసృష్టికి కరుణ అనే అంశం కీలకమైనది. ఏ వ్యక్తి అయితే అందరిలో ఉన్నది నేనే అనుకుంటాడో, అంతే కలసిమెలసి ఉండాలి అని ఆశిస్తాడు. ఆస్థితికి ఆధారం కరుణ. ఏ సంస్కృతి అయితే అంతా ఒకటే అని సంస్మరించి కరుణ ఆధారంగా అభివృద్ధి చెందినది. ఎప్పుడైతే నేను వేరు అనుకుంటారో భయం వారికి ఆధారమవుతుంది. ఆయాసంస్కృతులు భయం అనే ఆధారమీద నిర్మించబడతాయి. వారికి స్వేచ్ఛ అనగానే శత్రువులు లేనప్పుడే స్వేచ్ఛ అనుకుంటారు. ఎమిటివారినుంచి పొందేదే స్వేచ్ఛ అని అనుకుంటారు. ఇటువంటి సంస్కృతులు రాజకీయ స్వేచ్ఛ లేదా ఆర్థిక స్వేచ్ఛ మీద తమ శక్తిని కేంద్రీకరించాయి. అందుకే ఆమానసంస్కృతులు యుద్ధవీరుల్ని హీరోలుగా ఆరాధిస్తారు. ఆ సంస్కృతులలో హింసకి ప్రాధాన్యత ఉంటుంది. వారు పోరాటం ద్వారా స్వేచ్ఛని పొందుతాము అనుకుంటారు. కరుణ ఆధారంగా అభివృద్ధి చెందిన సంస్కృతులు అంతరంగపు స్వేచ్ఛ, ఆధ్యాత్మిక స్వేచ్ఛ మైన తమ శక్తిని కేంద్రీకరించాయి. ఆ సంస్కృతులలో జ్ఞానోదయమైన యోగీశ్వరులు హీరోలు. వారినే ఆ సంస్కృతులు ఆరాధిస్తాయి. ఉదాహరణకి మన సంస్కృతి ఇక్కడ రాజకీయ స్వేచ్ఛకోసం కూడా ఒక మహాయోగి అయిన మహాత్ముని మీద ఆధారపడ్డారు. ఆయనే మహాత్మాగాంధి. ఆయన పూర్తిగా అహింసా భావనలో స్థిరపడిన యోగి, మహాత్ముడు. నేను నా అనుభవంతో చెబుతున్నాను, నిజమైన స్వేచ్ఛని మీరు ఉన్న స్థలం నుంచి భౌతిక స్థితి నుంచి పొందలేరు. అది మీ అంతరంగపు స్థితి మీద ఆధారపడి ఉంటుంది. మీ అంతరంగం కరుణ లేదా అహింస భావనలో స్థిరపడితే మీకు పౌరహక్కులే స్వేచ్ఛ యొక్క అనుభూతి. ఆ భావం, ఆ స్వేచ్ఛ స్థతి నిమ్మళ్ని ఏ సమస్యనుంచైనా రక్షించగలుగుతుంది. నేను మీకు మరలా చెబుతున్నాను, ఎంత కలినమైన సమస్యనుంచి బయటికి రావాలన్నా ఎంత క్లిష్ట పరిస్థితిలోనైనా మీకు పరిష్కారాన్ని ఇవ్వగలిగేది అహింస, కరుణ మాత్రమే. అది రెండూ మీ అంతరంగంలో స్థిరపడనప్పుడు, మీరు నిజమైన స్వేచ్ఛ అనుభవించలేరు. కాబట్టి స్వేచ్ఛ అనేది మీ అంతరంగానికి సంబంధించిన విషయమే కాని, దానికి బయట ఉన్న భౌతిక ప్రపంచానికి ఎటువంటి సంబంధం లేదు. మీరు స్థిరపడిన అంతరంగపు స్థితి లోతైన ఆనంద పారవశ్యంతో, కరుణతో నిండి ఉన్నప్పుడు మీలోపలికి
Page 4
Page Number: 03
Content: వచ్చే సమాచారాన్ని స్నేహభావంతో, ఆసందంతో తీసుకోగలరు. ఆ సమాచారాన్ని అదే ఆనంద భావంతో విశ్లేషించి నిర్ణయాలు చేయగలరు. మీరు ఏపుడైతే అటువంటి స్థితిలో స్థిరపడతారో మీరు నిజమైన, అసలైన స్వేచ్ఛతో ఉంటారు. ఆ స్వేచ్ఛలో స్థిరపడగలుగుతారు. అదే అత్యుత్తమమైన అంతిమ స్వేచ్ఛ. దానిని మీ నుంచి ఎవరూ తీసివేయలేరు. అది మీలో ప్రకాశించే అందమైన సౌమ్యత అవుతుంది. అది మీ నుంచి వెల్లడి అయ్యే ఒక భావ వీచిక అని చెప్పవచ్చు. మరే పదం వాడినా అది చిన్నది అవుతుంది. మీరు ఏస్థితి నుంచి నిర్ణయాలు చేసినా, ఆ నిర్ణయాలకి కరుణ అనే భావాన్ని అమరిస్తే అది స్వేచ్ఛకి దారితీస్తుంది. విశ్వశక్తి సృష్టిని చేసేటప్పుడు ఉపయోగించిన కందెన (గీజు) కరుణ మాత్రమే. ఏపుడైతే నేను అందరిలో ఉన్నాను అని అనుకుంటారో వారు నాకుననే ఆనంద ఉత్సవాలు జరుపుకుంటారు అని అనుకోగలుగుతారు. తనకు తాను సృష్టించుకున్న న్యాయసూత్రం ‘కలసి జీవించుదాము’ అనేదే. అంతా కలసి ఉందాము అనే సూత్రం వారిదే. స్వేచ్ఛ అనగానే మన స్పురణకి వచ్చేది రెండు విషయాలు. ఈ విషయాలని అర్థం చేసుకుంటే అంతిమ స్వేచ్ఛని పొందగలుగుతారు. అవి దేని నుంచి స్వేచ్ఛని పొందాలి అనుకుంటున్నారు, దేనికోసం మీరు స్వేచ్ఛని ఆశిస్తున్నారు, అనే రెండు ముఖ్యమైన అంశాలు. దేని నుంచైనా స్వేచ్ఛ పొందాలి అనుకోవటం స్వేచ్ఛలోని వ్యతిరేక భావం. దేనికోసం స్వేచ్ఛని పొందాలి అనుకుంటారో అది స్వేచ్ఛయొక్క అనుకూల భావం. అయితే దేని నుంచి, దేనికోసం స్వేచ్ఛ అనే ఈ రెండింటిని నుంచీ స్వేచ్ఛని పొందగలితే అదే నిజమైన అంతిమస్వేచ్ఛ. ఒక్క విషయం అర్థం చేసుకోండి, దేనినుంచైనా స్వేచ్ఛ పొందాలి అని అనుకోవటం అంటే ఒక బంధం నుంచి బయటపడటం అని తెలుసుకోండి గాని, విడుపుదల నుంచి కాని, పేదరికం నుంచి కాని లేదా ఏదైనా చేతకాని విషయం నుంచి కాని. ఇవన్నీ కూడా స్వేచ్ఛని ఒకదాని నుంచి పొందాలి అనుకోవటమే. అదే స్వేచ్ఛలోని వ్యతిరేక భాగం. దయచేసి ఒక విషయం స్పష్టంగా తెలుసుకోండి, స్వేచ్ఛ యొక్క వ్యతిరేక భాగం నుంచి మీరు సంపూర్ణమైన సంతోషాన్ని పొందలేరు. స్వేచ్ఛయొక్క తృప్తిని పొందాలి అంటే అందులో అనుకూల భాగం కూడా ఉండాలి. అదే స్వేచ్ఛ ఎందుకు అనే అంశం. స్వేచ్ఛ దేనికోసం.. స్వేచ్ఛ దేనికోసం అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతే దాని నుంచి స్వేచ్ఛని పొందినా అది మీకు సంతోషాన్ని ఇవ్వదు. మీరు అటువంటి స్వేచ్ఛని అంటే దేనికోసం స్వేచ్ఛని పొందారో అర్థం చేసుకోలేనప్పుడు, ఆ స్వేచ్ఛని యధాలాపంగా తీసుకుంటారు. ఇది ఎలా ఉంటుందంటే, మీరు జైలునుంచి స్వేచ్ఛని పొంది బయటకి వచ్చారనుకోండి. ఎందుకు అన్న ప్రశ్నకి జవాబు లేనప్పుడు, బయటకి వచ్చిన తరువాత నాలుగురోజులు ఉత్సాహంగా ఉంటారు. తరువాత మీరు దేనినుంచి స్వేచ్ఛని పొందారో మరిచిపోతారు. ఆ తరువాత మిగిలేది శూన్యం. చూసండి! మీరందరూ స్వేచ్ఛని ఉత్సవంగా చేసుకుంటున్నారా? లేదు! మీ స్వేచ్ఛని యధాలాపంగా తీసుకుంటున్నారు. మీకు స్వేచ్ఛ ఎందుకో తెలియనప్పుడు స్వేచ్ఛని చాలా మామూలుగా తీసుకుంటారు, దేనినుంచి స్వేచ్ఛని పొందారో మరిచిపోతారు. ఎందుకు స్వేచ్ఛ కావాలి అని అనుకుంటున్నారో, దానిని తెలుసుకుంటుంటే మీరు సంపూర్ణమైన తృప్తిని పొందుతారు. అందుకే దేనినుంచి స్వేచ్ఛని పొందాలో అది వ్యతిరేక భాగం అయితే, దేనికోసం స్వేచ్ఛని పొందాలను కుంటున్నారో అది అనుకూల భావం అవుతుంది. మీకు ఇంకొంచెం వివరంగా చెబుతాను. కొంచెం లోతుగా ఈ విషయం గురించి చూద్దాము. మీరు దేని నుంచి, దేనికోసం స్వేచ్ఛని పొందాలని అనుకుంటున్నారో అది రెండింటి నుంచీ స్వేచ్ఛని పొందటమే అంతిమ స్వేచ్ఛ. స్వేచ్ఛ దేనికోసం అని మీరు అనుకుంటారో, అది ఏదైనా సాధించటానికి లేదా ఏదో ఒక పని చేయటానికి లేదా ఈ బంధాల నుంచి బయటపడితే నేను పలానా పని చేసేవాడిని అని అనుకోవటం కోసమా? దేనికోసం? ఎందుకు అనే ఆ విషయాన్ని మీరు స్పష్టంగా తెలుసుకోగలిగితే, దేనినుంచి స్వేచ్ఛ పొందాలి అనుకుంటున్నారో అది మీ జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది. నేను మీకు అంతిమ సత్యాన్ని చెబుతాను, దేని నుంచి, దేని కోసం అనే వాటినుంచి మీరు స్వేచ్ఛని పొందగలిగితే అప్పుడు మీరు అంతిమ స్వేచ్ఛని అనుభవించగలరు. ఏ చేతనస్థితిలోనైతే కరుణ స్థిరపడి ఉంటుందో ఆ స్థితినుంచి మీరు నిర్ణయాలు చేసినప్పుడు, అకస్మాత్‌గా మీరు అంతిమమైన, అత్యుత్తమమైన, మీనుంచి ఎవరూ వేరుచేయలేని స్వేచ్ఛని అనుభవిస్తారు. దానినే నేను జ్ఞానోదయస్థితి అంటాను. దయచేసి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి నా జీవితంలో తి క్షణమైన సమస్యని నేను ఎదుక్కొని ఆ మూడు నెలల సమయంలో, నాలో ఒక భాగం దేని చేతా ప్రభావితం కాలేదు. ఏ విషయం దానిని అటలేదు. చక్కటి
Page 5
Page Number: 04
Content: ప్రశాంతస్థితిలో విరామంగా నిశ్చలంగా ఉన్నది నాలో ఆ భాగం. నేను నిజాయితీగా మీకు చెబుతున్నాను. నా హృదయాంతరాలలోంచి చెబుతున్నాను నా అంతరంగపు ఉనికినుంచి మీకు చెబుతున్నాను. నేను కనీసం ఒక్కసారికూడా ఇదంతా ఎందుకు జరిగింది అని అనుకోలేదు. కనీసం ఒక్కసారికూడా నేను బాధ పడలేదు. నేను ఏ విధమైన వ్యధకి లోనుకాలేదు. అగౌరవాన్ని కాని నిందలు కాని సన్ను అంటలేదు. అన్ని మూలలనుంచి సన్ను ఎంతో అగౌరవపరిచారు, నిందించారు. చాలాచాలా జరిగాయి. ఎంత జరిగినా కాని నా అంతరంగంలో ఉనికి స్థిరంగా ఉన్నది. దేనినైతే నా నుంచి తీసివేయలేరో అది అక్కడ స్థిరంగా ఉన్నది.
Page Number: 04
Content: మరొక విషయం ఆర్థం చేసుకొండి, జైలులో ఉన్నప్పుడు కరుణ, జ్ఞానోదయం అనేవి గొప్ప ఆడంబరాలు కాదు, అవి అవసరాలు, ఉపయోగాలు. అవి ప్రాథమిక ఉపయోగాలు. అవి లేకుండా ఉండటం కష్టం. జ్ఞానోదయం ఒక గర్వించదగిన విషయం అని మీరు అనుకోవద్దు. అలా అనుకోగలిగినప్పుడే మీరు విరామంగా ఉండగలరు. నేను చెబుతున్నాను, త్వరగా జ్ఞానోదయాన్ని పొందండి అది నిజంగా మీకు ఉపయోగపడుతుంది.
Page Number: 04
Content: మీరు ద్వేషం, పగ నుంచి స్వేచ్ఛని పొందకపోతే విరామంగా ఉండలేరు. నాకు ఏ సమస్య లేదు పూర్తి విరామంగా నిశ్చలంగా ఉండగలిగాను. సన్ను అగౌరవపరుస్తున్నారు అని నేను ఎప్పుడూ అనుకోలేదు. అంతేకాదు నా పేరుకి రకరకాల మాటలు తగిలించి పేపర్లలో రాసేవారు. చాలా అగౌరవంగా ఉండేవి.
Page Number: 04
Content: నిత్యానంద అన్న పేరు ఎంత సందడిని సృష్టించిందంటే, ఎవరో ఒకరు నాకు ఒక రిపోర్టు చూపించారు. ఇంటర్నెట్ వలయంలో వెందుపడ్డారు. ఇంటర్నెట్ జామ్ అయిందట. ఒకసారి మైక్రోసాఫ్ట్ జాక్సన్ చనిపోయినప్పుడు, రెండవది నిత్యానంద స్కాండల్. ఇంటర్నెట్‌ని జామ్ చేయటానికి మైక్రోసాఫ్ట్ పాటలు పాడాడు, డాన్సులు వేసాడు, గెంతాడు. చివరికి ఆయన చనిపోయినప్పుడు ఇంటర్నెట్ జామైంది. కాని నేను ఏమీ చేయలేదు. ఎవరో ఏదో చేశారు ట్రాఫిక్ జామ్ అయింది. నాకు చాలా ఆశ్చర్యమనిపించింది. ఆ వ్యాసంలో మరో విశేషం కూడా ఉంది. గూగుల్‌లో అత్యంత ఎక్కువగా వెతికిన పేరు నిత్యానంద అని. ఏమైతే అయిందో, నేను ఎప్పుడూ ఆ పేరుతో అనుబంధాన్ని పెంచుకోలేదు. అందుకే పేరు ముందు ఎన్ని రకాలు (ప్రాసిక్యూటా అవి సన్ను ప్రభావితం చేయలేదు. నాకూ బాధకలగలేదు. ఏ సమస్యని కలిగించలేదు. సన్ను ఆ విధంగా కాపాడిన ఆ స్థితి నాతోనే ఉంది. అది ఏ పరిస్థితులలోకూడా సన్ను పదలి వెళ్ళలేదు.
Page Number: 04
Content: ఇంత పెద్ద సమస్యలో సన్ను కాపాడింది పూర్తిగా కరుణ, అహింసలలో స్థిరపడిన నా అంతరంగపు స్థితి మాత్రమే. ఆ విధంగా లేకపోతే కనీసం నిద్రపోవటం కూడా సాధ్యమయ్యేది కాదు. మీరు కరుణలో స్థిరపడకపోతే మీరు అసలు విరామంగా ఉండలేరు. నిద్రపోవటం కూడా కష్టమవుతుంది. కారణం లేకుండా నామీద అనేక నిందలు అన్ని చోట్లా ప్రచారం చేసారు. ఏకారణం లేకుండా కక్షమాపించారు ఏకారణం లేకుండా విషం వెళ్ళగక్కారు. ఇదంతా ఎందుకు అంటే కారణం లేదు.
Page Number: 04
Content: నేను మీకు చెబుతున్నాను, నా అంతరంగం లోపల ఎక్కడా ఎవరిమీద పగ సాధించాలి అన్న ఆలోచనే లేదు. ఆ కారణం వలననే నేను మామూలుగా విరామంగా ఉండగలిగాను. తతాట స్థితిలో ప్రశాంతంగా, పూర్తి విరామంలో నాకునేను సౌకర్యంగా ఉన్నాను. కనీసం నా లోపల ఒక్కసారికూడా ఎవరిమీద కోపం కాని, కక్షకాని కలగలేదు. ఎవరి మీదైనా పగసాధించాలి అనే రహస్య ఆలోచనలు, ప్లాన్లు లేవు. అలా ఒక్కసారి కూడా అనిపించలేదు. అందుకే నేను నాతో చాలా సౌకర్యంగా ఉండగలిగాను. దానినే నేను సంపూర్ణమైన స్వేచ్ఛ అనుభవం అంటాను.
Page Number: 04
Content: మీకు మరలా చెబుతున్నాను, నేను ఈ ప్రపంచానికి చెబుతున్న విషయంలో నా సౌఖ్యం ఏమిటంటే, ఈ సమస్య రాకముందు పరమానందం అనిచెప్పవాడిని. కాని ఇప్పుడు మాత్రం కరుణ అని చెబుతాను. ద్వేషం నుంచి స్వేచ్ఛని పొందటమే అంతిమ స్వేచ్ఛ. పగ నుంచి స్వేచ్ఛని పొందటమే అంతిమ స్వేచ్ఛ.
Page Number: 04
Content: మీరు ఎప్పుడైతే కరుణలో స్థిరపడతారో, అకస్మాత్‌గా ఎదుటివ్యక్తి శత్రువు కాదు అని తెలుసుకుంటారు. అప్పుడు మీరు బహురూపాలలో ఆనందోత్సవాలు జరుపుకుంటారు. మీ అంతరంగంలో అత్యంత సూక్ష్మస్థాయిలో పగ, ద్వేషం ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తి శత్రువుగా కనిపిస్తాడు. అప్పుడు మీకు ఎదుటివారు శత్రువుగా, నరకంగా అనిపిస్తారో మీరు కుచించుకుపోతారు. మీరు విషయాలనుంచి దూరంగా
Page 6
Page Number: 05
Content: వెళ్ళిపోతారు. అప్పుడు సహజంగానే మీరు జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోతారు. క్రమంగా మరణం వైపుకు వెళ్ళిపోతారు.
ప్రాధమిక సూత్రం, సత్యం ఏమిటంటే కరుణ ఆధారంగా, కరుణలో స్థిరపడండి. అప్పుడు మీరు అత్యున్నత ఆనందపారవశ్యాన్ని అనుభవించగలరు. మీ అంతరంగంలో నిరంతరం ఆనంద వాహినులు ప్రవహించటం చూస్తగలరు. మీ అంతరంగంలో స్థిరపడగలిగితే ఒక్క క్షణం కూడా బాధ, వ్యధ అన్నవి మిమ్మలని అంటవు, ఎందుకంటే మీరు పూర్తి విరామంలో స్థిరపడి ఉంటారు కాబట్టి.
దేనికోసమో స్వేచ్ఛని ఆశిస్తున్నస్థితి నుంచి స్వేచ్ఛని పొందితే మీరు ఆశ నుంచి స్వేచ్ఛని పొందుతారు. అడెవిధంగా దేనినుంచి స్వేచ్ఛని పొందాలనుకుంటున్నారో దాని నుంచి స్వేచ్ఛని పొందితే అది భయంనుంచి స్వేచ్ఛని పొందటమే. ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోండి. దేని నుంచో స్వేచ్ఛ పొందటం అంటే బంధాలనుంచి స్వేచ్ఛని పొందటమే. ఫలనాదానినుంచి స్వేచ్ఛ కావాలి అంటే మీరు ఆశ, లక్ష్యాలలో బంధీలు. ఎప్పుడైతే మీరు వీటినుంచి స్వేచ్ఛని పొందుతారో అప్పుడు మీరు భయంనుంచి కూడా స్వేచ్ఛని పొందుతారు. ఎప్పుడైతే మీరు ద్వేషం, విరోదం నుంచి స్వేచ్ఛని పొందుతారో మీరు స్వేచ్ఛలో ఒక కొత్తకోణాన్ని అకస్మాత్‌గా చూస్తగలుగుతారు. అదే అంతిమ స్వేచ్ఛ.
నేను జైలులో ఉండగా జరిగిన ఒక మార్మిక అద్భుతాన్ని, ఒక అనుభూతిని చెబుతాను. నేను తెలుసుకున్న సత్యాన్ని వివరిస్తాను.
మీకు కొత్తగా కల్పవలసినవి ఏమీ లేవు. మీరు ఎంత సంపాదించినా, ఎంత పొందినా, ఎంతమందితో అనుబంధాన్ని ఏర్పరుచుకున్నా మీరు నొటితో జీవించలేరు. ఇది చాలా ముఖ్యమైన సత్యం. మీరు అఖండమైన, కరుణలో స్థిరపడితే, మీనించి శరీరాన్ని వేరుచేసినా మీ ఆనందాన్ని వేరుచేయలేరు. మీరు దేనినైతే ఆనందం, ఉత్సవం, సంతోషం అనుకుంటారో దానిని ఈ శరీరం లేకుండా కూడా పొందగలరు. మీకు స్పష్టంగా చెబుతాను, మీరు ఏ ఆనందాన్నైతే ఈ శరీరంద్వారా పొందగలరో ఆ ఆనందాన్ని శరీరం లేకుండా కూడా మీరు పొందగలరు. మీరు కరుణలో స్థిరపడినప్పుడు శరీరాన్ని మీనించి తీసివేసినా మీరు అదే ఆనందాన్ని పొందగలరు.
మీరు ద్వేషం, హింసలతో స్థిరపడినప్పుడు మీరు శరీరంతో ఉన్నా మీరు పొందాలనుకున్న ఆనందాన్ని పొందలేరు. మీరు ఏ జ్ఞానేంద్రియం ద్వారా కూడా ఆనందాన్ని పొందలేరు. మీరు తింటూ ఉంటారు కాని మరేదో విషయంలో మునిగిపోయి తింటున్న ఆనందాన్ని పొందరు. మీరు ఇంకపైనది వింటూకూడా మరెక్కడో ఏదో ఆలోచిస్తూ ఆ ఆనందాన్ని అనుభవించలేరు. మీరు అందమైనవి చూస్తుంటారు కాని మరేదో కార్యక్రమానికి ప్రణాళికలు వేస్తుంటారు.
నేను చాలామందిని చూసాను శెలవులలో ఆనందంగా గడపటానికి అందమైన ప్రదేశానికి వెళతారు. అందమైన హిల్‌స్టేషన్ లేదా బీచ్ లేదా మరొక ప్రదేశం. అక్కడ ఉన్న అద్భుతమైన అందాన్ని చూసి కొంచం సేపుకూడా ఆసందించరు. అక్కడ కాటేజ్ కొంటే ఎలా ఉంటుంది. ఇక్కడ ఫ్లాట్‌హౌస్ కడితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలు, ప్లాన్తో ఉన్న సమయాన్ని గడిపేస్తారు. అటువంటి వారు దేనినైతే సొంతం చేసుకుంటే గాని దానినుంచి ఆనందం పొందలేము అనుకుంటారు. దానిని న్యాయబద్దంగా సొంతంచేసుకున్నదగ్గర నుంచి పనివాళ్ళ కోసం, ఎలక్ట్రీషియన్ కోసం ఆ తరువాత డబ్బుకోసం పరిగెడటంతో జీవితం గడిచిపోతుంది. ఆ ఇంటిని జాగ్రత్తగా కాపాడటంలో ఆనందం అనే సంగతి మరిచిపోయి బాధ్యతలలో కూరుకుపోతారు.
ఏవ్యక్తి అయితే పగ, ద్వేషంలో స్థిరపడతారో అటువంటివారు వారికి ప్రియమైన వ్యక్తి దగ్గర కూర్చున్నా వారు ఎంతగానో కోరుకున్న వారి సమక్షంలోడిన్నా వారు ఎంతకాలంగానో చూసి ఆనందించాలి అనుకున్న స్థలంలో ఉన్నా వారు ఆ ఆనందాన్ని పొందలేరు. ఆ సమయంలో వారి అంతరంగంలో మరెక్కడో జరుగుతూఉంటుంది. ఏ వ్యక్తి అయితే కరుణ, అహింసలలో స్థిరపడతారో అటువంటివారు శరీరం లేకపోయినా వారు పొందాలనుకున్న ఆనందాన్ని పూర్తిగా పొందగలతారు.
ఈ సందర్భంలో నాకు జరిగిన ఒక చక్కని మార్మిక అనుభవాన్ని మీకు చెబుతాను. నమ్మేవారు నమ్మండి లేకపోతే ఆయన ఏదో చెబుతున్నారలే అని విని పదిలివేయండి. నేను నిజాయితీగా నాకు జరిగిన అనుభవాన్ని మీతో పంచుకుంటాను.
నేను జైలులో ఉన్నప్పుడు ఒకరోజు పడుకని ఉన్నాను. నేను పూర్తిగా విరామంలో ఉన్నాను. నా శరీరం
Page 7
Page Number: 06
Content: పూర్తి విశ్రాంతిలో ఉంది. నా చేతన స్థితి చక్కటి సమాధిస్థితిలో ఉంది. అకస్మాత్‌గా శరీరం చక్యని సమాధి స్థితిలో ఉండటం చేతనస్థితి తాను చేయవలసిన పనులు చేయటం చేస్తు స్పష్టంగా చూడగలిగాను. ఎక్కడో ఎవరో ప్రార్థన చేస్తున్నారు. మరాక చోట ఎవరో ధ్యానం చేస్తున్నారు. అప్పుడు నేను చాలా స్పష్టంగా చూడగలిగాను, నా నుంచి శక్తి ఒక వెలుగు రేఖలా బయటికి వెళ్ళి వారికి సమాధానం ఇవ్వటం నేను చూసాను ఇది ఒక మార్మిక అనుభవం. దీనిని మీతో పంచుకుంటున్నాను. నాతో అనుబంధం ఉన్నవారు, నన్ను అర్థం చేసుకోగలవారు దీనిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. లేకపోతే ఈయన ఏదో చెబుతున్నాడు అని వదిలివేయండి. నాకు అప్పుడు జరిగిన అనుభవాన్ని మీకు యధాతదంగా చెబుతున్నాను. శక్తి రేఖ, ఒక వెలుగు లా శరీరం నుంచి వెళ్ళి ప్రార్థిస్తున్నవారికి, ధ్యానం చేస్తున్నవారికి అందుబాటులో ఉంది. వేరువేరు ప్రదేశాలలో రకరకాల వారి దగ్గరకి ఆ విధంగా వెళుతుంది. కొందరు అమెరికాలో ధ్యానం చేస్తుంటే, కొందరు ఆస్ట్రేలియాలో మరికొందరు ఇండియాలో ఈ విధంగా అందరి విషయాలని గమనిస్తూ వారి ప్రార్థనకి ప్రతిస్పందిస్తుంది. నేను ఈ విషయాన్ని అనుభవంతో తెలుసుకునే సమయంలో ఈ శరీరాన్ని ఈ భౌతిక జ్ఞానకాన్ని గుర్తుంచుకోలేకపోయాను. ఈ భౌతిక జ్ఞానకాలని గుర్తుతెచ్చుకుంటుంటప్పుడు ఆ మార్మిక అనుభవాన్ని గుర్తుంచుకోలేకపోయాను. విశ్వశక్తి స్పందనని గుర్తుంచుకో లేకపోతున్నాను. ఆ స్పందనని గుర్తుంచుకుంటే భౌతిక జ్ఞానకాలని మరిచిపోతున్నాను. ఇది బైనరీ పద్దతిలా 1010101 లా ఉంది. ఒకసారి దీనిని మరొకసారి దానిని గుర్తుస్తున్నాను. ఒక సెకండు పాటు, పరితప్తున్నవాళ్ళలో నేను నింపాలి, నాలోనికి జ్ఞాన్‌తోర్డ్ చేయాలి అని అనుకున్నాను. ఆ విధంగా నాశరీర జ్ఞానకాలలోనికి ఆ అనుభవాన్ని నింపి దాని అర్థాన్ని, ఆ అనుభవాన్ని ఆధార్చేసుకోవాలి అని అనుకున్నాను. ఆ విధంగా ఆర్థం చేసుకోగలిగితే ఈ అనుభవాన్ని ఎవరికైనా చెప్పవచ్చు. విశ్వస్పందన అనుభవాన్ని భౌతిక జ్ఞానకస్థాయికి తర్తుమాచేయాలి అనుకున్నాను. అలా చేయగలిగితేనే ఆ అనుభవాన్ని మన మాటలలో చెప్పగలం. ఆ అనుభవాన్ని మరొకరికి అందింపగలం. అందుకే ఆ మార్మిక అనుభవాన్ని నా భౌతిక జ్ఞానకాలలోనికి, నా అంతరంగంలోనికి తీసుకురావాలి అనుకున్నాను. అలా అనుకుని, ఒక క్షణం ఆ అనుభవాన్ని నా అంతరంగంలో నింపేస్తే, క్షణం అంటే మీరు అనుకునే సెకండ్ కాదు. అది రెండు ఆలోచనలమధ్య ఉన్న సమయం. నేను గమనిస్తే, క్షణకాలంలో 1000 నుంచి 2000 పిలుపులకి ఆ శక్తి స్పందించటం చూసాను. ఆ ప్రార్థనలు, వినతులు, కోరికలు, ధ్యానం అన్నింటికీ ఈ శక్తి అటోమెటిక్ గా స్పందిస్తేం చేసి ఆశ్చర్యపోయాను. ఈ అనుభవాన్ని విశ్లేషించితే నాకు ఒక విషయం అర్థమయ్యింది. ఈ శరీరంద్వారా నేను పొందే ఆనందం, అందరికే దీక్షనివ్వటం, జ్ఞానోదయపు అనుభవాన్ని అందరికీ వివరించటం ఈ శరీరంతో ఉండే ఒకే ఒక ఉపయోగం. శరీరాన్ని కలిగి ఉండే లక్ష్యం అదే. ఈ శరీరంతో నేను పొందే ఆనందం అదే. అయితే నేను ఆకస్మాత్‌గా ఒక విషయాన్ని తెలుసుకున్నాను. అది ఈ శరీరంతో అవసరం లేకుండా, ఈ శరీరాన్ని ఉపయోగించకుండా నేను చేయదలచుకున్న పనులు చేయగలను అని. జైలులో శరీరం పడి ఉన్నా నేను చేయగలిగిన పనులు సజావుగా జరిగిపోతున్నాయి. అప్పుడు నాకు ఈ శరీరంతో అవసరం లేదుకదా అనిపించింది. అకస్మాత్‌గా నాకు తెలిసిన విషయం శరీరం లేకుండా నేను చేయాలనుకున్నవి, నాకు ఆనందాన్ని కలిగించే అన్నే చేయగలను అని. నాకు అప్పుడు అనిపించింది, అసలైన స్వేచ్ఛ అంటే అదే అని. అదే ఎవరైనా పొందగల అత్యున్నత అంతిమస్వేచ్ఛ. నిజానికి అందరూ కోరుకునే నిజమైన స్వేచ్ఛ అదే. మనం పొందాలనుకునే ఆనందాన్ని శరీరం లేకుండా కూడా పొందగలస్థితి అంతిమస్వేచ్ఛ. అప్పుడు అనిపించింది, భగవంతుడా! ఈ శరీరం నిజంగా అవసరం లేదుకదా! అని. కాని ఒక జవాబు నాకు స్పష్టంగా స్ఫురించింది. ఈ శరీరంతో కొంతవరకు వితర్చని కల్పించగలను. వారిలో విశ్వాసాన్ని కలిగించగలను. మరింత మందికి విశ్వశక్తి ద్వారా అవపరమైన జ్ఞానాన్ని దీక్షని ఈ శరీరం ద్వారా ఇవ్వగలను. అందుకే మాత్రమే ఈ శరీరంతో అవసరం ఉంది. ఎప్పుడైతే మీరు లోతైన కరుణ, ప్రేమలో స్థిరపడతారో మీరు ఆనందించాలనుకుంటే ఆనందించటానికి ఈ శరీరంతో అవసరం లేదు. మీరు రుచిని ఆనందించాలనుకున్నారసుకోండి, మీరు అహింస ప్రేమలో స్థిరపడినప్పుడు
Page 8
Page Number: 07
Content: శరీరం లేకుండానే అసందాన్ని పొందవచ్చు. ఏ వ్యక్తి అయినా అహింసలో స్థిరపడగలిగితే, అతను భౌతిక శరీరాన్ని ఉపయోగించకుండా, ఎటువంటి ఆనందాన్నైనా పొందగలడు. అందుకే దానిని అమృతం అంటారు. అమృతం అంటే పయస్సు అనేది లేదు, కాలంతో పనిలేదు. అదే నిజమైన స్వేచ్ఛ. కరుణలో స్థిరపడితే మీకు ఆ స్వేచ్ఛ దొరుకుతుంది. మనిషి చేసే అతి తెలివితక్కువపని, సమస్యలనుంచి బయటకు రావటానికి ప్రణాళికలు చేయటమే. మీరు సమస్యలలో ఉన్నప్పుడు, దానినుంచి బయటకు రావటానికి వేసే ప్రణాళికలన్నీ మీ సమస్యని మరింత కరిసంచేసి, మిమ్మలని మరిన్ని సమస్యలలోనికి తోస్తుంది. ఎందుకంటే, సమస్య ఏర్పడినప్పుడు సాధారణ మానసిక వ్యవస్థ భయం, ఆశలలో చిక్కుకు పోతుంది.అప్పుడు మీరు వ్యవహారాలు నడపుతారు, బేరాలాడతారు. జీవితంతో బేరాలు ఆడవచ్చు కాని జీవితంతో కాదు. మీరు జీవితంతో బేరాలాడలేరు. జీవితం అంటే పూర్తిగా ఆధీనమవటమే. ఒక విషయం అర్థం చేసుకొండి, మీ జీవితం కంటే పెద్ద జీవనవిధానం మీ జీవితంలో ఏర్పడినప్పుడు మీరు కదలిపోయారసుకొండి, దానిని సమస్య అంటారు. మీరు ఆ సమయంలో విరామంగా, స్థిరంగా ఉన్నారసుకొండి, అది బోధన అవుతుంది. మీ జీవితంలోనికి మీ జీవితానికంటే పెద్ద జీవితం కల్పించుకున్నదనుకొండి మీరు ఆ జీవితాన్ని కొలవలేరు. అది ఎలా ఉంటుందంటే కాలేజీలో రాగింగ్ చేయటానికి జూనియర్స్ కి అగ్రిపుల్ల ఇచ్చి పెద్ద హాలుని కొలవముస్తే ఉంటుంది. అదే విధంగా మీముందు జీవితం ఏర్పడుతుంటే మీరు ఇదంతా ఎందుకు అని ప్రశ్నించటమే. ఎందుకు? ఏమిటి? ఎలా? ఎప్పుడు అనే ప్రశ్నలన్నీ అగ్రిపుల్లలతో పెద్ద హాలుని కొలవటమే. మీ దగ్గర ఉన్న అగ్రిపుల్ల అనే ప్రమాణంతో జీవితాన్ని కొలవలేరు. మీ లోతు, వెడల్పు, ఎత్తులతో మీ జీవితాన్ని కొలవలేరు. ఆ విధంగా జీవిత సమస్యల్ని పరిష్కరించాలి అని ప్రయత్నిస్తే, మరింత రంగరంగోత్సం పరిస్తే పరిస్తున్న వారవుతారు. మీరు లోతైన దయ, సానుభూతిలో స్థిరపడగలిగితే, జీవితాన్ని యధాతధంగా, ఉన్న విధంగా మీరు స్వీకరించగలరు, దీనిని అభినందించగలుగుతారు. అప్పుడు జీవితాన్ని అదే విధంగా అనుభవించగలరు.
Page Number: 07
Content: నేను మీ అందరికీ చెప్పదలచుకున్న ముఖ్యమైన సత్యం, మీరు కరుణ, ప్రేమలో స్థిరపడండి. మీ అంతరంగంలో అహింస అనే భావం ప్రవహించే విధంగా చూడండి. నేను అహింస అనే మాటని ఒక సీతినియమంగా మాట్లాడటంలేదు. దానిని ఒక శాస్త్రంగా మాట్లాడుతున్నాను. దానిని జ్ఞానోదయపు శాస్త్రంగా మాట్లాడుతున్నాను. మీరు పూర్తి అసహాయులుగా ఉన్నప్పుడు ఇది మీకు సహాయం చేస్తుంది. ఏది మీకు ఆధారంగా నిలవలేనప్పుడు అహింస, దయ అనేవి మీకు ఆధారంగా నిలుస్తుంది. ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకునే ఒక పద్ధతిని మీకు చెబుతాను. మీతో మీరు విరామంగా ఉండండి. మీ అంతరంగంలోనికి మీ జీవితంలో మిమ్మలని బాగా బాధించిన వ్యక్తులని ఒకరి తరువాత ఒకరుగా పిలవండి. మీరు హేతుబద్ధంగా, తార్కికంగా ఒక విషయాన్ని విశ్లేషించండి. ఈ విధంగా ప్రశ్నించుకొండి, ఈ వ్యక్తిమీద నేను పగతీర్చుకుంటే నాజీవితం మారిపోతుందా? నాకు సంతోషమై, పరిపూర్ణత దొరకుతాయా? లేదు అలా ఎప్పటికీ జరగదు. ఒక విషయాన్ని అర్థం చేసుకోండి, మీరు ఏ మనుకుంటారంటే మీరు సమస్యలతో ఉన్నప్పుడు, మిమ్మలని సమస్యలకు గురిచేసిన వ్యక్తిమీద పగసాధించితే మీరు ఏదో సాధించానసుకుంటారు. అది సరికాదు. అది విజయం కాదు. ఆవిధంగా పగసాధించాక మీలో శూన్యం ఏర్పడుతుంది. మీకు సంపూర్ణమైన సాధికారత, తృప్తి అనేవి అసలు కలగవు. అది మీకు సంతోషమై ఇవ్వదు. అత్యంత విలువైన మీ ప్రాణ శక్తి వృధా అవుతుంది. అయితే ఒక వ్యక్తిమీద పగసాధించాక అకస్మాత్‌గా మీరు ఆ విషయాన్ని తెలుసుకుంటారు. మీలో తృప్తి అనే అసలు ఉండదు. అది మరింత అశాంతిని, సమస్యని సృష్టిస్తుంది. అందుకే చాల్సార్లు, ఎగ అనపోతే మ అంతరంగంలోంచి పూర్తిగా తనయింటికి చేరదు. దానిని వెళ్లించి బయటకి తోసేయండి. నేను ఇలా చెప్పినప్పుడు కొంతమంది అంటుంటారు, స్వామీజీ! ఇది ఒక అంతరంగపుభావన. దీనిని తీసివేయటం కష్టం అని.
Page Number: 07
Content: అది సరికాదు. మీరు ఏ భావనైనా 7 సార్లు విశ్లేషించి చూస్తే అది దాని ప్రభావాన్ని పోగొట్టుకుంటుంది. నేను మీకు ఒక ముఖ్యమైన క్లుప్తి, విషయాన్ని చెబుతున్నాను. ఏ భావం అయినా అది కోపం, కోరిక, ద్వేషం, పగ ఏదైనాసరే చేతనస్థితిలో, మీ అంతరంగంలో దానిని తార్కికంగా 7 సార్లు విశ్లేషించితే అది తన ప్రభావాన్ని పోగొట్టుకుంటుంది. అది మీ వీద ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు.
Page 9
Page Number: 08
Content: కోపం, ద్వేషం, పగ ఉన్న ప్రతి వ్యక్తిని మీ అంతరంగంలోనికి తీసుకరండి, మీరు ఎందుకు ఎలా మీరు ద్వేషించే ప్రతి వ్యక్తిని మీ అంతరంగంలోనికి పిలవండి. వారిని ద్వేషించటం, వారి మీద పగ తీర్చుకోవటానికి కాదు మీ జీవితం. అది మీకు ఎటువంటి పూర్తిస్వాన్ని సంతృప్తిని ఇవ్వదు అని చెప్పుకోండి. రక్తంతో రక్తాన్ని తుడవలేము, హింసతో హింసని మార్చలేము. కన్నుకి కన్ను అని అనుకుంటే ప్రపంచమంతా అంధులతో నిండిపోతుంది.
Page Number: 08
Content: స్పష్టంగా అర్థం చేసుకోండి, ప్రపంచమంతా అంధులతో నిండిపోతుంది. ఒక విషయం మీరు తెలుసుకోవాలి, మీరందరూ ఎప్పుడో ఒకసారి అయినా బాధని అనుభవించి ఉంటారు. బాధపడటం అనగానే నాకు నా శిష్యులు, నా అనుచరులు గుర్తోస్తున్నారు. నా మీద గొడవలు జరిగినప్పుడు వారంతా ఎన్నో నిందలు అనుభవించారు. వారి తప్పు ఏమీలేదు కాని వారిని అవమానించారు, కొంతమంది ఆశ్రమంలో ఉన్న బ్రహ్మచారులని కొట్టారు. మా ఆశ్రమాలు తగలపెట్టారు. కాని ఇవన్నీ ఏకారణం లేకుండా చేసిన పనులు. ఇంత జరిగినా నాకుఉన్న లక్షలమంది అనుచరులు, భక్తులు, శిష్యులలో ఒక్కరికూడా ఒక్కసారికూడా ఎవరిమీద ఒక రాయికూడా విసరలేదు. చెడుగా మాట్లాడలేదు. ఎంత చురాగతం జరిగినా మౌనంగా ఉండిపోయారు. నేను మీకు చెబుతున్నాను మీరంతే నాకు చాలా గర్వంగా ఉంది, చాలా గౌరవం కలుగుతుంది. మీ మౌనానికి నేను గర్విస్తున్నాను. అంత గందరగోళంలో కూడా నిశ్శబ్దంగా ఉండగలిగిన నా వారందరినీ చూసి చాలా ఆనందపడుతున్నాను, గర్విస్తున్నాను. మీరంతా మౌనంగా ఎంత వ్యధన అనుభవించారో నాకు తెలుసు. కానీ వారు సౌమ్యంగా, శ్రీరమైన అంతరంగంతో శాంతంగా ఈ సమస్యని ఎదుర్కొన్నారు.
Page Number: 08
Content: నీకోక చిన్న కథ చెబుతాను. ఒక అబ్బాయి తన 18 వ సంవత్సరంలో పుట్టిన రోజున తండ్రి దగ్గరకి వెళ్ళి 'అయ్యా! ఈ రోజు నా పుట్టినరోజు. నాన్నగారు ఇవాళ్ళతో నాకు 18 సంవత్సరాలు పూర్తిపుతాయి. నన్ను ఆశీర్వదించండి అంటాడు. తండ్రి చాలా సౌమ్యంగా, ప్రేమగా కొడుకుని దగ్గరకి తీసుకొని, 18 సంవత్సరాలు నీవు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చావు నేను నీకు పూర్తి స్వేచ్ఛని ఇస్తున్నాను. నన్ను తృప్తిపరచటానికి ఇక నీవు ఏమీ చేయనవసరం లేదు, ఇక నుంచి నీ నిర్ణయాలు నీవు చేసుకొని జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్టు గడపవచ్చు. నీకు నేను పూర్తి స్వేచ్చని ఇస్తున్నాను. ఒక కొడుకునుంచి తండ్రి పొందవలసిన ఆనందాన్ని నేను ఆశించినదానికంటే ఎక్కువగా నాకు అదిచాలు. నాకు పూర్తి సంతోషం కలిగింది. నీకు నేను ఇవాళ్ళనుంచి పూర్తి స్వేచ్ఛని ఇస్తున్నాను అంటాడు.
Page Number: 08
Content: దయచేసి ఈ విషయం అర్థం చేసుకోండి. మీ అందరికీ నేను అదే చెబుతున్నాను. ఎవరైతే ఆ రెండు నెలల సంక్షోభాన్ని, సమస్యని అహింసా పద్దతిలో ఎదుర్కొన్నారో, ఎవరైతే ఆ సమస్యలో పడి కదిలిపోకుండా స్థిరంగా నిలబడగలిగారో, సంస్ట మూలాల నుంచి వేరుకాకుండా నిలబడగలిగారో వారందరికీ నేను చెప్పేది ఆ తండ్రి చెప్పిన మాటలే నేను మీకు చెబుతున్నాను. మీరు నాకు అత్యుత్తమ ఆనందాన్ని ఇచ్చారు. శిష్యులనుంచి ఏమి కోరుకుంటానో అది నాకు తృప్తికలిగేలా మీరు ఇచ్చారు. ఇంతకు మించి మీ నుంచి నేను ఏదీ ఆశించటంలేదు. నేను మీకు పూర్తి స్వేచ్ఛని ఇస్తున్నాను.
Page Number: 08
Content: ఎవరైతే ఈ సమస్యని అహింసా పద్దతిలో ఎదుర్కొన్నారో మీరంతా అదే పద్దతి పాటించారు అని నాకు తెలుసు, ఎవరైతే ఈ పుకార్లు అనే గాలి దుమారంతో పాటు వెళ్ళిపోకుండా స్థిరంగా నిలబడగలిగారో వారందరికీ నేను చెప్పేది ఇదే, మీకు పూర్తి స్వేచ్ఛని ఇస్తున్నాను. మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను. చూడండి! కొన్ని తుఫానులకి పడ్చెట్లకి ఉన్న పూలు రాలిపోతాయి. బలంగా లేని, పూర్తిగా పక్వానికి రాని కాయలు రాలిపోతాయి. ఏ పూలు, పిందలు చెట్టుని అంటిపెట్టుకొని ఉంటాయో అవి సంపూర్ణమైన పండ్లువుతాయి. అవి నిజమైన పండ్లు. ఈ గాలి దుమారంలో చాలా పూలు, కాయలు రాలిపోయాయి. బలమైనవి మాత్రం వ్యక్తిత్వానికి అంటిపెట్టుకొని ఉండి అవి పళ్ళుగా మారి పరిపూర్ణ సిద్ధిని పొందుతాయి.
Page Number: 08
Content: మీరందరూ ఈ కష్టమైన సమస్యా కాలంలో అత్యంత కరుణ, ప్రేమ, అహింసలతో సమస్యని ఎదుర్కొని నాకు పరిపూర్ణమైన తృప్తిని ఇచ్చారు. ఇంత కంటే నేను ఇంకేమీ కోరుకోను. నాకు ఇంతకంటే మీ నుంచి ఏమీ అవసరంలేదు, ఈ తృప్తి చాలు.
Page Number: 08
Content: సరే! అంతరంగంలో పరిపూర్ణమైన స్వేచ్ఛని పొందాలి అంటే మీకు ఒక పద్దతి చెబుతాను. ముఖ్యంగా ద్వేషం కోపం నుంచి స్వేచ్ఛని పొందగలిగితే అది ఇచ్చే తృప్తి, ఆనందం అనంతమైనది.
Page 10
Page Number: 09
Content: మిమ్మల్ని బాధపెట్టినవారిని, మీకు కోపం ఉన్న వ్యక్తుల్ని ఒకొక్కరిని మీ అంతరంగంలోనికి పిలవండి. ప్రతి వ్యక్తి జీవితంలో షుమారు 10 నుంచి 20 మంది వ్యక్తుల మీద ద్వేషం, కోపం ఉండవచ్చు. అంతకు మీంచి ఎక్కువ ఎవరికీ ఉండరు. ఒకవేళ ఉంటే, మరేదైనా సమస్య ఉన్నది అని అర్థం, వారి ఎదురుగా ఉండి కోపకారణాన్ని హేతుబద్ధంగా విశ్లేషించి, ద్వేషాన్ని తీసివేయండి. మీలోని కోపాన్ని పగని తుడిచివేయండి. ఒక విషయం చెబుతాను అర్థం చేసుకోండి, మీరు బాధపడినప్పుడు మీ నరాల వ్యవస్థ ఎంత వ్యధకిందో, మీరు ఆ బాధని ఎంత బరువుగా మోసారో, ఎంత భారంగా మీకు అనిపించిందోకదా! మరి అటువంటి బాధని మీరు మరొకరికి ఇవ్వాలని ఎందుకుకుంటున్నారు. మరొకవ్యక్తి కూడా అదే విధమైన బాధని అనుభవించాలి అని మీరు ఎందుకుకుంటున్నారు. మీరు అవిధంగా అనుకోకూడదు. మీకు ఏదైనా బాధకలిగినప్పుడు, అదేవిధమైన బాధ మరొకరికి కలగాలి అన్న భావన రాక్షసం. వారినే రాక్షసులు అంటారు. తనకి ఏదైనా బాధ కలిగినప్పుడు ఇటువంటి బాధ మరేవరికీ రాకూడదు అన్న భావం దైవత్వం. వారు దైవసమానులు. మీకు బాధ కలిగినప్పుడు మీరు బాధలలో ఉన్నప్పుడు మీలో కలిగే స్పందన మీరు రాక్షసులా లేక దేవతలా అనే విషయాన్ని నిర్ణయిస్తుంది.
Page Number: 09
Content: మీరు జీవితంలో ఒక్కసారైనా గొప్ప ఆనంద పారవశ్యాన్ని సంతోషాన్ని అనుభవించి ఉంటారు. ఆ ఆనందాన్ని ఎదుటివారికి పంచటానికి ప్రయత్నించండి. అంతే కాని బరువైన వ్యధని ఎదుటివారికి పంచవద్దు. కాబట్టి మిమ్మల్ని బాధించిన వారిని ఒకరి తరువాత ఒకరిని మీ అంతరంగంలోనికి అహ్వానించి వారిని ఒక సారి విశ్లేషించి గౌరవంగా మీ అంతరంగం నుంచి వీడ్కోలు ఇవ్వండి. వారిని అత్యంత గౌరవంగా మీముంచి పంపించివేయండి.
Page Number: 09
Content: మీకు చెబుతున్నాను అర్థంచేసుకోండి. న్యాయనిర్ణయం చేయగలిగి, తీర్పునిచ్చేవారిని న్యాయమూర్తి (జడ్జి) అంటాము. న్యాయనిర్ణయం చేయగలిగిన వారిని భగవంతుడు అంటాము. కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టిన వారినందరినీ మీ అంతరంగపు కోర్టులో హాజరుపరచండి. ఎవరిమీద ఎటువంటి తీర్పులు నిర్ణయాలు చేయకుండా వారిని గౌరవంగా మీ నుంచి పంపించివేయండి. మీరు అలా చేయగలిగినప్పుడు అకస్మాత్‌గా మీరు విశ్వన్యాయమూర్తిగా, భగవంతునిగా అనిపిస్తారు. మీరు భగవంతుని శక్తిక్షేత్రంలో, ఆయన సమక్షంలో ఉన్న అనుభూతిని పొందుతారు. ఎప్పుడైతే మీరు భగవంతుని లక్షణాలతో, ఆ నాణ్యతతో జీవించచురో మీరే భగవంతుడవుతారు.
Page Number: 09
Content: నేను ఎప్పుడైతే ఇటువంటి పద్దతులని చేబిటే వెంటనే అన్మో! ఇలా చేయటం అసాధ్యమైన విషయం ఒక వేళ నేను ఇవాళ ఇలా చేయగలిగినా రేపు తిరిగి ద్వేషం, కోపం నాలోనికి రావని నమ్మకం ఏమిటి? ఈ విధంగా మీకు మీ పాత అపజయాలు, చేయలేకపోయిన ధ్యానసపద్దతులు గుర్తుస్తాయి వెంటనే మీరు ఇంతవరకూ ఏ పద్దతీ నాకు పనిచేయలేదు ఇది మాత్రం పనిచేస్తుందా? అని నిరుత్సాహపడతారు.
Page Number: 09
Content: మీరు రేపటి గురించి ఆలోచించవద్దు. ద్వేషంలేని చక్కని భావనని కొన్నాళ్ళుపోతేనా అనుభవించండి. ఇప్పుడే ఇక్కడే కూర్చొని మీ అంతరంగపు కోర్టులోనికి మీకు పగ ఉన్నవారిని అహ్వానించండి. ఒక్క నిముషంపాటు అహింసా, కరుణలతో మీ అంతరంగాన్ని నింపండి. అప్పుడు మీరు పొందే ఆ అంతరంగపు స్వేచ్ఛ ఎంత అందంగా ఉంటుందో అనుభవంతో తెలుసుకోండి.
Page Number: 09
Content: ఆ భావం శరీరంతో సంబంధంలేని ఒక అద్భుతమైన అనుభవం. అందుకే అంటాను ద్వేషం నుంచి పొందే స్వేచ్ఛ అంతిమస్వేచ్ఛ అని. అప్పుడు మీరు తెలుసుకునే విషయం ఇక నాకు ఈ శరీరంతో అవసరం లేదు అని, ఒక వేళ శరీరం ఉంటే అక్కడే ఉంటుంది; శరీరం లేకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది మీనుంచి ఏది తీసేసుకున్నా దానినే నేను స్వేచ్ఛ అంటాను. ఈ స్వేచ్ఛ మీ అంతరంగపు స్థితిమీద ఆధారపడి ఉంటుంది కాని మీ భౌతిక స్థితిమీద కాదు. ఆ అంతరంగపు స్థితిని మీరు పరిశీలించి, ఆ అత్యంతమైన స్వేచ్ఛని పొందగలగాలి. అప్పుడు మీరు అనుభవించిన నిజమైన అంతిమ స్వేచ్ఛ.
Page Number: 09
Content: ఇది చాలా చిన్న పద్దతి సులభమైనది కూడా మీరు నిశ్భలంగా కూర్చొని ఒక్కసారైనా ద్వేషంలేని అంతరంగపు అనుభవాన్ని పొందాలి అని నిర్ణయించుకోండి. మీ అంతరంగపు మూలాల్లో ఎక్కడా సూక్ష్మస్థాయిలో కూడా ఎటువంటి రహస్యపు ఆలోచన కాని, ఎవరిమీద అయిన పగసాధించాలన్న ప్లాసుకుని ఉండకూడదు. మీకు ఇలా అనిపించవచ్చు - ఆ వ్యక్తి దుర్మార్గుడు అతనిని క్రమించకూడదు. అతనిని క్రమించితే నన్ను చంపేస్తాడు కాబట్టి ఆ ఒక్క వ్యక్తిని మాత్రం క్రమించను అని మీరు ఈ విషయంలో విరామంగా ఉండండి.
Page 11
Page Number: 10
Content: నేను మీకు చెప్పేది ఒకటే, ఒకసారి ద్వేషపడలేని స్థితిని అనుభవంతో తెలుసుకోండి. అప్పుడు మీరు లోతైన, అద్భుతమైన స్వేచ్ఛని అనుభవిస్తారు. ఆ స్వేచ్ఛని కోలవలేరు. అది అంతిమ స్వేచ్ఛ. నా అనుచరులు, భక్తులు, శిష్యులు బాధపడినప్పుడు సానుభూతిని చూపించాను కాని బాధపడలేదు. నేనూ బాధపడితే సహాయం చేసేది ఎవరు? నాతోపలికి బాధ ప్రవేశించి మాయం అయ్యేది. ఆ తరువాత వారినుంచి బాధ తొలగిపోయేది నానుంచి కూడా. ఒక విషయం అర్థం చేసుకొండి, మీ కరుణ హింసమీద ఆధారపడి ఉంటే, మీరు బాధపడతారు, దానితో మరింత బాధన సృష్టిస్తారు. విధంగా కాకుండా మీ కరుణ, దయలమీద ఆధారపడి ఉంటే, మీరు ఎదుటివారి బాధలని తీసుకొని వాటిని మసి చేసేయగలుగుతారు. బాధలు అనేవి పూర్తిగా మాయం అయిపోతాయి. కాబట్టి నేను మీకు చెప్పేది ఏమిటంటే, మీరు కరుణలో స్థిరపడగలిగితే చాలు, అది ఏ సమస్యకైనా పరిష్కారాన్ని చూపి ఆ సమస్యనుంచి మిమ్మల్ని బయటకి తీస్తుంది. అందుకు ఉదాహరణ నాకు వచ్చిన సమస్య ఆ మూడునెలల సంక్షోభం, అంతమైద్ద సమస్యని నేను ఎదుర్కోగలగటానికి కారణం నేను కరుణ, అహింసలలో స్థిరపడగలగటమే. మీరు కరుణతో ఉంటే అన్ని చక్కగా జరుగుతాయి. ఆ స్థితినే నేను నిజమైన, అత్యుత్తమమైన అంతిమ స్వేచ్ఛ అంటాను. మీరందరూ ఆ స్వేచ్ఛస్థితిని పొందాలని ఆశీర్వదిస్తున్నాను. మీరంతా నిత్య ఆనందస్థితిని అనుభవిస్తూ దానిని వ్యాపింపచేయుదురుగాక నిత్యానందం.
Page Number: 10
Content: ఒక ప్రశ్నకి సమాధానంగా పరమహంస ఈ విధంగా జవాబు చెప్పారు. నేను జైలులో ఉన్నప్పుడు చాలా మంచి ధ్యానపద్ధతలని రూపొందించాను. అవి మీరు జ్ఞానోదయం పొందేవిధంగా సహాయం చేస్తాయి. అందుకే నేసంటాను, మీరు సన్మ జైలులోపెట్టినా నేను మీ స్వేచ్ఛకి మీ విముక్తికి ప్రయత్నిస్తాను. ఇది నిజమైన కరుణ అనలైన అంతిమస్వేచ్ఛ
Page 12
Content: నిజమైన ప్రేమ.మీరు ప్రేమించిన వారికి, మీకు ఇదరకీ స్వేచ్ఛనిస్తుంది.
Content: కారణం లేకుండా మీలో ప్రేమ, కరుణా పొంగి ప్రవహించినప్పుడు మీరు అంతిమ స్వేచ్ఛని పొందుతారు.
Content: మీరు శరీరం, మనస్సు అనే వాటినుంచి బంధవిముక్తులు కాగలిగితే బంధాలనుంచి స్వేచ్ఛని పొందుతారు.అప్పుడు మీరు చక్కని ప్రశాంతో అనంద స్థితిలో స్థిరపడగలుగుతారు.
Content: మనస్సు అనే బంధం నుంచి స్వేచ్ఛని పొంది, మేధస్సులో స్థిరపడగలిగితే మీరు పొందే అంతిమ స్వేచ్ఛ పరమానంద స్థితి.
Content: మీ అంతరంగంలో కరుణ, ప్రేమల నుంచి చేసేవన్నీ మీలో అంతిమ స్వేచ్ఛని మేల్కోలుపుతాయి.
Content:
- పరమహంస నిత్యానంద
Content: www.nithyananda.org Ph: Bidadi - 80 27202801, AP: 09440572543, 09494340692 Ebook ISBN: 979-8-88572-657-3
Content: వెల-4/-