1. isbn 979-8-88572-852-2.pdf
Page 1
Content: నిత్యధ్యానం
Content: విరామంతో నూతనోత్సాహాన్ని వ్యాపింప చేయండి
Content: నిత్యానంద ధ్యానపీఠం
Content: నిత్యానంద స్థితిని పొందే ఒక పద్ధతి
Page 2
Content: ఇందులో ఇచ్చిన ధ్యాన పద్దతులని నిత్యానంద ధ్యానపీఠం లేదా నిత్యానంద యూనివర్సిటీలో ఆచార్యులు పర్యవేక్షణలో నేర్చుకోవాలి. ఎవరైనా వారి వ్యక్తిగతంగా ప్రయత్నించితే దాని వలన జరిగే పరిణామాలకి నిత్యానంద ధ్యానపీఠం కాని యన్.వి.యన్.యు. కాని ఎటువంటి బాధ్యత వహించదు. అందుకు మీరే పూర్తి బాధ్యత వహించాలి.
Content: పబ్లిషర్స్ :నిత్యానంద వేదిక్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రెస్
Content: నిత్యానంద వేదిక్ సైన్సెస్ యూనివర్సిటీ యు.ఎస్.ఎ. వారి అనుబంధ సంస్థ
Content: కాపీరైట్ డిసెంబర్ 2007
Content: Ebook ISBN: 979-8-88572-852-2
Content: ఈ పుస్తకానికి సంబంధించిన అన్ని హక్కులు నిత్యానంద ధ్యానపీఠం యొక్క సొంతం. నిత్యానంద ధ్యానపీఠం నుంచి వ్రాతపూర్వకంగా అనుమతి తీసుకోకుండా బహిరంగంగా లేదా వ్యక్తిగత వినియోగం కోసం ఇందులోని ఏ భాగాన్ని యాంత్రికంగా, ఫోటోగ్రాఫిక్ లేదా ఫోనోగ్రాఫిక్ ప్రక్రియ లేదా ఏ ఇతర ప్రక్రియ ద్వారా పునరుత్పదించటం నిషిద్ధం.
Content: ఈ పుస్తకం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం నిత్యానందా ధ్యానపీఠం వారు చేపట్టే ధర్మకర్తృత్వ కార్యక్రమాల కోసం వినియోగించటం జరుగుతుంది.
Page 3
Content: నిత్యధ్యానం గురించి చెప్పెముందు, ఈ ధ్యానానికి సంబంధించి నా అనుభవం, ఈ ధ్యాన పద్దతి నాకు ఏవిధంగా తెలిసింది అనే విషయాలని మీకు క్లుప్తంగా వివరిస్తాను. నాకు జ్ఞానోదయం జరిగాక చాలా కాలంపాటు, అంటే కొన్ని నెలల పాటు నేను మౌనంలో ఉన్నాను. ఆ సమయంలో నేను ధ్యాన పద్దతుల మీద చాలా లోతుగా పరిశోధనలు చేసాను. ముఖ్యంగా ఈ ధ్యాన పద్దతుల ద్వారా నాకు కలిగిన అనుభవాన్ని ఇతరులకు జరిగే విధంగా ఎలా చేయాలి. అలా పరిశోధించే సమయంలో ముందుగా నాకు స్ఫురించినది, నా పరిశోధనల ఫలితంగా ముందుగా బయటికి వచ్చినదే ఆనందస్పురణ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని రూపొందించే పనిలో ఉన్నప్పుడు నేను మనలోని ఏడు శక్తి కేంద్రాలయిన, ఏడు ప్రధాన చక్రాల మీద బాగా పని చేసాను. ఈ చక్రాలని శుభపరచగలిగి, తిరిగి వాటిని శక్తివంతం చేయగల ఏడు ధ్యాన పద్దతులని రూపొందించాను.
Content: ఆనందస్పురణ తరువాత, నా పరిశోధనల నుంచి వచ్చిన కార్యక్రమం నిత్యానంద స్పురణ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనలోని ఏడు శక్తి శరీరాలకి సరిపడే విధంగా, అదేవిధంగా మరణ సమయంలో ప్రశాంతంగా, ఆనందంగా శరీరాన్ని వదలగలిగే విధంగా సహాయం చేయగల ధ్యాన పద్దతులని రూపొందించాను. ఆ తరువాత ధ్యానస్పురణ అని, ఆత్మస్పురణ కార్యక్రమం ఇలా చాలా కార్యక్రమాలని తయారు చేసాను. ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ ఆత్మసత్యాన్ని తెలుసుకునే విధంగా, అన్ని మార్గాల ద్వారా ఆ సత్యాన్ని తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాలని
Page 4
Content: తయారు చేసాను. ఈ విధంగా నేను వంద రకాలయిన ధ్యాన పద్ధతులని, నా కార్యక్రమాల ద్వారా రూపొందించాను. ఇందులో ప్రతీ ధ్యాన పద్దతి ప్రతి ఒక్కరిలోని వారి చేతనస్థితిని ఉన్నతస్థితికి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. అదే విధంగా వారి అసలయిన ఉనికి(ఆత్మ) సంబంధించిన విషయాల మీద ఈ ధ్యాన పద్ధతులు పని చేస్తాయి.
Content: నన్ను చాలామంది చాలాసార్లు, ఒక విషయం అడిగే వారు, ‘మేము ప్రతిరోజు ధ్యానం చేసుకునేందుకు వీలుగా మాకు ఒక ధ్యానపద్దతిని నేర్పించండి’ అని. వారు పదే పదే అడగగా నేను ఈ విషయం గురించి పని చేయటం మొదలు పెట్టాను.
Content: నేను ఈ విషయం గురించి చాలా లోతుగా ఆలోచించాను. నేను తయారుచేయబోయే ధ్యాన పద్ధతి నా బోధనలకి, నా అనుభవాలకి, నేను నమ్మిన తత్వానికి పూర్తి ప్రతినిధిగా, పూర్తిగా సరిపోయే విధంగా ఉండాలి. నా దృష్టిలో ఈ ధ్యాన పద్దతి పూర్తిగా ఉండి మన ఉనికి(ఆత్మ)కి సంపూర్ణంగా సరిపోయే విధంగా ఉండాలి. అది ఏదో ఒక విషయం మీద మాత్రమే ప్రభావం చూపించేదిగా ఉండకూడదు. అది సంపూర్ణంగా ఉండాలి అనేది నా లక్ష్యం.
Content: ఆ పద్దతి మనిషి యొక్క ఉనికి(ఆత్మ)ని పూర్తిగా ప్రభావితం చేసి, ఆ వ్యక్తిలో ఆచరణ మార్పుస్తేరగాలి. ఒక రోజు నాకు ఒక ధ్యానపద్దతి స్పురణకి వచ్చింది. అదే ఇప్పుడు నేను మీకు నేర్పించబోయే
Page 5
Content: నిత్యధ్యానం
Content: ధ్యానం. దీనినే నిత్యధ్యానం అంటాను. (ఎడిటేషన్ ఫర్ ఎన్టర్నల్ బ్లిస్). ఇది ఒక మెరుపులా నాకు కనిపించింది. ఒక్కసారిగా నేను ఈ ధ్యానంలోని వివిధ భాగాలను చూడగలిగాను. ఇందులో ఒక్కొక్క భాగం మరొక దానితో ఎలా సంబంధాన్ని కలిగి ఉన్నది, అదే విధంగా అన్ని భాగాలు కలిపి మనలోని చేతనస్థితిని ఏ విధంగా ఉన్నతస్థితికి తీసుకురావచ్చునో నాకు స్పష్టంగా కనిపించినది. నిత్యధ్యానం నేను చేసిన పరిశోధన ఫలితాలన్నింటిలోనికి ఉత్తమమయినది అని చెప్పగలను.
Content: ఇక్కడ మీరు ఒక ముఖ్యమయిన విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒక రుషిని మంత్ర ద్రష్ట (మంత్రాన్ని చూడగల వ్యక్తి) అని కూడా అంటారు. దీని అర్థం ఏమిటి అంటే, ఆయన సమాధిస్థితిలో ఉన్నప్పుడు ఒక మంత్రాన్ని కాని, ఒక పద్దతిని కాని తన దృష్టితో చూడగలుగుతాడు. అంటే ఆయన మంత్రాన్ని కాని పద్దతిని కాని సృష్టించాడు అని అర్థం కాదు. అవి ఆయనకి వెల్లడి అవుతాయి. సర్వాంతర్యామి సంపూర్ణమయిన శక్తి. అందులోనికి కొత్తగా ఏదీ సృష్టించనవసరం లేదు. కాబట్టి ఒక మంత్రం కానీ లేదా ఒక పద్దతి కానీ ఎవరో ఒక వ్యక్తి యొక్క సృష్టి కాదు. ఈ విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పాలి. ఈ పద్దతిని నేను సృష్టించాను అని చెప్పలేను. అవసరమయినప్పుడు ఆ పద్దతి దానంతట అదే రూపుదిద్దుకొని మీ ముందుకు వస్తుంది.
Content: ఇప్పుడు మీకు నిత్యధ్యాన పద్దతి వివరాలు చెబుతాను. ఈ ధ్యానపద్దతిలో మొత్తం ఐదు భాగాలు ఉంటాయి. మీకు ఒక్కొక్క భాగాన్ని వివరంగా చెబుతాను.
Page 6
Content: నిత్యధ్యానం
Content: ఒక పద్ధతి లేకుండా శ్వాస తీసుకోవటం (7 నిముషాలు (Chaotic Breathing)
Content: మీరు ముందు ఏడు నిముషాలు కళ్ళు మూసుకొని వజ్రాసనంలో కార్యోపవి. చేతులు నడుమ మీద ఉంచాలి. ఏడు నిముషాల పాటు మీరు ఒక పద్ధతి లేకుండా శ్వాస తీసుకోవాలి. గాలి తీసుకోవటం, వదలటం లోతుగా చేయాలి. ఒక పద్ధతిలో కాకుండా గాలిని తీసుకోవాలి. మీరు కేవలం మీ శ్వాస మీద హృద్రవే మీ ఏకాగ్రతని నిలపాలి. మీరే ఆ శ్వాస అయిపోవాలి. ఆధారంగా మన శరీరంలో శక్తి నిలహ్ర్త్రా (తలమీద ఉన్న) చక్రం నుంచి మూలాధార (వెన్నెముక క్రింది ఉన్న) చక్రం వైపుకు ప్రవహిస్తూ ఉంటుంది. వజ్రాసనంలో ఉప్పుడు, ఆ ఆసనం శక్తిని క్రింద నుంచి పైకి వెళ్ళే విధంగా సహాయం చేస్తుంది. ఇదైనా ఒక ఆధ్యాత్మిక సాధన ప్రారంభించాలి అని అనుకుంటే వారికి శ్వాస చక్కని ప్రారంభం. ఈ విషయంలో చాలా ధ్యాన పద్ధతులు ఉన్నాయి. ఏదైనా ఒక దాని మీద ధ్యాస పెట్టటం, మంత్రాన్ని లేదా ఏదైనా ఒక పదాన్ని ఉచ్ఛరించటం కూడా చేయవచ్చు. ఒక మంచి పద్ధతి
Page 7
Content: మన శరీరంలో రెండు రకాల వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి స్వచ్ఛందంగా పనిచేసేది, రెండవది అలా చేయని వ్యవస్థ. కాళ్ళు, చేతులని కదిలించగలగటం స్వచ్ఛంద వ్యవస్థకి ఉదాహరణ : మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాళ్ళని, చేతులని కదిలించగలరు. కానీ మీరు మీ మెదడు పనితీరుని మీ ఇష్టం వచ్చినట్టు చేయలేరు. అదే విధంగా శ్వాస వ్యవస్థని, గుండె కొట్టుకోవటాన్ని మీరు నియంత్రించలేరు. అది స్వచ్ఛందంగా పనిచేయవు. అయితే శ్వాస రెండు వ్యవస్థలకి సంబంధించినది. మీరు తెలుసుకోకపోయినా, పట్టించుకోకపోయినా శ్వాస ఆడుతుంది కాని ఆగదు. మీ ఏకాగ్రత మరాకదాని మీద ఉన్నప్పుడు కూడా శ్వాస మామూలుగానే తన పని తాను చేసుకుపోతుంది. అదేవిధంగా మీరు శ్వాసని నియంత్రించవచ్చు. ప్రాణయామం మొదలైనది శ్వాస నియంత్రణ గురించే. మీరు లోతుగా, నెమ్మదిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఆ విధంగా శ్వాసించవచ్చు. చాలా సమయం శ్వాసని బంధించవచ్చు. కొన్ని నిముషాల పాటు శ్వాసించకుండా ఉండవచ్చు. అందుకే శ్వాస మీదోని స్వచ్ఛంద వ్యవస్థకి, స్వచ్ఛందం కాని వ్యవస్థకి మధ్య ఉండే బంధం లాంటిది.
Content: అయితే మీరు శ్వాస ఆపి మరణించలేరు. ఎందుకంటే అది జీవించాలనే కాంక్షకి, మీ కోరికకి మధ్య జరిగే పోరాటం. జీవించాలి అనే కోరిక మీ ఆకాంక్ష కంటే బలమయ్యింది. నిజానికి మీలోని స్వచ్ఛందం కాని కదలికలన్నీ జీవించాలనే కోరిక ఆధారంగానే జరుగుతాయి. మీరు జీవిస్తున్నారు అంటే అది మీకు
Page 8
Content: జీవించాలి అన్న కోరికవలన మాత్రమే. కాబట్టి మీ ప్రతి శ్వాస కూడా మీరు జీవించాలనే కోరిక వలన మాత్రమే జరుగుతుంది.
Content: మీరు ఒక విషయాన్ని గమనించారో లేదో, మీరు శ్వాసించే పద్దతి, మీ శ్వాస మీ మానసిక స్థితిని బట్టి మారుతూ ఉంటుంది. మీలోని భావవేశాలు మీ శ్వాస క్రియ మీద ప్రభావాన్ని చూపిస్తాయి. మీరు ఆత్రుతతో ఉన్నప్పుడు మీ శ్వాస ఒక విధంగా ఉంటుంది. మీరు కోపంగా ఉన్నప్పుడు అది మారుతుంది. మీరు ప్రేమతో ఉన్నప్పుడు మీ శ్వాసలో నాణ్యతతో కూడిన మార్పు ఉంటుంది. కామోద్రేకంలో ఉంటే మరొక విధంగా ఉంటుంది. కాబట్టి మీ శ్వాస అనేది మీ భావవేశాల మీద ఆధారపడి ఉంటుంది. అది మీ మానసిక పరిస్థితికి అనుగుణంగా మారుతూ ఉంటుంది. మీరు తీవ్రమైన వత్తిడిలో (టెన్షన్) ఉన్నప్పుడు సాధారణంగా ఇచ్చే సలహా, లోతుగా శ్వాస తీసుకోమని. మీరు ఎప్పుడయితే లోతుగా శ్వాస తీసుకుంటారో అప్పుడు తేలికగా అవుతారు. వెంటనే రిలాక్స్ అవుతారు. అప్పుడు మీకు ఉన్న టెన్షన్ (మానసికమైన ఒత్తిడి) తగ్గుతుంది. మైండ్, శ్వాస అనేవి దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. మీరు శ్వాసించనప్పుడు, శ్వాస తీసుకోనప్పుడు ఆలోచించలేరు. మైండ్‌కి శ్వాస శక్తిని ఇస్తుంది. అది ఇంధనంలా పనిచేస్తుంది.
Content: శ్వాసని సంస్కృతంలో ‘ప్రాణ’ అంటారు. ప్రాణ అంటే నిజానికి శ్వాస కాదు. దాని అర్థం మనోవలికి శ్వాసతో ప్రవహించే శక్తి అని అర్థం. ఆ శక్తే జీవశక్తి. తైత్త్రేయ ఉపనిషత్తులో ఐదుకోశాలు (పంచకోశాలు) గురించి చెప్పబడింది.
Page 9
Content: అవి అనామయకోశ (భౌతిక శరీర తొడుగు) ప్రాణామయకోశ (శ్వాస తొడుగు), మానామయకోశ (మనస్సు అనే తొడుగు) విజ్ఞానామయ కోశ (మేధస్సు అనే తొడుగు) చివరిది ఆనందమయ కోశ (పరమానందపు తొడుగు). ఈ ఐదుకోశాలు మనలోని ఆత్మని ఉల్లిపాయలోని పొరలు మూసినట్టుగా మూసి ఉంచుతాయి. ప్రాణాయామ కోశ దగ్గర మీలోని కోరికలకి సంబంధించిన జ్ఞాపకాలు నిలువచేయబడి ఉంటాయి. మీ కోరికలు ఎక్కువగా బలంగా ఉన్నప్పుడు, శ్వాస బరువుగా, చాలా త్వరగా జరుగుతుంది. మీకు కోరికలు లేనప్పుడు శ్వాస నెమ్మదిగా విరామంగా ఉంటుంది. శ్వాస, మనస్సు (మైండ్) అనేవి కలసి ఉంటాయి. కాబట్టి ఒకదానిలో మార్పు వస్తే రెండవది కూడా మారుతుంది. ఇంతకు ముందు మన భావవేశాల బట్టి శ్వాస ఎలా మారుతుందో తెలుసుకున్నాము. అదేవిధంగా శ్వాసని నియంత్రించాలి అనుకుంటే, శ్వాస క్రమంలో మార్పులు తెస్తే, అవి నేరుగా మన భావవేశాలని ప్రభావితం చేస్తాయి. అదే విధంగా మన మానసిక వ్యవస్థని ప్రభావితం చేస్తాయి.
Content: మనలోని జ్ఞాపకాలన్నీ మన కండరాలలో దాచబడి ఉన్నాయి. నేను ఒక విషయాన్ని నమ్ముతాను. అది ఏమిటి అంటే, మనం మన శరీరంలో ఒక భాగాన్ని కోల్పోతే, దాని తాలూకా జ్ఞాపకాలని కూడా కోల్పోతాం. అంటే మర్చిపోతాం. మీరు ఈ చిన్ని ప్రయోగం చేసి చూడండి. మీరు మీ ఆకారాన్ని గుర్తు తెచ్చుకోండి. మీకు గతంలో జరిగిన ఏదైనా ఒక సంఘటనని గుర్తు తెచ్చుకోండి. అది అసాధ్యం.
Page 10
Content: మీ జీవితంలో ఏది గుర్తు తెచ్చుకోవాలి అనుకున్నా మీ ఆకారం అవసరం. ఎందుకంటే మీ జ్ఞాపకాలన్నీ మీ రూపంలో మీ ఆకారంలో నిలవ చేయబడి ఉన్నాయి. మీరు మీ అంతరంగంలో చాలా భావాలని అణిచివేసి ఉంచారు. ఆ కారణం వలన మీరు సరిగా శ్వాసించలేరు. మీ శ్వాస లోతు లేకుండా పైపైనే ఉంటుంది. మీరు అలా పైనే శ్వాసిస్తే, మీ లోపల అణిచివేయబడిన భావావేశాలు విడుదల కావు. అదే విధంగా కండరాలలో నిలవచేయబడిన మీ జ్ఞాపకాలు బయటికి రావు. అటువంటి శ్వాస మీ శరీరంలోని ప్రతి భాగాన్ని స్పృశించదు. మీరు అందరూ ఒక క్రమపద్దతిలో శ్వాస తీసుకుంటారు. మనలో అణచివేయబడిన సంస్కారాలు, మన పాత జ్ఞాపకాలు మన శ్వాసను ఒక క్రమ పద్దతిలో ఉండేలా చేస్తాయి. దాని ఫలితంగా మనం అటువంటి సంస్కారాలు అటువంటి భావావేశాలనే ఆకర్షించుతాము. మన వ్యవస్థలో ఉండే దేనికైనా జీవించాలి అనే తాపత్రయం ఉంటుంది. కాబట్టి మనలో అణిచివేయబడినది ఏదైనా, అది తనకి సౌకర్యంగా ఉండే పరిస్థితులని కల్పించుకుని అందులో స్థిరపడి, అభివృద్ధి చెందాలి అని చూస్తుంది. మీరు కోపాన్ని అణిచివేస్తే అది మీ వ్యవస్థలో ఉంటూ బయటికి రావటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది తనకి కావలసిన శ్వాసక్రమాన్ని సృష్టించి దాని ద్వారా తన ఉనికిని కాపాడుకుంటుంది. ఇదంతా ఒక చేధించలేని చక్రాన్ని సృష్టిస్తుంది. కాబట్టి మీ శ్వాస అంటే మీలో చేరుకుపోయిన మీ పాత జ్ఞాపకాలే (సంస్కారాలు).
Page 11
Content: నిత్యధ్యానం ఒక పద్దతిలేని, ఒక క్రమంలేని శ్వాసతో ప్రారంభమవుతుంది. మీరు ఎంతలోతుగా శ్వాసించగలిగితే అంతలోతుగా శ్వాస తీసుకోండి. ఎంత క్రమంలేకుండా (గడిబిడిగా) శ్వాస తీసుకోగలిగితే అంత క్రమం లేకుండా శ్వాస తీసుకోండి. అలా చేస్తూ మీరే శ్వాసగా మారిపోవాలి. స్పష్టంగా అర్థం చేసుకోండి, మీ శ్వాస లోతుగా ఉండాలి. అది ఎప్పుడూ పైపైన ఉండకూడదు. మీరు లోతుగా, ఒక పద్దతి లేకుండా శ్వాస తీసుకుంటే అదిమీలోని టెన్షన్‌ని బయటికి విడుదల చేస్తుంది. అలా జరగడం వలన మీలోని పాత సంస్కారాలన్నీ బయటికి పచ్చేస్తాయి. సాధారణంగా మన కండరాలన్నీ నిరంతరం ఒత్తిడికి లోనైవుంటాయి. క్రమం లేని లోతయిన శ్వాస ఒత్తిడిలో ఉన్న కండరాలని వదులు చేస్తుంది. అదేవిధంగా సంస్కారాలని శుభ్రపరుస్తుంది. మనలోని ఒక్కొక్క భావావేశం ఒక్కొక్క విధమయిన శ్వాస పద్దతిని తయారు చేస్తాయి. మీరు చిన్న పిల్లల శ్వాసను గమనించితే, అది చాలా లోతుగా, పరమానందంతోనూ ఉంటుంది. వాళ్ళు శ్వాసని పైపైన తీసుకోరు. అయితే వారు పెద్దవారయ్యేకొద్దీ, సమాజపు నిబంధనలు, వారిలోని బాధలు, వ్యధలు, సంతోషం, అపరాధభావం, నమ్మకాలు, ఒత్తిడి ఇలా చాలా రకాల భావావేశాలు వారిలోకి ప్రవేశించి, వారి శ్వాసలోని నాణ్యతని పూర్తిగా మార్చివేస్తాయి. ఇప్పుడు ఈ క్రమపద్దతిని కదిలించాలి అంటే, అదేవిధంగా కొన్ని సంపత్సరాలూ మీలో అణిచివేయబడిన భావావేశాలని కదిలించాలంటే, మీరు ఆ క్రమపద్దతిలోనికి
Page 12
Content: కల్లోలాన్ని పంపించాలి. మీరు లోపల గొప్ప సంక్షోభం లేదా గందరగోళాన్ని సృష్టించాలి, అంతేకాని దానిలోనికి మరొక పద్దతిని ప్రవేశపెట్టటం పరిష్కారం కాదు. పాత భావాలనన్నింటినీ బయటికి తేవాలి అంటే మీలో పెద్ద కల్లోలాన్ని సృష్టించాలి. అందుకే నేను మీకు ఒక పద్దతిలో ఉండే శ్వాస క్రియ అయిన ప్రాణాయామాన్ని చేయమని ఈ ధ్యానపద్దతిలో చెప్పను. కేవలం ఒక పద్దతి లేని శ్వాస సరియైనది. ఇటువంటి శ్వాస పద్దతి మీలోని పాత సంస్కారాలన్నింటినీ నాశనం చేస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే పండిన ఆకులున్న చెట్టుని కదిలించటమే. అప్పుడు పండిపోయిన ఆకులన్నీ రాలిపోతాయి. కల్లోలంగా ఉండే ఈ శ్వాస పద్దతి మీలో అణచివేయబడిన సంస్కారాల వ్యవస్థని కుదిపివేయటమే. అప్పుడు మీలోని పాత సంస్కారాలన్నీ కూడా బయటకి వెళ్ళిపోతాయి. లోతుగా శ్వాస తీసుకోవటం వలన, ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ మనలోనికి పంపబడుతుంది. అదేవిధంగా మన శరీరం నుంచి కార్బన్‌డైఆక్సైడ్ బయటికి పంచేస్తుంది. అలా ఎప్పుడైతే అధికంగా బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు మీరు కొత్త ఉత్సాహంతో ఉంటారు. రక్తంలోనికి ఆక్సిజన్ ఎక్కువగా వెళ్ళటం వలన, మీ శరీరంలోని భాగాలు అన్నీ జీవంతో, ఉత్సాహంగా ఉంటాయి. అప్పుడు మీ శరీరంలో ప్రతి కణం జీవశక్తిని అధికంగా సృష్టిస్తాయి. సాధారణంగా అందరం బాల-బాలికలూ నిర్జీవమైన అణువులతో కూడిన ఒక ఘన పదార్థంగా అనిపిస్తాము. ఎందుకంటే మన శరీరం జీవశక్తితో ఉండదు.
Page 13
Content: ఈ శరీరం నిరంతరం వత్తిడి కంగారులతోనే ఉంటుంది. ఏదైతే ఆతృతతో, టెన్షన్‌తో ఉంటుందో అది జీవశక్తితో ఉండదు. ఎప్పుడైతే లోపలికి అధికంగా ఆక్సిజన్ పంపించి, శరీరంలోని ప్రతి భాగాన్ని జీవశక్తితో నింపుతామో అప్పుడు మన శరీరం తేలిక అయినట్టు మనం తెలుసుకుంటాము. అప్పుడు మీకు మీరు ఒక పదార్థంలా కాకుండా, ఒక శక్తిగా తెలుసుకోగలుగుతారు. మీలోని పాతజ్ఞాపకాలు, సంస్కారాల వలన మీకం మీరు చాలా బరువుగా అనిపిస్తారు. కొన్ని బౌద్ధ ఆశ్రమాలలో, సన్యాస దీక్షని ఇప్పటానికి ఈ పద్ధతిని ఉపయోగించుతారు. వాళ్ళు చేయవలసిన కొన్ని ఆధ్యాత్మిక సాధనలు చేసాక వారిని గడ్డి మీద నడిపించుతారు. అలా నడచినప్పుడు అక్కడ గడ్డి నలిగి దారి ఏర్పడితే, ఆ వ్యక్తికి సన్యాస దీక్షని ఇవ్వరు. ఆ వ్యక్తికి మరికొంతి ఆధ్యాత్మిక సాధనలు చేయాలి అని నిర్ధారించుతారు. ఏ వ్యక్తకయితే అతనిలోని సంస్కారాలు అతి తక్కువగా ఉంటాయో అటువంటి వ్యక్తి గడ్డి మీద నడిస్తే గడ్డి నలగదు, దారి ఏర్పడదు. ఎందుకంటే అటువంటి వారు తేలికగా ఉంటారు. వారిలో సంస్కారాల బరువు వుండదు.
Content: ఎప్పుడయితే లోతైన శ్వాస ద్వారా మన శరీరంలోనికి అత్యధికంగా ఆక్సిజన్ వెళుతుందో, అది మనలోని అణచివేయబడిన వ్యవస్థని జీవంతో ఉత్సాహపరుస్తుంది. దానికి ప్రాణం వస్తుంది. అందుకే మీ శ్వాస క్రమంగా, లోతుగా, తీప్రంగా ఉండాలి. మీరే ఆ శ్వాస అయిపోయాలి. అప్పుడు మీలో సృష్టించబడిన జీవశక్తి మీ కండరాలలోని, మీ వ్యవస్థలో నిలువ చేయబడిన సంస్కారాలని కరిగించి వేస్తుంది. ఆ శక్తి సంస్కారాలని శుభ్రం చేస్తుంది. అప్పుడు మీరు శక్తివంతులుగా ఉత్సాహంగా తేలికగా ఉంటారు.
Page 14
Content: పరమానందంతో ఉంటారు. ఆ తరువాత రెండవ దశ మొదలుపెడతాము. క్రమబద్దత లేని శ్వాసకి సంబంధించిన ధ్యాన పద్దతులు కావాలి అంటే మీరు దుఃఖహరణని సాధన చేయవచ్చు. ఆ ధ్యానాన్ని మీకు ఆనందస్పురణ కార్యక్రమంలో నేర్పించుతారు.
Page 15
Content: తీవ్రంగా హావ్మింగ్ చేయడం (7 నిమిషాల సమయం)
Content: రెండవ దశలో కూడా మీరు ప్రాణాన్నే కార్పొని, మీ చెవతలని చిటికెమిడిలో వంచి మీ మోకాళ్ళు మీద పెట్టాలి. అలా కార్పొని మీద ఎంత బాగా చేయగలిగితే అంత తీవ్రంగా, అంత గట్టిగా అంత ఎక్కువ సేపు హావ్మింగ్ చేయండి.
Content: మీరు మీ తెలిసినవే తత్వాన్ని (అవేర్నెస్) హావ్మింగ్ పైననే ఉంచాలి. మీరే హావ్మింగ్ చేస్తున్నట్లు అనిపించవలె ప్రయత్నమొనరే ప్రవాహం తగ్గుతుంది ఎందుకంటే మీ మైండ్లో నిరంతరం హావ్మింగ్ కోసం పట్టు జరుగుతుంది. మనసం ఎవరితోనూ కలయటానికి పాట్లుపడకపోవడం వలన కాని మన అంతరంగంలో నిరంతరం హావ్మింగ్ ఉంటాము. హావ్మింగ్ అనేది ఈ అంతరంగపు మాటలను తగ్గించటంలో లేదా ఆపటంలో సహాయం చేస్తుంది.
Content: సాధారణంగా ఎవరైనా ఆలోచనలు లేకుండా కార్పొలేరు. మీరు ఈ క్షణిని వ్యవస్థ మేరకు ప్రాణాయామమే చేస్తున్నట్లు భావించి మీ మైండ్ అడ్డగిస్తుంది. ఇది మొదట్లో పొడవు పయస్సునారిలో అథవా ఎక్కువదూరం వ్యాకేళిస్తుంది. దానికి నిత్యం కార్పొనటం అభ్యాసం.
Page 16
Content: ఎనో సంవత్సరాలుగా పరుగులు పెట్టటానికి అలవాటుపడిన మనస్సుని అకస్మాత్‌గా కూర్చోమని చెబితే, అది వ్యతిరేకిస్తుంది. చాలాసార్లు చాలామంది ఏమంటారంటే, 'మేము ఆలోచనలు లేకుండా కూర్చోవాలి అని కూర్చున్నప్పుడు మాకు ఎక్కువ ఆలోచనలు వస్తాయి' అని. కొన్ని సంవత్సరాలుగా మనస్సు నిష్ఠబ్ధం అంటే ఏమిటో తెలియకుండా గడిపింది. ప్రారంభంలో అటువంటి మైండ్‌ని నిష్ఠబ్ధంలో ఉంచాలి అంటే ప్రవాహానికి ఎదురు ఈదటమే. అలా ఎదురు ఈదే సమయంలో ప్రవాహం సహజంగానే వ్యతిరేకిస్తుంది.
Content: ఈ సమయంలోనే చాలామంది ధ్యానాన్ని వదిలివేస్తారు. వాళ్ళు చాలా నిరుత్సాహపడి, ధ్యానం నాకు సాధ్యపడే విషయం కాదులే అని నిర్ణయించుకుంటారు. నేను చెపుతున్నాను, అర్థం చేసుకోండి, సాధకులు అందరికీ ప్రారంభదశలో ఈ సమస్య ఉంటుంది. మీరు మీ ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నాన్నే నేను తపస్సు అంటాను. మీరు ప్రారంభంలో నిరుత్సాహపడితే, ముందుముందు ఈ విషయంలో విజయం సాధించలేరు.
Content: మనకి తెలిసిన పురాణకథ, అమృతం కోసం దేవతలు, అసురులు పాల సముద్రాన్ని చిలుకుతారు. వారు సముద్రాన్ని చిలుకుతుంటే అందులోంచి ముందుగా వచ్చినది భయంకరమైన కాలకూట విషం. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయమేకదా! కానీ వాళ్ళు ఆపకుండా అలా చిలుకుతునే ఉంటారు. అప్పుడు చాలా వస్తువులు వస్తాయి. చివరగా అమృతం వస్తుంది. ఇదంతా ధ్యానాన్ని విపరిస్తూ చెప్పే ఒక కథ మాత్రమే. ఇదంతా ధ్యానం, అక్కడ జరిగే మొత్తం ధ్యాన క్రమాన్ని
Page 17
Content: నిత్యధ్యానం
Content: కథ రూపంలో చెప్పటమే. ధ్యానం ద్వారా మనస్సుని జ్ఞానోదయం కోసం చిలికినప్పుడు ముందుగా బయటికి వచ్చేవన్నీ మనలో అణచివేయబడిన వ్యతిరేకపు భావాలు, సంస్కారాలు మాత్రమే. కాబట్టి ముందుగా వచ్చేవి వ్యతిరేకమైనవే. అందుకే మీరు నిరుత్సాహపడకూడదు. ఇలా జరగటం అనేది మీరు చేస్తున్న పనిలో అభివృద్ధిని సూచిస్తుంది. మీరు ఆగకుండా అత్యున్నత స్థితిని చేరేవరకూ ధ్యానాన్ని సాధన చేయండి.
Content: ప్రారంభ దశలో నిరంతరం ఈ లోపలి మాటలు మిమ్మల్ని చాలా విసిగిస్తాయి. తీవ్రంగా, లోతుగా మీరు హమ్మింగ్ (పెదాలు మూసి మ్..... మ్... అనే శబ్దం) చేస్తే అది ఉపయోగపడుతుంది. అది మీ మైండ్‌ని నిశ్శబ్దంగా చేస్తుంది. మన అంతరంగపు మాటలు అనవి మనిపూరక, స్వాధిష్ఠాన చక్రాల మధ్య సృష్టించబడతాయి. ఈ ప్రాంతాన్ని ‘హర’ అంటారు. మనం లోతుగా, తీవ్రంగా హమ్మింగ్ చేసినప్పుడు ఆ హమ్మింగ్ తరంగాలు నాభి ప్రాంతంలో క్రింద వరకూ వ్యాపించిన అనుభూతిని మనం పొందగలం. అప్పుడు మనం నిరంతరంగా జరుగుతుండే అంతరంగపు మాటల ప్రవాహాన్ని ఆపగలం. హామ్మింగ్ అనేది మన ‘హర’ ప్రాంతాన్ని కుదిపినట్టు చేస్తుంది. అందుకే హమ్మింగ్ అనేది మన నాభికి క్రింద నుంచి జరగాలి.
Content: మనలోని అంతరంగపు మాటలే మన మనస్సు అనేది ఏర్పడటానికి గల ఒక్కే ఒక్క కారణం. కాబట్టి మనస్సు (మైండ్) అంటేనే మన అంతరంగపు మాటలు. హమ్మింగ్ చేయటం ద్వారా మీరు అంతరంగపు మాటలని తగ్గించగలిగితే, మీరు
Page 18
Content: ఆటోమేటిక్గా, ఎటువంటి ప్రయత్నం లేకుండా, మైండ్లేని స్థితి (ఆలోచనలు లేని లేదా సో ఫైండ్ స్టేట్)కి చేరగలుగుతారు. అప్పుడు మీ ఉనికిలోని మరోక కోణాన్ని అనుభూతి పొందగలుగుతారు.
Content: ఒక మంచి కారు డ్రైవర్కి, తన కారులోని అంతర్గతంగా ఉండే వివరాలన్నీ క్షుణ్ణంగా తెలుస్తాయి. ఉదాహరణకి, వేగం మారినప్పుడు మాత్రే కారు శబ్దం ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా అతనికి అర్థం అవుతుంది. ఇంజను శబ్దంలో చిన్న మార్పు వచ్చినా అతను వెంటనే గుర్తించగలుగుతాడు. ఇంజనులో ఏదైనా తేడా ఉంటే అది తెలసుకుని వెంటనే దానిని బాగు చేయగలుగుతాడు. అయితే ఈ విషయాలు ఏవీ ఆ కారులో ప్రయాణించే వారికి ఎవరికీ తెలియదు. కేవలం నైపుణ్యంగల డ్రైవర్కే తెలుస్తుంది.
Content: అది విధంగా, ఈ ధ్యానం మీరు ప్రతి రోజూ సాధన చేస్తే, మీరు చేసే హమ్మింగ్ శబ్దం, తీవ్రత ఆధారంగా, మీ హమ్మింగ్ లక్షణాలని బట్టి మీరు మీ శరీరంలో జరిగే మార్పులని అర్థం చేసుకోగలుగుతారు. ఉదాహరణకి మీకు పడని పదార్థాలు తిన్నారనకండి. మీకుమీ హమ్మింగ్లో తేడా తెలుస్తుంది. అప్పుడు మీరు ఆ తేడాలని సరిచేసుకోవచ్చు. అంతే. మీరు ప్రతి రోజు ఈ ధ్యానం చేసేటప్పుడు అందులో ఉండే తేడాల బట్టి శరీరంలోని మార్పులను మీరు బాగుచేసుకోగలరు.
Content: దానితో హమ్మింగ్ సాధారణంగా ఉండే విధంగా మీరుకొరబరు మలచుకో గలరు. హమ్మింగ్ మీ శరీరంలో జరిగే సూక్ష్మ ప్రకంపనలని గమనించగలదు. అదే మీరు శరీర వ్యవస్థని బాగుచేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. అయితే ఇదంతా దానంత అదే జరుగుతుంది.
Content: మనం ప్రయత్నపూర్వకంగా ఏమీ
Page 19
Content: నిత్యధ్యానం చేయనవసరం లేదు. మన శరీరం, మనస్సు ఎప్పుడూ ఒక దగ్గర ఉండవు. నేనెప్పుడూ అంటుంటాను, శరీరం ఇక్కడ ఉన్నది అంటే మీరు కచ్చితంగా ఇక్కడ లేరు అని అర్థం. మీ మనస్సు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. మన శరీరానికి స్వభావసిద్ధమయిన తెలివితేటలు ఉంటాయి. ఆ తెలివి నిరంతరం పని చేస్తూ ఉంటుంది. అయితే మనస్సు మాత్రం ఆ విషయాన్ని అసలు ఒప్పుకోదు. అది శరీరాన్ని ఏవో కొన్ని పనులకు పురికొల్పుతుంది. అదే అనారోగ్యాల రూపంలో బయటపడుతుంది. అనారోగ్యం అంటే ఆరోగ్యం లేకపోవటమే. శరీరం మనస్సు సౌకర్యంగా లేకపోవటమే. శరీరాన్ని బలవంతంగా పరుగులు తీయించితే అది ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా తిరగబడుతుంది. మీరు ఎన్నోసార్లు అధికంగా తింటారు. మీ శరీరం మీకు ఇక చాలు నిండుగా ఉన్నది అని సూచనలని ఇస్తుంది. కానీ మనస్సుకు తృప్తిలేదు. దానికి ఇంకా కావాలి. అప్పుడు మీరు శరీరంలోనికి ఆహారాన్ని ఇంకా ఇంకా నింపుతూ ఉంటారు. దానితో శరీరానికి జరగవలసిన హాని జరుగుతుంది. దీని ఫలితాన్ని, ఆ దెబ్బని తరువాత తెలుసుకుంటారు. శరీరానికి, మనస్సుకు అతీతంగా వెళ్ళాలి అని అనుకుంటే, ఈ రెండింటిని పరస్పర సమన్వయపరచాలి. అలా చేయలేకపోతే, మనం మనస్సిక - శారీరక తత్వంలో చిక్కుకోతాము. అప్పుడు మనలో మార్పురావటం కష్టమవుతుంది. హ్మి్మంగ్ అనేది శరీరానికి మనస్సుకు మధ్యవారధిని నిర్మించే చక్కని పద్ధతి.
Page 20
Content: [SKIPPED page 20 - repeated NVIDIA JSON error]
Page 21
Content: నిత్యధ్యానం
Content: అలా కొంతసేపు చేసాక హమ్మింగ్ అనేది అప్రయత్నంగా జరిగిపోతుంది. మీరు కేవలం దానిని గమనిస్తూ ఉంటారు. మీ మనస్సు, శరీరం ఆ హమ్మింగ్ ప్రకంపనలని ప్రతిధ్వనిస్తూంటాయి.
Content: వజ్రాసనంలో కూర్చొని, మీ చేతి వేళ్లని “చిన్‌ముద్ర లోపుంచి చేతులని మోకాళ్ళ మీద పెట్టి హమ్మింగ్ చేయాలి. చిన్ ముద్ర అంటే చేతి వేళ్ళతో ఒక గుర్తు. దీనిలో చూపుడువేలు బొటన వేలు చివరలు కలిపి, మిగతా వేళ్ళు పూర్తిగా తెరచి ఉంచాలి. చిన్‌ముద్ర మనలోని శక్తిప్రవాహాన్ని నియంత్రిస్తుంది. అదేవిధంగా మనలో సృష్టించబడిన శక్తి మన శరీరంలో ఉండే విధంగా చేస్తుంది. అది శక్తిని మన శరీరం నుంచి పోనీయదు.
Content: ఈ విధంగా మొదటి రెండు దశలు, క్రమబద్దతలేని శ్వాస, హమ్మింగ్ చేసాక, ఆ తరువాత దశకి వెళ్ళాలి. ఇందులో మనం మన శరీరంలోని సూక్ష్మ ప్రాంతాలలోకి ప్రవేశించుతాము.
Content: హమ్మింగ్ గురించి ఇంకా వివరంగా సాధన చేయాలి అని అనుకుంటే మీరు మహామంత్ర ధ్యాన పద్దతిని సాధన చేయవచ్చు. మహామంత్ర ధ్యానం మీరు ఆనందస్సురణ కార్యక్రమంలో నేర్చుకుంటారు.
Page 23
Content: నిత్యధ్యానంలోని ఈ దశని మీరు వజ్రాసనంలో కూర్చోని అయినా చేయవచ్చు లేదా పద్మాసనంలోనైనా చేయవచ్చు. ఇప్పుడు మీరు మీ తెలుసుకునే తత్వాన్ని (అవేర్‌నెస్) మూలాధార చక్రం నుంచి సహస్రార వరకు తీసుకువెళ్ళాలి.
Content: మన శరీరంలో ఏడు శక్తి కేంద్రాలు ఉన్నాయి. ఈ ఏడు శక్తి కేంద్రాల స్థానాల గురించి మనం తెలుసుకోవాలి.
Content: మనలో మూడు రకాల చేతన స్థితులు ఉంటాయి. అవి : జాగృత్ స్థితి, స్వప్న స్థితి, సుషుప్త స్థితి (గాఢమయిన నిద్ర) ఈ శరీరాలకి, చేతనస్థితికి అతీతంగా మన నిజమయిన ఉనికి, మన ఆత్మ ఉంటుంది. దీనిని ఏవిధంగా అయినా పిలవవచ్చు.
Content: సంస్కృతంలో ఆ అత్యుత్తమస్థితిని శరీర త్రైవలక్షణ, పంచకోశాతీత, అవస్థాత్రయోశక్తి అంటారు. ఈ పదాలకి అర్థం, మూడు శరీరాలని పరిశీలించేది, కోశాలకి అతీతమయినది, మూడు చేతన స్థితులని గమనించేది.
Content: భౌతిక శరీరం అంటే మనకి తెలిసిన శరీరం. ఈ శరీరంతోనే మనం
Page 24
Content: ఎక్కడకయినా వెళ్ళగలం, తినగలం ఇలా మనకి తెలిసిన అన్ని పనులు చేస్తాము. ఇది జాగృత్ స్థితి. మానసిక శరీరం లేదా సూక్ష్మ శరీరం అనేదానిని మనం కలలో చూస్తాము. మీరు మీ శరీరంతో భారతదేశంలో నిద్రలో ఉండవచ్చు కానీ మీ మనస్సు మేరే దేశాలకి వెళుతుంది. అప్పుడు మీరు ఉపయోగించే శరీరమే సూక్ష్మ శరీరం. ఈ శరీరాన్ని మీరు మేలుకొని ఉన్నప్పుడు కూడా ఉపయోగించుతారు. అందుకే నిరంతరం ఆలోచనలు అనేవి జరుగుతూ ఉంటాయి. కారణ శరీరాన్ని మనం కలలు లేని గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు ఉపయోగించే శరీరం. మనం నిద్రపోయే సమయంలో మొత్తం గాఢమైన నిద్ర ఆలోచనలు లేని నిద్రయొక్క వృత్తాన్ని కొన్నిదశలలో చెప్పవచ్చు. అదే మీరు కారణ శరీరంలో పొందే అనుభూతి.
Content: ఈ మూడు శరీరాలు మనం అనుకున్నట్టు వరువరుగా ఉండవు. అవి ఒకదానికొకటి గట్టిగా పట్టుకొని, పెనవేసుకొని ఉంటాయి. ఒక కాగితం మీద మెళికలు తిరిగిన గీతలు ఒకదానిని ఒకటి పెనవేసుకున్నట్టు గీసారనుకోండి, అవి ఏడు చోట్ల ఒకదానికొకటి అంటుకొని ఉంటాయి. అందులో ఒక గీత భౌతిక శరీరం అయితే, మిగిలిన రెండు గీతలు సూక్ష్మ మరియు కారణ శరీరాలు అనుకోండి. అవి ఒకదానిని ఒకటి కలిసే ఏడు ప్రదేశాలే ఈ ఏడు చక్రాలు, భౌతిక, సూక్ష్మ, కారణ శరీరాలు ఒకదానినొకటి కలనే ప్రదేశాలు. అవి భౌతికంగా మనకంటికి కనిపించని స్థితిలో ఉంటాయి. ఈ మధ్యన జరిగిన కొన్ని పరిశోధనలలో ఆరాని ఫోటో తీయగల టెక్నాలజీతో ఈ
Page 25
Content: చక్రాలని కూడా ఫోటో తీయగలిగారు
Content: ఈ ఏడు శక్తి కేంద్రాలు, మనలోని ఏడు భావావేశాలకి సంబంధించి ఉంటాయి. మనలోని భావావేశాలు మనం కొన్ని జన్మలుగా సంతరించుకొని మనలో నిలువచేసిన సంస్కారాలు, అణిచివేయబడిన జ్ఞాపకాల వలన వస్తాయి. మనలోని సంస్కారాలు శక్తి కేంద్రాలలోనికి శక్తిని ప్రమేశించనీయకుండా అడ్డుకుంటాయి. దాంతో మన భౌతిక మానసిక వ్యవస్థలో మార్పులు వస్తాయి.
Content: మనలోని చాలా అనారోగ్యాలు కేవలం మానసికమయినవి. వాటి పేర్లు మన మానసిక వ్యవస్థలో ఉంటాయి. మనం చూసేది వాటి ప్రభావాన్ని మాత్రమే. అయితే మనం నిజానికి శరీర, మానసిక వ్యవస్థని తెలుసుకోము. శరీరానికి మనస్సుకు మధ్యయున్న సంబంధం మనకి తెలియదు. ఎప్పుడయితే ఒక చక్రం బంధింప బదుతుందో ఆ చక్రం ఉన్న ప్రాంతంలోని శరీరం అనారోగ్యంగా అవుతుంది. మీరు చాలాసార్లు గమనించి ఉంటారు. మీరు ఎక్కువ బాధపడితే మీకు కడుపులో గడబిడలు వస్తాయి. అందుకే మీరు ఈ శక్తి కేంద్రాలని శుభపరుస్తూ ఉండాలి. అప్పుడే శారీరకంగా, మానసికంగా మీరు ఆరోగ్యంగా ఉండగలరు.
Content: ఈ చక్రాలని ఏ భావావేశం బంధిస్తుంది, ఆ చక్రం ఎలా వికసిస్తుంది అనే పట్టికని ప్రక్కపేజీలో ఇచ్చాను.
Content: ఊహలు, కల్పనలు : భయం, బాధ, శ్రద్ధని అతిచింతనం, అసూర్య, అహంకారం, అసంతృప్తి ఇలాంటి భావావేశాలు వ్యతిరేకాలు. అవి అసలు ఉండవు.
Page 26
Content: వాటికి ఉనికి ఉండదు. ఈ గదిలో ఏదైనా ఒక వస్తువు ఉన్నదనుకొండి, దానిని బయట పెట్టాలి అంటే మీరు దానిని మీ చేతో తీసుకొని బయటపెడతారు. దానికి ఉనికి ఉంది కాబట్టి చేతోతీసి బయటపెట్టగలిగారు. కానీ గదిలో ఉన్న చీకటిని మీరు బయటపెట్టగలరా? అలా బయటపెట్టలేరు, ఎందుకంటే దానికి ఉనికి అనేది లేదు. అందుకే దానిని తీసి బయటపెట్టలేము. మీరు దీపం వెలిగేస్తే అప్రయత్నంగా చీకటి పోతుంది.
Content: చీకటి లాగానే భావావేశాలకి కూడా ఉనికి లేదు. వాటిని మీ నుంచి తీసివేయలేరు. మీరు చేయగలిగిన పని ఒక్కటే, అది మీలోపలికి తెలుసుకునే తత్వం అనే వెలుగుని తీసుకురావటమే. అప్పుడు మీలోని వ్యతిరేక భావాలు మాయం అయిపోతాయి.
Content: ఒకసారి బుద్ధుడు ఒకతాడుని ముడివేసి, తన శిష్యులని ఆ తాడు ముడి తీయమని అడుగుతాడు. శిష్యులు చాలామంది దానిని అటులాగి ఇటులాగి మరింత కరినంగా తయారుచేస్తారు. అప్పుడు ఒక శిష్యుడు వచ్చి ఆ ముడిని జాగ్రత్తగా గమనించుతాడు. ఆ తరువాత నెమ్మదిగా దానిని విప్పుతాడు. అప్పుడు బుద్ధుడు ఈ విధంగా చెబుతాడు, మీలోని అజ్ఞానం అనే ముడిని విడదీయాలి అంటే ముందుగా దానిలోపలికి జాగ్రత్తగా చూడటం నేర్చుకోవాలి. మీ అంతరాత్మలోనికి తెలుసుకునే తత్వాన్ని నేర్చాలి. అప్పుడు ఆ ముడి ఎలా పడిందో గమనించితే బాటు మీలోని వ్యతిరేకభావాలు మాయం అయిపోతాయి.
Page 27
Content: కాబట్టి నిత్యధ్యానంలోని ఈ దశలో మనం మన తెలుసుకునే తత్వాన్ని పూర్తిగా ప్రతి చక్రం మీదా, మూలాధార నుంచి సహస్రార వరకూ ఉంచుదాము. ఎప్పుడైతే మిమ్మల్ని శక్తికేంద్రం మీద మీ తెలుసుకునే తత్వాన్ని పెట్టమంటారో అప్పుడు మీరు ఆ శక్తికేంద్రమయిపోవాలి. ఆ శక్తి కేంద్రాన్ని మీ సర్వం శక్తిమయిపోయింది అనే అనుభూతిలో నింపండి. ఈ దశ తరువాత మీరు పూర్తిగా శక్తివంతులవుతారు. చాలా తేలిక అయిన అనుభూతిని పొందుతారు. ఇప్పుడు మనం తరువాత స్టెప్ప్‌లోకి వెళతాము.
Content: మీకు ఏడు చక్రాల గురించి వివరంగా నేర్చుకోవాలి అని అనుకుంటే మీరు ఆనందస్పురణ అనే కార్యక్రమాన్ని చేస్తే అందులో ప్రతి చక్రం గురించి చాలా వివరంగా తెలియచేస్తారు. ఒక్కొక్క చక్రం ఒక్కొక్క భావావేశానికి ఎలా సంబంధించి ఉంటుందో వివరిస్తారు. దానికి తగిన ధ్యానపద్దతిని కూడా నేర్పిస్తారు.
Page 28
Content:
- ములాధార చక్రం
Content: కల్పనలు, ఊహలు
Content: నిజాన్ని స్వీకరించటం
Content: 2. స్వాధిష్టాన చక్రం
Content: మరణ భయం
Content: మరణాన్ని స్వీకరించటం
Content: 3. మణిపూరక చక్రం
Content: బాధలు, వ్యధలు
Content: బాధపడకుండా ఉండటం
Content: 4. అనాహత చక్రం
Content: శ్రద్ధని ఆశించటం
Content: స్వార్థం లేని ప్రేమ
Content: 5. విశుద్ధి చక్రం
Content: పోలిక, అసూయ
Content: వారిలోని ప్రత్యేకతని తెలుసుకోగలగటం
Content: 6. ఆజ్ఞ చక్రం
Content: గంభీరత, అహంకారం
Content: అమాయకత్వం, సామాన్య జీవితం
Content: 7. సహస్రార చక్రం
Content: అసంతృప్తి
Content: కృతజ్ఞత
Page 29
Content: బంధవిముక్తికి తలుపు (సహజం 7 విధాలు) తలుపు తెరవాలంటే నిముషాల పూర్తి బంధవిముక్తిలాగా ఉండాలి. మనసు అంతే ఆలోచనల తీగలు, ఆలోచనల ప్రవాహం. ఒక ఆలోచన తరువాత మరొక ఆలోచన మరియు ఉంటుంది. సహజంగా ఒక ఆలోచనకి మరొక ఆలోచనకి సంబంధం ఉండదు. అవి చెరువులో గాలివడగలలాగా విడివిడిగా ఉంటాయి. చెరువులోని గాలిబోర్గల ఒక దానితో ఇంకొక దానికి ఎటువంటి సంబంధం కూడా ఉండదు. అవి దానికదే వేరుగా ఉంటాయి కానీ శూదటానికి ఒక దానికి ఒక వైసలా కనిపిస్తాయి. అదే విధంగా ఆలోచనలు కూడా ఒకదానికొకటి ఎటువంటి సంబంధం లేకుండా ఉంటాయి. కాకపోతే అలా సంబంధం కూడా ఉంటూ అనిపిస్తుంది మీరు ఈ చిన్న ఎక్సర్‌సైజ్ చేయండి. మీకు వచ్చిన ప్రతి ఆలోచనని అదే విధంగా ఒక పేరు మీద ప్రయత్నం కయినింపాలు నిశ్చలంగా కూర్చొని మీకు వచ్చిన ఆలోచనలను జాగ్రత్తగా ఒక పేరు పెట్టండి. దానిని వ్రాసుకోండి. ఇలా వ్రాయగలిగితే దానిని గమనించగలగడం అంటే బంధవిముక్తి.
Page 30
Content: గమనించండి. ఎప్పుడయితే ఆలోచన వస్తుందో వెంటనే పేపరు మీద వ్రాయండి. ఆ విధంగా పదినిముషాలపాటు చేయండి. పదినిముషాలు అయ్యాక మీరు వ్రాసినదాన్ని చదవండి. అది ఒక పిచ్చివాళ్ళ డైరీలా ఉంటుంది. అదంతా ఒక పెద్ద గందరగోళంలా ఉంటుంది. మీరు ఒకసారి ఒక కప్పు కాఫీ తాగాలి అని అనుకుంటారు. వెంటనే ఏదో ఆఫీసు విషయం ఆలోచిస్తారు. ఇక్కడ కప్పు కాఫీకి, ఆఫీసులో ఉన్నపనికి ఎటువంటి సంబంధం లేదు. రెండు వేరు వేరు సంఘటనలు. ఒక వేళ ఒక విషయానికే సంబంధించి రెండు ఆలోచనలు వచ్చినా అవి రెండూ పూర్తి స్వతంత్రమయిన ఆలోచనలు. ఒకదానికొకటి సంబంధం లేనివే. కాబట్టి ప్రతి రెండు ఆలోచనల మధ్య ఖాళీ ఉంటుంది. ప్రతి రెండు ఆలోచనల మధ్య కొంత కాలం నిశ్శబ్దం ఉంటుంది. అంటే రెండు ఆలోచనలు దానికి అదే స్వచ్ఛంగా ఉంటాయి కాని బంధాలతో ఉండవు.
Content: ఎప్పుడయితే మనం ఈ ఆలోచనలకి లింకులు ఏర్పరుస్తామో అప్పుడే సమస్యలు ప్రారంభమవుతాయి. మనం మనసు వదిలేస్తే చాలు, అది ఒక దానికొకటి లింకులు ఏర్పరచి బాధలు పడుతుంది. ఉదాహరణకి పదిసంవత్సరాల క్రితం మీరు ఇస్క్రీం తిని సంతోషపడ్డారు. అయిదు సంవత్సరాలక్రితం ఇస్క్రీం తిని సంతోషపడ్డారు సంవత్సరం క్రితం ఇస్క్రీం తిని సంతోషప్డ్డారు. రెండు నెలల క్రితం ఇస్క్రీం తిని సంతోషప్డ్డారు. నిన్న ఇస్క్రీం తిని సంతోషప్డ్డారు. ఈ అనుభవాలన్నీ మీరు ఒక చైనులా సంబంధం ఏర్పరచి ఇస్క్రీం తింటే సంతోషంగా ఉంటుంది అని ఒక
Page 31
Content: ఊహో గాలుసుని నిర్మించుకుంటారు. కాబట్టి భవిష్యత్‌లో కూడా మీరు సంతోషపడటానికి ఈ పనిని తిరిగి చేస్తారు. ఈ విధంగా దగ్గర పోలికలు ఉన్న ఆలోచనలన్నింటీ కలిపి ఒక కృత్రిమమయిన గాలుసుని తయారు చేసుకుంటారు. దాంతో ఐస్‌క్రీం తింటే నాకు సంతోషం కలుగుతుంది అని మిమ్మలని మీరు నమ్మించుతారు. ఎందుకంటే ఆలోచనలకి లింకులు పెట్టి దానిని ఒక చైనులా చేయటానికి మీరు అలవాటు పడ్డారు కాబట్టి మీరు అలా అనుకుంటారు. అందుకే మీకు తెలియకుండానే ఐస్‌క్రీం తింటే నాకు సంతోషం కలుగుతుంది అనే భావనని ఒప్పుకుంటారు.
Content: మనకి బాధకలిగించే అనుభవం కూడా అంటే. పది సంవత్సరాల క్రితం మీరు అనుభవించిన బాధ, ఎడిసంపత్సరాల క్రితం అనుభవించిన బాధ, మూడు సంవత్సరాల క్రితం అనుభవించిన బాధ అన్నీ విడివిడిగా ఉండే ఆలోచనలు. ఒక దానికి ఇంకొకటి సంబంధం లేనివి. కానీ వీటినన్నిటినీ కలిపి వాటికి ఒక దానితో ఇంకొకదానికి లింకులు పెట్టి ఒక ఊహాజనితమయిన గాలుసుని ఏర్పరచుకొని, ‘నా జీవితమే బాధలు మయం’ అని ఆలోచిస్తారు. అలాగే మీకు జీవితంలో ఆనందపడిన సంఘటనలు ఎక్కువగా ఉంటే, నా జీవితం ఆనందమయం, అనుకుంటారు. అయితే ఇది కూడా నిజం కాదు. మీ జీవితం సంతోషం కాదు. వృధా భరితం కాదు. ఎందుకంటే విడివిడిగా ఉన్న ఆలోచనలని ఒక దానితో కలపటమే తప్పు కాబట్టి ఇవి రెండు కూడా తప్పే. ఆలోచనలని కలపటం అనే కలపటమే తప్పు
Page 32
Content: భావన తప్పు. మనం మనకి గుర్తున్న ఆలోచనలని మాత్రమే ఒక దానికి మరొకటి కలిపి ఒక చైెనుని తయారు చేస్తాము. ఇది ఎలా ఉంటుందంటే పూల గుత్తులనుంచి ఒక్కొక్క పూవుని తుంపి ఒక పూలదండని చేసినట్టుగా కొన్ని లక్షల ఆలోచనలనుంచి కేవలం కొన్ని ఆలోచనలని మాత్రం దండలా తయారు చేసి అదే జీవితం అనుకుంటాము. ఇలా దండలు చేసి జీవితానికి అన్వయించుకోవటమే అసలయిన పాపం. ఎప్పుడయితే ఆలోచనలకి లింకులు ఏర్పరచి దండలు తయారు చేస్తామో మనం బాధ పడతాము.
Content: మీరు సంతోషం అనే గొలుసుని తయారుచేస్తే ఆ గొలుసు ఇంకా పొడిగించాలి అని అనుకుంటారు. ఎందుకంటే ఆ సంతోషాన్ని పొందాలి అనుకుంటారు. అదేవిధంగా బాధలతో దండను తయారుచేస్తే దానిని మీరు తెంపాలని చూస్తారు. ఎందుకంటే బాధలు పడటం మీకు ఇష్టం ఉండదు. మీరు అటువంటి దండలని పొడిగించలేరు. అదేవిధంగా దానిని తెంపలేరు. ఎందుకంటే నిజానికి అటువంటి దండ అనేది లేదు కాబట్టి, గొలుసు అనేది ఒక ఊహ. దానిని సృష్టించడం కూడా కేవలం మరొక ఊహ మాత్రమే.
Content: మీ అనుభవాలన్ని ఒక దానితో మరొకటి ఎటువంటి సంబంధం లేని స్వతంత్రమైన అనుభవాలే. ఎప్పుడయితే మీరు ఈ అనుభవాలని ఒకదానితో ఒకటి కలిపుతారో మీకుమీరు నరకాన్ని సృష్టించుకున్న వారవుతారు. మీకు మీరు బాధలని సృష్టించుకుంటారు. బాధపడటం కూడా ఒక నరకమే అని ఇప్పుడు మీకు
Page 33
Content: నిత్యధ్యానం
Content: అర్థమవుతుంది. ఇదంతాకూడా ఒక ఊహ మీద ఆధారపడినదే. ఇది అలా కనిపిస్తుంది, అంటే. ఆ దండ అసత్యం. దానికి ఎటువంటి ఉనికి లేదు. కాబట్టి ఆ దండ సృష్టించిన వ్యధ కూడా అసత్యమే. ఎప్పుడైతే మీరు ఈ విషయాన్ని తెలుసుకుంటారో అప్పుడు మీరు స్వేచ్ఛని పొంద గలుగుతారు.
Content: మన ఆలోచనలు చాలా బలమైనవి. అందుకే అవి మరొక ఆలోచనతో బంధం ఏర్పరచుకొని, ఒక ఊహాజనితమైన గోలుసులా తయారవుతాయి. ఈ విధంగా అసత్యమైనవి సృష్టించటం అహం చేసే ముఖ్యమైన పని. అహంకారం ఆలోచనలు వేరువేరు కాదు. ఆలోసలు లేదా అహం యొక్క లక్షణం ఇటువంటి దండలని లేదా చైనులని తయారు చేయటమే. కాబట్టి నిజానికి అహం అనేది లేదు. ఎందుకంటే అది తయారుచేసిన దండ ఒక ఊహ కాబట్టి. దండ ఒక ఊహ. అహం అనేది ఒక దండని తయారుచేసే ఒక క్రమానికి మనం ఇచ్చిన పేరు. ఒక విధమైన చోడిగింపుని ఇవ్వటం ఈ గోలుసు లక్షణం. అదే ఒక ఊహాజనితమైన అహంకారం.
Content: ఇప్పుడు ఇక్కడ మన ఆలోచనలు ఒక దానితో ఒకటి బంధం ఏర్పరచు కుంటాయి. మనం మనకి అహం అనేది ఉన్నది అని అనుకుంటాము. కానీ మన ఆలోచనలన్నీ స్వతంత్రమైనవి కాబట్టి అహం అనేది కేవలం ఒక ఊహ మాత్రమే. కాబట్టి సహజసిద్ధంగా మనం స్వతంత్రులం. బంధాలు లేని వారం. మనందరం జ్ఞానోదయం అయినవారమే. కాకపోతే ఆవిషయాన్ని మనం తెలుసుకోగలగాలి.
Page 34
Content: ఒక సారి ఒక బౌద్ధగురువు దగ్గరకి ఒక శిష్యుడు వచ్చి ఆయనని, ‘గురుదేవా! నేను ఏవిధంగా బుద్ధాని కాగలను’ అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువుగారు శిష్యుడికి ఒక గట్టి చెంపదెబ్బ ఇస్తారు. అలా కొట్టి, ‘నీవు బుద్దవే’ అని చెబుతారు. బుద్ధుడు వచ్చి నేను ఎలా బుద్ధిడిగా కాగలను అంటే ఎలా ఉంటుంది? మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఆ బౌద్ధగురువు కూడా అదేవిధంగా స్పందించాడు. కాబట్టి మనందరం, సహజంగా స్వేచ్ఛగల వారమే. కాకపోతే ఆ విషయం మనకి తెలియదు. దానిని మీరు అర్థం చేసుకోవాలి.
Content: ఒక వ్యక్తి అతని గమ్యం ఆధారంగా సంతోషాన్ని కాని, దుఃఖాన్ని గాని, అనుభూతిని పొందుతాడు. మీకు ఆ ఎంపిక లేదు. మీరు సంతోషాన్ని కాని, దుఃఖాన్ని కాని ఎంచుకోలేరు. అంటే అతి జీవితంలో ఉంటాయి, జరుగుతాయి. అయితే ఈ అనుభవాలని ఒక దానితో ఒకటి కలిపి ఒక చైనుని తయారు చేయాలా, వద్దా అనేది పూర్తిగా మీ నిర్ణయం, మీ ఎంపిక. మీరు ఒక వ్యక్తికి కానీ లేదా ఒక వస్తువుకు కాని దగ్గర అవ్వటం, వారితో తేడా వాటితో అనుబంధం పెంచుకోపటం అన్నే కూడా మీరు అనుభవాలని ఒక దండలా చేయటం వలన జరుగుతుంది. ఒక సంబంధ బాంధవ్యంలోని మీ ఐదు సంవత్సరం క్రితం అనుభవం, నిన్నటిది, వాటికి అనే వేరువేరు అనుభవాలు. మీరు ఎప్పుడయితే ఈ అనుభవాలని ఒక దానితో ఒక దానిని బంధాన్ని ఒక దండలా చేస్తారో అప్పుడు మీరు దానిని పొడిగించాలని కానీ లేదా దానిని తెంచాలని కాని ప్రయత్నిస్తారు. పాత అనుభవం
Page 35
Content: నిత్యధ్యానం
Content: మీకు సంతోషాన్ని ఇస్తే భవిష్యత్‌లో కూడా మీరు ఆ అనుబంధంలో సంతోషం ఉన్నది అని అనుకుంటారు. ఆ విధంగా కాకుండా ఆ సంబంధం మంచిది కాదు అని అనుకుంటారు. అయితే ప్రతి ఒక్క అనుభవం కొత్తది అనే విషయం మాత్రం మీకు తెలియదు. ఎందుకంటే ఇద్దరువ్యక్తులు కలసిన ప్రతిసారి కొత్తవ్యక్తులే. దీనికి కారణం మనం సహజసిద్ధంగా స్వేచ్ఛాజీవులం.
Content: మన నిజమయిన సమస్య బాధలవలన లేదా సంతోషం వలన వచ్చినది కాదు. మన సమస్య ఈ విషయాలని మనం తప్పుగా అర్థం చేసుకోవటం దానితోపాటుగా ఊహాజనితమయిన అనుభవాల దండలని తయారు చేయటం. యోగీశ్వరుల విషయంలో ఇది ఎలా ఉంటుందంటే - వాళ్ళు సంతోషం కలిగినప్పుడు సంతోషపడతారు, దానిని మర్చిపోతారు. బాధలు కలిగినప్పుడు బాధపడతారు, దానిని వదిలివేస్తారు. అంటే వారు బాధలని, సంతోషాలని కాలంతోపాటు మోస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం అనుభవాలని మోస్తుంటామో, అలా ఎంతకాలం మోస్తుంటామో అంతకాలం మనం బాధలు పడతాము.
Content: ఈ ప్రపంచంలో జీవిస్తూ అన్నింటికాల అనుభవాలని పొందుతూ, మనం ప్రశాంతంగా, నిశ్చలంగా ఉండగలం. బయట ప్రపంచానికి సంబంధించి మనం దేనిని వదిలివేయనవసరం లేదు (సన్యసించ నవసరం లేదు). తక్కువ స్థాయిలో ఉంటే నాది అనేడానిని వదిలి వేయాలి. ఒక్కసారి మనం అనుభవాల గొలుసులని సృష్టించటం మానివేయగానే మనం దేనినైతే పట్టుకుని వేళాడుతున్నామో అదే మన
Page 36
Content: దుఃఖానికి కారణం అని తెలుసుకోగలుగుతాము. ఎప్పుడయితే నేను అనే ముద్రని మీరు పదితీస్తారో, మీరు పరమానందంలోనికి ప్రవేశిస్తారు. అప్పుడు బయట జరిగే విషయాలు మీ నిశ్చలతని బంగపరచవు. మీరు ప్రతి సంఘటనని ఒక దానికొకటి కలిపే పద్దతిని మానివేయండి. అప్పుడు ప్రతి సంఘటన ఒక కొత్త అనుభవం అని తెలుసుకుంటారు. అప్పుడు జీవితాన్ని మరింత అందంగా చూడగలుగుతారు. అప్పుడు ప్రతిదీ ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది. మీరు దేనినైనా యధాలాపంగా తీసుకోవటం మూనేస్తారు.
Content: ఒకసారి జీవితాన్ని ఏ క్షణంలో జరిగిన దానిని ఆ క్షణంలోనే తీసుకోవటం ప్రారంభిస్తారో, మీలో పరమానందం సహజంగా కలుగుతుంది. బయట ప్రపంచంలో జరిగే సంఘటనలు ఏవి అయినా మీరు కావాలి అని అనుమతిస్తేనే మీమీద ప్రభావాన్ని చూపిస్తాయి. మీరు నిశ్బ్దంగా అనుమతిని ఇచ్చినప్పుడే ఎవరైనా మీ నిశ్చలతని పాడు చేయగలుగుతారు. కొందరు ఏమని పిర్యాదు చేస్తారంటే, మేము ప్రశాంతంగా, ఆ క్షణంలోనే జీవించేవిధంగా ఉంటాము. కానీ మాచుట్టూ ప్రక్కలవారు అది అధనుగా తీసుకొని మమ్మలని బాధిస్తారు అని అంటారు. స్పష్టంగా అర్థం చేసుకొండి, మీరు నిశ్బ్దంగా అనుమతించకపోతే ఎవరూ మీకు బాధ కలిగించరు, ఎవరూ మీ ప్రశాంతతని భంగపరచలేరు. ఈ విషయాన్ని మీరు ఎప్పుడయితే అర్థం చేసుకుంటారో, అప్పుడు పరమానందం సహజంగా మీలోనికి వస్తుంది.
Page 37
Content: ఆది శంకరాచార్యుల వారు నిర్వాణశతకంలో ఈ విధంగా చెబుతారు, 'సదా మే సమత్వం సముక్తిర్ న బంధం, చిదానందరూప శివోహం శివోహం.' నేను స్వచ్ఛమయిన చేతన స్థితిని. అదే శివశక్తి. బంధాలు, స్వేచ్ఛ అనేవి కేవలం మనస్సు కల్పించినవే. స్వేచ్ఛ అనేది బంధనాలు ఉన్నప్పుడే ఉంటుంది. ఎప్పుడైతే బంధాలు లేవో, స్వేచ్ఛ తన అర్థాన్ని కోల్పోతుంది. ఈ విషయాన్ని ఆదిశంకరాచార్యులు ఇక్కడ చెబుతున్నారు.
Content: మీరు అంతరంగంలోనికి వెళ్ళినా, బయట ప్రపంచంలోనికి వచ్చినా, మీరు ఎక్కడికి వెళ్ళటానికి ప్రయత్నించినా మీరు సత్యాన్ని పోగొట్టుకుంటారు. ప్రయాణిచటం అనే కార్యక్రమమే మిమ్మలని సత్యం నుంచి వేరు చేస్తుంది. సత్యం ఇక్కడ ఇప్పుడు ఉంది. దానికోసం మీరు ఎక్కడికీ వెళ్ళనవసరం లేదు. ఎక్కడికీ ప్రయాణించనవసరం లేదు. మరలా ఈ వెళ్ళటం అనే విషయమే మరొక దండనితయారు చేస్తుంది. మనం ఏదో అభివృద్ధిని చూస్తాము. కాని నిజానికి అసలు అభివృద్ధి అని ఏదీ ఉండదు. ఎందుకంటే అక్కడ అభివృద్ధి చెందుతూ ఎవరూ లేరు .ప్రతి వ్యక్తీ క్షణ క్షణం కొత్తగా ఉంటారు. ప్రతిక్షణం మరణించి కొత్తగా జీవిస్తారు. మరి అప్పుడు ఎవరు అభివృద్ధి సాధిస్తారు. మీరు ఎప్పుడైతే ఈ బంధాలనుంచి స్వేచ్ఛ పొందుతారో అప్పుడు మీరు 360° లో విస్పోటకంలా వ్యాపించుతారు. అటువంటి సందర్భంలో మీరు అప్పుడు బాహ్యప్రపంచానికి చెందిన వారా లేదా ఆధ్యాత్మికులా అనే ప్రశ్న తల ఎత్తుతుంది. అందుకే శంకరాచార్యులు తాను స్వేచ్ఛ
Page 38
Content: కలిగిన వాడిని కాదు బంధాలలోని వాడిని కాదు అని చెబుతారు. ఈ రెండూ కూడా కేవలం విషయాలు. అంతే.
Content: మన ఆత్మ అనేది ఎప్పటికీ అభివృద్ధి చెందదు. కొంతమంది సెల్ఫ్‌డెవలెప్‌మెంట్ అనే కార్యక్రమాలు చేస్తారు. ఏ సెల్ఫ్ లేదా ఏ ఆత్మని మీరు అభివృద్ధి చేయగలరు. అసలు అటువంటిది ఏమైనా ఉందా? మీరు అంటేనే ఒక దానికి ఒకటి ఎటువంటి సంబంధం లేని ఆలోచనలు మాత్రమే. మీరు ఆత్మాభివృద్ధి (సెల్ఫ్ ఇంప్రూవ్ మెంట్) అంటే తిరిగి మీరు ఒక ఊహాజనితమయిన చైనుని తయారు చేయటమే. అది మీకు బాగుంది అనే భావనని ఇస్తుంది. అంతే. మీకు ఆత్మాభివృద్ధి జరిగింది అనే ఒక ఆలోచన ఉండవచ్చు. కాని అది కేవలం బాగుంది అనే ఒక భావన మాత్రమే. నిజం చెప్పాలి అంటే ఆత్మ అనే దానిని అభివృద్ధి చేయలేరు. కాకపోతే మీలో ఉండే ఊహాజనితమయిన మీరు కాని మిమ్ములని తొలగించవచ్చు. మీరు ఎంతకాలం సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్, ఆత్మాభివృద్ధి అంటారో అంతకాలం మీరు ఊహాదండని తయారు చేస్తున్నారని అర్థం.
Content: మనస్సు అనేది ఉన్నంత వరకూ అసత్యమైన గుర్తింపుతో మిమ్ములని మీరు తెలుసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. శంకరాచార్య ఈ విధంగా చెబుతారు, ‘బ్రహ్మం సత్యం జగత్ మిథ్యా, జీవో బ్రహ్మైవ న అపరా: దీని అర్థం, బ్రహ్మం అంటే సత్యం. కాని ప్రపంచం అసత్యం. వ్యక్తిగా ఆత్మకి బ్రహ్మంకి తేడా లేదు’ ఆయన మాటలకి అర్థం ఏమిటి అంటే, మనస్సు అనేది ఉన్నంత కాలం
Page 39
Content: నిత్యధ్యానం
Content: ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు నిరంతరం భవిష్యత్, భూత కాలాలో తిరుగుతూ ఉంటాయి. వర్తమానం గురించి అసలు ఆలోచన అనేది ఉండదు. వర్తమానం అంటే ఈ క్షణంలో కేవలం చేతన స్థితి మాత్రమే ఉంటుంది. కాబట్టి మనలో ఆలోచనలు ఉన్నంతకాలం మనం ఊహల దండలని తయారు చేస్తుంటాము. ఈ ఆలోచనలనింటినీ ఒక ఊహజనితమయిన సంతోషం లేదా దుఃఖం అనే దండలుగా సృష్టిస్తుంటాము. ఎప్పుడయితే ఈ విధంగా దండలు తయారు చేస్తామో అప్పుడు మనం అసత్యంతోనే మనని చూసుకుంటాము. దీనికి కారణం అనవసరమయిన, అక్కడ లేని బంధాలు తయారు చేయటమే. ఈ విధమైన బంధాలు తయారు చేయటమే మన దుఃఖాలకి కారణం. దీనినే జీవం అంటాము. దీనితో ప్రపంచం ఒక మిథ్యలా కనిపిస్తుంది. ఎప్పుడయితే ఇలా బంధాలు ఏర్పరచటం మానేస్తామో, ఈ అసత్యపు గుర్తింపు మాయం అవుతుంది. బ్రహ్మం అనే విశ్వచేతన స్థితి కనిపిస్తుంది.
Content: మనకి రెండు రకాల గుర్తింపులు లేదా ముద్రలు (ఐడెంటిటీ) ఉంటాయి. ఒకటి మనం బయట ప్రపంచానికి చూపించేది. రెండవది మన అంతరంగ ప్రపంచానికి చూపించేది. మనం బయటప్రపంచానికి చూపించే దానిని ఆహంకారం అంటాము. మన అంతరంగానికి చూపించే దానిని మమకారం అంటాము. ఈ రెండు గుర్తింపులు నిరంతరం ఒక దానితో ఒకటి పోరాడుతూ ఉంటాయి. ఉదాహరణకి మనం బయటప్రపంచానికి ఇంత గొప్ప అంత గొప్ప అని
Page 40
Content: చూపించుతాము. కానీ అంతరంగంలో మనలో ఉండే లోపాలు మనకు తెలుసు. ఈ రెండు గుర్తింపులకి మధ్య చాలా అంతరం ఉంటుంది. మనం బయట ప్రపంచానికి చూపించే మన ఈ గుర్తింపు ఎప్పుడూ మనకంటే ఎక్కువగా ఉంటుంది. ప్రతి వ్యక్తి ఎదుటివారి ముందు తాను వారికంటే ఎంత గొప్పవాడో చూపిస్తూ ఉంటాడు. మనం మనకి చూపించేది మన స్థాయికంటే చాలా తక్కువగా ఉంటుంది. మీరు చాలా సార్లు గమనించే ఉంటారు. మనతో మనం ఎప్పుడూ తృప్తిని పొందము. అందుకే నిరంతరం మనని మనం అభివృద్ధి చేసుకుంటూ ఉంటాము. మనం ఆధ్యాత్మికంగా కాని లేదా వస్తు ప్రపంచం విషయాలలో కానీ ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటాము. కాబట్టి మనం మనకి చూపించే మనంలో ఎప్పుడూ ఏదో లోపం ఉంటుంది. మనం బయట ప్రపంచానికి చూపించే గుర్తింపు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఈ రెండు గుర్తింపులకి మధ్య నిరంతరం పోరు జరుగుతూ ఉంటుంది.
Content: అయితే ఈ రెండు గుర్తింపులూ అబద్ధపు గుర్తింపులు. ఇది మనం తయారు చేసిన ఆలోచనల బంధాల దండలే. ఈ గుర్తింపులని పట్టుకొని ఉన్నంతకాలం మనం ఈ సంసారం అనే దానిలో చిక్కుకొని ఉంటాము. ఎప్పుడయితే మనం ఈ రెండింటికీ అతీతంగా వెళతామో, అప్పుడు మనకి జ్ఞానోదయం అవుతుంది. నిరంతరం మనం ఆలోచనలని సృష్టిస్తూ, వాటిని పోషిస్తూ, వాటిని నాశనం చేస్తుంటాము. సృష్టి కార్యం (బ్రహ్మ) జీవితాన్ని ఇవ్వటం (విష్ణు) నాశనం
Page 41
Content: నిత్యధ్యానం చేయటం (శివుడు) అనేది నిరంతరం సాగుతూ ఉంటుంది. ఎప్పుడయితే మనం వీటికి అతీతంగా వెళతామో అప్పుడు మనం పరబ్రహ్మ స్థితికి చేరతాము.
Content: నిత్యధ్యానంలోని ఈ దశలో, మీరు ఆలోచనలు అనేవి ఒకదానికొకటి సంబంధంలేని స్వతంత్రమయినవి అని అర్థం చేసుకోవాలి. వాటికి ఎటువంటి సంబంధం ఉండదు. మీకు ఆలోచనలు వస్తే, వాటిని అణచవద్దు లేదా వాటికి స్పందించవద్దు. కేవలం వాటిని గమనించండి. అవి స్వతంత్రమైన వేరువేరు విషయాలు అని అర్థం చేసుకుంటూ వాటిని గమనించండి. ఇలా గమనించితే క్రమంగా మీలో చేతనస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మీరు ఈ రెండు గుర్తింపులకి అతీతంగా వెళ్ళగలరు. అప్పుడు మీరు బాధల గోలుసుకాడు, సంతోషాల గోలుసుకాడు అని అర్థం చేసుకుంటారు. మీరు కేవలం వీటికి నేపథ్యం (బ్యాక్‌గ్రౌండ్) అని మాత్రమే తెలుసుకుంటారు.
Content: ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. మీకు తెలిసినా తెలియకపోయినా, మీకు అర్థమయినా కాకపోయినా మీరు జ్ఞానోదయమయిన వారే. సహజ సిద్ధంగా మీరు స్వేచ్ఛ కలిగినవారు. మీకు బంధాలు తెలియవు. ఈ సత్యాన్ని మీతోనే ఉంచుకొని నిశ్బ్దంగా తరువాత ఏడు నిముషాలు కూర్చోండి. బంధాలు లేని స్థితిని అనుభూతి చెందుతూ మీ ఉనికిలో, పరమానందస్థితిలో ఉండండి. ఇదే జ్ఞానదయం పొందడమే. అంతిమ పద్దతి.
Content: మీకు ఈ సత్యం బాగా నచ్చితే మీరు ధ్యానస్పురణ కార్యక్రమాన్ని చేయండి.
Page 42
Content: అందులో ఈ విషయాలన్ని చాలా వివరంగా వివరిస్తాను. ధ్యానస్పురణ రెండు రోజుల ధ్యాన కార్యక్రమం. ఈ కార్యక్రమం మనని మన మనస్సు మన ధ్యానస్థితితో సంబంధాన్ని ఏర్పరుస్తుంది. ఈ కార్యక్రమం మనని మన మనస్సు అనే బంధాల నుంచి స్వేచ్ఛని ఇస్తుంది. ఇది మన భావావేశాల నుంచి స్వేచ్ఛని ఇస్తుంది. దుఃఖము సంతోషం అనే మన మానసిక వ్యవస్థని విడగొడుతుంది. అది మన అంతరంగంలో ఒక ఖాళీ ప్రదేశాన్ని సృష్టిస్తుంది. అక్కడే ధ్యానం అనేది వికసిస్తుంది.
Page 43
Content: మంత్రాలని వినండి (సమయం 10 నిమిషాలు)
Content: నిత్యధ్యానంలోని చివరి దశ, మీరు నిశ్శబ్దంగా ఆనందంగా కూర్చొని ఇక్కడ పటించే మంత్రాలని వినండి. సర్వాంతర్యామితో సంబంధాన్ని ఏర్పరచుకున్న అనుభూతితో ఉండండి. మీరు మీ అంతరాత్మ ద్వారా ఈ శక్తిగల మంత్రాల ప్రకంపనలని వినండి. ఇవ్వనీ సర్వాంతర్యామికి లేదా గురుదేవులకి మీరు కృతజ్ఞతని చూపించటమే. వారు మనకి ఇచ్చిన గొప్ప జ్ఞానానికి, ఏ జ్ఞానమైతే మనలని అజ్ఞానం నుంచి సేవెచ్ఛని ఇస్తుందో, ఏ జ్ఞానమయితే మనని నిత్యానంద స్థితికి తీసుకువెళుతుందో ఆ జ్ఞానాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తెలియచేద్దాము.
Content: మీకు పూజ చేయటం ఇష్టమయితే మీరు గురుపూజ చేయవచ్చు. ఈ మంత్రాలన్ని గురుపూజకి సంబంధించినవే. ఇదంతా కూడా గురుదేవులకి లేదా సర్వాంతర్యామికి కృతజ్ఞతలు తెలియచేయటమే.
Content: మీకు పూజలో ఆసక్తి లేకపోతే నిశ్శబ్దంగా కూర్చొని మంత్రాలని వినండి. అదికూడా చాలా మంచిది. మంత్రాలతోని ప్రకంపనలు మీ అంతరంగాన్ని స్వచ్ఛంగా చేయగలుగుతాయి. మిమ్మలని పరమానంద స్థితికి చేర్చుతాయి.
Content: ఈ నిత్యధ్యానాన్ని ప్రతిరోజూ చేయండి. కనీసం రోజుకి ఒకసారి అయినా చేయండి. మీరు మీ ఉనికిలో ఒక కొత్తకోణాన్ని అనుభూతి చెందగలరు. ఈ ధ్యానం మమ్మలని స్వచ్ఛమయిన చైతన్యస్థితిని, పరమానందాన్ని పొందే విధంగా నడిపిస్తుంది.
Content: అందరూ నిత్యానంద స్థితిని పొందుదురు గాక. నిత్యానందం.
Page 44
Content: [SKIPPED page 44 - repeated NVIDIA JSON error]
Page 45
Content: నిత్యానంద ధ్యానపీఠం : పరమహంస నిత్యానంద యొక్క ప్రపంచ వ్యాప్తంగా జరిగే అంతరంగపు పరమానందం అనే కార్యక్రమమే నిత్యానంద ధ్యాన పీఠం. దీనిని 2003లో స్థాపించారు. ప్రస్తుతం 33 దేశాలలో 1300పైగా సెంటర్లతో తన కార్యక్రమాలు చేస్తుంది. ఈ సంస్థ కింద ఇంటర్నేషనల్ వేదిక హిందూ యూనివర్సిటి, ఫ్లోరిడా, యు.ఎస్.ఏ. కూడా పని చేస్తుంది.
Content: నిత్యానంద మెడిటేషన్ అకాడమీస్ : (ఎన్.ఎమ్.ఏ.) అనేవి ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మిక ప్రయోగశాలలుగా పని చేస్తున్నాయి. అవి మనలో అంతరంగపు అభివృద్ధికి, బయట ప్రపంచంలో సహజాభివృద్ధికి కృషి చేస్తున్నాయి. ఈ అకాడమీలు ధ్యానం నుంచి శాస్త్రం వరకూ సంబంధించి వివిధ కార్యక్రమాల ద్వారా మనం అన్నివిధాలగా అభివృద్ధి చెందే విధంగా ఉన్నాయి. అవి మనలో పరిణామాత్మక ఆధ్యాత్మికతను పెంపొందించే విధంగా, ఎంతో ప్రపంచాలో కలిసి పరమానంద జీవితాన్ని సృష్టించే విధంగా పనిచేస్తున్నాయి.
Content: అందిస్తున్నారు. ఐ.వి.హెచ్.యు. ద్వారా ప్రపంచవ్యాప్తంగా రకరకాల ధ్యాన పద్ధతులని నేర్పిస్తున్నారు. నిత్య స్పిరిచ్చువల్ హీలింగ్ ద్వారా ఉచిత హీలింగ్, ఉచిత విద్య, ఉచిత మెడికల్ కాంపులు, ఉచిత భోజనము, ఒక సంవత్సరం ఆధ్యాత్మిక శిక్షణ ఉచిత భోజన వసతితో ఇస్తున్నారు. ఇక్కడి గురుకుల వ్యవస్థలో చిన్న పిల్లలకి విద్యాబోధన జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సేవలన్నీ అందిస్తున్నారు.
Content: నిత్య ధీర సేవసేన వారి ఆనందసేవకులు, వాలంటీర్లుగా తమ సేవలని, నిత్యం ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్నారు. వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది.
Page 46
Content: నిత్యానంద ధ్యానపీఠం అందించే కార్యక్రమాలు :
Content: నిత్యానంద ధ్యానపీఠం ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమందికి వారి శరీర మానసిక ఆధ్యాత్మికాభివృద్ధికి ప్రత్యేక ధ్యాన కార్యక్రమాలని అందిస్తున్నారు.
Content: ఆనందస్సురణ కార్యక్రమం.
Content:
- శక్తివంతులు అవ్వండి.
Content: ఈ కార్యక్రమంలో మీలోని ప్రధాన చక్రాలని శక్తివంతం చేస్తూ దాని ద్వారా మీరు నిశ్చలంగా విరామంగా ఉండగలరు. ఈ కార్యక్రమం మీ భావావేశాల గురించి మీతోపరమను జ్ఞానాన్ని ప్రయోగాత్మంగా ఇస్తుంది. ఈ కార్యక్రమం మీ భౌతిక స్థితిలో ఆధ్యాత్మిక ప్రభావాన్ని ఇవ్వగలిగే విధంగా రూపొందించారు. ఇది మీలోని పరమానందాన్ని అనుభవించగల సమ్మకమయిన జీవిత పరిపూర్ణం. ఇది చాలా శక్తివంతమయిన శిక్షణా కార్యక్రమం. దీనిని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది చేశారు.
Content: నిత్యానంద గ్రంథాలు 23 భాషలలో దొరుకుతాయి.
Content: డివిడిలు, సిడిలు, ధ్యానం కిట్టులు మొదలమయినవి ఆనందగలేరియాలో దొరుకుతాయి.
Page 47
Content: నిత్యధ్యానం
Content: Our Nithyananda Meditation Academies (NMA)
Content: INDIA:
Content: Nithyananda Dhyanapeetam
Content: Nithyanandapuri
Content: Kallugopahalli, Mysore Road, Bidadi
Content: Bangalore - 562 109
Content: Karnataka, INDIA
Content: Phone: 91 +80 65591844 / 27202084
Content: Fax: 91 +80 7288207
Content: Email: [email protected]
Content: URL: www.nithyananda.org
Content: Nithyananda Dhyanapeetam
Content: Sri Ananda Rajarajeshwari Temple,
Content: Nithyananda Giri
Content: Pashambanda Sathamrai Village, Shamshabad Mandal
Content: Rangredy District
Content: Andhra Pradesh - 501 218, INDIA
Content: Ph.: +91 93470 65288
Content: E-mail: [email protected]
Content: 46
Page 48
Content: నిత్యధ్యానం
Content: Nithyananda Dhyanapeetam
Content: HYDERABAD CENTRE,
Content: Ph : 93910 35463
Content: Nithyananda Dhyanapeetam
Content: VISKHAPATNAM CENTRE
Content: Viskhapatnam District, Andhra Pradesh, INDIA
Content: Nithyananda Dhyanapeetam
Content: ELURU CENTRE,
Content: West Godavari District, Andhra Pradesh - 534 003, INDIA
Content: Ph : 08812 - 250712, Cell : 94908 26692
Content: Nithyananda Dhyanapeetam
Content: BHIMAVARAM CENTRE,
Content: West Godavari District, Andhra Pradesh, INDIA
Content: Ph : 9912144429, 99498 33599
Content: 47
Page 49
Content: నిత్యధ్యానం
Page 50
Content: మనలోని భావవేశాలు, ఆలోచనలు అనేవి మనకు ఒక మానసిక వ్యవస్థని తయారు చేస్తాయి. మన ధృక్పథానికి అవే కారణం. వీటికి అతీతంగా వెళ్ళాలి అంటే మీరు ఆలోచనలు, భావావేశాలు ఆడే ఆటలని అర్థం చేసుకోవాలి. నిత్యధ్యానం అనేది 35 నిముషాల ధ్యాన పద్దతి. దీనిని పరమహంస నిత్యానంద మనం స్వచ్ఛ పొందే విధంగా, మనస్సుకు అతీతంగా వెళ్ళే విధంగా తయారుచేశారు.
Content: Ebook ISBN: 979-8-88572-852-2
Content: నిత్యానంద ధ్యానపీఠం
Content: నిత్యానందపురి, కలిగౌడహళ్లి, మైసూర్ రోడ్డు బిడది. బెంగుళూరు జిల్లా కర్ణాటక - 562 109.
Content: ఫోన్ : +91 - 80 - 65591844, 27202084