Books / isbn 979-8-88572-942-0.pdf

1. isbn 979-8-88572-942-0.pdf

Page 1

Content: పూలమామయ్యసీ శ్రీనిత్యానంద చెప్పిన చిన్న కథలో పెద్ద సత్యము

Page 2

Content: ఇంటర్నేషనల్ వేదిక్ హిందూయూనివర్సిటీ ట్రస్ట్

Content: (థి డివిజన్ ఆఫ్ ఇంటర్నేషనల్ వేదిక్ యూనివర్సిటీ)

Content: ఇండియా ప్రచురణ

Content: కాపీరైట్ 2007

Content: మొదటి ప్రచురణ డిసెంబరు 2007

Content: Ebook ISBN : 979-8-88572-942-0

Content: ఈ పుస్తకానికి సంబంధించిన అన్ని హక్కులు నిత్యానంద ధ్యానపీఠం యొక్క సొంతం.

Content: నిత్యానంద ధ్యానపీఠం నుంచి వ్రాతపూర్వకంగా అనుమతి తీసుకోకుండా బహిరంగంగా లేదా వ్యక్తిగత వినియోగం కోసం ఇందులోని ఏ భాగాన్ని యాంత్రికంగా, ఫోటో గ్రాఫిక్ లేదా ఫోనోగ్రాఫిక్ ప్రక్రియ లేదా ఏ ఇతర ప్రక్రియ ద్వారా పునర్ముద్రించటం నిషిద్ధం.

Content: ఈ పుస్తకం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం నిత్యానంద ధ్యానపీఠం వారు చేపట్టే ధర్మకర్తృత్వ కార్యక్రమాల కోసం వినియోగించటం జరుగుతుంది.

Content: నిత్యానంద ధ్యానపీఠం

Content: శ్రీఆనందేశ్వరి దేవాలయం

Content: నిత్యానందగిరి, పాశంబండ, సాతంరాయ్ విలేజ్,

Content: పంషాబాద్, రంగారెడ్డి జిల్లా. ఫోన్ : 9347065288, 9866500350

Content: www.nithyananda.org

Page 4

Content: కథలు మానవ సంస్కృతిలో ఒక ముఖ్య భాగము. మునిషి మాటలు నేర్చి, కల్పనలు అల్లటం నేర్చుకున్న నాడే కథలకి అంకురార్పణ జరిగింది. కథలు లేని సాహిత్యం బహుశః ప్రపంచంలో ఎక్కడా లేదేమో. కథలు చెప్పటం ప్రాచీనమయిన ఒక కళ. కథలలో పురాణ కథలు, జానపద కథలు, సమకాలీన జీవిత కథలు ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. కథలు చిన్నపుడే కథానికలు అంటాము. మరి పెద్ద కథలయితే నవలలు అంటాము. భారతీయ సాహిత్యం, సంస్కృతిలో పెనవేసుకుపోయిన అంశం కథ. ప్రపంచదేశాలతో పోల్చి చూస్తే భారతీయ కథలు బహుళ ప్రాచీనమైనవి. అవి నేటికి సజీవంగా అలరారుతున్నాయి. బహుశః ప్రపంచంలో వివే కళలో భారతీయులు వేల సంవత్సరాలుగా నిష్ఠాతులు అయినందుకు కథలు అంత ప్రాచుర్యాన్ని పొందాయేమో. వారి ధరణ శక్తి అమోఘం .అందుకు ఉదాహరణ, కొన్ని వేల సంవత్సరాలుగా మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు వినటం ద్వారా ఒక తరం నుండి మరొక తరానికి జాగ్రత్తగా బదిలీ అయ్యాయి. వాటిని ఈ మధ్య కాలంలోనే బహుశః మూడు నుంచి నాలుగువేల సంవత్సరాల క్రితం మాత్రమే అక్షర రూపంలో తాళ పత్రాల మీద రచించారు. ఈ ధరణ శక్తి వలన కూడా నేటికీ కథలు అజరామంగా ఈ భూమి మీద ఉన్నాయి. కథలు లేని పురాణాలు, కథలు లేని ఏ కార్యక్రమాలు మనకి ఉండవు. కథ అంటే మనలోని భావాలకి ఊహలని కల్పనలని మేళవించి, వినటానికి ఇంపుగా, చదవటానికి చక్కగా తయారు చేసి చెప్పటమే. కథని సృష్టించటం, దానిని అందంగా మలచటం, ఇంకొకస్త అద్భుతంగా చెప్పటం అనేది గొప్ప కళ. కథలు సృజనాత్మకతకి, మేధస్సుకి, అసంకల్పితంగా స్పందించ గల నేర్పుకి చక్కని ఉదాహరణ. కథలని సృష్టించే సృజనాత్మకత గురించి పరమహంస శ్రీ నిత్యానంద ఒక చక్కని మాట చెబుతారు. ‘ఎప్పుడయితే మేధస్సుతో పాటు హృదయం కూడా కలుస్తుందో అక్కడ సృజనాత్మకత ఉంటుంది. అందులొంచి కథ ఉద్భవిస్తుంది’. కథలు సృజనాత్మకతకి ఉదాహరణలు. మనలోని భావాలని స్పష్టంగా చిన్న చిన్న మాటలలో ఎడమటివారికి సూటిగా అర్ధమయ్యే రీతిలో చెప్పగల నేర్పుని కథలు అంటాము. చెబుతున్న సందర్భాన్ని మనకి స్పష్టం చేయటానికి కథలని ఉపయోగిస్తాము. మనం సూటిగా చెప్పలేని విషయాలని కథల రూపంలో అద్భుతంగా చెప్పవచ్చు. అందుకే కథలు సృష్టించే కళాకారులకు దొరికే తృప్తి అనంతమయినది. ఈ సందర్భంగా పరమహంస శ్రీ నిత్యానంద ఈ విధంగా చెబుతారు. ‘ఒక పద్యాన్ని ప్రాసిన (కథని ప్రాసిన) కవి, ఒక బిడ్డకి జన్మనిచ్చిన తల్లి కంటే ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే బిడ్డకి జన్మనిచ్చిన తల్లి గర్భం కడుపులో ఉంటుంది. అదే కవికి హృదయంలో ఉంటుంది. అదే ఫలసిద్ధి పొందిన ఆనందం. పరమహంస శ్రీ నిత్యానంద మరొక అందమయిన విషయాన్ని కూడా తన ప్రవచనాలలో చెబుతుంటారు. సృజనాత్మకత భగవంతునికి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే సృజనాత్మకత హృదయానికి సంబంధించినది. శ్రీ కృష్ణుడి హృదయం ఎప్పుడూ భగవంతునికి చేరువాకాలని ఆత్మత పడుతుంది. కాని మేధస్సు తొందరిక ప్రపంచానికి దగ్గరవటానికి ఆతృత పడుతుంది. అందుకే కళాకారులు సర్వాంతర్యామికి దగ్గరగా ఉంటారు. బహుశః ఈ కారణం వలననేమో ఎక్కడ ఆధ్యాత్మికత ఉంటుందో అక్కడ కథలు, పాటలు, పద్యాలు, నాట్యాలు, భజనలు, కీర్తనలు, సంగీతం ఉంటాయి. కానీ అక్కడ గణిత శాస్త్ర సూత్రాలు, లేదా మరొక శాస్త్ర ధియరీలు, గణాంకాలు, లెక్కలు ఇలాంటివి ఉండవు. ఆసలు మేధస్సుకి సంబంధించిన ఏ విషయం అక్కడ కనిపించదు.

Page 5

Content: అక్కడ మీకు కేవలం హృదయం మాత్రమే కనిపిస్తుంది. అదే ఆధ్యాత్మికత. అదే భగవంతుని సమక్షం. అక్కడ కూడా లెక్కలు కడుతున్నాము అంటే అది ఆధ్యాత్మికత కాదు అది కేవలం వ్యాపారం.

Content: కథ అనే మాట చాలా చిన్నది. అలాగే కథలు కూడా చిన్నవే. అలా అని వాటిని మనం చిన్నవి చూడుకూడదు. ఈ సందర్భంలో శ్రీ పాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు (1891) కథలు గురించి వాటి గొప్పదనం గురించి చాలా చక్కగా చెబుతారు. ఆయన ఈ విధంగా అంటారు “కథలు కల్పించటానికి గొప్ప ప్రతిభ ఉండాలి. అవి కథలు కల్పించటానికి గొప్ప ప్రతిభ ఉండాలి.

Content: అవి చెప్పటానికి నేర్పు ఉండాలి. అవి అర్థం చేసుకోవటానికి బుద్ధి సూక్ష్మత ఉండాలి" అని. కథల ద్వారా చెప్పే విషయం సూటిగా, సున్నితంగా హృదయాలని తాకుతుంది. అందుకే ఆ విషయం మనకి ఎంత కాలమయినా గుర్తుంటుంది. మన చిన్నప్పుడు తాతయ్య చెప్పిన అనగనగా ఒక రాజు కథ మర్చిపోయిన వారు అసలు మనకి కనిపించరు.

Content: ఆ కథ మొత్తం మనకి గుర్తుంటుంది. కాని నిన్న మొన్న నేర్చుకున్న సూత్రాలు, థియరీలు, నిర్వచనాలు, పాఠాలు అసలు గుర్తు ఉండవు. ఎందుకంటే అవి మేధస్సుకు చేరతాయి.

Content: కథలు స్ఫుర్తిని ఇస్తాయి. సబబుగా ఉన్న మనస్సుని ఉత్తేజపరుస్తాయి. నిరుత్సాహంగా ఉన్న వారిలో చైతన్యాన్ని నింపుతాయి. కథలు కల్పించిన కళాకారుడికి ఆ కధ ఇచ్చే తృప్తి అనందమయినది, ఎంతో విలువయినది.

Content: అదే విధంగా ఆ కధకి శ్రోత ఆయిన కళాపోషకుడు పొందే ఆనందం వెలకట్టలేనిది. అందుకే కథలకి మనస్సు అంత చక్కని అనుబంధం ఏర్పడినది.

Content: కథ మనస్సిని మనస్పుతో మారుస్తుంది, వ్యక్తిని తపస్సుని చేస్తుంది. భోగిని త్యాగిగా తయారు చేయగలుగుతుంది. అదే విధంగా నిరాశావాధిని అనేషిగా చేయగల శక్తి కధకి ఉంది. రాముడి కధ ఎంతమంది సామాన్యులని రుషులుగా చేసిందో మనందరికీ తెలుసు.

Content: ఛత్రపతి శివాజీని అంత గొప్పవీరునిగా మలచటంలో అమ్మ చెప్పిన కథలు ప్రభావం ఎక్కువ అని మనం చదివాము.

Content: ఇక్కడ కథల గురించి మంచి ప్రచారంలో ఉన్న కధ ఒకటి మన భారతీయ సాహిత్యంలో ఉంది. అదే పంచతంత్ర. ఒక రాజుగారు తన కుమారులని గొప్ప మేధావులుగా, మంచి పరిపాలనా దక్షులుగా చేయాలి అని నిర్ణయించి వారిని మంచి గురుకులానికి పంపిస్తారు.

Content: ఆ రాజకుమారులు చాలా చదువుకున్నారు. చదువు సంద్యలు వారి దగ్గరికి వచ్చేవి కాదు. క్రమశిక్షణ లేదు, భయం భక్తి వారికి అసలు లేదు. గురువులు మహారాజుకి నమస్కరించి రాజకుమారులకి విద్యాబుద్ధులు నేర్పించటం తమ శక్తికి మించిన పని అని శెలవు తీసుకునేవారు.

Content: రాజకుమారులని కులగురువుని రాజ్యానికి ఆహ్వానించి సమస్యని వివరించి, ఈ సమస్యలన మహారాజుగారు ఏవిధంగా మానసికంగా కుంగిపోయారో చెబుతాడు.

Content: అప్పుడు రాజగురువు రాజుని ఓదార్చి ఒక రోజు మొత్తం రాజకుమారులతో గడిపి, రాజు దగ్గరికి వస్తాడు. ఆయన రాజుతో, “మహారాజా! రాజకుమారులని నా వెంట నా ఆశ్రమానికి తీసుకువెళతాను.

Content: వీరిని విద్యావంతులని చేసి తిరిగి నీ రాజభవనానికి పంపుతాను” అని వాళ్ళని వెంట పెట్టుకుని ఆశ్రమానికి వెళతాడు.

Content: ఇంతమంది గురువులు చేయలేని పని ఈయన మాత్రం ఏం చేస్తాడలే అని అందరూ అనుకుంటారు. రాజగురువు రాజకుమారులకి చిన్న చిన్న అందమయిన కథలని చెబుతూ అన్ని శాస్త్రాలు భోదించుతాడు.

Page 6

Content: యుద్ధ నైపుణ్యాలు, యుద్ధతంత్రాలు, సామాజిక జీవితంలో ఉండే విశేషాలు, మోసాలు, కుతంత్రాలు వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం ఈవిధంగా రాజకుమారులకి కావలసిన శాస్త్రాలన్నీ నేర్పించుతారు. అయితే ఇవన్నీ కూడా చిన్న చిన్న కథల రూపంలోనే నేర్పించుతాడు. వారు శాస్త్రాలు నేర్చుకుంటున్నారు అన్న విషయం తెలియకుండా నేర్చుకుంటారు. చివరికి మహామేధావులుగా మారి రాజభవనానికి తిరిగి వస్తారు.

Content: కాబట్టి కథలకి అంతశక్తి ఉన్నది అని భారతదేశంలో ఎప్పుడో ప్రాచీన కాలంలోనే నిరూపించబడింది. సరే మనసందరం కథలని ఎందుకు ఇష్టపడతాం? దీనికి జవాబు మరొక ప్రశ్న ఉన్నది. మనం అర్ధంలో మన ప్రతిబింబాన్ని చూసి ఎందుకు ఆనందంపడతాం? ఎందుకు అంత ఇష్టపడతాం? ఇది కూడా అంతే. కథలలో ఉండే భావాలు, విషయాలు సమస్యలు, పరిష్కారాలు అన్నీ మనకి సంబంధించినవే. మన ప్రతిబింబాన్ని అందంగా చూపిస్తున్నాయి కాబట్టి మనం కథలని ఇష్టపడతాము.

Content: పరమహంస శ్రీ నిత్యానంద స్వామి కూడా పంచతంత్రంలో గురుదేవుల మాదిరిగానే మన అందరికీ కథ ద్వారా సత్యాన్ని అర్ధం చేసుకునేలా చేస్తారు. ఆయన తన ప్రతి ప్రవచనంలో ఎన్నో చిన్న చిన్న కథలు చెబుతూ తాను చెప్పదలచిన అంశాన్ని సూటిగా మన హృదయంలోనికి చంపించుతారు.

Content: పరమహంస శ్రీ నిత్యానంద స్వామి చెప్పే ప్రతి మాట ఒక సత్యం. అది విశ్వ జనీయత కలిగిన ఒక నిర్దిష్ట ప్రమాణం. సత్యం ఎప్పుడు కలిసంగానే ఉంటుంది. అది మనకి ఒక ఘాతం తగులుతుంది. అందుకే సత్యం చేదుగా ఉంటి మనకి గుచ్చుకుంటుంది. ఆ పదునైన సత్యాలు అగ్నిశిఖలా దూసుకు వస్తే మనం టట్టుకోలేము, అందుకే ఆ సత్యాల నుంచి పారిపోవటానికి ప్రయత్నిస్తాము అని పరమహంసకి తలుసు. పంచతంత్ర కథలలోని రాజకుమారులులా ఆ చేదు గుళికలు రుచించక, మనం గురువుల నుంచి, సత్యాల నుంచి తప్పించుకోవటానికి శాయశక్తులా ప్రయత్నిస్తామని కూడా పరమహంసకి తలుసు. విశ్వమేధస్సుతో నింపబడిన ఆ జ్ఞానోదయమయిన యోగేశ్వరుడు, మనని తప్పించుకోనీయరు.

Content: స్వామి ఆ భావాలని సుకుమార సుమాల మాలగా, అగ్ని శిఖలని చల్లని శ్రీ గంధంలా తయారు చేసి, ఆ సత్యాలని మన దగ్గరకి మృదువుగా, మధురంగా ఆప్లాదకర రీతిలో పంపించుతారు. దానికి ఆయన వాడే అతి శక్తి వంతమయిన పద్ధతి చక్కని చిన్న కథలు. అప్పుడు ఎటువంటి బాధ, త్రమ లేకుండా, చేదు తెలియకుండా ఆ సత్యాలు సూటిగా మన హృదయంలోనికి వెళతాయి. అవి మనని బాధించనవు సరిగదా ఆప్లాదపరుస్తాయి. అదే, పరమహంస శ్రీ నిత్యానంద స్వామి యొక్క కరుణాపూరితమయిన మేధస్సు, ప్రేమ పూరితమయిన అపార ఆధరణ. ఇంత యుక్తిగా, అంత శక్తివంతమయిన విషయాలని సామాన్యులలమయిన మన తోపలికి అత్యంత ఆప్లాదకరమయిన రీతిలో పంపించ గల నేర్పు, మేధస్సు ఆ పరమహంసకి తప్ప ఎవరికి ఉంటుంది?

Content: పరమహంస నిత్యానంద స్వామీజీ ఎవరు?

Content: భారతదేశాన్ని వేద భూమి, దేవ భూమి అంటారు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలుగా ఈ భూమి మీద అవతారపురుషులు, భగవత్ స్వరూపులు అవతరించి సామాన్య మానవులని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించారు. ఆ పరంపరలో, ఈ నాటి ఆధునిక కాలంలో పరమహంస శ్రీ నిత్యానంద స్వామి మనకోసం వచ్చిన మహాత్ముడు. ఆయన జ్ఞానోదయమయిన మన మధ్య ఉన్న యోగేశ్వరుడు.

Page 7

Content: పరమహంస నిత్యానంద 1978లో తమిళనాడులో జన్మించి, పదహరవ ఏట, హిమాలయాలకు వెళ్ళి అక్కడ కఠోర తపస్సు చేశారు. ఆయన పరివ్రాజకునిగా భారతదేశమంతా కాలినడకన తిరిగారు. ఇండియా, నేపాలులోని హిమాలయ ప్రాంతాన్ని తిరిగారు. అక్కడ ఆయన ఎందరో రుషులను,యోగులని కలిసి వారి దగ్గర యోగా, తంత్ర, ధ్యానం మొదలైన ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రాలని ఖూణంగా నేర్చుకున్నారు.

Content: స్వామీజీ హిమాలయాలలో తపస్సు చేసుకునే రోజులలో ఆయనకి మహావతార్ బాబాజీ కనపడి ఆయనని పరమహంస నిత్యానంద అని పిలిచి, దీవించి మాయం అయిపోయారు. ఆయన ఆ సమయంలో ఆయనకి అది బాబాజీ తనకి ఇచ్చిన పేరు అని అర్థం కాలేదు. కొంత కాలం గడిచాక ఒక యోగేశ్వరుడు స్వామీజీకి సన్యాస దీక్షని ఇచ్చి ఆయనకి ‘పరమహంస శ్రీ నిత్యానంద’ అని పేరు పెట్టారు. అప్పుడు స్వామీజీకి మహావతార్ బాబాజీనే తనకి ఆ పేరుని ఇచ్చారు అని అర్థమయింది.

Content: పరమహంస శ్రీ నిత్యానంద స్వామి కఠోర తపస్సు ఫలితంగా జనవరి ఒకటి 2000 సంవత్సరంలో ఆయనకి జ్ఞానోదయమయ్యి ఆయన శాశ్వతానంద స్థితిని చేరారు.

Content: జ్ఞానోదయం పొందిన తరువాత స్వామీజీ దక్షిణ భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇప్పుడు ఆయన ఏకైక లక్ష్యం, తాను పొందిన ఆనందాన్ని అందరికీ పంచి పెట్టాలి. తప్పుదారిలో ఉండే ఆధ్యాత్మికతని సరియైన మార్గంలో నిలపాలి, ముఖ్యంగా భారతీయ ఆధ్యాత్మికత, యోగా, ధ్యానం పైన పాశ్చాత్యదేశాలలో చాలా తప్పు ప్రచారాలు జరుగుతున్నాయి. అది సరికాదు అని చెప్పటానికి నిత్యానందస్వామి నిర్ణయించుకున్నారు.

Content: ఆయన నేటి సమాజంలో ఉన్న సమస్యలు, వ్యాధులు అన్నీ కూడా చాలా వరకు సన్మార్గమైనవే అని, వాటిని చిన్న చిన్న సాధనలతో తొలగించవచ్చునని నిరూపించారు. స్వామి ముఖ్యలక్ష్యం, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిలో మార్పుని తీసుకురాగలిగితే ప్రపంచంలోని సమస్యల్నీ మాయం అయిపోతాయి, ముఖ్యంగా హింసాప్రవృత్తి, డిప్రెషన్, అత్మాశ ఇటువంటి సమస్యలని చాలా సులభంగా తొలగించవచ్చు అని అంటారు.

Content: ప్రపంచంలోని ఇన్ని సమస్యలకి అసలయిన కారణం మనకి ఏమి కోవాలో మనకి తెలియకపోవటం. మనకు తెలియని దాని కోసం, అక్కడ లేని దాని కోసం మన శక్తిసంతా ఉపయోగించి పరుగులు పెడుతున్నాము. లేని దాని కోసం పరుగెడితే మనం ఏమీ సాధించలేము. దాంతో మనసికంగా కుంగిపోవటం, శారీరకంగా చాలా అనారోగ్యాలని తెచ్చుకొని అనేక సమస్యల ఊబిలో కూరుకుపోతున్నాము. దీనితో అశాంతి, అసహనం, అసంతృప్తి, అహంసా ఇలాంటివన్నీ కుటుంబాలలో, సమాజంలో చివరికి ప్రపంచమంతా వ్యాపించిపోయాయి. అది ఎంతలోతుగా వ్యాపించినది అంటే ఈ లక్షణాలు లేని వ్యక్తులు కానీ, ప్రదేశాలు కానీ మనకి కనపడటం లేదు.

Content: ఈ సమస్యలన్నిటికి పరమహంస నిత్యానంద చాలా సులభమయిన, ఆచరణ యోగ్యమయిన, అందరికీ అందుబాటులో ఉండే ఒక సూత్రాన్ని చెప్పారు. అది “వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తిలో మార్పు తీసుకురావటం ద్వారా ప్రపంచంలోని సమస్యలని అధికమించవచ్చు. అదే విధంగా ప్రపంచాన్ని మార్చవచ్చు. వ్యక్తిగత మార్పుని ధ్యానం ద్వారా సాధించవచ్చు. దీని ద్వారా ప్రపంచంలో నిత్యానందాన్ని పరమానంద స్థితిని స్థాపించవచ్చు.

Content: ధ్యానంతో పాటు, స్వామీజీ మనలోని సమస్యలకి, ప్రపంచంలోని సమస్యలకి కారణాలని మనకి స్పష్టంగా చూపిస్తూ, అవి ఏవిధంగా సమస్యలని సృష్టిస్తున్నాయో, ఆ సమస్యలని మనం ఏవిధంగా ధ్యానం ద్వారా సాధించవచ్చో వివరిస్తున్నారు.

Page 8

Content: పరిపక్వరించవచ్చునో నేర్పించుతారు. ఈ సందర్భంలో స్వామీజీ చెప్పే సత్యాలు మనని నిర్భయంతో పోయేలా చేస్తాయి. కొన్ని సమ్మతేని విధంగా ఉంటాయి. అటువంటి సత్యాలని స్వామీజీ మనకి మనోహరమయిన, ఆహ్లాదకరంగా ఉండే చిన్న చిన్న కథల ద్వారా ఆ నొప్పి తెలియకుండా నేర్పించుతారు. అటువంటి కొన్ని కథలని ఒక పుస్తక రూపంలో తీసుకువచ్చాము. ఇవి పిల్లలకి, పెద్దలకి, బాగా చదువుకున్న వారికి, అందరికీ అర్థమయ్యేవిధంగా మలచాము.

Content: మీ శరీరాన్ని, మిమ్మలని మీరు ప్రేమించటం నేర్చుకోండి?

Content: పరమహంస శ్రీ నిత్యానంద మనం సమ్మతేని నిజాన్ని మనం ఆశ్చర్యపోయే సత్యాన్ని ఒకదానిని చాలా చమత్కారంగా చెబుతారు. అది ‘మీ శరీరాన్ని మిమ్మలని మీరు ద్వేషించి చూతారు’. ఈ మాట వినగానే మనం సమ్మమ్, కానీ స్వామీజీ వివరంగా ఉదాహరణలతో చెప్పినప్పుడు, సమ్మతాము, ఆశ్చర్యపోతాము.

Content: స్వామీజీ ఈ విధంగా చెబుతారు. ‘నా శరీరంతో సౌకర్యంగా ఉన్నాను. నా శరీరం నాకు చాలా బాగుందని’ అని చెప్పేవారు చాలా అరుదుగా కనిపించుతారు. వాళ్ళు కూడా నా శరీరాన్ని ప్రేమిస్తున్నాను అని అనరు, సౌకర్యంగా ఉన్నాను అంటారు.

Content: శరీరం అంటే ఏమిటి?

Content: శరీరం అంటే మీరు కారు. ఈ శరీరం మిమ్మలని మోస్తూ తిరిగే ఒక వాహనం. ఈ జీవితం అనే సముద్రాన్ని దాటించే నౌక. మీకు నివాసాన్ని కల్పించిన గృహం అంతే. అయినా మీరు ఏ పని చేయాలి అని అనుకున్నా శరీరం కావాలి. శరీరం సహాయసహకారాలు లేకపోతే ఏమీ సాధించలేరు. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా, సౌకర్యంగా ఉంచుకోవాలి. అంతేకాదు శరీర సహాయం మీకు కావాలి కాబట్టి శరీరంతో మీరు ముంచి అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి, దానిని ప్రేమించాలి. అయితే దాని మీద ప్రేమ మిమ్మలని దాటి వెళ్ళిపోకూడదు. మీ శరీరం మీ కంటే గొప్పది కాదు. అది మీ యొక్క తాత్కాలిక నివాసం. ఈ జన్మలో మీరు చేరవలసిన పని అయిపోగానే ఇక ఆ ఇంట్లో వుండరు. దానిని వదిలి వెళ్తారు.

Content: అదే విధంగా శరీరాన్ని ద్వేషించకూడదు. నేను అందగాలేను, నేను పొడవుగా లేను, పొట్టిగా లేను ఇలాంటివన్నీ అర్థం లేని విషయాలు. ఇవన్నీ ఇతరులతో పోల్చుకోవటం వలన కలిగిన బాధలే. ఈ విధంగా చాలా మంది మానసికంగా కుంగిపోతారు.

Content: స్పష్టంగా అర్థం చేసుకోండి. మీరందరూ ఆ భగవంతుని చేత ప్రత్యేకంగా సృష్టించబడినవారు. భగవంతునికి మీరు కావాలి. అందుకే భగవంతుడు మిమ్మలని సృష్టించాడు. మీ ద్వారా ఈ ప్రపంచానికి ఏదో చేయాలి అని సంకల్పించాడు. అయితే మీరు ఒక విషయం అడగవచ్చు, భగవంతుడు అందరినీ అందంగా సృష్టించవచ్చు కదా! అని.

Content: అవును. భగవంతుడు అందరినీ అందంగా అద్భుతంగా సృష్టించాడు. కాదని ఎవరైనా చెప్పగలరా? ఆయన మేధస్సు కంటే గొప్పదా వేరి మేధస్సు? ఆయన సృష్టిని ప్రశ్నించే మేధస్సు ఉన్నదా మనకి?

Content: అర్థం చేసుకోండి, భగవంతుడు ఇంజనీరు కాదు. ఏదో ఒక మూస తీసుకొని మనుషులని ముద్రించటానికి. ఆయన అందమయిన హృదయం ఉన్న కళాకారుడు. ప్రతి మనిషినీ ఆతని జీవితానికి సరి పడే విధంగా తీర్చిదిద్దుతాడు.

Page 9

Content: అతను ఈ ప్రపంచంలో ఏ కర్మలు చేయటానికి వచ్చాడో దానికి అనుగుణంగా అతనిని తీర్చిదిద్దాడు. మహామేధో సంపన్నుడయిన భగవంతుని పనికి మనం లోపం చూపాలా? మీరు ఆయనకి సలహాలు చెప్పనవసరం లేదు కదా! ఆయన ఎవరిని అయినా ఒక లక్ష్యం కోసం సృష్టించుతారు. దానికి తగినట్టు వారిని తయారు చేస్తాడు. మనలో లోపం అనేది కేవలం సమాజం సృష్టి లేదా మన బ్రహ్మ. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా మనని మనం ద్వేషించుతాము. మనని నియంత్రించాలని (కంట్రోలు చేయాలని) చూసే సమాజం మీ శరీరం గురించి ఇటువంటి అర్థం లేని వ్యతిరేక అభిప్రాయాలని పంపించి, మనం తక్కువ అని అనుకునేలా చేసి అప్పుడు మనని తన గుప్పిటలోనికి తీసుకుంటుంది. మీరు ప్రశాంతంగా ఒంటరిగా కూర్చోని ఆలోచించితే మీ శరీరం మీద మీకు ఉన్న అభి|ప్రాయాల్నీ కూడా మీ చిన్నతనం నుంచి ఈ సమాజం కల్పించినవే అని స్పష్టంగా అర్థమవుతుంది. అవి నిమ్మళీ మీరు అపరాధభావంతో ఆత్మసూయతా భావంతో కుంగిపోతే, అప్పుడు సమాజం మీ మీద విజయం సాధించినట్టే అనుకోని, మిమ్మలని తన గుప్పిటలోనికి తీసుకుంటుంది. పరమహంస ఈ విషయాలన్నీ చెబుతూ మనకి ఒక చక్కని కథ చెబుతారు.

Content: చిన్నకథ : కావడి మోసే వ్యక్తి - కావడి కుండలు ఒక వ్యక్తి ఒక ఆసామి ఇంట్లో పనిచేస్తుంటాడు. ఆ వ్యక్తి చేయవలసిన పని ప్రతి రోజూ ఆ ఇంటికి దూరంగా ఉన్న నదికి వెళ్ళి రెండు కుండల నిండుగా నీరు నింపి, ఇంటికి తీసుకురావాలి. ఆ నీటిని ఒక తొట్టిలో నింపాలి. ఆ తరువాత యజమాని గదిని అందంగా సర్దాలి. ఆ వ్యక్తి తన పనులని చాలా బాధ్యతగా చేస్తుంటాడు. అతని పనులకి యజమాని సంతోషపడుతుంటాడు. ప్రతి రోజు ఆ వ్యక్తి కావడి భుజాన వేసుకొని నదికి వెళ్ళి, రెండు కుండల నిండా నీరు నింపి వాటిని కావడిలో పెట్టి భుజాన మోసుకొని యజమాని ఇంటికి తెస్తుంటాడు. ఈ విధంగా ప్రతి రోజు చేస్తుంటాడు. అతను ఇంటికి నీరు తెచ్చే రెండు కుండలలో ఒకటి బాగానే ఉంటుంది కాని మరొక కుండకి చిన్న పగులు ఉంటుంది. దానితో కుండనించగా నీరు పట్టి తెచ్చినా పగులు ద్వారా నీరు బయటకి కారిపోయి ఇంటి వచ్చేటప్పటికి సగం నీరు మాత్రమే మిగిలేది. ఆ విధంగా కుండలోని నీరు సగం బయటకి పోయినా, ఆ కావడి మోసే వ్యక్తి ఏమీ పట్టించుకనేవాడు కాదు. ఆవిధంగానే సగం కుండ నీరు మాత్రమే యజమాని ఇంటి తెచ్చేవాడు.

Content: అయితే రెండు కుండలలోనూ బాగున్న కుండ తను చాలా కచ్చితమైన దానిని అని, తనని తయారు చేసిన ఉద్దేశం ప్రకారం తన బాధ్యతని చక్కగా నిర్వహిస్తున్నానని అని చాలా గర్వపదేది. తనలో లోపం లేదు అనే అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉండేది. తన పనిలోని నాణ్యతని చూసి గర్వపదేది. రెండవదయిన పగులు ఉన్న కుండ తనలోని లోపం చూసి సిగ్గుపదేది. తను కచ్చితంగా లేనని, తన బాధ్యతని పూర్తిగా నెరవేర్చలేకపోతున్నాను అని చాలా బాధపడేది. మానసికంగా కుంగిపోయేది. రోజులు గడిచేకొద్దీ పగిలిన కుండ వ్యధ అధికమైపోతుండేది. ప్రతి రోజూ మాదిరిగానే ఆ రోజు కూడా కావడి మోసే వ్యక్తి నదికి వెళ్ళి కుండల నిండుగా నీరు నింపుతాడు. పగిలిన కుండని నీటితో నింపే సమయంలో ఆ కుండ, నీరు మోసే వ్యక్తితో ఈ విధంగా అంటుంది. "ఓ వ్యక్తీ!

Page 10

Content: నాకు చాలా సిగ్గుగా ఉంది. నాకు చాలా బాధగా ఉంది. నేను నీకు చాలా శ్రమ ఇస్తున్నాను. నా వలన నీకు చాలా కష్టం కలుగుతుంది. అని చాలా బాధగా అంటుంది. నీరు మోసే వృక్షి ఆశ్రయంగా ఆ కుండ వైపు చూస్తాడు. అతనికి ఏమీ అర్థం కాదు. ఓ కుండా! నీవు ఏ విషయం గురించి బాధపడుతున్నావు? అని అడుగుతాడు. పగిలిన కుండ ఆ వృక్షికి ఈ విధంగా జవాబు ఇస్తుంది, అయ్యా! నీవు ప్రతి రోజు నన్ను నీటితో నిండుగా నింపుతావు. కష్టపడి భుజం మీద కావడి వేసుకొని మోసి ఇంటికి వస్తున్నావు. నీవు తీరా ఇంటికి చేరే సరికి నా లోని లోపం వలన సగం నీళ్ళని పోగొట్టుకుంటున్నాను. నా మూలాన నీకు నీ శ్రమకి తగిన ఫలితం దొరకటం లేదు. ఈ విధంగా నా వలని నీ శ్రమ వ్యర్థ అవుతుంది. అందుకే నేను బాధపడుతున్నాను అని చాలా బాధపడుతూ తన మనస్సులోని వ్యధని ఆ కావడి మోసే వృక్షికి చెబుతుంది పగిలిన కుండ.

Content: కావడి మోసే వృక్షికి ఆ కుండని చూస్తే చాలా జాలి అనిపిస్తుంది. ఆ కుండని ఎంతో ప్రేమగా తన చేతులలోని తీసుకొని దానితో నీవు అసలు ఈ విషయం గురించి ఆలోచించకు. ఇవాళ మనం యజమాని ఇంటికి వెళ్ళే దారిలో చుట్టూ ఉన్న ప్రకృతిని చూడండి. అక్కడ ఉన్న అందమయిన పూలని గమనించు అని అప్పాయంగా చెబుతాడు. కుండ కన్నీళ్ళని తుడుచుకుని సరే అంటుంది, కానీ దానికి దిగులు తగ్గదు. ఆ వృక్షి కావడిని భుజం మీద వేసుకొని యజమాని ఇంటికి బయలుదేరుతాడు. ఆవృక్షి చెప్పినట్లు పగిలిన కుండ దారికి రెండువైపులా ఉన్న పరిసరాలని గమనించుతూ ఉంటుంది. అప్పుడే ఉదయించిన సూర్యుని కిరణాలు సులివెచ్చగా అక్కడి చెట్లపై పడి ఆ చెట్లు ఎంతో అందంగా, బంగారు రంగులో కనపడుతున్నాయి. దారి అంతా ఉన్న మొక్కలు అందమయిన పూలతో చాలా అందంగా ఉన్నాయి. ఆ పూల మొక్కలు వాటి పూలతో దారి అంతా అందంగా కనపడుతుంది. ఆ ప్రకృతి అందాలు, పూలతో నిండుగా ఉన్న మొక్కలని చూసి కుండ చాలా ఆనందపడుతుంది.

Content: వారు ఇంటికి చేరాకా, తిరిగి కుండ తన పాత భావాలలోనికి వెళ్ళిపోతుంది. తాను ఎందుకు పనికిరాని దాన్సని మరింతగా వ్యధ చెందుతుంది. తనలోని లోపాన్ని మరొకసారి గుర్తుచేసుకొని సిగ్గుతో కుంచించుకుపోతుంది. నీరమోసే వృక్షి కుండలలోని నీటిని తీసుకెళ్ళి తొట్టిలో పోసి, వాటిని యధాస్థానంలో పెడతాడు. అప్పుడు పగిలిన కుండ సగం నీరుని మాత్రమే తెగలిగాను అని కన్నీరు కారుస్తూ ఆ వృక్షిని క్షమించమని అడిగి తాను అసమర్థురాలనని అంటుంది. ఆ వృక్షి కుండతో ఇలా అంటాడు, నీవు నది నుంచి ఇంటికి వచ్చే దారిని గమనించావా? అని అడుగుతాడు.

Content: అవును, గమనించాను. ఎంతో అందమయిన పూల మొక్కలు ఉన్నాయి. అవి అద్భుతం కలిగిస్తాయి, నాలాంటి దురదృష్టవంతమయినవి కావు. వాటి అందాలు పరికించలేను అని అంటుంది, పగిలిన కుండ. ఆ వృక్షి తిరిగి కుండతో ఇలా అంటాడు, ఆ పూల మొక్కలు అన్నీ నీవు ఉన్నవైపు మాత్రమే ఉన్నాయి. అవతలవైపు లేవు. ఆ విషయం గమనించావా?. అవును, గమనించాను అని కుండ జవాబు చెబుతుంది. అప్పుడు ఆ వృక్షి కుండతో, ఆ మొక్కలు, అందమయిన పూలు నీవు పెంచినవే. అదంతా నీప్రతిఫలమే అంటాడు.

Page 11

Content: ఆశ్చర్యపోయిన కుండ నేను నమ్మను. నేను అసమర్థురాలని. ఇది ఎలా సాధ్యం అని అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, “ప్రతి రోజు ఉదయం నది నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నీ పగులు నుంచి కారిన నీటితో ఆ మొక్కలు పెరిగాయి. అవి అందమయిన పూలని ఇస్తున్నాయి. నేను ఆ పూలతో యజమాని గదిని అలంకరిస్తాను. యజమాని నా పనికి ఎంతో సంతోషపడతాడు. నన్ను ఎంతో మెచ్చుకుంటాడు. ఇదంతా కేవలం నీ వలన మాట్లమే సాధ్యపడింది. నేను నీకు కృతజ్ఞత చెప్పాలి” అని ముగించుతాడు ఆ వ్యక్తి. పగిలిన కుండ ఆశ్చర్యానికి, ఆనందానికి హద్దులు లేనతంగా ఆనందిస్తుంది. తనని అంత ప్రత్యేకంగా చేసిన భగవంతునికి వేళ్ వేల కృతజ్ఞతలు తెలుపుకుంటుంది.

Content: ఈ కధని ముగించి స్వామీజీ ఈ విధంగా చెబుతారు. మన అందరిలో ఒక లోపం ఉంటుంది. అందరం పగులు ఉన్న కుండలాంటి వారమే. కాని మనం ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. మనందరినీ భగవంతుడు ఎంతో శ్రద్ధతో ప్రత్యేకంగా సృష్టించాడు. నేను బాగా లేను, నాలో లోపం ఉందని మీరు అనుకుంటే, మీరు భగవంతుని శక్తిని విస్మరించుతున్నారు అని అర్థం. భగవంతుని మేధస్సు కచ్చితం కాదు అని మీరు అనుకుంటున్నారు అని అర్థం.

Content: మీలో లోపాలు ఉన్నాయని అనుకోవద్దు. మీకు ఏదయినా అలా కనిపించితే అవి మన జీవిత విధానాలు అని గుర్తుంచండి. అప్పుడు మీరు మీ జీవితంలోనికి అందాలు తెగలుగుతారు. ఆనందం మీ సొంతమవుతుంది. మీ చుట్టూ ప్రక్కల, మీ ఇంటిలో, సమాజంలో మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం వ్యాపించుతుంది.

Content: ఎవరయినా, నేటికాలం మనిషి నడిపే శక్తి ఏది అని అడిగితే, ఒకటి కాదు రెండు అని సమాధానం చెబుతారు. అవి కోరిక, ఆశ : ఆశ, ఆశగా ఉన్నతవరకూ పరవాలేదు. కాని అది అత్యాశగా మారినప్పుడే ఇన్ని సమస్యలు వచ్చేవి. అదే విధంగా కోరికలు అనేవి మన కోరికలయితే అసలు బాధపడే అవసరమే లేదు. కాని మనం ఎదుటివారిని చూసి వారి దగ్గర ఉన్న వాటిని మన కోరికలుగా మలుచుకోని, ఆ కోరికల వెంట పరుగులు తీస్తున్నాము. ఇది మనకి మరిన్ని బాధలని ముఖ్యంగా తీవ్రమయిన నిరాశ, మానసిక కుంగుబాటులని కలిగిస్తుంది.

Content: ఈ కోరికలు అత్యాశలు గురించి పరమహంస నిత్యానంద చాలా అద్భుతంగా విపరించుతారు. ఆయన చేపే ప్రతి మాట ఒక సత్యం. అది చురుక్కుమనే అగ్గీరవ్వలా మనసి తాకి, మనలో పేరుకుపోయిన మనవి కాని వాటిని దహించివేస్తుంది.

Content: మనిషిలో ఉండే కోరికల లక్షణాలని స్వామీజీ ఇలా చెబుతారు. మీలో ఉండే కోరికలకి అంతు ఉండదు. మహాపురుష ఈ విషయం గురించి ఒక చక్కని మాట చెబుతారు. “మనం జన్మించినప్పుడు మనకి ఏవి అవసరమో వాటిని మనతోపాటు ఈ భూమి మీదకి భగవంతుడు పంపించుతాడు.” కాబట్టి మన అవసరాలు గురించి అసలు చింతించనవసరం లేదు. ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికీ వున్న అవసరాలు చాలా సులభంగా తీర్చపచ్చు, కానీ ఈ ప్రపంచమంతా కలసి కూడా ఒక్క వ్యక్తి కోరికలని మాత్రం పూర్తిగా తీర్చలేదు.

Page 12

Content: ఇలా ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నించుకుంటే, మనం నిరంతరం ఒక కోరిక కోరిక వెంట వెళుతుంటాయి. ఒక కోరిక తీరగానే మరొక కోరిక మన ముందు సిద్ధంగా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఆ కోరిక తీరే వరకూ దాని తాలుకా వస్తువు మనకి అత్యవసరం అనిపిస్తుంది. అది లేకపోతే, జీవితం సాఫీగా సాగదు అనిపిస్తుంది. అది కోసగానే దాని విలువ పూరిగా తగ్గిపోతుంది.

Content: ఈ సందర్భంలో భగవాన్ రమణ మహర్షి మాటలని పరమహంస నిత్యానంద ఈ విధంగా చెబుతారు. “కోరిక ఉన్నప్పుడు అది ఆవగంజంతం అయినా మనకి పర్వతంలా కనిపిస్తుంది. ఆ కోరిక తీరాక పర్వతమంతం గొప్పవస్తువయినా మనకి ఆవగంజలా తోస్తుంది” అని.

Content: ఇలా ఎందుకు జరుగుతుందంటే మనం ప్రతి దానినీ యధాలాపంగా తీసుకుంటాము. పొందిన దానికి కృతజ్ఞత చూపం. అసలు మనం జీవితంలో పొందిన వరాలకి, బహుమతులకి పి నాదైన భగవంతునికి కృతజ్ఞతలు చెప్పామా. మీరు అందమయిన ప్రకృతిని చూడగలిగే కళ్ళు ఇచ్చిన దేవుడికి ఎనాడయినా కృతజ్ఞతలు చెప్పారా? మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే అక్కడకి తీసుకెళ్ళగలిగే కాళ్ళు ఇచ్చినందుకు, మీకు ఇంత అందమయిన లోకాన్ని ఇచ్చినందుకు, మీరు చేసే భోజనం ఇచ్చినందుకు, ఇలా చెబుతూ వెళితే కొన్ని వేల విషయాలు ఉంటాయి, వీటిని పొందినందుకు ఏ రోజూ భగవంతునికి కృతజ్ఞత చెప్పం సరికాదు, ఆ తరువాత ఏమిటి, ఆ తరువాత ఏమిటి? అని అడగటంతో సరిపోతుంది.

Content: మరొక సమస్య అత్యాశ. భవిష్యత్తులో ఏదో సంపాదించాలి అనే అత్యంత ఆందోళన. దానితో ఈ క్షణాన్ని ఆనందంగా గడపటం మర్చిపోతున్నాము. అందుకే ఎంత సంపాదించినా చెవికి శూన్యమే మిగులుతుంది. గుర్తుంచుకోండి ఏదో సంపాదించాలి, అప్పుడు సంతోషంగా ఉంటాను. అది సంపాదించాలి, అలా సంపాదించాకా సంతోషంగా ఉంటాను. ఇవన్నీ బ్రహ్మలే. అందుకే ఇంత పెద్ద ప్రపంచంలో ఎవరూ నిత్యం ఆనందంలో ఉండడటం లేదు. స్పష్టంగా అర్థం చేసుకోండి. ఎవరయితే ఈ క్షణంలో పూర్తి వర్తమానంలో ఉంటారో వాళ్ళు నిజమయిన సంతోషంలో ఉంటారు. ఆ ఆనందం కావాలి అంటే ఈ క్షణాన్ని ఆనందంగా, ఒక ఉత్సవంగా గడపండి.

Content: ఒక యోగి ఒక వ్యక్తి - నారదముని కథ

Content: మనిషికి అత్యాశ నిరాశనే కలిగిస్తుంది. కేవలం భవిష్యత్ కోరిక మీద మక్కువ పెంచుకుంటే వేధనే మిగులుతుంది. ఈ క్షణాన్ని ఆనందంగా గడపుతూ భవిష్యత్ మీద, భగవంతుని మీద నమ్మకం తప్ప కోరిక లేకుండా ఉండగలిగే వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో, వారి జీవితాన్ని ఎంత ఉత్సవంగా గడుపుతారో పరమహంస నిత్యానందస్వామి ఒక అందమయిన కధని చెబుతారు.

Content: నారద మహర్షి గొప్ప భక్తుడు. నిత్యం భగవన్నామ స్మరణలోనే కనిపిస్తాడు. ఆయన పేరు వినగానే మనకి గురువు వచ్చేది కూడా భగవన్నాము స్మరణ మాత్రమే. ఆయన త్రిలోక సంచారి. ఎక్కడికయినా, ఎప్పుడయినా వెళ్ళగల చనువు, శక్తి ఉన్న గొప్ప యోగిశ్వరుడు.

Content: ఒకసారి నారదమహర్షి త్రిలోక సంచారం చేస్తూ భూలోకం నుంచి వైకుంఠానికి విష్ణుమూర్తి దర్శనం కోసం వెళుతుంటాడు. అలా వెళుతూ దారిలో కనపడినవారిని పలకరిస్తూ, వారి యోగ క్షేమాలు తెలుసుకుంటూ ముందుకి వెళుతుంటాడు.

Page 13

Content: అలా వెళ్ళే సమయంలో ఒక అడవిలో చెట్టు క్రింద ఆయన నారదముని ఒక యోగిన చూస్తాడు. తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆతను నారదమహర్షిని చూసి నమస్కరించి “నారద మునీంద్ర తమరి ప్రయాణం ఎంత వరకూ” అని ఎంతో వినయంగా, భక్తిగా అడుగుతాడు.

Content: అప్పుడు నారదుడు తనను వైకుంఠానికి వెళ్ళి తిరిగి భూలోకానికి త్వరలోనే వస్తానని చెబుతాడు. అది విన్న యోగి ఎంతో ఆనందపడి నారదునితో ఇలా అంటాడు “నారద మహర్షి! దయచేసి నా తరువున శ్రీ మన్నారాయుణునికి ఒక మాట విన్నవించండి. నేను చాలా కాలంగా తపస్సు చేస్తున్నాను. నేను ఇంకా ఎంత కాలం తపస్సు చేయాలి. నాకు జ్ఞానోదయం ఎప్పుడు అవుతుంది. నాపై కరుణ చూపి ఈ విషయాన్ని కనుక్కొని రండి” అని అంటాడు.

Content: దానికి నారదుడు “స్వామీ! తప్పకుండా మీరు అడగమన్నట్టే అడుగుతాను” అని ఆ యోగికి మాట ఇస్తాడు. అలా కొంచం దూరం వెళ్ళాక అక్కడ అందమయిన పద్మాలు ఉన్న సరస్సు దగ్గర ఒక మృగి చెట్టు కని పిస్తుంది. అక్కడ ఒక భక్తుడు భగవంతుని కీర్తిస్తూ ఆనందపారవశ్యంతో నాట్యం చేసూ ఉంటాడు. ఆ భక్తుని పాటలోని లాలిత్యం, అతని పారవశ్యంలోని భక్తి నారదముని అటువైపు వెళ్ళేలా చేస్తాయి.

Content: నారదుముని చూసి ఆ భక్తుడు తన పాటని ఆవి, నారదునికి నమస్కరించి అతిధి మర్యాదలు చేస్తాడు. మాటల మధ్యలో నారదుడు తనను వైకుంఠానికి వెళ్ళి తిరిగి కొద్దికాలం తరువాత వస్తానని చెబుతాడు.

Content: ఆ మాట విన్న భక్తుడు అమితానంద భరితుడవుతాడు. ఆయన భక్తితో చేతులు జోడించి “మహారుపి! దయచేసి భగవానుని ఒకమ్మాట అడగండి. ఆయన దర్శనం నాకు ఎప్పుడు వుతుందో, ఆయన నన్ను ఎప్పుడు కరుణిస్తారో అడగండి. నన్ను కరుణించమని చెప్పండి” అని ప్రాదేయపూర్వకంగా అడుగుతాడు.

Content: అప్పుడు నారదుడు “తప్పనిసరిగా అడుగుతాను. నీ విషయం మరిచిపోను. నీవు బాధపడవద్దు” అని ఆ భక్తునికి మాట ఇచ్చి వైకుంఠానికి వెళ్తాడు. మరికొంతకాలానికి నారదుడు జవాబులతో భూలోకానికి వస్తాడు. ముందుగా యోగి దగ్గరికి వెళ్ళతాడు నారదుడు. ఆయనను చూడగానే యోగి ఎంతో ఆత్రుతతో ఎదురు వెళ్ళి, “మహారుపి! భగవంతుని కలసి నా విషయం అడిగారా? ఆయన ఏమని జవాబు ఇచ్చారు” అని అడుగుతాడు.

Content: ‘యోగీశ్వరా! మీ సంగతి అడిగాను, భగవంతుడు ఈ విధంగా జవాబు చెప్పారు. మీరు మరొక నాలుగు జన్మలు ఎదురు చూడాలంట. అప్పుడు మీకు జ్ఞానోదయమవుతుంది అని చెప్పారు” అని నారదముని జవాబు ఇస్తాడు.

Content: ఆ జవాబు వినగానే యోగి కుంగిపోతాడు. అమ్మో! ఇంకా నాలుగు జన్మలు ఎదురు చూడాలా? నేను ఏం చేయాలి. అయ్యో! నాకు ఎంత నిరీక్షణని విధించాడా భగవంతుడు” అని బాధతో కుప్పకూలిపోతాడు. ఆ యోగి భగవంతుని మాటలు గుర్తుకు తెచ్చుకుని మరీ బాధ పడిపోతుంటాడు. అతని అలా పదిలి నారదుడు ముందుకు వెళ్తాడు.

Content: అక్కడ మృగి చెట్టుకింద భక్తుడు ఎప్పటిలాగానే ఆనందపారవశ్యంలో భగవంతుని కీర్తిస్తూ పాటలు పాడుతుంటాడు. నారదుణ్ణి చూసి, ఆనందంగా ఎదురు వచ్చి “మహారుపి! భగవంతుని దర్శించుకున్నారా? నా విషయం అడిగారా? ఆయన ఏమని జవాబు ఇచ్చారు” అని అడుగుతాడు.

Content: ఆయన విషయం అడిగారా? ఆయన ఏమని జవాబు ఇచ్చారు” అని అడుగుతాడు.

Page 14

Content: నారదుడు అతనితో భగవంతుణ్ణి నీ విషయం అడిగాను. ఆయన నీ విషయం ఈవిధంగా చెప్పాడు, నీవు ఆయన దర్శనం కోసం చాలా జన్మలు చూడాలంట. అవి ఎన్ని జన్మలంటే ఈ చెట్టు మీద ఆకులు ఎన్ని ఉన్నాయో అన్ని జన్మలు ఎదురుచూడాలి. అప్పుడే నీకు జ్ఞానోదయం అవుతుందని, నీ మీద ఆయన కరుణ కురుస్తుందని చెప్పారు' అని అంటాడు.

Content: నారదముని చెప్పిన జవాబు విని, ఆ భక్తుడు ఎంతో ఆనందపడిపోతాడు. నారదునితో ఇలా అంటాడు "ఓ అలా చెప్పారా! చాలా సంతోషం ఆ దేవదేవుడు హామీ ఇచ్చారు. అది చాలు. నేను ఎన్ని జన్మలయినా ఎదురు చూస్తాను" అని ఆనందపారవశ్యంలో నాట్యం చేయటం ప్రారంభించాడు.

Content: ఆ భక్తుడు చివరి మాటను ముగించగానే పెద్ద వెలుగు వస్తుంది. అక్కడ భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఆ వ్యక్తికి జ్ఞానోదయమవుతుంది. భగవంతుని దర్శనం అవుతుంది.

Content: అక్కడ యోగి మాత్రం తన మనస్సు ఆడే ఆటలలో చిక్కుకుపోయి, తన కోరిక, ఆశల చిక్కులలో ఇరుక్కుపోయి విలవిలలాడుతున్నాడు. అతని కోరిక లోకికమయినది కాకపోవచ్చు, అది ఆధ్యాత్మిక కోరికే కావచ్చు. జ్ఞానోదయం పొందాలి అనే ఆశే కావచ్చు, కానీ అది కూడా కోరికే కదా!

Content: ఇక్కడ భక్తునికి కోరికే, కానీ అతను దానిని పట్టుకొని వేళాడటం లేదు. హాయిగా ఆ క్షణంలో, పరమాత్మలో ఆనందంగా ఉండగలిగాడు. అతను ఎదురుచూడటానికి అసలు బాధపడలేదు. ఇప్పుడే జ్ఞానోదయం కావాలి, భగవంతుని దర్శనం కావాలి అనే అత్యాశ లేదు. అందుకే అతను ఆనందపారవశ్యంలో ఉండగలిగాడు. భగవంతుడు ఇచ్చిన హామీ చాలు. అన్నింటికీ అతితంగా ఉన్న అతని విశ్వాసం అతను అనుకున్నది సాధించేలా చేసింది.

Content: స్వార్థం లేని, శ్రద్ధని ఆశించని ప్రేమ :

Content: ప్రేమ అనేది ఒక శక్తిపంతమయిన అద్భుతమయిన భావన. మానవ సంబంధాలని పటిష్టం చేయటంలో ప్రేమ చాలా చక్కని పాత్ర పోషిస్తుంది. సంబంధ బాంధవ్యాలు నిలిపే కీలక అంశం ప్రేమ. ప్రేమ అనేది లేకపోతే అసలు ఇంత అందమయిన భూలోకమే ఉండదు. ఎందుకంటే తన బిడ్డలయిన మానవుల కోసం భగవంతుడు ఒక అద్భుతమయిన కళాకారునిగా అవతరించి ఈ భూమిని ఒక గొప్ప కళాఖండంలా తీర్చిదిద్దాడు. దీనిని తనవారికోసం ఎంతో సౌకర్యవంతంగా చేసాడు. ఇదంతా ఆయనకి మన మీద వున్న అపారమయిన, హృద్యలు నిబంధనలు లేని ప్రేమ వలన మాత్రమే జరిగింది.

Content: అయితే నేటి మన ప్రపంచంలో ప్రేమ తన అసలు రూపాన్ని, రుచిని, లక్షణాన్ని కోల్పోయి అల్పస్థితిలోనికి జారిపోయింది. ఈ ప్రేమ తల్లిదండ్రులు-పిల్లల మధ్య అయినా కావచ్చు, ప్రేమికులు, భారాభర్తలు, స్నేహితులు, అన్నతమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎవరి మధ్య ఉన్న ప్రేమ అయినా అది ఎక్కడో అల్పస్థాయిలోనే ఉంది. పరమహంస శ్రీ నిత్యానంద స్వామి చెప్పే 'ప్రేమ దివ్య ప్రేమ, దైవ ప్రేమ. అది అత్యున్నత స్థాయిలో ఉండే ప్రేమ.

Content: అద్భుతమయిన దైవ ప్రేమ గురించి, అలాగే మన మధ్యస్థ ఉండే మామూలు ప్రేమ గురించి నిత్యానంద స్వామి ఈ విధంగా చెబుతారు. అందరూ అనుకునే ప్రేమ ఒక ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం. ఇవ్వటం అగిపోతేనే, ప్రేమ ఆగిపోతుంది. అదే విధంగా ఈ ప్రేమలో ఎదుటివారి నుంచి ఏదో ఆశించటం వుంటుంది. ఈ విషయంలో

Page 15

Content: తల్లి ప్రేమ కూడా ఎంతో కొంత ఆశించటంలోనే ఉంటుంది. కాకపోతే అది నిస్వార్థ ప్రేమ అవ్వవచ్చు కాని ఆశలు లేని ప్రేమ మాత్రం కాదు.

Content: మీరు ప్రేమ పంచటానికి కూడా ఎదుటివారికి అర్హత ఉన్నదా లేదా అని ఆలోచించి అప్పుడు ప్రేమిస్తారు. అంతేకాదు ఎవరికి ఎంత (ప్రేమ ఇవ్వాలో కొలచి అంతే ప్రేమని ఇస్తారు. ఇన్ని నిబంధనలు, హద్దులు కలిగి ఉన్న ఆ ప్రేమ నిజానికి ప్రేమ కాదు. అది ఎదుటివారి శ్రద్ధని ఆశించటమే. అందుకే ఆ ప్రేమని ప్రేమలో పడటం అంటారు. ఆ ప్రేమలో పడితే ఇక లేచే ప్రసక్తి ఉండదు. అందుకే మీకు తెలిసిన ప్రేమ, వ్యధలు సమస్యలతో ముగుస్తుంది. కష్టాలు, కన్నీళ్ళు ఇస్తుంది.

Content: ఎందుకంటే అది నిబంధనలు లేని ప్రేమ కాదు కాబట్టి. దానిలో ఉండేది కేవలం ఏదో ఆశించటమే కాబట్టి. ఇది పూర్తిగా కారణాలు మీద ఆధారపడిన ప్రేమ. ఉదా : పిల్లలు తమ తల్లి తమను అసుకుంటున్నట్టుగా ఉన్నంతవరకే తల్లిదండ్రుల ప్రేమ. పెద్ద వారిని ఎదిరించి పెద్ద నిర్ణయాలు చేయగానే ఆ ప్రేమ మాయం అవుతుంది. పిల్లల ప్రేమ కూడా అంతే.

Content: అదే విధంగా ప్రతి మానవ సంబంధంలోనూ ఎదుటివారి శ్రద్ధ ఆశించటం చాలా ఎక్కువగా ఉంటుంది. భార్య నిరంతరం భర్త తనని పట్టించుకోవాలని అలాగే భార్య కేవలం ఆమె సమయాన్ని తనకే కేటాయించాలని భర్త ఆశిస్తారు. అదే విధంగా ప్రతి వ్యక్తి ఎదుటివారి శ్రద్ధని ఆశిస్తారు. ఎదుటివారి శ్రద్ధ తమ మీద తగ్గినా మానసికంగా కుంగిపోతారు.

Content: కానీ గురువుల ప్రేమ స్వచ్ఛమైన, ఉన్నతమైన ప్రేమ. జ్ఞానోదయమయిన గురువులలో ప్రేమ పొంగి ప్రవహిస్తుంటుంది. వారి ముందు ఎవరు ఉన్నారో వారికి అర్హత ఉన్నదా లేదా అని ఆలోచించడు. ఆ ప్రేమ వెల్లువలో వారిని నింపటమే తెలుసు. అదే దైవ ప్రేమ. అందుకే జ్ఞానోదయమయిన గురువుల సమక్షంలో మనం అంత ఆనందంగా ఉండగలం.

Content: మనకి ఉండే చాలా సమస్యలకి, ముఖ్యంగా కుటుంబ సమస్యలు, సామాజిక సమస్యలు, మానవ సంబంధాలకి సంబంధించిన సమస్యలకి అసలు కారణం మనకి నిరంతరం ఎదుటివారు మనపై శ్రద్ధ చూపాలి అని ఆశించటమే. ఇది ఎక్కువ అయినప్పుడు, అనారోగ్యాలని కూడా తెచ్చుకుంటారు. ఎందుకంటే అనారోగ్యంగా ఉన్నప్పుడూ అందరూ మన మీద శ్రద్ధ చూపాలి అని ఆశించటమే. కాబట్టి మనసులో ఉండే మానసిక కుంగుబాటుకు కూడా అదే కారణం.

Content: అందరూ నన్ను నేను చేసిన పనిని చూసి, ప్రశంసించాలి. అప్పుడే నాకు ఉత్సాహంగా ఉండి మరింత ఎక్కువ పని చేయగలను అని అనుకోవటం చాలా సామాన్యం. అలా ఎవరైనా ఒక్కరు మెచ్చుకోకపోయినా ఆ వ్యకి మానసికంగా కుంగిపోతారు.

Content: ఒక్క నిముషం ఆలోచించండి, ఎదుటివారు మెచ్చుకుంటే మీరు పొందే సంతోషం కోసం ఎందుకు మీరు అంత తాపత్రయపడతారు. మీ అంతరంగంలో ఉండే మీ నిజమైన ఆనందాన్ని పొందినప్పుడు మీరు ఎవరి ప్రేమకోసం, ఎవరి శ్రద్ధ కోసం ఆతృతపడరు. ఎవరి నుంచి దేనినీ ఆశించరు.

Content: ఏమీ ఆశించని, నిస్వార్థమయిన ప్రేమ గురించి, ఎదుటివారి శ్రద్ధని ఆశించకుండా ఎంతో తృప్తిగా ఆనందంగా ఉండగలం అని నిరూపించే ఒక అద్భుతమయిన కధని పరమహంస నిత్యానంద చెబుతారు. అదే బామతి కధ.

Page 16

Content: భారతీయ వేదాంత సంపదలలో అత్యంత విలువైనది, అత్యంత క్లిష్టమయినది బ్రహ్మసూత్రాలు. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం మహారుషి, మహా జ్ఞాని వేదవ్యాసుడు తన తః ఫలితంగా అందిన అద్భుతమయిన జ్ఞాన సంపదని ఒక చక్కని గ్రంథంగా మలచి మానవజాతి పురోభివృద్ధికి అందించారు. అదే బ్రహ్మసూత్రాలు అనే ఒక గొప్ప వేదాంత గ్రంథం.

Content: బ్రహ్మసూత్రాలు అనే ఈ గ్రంథాన్ని ప్రపంచంలోని వేదాంతాలన్నింటిలోని సారంశంగా చెప్పవచ్చు. ఎందుకంటే అత్యంత ప్రాచీనమయిన బ్రహ్మసూత్రాల నుంచి ప్రపంచంలోని వేదాంతాలన్నీ ఉద్భవించాయి. అందుకే దీనిని గ్రంథాలకి గ్రంథమని, గ్రంథరాజమని చెబుతారు. బ్రహ్మసూత్రాలు అత్యత ఉత్తమయిన ప్రమాణాలు కలిగి, అన్ని కాలాలలోను అత్యుత్తమ గ్రంథంగా విరాజిల్లింది. (బ్రహ్మసూత్రాలని యధాతథంగా అర్థం చేసుకోవటం కష్టం.

Content: అందుకే జ్ఞానోదయమయిన ఋషుల దీనికి వ్యాఖ్యానాలు ప్రసార్.

Content: 8వ శతాబ్దంలో భారతదేశంలో జ్ఞానోదయమయిన ఒక గురువుగారి దగ్గర చాలామంది శిష్యులు ఉండేవారు. వారిలో వాచస్పతి మిశ్రా చాలా తెలివైన చురుకైన విద్యార్ధి. ఆ గురువు గారు ఒక రోజు వాచస్పతి మిశ్రాని పిలిచి బ్రహ్మసూత్రాలకి వ్యాఖ్యానం వ్రాయమని చెబుతారు. అది గురువుగా తనకి ఇచ్చిన ఒక వరంగా భావించి వినయంతో ఆ బాధ్యతని తీసుకుంటాడు, వాచస్పతి మిశ్ర

Content: ఆ గ్రంథం బాధ్యతతో పాటు ఆయన తన కుమార్తె భామతిని ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ తరువాత గురుదేవులు స్వర్గస్తులవుతారు. వాచస్పతి మిశ్రా గ్రంథ రచనలో ఉండగా అతని మంచిచెడ్డలు చూస్తూ అతను గ్రంథాన్ని విజయవంతంగా పూర్తి చేసే బాధ్యతని భామతి తీసుకుంటుంది.

Content: వాచస్పతి మిశ్రా బ్రహ్మసూత్రాలు అనే మహో గ్రంథానికి వ్యాఖ్యానం వ్రాయటం ప్రారంభించుతాడు. గ్రంథ రచనని ఆయన ఒక తీత్రమయిన తపస్సులా, ఒక లోతయిన ధ్యానంలా చేస్తుంటాడు. ఆ గ్రంథ రచనలో నిమగ్నమయిపోయి ప్రపంచాన్ని మర్చిపోతాడు. ఆ విధంగా ఆయన ఆ గ్రంథాన్ని వ్రాస్తూ చాలా సంవత్సరాలు దానిలోనే నిమగ్రమయిపోయి ఉంటాడు. ఆ గ్రంథ రచనలో ఉండగా ఆయన మరి దేనినీ గమనించవాడు కాదు.

Content: ఆ విధంగా ఆయన బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయి, గ్రంథ రచనలో నిమగ్నమయిపోతాడు.

Content: చివరికి ఆ గ్రంథ రచన పూర్తవుతుంది. ఇక ఆ పుస్తకానికి పేరు పెట్టడం మాత్రమే మిగిలి ఉంటుంది. అప్పుడు వాచస్పతి మిశ్రా బయట ప్రపంచం వైపు చూస్తాడు. గ్రంథంలోంచి బయటకి వచ్చి చూస్తాడు. అది సాయంతం సమయం, క్రమంగా చీకటి మొదలవుతుంది. ఆ సమయంలో అక్కడ ఒక పురులు వచ్చి దీపం వెలిగిస్తూ ఉంటుంది. ఆమెని చూసి వాచస్పతి మిశ్రా “మీరు ఎవరు?” అని అడుగుతాడు.

Content: ఆ ప్రశ్నకి ఆమె “పరవాలేదు మీ పనిని పూర్తి చేయండి” అని అంటుంది. అప్పుడు ఆయన “ఈ గ్రంథం వ్రాయటం పూర్తి అయింది. మీరు ఎవరో చెప్పండి” అని అడుగుతాడు.

Content: ఆమె వాచస్పతి మిశ్రా వైపు చూసి “నేను మీ భార్యని” అని జవాబు ఇస్తుంది. అప్పుడు జరిగిన సంఘటనకి ఆశ్చర్యపోతాడు. వాచస్పతి మిశ్రా విభ్రాంతిగా ఆమె వైపు చూస్తాడు.

Page 17

Content: అంటే ఆయన ఆ గ్రంథాన్ని రాస్తున్న ఇన్ని సంవత్సరాలు భార్య గురించి ఆలోచించలేదు. ఆ విషయాన్ని ఆయన నమ్మలేకపోయాడు. ఎంతో ఆర్తత నిండిన గొంతుతో ఆయన ఇలా అంటాడు "నీవు ఈ ఎందుకు ఈ విషయం నాకు గుర్తుచేయలేదు?"

Content: ఆ ప్రశ్నకి ఆయె “ఎందుకు? మీరు గ్రంథ రచనలో పూర్తిగా నిమగ్నమయినపోయారు. మిమ్మలని మీ నిష్కలతని భంగం చేయవలసిన అవసరం నాకు ఎప్పుడూ ఆనిపించలేదు” అని నెమ్మదిగా, ప్రశాంతంగా జవాబు చెబుతుంది.

Content: అప్పుడు వాచస్పతి మిశ్రా ఇలా అంటాడు “మానవులకి ఎంతో ఉపయోగపడే ఈ గ్రంథం కోసం నీ జీవితాన్ని త్యాగం చేసావు. ఆ త్యాగానికి ప్రతిఫలంగా నీకు నేను ఏమి ఇవ్వగలను”.

Content: అప్పుడు భామతి “ మీకు నేను చేయటంలో నేను చాలా ఆనందపడ్డాను. మీరు ఈ అద్భుతమయిన గ్రంధాన్ని వ్రాసే సమయంలో మీకు సేవ చేయగలగటమే నేను గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతకుమించి నాకు ఏ అవసరం లేదు” అని చాలా స్పష్టంగా, ధృడంగా జవాబు చెబుతుంది.

Content: భామతి జవాబు విన్న వాచస్పతి మిశ్రాకి ఆనందంతో కళ్ళలో నీళ్ళు వచ్చింది. ఆయన తన భార్యకి ఒక మంచి బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. ఆయన జీవితాంతం శ్రమపడి ఒక తపస్సులా వ్రాసిన ఆ అద్భుత గ్రంధానికి తన భార్య ‘భామతి’ పేరు పెడతాడు.

Content: ఈ రోజున మానవత్వం మీద ఉన్న ఒక అపురూపమయిన అద్భుతమయిన గ్రంథం, ఆమె పేరు మీద ఉంది. అదే భామతి. వేదాంతంలో ప్రవేశమున్నవారు, వేదాంతం పై పరిశోధనలు చేసేవారు, వేదాంతాన్ని తెలుసుకోగోరిన వారు, వేదాంత ప్రియులు తప్పని సరిగా చదివే గ్రంథం భామతి. రెండు వేల సంవత్సరాలుగా భామతి (గ్రంధాన్ని) కొని కోట్లవంది చదివి ఉంటారు.

Content: ఈ విధంగా భామతి ఈ ప్రపంచంలో శాశ్వతమయింది. ఆమెలోని నిస్వార్థ ప్రేమ, భక్తి, సేవాతత్పరత, త్యాగం ఆమెని ప్రపంచంలో శాశ్వతం చేసాయి.

Content: అసలు ఈ కథలోని ఒక అద్భుతమయిన విషయం ఉంది. అది ఏమిటి అంటే, అన్ని సంవత్సరాలు భామతి తన భర్తకి, ఆయన నిష్కలతని ఆయన గ్రంథ రచనని ఏమాత్రం భంగం పరచలేదు. ఆమె అలా చేయటం ఇష్టం లేక కాదు, తప్పదు కాబట్టి కాదు ఆమె ఏమని చెబుతుంది. ఆ అవసరం తనకి కలగలేదని చెబుతుంది. అది పరస్సితులకి సర్దుకుపోవటం కాదు. నాకు ఆ అవసరం లేదు అనటం, సర్దుకుపోవటం ఈ రెండింటికీ చాలా తేడా ఉంది.

Content: మనసకి చాలా స్థారు ఎదుటివారి ‘శ్రద్ధ మా మీద ఉండాలి అని వారు మనసు గురించ్చాలి, మన మీద ప్రేమ చూపాలి అని అనుకుంటాము, కానీ ఎందుకులే వారిని విసిగించవద్దులే అని సర్దుకుపోతాము. కానీ ఇక్కడ మన కథలోని భామతికి అసలు ఆ అవసరం లేదు. అదే తేడా ఆమె తన యవ్వనం వృధా అయిపోయింది అని అనుకోలేదు.

Content: అలా అని పరిస్థితులకి సర్దుకువోలేదు. ఆమె తన సహజత్వంతో, తనదైన సహజ వ్యక్తిత్వంతోనే ఉంది. అంటే, అది ఆమెకి చాలు. తన భర్త ఏకాగ్రతని పాడు చేయవలసిన అవసరం ఆమెకి రాలేదు. ఆమెకి అంతరంగంలోని శక్తి చాలు. ఆమె తన ఏకాగ్రతని తనమీద కేంద్రీకరించి తనలోని ఆనందాన్ని కనుగొనగలిగింది. ఆ పరమానందం

Page 18

Content: ఆమెకి నిజమయిన, శాశ్వతమయిన తృప్తిని ఇచ్చింది. ఆ ఆనందం యొక్క అనుభవమయిన వ్యక్తి ఆనందం కోసం, బయట ప్రపంచంలో ఎవరిపైనా ఆధారపడరు. వారికి ఎవరి శ్రద్ధ అవసరం లేదు. వారికి వారు చాలు. అలా ఆని వారు బయట ప్రపంచాన్ని వదలనవసరం లేదు. వారి బాధ్యతలని వారు చక్కగా నిర్వహించుతారు. అలాగే బయట ప్రపంచంలోని విషయాలు వారిపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు.

Content: అందుకే భామతి మరణించకా కూడా జీవిస్తూ ఉంది. పందల సంవత్సరాల తరువాత కూడా ఆమె మన మనస్సులలో ఉన్నత స్థానాన్ని పొంది మహోన్నత వ్యక్తిగా ఉండిపోయింది.

Content: కానీ మనం, మన ప్రవృత్తిని గుర్తి తెచ్చుకుంటే, ఎంతగా ఎడబాటువారి శ్రద్ధ, ప్రేమ కోసం తపించిపోతున్నామో అర్థమవుతుంది. ప్రేమని బలంగా అడగటం ఎంత తక్కువస్థాయిదో అర్థం చేసుకోండి. ఎవరూ కూడా ఆనందం కోసం, నిజమయిన సంతోషం కోసం ఎవరిపైనా ఆధారపడనవసరం లేదు అని ఈ కథ మనకి చెబుతుంది. ఎదుటి వారి శ్రద్ధ మనకి అవసరం లేదు. ఎదుటి వారి గుర్తింపు లేకుండానే మనం సంతోషంగా తృప్తిగా ఉండగలం అదే మనని శాశ్వతమయిన నిత్యానందం వైపుకు తీసుకెళ్ళగలుగుతుంది.

Content: మరణ భయం అన్ని భయాలకు మూల కారణం :

Content: భయం అంటే ఏమిటి? భయం అంటే మనం దేనినైనా పోగొట్టుకుంటామేమో అని అభద్రతా భావంలో భయం అంటే ఏమిటి? భయం అంటే మనం దేనినైనా పోపోతున్నామా? అని అంటే అది ఆస్తి, ఆనందం, ఆరోగ్యం, ప్రేమ, దగ్గరివారిని పోగొట్టుకోవటం ఇలా ఏదైనా సరే, అది మనసుంచి దూరం అవుతుంది అనే అభద్రతా భావమే భయాన్ని సృష్టిస్తుంది.

Content: పరమహంస శ్రీ నిత్యానంద మనకి తెలియని ఒక విషయాన్ని చెప్పినప్పుడు మనం ఆశ్చర్యపోతాం. అది మన అన్ని రకాల భయాలకు అసలు కారణం మరణభయమే. మన భయాలన్నీ ఎందుకు అని లోతుగా విశ్లేషించితే అది చివరికి మరణ భయం దగ్గరికే వెళుతుంది. అంతేకాదు స్వామి మరొక విషయం కూడా చెబుతారు. మరణం మన జీవితం యొక్క శ్రేష్ఠతని, నాణ్యతని మార్చివేస్తుంది. మరణం జీవితంలో ప్రతి క్షణంలో ఉంటుంది. ఇది మన జీవితాన్ని నిద్రెశిస్తుంది. ఎందుకంటే మరణం అనే ఒక అంశం మొత్తం జీవితాన్ని నియంత్రిస్తుంది.

Content: పరమహంస మరణం గురించి ఈవిధంగా చెబుతారు. మనం మరణం గురించి పూర్తిగా అర్థం చేసుకుంటే, అందులో రహస్యాలని లోతుగా తెలుసుకోగలిగితే, మనం జీవిత రహస్యాలని బాగా అర్థం చేసుకోగలుతాము.మరణం అంటే కేవలం మరొక రూపంలోకి వెళ్ళటమే అని తెలుసుకోగలిగినప్పుడు మనికి మరణ భయం ఉండదు.

Content: భయం అనేది కేవలం ఒక భావన మాత్రమే. ఈ భావన మనలో బలంగా నాటుకుపోవటానికి అసలు కారణం మరణం అంటే మనికి ఉండే భయం. దాని తరువాతది మన అహంకారాన్ని తృప్తిపరచటం. ఉదాహరణకి పరువుపోతుందేమో, నాకు ఉన్న కీర్తి పేరు పోతాయేమో ఇటువంటి భయాలు లేవా పిల్లలు ఎదిరించి తమ అధికారాన్ని లెక్కచేయరేమో అనే భయం అహంకారానికి దెబ్బ తగులుతుందనే భయం, ఇవన్నీ భావాలే కొందరికి చీకటంటే భయం, నీట్లు అంటే భయం. అగాధాలు అంటే భయం. జంతువులంటే భయం. ఇవన్నీ కూడా మరణం అంటే మనకి ఉండే భయాలే. అయితే వివరంగా చూస్తే భయాలన్నీ కూడా మనం

Page 19

Content: పోగోట్టుకోవటానికి అక్కడ ఏమీ లేదు అనే విషయం స్పష్టంగా మనకి తెలియక పోవటమే. ఉదాహరణకి ఎవరయితే మరణానికి దగ్గరగా వెళతారో, మరణాన్ని దగ్గరగా ఎదుర్కొంటారో వారికి అక్కడ పోగోట్టుకुनేది ఏమీ లేదు అని అర్థమవుతుంది. ఎవరయితే మరణ భయాన్ని జయించుతారో వాళ్ళు మరణాన్ని జయించినట్లే.స్వామీజీ ఈ విధంగా చెబుతారు మరణం అంటే మరోక రూపంలోకి మారే ఒక ప్రక్రియ. మీరు మరణాన్ని మరణ భయాన్ని అర్థ చేసుకుంటే జీవితాన్ని సంతృప్తిగా ఎంతో నాణ్యతతో జీవించగలుగుతారు.

Content: మరణం చాలా మంచి గురువు, మరణాన్ని వెతుకుతూ వెళ్లితే అక్కడ మరణం ఉండదు. మన జీవితంలో ఏదీ కచ్చితంగా జరగదు ఒక్క మరణం తప్పా. అయినా మనం ఆ మరణాన్ని తప్పించుకోవటానికి మనశక్తి కొంతీ, మనకి ఉన్న అన్ని అవకాశాలని ఉపయోగించి ప్రయత్నిస్తాము. అంటే కాని మరణం ఒక గురువు, మనికి బహుమతులనిచ్చే ఒక గొప్ప దేవత అని గ్రహించము. మరణం యొక్క గొప్పదనాన్ని స్పష్టంగా, వివరంగా చెప్పే కథ ఒకటి మన ఉపనిషత్తులలో ఉంది. స్వామీజీ ఆ కథని తప్పనిసరిగా తన నిత్యసంద ధ్యాన స్పురణ కార్యక్రమంలో చెబుతారు. అకథ గురించి ఇప్పుడు తెలుసుకుందాము.

Content: నచికేత కథ :

Content: మనికి ఉండే అనేకమయిన గొప్ప ఉపనిషత్తులలో కథోపనిషత్తు అనేది ఒక అద్భుతమయిన ఉపనిషత్తు. కథోపనిషత్ అంతా కూడా ఒక చిన్న బాలుడికి యమధర్మరాజుకి మధ్య జరిగే ఒక చక్కని విజ్ఞానపూరితమయిన సంభాషణ. ఈ కథకి నాయకుడు బాలుడు అయిన నచికేతుడు. ఇందులోని మరొక పాత్ర యమధర్మరాజు.అయిన మరణానికి దేవత మరణ శాసనకర్త.

Content: ఒకప్పుడు వాజశ్రవసుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకి సర్వసంపదలు పొందాలి అని, ఈ ప్రపంచాన్ని పరిపాలించాలి అనే కోరిక కలిగింది. అందా కోరిక సాధించటానికి ఆయన వాజపేయ యజ్ఞం చేయాలని సంకల్పించుతాడు. సర్వసంపదలకి అధిపతి కావాలి అని అనుకుంటే, ప్రపంచాన్ని నియంత్రించాలి అని అనుకుంటే ఈ యజ్ఞం చేయాలి.

Content: ఈ యజ్ఞం చేయటానికి కొన్ని నియమాలు ఉన్నాయి. యజ్ఞం చేసే వ్యక్తి తనకున్న సంపదలు దానమీయాలి. తనకి అత్యంత ప్రియమయినవి, తనకి అధిక సంబంధం గల వస్తువులని, తన దృష్టిలో అత్యంత విలువయిన సంపదలని ఆ యజ్ఞం చేసే వ్యక్తి దానమీయాలి. అప్పుడే ఆ యజ్ఞం పూర్తి అవుతుంది. దాని ఫలితాన్ని యజ్ఞం చేసే వ్యక్తి పొందగలుగుతాడు.

Content: అయితే ఆ రాజు బుట్టెవులకి దక్షిణగా కానుకలు ఇవ్వటానికి, దానం చేయటానికి జీవితపు చివరి దశలో ఉన్నవి, ముసలివి అయిపోయి పాలు ఇవ్వలేని ఆవులని, ఎందుకూ పనికి రాని ఆవులని దానం చేస్తాడు. ఆ విధంగా ఏమాత్రం ఉపయోగం లేని వాటిని దానం ఇవ్వసాగాడు.

Content: ఆ రాజుకి ఏడుసంపత్సరాల వయస్సు ఉన్న కొడుకు ఉన్నాడు. అతని పేరు నచికేతుడు. అతను తన తండ్రి చేస్తున్న పనిని గమనించసాగాడు. అతను తండ్రిచేసే దానం సరైనది కాదు అని అర్థం చేసుకున్నాడు. ఆ బాలుడికి తండ్రి చేసే పని తప్పు అని అర్థమయింది. అయితే అతనికి ఎలా చెప్పాలో తెలియలేదు.

Content: ఆ విధంగా మొదటి నుంచీ తండ్రిని గమనిస్తూ ఉన్నాడు నచికేతుడు. చివరకి తండ్రి దగ్గరకి వెళ్ళి

Page 20

Content: తండ్రి! మేరు యజ్ఞంలో మీకు ఉన్న విలువయిన సంపదని దానం ఇవ్వాలికదా! నేను మీకు ఉన్న విలువయిన, మీకు ప్రియమయిన సంపదని కదా! మరి నన్ను ఎవరికి దానంగా ఇస్తన్నారు? అని అడుగుతాడు. రాజుకి కొడుకు మనస్సు అతను తనకి ఏమి చెప్పదలచుకున్నాడో ఆ విషయం అర్థమయింది. నచికేత తను చేసే పనిని గురించి మాట్లాడుతున్నాడు అని అర్థమయింది. కాని అతని అహంకారం రాజుని ఆ వనినుంచి తప్పించలేకపోయింది. అతను నచికేత మాటలను లెక్కచేయకుండా తనపనిని తాను చేసుకుపోతుంటాడు.

Content: నచికేత తండ్రిని అదే ప్రశ్న అడుగుతాడు, నన్ను ఎవరికి దానం ఇస్తారు అని అంటాడు. రాజు జవాబు చెప్పడు.అప్పుడు నచికేత అదే ప్రశ్నని పదే పదే అడుగుతాడు.రాజుకి చాలా కోపం వస్తుంది. "నిన్ను యముడికి ఇవ్వాలి అని అనుకుంటున్నాను. యముడి దగ్గరికి వెళ్ళు", అంటాడు చాలా కోపంగా.

Content: తండ్రి తనని మృత్యువుకి అప్పగిస్తున్నాను అని చెప్పినా అతడు బెదరడు. అతను నిజాయితీ కలవాడు, సత్యతత్పరుడు. అతను తండ్రి మాటకి కట్టుబడి తండ్రిమాటని గౌరవించటానికి యమధర్మరాజుని కలవటానికి వెళ్తాడు. అతను యమలోకం వెళ్ళిన సమయానికి అక్కడ యమధర్మరాజు ఉండడు. యమధర్మరాజు కోసం ఎదురు చూస్తుంటాడు. ఆ విధంగా మూడురోజులు గడిచిపోతాయి. అయినా నచికేత అక్కడే ఉంటాడు. మూడురోజులు గడిచాక యమధర్మరాజు యమలోకానికి తిరిగి వస్తాడు.

Content: అప్పుడు యమధర్మరాజు సేవకులు ఆయనతో ఒక బాలుడు ఆయనకోసం మూడురోజులనుంచి ఎదురు చూస్తున్నాడు విషయాన్ని చెబుతారు. వెంటనే యమధర్మరాజు నచికేత దగ్గరికి వెళ్తాడు. యమధర్మరాజు ఆ బాలుడితో అతను వచ్చేసమయానికి స్వాగతం చెప్పటానికి తాను లేకపోయినందుకు క్షమాపణ కోరతాడు.

Content: ఆయన నచికేతుని తో, "నిన్ను నేను మూడురోజులు ఎదురు చూసెట్టు చేసాను. దానికి పరిహారంగా నీకు మూడు వరాలు ఇస్తాను. నీకు ఇష్టమయిన మూడు కోరికలు కోరుకో.ఆకోరికలు తీరుస్తాను అంటాడు. నచికేతకు మరణం వరాలు ఇచ్చే దేవత అయినది. నచికేత యమధర్మరాజుని మూడు వరాలు కోరతూ ఈ విధంగా అంటాడు. "యమధర్మరాజా! ధనుర్దని నీవు నాపై చూపించే ఆపాయమయిన కృపకి ప్రేమకి నా నమస్సులు. పే ధర్మదేవత! నామోదటికోరిక; నాతండ్రి చేసిన పాపాలు పరిహారం చేయండి " అని అడుగుతాడు. యమధర్మరాజు తధాస్తు అని వరం ఇచ్చాడు.

Content: "పే మృత్యుదేవత నా రెండవ కోరిక; మిమ్ములని కలిసి వెళ్ళాక నాతండ్రి నన్ను స్వీకరించాలి" అని పారించుతాడు. నచికేతుని రెండవ కోరిక కూడా తీరుస్తాడు యమధర్మరాజు. నచికేతుడు తన మూడవకోరికను ఈ విధంగా అడుగుతాడు.

Content: మేయం ప్రేతే విచికిత్సా మనుశ్యే స్తిత్స్తే కే నాయస్తితి చైకే ! ఏతద్ విద్యామయ శిష్టస్వయాహం వరాణామేష వరస్తృతీయః ॥ (కఠోపనిషత్ :20)

Page 21

Content: హే ! యమధర్మరాజా, నా మూడవకోరిక విను. చనిపోయిన వ్యక్తి జ్ఞాప్తస్తాడు (ఉన్నాడు) అని కొందరు అంటారు. మరికొందరు జన్మించారు, అని అంటారు. ఏది నిజం. ఈ విషయం గురించి తెలుసుకోవాలి అన్నదే నాకోరిక. ఇదే నేను విన్ను అడిగే మూడవ వరం" అని అంటాడు. ఏడు సంవత్సరాల పసి బాలుడి ప్రశ్న విని యమధర్మరాజు నిర్భాంతపోతాడు. ఆయన నచికేతతో ఈ విధంగా అంటాడు, “నచికేత ! ఇది చాలా సూక్ష్మమయినది, బహు కష్టతరమయిన విషయం. దీనిని నీవు అర్థం చేసుకోలేవు. నీవు మరొక వరం ఏదైనా కోరుకో. ఈ వరం మాత్రం నన్ను అడగవద్దు. నన్ను ఈ మాట అడగకుండా వదిలిపెట్టు”, అని అంటాడు. యమధర్మరాజు మాటలు విన్న నచికేతుడు వినయంగా ఈ విధంగా జవాబు చెబుతాడు. “యమధర్మరాజా ! ఇది చాలా సూక్ష్మమయినది, బహుకష్టతరమయిన విషయం అని మీరు చెబుతున్నారు కదా! కాబట్టి ఈ విషయాన్ని నాకు వివరించగల సమర్థులైన ఆచార్యులు మీరే. ఇంకా ఎవరూ ఈ విషయాన్ని వివరించలేరు. అందుచేత ఈవరాన్ని నాకు ఇవ్వండి. ఈ వరంతో సమానమయిన వరం మరి ఎక్కడాలేదు.”

Content: నచికేతుని జవాబు విన్న యమధర్మరాజు నచికేతుని ఒప్పించాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు. నచికేత నీకు సర్వసంపదలు ఇస్తాను, దీనికి సరితూగే మరే వరమయినా కోరుకో. అది ఏ వరమయినా తీరుస్తాను. నీవు గొప్ప సామ్రాజ్యానికి చక్రవర్తి కావాలి అంటే ఆ వరం ఇస్తాను. నీకు కలిగే కోరికలన్నీ తీరుస్తాను కానీ ఈ ప్రశ్న మాత్రం అడగవద్దు అంటాడు. అప్పుడు నచికేతుడు ఈ విధంగా జవాబు చెబుతాడు.

Content: శ్లో॒భావామృత్యో॒ర్యద॑ంత॒రైత॑త్‌

Content: స॒ర్వే॒ండ్రి॑యాణాం జ॒య॑ంతి తే॒జః॑

Content: అ॒పి స॒ర్వం జీ॑విత॒మ॑పే॒వ

Content: త॒మై॑వ వా॒హ॑స॒వ నృ॑త్య॒గీ॑తే॒ ॥

Content: “ఓ యమధర్మరాజా, సుఖవ్వ చెప్పేవస్నే కూడా క్షణికాలే. ఇవస్నే మానవుని ఇంద్రియశక్తిని క్షయింప చేసేవే. ఎంత పొడిగించినా మానవ జీవితం అల్పమే. అందుచేత అవస్సే నీ దగ్గరే ఉంచుకో కానీ నేను అడిగిన వరాన్ని ఇవ్వు, మరణాంతరం ఏమి జరుగుతుందో తెలియచేయి, మరణం వెనుక ఉన్న రహస్యాన్ని చెప్పు. అది తప్పా నాకు మరొక వరం వద్దు” అని కచ్చితంగా చెబుతాడు. యమధర్మరాజు ఆ బాలుడిలోని పరిణతి, సత్యాన్ని తెలుసుకోవాలనే పట్టుదల గమనించాడు. ఆయన ఆ బాలుడి పరిణతి చూసి మెచ్చింకి మరణం యొక్క రహస్యాన్ని ఆ అనుభవాన్ని తెలియచేయాలి అని నిర్ణయించుకుని అతనికి ఆ విషయాలసన్నీ భోదించుతాడు.

Content: యమధర్మరాజు ఇచ్చిన అనుభవపూర్వకమయిన జ్ఞానానికి, ఆ బాలుని ఆత్మపొందిన అసుభవానికి నచికేతుడు ఎంతో వికాసం పొందుతాడు. జ్ఞానోదయం పొందుతాడు. కరోపనిషత్తులో ఉండే ఈ కథని పరమహంస నిత్యానంద ఎంతో అద్భుతంగా, చక్కని వివరాలతో చెప్పి, ఈ కథలో మనం తెలుసుకోగల గొప్ప సత్యాలని ఈ విధంగా చెబుతారు.

Page 22

Content: . మరణం ఒక గురువు, అది మనకి జ్ఞానాన్ని ఇస్తుంది.

Content: . మనం మరణాన్ని వెతుకుతూవెళితే అక్కడ మనకి మృత్యువు (మరణం) కనిపించదు.

Content: . ఒక వేళ మరణం అక్కడ ఉంటే మనందరం అనుకునేటట్టు అది మనని భయపెట్టదు. అది మనని ప్రేమిస్తుంది, మనకి బహుమతులు ఇస్తుంది.

Content: . మరణం మనకి అంతిమ బహుమతిని ఇస్తుంది. అదే జ్ఞానం.

Content: -O-

Content: మనిషి దివ్యశక్తి సంపన్నుడు

Content: మనిషి భగవంతుని యొక్క అద్భుతమయిన సృష్టి. భగవంతుడు గొప్ప కళాకారుడు. ప్రతీ వ్యక్తిని ప్రత్యేక శ్రద్ధతో రూపొందించి వారిలో తన దివ్యశక్తిని నింపాడు. ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తిని ఒక ఉద్దేశంతో పంపించుతాడు. వారు ఆ లక్ష్యాన్ని సాధించగల నేర్పుని వారిలో నింపుతాడు. వారు ఈ ప్రపంచంలో సాధించవలసిన లక్ష్యాలకి అనుగుణంగా వారి శరీరాన్ని, మేధస్సును తీర్చిదిద్దుతాడు. చివరిగా ప్రతి వ్యక్తిలోనూ తన శక్తిని నింపుతాడు. అందుకే మనం భగవంతుని పిల్లలము, మనం ఆయన యొక్క ప్రతిరూపాలం.

Content: భగవంతుడు అంటేనే సర్వశక్తి స్వరూపం. రూపం లేని రూపంలో ఆ శక్తి ప్రపంచమంతా, ఈ విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. ఈ విశ్వంలోని గ్రహాలు, నక్షత్రాలు అన్నీ కూడా ఆ శక్తి ఆధారంగానే పనిచేస్తున్నాయి. అంత అద్భుతమయిన శక్తి మనలోపల ఉంది. భగవంతుడు శక్తి మాత్రమే కాదు. ఒక అపూర్వమయిన మేధస్సు. ఆశక్తి, మేధస్సులని మేళవించి మనని తయారుచేసాడు. అందుకే భగవంతుని సృష్టి అద్భుతం, అపూర్వం. మనలోని భగవంతుని శక్తికి నాశనం అనేది లేదు. అది శాశ్వతమయినది. ఎప్పుడూ శక్తి, మేధస్సులతో ప్రకాశించుతూ ఉంటుంది. దానినే మనం ‘ఆత్మ’ అంటాము. అదే మన యొక్క నిజమయిన ఉనికి. అంతేకాని ఈ శరీరం, ఈ మనస్సు అనేవి నిజమయిన మనం కాదు. శరీరం మనికి ఒక వాహనం లాంటిది. అలాగే మనస్సు అనేది అనేక సాంఘిక, సాంస్కృతిక, జీవన విధానాల ఆధారంగా మనం చేసే ఆలోచనల సమూహం, అంతేకాని అది నిజమయిన మన ఉనికి కాదు.

Content: మనం మన ఉనికి, మనలోపల నిక్షిప్తమయిపోయిన అసలయిన మన శక్తిని తెలుసుకోలేక పోతున్నాము. భగవంతుడు మనలని సృష్టించిన విధంగా మన సహజమయిన తత్వంతో స్వచ్ఛతతో ఉండగలిగితే మనం మన అంతరంగంలోని అసలయిన దివ్యశక్తిని తెలుసుకోగలం. అయితే ఆ శక్తి మీద ఆ ఉనికి మీద సమాజపు నిబంధనలు, మన అహంకారం, మనలోని వ్యతిరేక భావవేగాలయిన అసూయ, ద్వేషం, అత్యాశ, కోపం ఇలాంటివసే పొరలు పొరలుగా కప్పివేసాయి. కాలక్రమంలో ఆ పొరలు గట్టి పడిపోయాయి. చివరికి మనం అంటే ఆ పొరలు, లేదా శాశ్వతమయిన ఈ శరీరం మాత్రమే అని అనుకునే స్థితికి చేరిపోయాము.

Content: ఈ సందర్భంలో పరమహంస నిత్యానంద ఈ విధంగా చెబుతారు, “అసలు సమస్య ఏమిటి అంటే మనం మనలోని దివ్యశక్తిని మరచిపోయాము. మనం కేవలం మాములు మనుషులం మాత్రమే అని అనుకుంటున్నాము. మనలోని శక్తి చాలా చిన్నది అని దాని పరిధిని చూస్తూంటాము. దానివలన మనం అసూ సాధించలేము అని అనుకుంటాము. మీరు తెలుసుకోగలిగితే మీలో అంతులేని అద్భుతమయిన శక్తి నిక్షిప్తమై

Page 23

Content: ఉన్నది. మీలోని శక్తికి ఎలాంటి హద్దులు లేవు. మీలో అనంతమయిన విశ్వశక్తికి ఉన్నది దానిని గుర్తించి చేరగానే అది గొప్ప విస్పోటకంగా బయటకి వచ్చిెన్నో పెద్దపెద్ద లక్ష్యాలని సాధించే విధంగా మీకు సహాయం చేస్తుంది.

Content: ఒక చిన్న కథ :

Content: మన పరిస్థితి ఎలా ఉన్నదో మీకు వివరంగా, అర్థమయ్యే విధంగా పరమహంస శ్రీ నిత్యానంద ఒక చిన్న కథ చెబుతారు.

Content: మొదటి ప్రపంచయుద్ధం ముగిసిన తరువాత, సైనికులు ఒక చిన్న విమానాన్ని అడవుల ప్రాంతంలో పదిలిపెట్టి వెళ్ళిపోతారు.

Content: ఆ స్థలానికి కొంచెం లోపల ఒక చిన్న గిరిజనులు ఉండే పల్లె ఉంటుంది. ఆ గ్రామంలోని ప్రజలకి నాగరికత అసలు తెలియదు. ముఖ్యంగా అప్పటికి బయట ప్రపంచంలో జరిగిన అభివృద్ధి గురించి తెలయదు.

Content: వారికి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అసలు లేదు. వారు వారి జీవితకాలంలో ఎప్పుడూ విమానం అనే దానిని చూడలేదు, దాని గురించి వినలేదు. అసలు అటువంటిది ఈ ప్రపంచంలో ఉన్నది అని వారికి తెలియదు.

Content: అటువంటి అమాయకమయిన గ్రామస్తులు ఆ విమానాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు. ఆ విమంత వస్తువు గురించి తెలుసుకున్న గ్రామస్తులు అందరూ దాని చూట్టూ గుమిగుడి, అది ఏమిటి? అనే విషయం మీద చాలా సేపు వాదించి, విపరించి చివరికి దానికి రెండు చక్రాలు ఉన్నాయ్ కాబట్టి అది ఎడ్లబండి అని నిర్ణయించుతారు. వారిలో పెద్దలు ఇలా అంటారు. బహుశః కొత్త ప్రదేశంలోని వారెవరో ఇటువంటి ఎడ్లబక్కని వాడతారు కాబోలు అని నిర్ణయించుతారు.

Content: దానికి రెండు ఎడ్లు కట్టి దానిని గ్రామంలోనికి తెస్తారు. వారి గ్రామంలోనికి ఒక వింత బండి వచ్చిన సందర్భంగా గ్రామస్తులందరూ ఆనందంలో ఉత్సవాలు జరుపుతారు. ఆవిధంగా చిన్న విమానాన్ని గ్రామస్తులు ఎడ్లబండిలా ఉపయోగిస్తుంటారు.

Content: ఇలా కొన్ని వారాలు గడస్తాయి. అప్పుడు ఆ ఊరికి ఒక యువకుడు వస్తాడు. ఆ అబ్బాయి ఆ ఊరికి దూరంగా ఉండే ఒక చిన్న పట్టణంలో చదువుకుంటున్నాడు. శెలవలు గడపటానికి ఊరికి వచ్చి ఎడ్లు కట్టిన విమానాన్ని చూస్తాడు. ఆ అబ్బాయి విమానం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న మెషిన్లు, గేర్లు, స్విచ్ఛులు గమనించి వాటిని అటూ ఇటూ తిప్పుతాడు. అప్పుడు అకస్మాత్గా ఒక ఇంజను పనిచేయటం మొదలు పెట్టింది.

Content: ఆ అబ్బాయి పట్టణంలో ట్రాక్టర్లు చూసాడు. అతనికి ఆ ట్రాక్టరు, ట్రక్కులు గుర్తువచ్చి బహుశః ఇది కూడా ఒక ట్రాక్టరు లాంటిదే అని అనుకొని ఆ గ్రామస్తులకు ఆ విషయం చెబుతాడు.

Content: "ఇది ఎడ్లబండికొడు దానికి ఎడ్లు కట్టినవసరంలేదు. దానంతట అదే మేజిక్ కర్రలతో తిరగగలుగుతుంది" అని ఆ యువకుడు చెబుతాడు. అయితే గ్రామస్తులు అతని మాట నమ్మరు. అప్పుడు ఆ అబ్బాయి విమానాన్ని గ్రామమీదల నడిపి చూపిస్తాడు. గ్రామస్తులు ఎంతో ఆశ్చర్యపోయి, అంత వింతగల బండి వారి ఊరిలో ఉన్నది అని గర్వంగా, ఆనందంగా మరోసారి ఉత్సవాలు చేసుకుంటారు.

Content: ఈ విధంగా కొన్ని నెలలు గడిచిపోతాయి. అప్పుడు ఆ ఊరికి రిటైర్ అయిన మిలటరీ అఫీసరు వస్తాడు. అతనికి విమానాన్ని ట్రాక్టర్లా ఉపయోగిస్తున్న గ్రామస్తులు కనిపిస్తారు.

Page 24

Content: ఆ ఆఫీసరు గ్రామ ప్రజల దగ్గరికి వెళ్ళి "ఇది ట్రాక్టరు కాదు ఇది విమానం ఇదిగాలిలో ఎగురుతుంది. ఇది ఏమిటో తెలియక మీరు దీనిని ట్రాక్టర్లా రోడ్డుమీద తిప్పుతున్నారు." అని చెబుతాడు. గ్రామస్తులు ఆఫీసరు మాటని కొట్టిపారేస్తారు. వారి దృష్టిలో కేవలం పక్షులు మాత్రమే ఎగరగలవు. కాని మనుషులు, మెషిన్లు అలా ఎగరలేవు. అప్పుడు ఆ అఫీసరు విమానంలో కూర్చోని దానిని కానీపు గాలిలో తిప్పి కిందకి దింపుతాడు. అది చూసిన గ్రామస్తులు ఆశ్చర్యానికి అంతు ఉండదు. వారు తమ కళ్ళని నమ్మలేకపోతారు. అసలు ఇది ఎలా సాధ్యం ? అని అడుగుతారు. దానికి ఆ అఫీసరు దీనిలో ఉన్న అసలయిన శక్తి మీకు తెలియదు. అందుకే మీరు దానిని విమానంలా ఉపయోగించలేకపోయారు అని అంటాడు. మనలోని శక్తి విషయంలో మనం కూడా ఆ గ్రామస్తుల విధంగానే ప్రవర్తిస్తున్నాము. మనం ఎగరగలం. ఆశక్తి ఉన్నది కానీ ఆ శక్తి విషయం తెలియక పాఠకుతున్నాము. ఎవరయినా గురువులు, యోగీశ్వరులు వచ్చి మీరు గొప్ప శక్తి సంపన్నులు మీలోపల శక్తి అద్భుతమయినది, మీరు ఎంతోరెట్లు శక్తివంతులు అని చెప్పినా మనం వారి మాటలు నమ్మం. అందుకే క్రింది స్థాయిలోనే ఉండిపోతాము. పరమహంస నిత్యానంద ఈ విధంగా మనస్థితిని పోల్చిచెబుతూ మరొక విషయం కూడా వివరించుతారు. మనలో ఎవరయితే కేవలం అత్యల్ప స్థాయిలో నాఇల్లు, నా ఉద్యోగం, నావారు అనే చిన్న చిన్న విషయాలకి మాత్రమే పరిమితమైపోతారో వాళ్ళు ఎడబండి స్థాయిలో ఉంటారు. వారు వారిలోని అద్భుతమయిన శక్తిని కేవలం చాలా క్రింది స్థాయిలో మాత్రమే ఉపయోగించుకుంటూ నేను మాఇల్లు మనిషిని, నాజీవితం ఇంతే అని తృప్తి పడతారు. వారు ఎడబండి స్థాయినుంచి ఎదగరు. కొంతమంది ఉద్యోగం, ఇల్లు, ఆస్తి వీడితోపాటు కళలలో ప్రావీణ్యం సంపాదించుకుంటారు, కళలలో రాణిస్తారు. నాట్యం, సంగీతం, కవిత్వం, శిల్పకళ మొదలయిన విద్యలు ఉన్నవారు ట్రాక్టర్ స్థాయిలో జీవిస్తారు. వారిలో శక్తిని ఆ స్థాయిలో ఉపయోగించుకోగలుగుతున్నారు. అలాంటివారు, జీవితంలో ఏదో సాధించాము అన్న తృప్తితో జీవించుతారు. దీనిని తరువాతది అత్యున్నత స్థాయి అయిన ఆధ్యాత్మిక స్థితిని చేరడం. ఈస్థాయిలోని వారు తాము విశ్వశక్తిలో ఒక భాగం అనే అంతిమ సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. వారు జ్ఞానోదయం పొంది అత్యుత్తమ చేతనస్థితిలో ఉంటారు. అటువంటివారు తమలోని శక్తిని విమానం స్థాయిలో ఉపయోగించుతారు. వారు నిరంతరం పరమానందపు పారవశ్యంలో ఉంటారు. వారినే పరమహంసలు అంటారు. వారు ఆకాశంలోకి అంతే అత్యున్నత స్థితికి ఎగరగలరు (చేరగలరు) నీటిలో తామరలా ప్రపంచపు చాయ అంటా కూడదు

Content: ఈ ప్రపంచంలో ప్రతివ్యక్తీ ప్రయత్నించేది; వెతికేది ఒకే ఒక్క దాని కోసం అదే పరమానందం. పరమానందం అంటే శాశ్వతమయిన సంతోషపు స్థితి. ఇది అత్యున్నతమయిన స్థితి. మరి అందరూ ఎంతో కష్టాలు ఇబ్బందులు పడుతూవెతుకుతున్న ఆనందం వారికి దొరుకుతుందా? మరి అలా దొరికితే అందరూ నిరంతరం ఆనందస్థితిలో ఉండటం లేదు ? గొప్ప చదువులు చదివి, ఉద్యోగాలు చేసి; ఆస్తి, పేరు

Page 25

Content: ప్రతిష్టలు సంపాదించి, అధికారాలు చెలాయించి అన్నీ ముఖ్య దేవాలయాలు చూసి అన్నీ చేసాక ఎందుకు అందరిలో చివరికి శూన్య భావన మాత్రమే మిగులుతుంది ? ఎందుకు అంతలేని ఆవేదన, మానసిక కుంగుబాటు మిగులుతుంది? కారణం ఏమిటి? వీటి అన్నింటికీ కారణం ఒక్కటే. మనం వెతుకుతున్న ఆనందం మనలోనే ఉంది. అది బయట ప్రపంచంలో లేదు. ఆ విషయం మనకి తెలియక బయట ప్రపంచంలో వెతుకుతూ ఉంటాము. డబ్బు ద్వారా, పేరు ప్రఖ్యాతుల ద్వారా, అధికారం ఆస్తుల ద్వారా ఆనందం పొందవచ్చు అని అనుకుంటాము. అందులో వచ్చే చిన్న చిన్న సంతోషాలనే ఆనందం అని మురిసిపోతాము. చివరికి వ్యధలలో కూరుకుపోతాము.

Content: ఇక్కడ మీరు చేసే తప్పుపని ఒక్కటి ఉంది. మీరు మిమ్ములని నమ్మటం మానేసి సమాజాన్ని ఈ ప్రపంచాన్ని నమ్మటం మొదలు పెట్టారు. మీకు మీరు అప్పాయింట్‌మెంట్ ఇచ్చుకోవటానికి టైం ఉండదు అంటారు కాని ప్రపంచంలో అందరికీ అప్పాయింట్‌మెంట్ ఇస్తారు, అని పరుగుపడే పదే పదే హడావిడి చేస్తారు.

Content: మీరు అంటే ఏమిటో మీకు తెలియదు. ప్రపంచం మీ గురించి ఏమి చెబితే అదే మీరు అనుకుంటారు. మీకోరికలు, మీ లక్ష్యాలు మీకు తెలియదు. ప్రపంచంలోని ఇతరుల కోరికలని మీ కోరికలుగా చేసుకొని బాధలు కొని తెచ్చుకుంటారు. ఉదాహరణకి మీ ఆఫీసు పనికి, ఇంటి పనికి మోటార్ సైకిల్ చాలు. కాని ప్రక్కింటి వ్యక్తి కారుకొనగానే ‘అయ్యో! నాకు కారులేదు కారులేని బ్రతుకు కష్టాలమయం’ అని కారులేకపోతే కళిగే కస్టాలు లిస్టులు తయారుచేసుకుని, చాలా కష్టాలుపడి డబ్బు సంపాదించి కారు కొనుక్కుంటారు. కారుతో పాటు మనకి ఏమివస్తాయో తెలుసు, కస్టాలు. అందుకే అంటారు, కస్టాలు కొని తెచ్చుకున్నాము అని.

Content: ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు. కారు అనేది అదనపు సౌకర్యమే కదా! కస్టాలు ఎలా అవుతాయి? అది మనకి నిజమయిన అవసరం అయినప్పుడు సౌకర్యం అవుతుంది. అవసరం లేనప్పుడు అది భారమే కదా! భారం అంటే సమస్యలు. ఈ విధంగా మీరు ప్రతివిషయానికి, ప్రతిక్షణం ప్రపంచం మీద ఆధారపడి ఉంటారు. ప్రపంచంలో మునిగిపోయి మీరు అనేక విషయాల్ని మర్చిపోతారు. సమాజపు కోరికలు మీ అవసరాలుగా చేసుకుంటారు. సమాజం యొక్క అభి|ప్రాయంతో మీరు ఏమిటో తెలుసుకుంటారు. అందుకే ఇన్ని వ్యధలు.

Content: మీరు నిరంతరం పరమానందంలో ఉండాలి అంటే మీరు ఈ ప్రపంచంలో ఉంటూ ఈ ప్రపంచం పు చాయలు మీ నిష్ఠలనిటన బంగపరచకుండా ఉండాలి. అది ఎలా అంటే పద్మ నీటిలో పుట్టి, అక్కడే పెరిగి అందులోనే అందంగా వికసించుతుంది. కానీ ఒక్క నీటి బొట్టుకూడా పద్మాన్ని కాని, పద్మ పత్రాలనికాని అంటలేదు. మనస్కూడా ఈ ప్రపంచంలో ఉంటూ ఈ ప్రపంచంను వస్తువులు కాని, సంఘటనలు కాని, వ్యక్తులు కాని మనని ప్రభావితం చేయలేని విధంగా ఉండాలి. అంటే ఈ ప్రపంచం వెలుపకోవటంతో సంతోషపడి, విమర్శించగానే కుంగిపోకూడదు. ఏదైనా ఒక వస్తువు మనని ఆకర్షించితే మీరు నిజాయితీగా మీతోనే కూర్చొని ఈ వస్తువు నిజంగా నాకు అవసరమా అని తెలుసుకోవాలి. అలా చేసినప్పుడు ఈ ప్రపంచం వలన మన నిష్ఠలత పాడవదు. మన ప్రశాంతత, ఆనందం అనేవి ప్రభావితం కావు.

Content: మనం ఆ విధంగా ఉండగలగాలి అంటే ఏమి చేయాలి? మన ఏకాగ్రత నిరంతరం, కేవలం మనలోని మన ఉనికి, మన ఆత్మ మైన మాత్రమే ఉండాలి. మన ఆత్మ మాత్రమే మనకి సరియైన మార్గాన్ని

Page 26

Content: చూపించగలుగుతుంది. ఎందుకంటే అది దివ్యశక్తి మయమయినది కాబట్టి. నిరంతరం మన ఎరుక, మన తెలుసుకునే తత్వం, మన ఏకాగ్రత మనస్తోనే ఉండాలి. బయట ప్రపంచపు విషయాలు, వస్తువులు ఎంత ఆకర్షణతో ఉన్నాకూడా అవి మన నిశ్శలతని బంగపరచలేని విధంగా మనం ఉండాలి. అలా ఉన్న వ్యక్తులు బయట ప్రపంచంలోను, అంతరంగ ప్రపంచంలో కూడా అద్భుతాలు సాధించగలుగుతారు.

Content: బయట ప్రపంచపు అనవసర విషయాలు మనని ప్రభావ పరచకపోతే ఎంత గొప్పవారమైనా కావచ్చు ఇందుకు ఉదాహరణగా పరమహంస నిత్యానంద ఒక చక్కని కథ చెబుతారు.

Content: శుక మహారుషి జీవితం నుంచి ఒక చిన్న సంఘటన :

Content: శుక మహారుషి గొప్ప యోగిశ్వరుడు అత్యంత ప్రతిభ గల మహారుషి. ఆయన మహా మేధావి, ఈ ప్రపంచంలోనే పేరెన్నిక కలిగి ఎన్నదగిన మహో జ్ఞాని కుమారుడయిన శుకుడు తండ్రి దగ్గర విద్యాభ్యాసం చేసి శాస్త్రాలు కావ్యాలు అన్నీ నేర్చుకుంటాడు.

Content: ఒకరోజు వ్యాసమహరుషి శుకుని పిలిచి, "నేను నీకు నేర్పించవలసిన విద్యలు, బోధించవలసిన సత్యాలు చెప్పాను. ఇప్పుడు నీవు జనకమహారాజు దగ్గరకి వెళ్ళు" అంటాడు

Content: జనక మహారాజు విధిలా దేశానికి రాజు. ఆయన గొప్ప మహారాజు, కానీ అంతకంటే గొప్ప యోగిశ్వరుడు, రాజరుషి. ఆయనకి విదేహ అనే పేరు ఉంది. విదేహ అంటే శరీరం లేనివాడు. అంటే ఆయన తన శరీరం తనుకాదు అని తెలుసుకున్న జ్ఞానమూర్తి. ఆయన అష్టమైశ్వర్యాలతో తులతూగే దేశానికి రాజు అయికూడా, ఈ ప్రాపంచిక విషయాలు అంటకుండా, వాటితో ఏవాత్రం చలించకుండా ఉండగలిగే ఆధ్యాత్మిక యోగిశ్వరుడు.

Content: ఆయన తనలోని తన నిజమయిన ఉనికిలో స్థిరపడిన వ్యక్తి. ఎవరయితే వారిలోని నిజమయిన ఉనికిలో, ఆత్మలో స్థిరపడగలరో, వారిలోనే వారి ఏకాగ్రత నిలపగలరో అటువంటివారిని బయట ప్రపంచం యొక్క వస్తువులు, వ్యక్తులు ప్రభావితం చేయలేవు. వారు నిరంతరం మహదానందంలో ఉంటారు. అందుకే వ్యాసుడు తన కుమారుడు శుకుని జనకమహారాజు దగ్గరికి పంపించుతాడు.

Content: జనక మహారాజుకి శుకుడు వస్తున్న విషయం తలుస్తుంది. అతనికి స్వాగతం చెప్పటానికి తగిన ఏర్పాట్లు చేస్తాడు. మంత్రలకి ఆ బాధ్యతలు అప్పగించుతాడు. ఒకరోజు శుకుడు జనకమహారాజు భవనం దగ్గరకి చేరుకుంటాడు. ఆయన రాజభవన ద్వారం దగ్గరకి వస్తాడు కానీ ద్వారపాలకులు ఆయనని గుర్తించరు.

Content: శుకుడు విశిష్టమయిన పేరు ప్రఖ్యాతులగల మహాజ్ఞాని వ్యాసుడి కుమారుడు అయినా ఏమీ మాట్లాడకుండా ఆ ద్వారం దగ్గర మూడు రోజులు కూర్చుంటాడు. కానీ ఎవరూ కూడా అతనిని పట్టించుకోరు. అలా మూడురోజులు గడిచాక, జనకుని మంత్రలకి శుకుడు పచ్చిన విషయం తలుస్తుంది.

Content: శుకుడు భవనం బయట ఎదురు చూస్తున్నట్టు తెలుసుకుని పరుగు పరుగున ద్వారం దగ్గరికి వస్తారు.

Content: వారు ద్వారం దగ్గర ఇదరు చూస్తున్న శుకుని అత్యంత గౌరవ మర్యాదలతో సకల రాజ లాంఛనాలతో రాజ భవనంలోనికి తీసుకు వెళతారు. ఆయనకి వైభవోపేతమయిన భవనాన్ని ఇస్తారు. అద్భుతమయిన రాజరికపు భోజనాన్ని ఇస్తారు. అన్ని సౌకర్యాలు సమకూర్చుతారు. భయభక్తులతో మర్యాదలు చేస్తారు.

Content: శుకుని గమనించితే ఆయనలో ఎటువంటి మార్పు కనిపించదు. ఆయనకి మూడురోజులు రాజభవనం

Page 27

Content: బియట ఎదురు చూసే విధంగా ఏమాత్రం గౌరవం భక్తి లేకుండా రాజభవనం వారు ప్రవర్తించినప్పుడు ఆయనలో అదే ప్రశాంతత, నిశ్చలత ఉన్నాయి. ఆయనని అత్యంత గౌరవమర్యాదలతో, రాజలాంఛనాలతో సత్కరించినప్పుడూ అదే ప్రశాంతత, అదే నిశ్చలత ఉన్నాయి. ముఖంలో ఎప్పుడూ చెదరని చిరునవ్వు అన్ని సమయాలలో ఒకే విధంగా ఉంటుంది. దీనినే ప్రపంచంలో ఉంటూ ప్రపంచ విషయాలు అంటకుండా జీవించగలగటం అంటారు. తరువాత శుకుని జనకుడు ఉన్న రాజసభకి తీసుకువెళతారు. జనకుడు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. సభలో సంగీత,నాట్య కార్యక్రమాలు చాలా అట్టహాసంగా జరుగుతూ ఉంటాయి. సభలోని వారు అందరూ ఆ అట్టహాసంలో, హోరున వినిపించే సంగీత నాట్యాలలో మునిగిపోయి ఉంటారు.

Content: అక్కడికి వచ్చిన శుకుడుకి జనకుడు నిండుగా పాలను నింపిన పాత్రని ఇచ్చి, ఆపాత్రని పట్టుకొని సభచుటూ ఏడుసార్లు తిరగాలి, తిరిగే సమయంలో పాత్రలోని పాలు తొణికి వలక కూడదు అని చెబుతాడు. శుకుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ పాత్రని తీసుకొని సభచుటూ తిరగటం ప్రారంభిస్తాడు.

Content: అదే సభలో ఎంతో అందమయిన నాట్యాలు, ఆశ్చర్యదమయిన సంగీత కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవి చాలా ఆకర్షణగా ఉన్నాయి. అటువంటి అట్టహాసల మధ్య, ఆకర్షణల మధ్య శుకుడు పాలు ఉన్న పాత్రతో సభచుటూ ఏడుసార్లు తిరిగాడు. ఈ అట్టహాసాలు ఆ యువ ఋషి నిశ్చలతనం ఏమాత్రం భంగపరచలేక పోయాయి.

Content: పాలు ఉన్న పాత్రని తిరిగి జనకుని అప్పచెబుతాడు శుకుడు. అప్పుడు శుకుని చూస్తూ జనకుడు, "మీ తండ్రిగారు నీకు నేర్పించిన సత్యాలనే నేను తిరిగి చెప్పాను. నీవు ఏ సత్యాలనైతే సంపూర్ణంగా తెలుసుకోగలిగావో వాటినే నేను నీకు చూపించాను.నీకు తెలియవలసినదంతా తెలుసుకున్నావు. కుమారా! ఇక నీవు ఇంటికి వెళ్ళవచ్చు " అని చెప్పి శుకుని ఆశీర్వదించి పంపిస్తాడు రాజర్షి జనకుడు.

Content: శుకుడు ఈ ప్రపంచంలో ఏ విషయాల వలన ప్రభావితుడు కాలేడు. ఆ విధంగా ఉండాలి అనేది అతని నిర్ణయం. మనం చేసే ప్రతి పనిని మనమే ఎంచుకుంటాము. అది కేవలం మన నిర్ణయమే. ఉదాహరణకి మిమ్ములని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళమీద కోపం చూపించాలా వద్దా అనేది మీ నిర్ణయం. అసలు మీకు కోపం కూడా రాదు. అటువంటి స్థితిలో ఎంతమంది మిమ్ములని తిట్టినా మీరు నిశ్చలంగా ఉండిపోగలుగుతారు. ఒకవేళ వారిపైన కోపం చూపించినా దాని ప్రభావం మీ మీద అసలు ఉండదు. ఆ స్థితిని సాధించాలి అంటే సాధనతో సాధ్యమవుతుంది. ధ్యానం చేస్తే అది మిమ్ములని ఆ స్థితికి చేరే విధంగా సహాయం చేస్తుంది.

Content: తగిన మోతాదులో ఉంటే కోపం గొప్ప శక్తి

Content: కోపం మరొక మోసపూరితమయిన భావావేశము. కోపం అనేది చాలా చిన్న విషయం కానీ అత్యంత ప్రమాదకరమయినది కూడా, ఎందుకంటే మనకి కోపం వచ్చినప్పుడు, ఆ అవేశం మనని తన ఆధీనంలోనికి తీసుకుకుంటుంది. మన ఆధీనంలో ఉండి మనం చెప్పినట్లు వినవలసిన ఆవేశం, మనని తన వశం చేసుకుని మనం ఏంచేస్తున్నామో స్పృహ లేకుండా చేస్తుంది. అందుకే అంటారు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తునో నాకు తెలియదు అని. కోపం అంటే ఒక సంఘటనకి కాని, వ్యక్తుల వలన కలిగిన సంఘటనకి కానీ మనసుంచి

Page 28

Content: వచ్చే స్పందన మాత్రమే. ఎందుకు కోపం వస్తుంది? కోపంలో ఎందుకు అంత అతిగా ప్రవర్తించుతాము? చిన్న విషయానికే ఎందుకు అంత కోపం తెచ్చుకుంటాము?

Content: మై ప్రశ్నలన్నిటికి పరమహంస నిత్యానంద ఒక చక్కని వివరణ ఇస్తారు. మనకి కోపం కలిగినప్పుడు రెండు విషయాలు జరగాలి. మొదటిది కోపాన్ని ప్రదర్శించటం. సమాజపు మర్యాద పాటించటానికి గాని లేదా మన ఉద్యోగ ధర్మం వలన కాని లేదా కుటుంబసమస్యలు వస్తాయి అనే భయంతో కానీ మనం చాలాసార్లు కోపాన్ని చూపించడం. కోపం చూపిస్తే ఉద్యోగం పోతుంది లేదా ఇంటక గొడవలు ఎక్కువ అయిపోతుందని కాబట్టి కోపాన్ని ఎదుటివారిపై చూపించలేము. అదే విధంగా కోపాన్ని అణచకూడదు. అలా అణచివేస్తే, అది మనలోపల శారీరక, మానసిక వ్యాధిలా మారిపోతుంది.

Content: అసలు మనకి అంత త్వరగా కోపం ఎందుకు వస్తుంది? మనం చిన్నతనం నుంచి మనలోని కోపం, ద్వేషం, అవమానం ఇటువంటి భావాలని అణచివేస్తాము. అవన్నీ కూడా మనలోపల పేరుకుని పోతాయి. అవి ఒక అగ్నిపర్వతంలా తయారవుతాయి. మనం సమాజమర్యాద కోసం లేదా మరొక కారణంతో ఆ అగ్నిపర్వతానికి మూత పెట్టి దానిమీద కూర్చుంటాము. అది లోపల రగులుతూ ఉంటుంది. అది ఎప్పుడైనా ఏదైనా రాపిడి జరిగినా బ్రద్దలయ్యి అందరికీ అశాంతిని తెస్తుంది. అందుకే మనం నడిచేటప్పుడు ఎవరైనా మనకి తగిలారనుకొండి లేదా సైకిల్ తగిలిందనుకొండి, మనకి పెద్దగా దెబ్బలు తగలవు కానీ మనం దానిని కారణంగా చూపించి చాలా గొడవ చేస్తాము. చిన్న విషయానికే అంత పెద్దగా ఎందుకు చేస్తామంటే దానికి కారణం మనలో ఆనచివేయబడిన కోపం మొదలయిన భావాల వలన.

Content: ఈ రోజు ప్రపంచంలో ఇంత హింస జరగటానికి కూడా అదే కారణం. దీనివలన కోపం చూపే వ్యక్తి, దానికి బలి అయిన వ్యక్తి ఇద్దరూ బాధపడతారు. ఇద్దరూ అశాంతితో ఉంటారు. తిరిగి ఆ అశాంతి మరింత అశాంతిని సృష్టిస్తుంది.

Content: కోపాన్ని ఎలా వ్యక్తం చేయాలి : మీరు కోపాన్ని అణచకోవద్దు, అలా అని అతిగా వ్యక్తం చేయవద్దు. మీకు కోపం వచ్చినప్పుడు దానిని జాగ్రత్తగా గమనించండి. ఆకోపాన్ని చేతన స్థితిలో పరిశీలించండి. అప్పుడు మీకు కోపం అసలు రూపం తెలుస్తుంది. ఎంతకోపాన్ని ప్రదర్శించాలో అర్ధమవుతుంది. అప్పుడు మనం అంతే కోపాన్ని చూపించుతాము. అప్పుడు ఎదుటి వ్యక్తిపైన మన కోపాన్ని చూపించక మనకి అపరాధ భావం ఉండదు. ఎదుటి వ్యక్తిలో మార్పు వస్తుందే కానీ అతను బాధపడడు.

Content: అదే విధంగా కోపం, ద్వేషం మొదలయినపై మనసుని ప్రభావితం చేయకుండా ఉండే విధంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. ఆ స్థితిని ధ్యానం ద్వారా సాధించవచ్చు. కోపం అనే భావన మనలోనికి వచ్చినప్పుడు ఒక్కసారి చేతన స్థితిలో అది ఎందుకు వచ్చిందో అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు అసలు అది నిజమయిన కోపమా లేక మరొక భావన ఆ రూపంలో వచ్చిందా అనే విషయం మనకి అర్ధమవుతుంది.

Content: మీరు ఎప్పుడైనా కోపం వలన ప్రభావితమయ్యి ‘అయ్యో ఎందుకు అలా చేసాను’, అని అనుకుంటే మీరు కోపాన్ని అచేతనస్థితిలో చూపించారు అని అర్థం.

Page 29

Content: అదే విధంగా, కోపం మీ నిశ్శలతని, మీ ప్రశాంతతని పాడు చేస్తే మీరు కోపాన్ని తెలుసుకునే తత్వంతో పరిశీలించలేదు అని అర్థం. అటుంటప్పుడు మీరు కోపానికి బానిస అవుతారు. కోపం అనే భావన మిమ్ములని తన ఆధీనంలోనికి తీసుకుంటుంది.

Content: సాధువు - పాము కథ

Content: ఒక గ్రామంలోనికి కొత్తగా ఒక నాగుపాము వస్తుంది. అది ప్రజలని భయభ్రాంతులని చేస్తూ, వారి జీవితాలలో ప్రశాంతత లేకుండా చేస్తుంది. గ్రామ ప్రజలు స్వయంగా తమ పనులు చేసుకోలేకపోతుంటారు. నిరంతరం భయంతో జీవిస్తూ ఉంటారు. వారు ఎంత ప్రయత్నించినా ఆ పాముని ఏమి చేయలేక పోతారు.

Content: ఇలా కొంతకాలం గడిచాక ఆ ఊరికి ఒక సాధువు వస్తాడు. ఆయన హిమాలయాలలో తపస్సు చేసుకొని దేశ పర్యటన చేస్తూ ఆ గ్రామానికి వస్తాడు. తపస్సు చేసే యోగులకి జంతువుల భాష తెలుస్తుంది. అని ఎవరో ఆగ్రామస్తులకి చెబుతారు. ఆవిషయం తెలుసుకున్న గ్రామస్తులు ఊరు చివర ఉన్న యోగి దగ్గరకి వెళతారు.

Content: భయంతో అక్కడ నిలబడిన గ్రామస్తులని చూసి ఆ యోగి, "అయ్యా మీరు ఎవరు? ఎందుకు అలా భయపడుతున్నారు?" అని ఎంతో ప్రేమగా లాలనగా అడుగుతాడు.

Content: అప్పుడు వాళ్ళు ఆయన కాళ్ళమీద పడి "స్వామీ! మేము ఈ గ్రామ పెద్దలము. మా ఊరిలోనికి ఒక నాగుపాము వచ్చి మమ్ములని భయభ్రాంతులని చేస్తుంది. మా జీవితాలని అల్లకల్లోలం చేస్తుంది. మీకు జంతువుల భాష తెలుసు అని విన్నాము మా మీద దయ చూపించి, ఆ పాము వలన మాకు బాధలు లేకుండా చూడండి. మమ్మలని కాపాడండి" అని దీనంగా అడుగుతారు.

Content: "తప్పకుండా! నేను ఆ పాముతో మాట్లాడి, అది మీ జోలికి రాకుండా చూస్తాను. మీరు ధైర్యంగా మీ పనులు చేసుకొండి, ఇక నిశ్చింతగా ఉండండి" అని వారికి చెప్పి వెనక్కి పంపించి వేస్తాడు.

Content: ఆ తరువాత ఆ సాధువు పామును కలిసి దానితో మాట్లాడి చివరగా "ఓ స్నేహితుడా! అమాయకులయిన గ్రామస్తులని హింసించవద్దు నామాట విని, వారిని వదిలి వేయి" అని అంటాడు.

Content: సాధువు మీద ఉండే అపారమయిన గౌరవంతో నాగుపాము ఆ సాధువుకి సరే అని మాట ఇస్తుంది. గ్రామస్తులు జోలికి వెళ్ళను అని ప్రమాణం చేస్తుంది.

Content: కొంతకాలమయ్యాక ఆ సాధువు తిరిగి హిమాలయాలకి వెళ్ళిపోతూ అదే గ్రామానికి వస్తాడు. ఆ గ్రామం సరిహద్దుల దగ్గరకి రాగానే సాధువుకి అతని స్నేహితుడయిన నాగుపాము కనిపిస్తుంది. నాగుపాము పరిస్థితి అతి దయనీయంగా ఉంటుంది. అది గాయాలతో రక్తం కారుతూ బాధపడుతూ చనిపోయే స్థితిలో ఉంటుంది. పాముని ఆశ్చర్యంతో చూసిన సాధువు ఆశ్చర్యపోతాడు, చాలా బాధపడతాడు. ఆయన పాము దగ్గరకి వచ్చి, "స్నేహితుడా! నీకు ఏమయింది? ఎందుకు ఇంత దీన స్థితిలో ఉన్నావు. ఎందుకు నీకు ఇన్ని దెబ్బలు తగిలాయి?" అని అడుగుతాడు.

Content: దానికి ఆపాము, "ఓ!సాధువా! ఇదంతా నీవలనే జరిగింది" అంటుంది నిష్కారంగా. "అసలు ఏమిజరిగిందో చెప్పు" అంటాడు సాధువు

Page 30

Content: "నేను గ్రామస్తుల జోలికి వెళ్ళను అని నీకు ప్రమాణం చేసాను కదా! నీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు వరకూ నేను వారిని ఏమీ అనకుండా, నీమాట ప్రకారం నడుచుకుంటున్నాను. కానీ ఈ గ్రామస్తులు నేను ఇచ్చిన మాటని అలుసుగా తీసుకుని నన్ను హింసిస్తున్నారు. ఇదివరకు గ్రామస్తులు నన్ను చూసి భయపడి పారిపోయేవారు. ఇప్పుడు నా మంచితనాన్ని నా బలహీనతగా అనుకుని నన్ను చిత్రహింసలు పెడుతున్నారు. నేను వారిని కాటు వేయను అని తెలుసుకొని నన్ను కొట్టి బాధ పెడుతున్నారు. చూడు నాపరిస్థితి ఎంత భయంకరంగా ఉందో! చూస్తే నీకే అర్థమవుతుంది." అని బాధపడుతూ చెబుతుంది నాగుపాము. పాము చెప్పినదంతా విన్న సాధువుకు ఆ పాము అమాయకత్వం చూసి జాలి అనిపిస్తుంది. "అయ్యో !అమాయకపు స్నేహితుడా !నేను నిన్ను ప్రజలని కాటువేయొద్దు అని చెప్పాను కానీ బుసకొట్టవద్దు అనలేదుగా. నీవు వారిని భయపెట్టి కానీ కాటువేసి ప్రాణం తీయవద్దు" అని హితవు చెబుతాడు సాధువు.

Content: మీరు కోపాన్ని చూపించవచ్చు కానీ దానిని సరియైన పద్దతిలో, తగిన మోతాదులో మాత్రమే చూపించాలి. అలా చేయగలిగినప్పుడు మీ కోపం మీకు మంచి చేస్తుంది, ఎడతెరిపి లేకుండా మీ కోపం మీకు మంచి చేస్తుంది. కోపం గురించి తెలుసుకుంటే కోపం తగ్గుతుంది. దానిని సరియైన పద్దతిలో ఉపయోగించితే అది గొప్ప శక్తిగా మారి అందరికీ మంచి చేస్తుంది. పెద్దలు చెప్పే విషయాలు మన మంచి కొరకే : జీవితంలో చాలా దూరం ప్రయాణించి, అందులోని సాధక బాధలని, కష్టాలు, ప్రమాదాలని, మంచి చెడులని తెలుసుకొని ఆ అనుభవంతో పెద్దవారు, గురువులు, తలైద్రులు పిల్లలకి, జీవితపు ప్రయాణంలో మొదటి మలుపులో ఉన్నవారికి హితవు చెబుతారు. వారు తమ అనుభవం ద్వార ముళ్ళదారి,పూల బాటలని గుర్తించి మనని మంచి మార్గంలో వెళ్ళమని బోధిస్తారు. వినకపోతే దండిస్తారు. కానీ చిన్నపిల్లులు, యువత వారిని, వారి మాటలని పట్టించుకోకుండా అలా చెప్పేవారిని శత్రువులుగా చూస్తారు. అలా ఎందుకు చేస్తారు?

Content: ఇదంతా కూడా మనలోని మోసపూరితమయిన మనస్సు, జిత్తులమారి అహంకారం అడే నాటకం. ఎప్పడయితే మనం మన మనస్సు (ఆలోచనలు), అహం మాట వింటామో అప్పుడు హృదయానికి, ఆ తరువాత మనలోని మన నిజమయిన ఉనికి అయిన ఆత్మకి దూరం అయిపోతాము. ఎప్పడయితే మనం మన అంతరాత్మకి దూరం అవుతామో అప్పుడు సర్వాంతర్యామి, విశ్వశక్తి అయిన భగవంతునికి కూడా దూరం అయిపోతాము.

Content: అహం అంటే నేను, నాది అనే హద్దులు మాత్రమే. మనస్సు అంటే అర్థం లేని ఒకదానికొకటి ఎటువంటి సంబంధంలేని ఆలోచనలు. ఈ రెండు కలిసి మన మన అంతరాత్మకి, సర్వాంతర్యామికి మధ్య దూరాన్ని పెంచుతాయి. అవి మన మధ్యకి అడ్డుపొర అయిన పేతువాదాన్ని తీసుకువచ్చి అవి చెప్పేదే నిజం అని నమ్మేలా చేస్తాయి.

Content: మనస్సు, అహం అనేవి మనసోంతం కాదు. అవి నిజమయిన మన ఆత్మకి సంబంధించినవి కాదు, అవి సమాజంచేత, మనలోని భావావేశాలు, కోరికలు వలన తయారుకాబడి, మనకి తెలియకుండా మనలోనే పట్టిష్టంగా తయారయినవి. వాటినే పరమహంస "నీవు కాని నీవు " అంటారు. ఇవి పూర్తిగా మన ఆచేతనస్థితిలోనే

Page 31

Content: పని చేస్తాయి. గురువులు,యోగీశ్వరులు మనకీ పదే పదే ఈ విషయాన్ని చెబుతారు, "నీనుంచి నీవు దూరం అయిపోతున్నావు. సమాజం నీపైన వేసిన ముద్రలని నీవు అని బ్రహ్మపుడి పొంగిపోతున్నావు లేదా కుంగిపోతున్నావు. అది సరియైన పద్దతి కాదు.నేను, నాది అనే అహంకారాన్ని వదిలిపెట్టు అది మహా ప్రమాదకరమయినది. నీవు అహంకారాన్ని పదలకపోతే అది నిన్ను ఆధ్యాత్మిక దారిలోకాని, బయట ప్రపంచంలో కాని అభివృద్ధిని సాధించనీయదు." కానీ మనం వారి మాటలు వినం; విన్నా వారిని నమ్మం.

Content: ఇదంతా ఎలా ఉంటుందంటే , చిన్న పిల్లలు, యువకులు తప్పవారిలో వెళుతున్నప్పుడు పెద్దలు, తల్లిదండ్రులు గురువులు వారిని అలా వెళ్ళవద్దు, అది మీ లక్ష్యాన్ని సాధించలేటే దారికాదు. మీ అసలయిన దారి ఇది అని చెబితే వినరు. పెద్దలు, తల్లిదండ్రులు జీవితప్రయాణంలో చాలా ముందుకు సాగిపోయారు. ఆ దారిలో ఏది మంచిది, ఏది చెడ్డది అనేది వారికి అనుభవపూర్వకంగా తెలిసు కాబట్టి వాళ్ళు ఏ విషయం అయినా సరిగ్గా చెప్పగలరు. కానీ అహంకారంతో అమాయకత్వంతో వారు ఆ విషయాలని వినిపించుకోరు. పాముని పట్టుకుని అదే తాడు అని సంబరపడతారు.

Content: నీవు పట్టుకున్నది ఒక ప్రమాదాన్ని అని పెద్దవారు బలవంతంగా చిన్నవారి చేతిలోని ప్రమాదాన్ని లాగి పారవేస్తానికీ ప్రయత్నిస్తే, వారిని స్వార్ధ పరులుగా అనుమానించి వారిని శత్రువులుగా చూస్తారు.

Content: జ్ఞానోదయం పొందిన యోగీశ్వరులు, గురువులు ఎంతో శ్రమకోర్చి, తపస్సు చేసి కనుగొన్న సత్యాలని మనకి చెబుతారు. వారిలో వేంగి ప్రవహించే కరుణ, ప్రేమ వారిని మన దగ్గరకి పంపించుతాయి. మనకి సహాయపడాలి అని, మనం తెలివితక్కువగా, అమాయకంగా మన చుట్టూ అలుకునే సమస్యలు, వ్యధలు నుంచి రక్షించాలని, వారు పొందిన పరమానందం మనం కూడా పొందాలనే ఉద్దేశంతో వారు ఇవన్నీ చేస్తున్నారని వారికి పారిపోతాము. ఈ విషయాలని వివరించే సమయంలో పరమహంస నిత్యానంద ఒక చక్కని కథ చెబుతారు.

Content: ఒక అంధుడయిన వ్యక్తి : సాధువు అది హిమాలయాల ప్రాంతాలలో డట్టంగా మంచు కురిసే ఒక గ్రామం. ఒకరోజు అంధుడయిన ఒక యువకుడు గ్రామం ఉన్న అడవి గుండా నడుస్తూ వస్తున్నాడు. అక్కడ చలలదనానికి నీరు, అన్నం గడ్డకట్టుకుపోయి ఉన్నాయి. ఆకులు, కాయలు, కొమ్మలు, రాళ్ళు కూడా మంచుతో గడ్డకట్టుకుపోయి ఉన్నాయి. అలా మంచులో నడచి వస్తున్న గుడ్డివాడయిన యువకుడు ఒక దగ్గర కాలుజారి నేలపై పడతాడు. అప్పుడు అతని చేతి కర్ర జారి లోయలో పడిపోతుంది.

Content: దారి బాగా అలవాటు కాబట్టి తేల్చి మెల్లగా చేతులతో తడుముకుంటూ గ్రామం లోపలికి నడుస్తుంటాడు ఆ యువకుడు. అలా కొంచెం దూరం వెళ్ళాక, అకస్మాత్గా అతని చతులమీద ఒక కర్ర పడుతుంది. దానిని పట్టుకుంటూ అది పొడవైన కర్ర.

Content: దానిని పట్టుకుని, "అమ్మయ్య !నాకు కర్ర దొరికింది. అదృష్టవంతుణ్ణి ! దేవుడే ఈ కర్ర నాకు ఇచ్చాడు," అని దాని సహాయంతో గబగబా నడుస్తుంటాడు. కానీ అతని మీద పడినది కర్రకాదు. భయంకరమయిన నాగుపాము. అది మంచులో గడ్డకట్టుకుపోయి కక్రలా ఉంది. కానీ ఆ యువకుడు చూడలేదు కాబట్టి దానిని కర్ర అనుకుని దానిని పట్టుకుని నడుస్తుంటాడు

Page 32

Content: అంతలో ఒక సాధువు గ్రామం నుంచి అడవి లోపలికి వెళ్తుంటాడు. అయన ఆ అంధుడి చేతిలో పాముని చూస్తాడు. వెంటనే ఆ యువకుడితో "అయ్యా !నీవు ఎవరివో కానీ, ముందు నీచేతిలో దానిని పారవేయి. నీవు దానిని కత్ర అనుకుంటున్నావు. కానీ ఆది పాము. త్వరగా దానిని పారవేయి" అని ఆరుస్తూ చెబుతాడు.

Content: అప్పుడు ఆ యువకుడు సాధువుతో "నాకు అన్నీ తెలుసు నా చేతిలోది కత్రే. నీవు మాట్లాడకుండా నీదారిని వెళ్ళు" అంటాడు కోపంగా.

Content: అప్పుడు సాధువు, " అయ్యో ! ఓ యువకుడా ! అది పాము వరి కాసేపటిలో సూర్యకిరణాలు బయటకి వస్తాయి. ఆ మంచు కరిగిపోయి, పాము బయటకి వస్తుంది. అది కరిస్తే నీ ప్రాణాలు దక్కవు. అది భయంకరమైన నాగుపాము దానిని దూరంగా పారవేయి అని కొంచెం గట్టిగా చెబుతాడు.

Content: ఈసారి ఆ యువకుడికి చాలా కోపం వస్తుంది. అతసుకుూడా చాలా గట్టిగా ఇలా అంటాడు," బహుశః నీకు ఈ కత్ర అవసరం అయి ఉంటుంది.దీనిని పారవేస్తే, నీవు తీసుకోవాలని అనుకుంటున్నావు. నాకు ఆ మాటం తెలియదు అని అనుకోకు. నీలాంటి వారిని చాలా మందిని చూసాను. నీదారిని నీవు నోరుమూసుకొని వెళ్ళు. అనవసరంగా నాజోలికి రావద్దు. నీవు ఎంత అరచినా నేను ఈ కత్రని వదలను" అంటాడు.

Content: అప్పుడు ఆ సాధువు " ఓ మూర్ఖుడా ! అతిగా ప్రవర్తించి నీప్రాణం మీదకి తెచ్చుకోవద్దు. నీ మంచి కోరి చెబుతున్నాను. అనవసరంగా చస్తావు " అంటాడు. ఆ యువకుడు లెక్క చేయకుండా ముందుకి వెళ్ళిపోతూంటాడు.

Content: అప్పుడు సాధువు ఆ యువకుడి మీద జాలింతో అతను తనని తిడుతున్నా లెక్కచేయకుండా అతని చేతిలోని పాముని లాగేయటానికి ప్రయత్నిస్తాడు. ఆ యువకుడు కోపంగా ఆ పాముతోనే సాధువుని కొడతాడు. కరుణ, ప్రేమ మాట్రమే తెలిసిన ఆ సాధువు ఆ దెబ్బలను భరిస్తూ పాముని అతని చేతినుంచి లాగి దూరంగా పారవేసి ఆ యువకుడి ప్రాణాలు కాపాడతాడు.

Content: మనందరం కూడా జీవితంలో చాలాసార్లు ఆ యువకుడిలా మూర్ఖంగా ప్రవర్తిస్తాము. కానీ మనమీద ఉండే అపారమయిన ప్రేమతో,కరుణతో గురువులు తిరిగి తిరిగి మనకి సహాయం చేయాలనే చూస్తారు. మనకి వారి హాస్యాన్ని అందించుతారు. మనం మాత్రం అహంకారంతో అంధులమయిపోయి ఆ చేతిని బలంగా తోసిపారేస్తాము.

Content: పూజ, ప్రార్థన అంటే కృతజ్ఞత చూపటం

Content: మనం ఈ భూమిమీద పుట్టినప్పటినుంచి చనిపోయేవరకు నిరంతరం ఆ భగవంతుని రక్షణలో ఉంటాము. కానీ ఆ వేష్యాసక్తి మనం ఎప్పుడూ గమనించచేము. అనలూ ఆ అలోచన రానియము. ఎంతవరకూ కూడా కేవలం మన కళ్ళకి కనపదుతూ, మనం కష్టాలలో ఉన్నప్పుడు సహాయం చేసిన వారిని మాత్రం గుర్తించుతాము. మనం అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేసిన వారిని మాత్రం స్మరించుతాము. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విద్యనేర్పినవారు, సహాయం చేసిన స్నేహితులు, బంధువులు ఇలా అనుకుంటాము కానీ నిరంతరం, కొన్ని వేలసార్లు మనని రక్షిస్తున్న ఆ సర్వాంతర్యామిని, మనం అడగకుండానే అన్ని వరాలని మనమీద వర్షింపచేసే విశ్వశక్తి అయిన భగవంతుణ్ణి మాత్రం గుర్తించం. దేవుడికి అసలు కృతజ్ఞత ఎప్పుడైనా చెబుతామా?

Page 33

Content: మీరు ఒకసారి గమనించండి - ప్రార్థన చేయి లేదా పూజ చేయి అనగానే, 'భగవంతుడా నాకు ఇది కావాలి, అది కావాలి,' అని మొదలు పెడతాం. గుడికి వెళ్ళగానే లేదా దేవుని పటం ముందు నిలబడగానే భగవంతుడా మమ్మల్ని చల్లగా చూడు, మంచి ఆరోగ్యం ఇవ్వు మంచి జీవితాన్ని ఇవ్వు చదువు ఇలా ఉంటుంది మన ప్రార్థన.

Content: అంతేకాదు భగవంతుడు మనకు ఎంత ఇచ్చినా ఇంకా కావాలి. ఇంకా కావాలి అని మాత్రమే అంటాం. మనకి భగవంతుడు ఇచ్చిన ఎంతో అపూర్వమైన బహుమతులని ఏరోజూ తృప్తిగా చూసుకోము, అవి ఇచ్చినందుకు భగవంతుడికి మనస్పూర్తిగా కృతజ్ఞత చెప్పం.

Content: పిల్లలు గుడికి వెళ్తాం అనగానే ఇది అడుగు, అది అడుగు అని చెబుతామే కానీ,నీకు భగవంతుడు ఎన్నో ఇచ్చాడు మనస్పూర్తిగా ప్రేమతో కృతజ్ఞత చెప్పు అని చెప్పం. అందుకే చిన్నతనం నుంచి మనకి పూజ, ప్రార్థన అనగానే అడగటం అనేది అలవాటుయిపోయింది.

Content: మనకి చక్కని శరీరాన్ని ఇచ్చాడు ఆ భగవంతుడు. అందమైన కాళ్ళు, ఇలా మహోద్బుతమయినవి నిద్రపోయేవరకు మన అవసరాలు తీరుస్తూ రక్షణని ఇస్తున్నాడు. కానీ మనం ఏరోజు అయినా భగవంతునికి కృతజ్ఞతలు చెప్పామా?

Content: ఎందుకు మనం నిరంతరం కృతజ్ఞతతో ఉండము? ఎందుకు భగవంతుడు ఎన్ని వరాలు ఇచ్చినా ఇంకా కావాలి. ఆ తరువాత ఏమిటి? ఇంతేనా? అని అనుకుంటాము? అపుడు తృప్తి అనేది మనకి లేదా? ఎందుకు అలా ప్రవర్తిస్తాము అంటే , మనకి ఏది ఇచ్చినా దానిని యధాలాపంగా, చాలా మాములుగా తీసుకుంటాము. అద్భుతమయిన ఈ జీవితాన్నే యధాలాపంగా తీసుకుంటాము. అంతే కాకుండా, నాకు అర్హత ఉన్నది కాబట్టి ఇవ్వనీ పొందగలుగుతున్నాను అనే భావం కూడా మనలో కృతజ్ఞతని లేకుండా చేస్తుంది. కానీ ఒక్క విషయం అర్ధం చేసుకోము. భగవంతుడు ఇతను/ఆమె నాకు అవసరం లేదు అనుకున్నా మరక్షణం మనం ఈ ప్రపంచంలో ఉందాము. మనం జీవించి ఉన్నాము అంటే, భగవంతుని రక్షణలో ఆయిన కోరికపై ఈ భూమిమీద ఉన్నాము అని అర్ధం. అందుకే మనం నిరంతరం కృతజ్ఞతతో ఉండాలి. మనపూజలు, మనప్రార్థనలు, మన జీవితమే కృతజ్ఞతగా మారాలి. కృతజ్ఞత అనేది ఒక సమాజపు మర్యాదలా ఉండకూడదు. అది మన అంతరాత్మనుంచి, మనహృదయమయిపు లోతుల నుంచి పొంగి ప్రవహించాలి. అలాంటి స్థితిలో మనం మాటలు రూపంలో కృతజ్ఞతని వ్యక్తం చేయవలసినా పరమావధ.

Content: మనం ఏ మత ఆచారాలు పాటించినా పరవాలేదు. కానీ ఆ ఆచారాలు మనని నిష్కల్మషమయిన ప్రేమతో కృతజ్ఞతతో నింపాలి. మనం చేసే ప్రార్థన, ప్రేమ కృతజ్ఞతలతో ఉండాలి.కోరిక, భయంతో కాదు. నాకు ఇది వచ్చింది కాబట్టి దేవుడికి పూజ చేస్తాను. నాకు ఇది రాలేదు కాబట్టి ఇవాళ ప్రార్థన చేయను అని అంటే అది భక్తి కాదు, కృతజ్ఞత అంతకంటే కాదు. మనకి మంచి జరిగినా చెడు జరిగినా (చెడు అనేది కేవలం మన భాష, మన భావం మాత్రమే) నిరంతరం భగవంతుడికి కృతజ్ఞతని ప్రేమతో తెలియచేయాలి.

Page 34

Content: ఒక సుఫీ గురువు కథ :

Content: జున్నాద్ అనే ఒక సుఫీ గురువు తన శిష్యులతో కాలినడకన దేశాటన చేస్తూ ఉంటాడు. సుఫీ మతం కృతజ్ఞతతో ఉండే మతం. వారు రోజుకి ఐదుసార్లు భగవంతునికి ప్రార్థనలు చేస్తారు.

Content: సుఫీ గురువు తన శిష్యులతో ప్రతిరోజు ఒక గ్రామానికి వెళ్ళి, అక్కడ వారు ఇచ్చిన భోజనం తిని ఊరు చివరలో రాత్రికి తిరిగి మర్నాడు మరొక గ్రామానికి వెళుతుంటారు. ఆ విధంగా వారు దేశాటన చేస్తుంటారు.

Content: ఒకసారి ఈ సుఫీ గురువు తన శిష్యులతో కలిసి ఒక గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామ ప్రజలకి సుఫీ మతం గురించి కానీ, సుఫీ గురువుల గురించి కానీ ఏమీ తెలియదు. వీరు మాములుగా భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఎవరూ వారికి భిక్ష వేయరు. సాయంత్రం వరకూ భిక్షాటన చేసినా తినటానికి ఏమీ దొరకదు.

Content: సుఫీ గురువు శిష్యులతో ఆ రాత్రి గ్రామం సరిహద్దులో విశ్రమిస్తాడు. అందరూ ఆకలితోనే పడుకుంటారు. రెండవరోజు వీరంతా ఆ తరువాత ఉన్న గ్రామానికి వెళ్తారు. ఆ గ్రామంలో వారికి సుఫీమతం అంటే ఇష్టం ఉండదు. దాంతో వారు భిక్షమేయరు సరికదా వీరిని తిట్టి పంపించి వేస్తారు. ఆ రాత్రి కూడా గురువుగారు తన శిష్యులతో గ్రామం బయట అకలితోనే నిద్రపోతారు.

Content: మూడవరోజు వారంతా ఆ తరువాత గ్రామంలోకని వెళ్తారు. ఆ గ్రామంలో వారు సుఫీ మతం అంటే అసలు ఇష్టం ఉండదు. దాంతో వారు గురువుగారిని, ఆయన శిష్యులని కర్రలతో బెదిరించి ఊరు బయటకి తరిమివేస్తారు. అందరూ ఆ గ్రామం దాటి బయటకి వచ్చేస్తారు.

Content: ఆ రోజు రాత్రి ఎప్పటిలాగానే సుఫీ గురువు గుడ్డపరచి, దాని మీద కూర్చొని, ప్రార్థన చేసి భగవంతునికి కృతజ్ఞతలు తెలియచేస్తాడు.

Content: ఇదంతా గమనించిన శిష్యులకి చాలా కోపం వస్తుంది. అసలు గురువుగారు దేవుడికి ఎందుకు కృతజ్ఞతలు చెబుతున్నారో వాళ్ళకి అర్ధం కాలేదు. వాళ్ళు కోపంగా గురువు గారితో, "గురుదేవా! మనకి గత మూడు రోజుల నుండి భోజనం లేదు. ఈ రోజు అయితే కర్రలతో కొట్టబోయారు. మనని భయపెట్టి ఊరునుంచి తరిమివేసారు. మనకి ఏమి మంచి జరిగింది అని మీరు దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నారు? మనం ఆకలితో ఉన్నందుకు కృతజ్ఞతలు చెబుతున్నారా? అని కోపంగా అడగుతారు.

Content: గురువుగారికి వాళ్ళు కోపం అర్ధమయింది. ఆయన వాళ్ళు వైపు చూసి చిన్నగా నవ్వుతూ ఇలా అంటాడు. "మీరు మూడురోజుల ఆకలి గురించి మాట్లాడుతున్నారు. మరి గత మూపై సంవత్సరాలుగా మీరు చేస్తున్న భోజనానికి భగవంతునికి కృతజ్ఞత చెప్పాలి కదా! ఆ విషయం మర్చిపోయారా?"

Content: ఆయన ఇంకా ఇలా అంటాడు "మకు ప్రార్థన అంటే తెలిసిందే. మీరు ఒక్క విషయం గురించి మాత్రమే ఆలోచించుతారు. అది, ఏమైనా పొందినప్పుడు మాత్రమే కృతజ్ఞత చెప్పాలి అని కానీ నేను భగవంతునికి చెప్పే కృతజ్ఞత అది కాదు. నేను ఎంతో పొందాను అని చెప్పే కృతజ్ఞత కాదు. నా ప్రార్థన, నా కృతజ్ఞత అనేది నా అంతరంగపు లోతుల నుంచి పొంగి ప్రపహించే ఆనందం, ప్రేమ. నేను కేవలం వాటిని మాత్రమే వ్యక్తం చేస్తున్నాను. దీనికి ఎంపికలు ఉండవు. కేవలం నా నుంచి పొంగి ప్రపహించే భక్తి, ప్రేమ భావాలే నా ఈ ప్రార్థన"

Page 35

Content: మీలో కృతజ్ఞతా భావం పొంగి ప్రవహించుతున్నప్పుడు, కృతజ్ఞత తెలియచేయటం అనేది బాధ్యతగా ఉండదు. ఏదో జరిగింది కాబట్టి మర్యాద కోసం చెప్పే మాటలుగా అనిపించదు. అటువంటి వారి జీవితమే కృతజ్ఞతతో నిండి ఉంటుంది. అలా కృతజ్ఞత ఉన్నప్పుడు వారు ధ్యానస్థితిలో ఉన్నట్లే ఎందుకంటే మనం, అంతరంగం కృతజ్ఞతతో నిండి ఉన్నట్లయితే మనలో అహంకారం, అదే విధంగా మనస్సు అనే వాటికి స్థానం ఉండదు. ఎప్పుడయితే ఆ రెండూ మనలో ఉండవో మనం ధ్యానస్థితిలో ఉన్నట్లే. అదే మనం చేరగల అత్యున్నతమయిన స్థితి.

Content: పూజ, ప్రార్థన అనేవి ఒక పని కాదు: మనం భగవంతుడిని ప్రేమతో, భక్తితో ప్రార్థించాలి. కానీ చాలా మంది దానిని యాంత్రికంగా, అదేదో ఒక డ్యూటీ లేదా బాధ్యత అన్నట్లు చేస్తారు. పూజ అయిపోయిన తర్వాత, హమ్మయ్య అయిపోయిందిలే అని అనుకుంటాము. కొంతమంది గుడిలో విగ్రహాలకి బిందెడు పాలతో అభిషేకం చేస్తాం అని అంటారు. కొందరు గుడి చుట్టూ 108 సార్లు 21 రోజులు ప్రదక్షణ చేస్తాం అంటారు. కొందరు, కొన్ని స్తోత్రాలని 10 రోజులు 21 రోజులు లేదా 10,000 సార్లు చదివాము అని అంటారు. ఇవన్నీ దేనికి చేస్తారు. అలా చేయటం వలన వారికి భగవంతుని మీద భక్తి లేదా భయం అనే భావాలు తప్ప వారికి భగవంతునితో సాన్నిహిత్యం ఏర్పడదు. నిజంగా ఆలోచించితే ఇదంతా వ్యాపార వ్యవహారాలా ఉంటుంది.

Content: కొంతమంది పూజకి అన్ని ఇచ్చి తమ పేరు గోత్రం అడ్రస్ అన్ని చెప్పి వారికి ఏమికావాలో కూడా స్పష్టంగా చెబుతారు. అప్పుడు భగవంతుడు వారికి ఇచ్చే వరాలు కచ్చితంగా ఉంటే, వారి కలెక్ట్ అడ్రస్‌కి వస్తాయి అని నమ్మకం. అంటే వీరి ఉద్దేశం భగవంతుడికి మనకి ఏమి ఇవ్వాలో, ఏది అవసరమో తెలియదు అని నమ్మకం. భగవంతుడు అంటేనే మేధావి. భగవంతునికి తెలియనది ఈ ప్రపంచంలో ఏదీ ఉండదు. మన గురించి ఈ జన్మ మాత్రమే కాదు, మన పూర్వ జన్మలు, మన రాబోయే జన్మలు దేవుడికి స్పష్టంగా తెలుసు. మన గురించి మనకంటే దేవుడికే బాగా తెలుసు.

Content: కానీ తెలివిగలవాళ్ళం మనమే అనుకునే వారి వ్యవహారాలు, వారి పూజలు, ప్రార్థనలు ఎంత వ్యాపారంగా ఉంటాయో పరమహంస నిత్యానంద ఒక చిన్న కథలో వివరిస్తారు.

Content: ఒక చిన్న కధ : దేవుడే వ్యాపారంలో భాగస్వామి అయితే? ఒక చిన్న పట్ణణంలో ముగ్గురు స్నేహితులు ఉంటారు. వారికి చదువు పూర్తయింది. ఏం ఉద్యోగం చేయాలా అని చాలా ఆలోచించుతారు. వారి ఉద్దేశం ఏమిటి అంటే, త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించాలి. అలా తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి అంటే వ్యాపారమే సరియైన పద్దతి అని నిర్ణయించుకుంటారు. కొంత ఆలోచించి, వాధించి మాట్లాడి చివరగా ముగ్గురూ వాటాదారులుగా ఉండి వ్యాపారం చేయాలి అని నిర్ణయించుతారు.

Content: అప్పుడు వారిలో ఒక వ్యక్తి “ మనం ముగ్గురం వాటాదారులమంటే బాగుండదు. మనకి మరొక వాటాదారుడు ఉంటే బాగుంటుంది” అని అంటాడు. వారు మరలా చాలా తర్జన బర్జన పడతారు. వారికి

Page 36

Content: ఏకాభిప్రాయం కుదురదు. చివరికి వారిలో రెండో వ్యక్తి ఇలా అంటాడు “ మనకి బయట వ్యక్తులు ఎవరూ వద్దు. మనం ముగ్గరం, నాలుగువ భాగస్వామిగా దేవుడిని పెట్టుకుందాము. అప్పుడు మనకి ఎవరితో గొడవలు ఉండవు, దేవుడే మన భాగస్వామి కాబట్టి మన వ్యాపారం చాలా బాగుంటుంది” అని అంటాడు. మిగిలిన ఇద్దరూ చాలా సంతోషపడతారు. అప్పుడు వారిలో మూడవ వ్యక్తి “ఇది చాలా మంచి సలహా మనం దేవుడికి కూడా మన లాభాలలో కొంత భాగం ఇద్దాము” అంటాడు అందరూ ఒప్పుకుంటారు. ఆ ముగ్గరు స్నేహితులు, దేవుడిని కూడా భాగస్వామిగా చేసి, చాలా ధైర్యంగా వ్యాపారం మొదలు పెడతారు. సంవత్సరం అయ్యేటప్పటికి వారికి చాలా లాభాలు వస్తాయి. వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. సంవత్సరం చివరలో అందరూ లాభాలు పంచుకొనే సమయం వస్తుంది. ఇప్పుడు అసలు సమస్య ప్రారంభమవుతుంది. సమస్య ఏమిటి అంటే దేవుడికి లాభాలలో వాటా ఎంత ఇవ్వాలి, అది ఎలా నిర్ణయించాలి. వారికి లాభాలు చూస్తే చాలా ఎక్కువగా వచ్చాయి. స్నేహితులు చాలా నేపు ఆలోచించి చాలా మార్గాలని పద్దతులని పరిశీలిస్తారు. చివరగా మొదటి వ్యక్తి ఇలా అంటాడు. “సరే, నేను ఒక పద్దతి చెబుతాను. ఇక్కడ ఒక సర్కిల్ గీద్దాము. మనకి వచ్చిన డబ్బు అంతా దాని మీద పోడ్డాము. ఆ సున్నాలో పడిన డబ్బు దేవుడికి ఇద్దాము. బయటపడిన డబ్బు మనం పంచుకుందాము” ఈ సలహా మిగతా ఇద్దరికీ అంతగా నచ్చదు. వాళ్ళు ఏం మాట్లాడరు. అప్పుడు రెండవ వ్యక్తి ముందుకు వచ్చి ఇలా అంటాడు “ ఒక పెద్ద వ్యక్తిని గీద్దాము. మనకి వచ్చిన డబ్బుని అందులో వేద్దాము. వృత్తం లోపల పడిన డబ్బు మనం తీసుకుందాము. బయటపడిన డబ్బు దేవుడికి ఇద్దాము”, అంటాడు. ఆ సలహా కూడా అంతగా నచ్చదు వాళ్ళకి. అప్పుడు మూడవ వ్యక్తి, “నేనోక సలహా ఇస్తాను. ముందు నామాట వినండి. భగవంతుడు ఎక్కడ ఉంటాడు. పైన ఉంటాడు కదా. మనం డబ్బు మొత్తం పైకి విసిరుదాము. దేవుడు తనకు ఎంత డబ్బు కావాలో అంత తీసుకోని మిగతాది మనకి ఇస్తాడు. అలా క్రింద పడిన డబ్బు మనం పంచుకుందాం అంటాడు. ఈ సలహా అందరికీ నచ్చుతుంది.

Content: మనం ఇలానే ప్రవర్తిస్తాము. భగవంతుడిని వరాలు అడిగే సమయంలో నేను కోరుకునేది జరిగితే నీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెబుతాము. కోరిక తీరగానే దేవుడిని మర్చిపోతాం. తిరిగి ఇంకొక కోరిక రాగానే మళ్ళీ దేవుడితో బేరాలు మొదలు పెడతాము. ఇదే మనం చూపించే భక్తి. అందుకే అంటాను, భక్తి అంటే కృతజ్ఞత, ప్రేమ అంటే కాని వ్యవహారాలు కాదు. దానిని భక్తి అనరు.

Content: ఫోరిక వితనం : అసూయ ఆ చెట్టుకు కాస్తే పళ్ళం : మనం మన జీవితంలో చాలా భాగం. ఎదుటి వారితో తేడా ఇతరులతో పోల్చుకోవటంలో గడుపుతుంటాము. మనకి తెలిసే విధంగా కొంత, మన అచేతన స్థితిలో కొంత మనం నిరంతరం పోల్చుకుంటూ ఉంటాము. మన మైండ్ ఈ పోల్చుకునే కార్యక్రమంలో ఎంతగా మునిగిపోతుందంటే, మనం అసలు సత్యాన్ని ఆ విధంగా చూడకుండా కేవలం పోలికతో మాత్రమే చూడగలుగుతున్నాము. దీనివలన మనం మన జీవితంలో సాన్యతని కోల్పోతున్నాము. అసలు జీవితాన్ని యధాతధంగా చూడలేకపోతున్నాము.

Page 37

Content: పరమహంస నిత్యానంద ఒక చక్కని విషయాన్ని చెబుతారు. మీరు ఎదుటివారిని చూసి కొంత విషయాన్ని, కొత్త సంగతులని, తెలియని జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. అంతవరకు మాత్రమే మీరు ఎదుటివారిలో చూడగాలి. అది మంచి పద్దతి. ఇటువంటి దృక్పథం వలన మీరు అభివృద్ధి చెందుతారు. అలా కాకుండా ఎదుటివారు ఇలా చేసారు కాబట్టి నేను కూడా.... ఇలా ఆలోచించితే మనం జీవితంలో ఏదీ సాధించలేము.

Content: అసలు అందరూ ఎందుకు నిరంతరం ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీకు మీరు అంటే ఏమిటో తెలియదు. మీ లోపల ఉన్న అద్భుతమయిన శక్తి కూడా తెలియదు.మీలోని గొప్పశక్తిని మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీలోని శక్తియుక్తలని ఎప్పుడయితే తెలుసుకుంటారో అప్పుడు మీ మీద మీకు సమ్మకం ఏర్పడుతుంది. ఎప్పుడయితే మిమ్మలని మీరు సమ్ముతారో ఇక ఎదుటివారితో పోల్చుకోవలసిన అవసరం ఉండదు.

Content: మీ ఏకాగ్రత, మీ దృష్టి మీ మీద లేకపోవటం కూడా ఒక కారణం. మీరు మీతో ఉండగలిగే స్థితిని పొందితే మీరు ఎవరితోనూ పోల్చుకోరు. మీకు మీరు చాలు అని అనుకొగలిగితే, మీతో మీరు ఉండగలిగితే ఎదుటి వారితో పోల్చుకునే అవసరం మీకురాదు.

Content: ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి భగవంతుని సృష్టి. భగవంతుడు తనలోని దివ్యశక్తిని అద్భుత మేధస్సుని కలిపి ఈ ప్రపంచంలోనికి మనం ఏ లక్ష్యంతో పంపబడ్డామో ఆ లక్ష్యం సాధించేందుకు అనువుగా మనసు తయారుచేస్తాడు. అందుకే ప్రతి మనిషి ఒక ప్రత్యేకతని కలిగి ఉంటాడు. ఎవరి ప్రత్యేకత వారిది. నేను ప్రత్యేక వ్యక్తిని అని అనుకోలేని మనిషి తనని ఎదుటివారితో పోల్చుకుంటాడు. ప్రతి వ్యక్తి ప్రత్యేకమైనవాడు ఇక పోల్చటానికి ఏముంటుంది. గులాబీ పూవు - మల్లెపూవుతో ఏవిధంగా పోల్చుకుంటుంది. ఈ సత్యాన్ని తెలుసుకుంటే మనం ఎదుటి వారితో పోల్చుకోవటం మానేస్తాము. నేను ప్రత్యేక వ్యక్తిని, నా ప్రత్యేక నాది ఎదుటి వారితో పోల్చుకోరు.

Content: మీరు జాగ్రత్తగా గమనించితే, మన జీవితంలో సగభాగం ఇతరులతో పోల్చుకోవటంతోనే గడిచిపోతుంది. మనం మన కోసం ఉపయోగించే శక్తిలో 60% ఎదుటివారి అభివృద్ధిని తెక్కలు కట్టటానికి, మనం వారితో పోలిస్తే ఎక్కడ ఉన్నామో లెక్క కట్టటానికి ఉపయోగిస్తాము. ఒక్క క్షణం ఆలోచించండి. ఆ అర్థవైశాతం శక్తిని కూడా మన అభివృద్ధికే ఉపయోగించగలిగితే మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో, మనలో ఎంత శాంతి ఆనందం ఉంటాయో ఊహించండి.

Content: ఒక చిన్న కథ : ఒక వృక్షం 1000 మీటర్లు పొంగిపొందంలో పైకెగదుతుంటాడు. 250 మీటర్లు పైకెగత్తాక ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాడు. అతను అందరికంటే ముందు ఉంటాడు. మరలా 500 మీటర్లు పైకెగత్తాక ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాడు. అతనే ముందు ఉంటాడు. అలాగే 750 మీటర్లు తరువాత వెనక్కి చూస్తే అతనే ముందు ఉంటాడు. చివరికి అతను గెలుస్తాడు.

Content: ఆ వృక్షం అసలు వెనక్కి తిరగకunda, తన పూర్తి శక్తిని ఏకాగ్రతని కేవలం తన లక్ష్యం వైపు మాత్రమే ఉంచి ఉంటే బహుశః అతను ప్రపంచ రికార్డు సాధించి ఉండేవాడు.

Page 38

Content: ఎవరి ప్రత్యేకత వారిది. ఎవరి జీవిత లక్షణం వారిది. అటువంటప్పుడు ఎదుటివారితో పోల్చుకొని మనం ఏమి అర్థం చేసుకోగలం. వారి ఆధారంగా మనం ఏమి సాధించగలం.

Content: ఎదుటివారితో పోల్చుకుంటే నష్టం ఏమిటి?

Content: ఎదుటివారితో పోల్చుకుంటే మనకి మిగిలేది వ్యధ, మానసిక కుంగుబాటు అంటే. మనం అంతకంటే ఇంకా గొప్పవారము కాగలమేమో కనీ ఎదుటివారితో పోల్చుకుంటూ మన చిన్న పరిధిలో ఉండిపోతున్నాము.

Content: ఎదటివారితో పోల్చుకుంటూ, వారిలా మనం పనులు చేస్తే, మహా సాధించగలిగితే వారి స్థితిని చేరగలం. కానీ మన ప్రత్యేక శక్తియుక్తులని, మన లక్షణం వైపు ఉపయోగించి ఉంటే మనం ఇంకా గొప్పవారం అయి ఉండే వారం కదా!

Content: ఉదాహరణకి : విలేజెట్స్ ఎవరితోనైనా పోల్చుకొని ఉంటే బహుశా ఒక కంపెనీకి మేనేజర్ అయి ఉండేవాడు అంతే. ఐన్‌స్టీన్ లేదా న్యూటన్ ఒకరితో పోల్చుకొని ఉంటే యూనివర్సిటీ ప్రొఫెసర్ అయి ఉండేవారు.

Content: అర్థం చేసుకోండి! పోల్చుకోవటం అనే విషయాన్ని వదిలివేస్తే మనం స్వేచ్ఛగా, ఆనందంగా మన పని మనం పూర్తి ఏకాగ్రతతో చేసి మంచి ఫలితాలు సాధించగలం. అప్పుడు మన జీవితం అద్భుతంగా, తృప్తిగా ఉంటుంది.

Content: మరొక చిన్న కథ :

Content: ఒక అందమయిన చిన్ని రాజ్యానికి ఒక రాజు ఉంటాడు. ఆయన ఎప్పుడూ దిగులుగా, అశాంతిగా, అసంతృప్తితో ఉండేవాడు. ఆయన మంత్రలకి కారణం తెలియదు. ఆయన దిగులుగా ఉండవలసిన పరిస్థితులు ఆ రాజ్యంలో లేవు. దేశ ప్రజలు మంచివారు. దేశంలో అందరూ ధనవంతులు. దేశానికి పెద్దగా శత్రభయం లేదు. రాజుగారి కోలువులో అందరూ సమర్థులే. మరి రాజుగారి అసంతృప్తి, దిగులుకి కారణం ఎవరికీ తెలియదు. ఆయనని ఎప్పుడూ ఎవరూ ఆనందంగా ఉండటం చూడలేదు.

Content: రాజు దిగులుకి కారణం ఏమిటంటే, ఆయన ప్రతి క్షణం తన ప్రక్కనే ఉన్న రాజు గురించే ఆలోచిస్తాడు. ఎప్పుడూ ఆ రాజ్యంతో ఆ రాజ్యంతో పోల్చుకుంటూ ఉంటాడు. ఆ రాజ్యాన్ని మనసు అసూయతో మండిపోతుంటాడు. అతనికి ఆ రాజు తనకంటే గొప్పవాడు అనే భావం చాలా ఎక్కువగా ఉంటుంది. దానితో ఆ రాజ్యం మీద ఆ రాజుమీద ద్వేషం పెరుగుతుంది. కానీ ఆ రాజ్యాన్ని ఏమీ చేయలేదు. కారణం, ఆ రాజ్యం తన రాజ్యానికంటే చాలా రెట్లు పెద్దది. ఆ రాజు ఈయన కంటే చాలా ధనవంతుడు. చాలా మంచి వాడని, తెలివైనవాడని పేరు ఉన్నది. కాబట్టి ఆ రాజుని, రాజ్యాన్ని ఏమీ చేయలేననే దిగులు, అతనికి చూస్తే కలిగే అసూయతో ఆ రాజు కుంగిపోతుంటాడు.

Content: ఒక రోజు ఆయన వాళ్ళ కులగురువు యొక్క ఆశ్రమానికి వెళ్ళతాడు. గురువుగారు రాజుని కుశల ప్రశ్నలు అడిగిన తరువాత ఆశ్రమానికి వచ్చిన కారణం అడుగుతాడు. అప్పుడు రాజు తన మనస్సులోని బాధని చెప్పి గురువుగారితో ఇలా అంటాడు, “గురుదేవా! మీ దగ్గర అద్భుతమయిన మహిమలు, గొప్ప మంత్రాలు ఉంటాయి కదా! నాకు ఏదైనా ఒక మంత్రాన్ని నేర్పించండి. దాని మహిమతో నేను నా ప్రక్కనే ఉన్న రాజుని ఓడించి ఆ రాజ్యాన్ని సాధించుతాను. దయచేసి నాకు ఈ సహాయం చేసి నాలోని దుఃఖాన్ని, వేదనని తొలగించండి” అని ప్రార్థించుతాడు.

Page 39

Content: రాజుగారు చెప్పినదంతా చాలా ఓపికగా విని, రాజుతో, "రాజా! ఈప్రక్కన పూలతోటలో చక్కని గులాబి మొక్క ఉన్నది, దాని ప్రక్కనే ఒక కానగ చెట్టు ఉన్నది. వాటిని జాగ్రత్తగా గమనించు. అవి నీకు కావలసిన విషయాలని నేర్పించుతాయి" అని అంటారు గురువు గారు

Content: గురువు గారు చెప్పిన విధంగా రాజు తోటలో ఉన్న గులాబి చెట్టు దగ్గరకి వెళతాడు. గులాబి చెట్టు ప్రక్కనే ఉన్నకానగ చెట్టుని చాలాసేపు గమనించుతాడు. కానీ అతనికి ఏమీ అర్ధం కాదు. కొంచెం‌సేపు అలా వాటిని చూసి గురువుగారి కుటీరానికి తిరిగి వస్తాడు.

Content: గురువుగారితో రాజు ఇలా అంటాడు " గురుదేవా! ఆ చెట్లని చూసాను కానీ నాకు ఏమీ అర్ధం కాలేదు. అవి నాకు ఏమి నేర్పించుతాయి" అని అంటాడు.

Content: అప్పుడు గురువుగారి రాజుని తీసుకొని ఆ చెట్ల దగ్గరకి వస్తాడు. ఈ గులాబి మొక్క కానగ చెట్టు చాలా కాలం నుంచి ఇలా ప్రక్కప్రక్కనే ఉన్నాయి. కానగ చెట్టు ఏనాడు తాను గులాబి మొక్కలా ఉండాలి అని కోరుకోలేదు. అదే విధంగా గులాబి యొక్క ఎప్పుడు తాను కానగ మొక్కలా ఉండాలి అని ఆశించలేదు. అవి వాటి బాధ్యతలని నెరవేర్చుతా ఆనందంగా, హాయిగా పెరిగి పెద్దవవుతున్నాయి.

Content: అదే గనక ఒక మనిషి కానగ చెట్టు స్థానంలో ఉండి ఉంటే అతను నిరంతరం ఆ గులాబి చెట్టు వైపు చూస్తూ, దాని అందంతో తనని తాను పోల్చుకుంటూ అసూయతో రగిలిపోయేవాడు. తోటలోని వచ్చిన ప్రతి వ్యక్తి గులాబి మొక్క దగ్గరకే వచ్చి, దాని అందానికి ఆనందిస్తూ ఆ పూలని మూత్రమే కోసుకుంటూ ఉంటే అది చూసి మరింత కుంగిపోయేవాడు. తనకి ఉన్న శక్తిని మొత్తం ఇలా పోల్చుకుని బాధపడటానికే ఉపయోగించేవాడు.

Content: అదే విధంగా గులాబి మొక్క స్థానంలో మనిషి ఉండి ఉంటే, అతను తన ప్రక్కనే బలంగా ఎత్తుగా పెద్దగా ఉన్న కానగ చెట్టుని చూసి దానితో తనని తాను పోల్చుకుని బాధపడేవాడు. తోటలోనికి ఎవరు వచ్చినా అందరూ సన్నే విసిగిస్తారు. నా పూలు కోసి సన్ను హింసపెడతారు. సన్ను ఒక్క క్షణం ప్రశాంతంగా ఉండనీయరు. నా బ్రతుకే ఇటువంటిది. అదే కానగ చెట్టు దగ్గరకి ఎవరూరూ దానిని ఎవరూ బాధించరు. దాని ప్రశాంతతని పాడుచేయరు. అది చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. కానగ ఎంత అదృష్టవంతురాలు అని ఇంకాస్త బాధపడేవాడు.

Content: కానీ రాజా! ఈ మొక్కలు ఏ మాత్రం తన ప్రక్కవాటి మీద దృష్టిపెట్టి ఉండి ఉంటే అవి ఇంత అందంగా, బలంగా పెరిగేవు కదా! నీకు ఉన్న శక్తియుక్తులని నీతేలివి తేటలని, నీ సమయాన్ని కేవలం నీ రాజ్యం మీద మాత్రమే పెడితే నీ దేశం మరింత అభివృద్ధి అవుతుంది. నీవు ఆనందంగా తృప్తిగా జీవించగలవు కదా! ఇదే నేను నీకు ఇచ్చే మహిమగల మంత్రం. ఈ మంత్రాన్ని పాటిస్తే త్వరలోనే నీవు చాలా గొప్ప ధనవంతుడిగా అవుతావు, నీ దేశాన్ని స్వర్గంగా తీర్చిదిద్దగలుగుతావు అని అంటాడు.

Content: ఈ ప్రపంచంలో ఏదీ నీది కాదు : ఏదీ శాశ్వతం కాదు

Content: ఈ భూమి మీద ఉన్న ప్రాణులు అన్నింటిలోనూ మనిషి అత్యంత తెలివితేటలు కలిగిన ప్రాణి అని అంటారు. కానీ అంత మేధస్సు కలిగిన మనిషి అత్యంత సామాన్యమయినది, ప్రతి నిత్యం తన కళ్ళముందు నిలబడి ఉన్న సత్యాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నాడు. ఆ సత్యం “ ఈ ప్రపంచంలో ఏదీ తనది కాదు. ఏదీ

Page 40

Content: శాశ్వతం కాదు. మనిషి ఎంత మహాసామ్రాజ్యాలు పొందినా, ఎన్ని ఆస్తిపాస్తులు సంపాదించినా, కొంతకాలం వాటికి సంరక్షకుడిగా ఉండి, వాటిని తిరిగి సర్వాంతర్యామికి అప్పచెప్పి వెళ్ళిపోపలసినదే. ఒక్క నిముషం జాగ్రతగా ఆలోచించండి. మన చుట్టూప్రక్కల ఉన్న ఈ స్థలాలు, ఇళ్ళు, పొలాలు వీటికోసం ఎంతమంది రాజులు ఎందరిని చంపి వుంటారో ఎందరు జమిందారులు, భూస్వాములు ఎంతమందికి అన్యాయం చేసి ఉంటారో. కేవలం కొద్దికాలం వాటికి సంరక్షకులుగా ఉండటం కోసం వాట్లు ఎన్ని దారుణాలు చేసారో, నిరంతరం ఆ అపరాధ భావంతో ఎంత అశాంతిగా బ్రతికీ ఉంటారో మనం ఊహించగలం. సంపాదించిన ఆస్తులు కాపాడుకోవటంలో మరొకరకమయిన క్రోధానికి గురిఅవుతారు. శత్రురాజు ఏ క్షణాన తన రాజ్యం మీదకి వస్తాడో అని, తన భూమిని ఆక్రమిస్తాడో అనే భయంతో ఎన్ని రాత్రులు నిద్రలేకుండా గడిపివుంటాడో. కష్టపడి సంపాదించిన ఆస్తులని కాపాడుకోవటంలో భోజనం చేయికుండా ఎన్నిరోజులు గడిపి ఉంటారో. పరిగెత్తు, పరిగెత్తు సంపాదించిన ఆస్తికి కాపాలా కాస్తూ అమూల్యమయిన జీవితాన్ని జీవించటం మర్చిపోయారు. జీవిత కాలంలో కనీసం ఒక్క రోజయినా విరామంగా నిలబడి, తను సంపాదించిన ఆస్తిని కానీ, భగవంతుడు తనకి ఇచ్చిన వరాలని కానీ తృప్తిగా చూసుకొని, వాటిని ఆనందంగా అనుభవించి ఉండడు. ఎందుకంటే అలా నిలబడితే తన సంపాదన అగిపోతుందని భయం. మరణించే వరకూ పరుగుపెట్టటమే కాని నిలబడి తృప్తిగా ఆనందించటానికి భయం. అలా చేస్తే ఆ తరువాత మరొకటి సంపాదించలేము అని భయం.

Content: ఒక చిన్న కథ : ఒక రైతు ఏదో కొన్ని కారణాల పలన తనకున్న కొద్దిపాటి పొలాన్ని పోత్సుకుంటాడు. అతను చాలా పేదస్థితికి వెళ్ళిపోతాడు. ఏమీ చేయలేని స్థితిలో “భగవంతుడా నీవే నాకు దిక్కు” అని మనసులో భగవంతుడిని శరణు వేడతాడు. అతని ప్రార్థనని ఆలకించిన భగవంతుడు ప్రత్యక్షమై, ఏమికావాలో కోరుకోమని అడుగుతాడు. రైతు పరమానందభరితుడయి భగవంతుడికి నమస్కరించి, “దేవాదిదేవా! కరుణామూర్తి! ఈ పేదవాడి మీద దయ చూపించావా! నీకు వేల వేల కృతజ్ఞతలు. స్వామీ! నాకు కొంచం భూమి ఇప్పించితే అందులో వ్యవసాయం చేసుకొని నేను నాకుటుంబం హాయిగా ఉంటాము ” అని పదే పదే ప్రార్ధించతాడు. భగవంతుడు చాలా ఆందమయిన చిరునవ్వు నవ్వి, “తధాస్తు! నీకు ఎంత భూమి కావాలో” అంటాడు. రైతు కొంచం అయోమయంగా చూస్తాడు. అప్పుడు భగవంతుడు, “రేపు సూర్యోదయం కాగానే నీవు కాలినడకన సూర్యాస్తమయం వరకూ ఎంత దూరం నడిస్తే ఆ భూమి అంతా నీ సొంతమవుతుంది” అని దేవుడు మాయం అవుతాడు. రైతు ఆనందానికి అవధులు ఉండవు. ఎప్పుడే తెల్లవారతుందా అని చూస్తూ ఉంటాడు. మర్నాడు సూర్యోదయం కాగానే రైతు నడవటం మొదలు పెడతాడు. అలా కొన్ని గంటలు నడిచాక అతను పోత్సుకుంటున్న భూమిని సంపాదిస్తాడు. ఇప్పుడు అతనిలో ఆశ మెదలవుతుంది. అప్పుడు అతను, “అదేమిటి, నేను ఎందుకు నడుస్తూ టైం అంతా వృధా చేస్తున్నాను. పరిగెడితే ఇంకా చాలా భూమిని సంపాదించవచ్చు కదా!” అని అనుకొని పరిగెడటం మొదలు పెడతాడు.

Page 41

Content: అలా మధ్యాహ్నం వరకూ పరిగెడతాడు. విపరీతమయిన దాహం వేస్తుంది. కానీ మంచినీళ్ళు తాగటానికి ఆగితే కొంత భూమి పోతుందేమో అని భయపడి అలాగే పరిగెడతాడు. మరికొంత సేపటికి ఆకలి, నీరసం ఎక్కువ అయిపోతాయి. అయినా లేని ఓపికని తెచ్చుకొని పరిగెడుతుంటాడు. ఇంకా నీరసం వచ్చి పరిగెత్తలేకపోతాడు. అయినా తనకి తాను ఇలా చెప్పుకుంటాడు, “ఈ రోజు ఏమయినా సరే నేను ఒకక్షణం కూడా వృథా చేయను. ఒకరోజు మరే వస్తే చేయను. మంచినీళ్ళ, ఆహారం ఏమీ తీసుకోను. ఒక నిముషం కూడా విశ్రాంతి తీసుకోను. నేను ఇంకా చాలా భూమిని చుట్టబెట్టాలి. దానికి అధికారిని కావాలి” అని పరిగెడుతుంటాడు. అలా సూర్యాస్తమయం అయ్యే సమయానికి పరిగెత్తి పరిగెత్తి కిందపడి చనిపోతాడు.

Content: పరిగెత్తి పరిగెత్తి సంపాదించిన భూమిని ఒకక్షణం కూడా తృప్తిగా చూసుకోలేదు. అత్యాశకి పోయి అమూల్యమయిన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. మనందరం కూడా ఇంచిమించు అదే స్థితిలో ఉన్నాము. ఎప్పుడూ పరిగెత్తటమే. ఎందుకు పరిగెడుతున్నామో? ఎక్కడికి? ఏమి సాధించటానికి ఈ ఆతృత? ఒక క్షణం నిలబడి భగవంతుడు మనికి ఇచ్చిన ఎన్నో అద్భుతవరాలని అనుభవించి తృప్తిపడటం లేదు. ఎంతసేపూ ఆ తరువాత ఏమిటి? ఇంకా ఏమిటి అనుకోవటమే. ఇలా పరిగెత్తటం ఎంత అమాయకత్వమో కదా! ప్రకృతిలో మరే ప్రాణి ఇలా జీవితాన్ని జీవించటం మనం పరిగెత్తటం లేదు. ఏవీ అమాయకంగా జీవితాన్ని బలిచెట్టి ఆస్తులు కూడబెట్టటం లేదు. అవి అందమయిన ఈ ప్రపంచంలో, ప్రకృతిలో ఒక భాగంగా జీవిస్తాయి. ప్రతి నిముషం అత్యుత ఆనందంగా సంబరాలు చేసుకుంటాయి. ప్రతి క్షణం ఒక ఉత్సవంగా జీవిస్తాయి. కేవలం ఆనందం తప్పా మరే భావం లేకుండా చనిపోతాయి. కేవలం మనిషి మాత్రమే నిత్యం వ్యధలు, బాధ, కోపం, నిరాశ, అసంతృప్తి, కుంగుబాటుతనం, అపరాధభావం వీగిటో జీవిస్తూ జీవితం అంటే ఉత్సాహం అని, జీవితంలో ప్రతిక్షణం ఒక పందగలా జీవించాలనే విషయాన్ని మర్చిపోయి, జీవితాన్ని నిరాశతో లాగుతున్నాడు. అది ఎలా ఉంటుందంటే మరణాన్ని వాయిదా వేస్తున్నటే ఉంటుంది, కాని మనిషి జీవిస్తున్నట్లుగా ఉండదు.

Content: ఎప్పుడయితే మనం ఇది నాది, నేను దీనిని పొందాలి, నేను దీనికి అధికారిని అవ్వాలి అనే భావన వదిలిపెడతామో అప్పుడు మనం శాశ్వతమయిన ఆనందాన్ని పొందగలుగుతాము. జీవితం అనేది ఎంత అందంగా, ఎంత అద్భుతంగా ఉంటుందో, ఆ స్వేచ్ఛలోని ఆనందం ఎంత మధురంగా ఉంటుందో అనుభవించగలుగుతాము. అప్పుడు మనం పొందే ఆనందం ఎన్ని కోట్లు ఆస్తుల అయినా మనకి ఇవ్వలేదు. ఎప్పుడయితే నాది అనే దానిని వదిలివేస్తామో, జీవితం తేలికగా, స్వేచ్ఛగా అందంగా ఉంటుంది. ప్రతీ క్షణం ఒక ఉత్సవంగా జీవితాన్ని గడపవచ్చు.

Content: మీ అంతరంగంలో ఎన్నో గాయాలు ఉన్నాయి. అవి మీలోని కోపం, అసూయ, అసంతృప్తి, అత్యాశ, అశాంతి, మానసిక ఒత్తిడి అనే వాటి ద్వారా ఏర్పడ్డాయి. అదే విధంగా మీరు ఇతరులతో పోల్చుకుంటూ, వాళ్ళు పరిగెడుతున్నారు. కాబట్టి మీరూ పరిగెడుతున్నారు. ఆ విధంగా ఇతరుల ద్వారా, సమాజం ద్వారా ఏర్పడిన గాయాలు మరికొన్ని. ఇన్ని గాయాలు అంతరంగం నిండా ఉన్నప్పుడు మీకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది. ఈ గాయాలని మానసగల దివ్య మంత్రం ఒకటి ఉంది, అది ఈ ప్రపంచంలో ఏదీ నా సొంతం కాదు ప్రతిదీ భగవంతునికి వదిలివేయవలసినదే. ఏదీ శాశ్వతం కాదు. నేను, నాది అనేది కేవలం నా

Page 42

Content: అమాయికత్వం " అని తెలుసుకోవటమే దివ్యమంత్రం. అది గొప్ప మందులా పనిచేసి గాయాలన్నింటినీ ఒక్కక్షణంలో మాన్పగలుగుతుంది. అప్పుడు మీ అంతరంగం అద్భుతమయిన ఆనందం, తృప్తి, శాంతితో నిండిపోతుంది. ఆ అనుభూతిని ఆ పరమానందాన్ని ఒక్కసారి అనుభవించినా చాలు, దాని గొప్పదనం మీకు అర్థమవుతుంది.

Content: మీరు మీతో ఉండగలగటం నేర్చుకోవాలి. మీరు మీ మీద ఏకాగ్రతని నిలిపి, మీతో ఉండగలిగితే విశ్రాంతిగా, విరామంగా ఉండగలుగుతారు. అప్పుడు మీకు నిజంగా ఏమి కావాలో తెలుస్తుంది. అప్పుడు మీరు సరియైన నిర్ణయాలు చేయగలుగుతారు. అనవసరంగా పరుగులు పెట్టరు.

Content: ఒక చిన్న కథ : ఒక యోగీశ్వరుడు - అలెగ్జాండరు :

Content: అలెగ్జాండరు గ్రీకుదేశానికి రాజు. అతడు యువకుడు. గొప్ప యోధుడు. అతనికి ప్రపంచాన్ని గెలవాలి, ప్రపంచానికి చక్రవర్తిని కావాలి అనే కోరిక కలిగింది. వెంటనే పెద్ద సైన్యాన్ని తీసుకొని తూర్పుదిశగా ఒక్కొక్క రాజ్యాన్ని జయించుతూ వస్తాడు. చివరగా అతను భారతదేశం చేరతాడు. భారతదేశపు సరిహద్దులలోని రాజులని జయించి తన ప్రతినిధులని ఉంచుతాడు.

Content: అతను భారతదేశపు సంస్కృతి, సంప్రదాయాలు, విజ్ఞానము చూసి ఆశ్చర్యపోతాడు. వారి వైభవానికి కారణం వారికి ఉన్న వేదాలు, జ్ఞానోదయమయిన యోగీశ్వరులు అని తెలుసుకుంటాడు. అతనికి ఆ విజ్ఞానాన్ని తన దేశానికి తీసుకొని వెళ్ళాలి అనే కోరిక కలుగుతుంది.

Content: అలెగ్జాండర్ తనతో భారతదేశం నుంచి జ్ఞానోదయం అయిన యోగిని అలాగే వేదాలని తీసుకు వెళ్ళాలి అని అనుకుంటాడు. వాళ్ళి సహాయంతో తన దేశాన్ని బాగా అభివృద్ధి చేయగలను అని నిర్ణయించుకుంటాడు. అతను అనుకోకుండా ఒక జ్ఞానోదయమయిన యోగిని కలుస్తాడు.

Content: అలెగ్జాండర్, యోగిశ్వరుని చూసి చాలా సంతోషపడతాడు. ఆయన దగ్గరకు వెళ్ళి, "దయచేసి మీరు నాతో మా దేశానికి రండి" అని ఆహ్వానించుతాడు. అలెగ్జాండర్ ఆహ్వానానికి యోగీశ్వరుడు నవ్వి "నేను రాను. నాకు ఎక్కడికీ రావలని లేదు. నేను ఇక్కడే ఉంటాను" అని అంటాడు. అప్పుడు అలెగ్జాండరు, "మీరు అలా అనవద్దు. మీరు మా దేశానికి రండి. మీరు అక్కడికి వస్తే మీకు గొప్ప రాజభవనాన్ని ఇస్తాను. మీరు ఇక్కడ కేవలం ఒక బిక్షగానిలా ఉన్నారు. మీకు కట్టుకోవటానికి సరియైన బట్టలు కూడా లేవు. మీరు మా దేశానికి వస్తే మీకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను. దయచేసి నాతో మా దేశానికి రండి" అని అంటాడు.

Content: అప్పుడు యోగి నవ్వి "నేను రాను. నేను ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నాను. నాకు ఎక్కడికీ వెళ్ళాలని లేదు" అంటాడు.

Content: అప్పుడు ఏమయి ఉంటుందో మీకతలుసు : అలెగ్జాండరు ఒక చక్రవర్తి, యోధుడు, బాగా తెలివైనవాడు. అతను ముందుగా యోగికి ఆశలు చూపించి ఆధీనం చేసుకోవాలి అని అనుకుంటాడు. అది పని చేయలేదు ఇప్పుడు భయపెట్టి తనతో తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటాడు. అప్పుడు తన కత్తిని బయటికి తీసి "నీవు నాతో రాకపోతే నిన్ను చంపేస్తాను" అంటాడు అలెగ్జాండరు.

Content: అలెగ్జాండరుని, అతని కత్తిని చూసి మరింత నవ్వతాడు ఆయోగి. ఒక మాములు వ్యక్తి, ఒక సన్యాసి

Page 43

Content: గొప్ప చక్రవర్తిని, అతని కత్తిని చూసి నవ్వటం అంటే సామాన్య విషయం కాదు. రాజు ఏమి చేసినా అడిగేవారు ఉండరు. అయినా సరే ఆ యోగి అతనిని చూసి నవ్వి, అలెగ్జాండరు కళ్ళలోనికి సూటిగా చూస్తూ, “ ఓ! తెలివి తక్కువ వాడా! నీవు అబద్దాలకోరివి అంటాడు.”

Content: గొప్ప యోధుడయిన అలెగ్జాండరు, జీవితంలో మొదటిసారి భయపడతాడు. అతను యోగిని చూస్తూ, “నీకు భయం వేయటం లేదా?” అని అడుగుతాడు.

Content: అప్పుడు యోగి, “ నీవు నన్ను ఎప్పటికీ చంపలేవు. నీవు నా ఈ శరీరాన్ని నాశనం చేయగలవేమో కాని నన్ను మాత్రం ఏమీ చేయలేవు” అంటాడు.

Content: ఆ యోగికి ఆ ధైర్యం, తనపై తనకి ఆ నమ్మకం అతని అనుభవం ద్వారా వచ్చాయి. ఆధ్యాత్మిక అనుభవం అతనిని ఆ విధంగా నిలబెట్టాయి.

Content: అలెగ్జాండరు అశ్చర్యపోతాడు. ఆ యోగిశ్వరుడి వైపు చూస్తూ “నీవు ఇంత ధైర్యంగా ఎలా ఉండగలిగావు?” అని అడుగుతాడు.

Content: అప్పుడు యోగి అలెగ్జాండర్ని, “నీవు భారతదేశానికి ఎందుకు వచ్చావు” అని అడుగుతాడు. భారతదేశాన్ని జయించటానికి వచ్చాను అని అలెగ్జాండరు జవాబు ఇస్తాడు.

Content: 'ఆ తరువాత ఏమి చేస్తావు', అని యోగి ప్రశ్నిస్తాడు. మరొక దేశాన్ని జయించుతాను అని జవాబు ఇస్తాడు అలెగ్జాండరు.

Content: “ ఆ తరువాత?” అని అడుగుతాడు యోగి.

Content: “హాయిగా విశ్రాంతిగా ఉంటూ ఆనందంగా ఉంటాను”, అంటాడు అలెగ్జాండరు. అప్పుడు యోగి, “ ఓ తెలివితక్కువ వాడా! నేను ప్రస్తుతం అదే స్థితిలో ఆనందంగా ఉన్నాను” అంటాడు.

Content: అలెగ్జాండరుకి తాను ఎంత మూర్ఖుడినో, ఎంత తెలివిహీనుడో అర్థమయింది. తాను ప్రపంచాన్ని జయించాడు కానీ అపూర్వమయిన ఆనందాన్ని, అద్భుతమయిన జీవితాన్ని పోగొట్టుకున్నాను అని తెలుసుకున్నాడు. ఈ రాజ్యాలు, గెలుపు తనతో రావు అని తెలుసుకున్నాడు. అందుకే అతను తన మనస్సులతో ఈ విధంగా చెబుతాడు.

Content: “నేను మరణించాక, నా పార్ధవ శరీరాన్ని తీసుకు వెళ్ళేటప్పడు నాచేతులు బయటికి పెట్టండి. ప్రజలందరికీ, అలెగ్జాండర్ అంతటివాడు కూడా మరణించాక తనతో ఏమీ తీసుకువెళ్ళటం లేదు అని తెలుసుకోవాలి. ఇది నా కోరిక”.

Content: ఈ కధలో మనకి మూడు విషయాలు అరమరికలు. జ్ఞానోదయమయిన యోగీశ్వరులలో ధైర్యం, నమ్మకం నిజంగా కనిపిస్తాయి. ప్రపంచంలోని విషయాల వెనుక పరిగెత్తటం వలన ఉపయోగం లేదు. విశ్రాంతిగా ఉంటూ జీవితాన్ని ప్రతి క్షణం ఆనందంగా గడపగలగాలి. ఆ యోగిశ్వరుడికి ఏమీ లేవు కాని గొప్ప పరమానందంలో ఉంటూ జీవితాన్ని ఉత్సవంలా గడుపుతున్నాడు.

Content: మన ఈ ప్రపంచంలో ఎంత సంపాదించినా, మనతో ఏమీ తీసుకువెళ్ళము. మీ కీర్తి ప్రతిష్ఠలు, ఆస్తి అంతస్తులు ఏవీ మీరు తీసుకువెళ్ళలేరు. ఈ ప్రపంచమంతా మిమ్మల్ని గొప్ప చక్రవర్తి అని అభిమానించి

Page 44

Content: ఆరాధించినా దానిని మీతో తీసుకువెళ్ళలేరు. మీరు ఖాళీ చేతులతోనే వెళతారు. సంపాదించినది మొత్తం తిరిగి ఆ సర్వాంతర్యామికి వదిలి మరీ వెళతారు. భగవంతుడికి కృతజ్ఞతతో పూజించాలి, ప్రేమతో దరి చేరాలి.

Content: భగవంతుడు, దేవుడు మరే పేరుతో పిలచినా సరే, ఆయన సర్వాంతర్యామి. ఆయన విశ్వశక్తి, అత్యుత్తమ అత్యున్నత చేతనస్తితి. ఆ విశ్వశక్తే ప్రతి మనిషిలోనూ ప్రతి ప్రాణిలోనూ జీవశక్తిగా ఉంటుంది. అందుకే ప్రతి ప్రాణి దేవుని రూపమే. భగవంతుడు సర్వశక్తి సంపన్నుడు. ఆయన మహామేధావి, కరుణామూర్తి ప్రేమమూర్తి.

Content: అటువంటి భగవంతుని మనం భయం, భక్తితో దూరం చేసుకోకూడదు. గౌరవం అనే భావంతో ఎక్కడో పైన పెట్టి మనం దూరం వెళ్ళి పోకూడదు. ఆయనని కృతజ్ఞతతో, ప్రేమతో పూజించాలి. భగవంతునితో ఉండే బంధుత్వం, సంబంధమే అన్ని సంబంధ బాంధవ్యాలోనికి ఉత్తమోత్తమయినది. ఆయనే అన్ని రకాల బంధుత్వాలు.

Content: కష్టకాలంలో రక్షణ ఇచ్చే తండ్రి ఆ దేవుడే. మానసికంగా బలమీనులమయినప్పుడు తన ఒడిలో లాలించే తల్లి ప్రేమ ఆ భగవంతుడే. ఒక ప్రేమికునిగా, ఒక ప్రేయునిగా ఆటలాడి ఆనందపరచే ప్రేమశక్తి ఆ దేవదేవడే. ఒక స్నేహితునిగా ఆదరించినా, గురువుగా మంచిమార్గంలో పెట్టినా, ఆ శక్తి ఆ భగవంతుడే.

Content: మనం ఏ బంధుత్వంతో దగ్గరయితే మనని అలా ఆదరిస్తాడు. ఏమీ లేదు! దేవా నావల్లకాదు. నీవే దిక్కు అని ఆయన పాదాల శరణు వేడితే, తన హృదయానికి హత్తుకునే గొప్ప బంధువు, యాజమాని అన్ని ఆయనే.

Content: కానీ ఆయనని మన నుంచి వేరే చేసే ఒక శక్తివంతమయిన అంశం మనలో ఉంది. అదే మనలోని అహంకారం. కొందరిలో అహంకారం స్పష్టంగా కనిపిస్తుంది. కొందరిలో వారికే తెలియకుండా అహంకారం ఉంటుంది. ఎవరైతే అహంకారాన్ని పూర్తిగా త్యజించుతారో, ఎవరిలో అయితే అహంకారం అనే అసలు ఉంటడో, ఎవరైతే అహంకారంలేని పూర్తి అమాయకత్వంతో ఉంటారో వారికో భగవంతుడు చాలా దగ్గర చుట్టము. తెలిసి గాని తెలియక గాని అహంకారపు పోరల మధ్య ఉంటుంది. ఆ భగవంతునికి ఎన్ని పూలు, ఎన్ని యాగాలు ఎన్ని అభిషేకాలు చేసినా వ్యర్థం. ఆయన కోసం అహం తప్పా అన్ని సన్యసించి కఠోర తపస్సు చేసినా ఆయనదొరకడు. అందుకే ఆయనని భక్త సులభుడు అంటారు. ఈ విషయాన్ని వివరిస్తూ పరమహంస ఒక చిన్నది చక్కని కథని చెబుతారు.

Content: చిన్నకథ : గోపికలు - ఋషులు : శ్రీ కృష్ణుడు జనించి పెరిగి పెద్దవాడయిన గోకులం అనబడే బృందావనం చాలా అందమయిన పల్లె. అక్కడి గోపాలురు, గోపికలు అమాయకమయిన పల్లె ప్రజలు. గోవులని మేపుతూ ఆపాలు పెరుగుతూ వారి ఆస్తిపాస్తులుగా జీవించే సామాన్యులు.

Content: బృందావనానికి కొంచెం దూరంలో ఉండే అరణ్యంలో చాలా మంది ఋషుల తపస్సు చేసుకుంటూ నిరంతరం ధ్యానస్థితిలో ఉండేవారు. వారికి అవసరమయిన పళ్ళూ, పాలు గోకులంలోని గోపాలురు, గోపికలు వారికి భక్తితో ఇస్తుండేవారు.

Page 45

Content: శ్రీకృష్ణుడు జన్మించక గోకులంలోని శ్రీ పురుషులకి, పిల్లలకి పెద్దలకి నిరంతరం శ్రీకృష్ణుడు ధ్యానే ఉండేది. వారు ఏమాత్రం సమయం దొరికినా శ్రీకృష్ణుని సన్నిధికి చేరేవారు. ఆ పరంధాముని సన్నిధిలో, ఆయన సమక్షంలో అంతులేని పరమానందాన్ని పొందేవారు. ఆయన ఉన్న పరిసరాలలో ఉండి, అద్భుతమయిన ఆధ్యాత్మిక అనుభవాలు పొందేవారు. శ్రీకృష్ణుడు చెలిమిలో నిరంతరం ఆనంద పారవశ్యంలో మునిగి ఉండేవారు. వారికి కృష్ణుడు తప్ప మిగతా విషయాలన్ని మరిచిపోయారు. వారి జీవితం, ధ్యేయం, సుఖం, దుఃఖం, సంతోషం, ఉత్సాహం, సర్వం శ్రీకృష్ణుడే. శ్రీ కృష్ణుని ప్రేమలో, ఆయన ఆటపాటలు లీలలో వారు ప్రపంచాన్నే మరిచిపోయారు.

Content: ఈ క్రమంలో రోజులు గడచే కొద్దీ వారు రుషులకి చేసే మర్యాదలలో లోటు వస్తుండేది. వారు క్రమంగా రుషుల దగ్గరకి వెళ్ళటం తగ్గించారు. గోకుల వాసుల నిర్లక్ష్యం వహా జ్ఞానులు, తపో సంపన్నులు ఆయన రుషులకి కోపం తెప్పించింది.

Content: విషయం ఏమిటో తెలుసుకొని గోపాలुरకి, గోపికలకి బుద్ధి చెప్పాలని రుషులు గోకులానికి వస్తారు. వారికి ఎక్కడా జన సమూహాలు కనిపించవు. వారు ఇంకా ముందుకి వెళితే అక్కడ కొంతమంది గోపికలు కనిపిస్తారు.

Content: వారు రుషులని చూడగానే భక్తి మర్యాదలతో వారికి సమస్కరించుతారు. వారి భక్తిని పట్టించుకోకుండా, రుషులు గోకులవాసుల నిర్లక్ష్యానికి వారి ఆగ్రహాన్ని వెల్లడిస్తారు. వారు కోపంతో 'మీ గోకులవాసులు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మాకు తగిన గౌరవ మర్యాదలని ఇవ్వటం లేదు. మాకు కోపం వస్తే మీరు తగిన ఫలితాలు అనుభవిస్తారు' అని గట్టిగా చెబుతారు.

Content: కాని గోపికలు వారి కోపానికి, వారి మాటలకి అసలు భయపడరు. గోపికల ధైర్యానికి రుషుల ఆశ్చర్యపోతారు. 'మేము ఎవర్లో మా గోపుడనం ఏమిటో మీకు తెలుసా' అని వారిని హంకరిస్తూ అడుగుతారు. 'మేము రుషులము. అడవులలో నిరంతరం తపోదీక్షలో ఉంటాము. మేము వేదవేదాంగాలు చదివిన జ్ఞానులం' అంటారు. అప్పుడు గోపికలు వారివైపు ఆశ్చర్యంగా చూస్తూ 'మహాత్ములారా! తపస్సు అంటే ఏమి చేస్తారు' అని అమాయకంగా అడుగుతారు.

Content: వారి అమాయకత్వానికి, అజ్ఞానికి రుషుల జాలి పడి, వారితో ఇలా అంటారు, 'మేము నిరంతరం ఆ భగవంతుని ధ్యానంలో ఉంటాము. ఆ దేవదేవుని పాదలపై ధ్యానం చేస్తుంటాము'. 'అలా ఎందుకు చేస్తారు?' ఇంకా అమాయకంగా ప్రశ్నిస్తారు. గోపికలు గోపికలని చూస్తూ, 'అలా తపస్సు చేస్తే భగవంతుడు మాకు దర్శనాన్ని ఇస్తాడు. మాకు ఆత్మసాక్షాత్కారం కలిగించి జ్ఞానోదయమయ్యేలా చేస్తాడు. ఆ భగవందనుగ్రహం కోసం, భగవత్ సాక్షాత్కారం కోసం ఎన్నో జన్మలుగా ఎందరో మునులు తపస్సు చేస్తున్నారు. అయినా లోకజ్ఞానం లేని అమాయకులయిన మీకు ఈవిషయాలు అర్థం కావు. మీ వారందరూ ఎక్కడ వారికి మేము వచ్చిన విషయం తెలియచేయండి' అంటారు.

Page 46

Content: "మహాత్ములయిన తథోదనులారా! మీరు భగవంతుని కోసం అరణ్యాలలో తపస్సు చేస్తున్నారు. భగవదనుగ్రహం కోసం ఎన్నో గ్రంథాలు చదివి గొప్ప జ్ఞానాన్ని పొందారు. చాలా గొప్పవిషయం ఇది కానీ అక్షరజ్ఞానం లేని మా గోకులవాసులం భగవంతునితో ఆడుకంటున్నాము. మీరు అలా యమునానది ఒడ్డుకొ వెళితే అక్కడ భగవంతునితో ఆడుపాటలు, నాట్యాలు చేస్తూ పరమానందపు పారవశ్యంలో మునిగి ఉన్న మా గోకుల వాసులు కనిపిస్తారు. ఆ ఆనంద పారవశ్యంలో మైమరచి మావారు మిమ్మలని గమనించకపోతే దయచేసి క్షమించండి" అంటూ వినయంగా, అమాయకంగా చెబుతారు గోపికలు

Content: ఎవరైతే పరిపూర్ణంగా ఆ భగవంతుని ఆధీనులపుతారో భగవంతుడు వారికి సొంతమవుతారు. అక్షర జ్ఞానం, లోక జ్ఞానం అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం కూడా లేని గోకులవాసులకి వారికి భగవంతునికి మధ్య నిలబడే జ్ఞానం, హేతువాదం, శాస్త్రీయత, అహంకారం, మేధస్సు ఇలాంటి అడ్డుకోడలు ఉండవు. వారికి సంపూర్ణంగా నమ్మటం సంపూర్ణంగా ఆధీనులై ప్రేమించటమే తెలిసు. అందుకే భగవంతుడు వారితో నాట్యం చేసాడు. పాటలు పాడాడు. చక్కని ఆటలు ఆడుకన్నాడు. గోకులం వారికి కృష్ణుడితో వాదించటం రాదు, ప్రశ్నలు అడగటం తెలియదు. కేవలం ప్రేమించటమే తెలిసు అందుకే వారు ధన్యులు.

Content: భగవంతునికి ఆధీనులవటం అంటే ఏమిటి?

Content: భగవంతునికి ఆధీనమవటం అనేది నిబంధనలతో ఉండకూడదు. అది సంపూర్ణంగా జరగాలి. అందులో 'అయితే' 'కానీ' వంటివి ఉండకూడదు. నీవు నా ఈ కోరిక తీరిస్తే నేను నీకు ఆధీనమవుతాను లేదా మరొక దేవుడిని చూసుకుంటాను. అనే పద్దతి భక్తి కాదు వ్యాపారం. స్పష్టంగా అర్థం చేసుకోండి. భగవంతుడు అంటే మేధస్సు ఆయనకి సమస్తం తెలిసు. మనం అడిగేవి అడగబోయేవి కూడా తలుసు. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే మనసే పూజా ప్రార్థనలలో గొప్ప మార్పు వస్తుంది.

Content: భగవంతునికి ఆధీనమవటం అనేది మూడు విధాలుగా ఉంటుంది.

Content: మొదటి రకం ఆధీనత అనేది మన మేధస్సుని ఆధీనపరచటం. ఇది సులభమే. విశ్వశక్తి, భగవంతుడు అనేది చాలా గొప్పశక్తి. ఆ మేధస్సు మన మేధస్సు కంటే గొప్పది అని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆశక్తికి మనం మన ఆధీనపరుస్తాం. అంటే తెలివితేటల దశలో ఆధీనులవుతాము. అప్పుడు నిర్ణయాలు భగవంతునికి వదలగుతాము.ఆ తరువాత ఆధీనత భావాత్మక దశలో జరిగేది. అటువంటి వారు భగవంతుని స్మరించగానే కరిగిపోతారు. అలా అనుకోగానే ప్రేమ కృతజ్ఞతా భావం వారిలోంచి పొంగి ప్రవహిస్తుంది. కళ్ళ నుండి నీరు ప్రవాహంలా వస్తుంది. అప్పుడు వారు భక్తులుగా మారిపోతారు. ఈ సందర్భంలో రామకృష్ణ పరమహంస ఈవిధంగా చెబుతారు, "మీరు భగవంతుని కానీ గురుదేవులని కానీ స్మరించకోగానే మీ కళ్ళలో నీళ్ళు స్పష్టంగా తెలుసుకోండి. ఇది మీకు చివరి జన్మ అని, మీరు స్వేచ్ఛను పొందటానికి సిద్ధంగా ఉన్నారు అని"

Content: ఇక మూడవదశ స్వరూపేంద్రియాలని ఆధీనపరిచే దశ, ఇది చివరి దశ. రామకృష్ణ పరమహంస చెప్పిన స్వేచ్ఛని రెండవ దశలో పొందలేము. ఆ స్వేచ్ఛ ఈ దశలో మనం మన స్వరూపేంద్రియాలని ఆయనకి ఆధీన పరుస్తాము. ఇదే సంపూర్ణ ఆధీనత. ఇది నిబంధనలు లేని అప్రయత్నంగా, సహజంగా జరిగే ఆధీనత.

Page 47

Content: కృష్ణార్జునల కథ :

Content: మహా భారతంలో వ్యాసమహర్షి శ్రీ కృష్ణుడు, అర్జునునికి గురించి ఒక చక్కని సంఘటనని వివరిస్తారు. ఒక రోజు సాయంత్రం సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడు అలా నడచి వెళుతుంటారు. వారు ఇద్దరూ మంచి స్నేహితులు, బంధువులు దగ్గర దగ్గర ఒక వయస్సు వారు, చిన్నతనంలో కలసి ఆడుకున్నవారు. అంతే కాదు అర్జునుడు శ్రీ కృష్ణుడు భక్తుడు. నిజానికి వారి మధ్య ఉన్న బంధం భగవంతుడు, భక్తుడు మాత్రమే.

Content: అలా నడుస్తూ ఉండగా ఆకస్మాత్‌గా కృష్ణుడు అక్కడ చెట్టు మీద ఉన్న ఒక కాకిని చూపిస్తూ, “అర్జునా! ఆ ఆకుపచ్చని కాకిని చూసావా?” అంటాడు. అప్పుడు అర్జునుడు, “అవును కృష్ణా! నేను ఆ ఆకుపచ్చని కాకిని చూసాను” అంటాడు. వాళ్ళు ఇంకా కొంచం ముందుకు వెళ్ళాక, శ్రీకృష్ణుడు మరొక కాకిని చూపించి, “అర్జునా! ఆ నల్లని కాకిని చూడు” అంటాడు. అప్పుడు అర్జునుడు, “ కృష్ణా! నేను నల్లని కాకిని చూసాను” అంటాడు. కృష్ణుడు అర్జునునిని వైపు తిరిగి, “అర్జునా! నీవు మూర్భుడివిగా ఉన్నావు. నేను నిన్ను తెలివైనవాడివి అని అనుకున్నాను. కాకి ఎలా ఆకుపచ్చగా ఉంటుంది? మొదటి నేను చూపించిన కాకి నల్లగానే ఉన్నప్పుడు నీవుఎలా దానిని ఆకుపచ్చ కాకి అని అన్నావు? నీవు నన్ను ఆనందపరచాలని అలా అన్నావా?” అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు, “కృష్ణా! నీవు చూపించి, ఆకుపచ్చ కాకి ఉన్నప్పుడు నాకు ఆకుపచ్చని కాకి కనిపించింది. నేను ఏమి చేయను. నేను అప్పుడు నల్లటి కాకిని చూడలేకపోయాను. నా కళ్ళు నా స్వర్యేంద్రియాలు నన్ను మోసం చేస్తాయి” అని జవాబు ఇస్తారు.

Content: అర్జునుని స్వర్యేంద్రియాలు ఆయనని మోసం చేయలేదు. అవి భగవంతునికి ఆధినమయిపోయాయి. ఒక్కసారి ఆ స్థితికి చేరితే ఇక వెనక్కి వచ్చే ప్రసక్తి ఉండదు. ఇదే సంపూర్ణమయిన ఆధీనత అంటే కృష్ణుడు భగవద్గీతలో ఇలా చెబుతాడు, “మీరు నా ఆధీనులైతే మీకు స్వేచ్ఛని ఇస్తాను” అని ఆయనని చేరటానికి మనం పూర్తి ఆధీనలమయిపోవాలి. మన స్వర్యేంద్రియాలని ఆధీనపరచాలి. మన చేతనస్థితి, మన తెలుసుకునే తత్వం సర్వం ఆయనే అయిుండాలి. అప్పుడే మనం భగవంతుణ్ణి చేరగలం.

Content: నిజమయిన భక్తుడు భగవంతుని సందేశానికి దాసుడవుతాడు కానీ రూపానికి కాదు :

Content: నన్ను చాలామంది ఒక ప్రశ్న అడుగుతుంటారు. అది మతం పేరిట, ఆధ్యాత్మిక పేరు మీద లేదా భగవంతుని పేరు మీద ప్రపంచమంతా ఎందుకు ఇంత హింస జరుగుతుంది? ఎందుకు ఇన్ని పోరాటాలు జరుగుతాయి, అని.

Content: ముందుకు మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఇదంతా ఆధ్యాత్మికత కాదు. అలాగే ఇది ఏమతం యొక్క ఉద్దేశం కాదు. ఎన్నో సంప్రదాయాలుగా అవతారం పురుషుల, యోగులూ అంతటి నిత్యమయిన భగవంతుడిని గురించి చెప్పే సత్యం ఒక్కటే అయితే ఆ సత్యాన్ని చెప్పే భాషా, పద్దతి, మార్గం కాలానుగుణంగా, అప్పటి పరిస్థితులని బట్టి వారు వెల్లడి చేసే మార్గముంటారు అయితే. ఇక్కడ జరిగే పోరపాటం ఏమిటంటే భక్తులు, అనుచరులు గురువులు చెప్పే మాటలు సందేశాలను పట్టించుకోకుండా వారి రూపానికి వారి పేరుకి ప్రాముఖ్యాన్ని ఇస్తారు. గీతలోనిక సందేశాన్ని పదిలిచేసి కృష్ణుణ్ణి, అతని మూర్తిని, నెమలిపించాన్ని పట్టుకొని వేలాడితే వచ్చే ఫలితమే హింస. ఇది ఏ కాలానికైనా వర్తిస్తుంది.

Page 48

Content: అలాకాకుండా శ్రీకృష్ణుని సందేహాన్ని గ్రహించి ఆయన రూపానికి మేరుకి ప్రాముఖ్యాన్ని ఇవ్వనప్పుడు వాళ్ళు నిజమైన కృష్ణ భక్తులవుతారు. అటువంటివారు కృష్ణ ప్రేమని, శ్రీకృష్ణని సేవా మార్గాన్ని ప్రపంచమంతా వెదజల్లగుతారు.

Content: ఒక చిన్న కథ:

Content: వారణాసిలో శ్రీకృష్ణుని భక్తుడు :

Content: నేను మీకు వారణాసిలో నివసించే ఒక భక్తుని కథ చెబుతాను. ఆతను గొప్ప కృష్ణ భక్తుడు. అతని దగ్గర భగవద్గీత పుస్తకం ఉంది. అదే ఆయన సర్వస్వం, అదే అతని సర్వసంపద. అతనికి ఎటువంటి ఆస్తులు లేవు.

Content: శ్రీ కృష్ణ భక్తుడు ప్రతి రోజూ గంగానదిలో స్నానం చేసి ఒడ్డునే ఉన్న తన పూరిపాక దగ్గర ఉన్న చెట్టు క్రింద కూర్చొని ఆ గీతనిచదివేవాడు. శ్రీకృష్ణుని సందేశమయిన భగవద్గీతని అతను అత్యంత భక్తీ పారవశ్యంతో చదివేవాడు. అలాగే కూర్చొని రోజూంతా కృష్ణుని ధ్యానం చేసేవాడు. అతను నిరంతరం శ్రీకృష్ణుని భక్తి పారవశ్యంలో ఉండేవాడు. అతని ధ్యానం, ధ్యాన సర్వస్వం కృష్ణమయమే. అతను శ్రీకృష్ణుని చేతనస్థితిలో తనను తానులీనమై తాను అనే విషయాన్ని మరిచిపోయే వాడు.

Content: ఆ భక్తుడి సంగతి ఆ ఊరివారందరికీ తెలుసు. అందరూ ఆయనని ఎంతో గౌరవంతో, భక్తితో ఆదరించేవారు. భారతదేశం, అక్కడక్కడ ప్రజలు ఈ విషయంలో ఎంతో గొప్పవారు. ఎవరైనా ఒక వ్యక్తి ఎటువంటి పనీపాటు చేయకుండా, ఏ చెట్టుక్రింద అయినా కూర్చొని భక్తిపారవశ్యంలో ఉన్నా లేదా ధ్యానం చేసుకుంటూ ఉన్నా ఎవరూ వారి నిశ్చలతని భంగపరచరు. వారే ఆ వ్యక్తి బాగోగులు చూసుకుంటారు. అదే మరే దేశంలో అయినా అయితే అటువంటివారిని తీసుకెళ్ళి జైలులోనో లేదా ఏదైనా పిచ్చోమ్మలలో వేస్తారు.

Content: ఇలా ఉండగా, ఒక రోజు ఒక భిక్షగాడు అతని దగ్గరకి వచ్చి “స్వామీ! దయచేసి ఏమయినా ఇవ్వండి. నేను భోజనంచేసి మూడు రోజులు అయింది అని దీనంగా అడుగుతాడు”.

Content: ఆ భక్తునికి ఏమిచేయాలో తెలియదు. అతనే ఒక భిక్షగాడు. అతనికి ఉన్న ఏకైక ఆస్తి భగవద్గీత. ఆ సమయంలో భిక్షగాడు వచ్చి తాను మూడురోజుల నుంచి ఏమీ తినలేదు అని అనగానే, భక్తుడు చాలా బాధపడతాడు. అతను తన పాకలో వెతుకుతాడు. ఆయనకి భగవద్గీత తప్ప ఏమీ కనిపించదు. ఆ పుస్తకమే అతని దైవం, అతని సర్వస్వం.

Content: అకస్మాత్తుగా త భక్తునికి ఛార్యలన్న అచ్చుకన,ఆ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని “అన్నా! నీ దగ్గర ఏమీ లేదు, ఈ పుస్తకం నీకు నేను ఇచ్చాను అని చెప్పి ఎవరికైనా అమ్ముకో చాలామందికి నేసంంటే గౌరవభావం ఉంది. ఎవరైనా నీకు డబ్బులు ఇచ్చి ఈ పుస్తకాన్ని కొనుక్కుంటారు. ఆ డబ్బులతో నీవు ఆకలి తీర్చుకో అని చెప్పి పుస్తకాన్ని ఆ భిక్షగాడికి ఇస్తాడు.

Content: భిక్షగాడు ఆ పుస్తకాన్ని తీసుకువెళ్ళిపోతాడు. మర్నాడు ఆ భక్తుడు గీత చదివే సమయంలో ఇలా అనుకుంటాడు, “శ్రీకృష్ణా నేను నీ మాటలని నిలబెట్టటానికి నీ మాటలని ఇచ్చివేసాను” అని

Page 49

Content: ఇతను నిజమయిన భక్తుడు. అతను సత్యాన్ని చూడగలిగాడు. ఆ సత్యాన్ని అనుభవించాడు. ఆ అనుభూతులని వెల్లడి చేయగలిగాడు. అతను శ్రీకృష్ణుని ప్రేమని, సేవా మార్గాన్ని, భక్తిని అందరికీ తెలియచేయగలిగాడు.

Content: ఇటువంటి భక్తులు ఉన్నప్పుడు గొడవలు, పోరాటాలు హింసలు జరగవు. అలా కాకుండా గీతలోని సందేశాన్ని వదలి గీతనో, కృష్ణుణ్ణి పట్టుకొని వేలాడినప్పుడే సమస్యలు వచ్చేవి.

Page 50

Content: Our Nithyananda Meditation Academies (NMA)

Content: USA:

Content: Nithyananda Dhyanapeetam

Content: 9720, Central Avenue,

Content: Montclair, CA 91763 USA

Content: Phone: 626 531 6065

Content: E-mail: [email protected]

Content: URL: www.lifebliss.org

Content: INDIA:

Content: Nithyananda Dhyanapeetam

Content: Nithyanandapuri

Content: Kallugopahalli, Mysore Road, Bidadi

Content: Bangalore - 562 109

Content: Karnataka, INDIA

Content: Phone: 91 +80 65591844 / 27202084

Content: Fax: 91 +80 7288207

Content: Email: [email protected]

Content: URL: www.nithyananda.org

Content: Nithyananda Dhyanapeetam

Content: Sri Ananda Rajarajeswari Temple,

Content: Nithyananda Giri

Content: Pashambanda Sathamrai Village, Shamshabad Mandal

Content: Rangareddy District

Content: Andhra Pradesh - 501 218, INDIA

Content: Ph.: +91 93470 65288

Content: E-mail: [email protected]

Content: Nithyananda Dhyanapeetam

Content: HYDERABAD CENTRE,

Content: Ph : 93910 35463

Content: Ebook ISBN : 979-8-88572-942-0