Books / isbn 979-8-88572-943-7

1. isbn 979-8-88572-943-7

Page 1

Content: పరమహంస శ్రీ నిత్యానంద

Content: చెప్పిన చిన్న కథలలో పెద్ద సత్యాలు

Page 2

Content: కథలు మానవ సంస్కృతిలో ఒక ముఖ్య భాగము. మనిషి మాటలు నేర్చి, కల్పనలు అల్లటం నేర్చుకున్న నాడే కథలకి అంకురార్పణ జరిగింది. కథలు లేని సాహిత్యం బహుశః ప్రపంచంలో ఎక్కడా లేదేమో. కథలు చెప్పటం ప్రాచీనమయిన ఒక కళ. కథలలో పురాణ కథలు, జానపద కథలు, సమకాలీన జీవిత కథలు ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. కథలు చిన్నపయితే కథానికలు అంటాము. మరీ పెద్ద కథలయితే నవలలు అంటాము.

Content: భారతీయ సాహిత్యం, సంస్కృతిలో పెనవేసుకుపోయిన అంశం కథ. ప్రపంచదేశాలతో పోల్చిచూస్తే భారతీయ కథలు బహుప్రాచీనమయినవి. అవి నేటికి సజీవంగా అలరారుతున్నాయి. బహుశః ప్రపంచంలో వినే కళలలో భారతీయులు వేల సంవత్సరాలుగా నిష్ఠాతులు అయినందుకు కథలు అంత ప్రాచుర్యాన్ని పొందాయేమో. వారి శ్రవణ శక్తి అమోఘం .అందుకు ఉదాహరణ, కొన్ని వేల సంవత్సరాలుగా మన వేడాలు, ఉపనిషత్తులు, పురాణాలు వినడం ద్వారా ఒక తరం నుండి మరొక తరానికి జాగ్రత్తగా బదిలీ అయ్యాయి. వాటిని ఈ మధ్య కాలంలోనే బహుశః మూడు నుంచి నాలుగువేల సంవత్సరాల క్రితం మాత్రమే అక్షర రూపంలో తాళ పత్రాల మీద రచించారు.

Content: ఈ శ్రవణ శక్తి వలన కూడా నేటికీ కథలు అజరామరంగా ఈ భూమి మీద ఉన్నాయి. కథలు లేని పురాణాలు, కథలు లేని ఏ కార్యక్రమాలు మనకి ఉండవు.

Content: కథ అంటే మనలోని భావాలకి ఊహలని కల్పనలని మేళవించి, వినటానికి ఇంపుగా, చదవటానికి చక్కగా తయారు చేసి చెప్పటమే. కథని సృష్టించటం, దానిని అందంగా మలచటం, ఇంకాస్త అద్భుతంగా చెప్పటం అనేది గొప్ప కళ. కథలు సృజనాత్మకతకి, మేధస్సుకి, అసంకల్పితంగా స్పందించ గల నేర్పుకి చక్కని ఉదాహరణ.

Content: కథలని సృజించే సృజనాత్మకత గురించి పరమహంస శ్రీ నిత్యానంద ఒక చక్కని మాట చెబుతారు. 'ఎప్పుడయితే మేధస్సుతో పాటు హృదయం కూడా కలుస్తుందో అక్కడ సృజనాత్మకత ఉంటుంది. అందులోంచి కళ ఎదుటివారికి సూటిగా అర్థమయ్యే రీతిలో చెప్పగల నేర్పుని కథలు అంటాము. చెబుతున్న సందర్భాన్ని మనకి స్పష్టం చేయటానికి కథలని ఉపయోగిస్తాము. మనం సూటిగా చెప్పలేని విషయాలని కథల రూపంలో అద్భుతంగా చెప్పవచ్చు.

Content: అందుకే కథలు సృజించే కళాకారునికి దానికి తృప్తి అనంతమయినది. ఈ సందర్భంగా పరమహంస శ్రీ నిత్యానంద ఈ విధంగా చెబుతారు. 'ఒక పద్యాన్ని (కథని ప్రాసిన) కవి, ఒక బిడ్డకి జన్మించిన తల్లి కంటే ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే బిడ్డకి జన్మనిచ్చే తల్లి గర్భం కడుపులో ఉంటుంది. అదే కవికి హృదయంలో ఉంటుంది. అదే ఫలసిద్ధి పొందిన ఆనందం. పరమహంస శ్రీ నిత్యానంద మరొక అందమయిన విషయాన్ని కూడా తన ప్రవచనాలలో చెబుతుంటారు.

Content: సృజనాత్మకత భగవంతునికి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే సృజనాత్మక హృదయానికి సంబంధించినది. హృదయం ఎప్పుడూ భగవంతునికి చేరువకావాలని ఆతృత పడుతుంది. కాని మేధస్సు తొలికిక ప్రపంచానికి దగ్గరవటానికి ఆతృత పడుతుంది. అందుకే కళాకారులు సర్వాంతర్యామికి దగ్గరగా ఉంటారు.

Content: బహుశః ఈ కారణం వలననేమో ఎక్కడ ఆధ్యాత్మికత ఉంటుందో అక్కడ కథలు, పాటలు, పద్యాలు, నాట్యాలు, భజనలు, కీర్తనలు, సంగీతం ఉంటాయి. కానీ అక్కడ గణిత శాస్త్రాలు, లేదా మరొక శాస్త్ర ధియరీలు, గణాంకాలు, లెక్కలు ఇలాంటివి ఉండవు. అసలు మేధస్సుకి సంబంధించిన ఏ విషయం అక్కడ కనిపించదు.

Page 3

Content: అక్కడ మీకు కేవలం హృదయం మాత్రమే కనిపిస్తుంది. అదే ఆధ్యాత్మికత. అదే భగవంతుని సమక్షం. అక్కడ కూడా లెక్కలు కడుతున్నాము అంటే అది ఆధ్యాత్మికత కాదు అది కేవలం వ్యాపారం.

Content: కథ అనే మాట చాలా చిన్నది. అలాగే కథలు కూడా చిన్నవే. అలా అని వాటిని మనం చిన్న చూపు చూడకూడదు. ఈ సందర్భంలో శ్రీ పాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు (1891) కథల గురించి వాటి గొప్పదనం గురించి చాలా చక్కగా చెబుతారు. ఆయన ఈ విధంగా అంటారు “కథలు కల్పించటానికి గొప్ప ప్రతిభ ఉండాలి. అవి చెప్పటానికి నేర్పు ఉండాలి. అవి అర్థం చేసుకోవటానికి బుద్ధి సూక్ష్మత ఉండాలి” అని. కథల ద్వారా చెప్పే విషయం సూటిగా, సున్నితంగా హృదయానికి తాకుతుంది. అందుకే ఆ విషయం మనసికి ఎంత కాలమయినా గుర్తుంటుంది.

Content: మన చిన్నప్పుడు తాతయ్య చెప్పిన అనగనగా ఒక రాజు కథ మర్చిపోయిన వారు అసలు మనకి కనిపించరు. ఆ కథ మొత్తం మనకి గుర్తుంటుంది. కాని నిన్న మొన్న నేర్చుకున్న సూత్రాలు, ధ్యరీలు, నిర్వచనాలు, పాఠాలు అసలు గుర్తు ఉండవు. ఎందుకంటే అవి మేధస్సుకు చేరతాయి.

Content: కథలు స్ఫూర్తిని ఇస్తాయి. స్థబ్దతగా ఉన్న మనస్సుని ఉత్సాహపరుస్తాయి. నిరుత్సాహంగా ఉన్న వారిలో చైతన్యాన్ని నింపుతాయి. కథలు కల్పించిన కళాకారుడికి ఆ కథ ఇచ్చే తృప్తి అనంతమయినది, ఎంతో విలువయినది. అదే విధంగా ఆ కథకి శ్రోత అయిన కళాపోషకుడు పొందే ఆనందం వెలకట్టలేనది. అందుకే కథలకి మనకి అంత చక్కని అనుబంధం ఏర్పడినది.

Content: కథ మనిషిని మనస్సుగా మారుస్తుంది, వ్యక్తిని తపస్విని చేస్తుంది. భోగిని త్యాగిగా తయారు చేయగలుగుతుంది. అదే విధంగా విరాగిని అన్వేషిగా చేయగల శక్తి కథకి ఉంటుంది. సృష్టికర్త కథ ఎంతమందికి స్ఫూర్తి రూపంగా చేసిందో మనదరికీ తెలుసు. ఛత్రపతి శివాజీని అంత గొప్పవీరునిగా మలచటంలో అమ్మ చెప్పిన కథలు ప్రభావం ఎక్కువ అని మనం చదినాము.

Content: ఇక్కడ కథల గురించి మంచి ప్రాచుర్యంలో ఉన్న కథ ఒకటి మన భారతీయ సాహిత్యంలో ఉన్నది. అదే పంచతంత్ర. ఒక రాజుగారు తన కుమారులని గొప్ప మేధావులుగా, మంచి పరిపాలనా దక్షులుగా చేయాలి అని నిర్ణయించి వారిని మంచి గురుకులానికి పంపిస్తారు. ఆ రాజకుమారులు చాలా దుడుకువారు. చదువు సంధ్యలు వారి దగ్గరికి వచ్చేవి కాదు. క్రమశిక్షణ లేదు, భయం భక్తి వారికి అసలు లేదు. గురువులు మహారాజుకి నమస్కరించి రాజకుమారులకి విద్యాబుద్ధులు నేర్పించటం తమ శక్తిని మించిన పని అని చెప్పి తలవు తీసుకునేవారు. రాజకుమారులని చాలా గురువుల దగ్గరకి పంపించాడు, కానీ ఫలితం శూన్యం.

Content: రాజకుమారుల విషయం రాజుగారికి పెద్ద సమస్యగా మారిపోయింది. ఆ సమయంలో మహామంత్రి రాజుగారి కులగురువుని రాజ్యానికి ఆహ్వానించి సమస్యని వివరించి, ఈ సమస్యవలన మహారాజుగారు ఏవిధంగా మానసికంగా కుంగిపోయారో చెబుతాడు. అప్పుడు రాజగురువు రాజుని ఓదార్చి ఒక రోజు మొత్తం రాజకుమారులతో గడిపి, రాజు దగ్గరకి వస్తాడు. ఆయన రాజుతో, “మహారాజా! రాజకుమారులని నా వెంట నా ఆశ్రమానికి తీసుకువెళతాను. వీరిని విద్యావంతులని చేసి తిరిగి నీ రాజభవనానికి వస్తాను” అని వాళ్ళనీ వెంట పెట్టుకుని ఆశ్రమానికి వెళతాడు. ఇంతమంది గురువులు చేయలేని పని ఈయన మాత్రం ఏం చేస్తాడులే అని అందరూ అనుకుంటారు.

Content: రాజగురువు రాజకుమారులకి చిన్న చిన్న అందమయిన కథలని చెబుతూ అన్ని శాస్త్రాలు భోదించుతాడు. వారికి

Page 4

Content: యుద్ధ నైపుణ్యాలు, యుద్ధతంత్రాలు, సామాజిక జీవితంలో ఉండే విశేషాలు, మోసాలు, కుతంత్రాలు వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం ఈవిధంగా రాజకుమారులకి కాపలసిన శాస్త్రాలన్నీ నేర్పించుతారు. అయితే ఇన్నీ కూడా చిన్న చిన్న కథల రూపంలోనే నేర్పించుతాడు. వారు శాస్త్రాలు నేర్చుకుంటున్నారు అన్న విషయం తెలియకుండా నేర్చుకుంటారు. చివరికి మహామేధావులుగా మారి రాజభవనానికి తిరిగి వస్తారు.

Content: కాబట్టి కథలకి అంతశక్తి ఉన్నది అని భారతదేశంలో ఎప్పుడో ప్రాచీన కాలంలోనే నిరూపించబడింది. అసరే మనందరం కథలని ఎందుకు ఇష్టపడతాం? దీనికి జవాబు మరొక ప్రశ్న ఉన్నది. మనం అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసి ఎందుకు అంత ఆనందంపడతాం? ఎందుకు అంత ఇష్టపడతాం? ఇది కూడా అంతే. కథలలో ఉండే భావాలు, విషయాలు సమస్యలు, పరిష్కారాలు అన్నీ మనకి సంబంధించినవే. మన ప్రతిబింబాన్ని అందంగా చూపిస్తున్నాయి కాబట్టి మనం కథలని ఇష్టపడతాము.

Content: పరమహంస శ్రీ నిత్యానంద స్వామి కూడా పంచతంత్రంలో గురుదేవుల మాదిరిగానే మన అందరినీ కథల ద్వారా సత్యాన్ని అర్థం చేసుకునేలా చేస్తారు. ఆయన తన ప్రతి ప్రవచనంలో ఎన్నో చిన్న చిన్న కథలు చెబుతూ తాను చెప్పదలచిన అంశాన్ని సూటిగా మన హృదయంలోనికి పంపించుతారు.

Content: పరమహంస శ్రీ నిత్యానంద స్వామి చెప్పే ప్రతి మాట ఒక సత్యం. అది విశ్వ జనీయత కలిగిన ఒక నిర్దిష్ట ప్రమాణం. సత్యం ఎప్పుడు కరినంగానే ఉంటుంది. అది మనకి ఒక ఘాతంలా తగులుతుంది. అందుకే సత్యం చేదుగా ఉంటే మనకి గుచ్చుకుంటుంది. ఆ పదునైన సత్యాలు అగ్నిశిఖలా దూసుకు వస్తే మనం తట్టుకోలేము, అందుకే ఆ సత్యాలు గుచ్చి పారిపోటానికి ప్రయత్నిస్తాము. అని పరమహంసకి తెలుసు. పంచతంత్ర కథల ని రాజకుమారులులా ఆ చేదు గుళికలు రుచించచక, మనం గురువుల నుంచి, సత్యాల నుంచి తప్పించుకోపటానికి శాయశక్తులా ప్రయత్నిస్తామని కూడా పరమహంసకి తెలుసు. విశ్వమేధస్సుతో నింపబడిన ఆ జ్ఞానోదయమయిన యోగిశ్వరుడు, మనని తప్పించుకోనీయరు.

Content: స్వామి ఆ భాణాలని సుకుమార సుమాల మాలగా, అగ్ని శిఖలని చల్లని శ్రీ గంధంలా తయారు చేసి, ఆ సత్యాలని మన దగ్గరకి మృదువుగా, మధురంగా ఆప్లాదకర రీతిలో పంపించుతారు. దానికి ఆయన వాడే అతి శక్తి వంతమయిన పద్ధతి చక్కని చిన్న కథలు. అప్పుడు ఎటువంటి బాధ, శ్రమ లేకుండా, చేదు తెలియకుండా ఆ సత్యాలు సూటిగా మన హృదయంలోనికి వెళతాయి. అవి మనని బాధించవు సరికదా ఆప్లాదపరుస్తాయి. అదే, పరమహంస శ్రీ నిత్యానంద స్వామి యొక్క కరుణాపూరితమయిన మేధస్సు, ప్రేమ పూరితమయిన అపార ఆదరణ.

Content: ఇంత యుక్తిగా, అంత శక్తివంతమయిన విషయాలని సామాన్యులమయిన మన లోపలికి అత్యంత ఆప్లాదకరమయిన రీతిలో పంపించ గల నేర్పు, మేధస్సు ఆ పరమహంసకి తప్ప ఎవరికి ఉంటుంది?

Content: పరమహంస నిత్యానంద స్వామీజీ ఎవరు?

Content: భారతదేశాన్ని వేద భూమి, దేవ భూమి అంటారు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలుగా ఈ భూమి మీద అవతారపురుషులు, భగవత్ స్వరూపులు అవతరించి సామాన్య మానవులని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించారు. ఆ పరంపరలో, ఈ నాటి ఆధునిక కాలంలో పరమహంస శ్రీ నిత్యానంద స్వామి మనకోసం వచ్చిన మహాత్ముడు. ఆయన జ్ఞానోదయమయి మన మధ్య ఉన్న యోగిశ్వరుడు.

Page 5

Content: పరమహంస నిత్యానంద 1978లో తమిళనాడులో జన్మించి, పదహారవ ఏట, హిమాలయాలకు వెళ్ళి అక్కడ కలోర తపస్సు చేసారు. ఆయన పరిప్రాజకునిగా భారతదేశమంతా కాలినడకన తిరిగారు. ఇండియా, నేపాలులలోని హిమాలయ ప్రాంతాలన్నీ తిరిగారు. అక్కడ ఆయన ఎందరో ఋషులని,యోగులని కలిసి వారి దగ్గర యోగా, తంత్ర, ధ్యానం మొదలయిన ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రాలని క్షుణ్ణంగా నేర్చుకున్నారు.

Content: స్వామీజీ హిమాలయాలలో తపస్సు చేసుకునే రోజులలో ఆయనకు మహాపతార్ బాబాజీ దర్శనమిచ్చి ఆయనని పరమహంస నిత్యానంద అని పిలిచి, దీవించి మాయం అయిపోయారు. అయితే ఆ సమయంలో ఆయనకి అది బాబాజీ తనకి ఇచ్చిన పేరు అని అర్ధం కాలేదు. కొంత కాలం గడిచాక ఒక యోగీశ్వరుడు స్వామీజీకి సన్యాస దీక్షని ఇచ్చి ఆయనకి ‘పరమహంస శ్రీ నిత్యానంద’ అని పేరు పెట్టారు. అప్పుడు స్వామీజీకి మహాపతార్ బాబాజీనే తనకి ఆ పేరుని ఇచ్చారు అని ఆర్థమయింది.

Content: పరమహంస శ్రీ నిత్యానందస్వామి కలోర తపస్సు ఫలితంగా జనవరి ఒకటి 2000 సంవత్సరంలో ఆయనకి జ్ఞానోదయమయ్యి ఆయన శాశ్వతానంద స్థితిని చేరారు.

Content: జ్ఞానోదయం పొందిన తరువాత స్వామీజీ దక్షిణ భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇప్పుడు ఆయన ఏకైక లక్ష్యం, తాను పొందిన ఆనందాన్ని అందరికీ పంచి పెట్టాలి. తప్పుదారిలో ఉన్నే ఆధ్యాత్మికతని సరియైన మార్గంలో నిలపాలి, ముఖ్యంగా భారతీయ ఆధ్యాత్మికత, యోగా, ధ్యానం పైన పాశ్చాత్యదేశాలలో చాలా తప్పు ప్రచారాలు జరుగుతున్నాయి. అది సరికాదు అని చెప్పటానికి నిత్యానందస్వామి నిర్ణయించుకున్నారు.

Content: ఆయన వెంట సమాజంలో ఉన్న సమస్యలు, వ్యధలు అన్నీ చాలా స్పష్టంగా స్పష్టంగా కనిపిస్తున్నవే అని, వాటిని చిన్న చిన్న సాధనలతో తొలగించవచ్చుసని నిరూపించారు. స్వామి ముఖ్యలక్ష్యం, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిలో మార్పుని తీసుకురాగలిగితే ప్రపంచంలోని సమస్యలన్నీ మాయం అయిపోతాయి, ముఖ్యంగా హింసాప్రవృత్తి, డిప్రెషన్, అత్యాశ ఇటువంటి సమస్యలని చాలా సులభంగా తొలగించవచ్చు అని అంటారు.

Content: ప్రపంచంలోని ఇన్ని సమస్యలకి అసలయిన కారణం మనకి ఏమి కావాలో మనకి తెలియకపోవటం. మనకు తెలియని దాని కోసం, అక్కడ లేని దాని కోసం మన శక్తినంతా ఉపయోగించి పరుగులు పెడుతున్నాము. లేని దాని కోసం పరుగెడితే మనం ఏమీ సాధించలేము. దానితో మానసికంగా కుంగిపోవటం, శారీరకంగా చాలా అనారోగ్యాలని తెచ్చుకొని అనేక సమస్యల ఊబిలో కూరుకుపోతున్నాము. దీనితో అశాంతి, అసహనం, అసంతృప్తి, అహంసా ఇలాంటివన్నీ కుటుంబాలలో, సమాజంలో చివరికి ప్రపంచమంతా వ్యాపించిపోయాయి. అది ఎంతలోతుగా వ్యాపించిందీ అంటే ఈ లక్షణాలు లేని వ్యక్తులు కానీ, ప్రదేశాలు కాని మనకి కనపడటం లేదు.

Content: ఈ సమస్యలన్నింటికి పరమహంస నిత్యానంద చాలా సులభమయిన, ఆచరణ యోగ్యమయిన, అందరికీ అందుబాటులో ఉండే ఒక సూత్రాన్ని చెప్పారు. అది “వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తిలో మార్పు తీసుకురావటం ద్వారా ప్రపంచంలోని సమస్యలని అధికమించవచ్చు. అదే విధంగా ప్రపంచాన్ని మార్చవచ్చు. వ్యక్తిగత మార్పుని ధ్యానం ద్వారా సాధించవచ్చు. దీని ద్వారా ప్రపంచంలో నిత్యానందాన్ని పరమానంద స్థితిని స్థాపించవచ్చు.

Content: ధ్యానంతో పాటు, స్వామీజీ మనలోని సమస్యలకి, ప్రపంచంలోని సమస్యలకి కారణాలని మనకి స్పష్టంగా

Page 6

Content: చూపిస్తూ, అవి ఏవిధంగా సమస్యలని సృష్టిస్తున్నాయో, ఆ సమస్యలని మనం ఏవిధంగా ధ్యానం ద్వారా పరిష్కరించవచ్చునో నేర్పించుతారు. ఈ సందర్భంలో స్వామీజీ చెప్పే సత్యాలు మనని నిర్భయత్వపోయేలా చేస్తాయి. కొన్ని సమ్మటేని విధంగా ఉంటాయి. అటువంటి సత్యాలని స్వామీజీ మనకి మనోహరమయిన, ఆకర్షణకరంగా ఉండే చిన్న చిన్న కథల ద్వారా ఆ నొప్పి తెలియకుండా నేర్పించుతారు. అటువంటి కొన్ని కథలని ఒక పుస్తక రూపంలో తీసుకువచ్చాము. ఇవి పిల్లలకి, పెద్దలకి, బాగా చదువుకున్న వారికి, అందరికీ అర్థమయ్యేవిధంగా మలచాము.

Content: మీ శరీరాన్ని, మిమ్మలని మీరు ప్రేమించటం నేర్చుకోండి?

Content: పరమహంస శ్రీ నిత్యానంద మనం సమ్మటేని నిజాన్ని మనం ఆశ్చర్యపోయే సత్యాన్ని ఒకదానిని చాలా చమత్కారంగా చెబుతారు. అది ‘మీ శరీరాన్ని, మిమ్మలని మీరు ద్వేషించచున్నారు’. ఈ మాట వినగానే మనం సమ్మం, కానీ స్వామీజీ వివరంగా ఉదాహరణలతో చెప్పినపుడు, సమ్ముతాము, ఆశ్చర్యపోతాము.

Content: స్వామీజీ ఈ విధంగా చెబుతారు. ‘నా శరీరంతో సౌకర్యంగా ఉన్నాను. నా శరీరం నాకు చాలా బాగుంది’ అని చెప్పేవారు చాలా అరుదుగా కనిపించుతారు. వాళ్ళు కూడా నా శరీరాన్ని ప్రేమిస్తున్నాను అని అనరు, సౌకర్యంగా ఉన్నాను అంటారు.

Content: శరీరం అంటే ఏమిటి?

Content: శరీరం అంటే మీరు కారు ఈ శరీరం మిమ్ములను మోసుకు తిరిగే ఒక వాహనం. ఈ జీవితం అనేది సముద్రం దాటించే నౌక. మీకు నివాసాన్ని కల్పించిన గృహం. అంతే. అయితే మీరు ఏ పని చేయాలి అని అనుకున్నా శరీరం కావాలి. శరీరం సహాయసహకారాలు లేకపోతే ఏమీ సాధించలేరు. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా, సౌకర్యంగా ఉంచుకోవాలి. అంతేకాదు శరీర సహాయం మీకు కావాలి కాబట్టి శరీరంతో మీరు ముంచి అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి, దానిని ప్రేమించాలి. అయితే దానిని మీద ప్రేమ మిమ్మలని దాటి వెళ్ళిపోకూడదు. మీ శరీరం మీ కంటే గొప్పది కాదు. అది మీ యొక్క తాత్కాలిక నివాసం. ఈ జన్మలో మీరు చేయవలసిన పని అయిపోగానే ఇక ఆ ఇంట్లో వుండరు. దానిని వదిలి వెళ్ళుతారు.

Content: అదే విధంగా శరీరాన్ని ద్వేషించకూడదు. నేను అందగాలేను, నేను పొడవుగా లేను, పొట్టిగా లేను ఇలాంటివన్నీ అర్థం లేని విషయాలు. ఇవన్నీ ఇతరులతో పోల్చుకోవటం వలన కలిగిన భ్రమలే. ఈ విధంగా చాలా మంది మానసికంగా కుంగిపోతారు.

Content: స్పష్టంగా అర్థం చేసుకోండి. మీరందరూ ఆ భగవంతుని చేత ప్రత్యేకంగా సృష్టించబడినవారు. భగవంతునికి మీరు కావాలి. అందుకే భగవంతుడు మిమ్మలని సృష్టించాడు. మీ ద్వారా ఈ ప్రపంచానికి ఏదో చేయాలి అని సంకల్పించాడు. అయితే మీరు ఒక విషయం అడగవచ్చు. భగవంతుడు అందరినీ అందంగా సృష్టించవచ్చు కదా! అని.

Content: అవను. భగవంతుడు అందరినీ అందంగా అద్భుతంగా సృష్టించాడు. కాదని ఎవరయినా చెప్పగలరా? ఆయన మేధస్సు కంటే గొప్పదా మీ మేధస్సు? ఆయన సృష్టిని ప్రశ్నించేంత మేధస్సు ఉన్నదా మనకి?

Page 7

Content: అర్థం చేసుకొండి, భగవంతుడు ఇంజినీరు కాదు. ఏదో ఒక మూస తీసుకొని మనుషులని ముద్రించటానికి. ఆయన అందమయిన హృదయం ఉన్న కళాకారుడు. ప్రతి మనిషినీ అతని జీవితానికి సరిపడే విధంగా తీర్చిదిద్దుతాడు. అతను ఈ ప్రపంచంలో ఏ కర్మలు చేయటానికి వచ్చాడో దానికి అనుగుణంగా అతనిని తీర్చిదిద్దాడు. మహామేధో సంపన్నుడయిన భగవంతుని పనికి మనం లోపం చూపాలా? మనం ఆయనకి సలహాలు చెప్పనవసరం లేదు కదా! ఆయన ఎవరిని అయినా ఒక లక్ష్యం కోసం సృష్టించుతారు. దానికి తగినట్టు వారిని తయారు చేస్తాడు. మనలో లోపం అనేది కేవలం సమాజం సృష్టి లేదా మన బ్రహ్మ.

Content: ఈ విషయాన్ని అర్థం చేసుకొకుండా మనని మనం ద్వేషించుతాము. మనని నియంత్రించాలని (కంట్రోలు చేయాలని) చూసే సమాజం మీ శరీరం గురించి ఇటువంటి అర్థం లేని వ్యతిరేక అభిప్రాయాలని పంపించి, మనం తక్కువ అని అనుకునేలా చేసి అప్పుడు మనని తన గుప్పిటలోనికి తీసుకుంటుంది. మీరు ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని ఆలోచించితే మీ శరీరం మీద మీకు ఉన్న అభిప్రాయాలన్నీ కూడా మీ చిన్నతనం నుంచి ఈ సమాజం కల్పించినవే అని స్పష్టంగా అర్థమవుతుంది. అవి నమ్మి మీరు అపరాధభావంతో ఆత్మసూయతో భావంతో కుంగిపోతే, అప్పుడు సమాజం మీ మీద విజయం సాధించినట్లే అనుకోని, మిమ్మలిని తన గుప్పిటలోనికి తీసుకుంటుంది. పరమహంస ఈ విషయాలన్నీ చెబుతూ మనకి ఒక చక్కని కథ చెబుతారు.

Content: చిన్నకథ : కావడి మోసే వ్యక్తి - కావడి కుండలు ఒక వ్యక్తి ఒక ఆసామి ఇంట్లో పనిచేస్తుంటాడు. ఆ వ్యక్తి చేయవలసిన పని ప్రతి రోజూ ఆ ఇంటికి దూరంగా ఉన్న వనానికి వెళ్ళి రెండు కుండలు నిండుగా నీరు నింపి, ఇంటికి తీసుకురావాలి. ఆ వనానికి ఒక ఘాటిలో నింపాలి. ఆ వ్యక్తి తన పనులని చాలా బాధ్యతగా చేస్తుంటాడు. అతని పనులకి యజమాని సంతోషపడుతుంటాడు. ప్రతి రోజూ ఆ వ్యక్తి కావడి భుజాన వేసుకొని సడచి నది దగ్గరికి వెళ్ళి, రెండు కుండల నిండా నీరు నింపి వాటిని కావడిలో పెట్టి భుజాన మోసుకొని యజమాని ఇంటికి తెస్తుంటాడు. ఈ విధంగా ప్రతి రోజు చేస్తుంటాడు.

Content: అతను ఇంటికి నీరు తెచ్చే రెండు కుండలలో ఒకటి బాగానే ఉంటుంది కాని మరొక కుండకి చిన్న పగులు ఉంటుంది. దానితో కుండనిన్డుగా నీరు పట్టి తెచ్చినా ఆ పగులు ద్వారా నీరు బయటకి కారిపోయి ఇంటి వచ్చేటప్పటికి నగం నీరు మాత్రమే మిగిలేది.ఆ విధంగా కుండలోని నీరు సగం బయటకి పోయినా, ఆ కావడి మోసే వ్యక్తి ఏమి పట్టించుకునేవాడు కాదు. ఆవిధంగానే సగం కుండ నీరు మాత్రమే యజమాని ఇంటి తెచ్చేవాడు.

Content: అయితే రెండు కుండలలోనూ బాగున్న కుండ తాను చాలా కచ్చితమయిన దానిని అని, తనని తయారు చేసిన ఉద్దేశం ప్రకారం తన బాధ్యతని చక్కగా నిర్వహిస్తున్నాను అని చాలా గర్వపడేది. తనలో లోపం లేదు అనే అహంకారాన్ని ప్రదర్శించుతూ ఉండేది. తన పనిలోని నాణ్యతని చూసి గర్వపడేది.

Content: రెండవపదయిన పగులు ఉన్న కుండ తనలోని లోపం చూసి సిగ్గుపడేది. తాను కచ్చితంగా లేనని, తన బాధ్యతని పూర్తిగా నెరవేర్చలేకపోతున్నాను అని చాలా బాధపడేది. మానసికంగా కుంగిపోయేది. రోజులు గడచేకొద్దీ పగిలిన కుండ వ్యధ అధికమయిపోతుండేది.

Page 8

Content: ప్రతి రోజూ మాదిరిగానే ఆ రోజు కూడా కావడి మోసే వ్యక్తి నదికి వెళ్ళి కుండల నిండుగా నీరు నింపుతాడు. పగిలిన కుండని నీటితో నింపే సమయంలో ఆ కుండ, నీరు మోసే వ్యక్తితో ఈ విధంగా అంటుంది. "ఓ వ్యక్తీ! నాకు చాలా సిగ్గగా ఉంది. నాకు చాలా బాధగా ఉంది. నేను నీకు చాలా శ్రమ ఇస్తున్నాను. నా వలన నీకు చాలా కష్టం కలుగుతుంది," అని చాలా బాధగా అంటుంది.

Content: నీరు మోసే వ్యక్తి ఆశ్చర్యంగా ఆ కుండ వైపు చూస్తాడు. అతనికి ఏమీ అర్థం కాదు. "ఓ కుండా! నీవు ఏ విషయం గురించి బాధపడుతున్నావు?" అని అడుగుతాడు.

Content: పగిలిన కుండ ఆ వ్యక్తికి ఈ విధంగా జవాబు ఇస్తుంది, "అయ్యా! నీవు ప్రతి రోజు నన్ను నీటితో నిండుగా నింపుతావు. కష్టపడి భుజం మీద కావడి వేసుకొని మోసి ఇంటికి వస్తావు. నీవు తీరా ఇంటికి చేరే సరికి నా లోని లోపం వలన సగం నీటిని పోగొట్టుకుంటున్నావు. నా మూలాన నీకు నీ శ్రమకి తగిన ఫలితం దొరకటం లేదు. ఈ విధంగా నా వలన నీ శ్రమ వృథా అవుతుంది. అందుకే నేను బాధపడుతున్నాను" అని చాలా బాధపడుతూ తన మనస్సులోని వ్యధని ఆ కావడి మోసే వ్యక్తికి చెబుతుంది పగిలిన కుండ.

Content: కావడి మోసే వ్యక్తికి ఆ కుండని చూస్తే చాలా జాలి అనిపిస్తుంది. ఆ కుండని ఎంతో ప్రేమగా తన చేతులలోనికి తీసుకొని దానితో "నీవు అసలు ఈ విషయం గురించి ఆలోచించకు. ఇవాళ మనం యజమాని ఇంటికి వెళ్ళే దారిలో చుట్టూ ఉన్న ప్రకృతిని చూడు. అక్కడ ఉన్న అందమయిన పూలని గమనించు" అని అప్ప్యాయంగా చెబుతాడు.

Content: కుండ కన్నీటిని తుడిచుకుంటూ పరే అంటుంది, "కానీ దానికి దిగులు లేదు. ఆ వ్యక్తి కావడిని భుజం మీద వేసుకొని యజమాని ఇంటికి బరులుదేరుతాడు. ఆవ్యక్తి చెప్పినట్టు పగిలిన కుండ దారికి రెండువైపులా ఉన్న పరిసరాలని గమనించుతూ ఉంటుంది. అప్పుడే ఉదయించిన సూర్యుని కిరణాలు సుళివెచ్చగా అక్కడి చెట్లపై పడి ఆ చెట్లు ఎంతో అందంగా, బంగారు రంగులో కనపడుతున్నాయి. దారి అంతా ఉన్న మొక్కలు అందమయిన పూలతో చాలా అందంగా ఉన్నాయి. ఆ పూల మొక్కలు వాటి పూలతో దారి అంతగా కనపడుతుంది. ఆ ప్రకృతి అందాలు, పూలతో నిండుగా ఉన్న మొక్కలని చూసి కుండ చాలా ఆనందపడుతుంది.

Content: వారు ఇంటికి చేరాకా, తిరిగి కుండ తన పాత భావాలలోనికి వెళ్ళిపోతుంది. తాను ఎందుకూ పనికిరాని దానినని మరింతగా వ్యధ చెందుతుంది. తనలోని లోపాన్ని మరొకసారి గుర్తుచేసుకొని సిగ్గుతో కుంచించుకుపోతుంది. నీరుమోసే వ్యక్తి కుండలలోని నీటిని తీసుకెళ్ళి తొట్టిలో పోసి, వాటిని యధాస్థానంలో పెడతాడు.

Content: అప్పుడు పగిలిన కుండ సగం నీరుని మాత్రమే తేగలిగాను అని కసీరు కారుస్తూ ఆ వ్యక్తిని క్షమించమని అడిగి తాను అసమర్థురాలనని అంటుంది.

Content: ఆ వ్యక్తి కుండతో ఇలా అంటాడు, "నీవు నది నుంచి ఇంటికి వచ్చే దారిని గమనించావా?" అని అడుగుతాడు. "అవును, గమనించాను. ఎంతో అందమయిన పూల మొక్కలు ఉన్నాయి. అవి అదృష్టం కలిగినవి, నాలాంటి దురదృష్టవంతమయినవి కావు. వాటి అందాలు వర్ణించలేను" అని అంటుంది, పగిలిన కుండ. ఆ వ్యక్తి తిరిగి కుండతో ఇలా అంటాడు, "ఆ పూల మొక్కలు అన్నీ నీవు ఉన్నవైపు మాత్రమే ఉన్నాయి. అవపతలవైపు లేవు. ఆ విషయం గమనించావా".

Page 9

Content: అవును, గమనించాను ఆని కుండ జవాబు చెబుతుంది. అప్పుడు ఆ వ్యక్తి కుండతో, “ ఆ మొక్కలు, అందమయిన పూలు నీవు పెంచినవే. అదంతా నీప్రతిభే అంటాడు”.

Content: ఆశ్చర్యపోయిన కుండ నేను నమ్మను. నేను అసమర్థురాలని. ఇది ఎలా సాధ్యం అని అంటుంది.

Content: అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, “ప్రతి రోజు ఉదయం నది నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నీ పగలు నుంచి కారిన నీటితో ఆ మొక్కలు పెరిగాయి. అవి అందమయిన పూలని ఇస్తున్నాయి. నేను ఆ పూలతో యజమాని గదిని అలంకరిస్తాను. యజమాని నా పనికి ఎంతో సంతోషపడతాడు. నన్ను ఎంతో మెచ్చుకుంటాడు. ఇదంతా కేవలం నీ వలన మాత్రమే సాధ్యపడినది. నేను నీకు కృతజ్ఞత చెప్పాలి” అని ముగించుతాడు ఆ వ్యక్తి.

Content: పగిలిన కుండ ఆశ్చర్యానికి, ఆనందానికి హద్దులు లేనటంగా ఆనందిస్తుంది. తనని అంత ప్రత్యేకంగా చేసిన భగవంతునికి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటుంది.

Content: ఈ కధని ముగించి స్వామీజీ ఈ విధంగా చెబుతారు. మన అందరిలో ఒక లోపం ఉంటుంది. అందరం పగులు ఉన్న కుండలాంటి వారమే. కాని మనం ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. మనందరిని భగవంతుడు ఎంతో శ్రద్ధతో ప్రత్యేకంగా సృష్టించాడు. నేను బాగా లేను, నాలో లోపం ఉన్నది అని మీరు అనుకుంటే, మీరు భగవంతుని శక్తిని విమర్శించుతున్నారు అని అర్థం. భగవంతుని మేధస్సు కచ్చితం కాదు అని మీరు అనుకుంటున్నారు అని అర్థం.

Content: మీలో లోపాలు ఉన్నాయి అని అనుకోవద్దు. మీకు ఏదయినా అలా కనిపించితే అవి మన జీవిత విధానాలు అని గుర్తుంచండి. అప్పుడు మీరు మీ జీవితంలోకి అందాలు తెచ్చుకుంటారు. ఆనందం మీ సొంతమవుతుంది. మీ చుట్టూ ప్రక్కల, మీ ఇంటిలో, సమాజంలో మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం వ్యాపిస్తుంది.

Content: కోరిక అత్యాశ అనర్థదాయకం

Content: ఎవరయినా, నేటికాలంలో మనిషిని నడిపే శక్తి ఏది అని అడిగితే, ఒకటి కాదు రెండు అని సమాధానం చెబుతారు. అవి కోరిక, ఆశ :

Content: ఆశ, ఆశగా ఉన్నతవరకూ పరవాలేదు. కాని అది అత్యాశగా మారినప్పుడే ఇన్ని సమస్యలు వచ్చేవి. అదే విధంగా కోరికలు అనేవి మన కోరికలయితే అసలు బాధపడే అవసరమే లేదు. కాని మనం ఎదుటివారిని చూసి వారి దగ్గర ఉన్న వాటిని మన కోరికలుగా మలచుకొని, ఆ కోరికల వెంట పరుగులు తీస్తున్నాము. ఇది మనకి మరిన్ని బాధలని ముఖ్యంగా తీప్రమయిన నిరాశ, మానసిక కుంగుబాటులని కలిగిస్తుంది.

Content: ఈ కోరికలు అత్యాశలు గురించి పరమహంస నిత్యానంద చాలా అద్భుతంగా వివరించుతారు. ఆయన చెప్పే ప్రతి మాట ఒక సత్యం. అది చురుక్కుమనే అగ్నిరవ్వలా మనని తాకి, మనలో పేరుకుపోయిన మనవి కాని వాటిని దహించివేస్తుంది.

Content: మనిషిలో ఉంటే కోరికల లక్షణాలని స్వామీజీ ఇలా చెబుతారు. మీలో ఉంటే కోరికలకి అంతు ఉండదు. మహాపీర ఈ విషయం గురించి బక చక్కని మాట చెబుతారు. “మనం జన్మించినప్పుడు మనకి ఏవి అవసరమో

Page 10

Content: వాటిని మనతోపాటు ఈ భూమి మీదకి భగవంతుడు పంపించుతాడు." కాబట్టి మన అవసరాల గురించి అసలు చింతించనవసరం లేదు. ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికీ వున్న అవసరాలు చాలా సులభంగా తీర్చవచ్చు, కానీ ఈ ప్రపంచమంతా కలసి కూడా ఒక్క వ్యక్తి కోరికలన మాత్రం పూర్తిగా తీర్చలేదు.

Content: ఇలా ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నించుకుంటే, మనం నిరంతరం ఒక కొత్త కోరిక వెంట వెళుతుంటాయి. ఒక కోరిక తీరగానే మరొక కోరిక వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఆ కోరిక తీరే వరకూ దాని తాలూకా వస్తువు మనకి అత్యవసరం అనిపిస్తుంది. అది లేకపోతే, జీవితం సాఫీగా సాగదు అనిపిస్తుంది. అది కొనగానే దాని విలువ పూర్తిగా తగ్గిపోతుంది.

Content: ఈ సందర్భంలో భగవాన్ రమణ మహర్షి మాటలని పరమహంస నిత్యానంద ఈ విధంగా చెబుతారు. "కోరిక ఉన్నప్పుడు అది ఆవగింజంత అయినా మనకి పర్వతంలా కనిపిస్తుంది. ఆ కోరిక తీరాక పర్వతమంత గొప్పవస్తువయినా మనకి ఆవగింజలా తోస్తుంది" అని.

Content: ఇలా ఎందుకు జరుగుతుందంటే మనం ప్రతి దానినీ యధాలాపంగా తీసుకుంటాము. పొందిన దానికి కృతజ్ఞత చూపం. అసలు మనం జీవితంలో పొందిన వరాలకి, బహుమతులకి ఏ నాడైనా భగవంతునికి కృతజ్ఞతలు చెప్పామా. మీరు అందమయిన ప్రకృతిని చూస్తేనే కళ్ళు ఇచ్చిన దేవుడికి ఏనాడయినా కృతజ్ఞతలు చెప్పారా? మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే అక్కడికి తీసుకువెళ్ళగలిగే కాళ్ళు ఇచ్చినందుకు, మీకు ఇంత అందమయిన లోకాన్ని ఇచ్చినందుకు, మీరు చేసే భోజనం ఇచ్చినందుకు, ఇలా చెబుతూ వెళితే కొన్ని వేల విషయాలు ఉంటాయి. వీటిని పొందినందుకు ఏ రోజూ భగవంతునికి కృతజ్ఞత చెప్పం సరికాదు, ఆ తరువాత ఏమిటి, ఆ తరువాత ఏమిటి? అని అడగటంతో సరిపోతుంది.

Content: మరొక సమస్య అత్యాశ. భవిష్యత్తులో ఏదో సంపాదించాలి అనే అత్యంత ఆందోళన. దానితో ఈ క్షణాన్ని ఆనందంగా గడపటం మరిచిపోతున్నారు. అందుకే ఎంత సంపాదించినా చివరికి శూన్యమే మిగులుతుంది. గుర్తుంచుకోండి ఏదో సంపాదించాలి, అప్పుడు సంతోషంగా ఉంటాను. అది సంపాదించాలి, అలా సంపాదించాలి అని సంతోషంగా ఉంటాను. ఇవన్నీ భ్రమలే. అందుకే ఇంత పెద్ద ప్రపంచంలో ఎవరూ నిత్యం ఆనందంలో ఉండటం లేదు. స్పష్టంగా అర్థం చేసుకోండి. ఎవరయితే ఈ క్షణంలో పూర్తి వర్తమానంలో ఉంటారో వాళ్ళు నిజమయిన సంతోషంలో ఉంటారు. ఆ ఆనందం కావాలి అంటే ఈ క్షణాన్ని ఆనందంగా, ఒక ఉత్సవంలా గడపండి.

Content: ఒక యోగి ఒక వ్యక్తి - నారదముని కథ

Content: మనిషికి అత్యాశ నిరాశనే కలిగిస్తుంది. కేవలం భవిష్యత్ కోరిక మీద మక్కువ పెంచుకుంటే వేధనే మిగులుతుంది. ఈ క్షణాన్ని ఆనందంగా గడుపుతూ భవిష్యత్ మీద, భగవంతుని మీద సమ్మకం తప్పు కోరిక లేకుండా ఉండగలిగే వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో, వారి జీవితాన్ని ఎంత ఉత్సవంగా గడుపుతారో పరమహంస నిత్యానందస్వామి ఒక అందమయిన కధని చెబుతారు.

Content: నారద మహర్షి గొప్ప భక్తుడు. నిత్యం భగవన్నామ స్మరణలోనే కనిపిస్తాడు. ఆయన పేరు వినగానే మనకి గుర్తు వచ్చేది కూడా భగవన్నామ స్మరణ మాత్రమే. ఆయన త్రిలోక సంచారి. ఎక్కడికయినా, ఎప్పుడయినా వెళ్ళగల

Page 11

Content: చనువు, శక్తి ఉన్న గొప్ప యోగీశ్వరుడు. ఒకసారి నారదమహర్షి త్రిలోక సంచారం చేస్తూ భూలోకం నుంచి వైకుంఠానికి విష్ణుమూర్తి దర్శనం కోసం వెళుతుంటాడు. అలా వెళుతూ దారిలో కనపడినవారిని పలకరిస్తూ, వారి యోగ క్షేమాలు తెలుసుకుంటూ ముందుకు వెళుతుంటాడు.

Content: అలా వెళ్ళే సమయంలో ఒక అడవిలో చెట్టు క్రింద నారదముని ఒక యోగిని చూస్తాడు. ఆయోగి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అతను నారదమహర్షిని చూసి నమస్కరించి “నారద మునీంద్ర తమరి ప్రయాణం ఎంత వరకూ” అని ఎంతో వినయంగా, భక్తిగా అడుగుతాడు.

Content: అప్పుడు నారదుడు తాను వైకుంఠానికి వెళ్ళి తిరిగి భూలోకానికి త్వరలోనే వస్తానని చెబుతాడు. అది విన్న యోగి ఎంతో ఆనందపడి నారదునితో ఇలా అంటాడు “నారద మహర్షి! దయచేసి నా తరపున శ్రీ మన్నారాయణునికి ఒక మాట విన్నవించండి. నేను చాలా కాలంగా తపస్సు చేస్తున్నాను. నేను ఇంకా ఎంత కాలం తపస్సు చేయాలి. నాకు జ్ఞానోదయం ఎప్పుడు అవుతుంది. నాపై కరుణ చూపి ఈ విషయాన్ని కనుక్కొని రండి” అని అంటాడు.

Content: దానికి నారదుడు “స్వామీ! తప్పకుండా మీరు అడగమన్నటే అడుగుతాను” అని ఆ యోగికి మాట ఇస్తాడు. అలా కొంచం దూరం వెళ్ళాక అక్కడ అందమైన పద్మాలు ఉన్న సరస్సు దగ్గర ఒక మర్రి చెట్టు కనిపిస్తుంది. అక్కడ ఒక భక్తుడు భగవంతుని కీర్తిస్తూ ఆనందపారవశ్యంతో నాట్యం చేస్తూ ఉంటాడు. ఆ భక్తుని పాటలోని లాలిత్యం, అతని పారవశ్యంలోని భక్తి నారదమునిని అటువైపు వెళ్ళేలా చేస్తాయి. నారదమునిని చూసి భక్తుడు తన పాటని ఆపి, నారదునికి నమస్కరించి ఆతిథ్యం చేస్తాడు.

Content: మాటల మధ్యలో నారదుడు తాను వైకుంఠానికి వెళ్ళి తిరిగి కొద్దికాలం తరువాత వస్తానని చెబుతాడు. ఆ మాట విన్న భక్తుడు అమితానంద భరితుడవుతాడు. ఆయన భక్తితో చేతులు జోడించి “మహోరుపి! దయచేసి భగవానుని ఒక్కమాట అడగండి. ఆయన దర్శనం నాకు ఎప్పుడపుడుతో, ఆయన నన్ను ఎప్పుడు కరుణిస్తారో అడగండి. ఆయన కరుణ కోసం నేను ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలో అడగండి. నన్ను కరుణించమని చెప్పండి” అని ప్రాధేయపూర్వకంగా అడుగుతాడు.

Content: అప్పుడు నారదుడు “తపస్సనరిగా అడుగుతాను. నీ విషయం మరిచిపోను. నీవు బాధపడవద్దు” అని ఆ భక్తునికి మాట ఇచ్చి వైకుంఠానికి వెళతాడు. మరికొంతకాలానికి నారదుడు జవాబులతో భూలోకానికి వస్తాడు. ముందుగా యోగి దగ్గరికి వెళతాడు నారదుడు. ఆయనను చూసి యోగి ఎంతో ఆత్రుతతో ఎదురు వెళ్ళి, “మహోరుపి! భగవంతుని కలిసి నా విషయం అడిగారా? ఆయన ఏమని జవాబు ఇచ్చారు” అని అడుగుతాడు.

Content: “యోగీశ్వరా! మీ సంగతి అడిగాను, భగవంతుడు ఈ విధంగా జవాబు చెప్పారు. మీరు మరొక నాలుగు జన్మలు ఎదురు చూడాలంట. అప్పుడు మీకు జ్ఞానోదయమవుతుంది అని చెప్పారు” అని నారదముని జవాబు ఇస్తాడు. ఆ జవాబు వినగానే యోగి కుంగిపోతాడు. అమ్మో! ఇంకా నాలుగు జన్మలు ఎదురు చూడాలా? నేను ఏం చేయాలి. అయో! నాకు ఎంత నిరీక్షణని విధించాడా భగవంతుడు” అని బాధతో కుప్పకూలిపోతాడు. ఆ యోగి భగవంతుని మాటలు గుర్తుతెచ్చుకుని మరీ బాధ పడిపోతుంటాడు. అతనిని అలా పదిలి నారదుడు ముందుకు వెళతాడు.

Page 12

Content: అక్కడ మత్రి చెట్టుకింద భక్తుడు ఎప్పటిలాగానే ఆనందపారవశ్యంలో భగవంతుని కీర్తిస్తూ పాటలు పాడుతుంటాడు. నారదుణ్ణి చూసి, ఆనందంగా ఎదురు వచ్చి “మహారఉపి! భగవంతుని దర్శించుకున్నారా? నా విషయం అడిగారా? ఆయన ఏమని జవాబు ఇచ్చారు” అని అడుగుతాడు. నారదుడు అతనితో భగవంతుణ్ణి నీ విషయం అడిగాను. ఆయన నీ విషయం ఈవిధంగా చెప్పాడు, నీవు ఆయన దర్శనం కోసం చాలా జన్మలు చూడాలట. అవి ఎన్ని జన్మలంటే ఈ చెట్టు మీద ఆకులు ఎన్ని ఉన్నాయో అన్ని జన్మలు ఎదురుచూడాలి. అప్పుడే నీకు జ్ఞానోదయం అవుతుందని, నీ మీద ఆయన కరుణ కురుస్తుందని చెప్పారు’ అని అంటాడు.

Content: నారదముని చెప్పిన జవాబు విని, ఆ భక్తుడు ఎంతో ఆనందపడిపోతాడు. నారదునితో ‘ఓ అలా చెప్పారా! చాలా సంతోషం. ఆ దేవదేవుడు హామీ ఇచ్చారు. అది చాలు. నేను ఎన్ని జన్మలయినా ఎదురు చూస్తాను” అని ఆనందపారవశ్యంలో నాట్యం చేయటం ప్రారంభించాడు. ఆ భక్తుడు చివరి మాటను ముగించగానే పెద్ద వెలుగు వస్తుంది. అక్కడ భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఆ వ్యక్తికి జ్ఞానోదయమవుతుంది. భగవంతుని దర్శనం అవుతుంది.

Content: అక్కడ యోగి మాత్రం తన మనస్సు ఆడే ఆటలలో చిక్కుకుపోయి, తన కోరిక, ఆశల చిక్కులలో ఇరుక్కుపోయి విలవిలలాడుతున్నాడు. అతని కోరిక లౌకికమయినది కాకపోవచ్చు, అది ఆధ్యాత్మిక కోరికే కావచ్చు, జ్ఞానోదయం పొందాలి అనే ఆశే కావచ్చు, కానీ అది కూడా కోరికే కదా! ఇకపడ భక్తుడు ఇకోరికే కాదు, కానీ అతను దానిని పట్టుకొని వేళ్ళాడటం లేదు. హాయిగా ఆ కణంలో వర్తమానంలో ఆనందంగా ఉండగలిగాడు. అతను ఎదురుచూడటానికి అసలు బాధపడలేదు. ఇప్పుడే జ్ఞానోదయం కావాలి, భగవంతుని దర్శనం కావాలి అనే అత్యాశ లేదు. అందుకే అతను ఆనందపారవశ్యంలో ఉండగలిగాడు. భగవంతుడు ఇచ్చిన హామీ చాలు. అన్నింటికీ అతీతంగా ఉన్న అతని విశ్వాసం అతను అనుకున్నది సాధించేలా చేసింది.

Content: స్వార్థం లేని, శ్రద్ధని ఆశించని ప్రేమ :

Content: ప్రేమ అనేది ఒక శక్తిపంతమయిన అద్భుతమయిన భావన. మానవ సంబంధాలని పటిష్టం చేయటంలో ప్రేమ చాలా చక్కని పాత్ర పోషిస్తుంది. సంబంధ బాంధవ్యాలు నిలిపే కీలక అంశం ప్రేమ. ప్రేమ అనేది లేకపోతే అసలు ఇంత అందమయిన భూలోకమే ఉండదు. ఎందుకంటే తన బిడ్డలయిన మానవుల కోసం భగవంతుడు ఒక అద్భుతమయిన కళాకారునిగా అవతరించి ఈ భూమిని ఒక గొప్ప కళాఖండంలా తీర్చిదిద్దాడు. దీనిని తన వారికోసం ఎంతో సౌకర్యవంతంగా చేసాడు. ఇదంతా ఆయనకి మన మీద వున్న అపారమయిన, హృదయ నిబంధనలు లేని ప్రేమ వలన మాత్రమే జరిగింది.

Content: అయితే నేటి మన ప్రపంచంలో ప్రేమ తన అసలు రూపాన్ని రుచిని, లక్షణాన్ని కోల్పోయి అల్పస్థితిలోనికి జారిపోయింది. ఈ ప్రేమ తల్లిదండ్రులు-పిల్లల మధ్య అయినా కావచ్చు, ప్రేమికులు, భార్యాభర్తలు, స్నేహితులు, అన్నతమ్ములు, అక్కచెల్లెళ్ళు ఎవరి మధ్య ఉన్న ప్రేమ అయినా అది ఎక్కడో అల్పస్థాయిలోనే ఉన్నది. పరమహంస శ్రీ

Page 13

Content: నిత్యానంద స్వామి చెప్పే ప్రేమ దివ్య ప్రేమ, దైవ ప్రేమ. అది అత్యున్నత స్థాయిలో ఉండే ప్రేమ. అద్భుతమయిన దైవ ప్రేమ గురించి, అలాగే మన మధ్యన ఉండే మూమూలు ప్రేమ గురించి నిత్యానంద స్వామి ఈ విధంగా చెబుతారు. అందరూ అనుకునే ప్రేమ ఒక ఇచ్చిపుచ్చుకనే వ్యవహారం. ఇవ్వటం ఆగిపోతేనే, ప్రేమ ఆగిపోతుంది. అదే విధంగా ఈ ప్రేమలో ఎదుటివారి నుంచి ఏదో ఆశించటం వుంటుంది. ఈ విషయంలో తల్లి ప్రేమ కూడా ఎంతో కొంత ఆశించటంలోనే ఉంటుంది. కాకపోతే అది నిస్వార్ధ ప్రేమ అవ్వవచ్చు కాని ఆశలు లేని ప్రేమ మాత్రం కాదు.

Content: మీరు ప్రేమ పంచటానికి కూడా ఎదుటివారికి అర్హత ఉన్నదా లేదా అని ఆలోచించి అప్పుడు ప్రేమిస్తారు. అంతేకాదు ఎవరికి ఎంత ప్రేమ ఇవ్వాలో కొలచి అంతే ప్రేమని ఇస్తారు. ఇన్ని నిబంధనలు, హద్దులు కలిగి ఉన్న ఆ ప్రేమ నిజానికి ప్రేమ కాదు. అది ఎదుటివారి శ్రద్ధని ఆశించటమే. అందుకే ఆ ప్రేమని ప్రేమలో పడటం అంటారు. ఆ ప్రేమలో పడితే ఇక లేచే ప్రసక్తి ఉండదు. అందుకే మీకు తెలిసిన ప్రేమ, వ్యధలు సమస్యలతో ముగుస్తుంది. కష్టాలు, కన్నీళ్ళని ఇస్తుంది.

Content: ఎందుకు అంటే అది నిబంధనలు లేని ప్రేమ కాదు కాబట్టి. దానిలో ఉండేది కేవలం ఏదో ఆశించటమే కాబట్టి. ఇది పూర్తిగా కారణాల మీద ఆధారపడిన ప్రేమ. ఉదా : పిల్లలు తాము అనుకున్నట్లుగా ఉన్నంతవరకే తల్లిదండ్రుల ప్రేమ. పెద్ద వారిని ఎదిరించి పెద్ద నిర్ణయాలు చేయగానే ఆ ప్రేమ మాయం అవుతుంది. పిల్లల ప్రేమ కూడా అంటే.

Content: అదే విధంగా ప్రతి మూర్తిని సంబంధంలోకూ ఎదుటివారి శ్రద్ధ ఆశించటం చాలా ఎక్కువగా ఉంటుంది. భార్య నిరంతరం భర్త తనని పట్టించుకోవాలని అలాగే భార్య కేవలం ఆమె సమయాన్ని తనకే కేటాయించాలని భర్త ఆశిస్తారు. అదే విధంగా ప్రతి వ్యక్తీ ఎదుటివారి శ్రద్ధని ఆశిస్తారు. ఎదుటివారి శ్రద్ధ తమ మీద తగ్గగానే మానసికంగా కుంగిపోతారు.

Content: కానీ గురువుల ప్రేమ స్వచ్ఛమయిన, ఉన్నతమయిన ప్రేమ. జ్ఞానోదయమయిన గురువులలో ప్రేమ పొంగి ప్రవహిస్తుంటుంది. వారి ముందు ఎవరు ఉన్నారు వారికి అర్హత ఉన్నదా లేదా అని ఆలోచించదు. ఆ ప్రేమ వెల్లువలో వారిని నింపటమే తెలుసు. అదే దైవ ప్రేమ. అందుకే జ్ఞానోదయమయిన గురువుల సమక్షంలో మనం అంత ఆనందంగా ఉండగలం.

Content: మనకి ఉండే చాలా సమస్యలకి, ముఖ్యంగా కుటుంబ సమస్యలు, సామాజిక సమస్యలు, మానవ సంబంధాలకి సంబంధించిన సమస్యలకి అసలు కారణం మనకి నిరంతరం ఎదుటివారు మనపై శ్రద్ధ చూపాలి అని ఆశించటమే. ఇది ఎక్కువ అయినప్పుడు, అనారోగ్యాలు కూడా తెచ్చుకుంటారు. ఎందుకంటే అనారోగ్యంగా ఉన్నప్పుడూ అందరూ మన మీద శ్రద్ధ చూపిస్తారు. కాబట్టి మనుషులలో ఉండే మానసిక కుంగుబాటుకి కూడా అదే కారణం.

Content: అందరూ నన్ను, నేను చేసిన పనిని చూసి, ప్రశంసించాలి. అప్పుడే నాకు ఉత్సాహంగా ఉండి మరింత ఎక్కువ పని చేయగలను అని అనకోపటం చాలా సామాన్యం. అలా ఎవరైనా ఒక్కరు మెచ్చుకోకపోయినా ఆ వ్యక్తి మానసికంగా కుంగిపోతారు.

Content: ఒక్క నిముషం ఆలోచించండి, ఎదుటివారు మెచ్చుకుంటే మీరు పొందే సంతోషం కోసం ఎందుకు మీరు

Page 14

Content: అంత తాపత్రయపడతారు. మీ అంతరంగంలో ఉండే మీ నిజమయిన ఆనందాన్ని పొందినప్పుడు మీరు ఎవరి ప్రేమకోసం, ఎవరి శ్రద్ధ కోసం ఆత్రుతపడరు. ఎవరి నుంచి దేనినీ ఆశించరు.

Content: ఏమీ ఆశించని, నిస్వార్థమయిన ప్రేమ గురించి, ఎడతెరిపి లేని శ్రద్ధని ఆశించకుండా ఎంతో తృప్తిగా ఆనందంగా ఉండగలం అని నిరూపించే ఒక అద్భుతమయిన కథని పరమహంస నిత్యానంద చెబుతారు. అదే భామతి కథ.

Content: భామతి

Content: భారతీయ వేదాంత సంప్రదాయంలో అత్యంత విలువైనది, అత్యంత క్షిష్ణమయినది బ్రహ్మసూత్రాలు. కొన్ని వేల సంవత్సరాల కిందట పూర్వం మహోర్షి, మహో జ్ఞాని వేదవ్యాసుడు తన తపః ఫలితంగా అందిన అద్భుతమయిన జ్ఞాన సంపదని ఒక చక్కని గ్రంథంగా వ్రాసి మానవజాతి పురోభివృద్ధికి అందించారు. అదే బ్రహ్మసూత్రాలు అనే ఒక గొప్ప వేదాంత గ్రంథం.

Content: బ్రహ్మసూత్రాలు అనే ఈ గ్రంథాన్ని ప్రపంచంలోని వేదాంతాలన్నింటిలోని సారంశంగా చెప్పవచ్చు. ఎందుకంటే అత్యంత ప్రాచీనమయిన బ్రహ్మసూత్రాల నుంచి ప్రపంచంలోని వేదాంతాలన్నీ ఉద్భవించాయి. అందుకే దీనిని గ్రంథాలకు గ్రంథమని, గ్రంథరాజమని చెబుతారు. బ్రహ్మసూత్రాలు అత్యంత ఉన్నతమయిన ప్రమాణాలు కలిగి, అన్ని కాలాలలోను అత్యుత్తమ గ్రంథంగా విరాజిల్లింది. బ్రహ్మసూత్రాలని యధాతథంగా అర్థం చేసుకోవటం కష్టం.

Content: అందుకే జ్ఞానోదయమయిన రుషులు దీనికి వ్యాఖ్యానాలు వ్రాసారు.

Content: 8వ శతాబ్దంలో భారతదేశంలో జ్ఞానోదయమయిన ఒక గురువుగారి దగ్గర చాలామంది శిష్యులు ఉండేవారు. వారిలో వాచస్పతి మి[శ్రా చాలా తెలివైన చురుకైన విద్యార్థి. ఆ గురువు గారి ఒక రోజు వాచస్పతి మి[శ్రాని పిలిచి బ్రహ్మసూత్రాలకి వ్యాఖ్యానం వ్రాయమని చెబుతారు. అది గురువుగారు తనకి ఇచ్చిన ఒక పరమలా భావించి వినయంతో ఆ బాధ్యతని తీసుకుంటాడు, వాచస్పతి మి[శ్రా.

Content: ఆ గ్రంథం బాధ్యతతో పాటు ఆయన తన కుమార్తె భామతిని ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ తరువాత గురుదేవులు స్వర్గస్తులవుతారు. వాచస్పతి మి[శ్రా గ్రంథ రచనలో ఉండగా అతని మంచిచెడ్డలు చూస్తూ అతను గ్రంథాన్ని విజయవంతంగా పూర్తి చేసే బాధ్యతని భామతి తీసుకుంటుంది.

Content: వాచస్పతి మి[శ్రా బ్రహ్మసూత్రాలు అనే మహో గ్రంథానికి వ్యాఖ్యానం వ్రాయటం ప్రారంభించుతాడు. గ్రంథ రచనని ఆయన ఒక తీ[ప్రమయిన తపస్సులా, ఒక లోతయిన ధ్యానంలో చేస్తుంటాడు. ఆ గ్రంథ రచనలో నిమగ్నమయిపోయి ప్రపంచాన్ని మర్చిపోతాడు. ఆ విధంగా ఆయన ఆ గ్రంథాన్ని వ్రాస్తూ చాలా సంవత్సరాలు దానిలోనే నిమగ్నమయిపోయి ఉంటాడు. ఆ గ్రంథ రచనలో ఉండగా ఆయన మరి దేనినీ గమనించేవాడు కాదు. దేని గురించీ ఆలోచించేవాడు కాదు. ఆ విధంగా ఆయన బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయి, గ్రంథ రచనలో నిమగ్నమయిపోతాడు.

Content: చివరికి ఆ గ్రంథ రచన పూర్తవుతుంది. ఇక ఆ పుస్తకానికి పేరు పెట్టటం మాత్రమే మిగిలి ఉంటుంది. అప్పుడు వాచస్పతి మి[శ్రా బయట ప్రపంచం వైపు చూస్తాడు. గ్రంథంలోంచి బయటకి వచ్చి చూస్తాడు. అది సాయంత్రసమయం, క్రమంగా చీకటి మొదలవుతుంది. ఆ సమయంలో అక్కడికి ఒక వృద్ధురాలు వచ్చి దీపం వెలిగిస్తూ ఉంటుంది. ఆమెని చూసి వాచస్పతి మి[శ్రా “మీరు ఎవరు?” అని అడుగుతాడు.

Page 15

Content: ఆ ప్రశ్నకి ఆమె "పరవాలేదు మీ పనిని పూర్తి చేయండి" అని అంటుంది. అప్పుడు ఆయన "ఈ గ్రంధం వ్రాయటం పూర్తి అయినది. మీరు ఎవరో చెప్పండి" అని అడుగుతాడు. ఆమె వాచస్పతి మిశ్రా వైపు చూసి "నేను మీ భార్యని" అని జవాబు ఇస్తుంది. వాచస్పతి మిశ్రా విభ్రాంతిగా ఆమె వైపు చూస్తాడు. అప్పుడు జరిగిన సంఘటనకి ఆశ్చర్యపోతాడు. అంటే ఆయన ఆ గ్రంధాన్ని రాస్తున్న ఇన్ని సంవత్సరాలు భార్య గురించి ఆలోచించలేదు. ఆ విషయాన్ని ఆయన నమ్మలేకపోయాడు. ఎంతో ఆర్ధత నిండిన గొంతుతో ఆయన ఇలా అంటాడు "నీవు ఎందుకు ఈ విషయం నాకు గుర్తుచేయలేదు?"

Content: ఆ ప్రశ్నకి ఆమె "ఎందుకు? మీరు గ్రంధ రచనలో పూర్తిగా నిమగ్నమైపోయారు. మిమ్ములని మీ నిష్ఠలతని భంగం చేయవలసిన అవసరం నాకు ఎప్పుడూ అనిపించలేదు" అని నెమ్మదిగా, ప్రశాంతంగా జవాబు చెబుతుంది. అప్పుడు వాచస్పతి మిశ్రా ఇలా అంటాడు "మానవులకి ఎంతో ఉపయోగపడే ఈ గ్రంధం కోసం నీ జీవితాన్ని త్యాగం చేసావు. ఆ త్యాగానికి ప్రతిఫలంగా నీకు నేను ఏమి ఇవ్వగలను". అప్పుడు భామతి "మీకు సేవ చేయటంలో నేను చాలా ఆనందపడ్డాను. మీరు ఈ అద్భుతమయిన గ్రంధాన్ని వ్రాసే సమయంలో మీకు సేవ చేయగలగటమే నేను గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతకుమించి నాకు ఏ అవసరం లేదు" అని చాలా స్పష్టంగా, ధృడంగా జవాబు చెబుతుంది.

Content: భామతి జవాబు విన్న వాచస్పతి మిశ్రాకి ఆనందంతో కళ్ళలో నీళ్ళు వచ్చింది. ఆయన తన భార్యకి ఒక ముద్ది భామతి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. ఆయన జీవితాంతం శ్రమపడి ఒక తత్వశాస్త్ర గ్రంధము వ్రాస్తాడు. ఆ అద్భుత గ్రంధానికి తన భార్య 'భామతి' పేరు పెడతాడు.

Content: ఈ రోజున మానవత్వం మీద ఉన్న ఒక అపురూపమయిన అద్భుతమయిన గ్రంధం, ఆమె పేరు మీద ఉంది. అదే భామతి. వేదాంతంలో ప్రవేశమున్నవారు, వేదాంతం పై పరిశోధనలు చేసేవారు, వేదాంతాన్ని తెలుసుకోగోరిన వారు, వేదాంత ప్రియులు తప్పని సరిగా చదివే గ్రంధం భామతి. రెండు వేల సంవత్సరాలుగా భామతి గ్రంధాన్ని కొన్ని కోట్లమంది చదివి ఉంటారు.

Content: ఈ విధంగా భామతి ఈ ప్రపంచంలో శాశ్వతమయినది. ఆమెలోని నిస్వార్థ ప్రేమ, భక్తి, సేవాతత్పరత, త్యాగం ఆమెని ప్రపంచంలో శాశ్వతం చేసాయి. అసలు ఈ కథలోని ఒక అద్భుతమయిన విషయం ఉంది. అది ఏమిటి అంటే, అన్ని సంవత్సరాలు భామతి తన భర్తకి, ఆయన నిష్ఠలతని ఆయన గ్రంధ రచనని ఏమాత్రం భంగం పరచలేదు. ఆమె ఆలా చేయటం ఇష్టం లేక కాదు, తప్పదు కాబట్టి కాదు. ఆమె ఏమని చెబుతుంది? ఆ అవసరం తనకి కలగలేదని చెబుతుంది. అది పరిస్థితులకి సర్దుకొనిపోవటం కాదు. నాకు ఆ అవసరం లేదు అనటం, సర్దుకొనిపోవటం ఈ రెండింటికీ చాలా తేడా ఉంది.

Content: మనకి చాలా సారులు ఎడుతెరివారి శ్రద్ధ మా మీద ఉండాలి అని వారు మనని గుర్తించాలి, మన మీద ప్రేమ చూపాలి అని అనుకుంటాము, కానీ ఎందుకూలే వారిని విసిగించవద్దులే అని సర్దుకొపోతాము. కానీ ఇక్కడ మన కథలోని భామతికి అసలు ఆ అవసరం లేదు. అదే తేడా ఆమె తన యవ్వనం వృథా అయిపోయింది అని అనుకోలేదు. ఆమె తన సహజత్వంతో, తనదైన సహజ వ్యక్తిత్వంతోనే ఉంది. అంటే, అది అలా అని పరిస్థితులకి సర్దుకొనిపోలేదు.

Page 16

Content: ఆమెకి చాలు. తన భర్త ఏకాగ్రతని పాడు చేయవలసిన అవసరం ఆమెకి రాలేదు. ఆమెకి అంతరంగంలోని శక్తి చాలు. ఆమె తన ఏకాగ్రతని తనపైన కేంద్రీకరించి తనలోని ఆనందాన్ని కనుగొనగలిగింది. ఆ పరమానందం ఆమెకి నిజమయిన, శాశ్వతమయిన తృప్తిని ఇచ్చింది. ఆ ఆనందం యొక్క అనుభవమయిన వ్యక్తి ఆనందం కోసం, బయట ప్రపంచంలో ఎవరిమైనా ఆధారపడరు. వారికి ఎవరి శ్రద్ధ అవసరం లేదు. వారికి వారు చాలు. అలా అని వారు బయట ప్రపంచాన్ని వదలనివసరం లేదు. వారి బాధ్యతలని వారు చక్కగా నిర్వహించుతారు. అలాగే బయట ప్రపంచంలోని విషయాలు వారిపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు.

Content: అందుకే భామతి మరణించాక కూడా జీవిస్తూ ఉంది. వందల సంవత్సరాల తరువాత కూడా ఆమె మన మనస్సులలో ఉన్నత స్థానాన్ని పొంది మహోన్నత వ్యక్తిగా ఉండి పోయింది.

Content: కానీ మనం, మన ప్రవర్తనని గురుతు తెచ్చుకుంటే, ఎంతగా ఎడుతీవారి శ్రద్ధ, ప్రేమ కోసం తపించిపోతున్నామో అర్ధమవుతుంది. (ప్రేమని బిక్షగా అడగటం ఎంత తక్కువవస్థయో అర్ధం చేసుకోండి. ఎవరూ కూడా ఆనందం కోసం, నిజమయిన సంతోషం కోసం ఎవరిమైనా ఆధారపడనవసరం లేదు అని ఈ కథ మనకి చెబుతుంది. ఎడుతి వారి శ్రద్ధ మనకి ఆసలు అవసరం లేదు. ఎడుతి వారి గుర్తింపు లేకుండానే మనం సంతోషంగా తృప్తిగా ఉండగలం అదే మనని శాశ్వతమయిన నిత్యానందం వైపుకు తీసుకెళ్ళగలుగుతుంది.

Content: మరణ భయం అన్ని భయాలకి మూల కారణం :

Content: భయం అంటే ఏమిటి? భయం అంటే మనం దేనినైనా పోగొట్టుకుంటామేమో అని అభద్రతా భావంలో ఉండటమే. ఏమి పోతుంది? ఆస్తి, ఆరోగ్యం, ప్రేమ, దగ్గరివారిని పోగొట్టుకోవటం ఇలా ఏదయినా సరే, అది మనసుంచి దూరం అవుతుంది అనే అభద్రతా భావమే భయాన్ని సృష్టిస్తుంది.

Content: పరమహంస శ్రీ నిత్యానంద మనికి తెలియని ఒక విషయాన్ని చెప్పినప్పుడు మనం ఆశ్చర్యపోతాం. అది మన అన్ని రకాల భయాలకి అసలు కారణం మరణభయమే. మన భయాలన్నీ ఎందుకు అని లోతుగా విశ్లేషించితే అది చివరకి మరణ భయం దగ్గరికే వెళుతుంది. అంతేకాదు స్వామి మరొక విషయం కూడా చెబుతారు. మరణం మన జీవితం యొక్క శ్రేష్ఠతని, నాణ్యతని మార్చివేస్తుంది. మరణం జీవితంలో ప్రతి క్షణంలో ఉంటుంది. ఇది మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. ఎందుకంటే మరణం అనే ఒక్క అంశం మొత్తం జీవితాన్ని నియంత్రిస్తుంది.

Content: పరమహంస మరణం గురించి ఈవిధంగా చెబుతారు. మనం మరణం గురించి పూర్తిగా అర్ధం చేసుకుంటే, అందులో రహస్యాలని లోతుగా తెలుసుకోగలిగితే, మనం జీవిత రహస్యాలని బాగా అర్ధం చేసుకోగలుగుతాము.మరణం అంటే కేవలం మరొక రూపంలోనికి వెళ్ళటమే అని తెలుసుకోగలిగినప్పుడు మనకి మరణ భయం ఉండదు.

Content: భయం అనేది కేవలం ఒక భావన మాత్రమే. ఈ భావన మనలో బలంగా నాటుకుపోవటానికి అసలు కారణం మరణం అంటే మనకి ఉండే భయం. దాని తరువాతది మన అహంకారాన్ని తృప్తిపరచటం. ఉదాహరణకి

Page 17

Content: పరువుపోతుందేమో, నాకు ఉన్న కీర్తి పేరు పోతాయేమో ఇటువంటి భయాలు లేకా పిల్లలు ఎదిరించి తమ అధికారాన్ని లెక్కచేయరేమో అనే భయం అహంకారానికి దెబ్బ తగులుతుందనే భయం, ఇవన్నీ భావాలే కొందరికి చీకటంటే భయం, నీళ్ళు అంటే భయం. అగాధాలు అంటే భయం. జంతువులంటే భయం. ఇవన్నీ కూడా మరణం అంటే మనకి ఉండే భయాలే. అయితే వివరంగా చూస్తే భయాలన్నీ కూడా మనం పోగొట్టుకోవటానికి అక్కడ ఏమీ లేదు అనే విషయం స్పష్టంగా మనకి తెలియక పోవటమే. ఉదాహరణకి ఎవరయితే మరణానికి దగ్గరగా వెళతారో, మరణాన్ని దగ్గరగా ఎదుర్కొంటారో వారికి అక్కడ పోగొట్టుకునేది ఏమీ లేదు అని అర్థమవుతుంది. ఎవరయితే మరణ భయాన్ని జయించుతారో వాళ్ళు మరణాన్ని జయించినట్లే. స్వామీజీ ఈ విధంగా చెబుతారు, మరణం అంటే మరొక రూపంలోనికి మారే ఒక ప్రక్రియ. మీరు మరణాన్ని మరణ భయాన్ని అర్థం చేసుకుంటే జీవితాన్ని సంతోషంగా ఎంతో నాణ్యతతో జీవించగలుగుతారు.

Content: మరణం చాలా మంచి గురువు, మరణాన్ని వెతుకుతూ వెళితే అక్కడ మరణం ఉండదు. మన జీవితంలో ఏదీ కచ్చితంగా జరగదు ఒక్క మరణం తప్పా. అయినా మనం ఆ మరణాన్ని తప్పించుకోవటానికి మనశక్తి కొద్దీ, మనకి ఉన్న అన్ని అవకాశాలని ఉపయోగించి ప్రయత్నిస్తాము. అంతే కానీ మరణం ఒక గురువు, మనకి బహుమతులనిచ్చే ఒక గొప్ప దేవత అని గ్రహించచము. మరణం యొక్క గొప్పదనాన్ని స్పష్టంగా, వివరంగా చెప్పే కథ ఒకటి మన ఉపనిషత్తులలో ఉన్నది. స్వామీజీ ఆ కథని తప్పనిసరిగా తన నిత్యానంద స్పురణ కార్యక్రమంలో చెబుతారు. అకధ గురించి ఇప్పుడు తెలుసుకుందాము.

Content: నచికేతుని కథ:

Content: మనకి ఉండే అనేకమయిన గొప్ప ఉపనిషత్తులలో కఠోపనిషత్తు అనేది ఒక అద్భుతమయిన ఉపనిషత్తు. కఠోపనిషత్ అంటే కూడా ఒక చిన్న బాలుడికి యమధర్మరాజుకి మధ్య జరిగే ఒక చక్కని విజ్ఞానపూరితమయిన సంభాషణ. ఈ కథకి నాయకుడు బాలుడు అయిన నచికేతుడు. ఇందులోని మరొక పాత్ర యమధర్మరాజు. ఆయన మరణానికి దేవత మరణ శాసనకర్త.

Content: ఒకప్పుడు వాజశ్రవసుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకి సర్వసంపదలు పొందాలి అని, ఈ ప్రపంచాన్ని పరిపాలించాలి అనే కోరిక కలిగింది. ఆ కోరిక సాధించటానికి ఆయన వాజపేయ యజ్ఞం చేయాలని సంకల్పించుతాడు. సర్వసంపదలకి అధిపతి కావాలి అని అనుకుంటే, ప్రపంచాన్ని నియంత్రించాలి అని అనుకుంటే ఈ యజ్ఞం చేయాలి.

Content: ఈ యజ్ఞం చేయటానికి కొన్ని నియమాలు ఉన్నాయి. యజ్ఞం చేసే వ్యక్తి తనకున్న సంపదలు దానమీయాలి. తనకి అత్యంత ప్రియమయినవి, తనకి అధిక సంబంధం గల వస్తువులని, తన దృష్టిలో అత్యంత విలువయిన సంపదలని ఆ యజ్ఞం చేసే వ్యక్తి దానమీయాలి. అప్పుడే ఆ యజ్ఞం పూర్తి అవుతుంది. దాని ఫలితాన్ని యజ్ఞం చేసే వ్యక్తి పొందగలుగుతాడు.

Content: అయితే ఆ రాజు బుద్ధిజులకి దక్షిణగా కానుకలు ఇవ్వటానికి, దానం చేయటానికి జీవితపు చివరి దశలో ఉన్నవి, ముసలివి అయిపోయి పాలు ఇవ్వలేని ఆవులని, ఎందుకూ పనికి రాని ఆవులని దానం చేస్తాడు. ఆ విధంగా ఏమాత్రం ఉపయోగం లేని వాటిని దానం ఇవ్వసాగాడు.

Page 18

Content: ఆ రాజుకి ఏడుసంపత్సరాల వయస్సు ఉన్న కొడుకు ఉన్నాడు. అతని పేరే నచికేతుడు. అతను తన తండ్రి చేస్తున్న పనిని గమనించసాగాడు. అతను తండ్రిచేసే దానం సరియైనది కాదు అని అర్థం చేసుకున్నాడు. ఆ బాలుడికి తండ్రి చేసే పని తప్పు అని అర్థమయింది. అయితే అతనికి ఎలా చెప్పాలో తెలియలేదు.

Content: ఆ విధంగా మొదటినుంచీ తండ్రిని గమనిస్తూనే ఉన్నాడు నచికేత. చివరికి తండ్రి దగ్గరకి వెళ్ళి “తండ్రీ! మీరు యజ్ఞంలో మీకు ఉన్న విలువైన సంపదని దానం ఇవ్వాలికదా! నేను మీకు ఉన్న విలువైన, మీకు ప్రియమయిన సంపదని కదా! మరి సన్ను ఎవరికి దానంగా ఇస్తున్నారు? ” అని అడుగుతాడు.

Content: రాజుకి కొడుకు మనస్సు అతను తనకి ఏమి చెప్పదలచుకున్నాడో ఆ విషయం అర్థమయింది. నచికేత తను చేసే పనిని గురించి మాట్లాడుతున్నాడు అని అర్థమయింది. కాని అతని అహంకారం రాజుని ఆ పనినుంచి తప్పించలేకపోయింది. అతను నచికేత మాటలను లెక్కవేయకుండా తనపనిని తాను చేసుకుపోతూంటాడు.

Content: నచికేత తండ్రిని మరలా అదే ప్రశ్న అడుగుతాడు, నన్ను ఎవరికి దానం ఇస్తారు అని అంటాడు. రాజు జవాబు చెప్పడు.అప్పుడు నచికేత అదే ప్రశ్నని పదే పదే అడుగుతాడు.రాజుకి చాలా కోపం వస్తుంది. “నిన్ను యముడికి ఇవ్వాలి అని అనుకుంటున్నాను. యముడి దగ్గరికి వెళ్ళు”, అంటాడు చాలా కోపంగా.

Content: తండ్రి తనని మృత్యువుకి అప్పగిస్తున్నాను అని చెప్పినా అతడు బెదరడు. అతను నిజాయితీ కలవాడు, సత్యతత్పరుడు. అతను తండ్రి మాటకి కట్టుబడి తండ్రిమాటని గౌరవించటానికి యమధర్మరాజుని కలవటానికి వెళతాడు. అతను యమలోకం వెళ్ళిన సమయానికి అక్కడ యమధర్మరాజు ఉండడు. యమధర్మరాజు కోసం ఎదురు చూస్తుంటాడు. ఆ విధంగా మూడురోజులు గడచిపోతాయి.

Content: అయినా నచికేత అక్కడే ఉంటాడు. మూడురోజులు గడిచాక యమధర్మరాజు యమలోకానికి తిరిగి వస్తాడు. అప్పుడు యమధర్మరాజు సేవకులు ఆయనతో ఒక బాలుడు ఆయనకోసం మూడురోజులనుంచి ఎదురు చూస్తున్నాడన్న విషయాన్ని చెబుతారు. వెంటనే యమధర్మరాజు నచికేత దగ్గరికి వెళతాడు. యమధర్మరాజు ఆ బాలుడిని అతను వచ్చేసమయానికి స్వాగతం చెప్పటానికి తాను లేకపోయినందుకు క్షమాపణ కోరతాడు.

Content: ఆయన నచికేతునితో, “నిన్ను నేను మూడురోజులు ఎదురు చూసెట్టు చేసాను. దానికి పరిహారంగా నీకు మూడు వరాలు ఇస్తాను. నీకు ఇష్టమయిన మూడు కోరికలు కోరుకో. ఆకోరికలు తీరుస్తాను అంటాడు. నచికేతకు మరణం వరాలు ఇచ్చే దేవత అయినది. నచికేత యమధర్మరాజుని మూడు వరాలు కోరతూ ఈ విధంగా అంటాడు. “యమధర్మరాజా! ధన్యుడని. నీవు నాపై చూపించే అపారమయిన కృపకి [ప్రేమకి నా నమస్సులు. హే ధర్మదేవతా! నామొదటికోరిక; నాతండ్రి చేసిన పాపాలు పరిహారం చేయండి ” అని అడుగుతాడు.

Content: యమధర్మరాజు తధాస్తు అని వరం ఇచ్చాడు. “హే మృత్యుదేవతా నా రెండవ కోరిక; మిమ్ములని కలసి వెళ్ళాక నాతండ్రి నన్ను స్వీకరించాలి ” అని ప్రార్థించుతాడు. నచికేతుని రెండవ కోరిక కూడా తీరుస్తాడు యమధర్మరాజు.

Content: నచికేతుడు తన మూడవకోరికను ఈ విధంగా అడుగుతాడు.

Page 19

Content: 7మేయం ప్రేతే విచికిత్సా మనుష్యే స్తిత్యేకే నాయస్తీతి చైకే ! ఏతద్ విద్యామయ శిష్టస్వయాహం వరాణామేష వరస్పతీయః ॥ (కఠోపనిషత్ :20)

Content: హే ! యమధర్మరాజా, నా మూడవకోరిక విను. చనిపోయిన వ్యక్తి జన్మిస్తాడు (ఉన్నాడు) అని కొందరు అంటారు. మరికొందరు జన్మించరు, అని అంటారు. ఏది నిజం. ఈ విషయం గురించి తెలుసుకోవాలి అన్నదే నాకోరిక. ఇదే నేను నిన్ను అడిగే మూడవ వరం” అని అంటాడు.

Content: ఏడు సంవత్సరాల పసి బాలుడి ప్రశ్న విని యమధర్మరాజు నిర్ఘాంతపోతాడు. ఆయన నచికేతతో ఈ విధంగా అంటాడు, “నచికేత ! ఇది చాలా సూక్ష్మమయినది, బహు కష్టతరమయిన విషయం. దీనిని నీవు అర్థం చేసుకోలేవు. నీవు మరొక వరం ఏదైనా కోరుకో. ఈ వరం మాత్రం నన్ను అడగవద్దు. సన్ను ఈ మాట అడగకుండా వదిలిపెట్టు”, అని అంటాడు.

Content: యమధర్మరాజు మాటలు విన్న నచికేతుడు వినయంగా ఈ విధంగా జవాబు చెబుతాడు.

Content: “యమధర్మరాజా ! ఇది చాలా సూక్ష్మమయినది, బహుకష్టతరమయిన విషయం అని మీరు చెబుతున్నారు కదా! కాబట్టి ఈ విషయాన్ని నాకు వివరించగల సమర్థులయిన ఆచార్యులు మీరే. ఇంకా ఎవరూ ఈ విషయాన్ని వివరించలేరు. అందుచేత ఈవరాన్ని నాకు ఇవ్వండి. ఈ వరంతో సమానమయిన వరం మరి ఎక్కడాలేదు.'

Content: నచికేతని జవాబు విని యమధర్మరాజు నచికేతని ఒప్పించాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు. నచికేత నీకు సర్వసంపదలు ఇస్తాను, దీనికి సరితూగే మరే వరమయినా కోరుకో. అది ఏ వరమయినా తీరుస్తాను. నీవు గొప్ప సామ్రాజ్యానికి చక్రవర్తి కావాలి అంటే ఆ వరం ఇస్తాను. నీకు కలిగే కోరికలన్నీ తీరుస్తాను కానీ ఈ అప్పుడు నచికేతుడు ఈ విధంగా జవాబు చెబుతాడు.

Content: శ్వోభావామర్త్యస్య యదంతకైతత్ సర్వేంద్రియాణాం జయతి తేజః

Content: అపి సర్వం జీవితమల్పమేవ

Content: తమైవ వాహాస్తవ సృత్యగీతే ॥

Content: “ఓ యమధర్మరాజా, నువ్వు చెప్పేవన్నీ కూడా క్షణికాలే. ఇవన్నీ మానవుని ఇంద్రియశక్తిని క్షయించప చేసేవే. ఎంత పొడిగించినా మానవ జీవితం అల్పమే. అందుచేత అవన్నీ నీ దగ్గరే ఉంచుకో కానీ నేను అడిగిన వరాన్ని ఇవ్వు. మరణాంతరం ఏమి జరుగుతుందో తెలియచేయి, మరణం వెనుక ఉన్న రహస్యాన్ని చెప్పు. అది తప్పా నాకు మరొక వరం పద్దు” అని కచ్చితంగా చెబుతాడు.

Content: యమధర్మరాజు ఆ బాలుడిలోని పరిణత, సత్యాన్ని తెలుసుకోవాలనే పట్టుదల గమనించాడు. ఆయన ఆ బాలుడి పరిణతికి పొందిన మేధస్సునకు సంతోషించి మరణం యొక్క రహస్యాన్ని ఆ అనుభవాన్ని తెలియచేయాలి

Page 20

Content: అని నిర్ణయించుకుని అతనికి ఆ విషయాలన్నీ బోధించుతాడు. యమధర్మరాజు ఇచ్చిన అనుభవపూర్వకమయిన జ్ఞానానికి, ఆ బాలుని ఆత్మపొందిన అనుభవానికి నచికేతుడు ఎంతో వికాసం పొందుతాడు. జ్ఞానోదయం పొందుతాడు. కఠోపనిషత్తులో ఉండే ఈ కథని పరమహంస నిత్యానంద ఎంతో అద్భుతంగా, చక్కని వివరాలతో చెప్పి, ఈ కథలో మనం తెలుసుకోగల గొప్ప సత్యాలని ఈ విధంగా చెబుతారు.

Content: . మరణం ఒక గురువు, అది మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. . మనం మరణాన్ని వెతుకుతూవెళితే అక్కడ మనకి మృత్యువు (మరణం) కనిపించదు. . ఒక వేళ మరణం అక్కడ ఉంటే మనందరం అనుకునేట్టు అది మనని భయపెట్టదు. అది మనని ప్రేమిస్తుంది, మనకి బహుమతులు ఇస్తుంది.

Content: . మరణం మనకి అంతిమ బహుమతిని ఇస్తుంది. అదే జ్ఞానం.

Content: మనిషి దివ్యశక్తి సంపన్నుడు మనిషి భగవంతుని యొక్క అద్భుతమయిన సృష్టి. భగవంతుడు గొప్ప కళాకారుడు. ప్రతీ వ్యక్తిని ప్రత్యేక శ్రద్ధతో రూపొందించి వారిలో తన దివ్యశక్తిని నింపాడు. ఈ ప్రపంచంలోనికి ప్రతి వ్యక్తిని ఒక ఉద్దేశంతో పంపించుతాడు. వారు ఆ లక్ష్యాన్ని సాధించగల నేర్పుని వారిలో నింపుతాడు. వారు ఈ ప్రపంచంలో సాధించవలసిన లక్ష్యాలకి అనుగుణంగా వారి శరీరాన్ని, మేధస్సును తీర్చిదిద్దుతాడు. చివరగా ప్రతి వ్యక్తిలోనూ తన శక్తిని నింపుతాడు. అందుకే మనం భగవంతుని పిల్లలము, మనం ఆయన యొక్క ప్రతిరూపాలం.

Content: భగవంతుడు అంటేనే సర్వశక్తి స్వరూపం. రూపంలేని రూపంలో ఆ శక్తి ప్రపంచమంతా, ఈ విశ్వమంతా వ్యాపించి ఉంటుంది.ఈ విశ్వంలోని గ్రహాలు, నక్షత్రాలు అన్నీ కూడా ఆ శక్తి ఆధారంగానే పనిచేస్తున్నాయి. అంత అద్భుతమయిన శక్తి మనలోపల ఉంది. భగవంతుడు శక్తి మాత్రమే కాదు. ఒక అపూర్వమయిన మేధస్సు. ఆశక్తి, మేధస్సులని మేళవించి మనని తయారుచేసాడు. అందుకే భగవంతుని సృష్టి అద్భుతం, అపూర్వం.మనలోని భగవంతుని శక్తికి నాశనం అనేది లేదు. అది శాశ్వతమయినది. ఎప్పుడూ శక్తి, మేధస్సులతో ప్రకాశించుతూ ఉంటుంది. దానినే మనం ‘ఆత్మ’ అంటాము. అదే మన యొక్క నిజమయిన ఉనికి. అంతేకాని ఈ శరీరం, ఈ మనస్సు అనేది నిజమయిన మనం కాదు. శరీరం మనకి ఒక వాహనం లాంటిది. అలాగే మనస్సు అనేది అనేక సాంఘిక, సాంస్కృతిక, జీవన విధానాల ఆధారంగా మనం చేసే ఆలోచనల సమూహం, అంతేకాని అది నిజమయిన మన ఉనికి కాదు.

Content: మనం మన ఉనికి, మనలోపల నిక్షిప్తమయిపోయిన అసలయిన మన శక్తిని తెలుసుకోలేక పోతున్నాము. భగవంతుడు మనలని సృష్టించిన విధంగా మన సహజమయిన తత్వంతో స్వచ్ఛతతో ఉండగలిగితే మనం మన అంతరంగంలోని అసలయిన దివ్యశక్తిని తెలుసుకోగలం. అయితే ఆ శక్తి మీద; ఆ ఉనికి మీద సమాజపు నిబంధనలు, మన అహంకారం, మనలోని వ్యతిరేక భావావేశాలయిన అసూయ, ద్వేషం, అత్యాశ, కోపం

Page 21

Content: ఇలాంటివన్నీ పొరలు పొరలుగా కప్పివేసాయి. కాలక్రమంలో ఆ పొరలు గట్టి పడిపోయాయి. చివరికి మనం అంటే ఆ పొరలు, లేదా అశాశ్వతమయిన ఈ శరీరం మాత్రమే అని అనుకునే స్థితికి చేరిపోయాము. ఈ సందర్భంలో పరమహంస నిత్యానంద ఈ విధంగా చెబుతారు, “అసలు సమస్య ఏమిటి అంటే మనం మనలోని దివ్యశక్తిని మర్చిపోయాము. మనం కేవలం మాహులు మనుషులం మాత్రమే అని అనుకుంటున్నాము. మనలోని శక్తి చాలా చిన్నది అని దాని పరిధిని చూస్తుంటాము. దానివలన మనం అన్నీ సాధించలేము అని అనుకుంటాము. మీరు తెలుసుకోగలిగితే మీలో అంతులేని అద్భుతమయిన శక్తి నిక్షిప్తమై ఉంది. మీలోని శక్తికి ఎలాంటి హద్దులు లేవు. మీలో అనంతమయిన విశ్వశక్తి ఉంది. దానిని గుర్తించి చేరగానే అది గొప్ప విస్పోటకంగా బయటకి వచ్చి ఎన్నో పెద్దపెద్ద లక్ష్యాలను సాధించే విధంగా మీకు సహాయం చేస్తుంది.

Content: ఒక చిన్న కథ : మన పరిస్థితి ఎలా ఉందో మీకు వివరంగా, అర్థమయ్యే విధంగా పరమహంస శ్రీ నిత్యానంద ఒక చిన్న కథ చెబుతారు. మొదటి ప్రపంచయుద్ధం ముగిసిన తరువాత, సైనికులు ఒక చిన్న విమానాన్ని అడపుల ప్రాంతంలో పదిలీ పెట్టి వెళ్ళిపోతారు.

Content: ఆ స్థలానికి కొంచెం లోపల ఒక చిన్న గిరిజనులు ఉండే పల్లె ఉంటుంది. ఆ గ్రామంలోని ప్రజలకు నాగరికత అసలు తెలియదు. ముఖ్యంగా అప్పటికి బయట ప్రపంచంలో జరిగిన అభివృద్ధి గురించి వారికి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అసలు లేదు. వారు వారి జీవితకాలంలో ఎప్పుడూ విమానం అనే దానిని చూడలేదు, దాని గురించి వినలేదు. అసలు అటువంటిది ఈ ప్రపంచంలో ఉన్నది అని వారికి తెలియదు. అటువంటి అమాయకమయిన గ్రామస్తులు ఆ విమానాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు. ఆ విమాన వస్తువు గురించి తెలుసుకున్న గ్రామస్తులు అందరూ దాని చూట్టూ గుమిగూడి, అది ఏమిటి? అనే విషయం మీద చాలా సేపు వాదించి, వివరించి చివరికి దానికి రెండు చక్రాలు ఉన్నాయి కాబట్టి అది ఎడ్లబండి అని నిర్ణయిస్తారు. వారిలో పెద్దలు ఇలా అంటారు, “బహుశః కొత్త ప్రదేశంలోని వారెవరో ఇటువంటి ఎడ్లబండిని వాడతారు కాబోలు” అని నిర్ణయించుతారు.

Content: దానికి రెండు ఎడ్లు కట్టి దానిని గ్రామంలోనికి తెస్తారు. వారు గ్రామంలోనికి ఒక విచిత్ర బండి వచ్చిన సందర్భంగా గ్రామస్తులందరూ ఆనందంలో ఉత్సవాలు జరుపుతారు. ఆవిధంగా చిన్న విమానాన్ని గ్రామస్తులు ఎడ్లబండిలా ఉపయోగిస్తుంటారు.

Content: ఇలా కొన్ని వారాలు గడస్తాయి. అప్పుడు ఆ ఊరికి ఒక యువకుడు వస్తాడు. ఆ అబ్బాయి ఆ ఊరికి దూరంగా ఉండే ఒక చిన్న పట్టణంలో చదువుకుంటున్నాడు. తెలవలు గడపటానికి ఊరికి వచ్చి ఎడ్లు కట్టిన విమానాన్ని చూస్తాడు. ఆ అబ్బాయి విమానం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న మెషిన్లు, గేర్లు, స్విచ్‌లు గమనించి వాటిని అటూ ఇటూ తిప్పుతాడు. అప్పుడు అకస్మాత్‌గా ఒక ఇంజను పనిచేయటం మొదలు పెట్టింది. ఆ అబ్బాయి పట్టణంలో ట్రాక్టర్స్ చూసాడు. అతనికి ఆ ట్రాక్టరు, ట్రక్కులు గుర్తువచ్చి బహుశః ఇది

Page 22

Content: కూడా ఒక ట్రాక్టరు లాంటిదే అని అనుకొని గ్రామస్తులకు ఆ విషయం చెబుతాడు. "ఇది ఎడ్లబండి కాదు. దీనికి ఎడ్లు కట్టనవసరంలేదు. దానంతట అదే మెషిన్ సహాయంతో తిరగగలుగుతుంది" అని ఆ యువకుడు చెబుతాడు. అయితే గ్రామస్తులు అతని మాట నమ్మరు. అప్పుడు ఆ అబ్బాయి విమానాన్ని గ్రామవీధులలో నడిపి చూపిస్తాడు. గ్రామస్తులు ఎంతో ఆశ్చర్యపోయి, అంత వింతగల బండి వారి ఊరిలో ఉందని గర్వంగా, ఆనందంగా మరోసారి ఉత్సవాలు చేసుకుంటారు.

Content: ఈ విధంగా కొన్ని నెలలు గడిచిపోతాయి. అప్పుడు ఆ ఊరికి రిటైర్ అయిన మిలటరీ ఆఫీసరు వస్తాడు. అతనికి విమానాన్ని ట్రాక్టర్లలా ఉపయోగిస్తున్న గ్రామస్తులు కనిపిస్తారు.

Content: ఆ ఆఫీసరు గ్రామ ప్రజల దగ్గరికి వెళ్ళి "ఇది ట్రాక్టరు కాదు, ఇది విమానం. ఇదిగాళ్ళలో ఎగురుతుంది. ఇది ఏమిటో తెలియక మీరు దీనిని ట్రాక్టర్లా రోడ్డుమీద తిప్పుతున్నారు." అని చెబుతాడు.

Content: గ్రామస్తులు ఆఫీసరు మాటని కొట్టిపారేస్తారు. వారి దృష్టిలో కేవలం పక్షులు మాత్రమే ఎగరగలవు. కాని మనుషులు, మెషిన్లు అలా ఎగరలేవు.

Content: అప్పుడు ఆ అఫీసరు విమానంలో కూర్చొని దానిని కాసేపు గాలిలో తిప్పి కిందకి దింపుతాడు. అది చూసిన గ్రామస్తుల ఆశ్చర్యానికి అంతు ఉండదు. వారు తమ కళ్ళని నమ్మలేకపోతారు. అసలు ఇది ఎలా సాధ్యం ? అని అడుగుతారు.

Content: దానికి ఆ అఫీసరు దీనిలో ఉన్న అసలయిన శక్తి మీకు తెలియదు. అందుకే మీరు దానిని విమానంలా ఉపయోగించలేకపోయారు అని అంటాడు.

Content: మనలోని శక్తి విషయంలో మనం కూడా ఆ గ్రామస్తుల విధంగానే ప్రవర్తిస్తున్నాము. మనం ఎగరగలం ఆశక్తి ఉందికానీ ఆ శక్తి విషయం తెలియక పాచుకుంటున్నాము. ఎవరైనా గురువులు, యోగీశ్వరులు వచ్చి, మీరు గొప్ప శక్తి సంపన్నులు మీలోపలి శక్తి అద్భుతమయినది, మీరు ఎంతోరెట్లు శక్తివంతులు అని చెప్పినా మనం వారి మాటలు నమ్మం. అందుకే క్రింది స్థాయిలోనే ఉండిపోతాము.

Content: పరమహంస నిత్యానంద ఈ విధంగా మనస్థితిని పోల్చిచెబుతూ మరొక విషయం కూడా వివరించుతారు. మనలో ఎవరయితే కేవలం అత్యల్ప స్థాయిలో నాళ్లు, నా ఉద్యోగం, నావారు అనే చిన్న చిన్న విషయాలకి మాత్రమే పరిమితమైపోతారో వాళ్ళు ఎడ్లబండి స్థాయిలో ఉంటారు. వారు వారిలోని అద్భుతమయిన శక్తిని కేవలం చాలా క్రింది స్థాయిలో మాత్రమే ఉపయోగించుకుంటూ నేను పాములు మనిషిని, నాజీవితం ఇంతే అని తృప్తి పడతారు. వారు ఎడ్లబండి స్థాయినుంచి ఎదగరు. కొంతమంది ఉద్యోగం, ఇల్లు, ఆస్తి పీతితోపాటు కళలలో ప్రావీణ్యం సంపాదించకుంటారు, కళలతో రాణిస్తారు. నాట్యం, సంగీతం, కవిత్వం, శిల్పకళ మొదలయిన విద్యలు ఉన్నవారు ట్రాక్టర్ స్థాయిలో జీవిస్తారు. వారిలో శక్తిని ఆ స్థాయిలో ఉపయోగించుకోగలుగుతున్నారు. అలాంటివారు, జీవితంలో ఏదో సాధించాము అన్న తృప్తితో జీవించుతారు.

Content: దీనిని తరువాతది అత్యున్నత స్థాయి అయిన ఆధ్యాత్మిక స్థితిని చేరతం. ఈస్థాయిలోని వారు తాము విశ్వశక్తిలో ఒక భాగం అనే అంతిమ సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. వారు జ్ఞానోదయం పొంది అత్యుత్తమ చేతనస్థితిలో ఉంటారు. అటువంటివారు తమలోని శక్తిని విమానం స్థాయిలో ఉపయోగించుతారు. వారు నిరంతరం

Page 23

Content: పరమానందపు పారవశ్యంలో ఉంటారు. వారినే పరమహంసలు అంటారు. వారు ఆకాశంలోనికి అంటే అత్యున్నత స్థితికి ఎగరగలరు (చేరగలరు)

Content: నీటిలో తామరలా ప్రపంచపు చాయ అంట కూడదు

Content: ఈ ప్రపంచంలో ప్రతివ్యక్తీ ప్రయత్నించేది; వెతికేది ఒకే ఒక్క దాని కోసం అదే పరమానందం. పరమానందం అంటే శాశ్వతమైన సంతోషపు స్థితి. ఇది అత్యున్నతమయిన స్థితి. మరి అందరూ ఎంతో కష్టాలు ఇబ్బందులు పడుతూవెతుకుతున్న ఆనందం వారికి దొరుకుతున్నదా? మరి అలా దొరికితే అందరూ నిరంతరం ఆనందస్థితిలోకి ఎందుకు ఉండటంలేదు ? గొప్ప చదువులు చదివి, ఉద్యోగాలు చేసి; ఆస్తి, పేరు ప్రతిష్టలు సంపాదించి, అధికారాలు చెలాయించి అన్ని ముఖ్య దేవాలయాలు చూసి అన్నీ చేసాక ఎందుకు అందరికీ చివరికి శూన్య భావన మాత్రమే మిగులుతుంది ? ఎందుకు అంటులేని ఆవేదన, మానసిక కుంగుబాటు మిగులుతుంది? కారణం ఏమిటి?

Content: వీటి అన్నింటికీ కారణం ఒక్కటే. మనం వెతుకుతున్న ఆనందం మనలోనే ఉంది. అది బయట ప్రపంచంలో లేదు. ఆ విషయం మనకి తెలియక బయట ప్రపంచంలో వెతుకుతూ ఉంటాము. డబ్బు ద్వారా, పేరు ప్రఖ్యాతుల ద్వారా, అధికారం ఆస్తుల ద్వారా ఆనందం సొందొచ్చను అని అనుకుంటాము. అందులో వచ్చే చిన్న చిన్న సంతోషాలనే ఆనందం అని మురిసిపోతాము. చివరికి వ్యధలతో కూరుకుపోతాము.

Content: ఇక్కడ మీరు చేసే తప్పుపని ఒకటి ఉన్నది. మీరు మిమ్ములని సమ్మటం మానేసి సమాజాన్ని, ఈ ప్రపంచాన్ని నమ్మటం మొదలు పెట్టారు. మీకు మీరు అప్పాయింట్‌మెంట్ ఇచ్చుకోవటానికి టైం ఉండడు అంటారు కాని ప్రపంచంలో అందరికీ అప్పాయింట్‌మెంట్ ఇస్తారు, అని పరమహంస పదే పదే హెచ్చరిచుతారు.

Content: మీరు అంటే ఏమిటో మీకు తెలియదు. ప్రపంచం మీ గురించి ఏమి చెబితే అదే మీరు అనుకుంటారు. మీకోరికలు, మీ లక్ష్యాలు మీకు తెలియదు. ప్రపంచంలోని ఇతరుల కోరికలని మీ కోరికలుగా చేసుకొని బాధలు కొని తెచ్చుకుంటారు. ఉదాహరణకి మీ ఆఫీసు పనికి, ఇంటిపనికి మోటార్ సైకిల్ చాలు. కాని ప్రక్కింటి వ్యక్తి కారుకొనగానే ‘అయ్యో! నాకు కారులేదు. కారులేని (బ్రతుకు కష్టాలమయం)’ అని కారులేకపోతే కలిగే కష్టాలు లిస్టులు తయారుచేసుకుని, చాలా కష్టాలుపడి డబ్బు సంపాదించి కారు కొనుక్కుంటారు. కారుతో పాటు మనకి ఏమివస్తాయో తెలుసు, కష్టాలు. అందుకే అంటారు, కష్టాలు కొని తెచ్చుకున్నాము అని.

Content: ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు. కారు అనేది అదనపు సౌకర్యమే కదా! కష్టాలు ఎలా అవుతాయి? అది మనకి నిజమయిన అవసరం అయినప్పుడు సౌకర్యం అవుతుంది. అవసరం లేనప్పుడు అది భారమే కదా! భారం అంటే సమస్యలు. ఈ విధంగా మీరు ప్రతివిషయానికి, ప్రతిక్షణం ప్రపంచం మీద ఆధారపడి ఉంటారు. ప్రపంచంలో మునిగిపోయి మీరు అనే విషయాన్ని మర్చిపోతారు. సమాజపు కోరికలు మీ అవసరాలుగా చేసుకుంటారు. సమాజం యొక్క అభిప్రాయంతో మీరు ఏమిటో తెలుసుకుంటారు. అందుకే ఇన్ని వ్యధలు.

Page 24

Content: మీరు నిరంతరం పరమాత్మలో ఉండాలి అంటే మీరు ఈ ప్రపంచంలో ఉంటూ ఈ ప్రపంచం చాయలు మీ నిశ్చలనితని భంగపరచకుండా ఉండాలి. అది ఎలా అంటే పద్మం నీటిలో పుట్టి, అక్కడే పెరిగి అందులోనే అందంగా వికసిస్తుంది. కానీ ఒక్క నీటి బొట్టుకూడా పద్మాన్ని కాని, పద్మ పత్రాలనికాని అంటలేవు. మనంకూడా ఈ ప్రపంచంలో ఉంటూ ఈ ప్రపంచంలోని వస్తువులు కాని, సంఘటనలు కాని, వ్యక్తులు కాని మనని ప్రభావితం చేయిలేని విధంగా ఉండాలి. అంటే ఈ ప్రపంచం మెచ్చుకోవటంతో సంతోషపడి, విమర్శించగానే కుంగిపోకూడదు. ఏదైనా ఒక వస్తువు మనని ఆకర్షించితే మీరు నిజాయితీగా మీతోనే కూర్చోని ఈ వస్తువు నిజంగా నాకు అవసరమా అని తెలుసుకోవాలి. అలా చేసినప్పుడు ఈ ప్రపంచం వలన మన నిశ్చలత పాడవదు. మన ప్రశాంతత, ఆనందం అనేవి ప్రభావితం కావు.

Content: మనం ఆ విధంగా ఉండగలగాలి అంటే ఏమి చేయాలి? మన ఏకాగ్రత నిరంతరం, కేవలం మనలోని మన ఉనికి, మన ఆత్మ పైన మాత్రమే ఉండాలి. మన ఆత్మ మాత్రమే మనకి సరియైన మార్గాన్ని చూపించగలుగుతుంది. ఎందుకంటే అది దివ్యశక్తి మయమయినది కాబట్టి. నిరంతరం మన ఎరుక, మన తెలుసుకునే తత్వం, మన ఏకాగ్రత మనతోనే ఉండాలి. బయట ప్రపంచపు విషయాలు, వస్తువులు ఎంత ఆకర్షణతో ఉన్నాకూడా అవి మన నిశ్చలతని భంగపరచలేని విధంగా మనం ఉండాలి. అలా ఉన్న వ్యక్తులు బయట ప్రపంచంలోను, అంతరంగ ప్రపంచంలో కూడా అద్భుతాలు సాధించగలుగుతారు.

Content: ఇందుకు ఉదాహరణగా పరమహంస నిత్యావస్థ ఒక చక్రవర్తి కథ చెబుతారు.

Content: శుక మహారుషి జీవితం నుంచి ఒక చిన్న సంఘటన :

Content: శుక మహారుషి గొప్ప యోగీశ్వరుడు, అత్యంత ప్రతిభ గల మహారుషి. ఆయన మహా మేధావి, ఈ ప్రపంచంలోనే పేరెన్నిక కలిగి ఎన్నదగిన మహా జ్ఞాని వ్యాస మహారుషి కుమారుడు శుకుడు తండ్రి దగ్గర విద్యాభ్యాసం చేసి శాస్త్రాలు కావ్యాలు అన్నీ నేర్చుకుంటాడు.

Content: ఒకరోజు వ్యాసమహారుషి శుకుని పిలిచి, “నేను నీకు నేర్పించవలసిన విద్యలు, బోధించవలసిన సత్యాలు చెప్పాను. ఇప్పుడు నీవు జనకమహారాజు దగ్గరకి వెళ్ళు” అంటాడు

Content: జనక మహారాజు మిథిలా దేశానికి రాజు. ఆయన గొప్ప మహారాజు, కానీ అంతకంటే గొప్ప యోగీశ్వరుడు, రాజరుషి. ఆయనకి విదేహ అనే పేరు ఉంది. విదేహ అంటే శరీరం లేనివాడు. అంటే ఆయన తన శరీరం తనుకాదు అని తెలుసుకున్న జ్ఞానమూర్తి. ఆయన అష్టైశ్వర్యాలతో తులతూగే దేశానికి రాజు అయికూడా, ఈ ప్రాపంచిక విషయాలు అంటకుండా, వాటితో ఏమాత్రం చలించకుండా ఉండగలిగే ఆధ్యాత్మిక యోగీశ్వరుడు.

Content: ఆయన తనలోని తన నిజమయిన ఉనికిలో స్థిరపడిన వ్యక్తి. ఎవరయితే వారిలోని నిజమయిన ఉనికిలో, ఆత్మలో స్థిరపడగలరో, వారిలోనే వారి ఏకాగ్రతని నిలపగలరో అటువంటివారిని బయట ప్రపంచం యొక్క వస్తువులు, వ్యక్తులు ప్రభావితం చేయలేవు. వారు నిరంతరం మహదానందంలో ఉంటారు. అందుకే వ్యాసుడు తన కుమారుడు శుకుని జనకమహారాజు దగ్గరికి పంపించుతాడు.

Content: జనక మహారాజుకు శుకుడు వస్తున్న విషయం తెలుస్తుంది. ఆతనికి స్వాగతం చెప్పటానికి తగిన

Page 25

Content: ఏర్పాట్లు చేస్తాడు. మంత్రలకి ఆ బాధ్యతలు అప్పగించుతాడు. ఒకరోజు శకుడు జనకమహారాజు భవనం దగ్గరకి చేరుకుంటాడు. ఆయన రాజభవన ద్వారం దగ్గరకి వస్తాడు, కాని ద్వారపాలకులు ఆయనని గుర్తించరు. శకుడు విశిష్టమయిన పేరు ప్రఖ్యాతులగల మహాజ్ఞాని వ్యాసుడి కుమారుడు అయినా ఏమీ మాట్లాడకుండా ఆ ద్వారం దగ్గర మూడు రోజులు కూర్చుంటాడు. కానీ ఎవరూ కూడా అతనిని పట్టించుకోరు. అలా మూడురోజులు గడిచాక, జనకుని మంత్రులకి శకుడు వచ్చిన విషయం తలుస్తుంది.శకుడు భవనం బయట ఎదురు చూస్తున్నట్టు తెలుసుకుని పరుగు పరుగున ద్వారం దగ్గరికి వస్తారు.

Content: వారు ద్వారం దగ్గర ఎదురు చూస్తున్న శకుని అత్యంత గౌరవ మర్యాదలతో సకల రాజ లాంఛనాలతో రాజ భవనంలోనికి తీసుకు వెళతారు. ఆయనకి వైభవోపేతమయిన భవనాన్ని ఇస్తారు. అద్భుతమయిన రాజరికపు భోజనాన్ని ఇస్తారు. అన్ని సౌకర్యాలు సమకూర్చుతారు. భయభక్తులతో మర్యాదలు చేస్తారు.

Content: శకుని గమనించితే ఆయనలో ఎటువంటి మార్పు కనిపించదు. ఆయన మూడురోజులు రాజభవనం బయట ఎదురు చూసే విధంగా ఏమాత్రం గౌరవం భక్తి లేకుండా రాజభవనం వారు ప్రవర్తించినప్పుడు ఆయనలో అదే ప్రశాంతత, నిశ్చలత ఉన్నాయి. ఆయనని అత్యంత గౌరవమర్యాదలతో, రాజలాంఛనాలతో సత్కరించినప్పుడూ అదే ప్రశాంతత, అదే నిశ్చలత ఉన్నాయి. ముఖంలో ఎప్పుడూ చెదరని చిరునవ్వు అన్ని సమయాలలో ఒకే విధంగా ఉంది. దీనినే ప్రపంచంలో ఉంటూ ప్రపంచ విషయాలు అంటకుండా జీవించగలగటం అంటారు. తరువాత శకుని జనకుడు ఉన్న రాజసభకి తీసుకువెళతారు. జనకుడు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. సభలో సంగీత నాట్య కార్యక్రమాలు చాలా అట్టహాసంగా జరుగుతూ ఉంటాయి. సభలోని వారు అందరూ ఆ అట్టహాసంలో, హోరున వినిపించే సంగీత నాట్యాలలో మునిగిపోయి ఉంటారు.

Content: అక్కడకి వచ్చిన శకుడుకు జనకుడు నిండుగా పాలను నింపిన పాత్రని ఇచ్చి, ఆపాత్రని పట్టుకొని సభచూటూ ఏడుసార్లు తిరగాలి, తిరిగే సమయంలో పాత్రలోని పాలు తొణకి వలక కూడదు అని చెబుతాడు. శకుడు ఒక్కమాట కూడా మాట్లాడకుండా ఆ పాత్రని తీసుకొని సభచూటూ తిరగటం ప్రారంభిస్తాడు. అదే సభలో ఎంతో అందమయిన నాట్యాలు, ఆప్లోదమయిన సంగీత కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవి చాలా ఆకర్షణగా ఉన్నాయి. అట్టవంటి అట్టహాసల మధ్య, ఆకర్షణల మధ్య శకుడు పాలు ఉన్న పాత్రతో సభచూటూ ఏడుసార్లు తిరిగాడు. ఈ అట్టహాసాలు ఆ యువ రుషి నిశ్చలతని ఏమాత్రం భంగపరచలేక పోయాయి.

Content: పాలు ఉన్న పాత్రని తిరిగి జనకుని అప్పచెబుతాడు శకుడు. అప్పుడు శకుని చూస్తూ జనకుడు, "మీ తండ్రిగారు నీకు నేర్పించిన సత్యాలనే నేను తిరిగి చెప్పాను. నీవు ఏ సత్యాలనైతే సంపూర్ణంగా తెలుసుకోగలిగావో వాటినే నేను నీకు చూపించాను.నీకు తెలియవలసినదంతా తెలుసుకున్నావు. కుమారా! ఇక నీవు ఇంటికి వెళ్ళవచ్చు " అని చెప్పి శకునికి ఆశీర్వదించి పంపిస్తాడు రాజర్షి జనకుడు.

Content: శకుడు ఈ ప్రపంచంలో ఏ విషయాల వలన ప్రభావితుడు కాలేదు. ఆ విధంగా ఉండాలి అనేది అతని నిర్ణయం. మనం చేసే ప్రతి పనిని మనమే ఎంచుకుంటాము. అది కేవలం మన నిర్ణయమే. ఉదాహరణకి మిమ్ములని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళమీద కోపం చూపించాలా వద్దా అనేది మీ నిర్ణయం. అసలు మీకు కోపం కూడా రాదు. అటువంటి స్థితిలో ఎంతమంది మిమ్ములని రెచ్చకోట్టినా మీరు నిశ్చలంగా

Page 26

Content: ఉండి పోలు గుతారు. ఒకవేళ వారిపై కోపం చూపించినా దాని ప్రభావం మీ మీద అసలు ఉండదు. ఆ స్థితిని సాధించాలి అంటే సాధనతో సాధ్యమవుతుంది. ధ్యానం చేస్తే అది మిమ్ములని ఆ స్థితికి చేరే విధంగా సహాయం చేస్తుంది.

Content: తగిన మోతాదులో ఉంటే కోపం గొప్ప శక్తి

Content: కోపం మరొక మోసపూరితమయిన భావావేశము. కోపం అనేది చాలా చిన్న విషయం కానీ అత్యంత ప్రమాదకరమయినది కూడా, ఎందుకంటే మనకి కోపం వచ్చినప్పుడు, ఆ ఆవేశం మననిని తన ఆధీనంలోనికి తీసేసుకుంటుంది. మన ఆధీనంలో ఉండి మనం చెప్పినట్లు వినవలసిన ఆవేశం, మననిని తన వశం చేసుకుని మనం ఏంచేస్తున్నామో స్పృహ లేకుండా చేస్తుంది. అందుకే అంటారు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తున్నామో నాకు తెలియదు అని. కోపం అంటే ఒక సంఘటనకి కాని, వ్యక్తుల వలన కలిగిన సంఘటనకి కానీ మననుంచి వచ్చే స్పందన మాత్రమే. ఎందుకు కోపం వస్తుంది? కోపంలో ఎందుకు అంత అతిగా ప్రవర్తించుతాము? చిన్న విషయానికే ఎందుకు అంత కోపం తెచ్చుకుంటాము?

Content: పై ప్రశ్నలన్నిటికి పరమహంస నిత్యానంద ఒక చక్కని వివరణని ఇస్తారు. మనకి కోపం కలిగినప్పుడు రెండు విషయాలు జరగాలి. మొదటిది కోపాన్ని ప్రదర్శించటం. సమాజపు మర్యాద పాటించటానికి గాని లేదా మన ఉద్యోగ ధర్మం వలన కానీ లేదా కుటుంబపుస్థితులు ఒత్తిడి అనే భయంతో కానీ చాలాసార్లు కోపాన్ని చూపించం. కోపం చూపిస్తే ఉద్యోగం పోతుంది లేదా ఇంకా గొడవలు ఎక్కువ అయిపోవచ్చు కాబట్టి కోపాన్ని ఎదుటివారిమీద చూపించలేము. రెండవ విషయం కోపాన్ని అణచడం. కోపాన్ని అణచకూడదు. అలా అణచివేస్తే, అది మనలోపల శారీరక, మానసిక వ్యాధిలా మారిపోతుంది.

Content: మనం చిన్నతనం నుంచి మనలోని కోపం, ద్వేషం, అవమానం ఇటువంటి భావాలని అణచివేస్తాము. అవన్నీ కూడా మనలోపల పేరుకుని పోతాయి. అవి ఒక అగ్నిపర్వతంలా తయారవుతాయి. మనం సమాజమర్యాద కోసం లేదా మరొక కారణంతో ఆ అగ్నిపర్వతానికి మూత పెట్టి దానిమీద కూర్చుంటాము. అది లోపల రగులుతూ ఉంటుంది. అది ఎప్పుడైనా ఏచిన్న రాళ్ళు జరిగినా బళ్ళున (బ్రద్దలయ్యి) అందరికీ అశాంతిని తెస్తుంది. అందుకే మనం నడిచేటప్పుడు ఎవరైనా మనకి తగిలినా లేదా సైకిల్ తగిలిందనుకోండి, మనకి పెద్దగా దెబ్బలు తగలవు కానీ మనం దానిని కారణంగా చూపించి చాలా గొడవ చేస్తాము. చిన్న విషయానికే అంత పెద్దగొడవ ఎందుకు చేస్తామంటే దానికి కారణం మనలో అణచివేయబడిన కోపం మొదలయిన భావాల వలన.

Content: ఈ రోజు ప్రపంచంలో ఇంత హింస జరగటానికి కూడా అదే కారణం. దీనివలన కోపం చూపే వ్యక్తి, దానికి బలి అయిన వ్యక్తి ఇద్దరూ బాధపడతారు. ఇద్దరూ అశాంతితో ఉంటారు. తిరిగి ఆ అశాంతి మరింత అశాంతిని సృష్టిస్తుంది.

Page 27

Content: కోపాన్ని ఎలా వ్యక్తం చేయాలి :

Content: మీరు కోపాన్ని అణచుకోవద్దు, అలా అని అతిగా వ్యక్తం చేయవద్దు. మీకు కోపం వచ్చినప్పుడు దానిని జాగ్రత్తగా గమనించండి. ఆ కోపాన్ని చేతన స్థితిలో పరిశీలించండి. అప్పుడు మీకు కోపం అసలు రూపం తెలుస్తుంది. ఎంతకోపాన్ని ప్రదర్శించాలో అర్థమవుతుంది. అప్పుడు మనం అంతే కోపాన్ని చూపించుతాము. అప్పుడు ఎదుటి వ్యక్తిపైన మన కోపాన్ని చూపించక మనకి అపరాధ భావం ఉండదు. ఎదుటి వ్యక్తిలో మార్పు వస్తుందే కానీ అతను బాధపడు.

Content: అదే విధంగా కోపం, ద్వేషం మొదలయినవి మనిని ప్రభావితం చేయకుండా ఉండే విధంగా మన జీవితాన్ని మలచుకోవాలి. ఆ స్థితిని ధ్యానం ద్వారా సాధించవచ్చు. కోపం అనే భావన మనలోనికి వచ్చినప్పుడు ఒక్కసారి చేతన స్థితిలో అది ఎందుకు వచ్చిందీ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు అసలు అది నిజమయిన కోపమా లేక మరొక భావన ఆ రూపంలో వచ్చినదా అనే విషయం మనకి అర్థమవుతుంది.

Content: మీరు ఎప్పుడయినా కోపం వలన ప్రభావితమయ్యి, ‘అయ్యో ఎందుకు అలా చేసాసు’, అని అనుకుంటే మీరు కోపాన్ని అచేతనస్థితిలో చూపించారు అని అర్థం.

Content: అదే విధంగా, కోపం మీ నిశ్చలతని, మీ ప్రశాంతతని పాడు చేస్తే మీరు కోపాన్ని తెలుసుకునే తత్వంతో పరిశీలించలేదు అని అర్థం. అటువంటప్పుడు మీరు కోపానికి బానిస అవుతారు. కోపం అనే భావన మిమ్మలని తన ఆధీనంలోనికి తీసుకుంటుంది.

Content: సాధువు - సాము కథ

Content: ఒక గ్రామంలోనికి కొత్తగా ఒక నాగుపాము వస్తుంది. అది ప్రజలని భయభ్రాంతులని చేస్తూ, వారి జీవితాలలో ప్రశాంతత లేకుండా చేస్తుంది. గ్రామ ప్రజలు స్వేచ్ఛగా తమ పనులు చేసుకోలేకపోతుంటారు. నిరంతరం భయంతో జీవిస్తూ ఉంటారు. వారు ఎంత ప్రయత్నించినా ఆ పాముని ఏమి చేయలేక పోతారు.

Content: ఇలా కొంతకాలం గడిచాక ఆ ఊరికి ఒక సాధువు వస్తాడు. ఆయన హిమాలయాలలో తపస్సు చేసుకొని దేశ పర్యటన చేస్తూ ఆ గ్రామానికి వస్తాడు. తపస్సు చేసే యోగులకి జంతువుల భాష తెలుస్తుంది అని ఎవరో ఆగ్రామస్తులకి చెబుతారు. ఆవిషయం తెలుసుకున్న గ్రామస్తులు ఊరు చివర ఉన్న యోగి దగ్గరకి వెళతారు.

Content: భయంతో అక్కడ నిలబడిన గ్రామస్తులని చూసి ఆ యోగి, “అయ్యా మీరు ఎవరు? ఎందుకు అలా భయపడుతున్నారు?” అని ఎంతో ప్రేమగా లాలనగా అడుగుతాడు.

Content: అప్పుడు వాళ్ళు ఆయన కాళ్ళమీద పడి “స్వామీ! మేము ఈ గ్రామ పెద్దలము. మా ఊరిలోనికి ఒక నాగుపాము వచ్చి మమ్మలని భయభ్రాంతులని చేస్తుంది. మా జీవితాలని అల్లకల్లోలం చేస్తుంది. మీకు జంతువుల భాష తెలుసు అని విన్నాము. మామీద దయ చూపించి, ఆ పాము వలన మాకు బాధలు లేకుండా చూడండి. మమ్మలని కాపాడండి” అని దీనంగా అడుగుతారు.

Content: “తప్పకుండా! నేను ఆ పాముతో మాట్లాడి, అది మీ జోలికి రాకుండా చూస్తాను. మీరు ధైర్యంగా మీ పనులు చేసుకోండి, ఇక నిశ్చింతగా ఉండండి” అని వారికి చెప్పి వెనక్కి పంపించి వేస్తాడు.

Page 28

Content: ఆ తరువాత ఆ సాధువు పామును కలిసి దానితో మాట్లాడి చివరగా " ఓ స్నేహితుడా! అమాయకులయిన గ్రామస్తులని హింసించవద్దు. నామాట విని, వారిని పదిలి వేయి" అని అంటాడు.

Content: సాధువు మీద ఉండే అపారమయిన గౌరవంతో నాగుపాము ఆ సాధువుకు సరే అని మాట ఇస్తుంది. గ్రామస్తుల జోలికి వెళ్ళను అని ప్రమాణం చేస్తుంది.

Content: కొంతకాలమయ్యాక ఆ సాధువు తిరిగి హిమాలయాలకి వెళ్ళిపోతూ అదే గ్రామానికి వస్తాడు. ఆ గ్రామ సరిహద్దుల దగ్గరకి రాగానే సాధువుకి అతని స్నేహితుడయిన నాగుపాము కనిపిస్తుంది. నాగుపాము పరిస్థితి అతి దయనీయంగా ఉంటుంది. అది గాయాలతో రక్తం కారుతూ బాధపడుతూ చనిపోయే స్థితిలో ఉంటుంది. పాముని ఆస్థితిలో చూసిన సాధువు ఆశ్చర్యపోతాడు, చాలా బాధపడతాడు. ఆయన పాము దగ్గరకి వచ్చి, "స్నేహితుడా! నీకు ఏమయింది? ఎందుకు ఇంత దీన స్థితిలో ఉన్నావు. ఎందుకు నీకు ఇన్ని దెబ్బలు తగిలాయి?" అని అడుగుతాడు.

Content: దానికి ఆపాము, " ఓ!సాధువా! ఇదంతా నీవలనే జరిగింది" అంటుంది నిష్పరంగా. "అసలు ఏమిజరిగిందో చెప్పు" అంటాడు సాధువు

Content: "నేను గ్రామస్తుల జోలికి వెళ్ళను అని నీకు ప్రమాణం చేసాను కదా! నీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు వరకూ నేను వారిని ఏమీ అనకుండా, నీమాట ప్రకారం నడుచుకుంటున్నాను. కానీ ఈ గ్రామస్తులు నేను ఇచ్చిన మాటని అలుసుగా తీసుకుని నన్ను హింసిస్తున్నారు. ఇదివరకు గ్రామస్తులు నన్ను చూసి భయపడి పారిపోయేవారు. ఇప్పుడు వాళ్ళచేతనవ్వి వాళ్ళ బలహీనతగా అనుకుని నన్ను చితక్కొడుతూ వెళుతున్నారు. నేను వారిని కాటు వేయను అని తెలుసుకొని నన్ను కొట్టి బాధ పెడుతున్నారు. చూడు నాపరిస్థితి ఎంత భయంకరంగా ఉందో! చూస్తే నీకే అర్ధమవుతుంది." అని బాధపడుతూ చెబుతుంది నాగుపాము.

Content: పాము చెప్పినదంతా విన్న సాధువుకి ఆ పాము అమాయకత్వం చూస్తే జాలి అనిపిస్తుంది. “అయ్యో ! అమాయకపు స్నేహితుడా !నేను నిన్ను ప్రజలని కాటువేయొద్దు అని చెప్పాను కానీ బుసకొట్టవద్దు అనలేదుగా. నీవు వారిని భయపెట్టి కానీ కాటివేసి ప్రాణం తీయవద్దు" అని హితవు చెబుతాడు సాధువు.

Content: మీరు కోపాన్ని చూపించమచ్చు కానీ దానిని సరియైన పద్దతిలో, తగిన మోతాదులో మాత్రమే చూపించాలి. అలా చేయగలిగినప్పుడు మీ కోపం మీకు మంచి చేస్తుంది, ఎదుటి వారికి మంచి చేస్తుంది.

Content: కోపం గురించి తెలుసుకుంటే కోపం తగ్గుతుంది. దానిని సరియైన పద్దతిలో ఉపయోగించితే అది గొప్ప శక్తిగా మారి అందరికీ మంచి చేస్తుంది.

Page 29

Content: పెద్దలు చెప్పే విషయాలు మన మంచి కోరికే

Content: జీవితంలో చాలా దూరం ప్రయాణించి, అందులోని సాధక బాధలని, కష్టాలు, ప్రమాదాలని, మంచి చెడులని తెలసుకొని ఆ అనుభవంతో పెద్దవారు, గురువులు, తల్లిదండ్రులు పిల్లలకి, జీవితపు ప్రయాణంలో మొదటి మలుపులో ఉన్నవారికి హితవు చెబుతారు. వారు తమ అనుభవం ద్వార ముళ్ళదారి,పూల బాటలని గుర్తించి మనని మంచి మార్గంలో వెళ్ళమని బోధిస్తారు. వినకపోతే దండిస్తారు. కానీ చిన్నపిల్లలు, యువత వారిని, వారి మాటలని పట్టించుకోకుండా అలా చెప్పేవారిని శత్రువులుగా చూస్తారు. అలా ఎందుకు చేస్తారు?

Content: ఇదంతా కూడా మనలోని మోహపూరితమయిన మనస్సు, జిత్తులమారి అహంకారం ఆడే నాటకం. ఎప్పుడయితే మనం మన మనస్సు (ఆలోచనలు), అహం మాట వింటామో అప్పుడు హృదయానికి, ఆ తరువాత మనలోని మన నిజమయిన ఉనికి అయిన ఆత్మకి దూరం అయిపోతాము. ఎప్పుడయితే మనం మన అంతరాత్మకి దూరం అపుతామో అప్పుడు సర్వాంతర్యామి, విశ్వశక్తి అయిన భగవంతునికి కూడా దూరం అయిపోతాము.

Content: అహం అంటే నేను, నాది అనే హద్దులు మాత్రమే. మనస్సు అంటే అర్థం లేని ఒకదానికొకటి ఎటువంటి సంబంధం లేని ఆలోచనలు. ఈ రెండు కలిసి మనని మన అంతరాత్మకి, సర్వాంతర్యామికి మధ్య దూరాన్ని పెంచుతాయి. అవి మన మధ్యకి అడ్డుతగిలిన హేతువాదాన్ని శాస్త్రీయతని తీసుకువచ్చి అవి చెప్పేదే నిజం అని నమ్మేలా చేస్తాయి.

Content: మనస్సు, అహం అనేది మనస్సొంతం కాదు, అవి నిజమయిన మన ఆత్మకి సంబంధించినవి కాదు, అవి సమాజంచేత, మనలోని భావావేశాలు, కోరికలు వలన తయారుకాబడి, మనకి తెలియకుండా మనలోనే పట్టిష్టంగా తయారయినవి. వాటినే పరమహంస "నీవు కాని నీవు " అంటారు. ఇవి పూర్తిగా మన ఆచేతనస్థితిలోనే పని చేస్తాయి. గురువులు,యోగీశ్వరులు మనకి పదే పదే ఈ విషయాన్ని చెబుతారు, "నీనుంచి నీవు దూరం అయిపోతున్నావు. సమాజం నీపైన వేసిన ముద్రలని నీవు అని బ్రహ్మపడి పొంగిపోతున్నావు లేదా కుంగిపోతున్నావు. అది సరియైన పద్దతి కాదు.నేను, నాది అనే అహంకారాన్ని పదిలిఎట్టు అది మహో ప్రమాదకరమయినది. నీవు అహంకారాన్ని పదలకపోతే అది నిన్ను ఆధ్యాత్మిక దారిలోకాని, బయట ప్రపంచంలో కాని అభివృద్ధిని సాధించనీయదు."

Content: కానీ మనం వారి మాటలు వినం; విన్నా వారిని నమ్మం. ఇదంతా ఎలా ఉంటుందంటే , చిన్న పిల్లలు, యువకులు తప్పదారిలో వెళుతున్నప్పుడు పెద్దలు, తల్లితండ్రులు గురువులు వారిని అలా వెళ్ళవద్దు, అది మీ లక్ష్యాన్ని సాధించిపెట్టే దారికాదు. మీ అసలయిన దారి ఇది అని చెబితే వినరు. పెద్దలు, తల్లిదండ్రులు జీవితప్రయాణంలో చాలా ముందుకు సాగిపోయారు. ఆ దారిలో ఏది మంచిది, ఏది చెడ్డది అనేది వారికి అనుభవపూర్వకంగా తెల్సు కాబట్టి వాళ్ళు ఏ విషయం అయినా సరిగ్గా చెప్పగలరు. కానీ అహంకారంతో అమాయకత్వంతో వారు ఆ విషయాలని వినిపించుకోరు. పాముని పట్టుకుని అదే తాడు అని సంబరపడతారు.

Content: నీవు పట్టుకున్నది ఒక ప్రమాదాన్ని అని పెద్దవారు బలవంతంగా చిన్నవారి చేతిలోని ప్రమాదాన్ని లాగి పారవేస్తానికి ప్రయత్నిస్తే, వారిని శత్రువులుగా అనుమానించి వారిని శత్రువులుగా చూస్తారు.

Page 30

Content: జ్ఞానోదయం పొందిన యోగీశ్వరులు, గురువులు ఎంతో శ్రమలకోర్చి, తపస్సు చేసి కనుగొన్న సత్యాలని మనకి చెబుతారు. వారిలో పొంగి ప్రపహించే కరుణ, ప్రేమ వారిని మన దగ్గరకి పంపించుతాయి. మనకి సహాయపడాలి అని, మనం తెలివితక్కువగా, అమాయకంగా మన చుట్టూ అలుకునే సమస్యలు, వ్యర్థల నుంచి రక్షించాలని, వారు పొందిన పరమానందం మనం కూడా పొందాలనే ఉద్దేశంతో వారు ఇవ్వనీ చేస్తున్నారని వారికి దూరంగా వారు నుంచి పారిపోతాము. ఈ విషయాలని విపరించే సమయంలో పరమహంస నిత్యానంద ఒక చక్కని కథ చెబుతారు.

Content: ఒక అంధుడయిన వ్యక్తి : సాధువు అది హిమాలయాల ప్రాంతాలలో ఒకటి. ఒక గ్రామం. ఒకరోజు అంధుడయిన ఒక యువకుడు గ్రామం ఉన్న అడవి గుండా నడుస్తూ వస్తున్నాడు. అక్కడ చల్లదనానికి నీరు, అన్నీ గడ్డకట్టుకుపోయి ఉన్నాయి. ఆకులు, కాయలు, కొమ్మలు, రాళ్ళు కూడా మంచుతో గడ్డకట్టుకుపోయి ఉన్నాయి. అలా మంచులో నడిచి వస్తున్న గుడ్డివాడయిన యువకుడు ఒక దగ్గర కాలుజారి నేలపై పడతాడు. అప్పుడు అతని చేతి కర్ర జారి లోయలో పడిపోతుంది.

Content: దారి బాగా అలవాటు కాబట్టి లేచి మెల్లగా చేతులతో తడుముకుంటూ గ్రామంవైపు నడుస్తుంటాడు ఆ యువకుడు. అలా కొంచెం దూరం వెళ్ళాక, అకస్మాత్తుగా అతని చేతులమీద ఒక కర్ర పడుతుంది. దానిని ఒడిసి పట్టుకుంటాడు అది పొడమైన కర్ర.

Content: దానిని పట్టుకుని, “అమ్మయ్యా !నాకు కర్ర దొరికింది. అదృష్టవంతుణి ! దేవుడే ఈ కర్ర నాకు ఇచ్చాడు,” అని దాని సహాయంతో గబగబా నడుస్తుంటాడు.

Content: కానీ అతని మీద పడినది కర్రకాదు. భయంకరమయిన సాగుపాము. అది మంచులో గడ్డకట్టుకుపోయి కర్రలా ఉంది. కానీ ఆ యువకుడు చూడలేడు కాబట్టి దానిని కర్ర అనుకుని దానిని పట్టుకుని నడుస్తుంటాడు అంతలో ఒక సాధువు గ్రామం నుంచి అడవి లోపలికి వెళుతుంటాడు. అయన ఆ అంధుడి చేతిలో పాముని చూస్తాడు. వెంటనే ఆ యువకుడితో “అయ్యా !నీవు ఎవరివో కానీ, ముందు నీ చేతిలో దానిని పారవేయి. నీవు దానిని కర్ర అనుకుంటున్నావు. కానీ అది పాము. త్వరగా దానిని పారవేయి” అని అరుస్తూ చెబుతాడు.

Content: అప్పుడు ఆ యువకుడు సాధువుతో “నాకు అన్నీ తెలుసు. నా చేతిలోనిది కర్రే. నీవు మాట్లాడకుండా నీదారిని వెళ్ళు” అంటాడు కోపంగా.

Content: అప్పుడు సాధువు, “అయ్యో ! ఓ యువకుడా ! అది పాము. మరి కాసేపటిలో సూర్యకిరణాలు బయటకి వస్తాయి. ఆ మంచు కరిగిపోయి, పాము బయటకి వస్తుంది. అది కర్రస్తే నీ ప్రాణాలు దక్కవు. అది భయంకరమైన సాగుపాము దానిని దూరంగా పారవేయి అని కొంచెం గట్టిగా చెబుతాడు.

Content: ఈసారి ఆ యువకుడికి చాలా కోపం వస్తుంది. అతనుకూడా చాలా గట్టిగా ఇలా అంటాడు, 'బహుశః నీకు ఈ కర్ర అవసరం అయి ఉంటుంది.నేను దీనిని పారవేస్తే, నీవు తీసుకోవాలని అనుకుంటున్నావు. నాకు ఆ మాట్రం తెలియదు అని అనుకోకు. నీలాంటి వారిని చాలా మందిని చూసాను. నీదారిని నీవు నోరుమూసుకొని వెళ్ళు. అనవసరంగా నాజోలికి రావద్దు. నీవు ఎంత అరచినా నేను ఈ కర్రని వదలను' అంటాడు.

Page 31

Content: అప్పుడు ఆ సాధువు " ఓ మూర్థుడా ! అతిగా ప్రవర్తించి నీప్రాణం మీదకి తెచ్చుకోవద్దు. నీ మంచి కోరి చెబుతున్నాను. అనవసరంగా చస్తావు " అంటాడు. ఆ యువకుడు లెక్క చేయకుండా ముందుకు వెళ్ళిపోతూంటాడు. అప్పుడు సాధువు ఆ యువకుడి మీద జాలి తో అతను తనని తిదుతున్నా లెక్కచేయకుండా అతని చేతిలోని పాముని లాగేయటానికి ప్రయత్నిస్తాడు. ఆ యువకుడు కోపంగా ఆ పాముతోనే సాధువుని కొడతాడు. కరుణా, ప్రేమ మాత్రమే తెలిసిన ఆ సాధువు ఆ దెబ్బలను భరిస్తూ పాముని అతని చేతినుంచి లాగి దూరంగా పారవేసి ఆ యువకుడి ప్రాణాలు కాపాడతాడు. మనం చాలాసార్లు ఆ యువకుడిలా మూర్ఖంగా ప్రవర్తించుతాము. కానీ మనమీద ఉండే అపారమయిన ప్రేమతో,కరుణతో గురువులు తిరిగి తిరిగి మనకి సహాయం చేయాలనే చూస్తారు. మనకి వారి హాస్తాన్ని అందించుతారు. మనం మాత్రం అహంకారంతో అంధులమయిపోయి ఆ చేతిని బలంగా తోసిపారేస్తాము.

Content: మనం ఈ భూమిమీద పుట్టినప్పటినుంచి చనిపోయేవరకూ నిరంతరం ఆ భగవంతుని రక్షణలో ఉంటాము. కానీ ఆ విషయాన్ని మనం ఎప్పుడూ గమనించము. అసలు ఆ అలోచన రానీయము. ఎంతవరకూ కూడా కేవలం మను కళ్ళకి కనపడుతూ, మనం క్షణాలలో ఉన్నప్పుడు సహాయం చేసిన వారిని మాత్రం స్మరించుతాము. మనం అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేసిన వారిని మాత్రం స్మరించుతాము. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విద్యనేర్పినవారు, సహాయం చేసిన స్నేహితులు, బంధువులు ఇలా అనుకుంటాము కానీ నిరంతరం కొన్ని వేలసార్లు మనని రక్షిస్తున్న ఆ సర్వాంతర్యామిని, మనం అడగకుండానే అన్ని పరాలని మనమీద వర్షింపచేసే విశ్వశక్తి అయిన భగవంతుణ్ణి మాత్రం గుర్తించం. దేవుడికి అసలు కృతజ్ఞత ఎప్పుడైనా చెబుతామా?

Content: మీరు ఒకసారి గమనించండి - ప్రార్థన చేయి లేదా పూజ చేయి అనగానే, 'భగవంతుడా నాకు ఇది కావాలి, అది కావాలి,' అని మొదలు పెడతాం. గుడికి వెళ్ళగానే లేదా దేవుని పటం ముందు నిలబడగానే భగవంతుడా మమ్మలని చల్లగా చూడు, మంచి ఆరోగ్యం ఇవ్వు మంచి జీవితాన్ని ఇవ్వు చదువు ఇవ్వు ఇలా ఉంటుంది మన ప్రార్థన.

Content: అంతేకాదు భగవంతుడు మనకు ఎంత ఇచ్చినా ఇంకా కావాలి.. ఇంకా కావాలి అని మాత్రమే అంటాం. మనకి భగవంతుడు ఇచ్చిన ఎన్నో అపురూపమైన బహుమతులని ఏరోజూ తృప్తిగా చూసుకోము, అవి ఇచ్చినందుకు భగవంతుడికి మనస్పూర్తిగా కృతజ్ఞత చెప్పం.

Content: పిల్లలు గుడికి వెళతాం అనగానే ఇది అడుగు, అది అడుగు అని చెబుతామే కానీ,నీకు భగవంతుడు ఎన్నో ఇచ్చాడు మనస్పూర్తిగా, ప్రేమతో కృతజ్ఞత చెప్పు అని చెప్పం. అందుకే చిన్నతనం నుంచి మనకి పూజ, ప్రార్థన అనగానే అడగటం అనేది అలవాటయిపోయింది.

Page 32

Content: మనకి చక్కని శరీరాన్ని ఇచ్చాడు ఆ భగవంతుడు. అందమయిన కాళ్ళు, ఇలా మహోద్భుతమయినవి ఎన్నో ఇచ్చాడు. సంతోషంగా (బ్రతకటానికి అందాల ప్రపంచాన్ని ఇచ్చాడు. మనం నిద్రలేచినది మొదలు, నిద్రపోయేవరకు మన అవసరాలు తీరుస్తూ రక్షణని ఇస్తున్నాడు. కానీ మనం ఏరోజు అయినా భగవంతునికి కృతజ్ఞతలు చెప్పామా?

Content: ఎందుకు మనం నిరంతరం కృతజ్ఞతతో ఉండము? ఎందుకు భగవంతుడు ఎన్ని వరాలు ఇచ్చినా ఇంకా కావాలి. ఆ తరువాత ఏమిటి? ఇంతేనా! అని అనుకుంటాము? అసలు తృప్తి అనేది మనకి లేదా?

Content: ఎందుకు ఆలా ప్రవర్తిస్తాము అంటే , మనకి ఏది ఇచ్చినా దానిని యధాలాపంగా, చాలా మాములుగా తీసుకుంటాము. అద్భుతమయిన ఈ జీవితాన్నే యధాలాపంగా తీసుకుంటాము. అంతే కాకుండా, నాకు అర్హత ఉన్నది కాబట్టి ఇవ్వకపోతే పొందగలుగుతున్నాను అనే భావం కూడా మనలో కృతజ్ఞతని లేకుండా చేస్తుంది.

Content: కానీ ఒక్క విషయం అర్ధం చేసుకోము. భగవంతుడు ఇతను/ఆమె నాకు అవసరం లేదు అనుకున్నా మరక్షణం మనం ఈ ప్రపంచంలో ఉండము. మనం జీవించి ఉన్నాము అంటే, భగవంతుని రక్షణలో ఆయన కోరికపై ఈ భూమిమీద ఉన్నాము అని అర్ధం. అందుకే మనం నిరంతరం కృతజ్ఞతతో ఉండాలి. మనపూజలు, మనప్రార్ధనలు, మన జీవితమే కృతజ్ఞతగా మారాలి. కృతజ్ఞత అనేది ఒక సమాజపు మర్యాదలా ఉండకూడదు.

Content: అది మన అంతరాత్మనుంచి, మనహృదయపు లోతుల నుంచి పొంగి ప్రవహించాలి. అలాంటి స్థితిలో మనం మాటల రూపంలో కృతజ్ఞతని వ్యక్తం చేయకపోయినా పరవాలేదు.

Content: మనం ఏ మాత్రం ఆచారాలు పాటించినా పరవాలేదు. కానీ ఆ ఆచారాలు మనని నిస్సుక్రియులను, ప్రేమతో కృతజ్ఞతతో నింపాలి. మనం చేసే ప్రార్థన, ప్రేమ కృతజ్ఞతలతో ఉండాలికాని కోరిక, భయంతో కాదు.

Content: నాకు ఇది వచ్చింది కాబట్టి దేవుడికి పూజ చేస్తాను. నాకు ఇది రాలేదు కాబట్టి ఇవాళ ప్రార్థన చేయను అని అంటే అది భక్తి కాదు, కృతజ్ఞత అంతకంటే కాదు. మనకి మంచి జరిగినా చెడు జరిగినా (చెడు అనేది కేవలం మన భాష, మన భావం మాత్రమే) నిరంతరం భగవంతుడికి కృతజ్ఞతని ప్రేమతో తెలియచేయాలి.

Content: ఒక సూఫీ గురువు కథ :

Content: జున్నాద్ అనే ఒక సూఫీ గురువు తన శిష్యులతో కాలినడకన దేశాటన చేస్తూ ఉంటాడు. సూఫీ మతం కృతజ్ఞతతో ఉండే మతం. వారు రోజుకి ఐదసార్లు భగవంతునికి ప్రార్థనలు చేస్తారు.

Content: సూఫీ గురువు తన శిష్యులతో ప్రతిరోజు ఒక గ్రామానికి వెళ్ళి, అక్కడ వారు ఇచ్చిన భోజనం తిని ఊరు చివరలో రాత్రికి బస చేసి తిరిగి మర్నాడు మరొక గ్రామానికి వెళతుతారు. ఆ విధంగా వారు దేశాటన చేస్తుంటారు.

Content: ఒకసారి ఈ సూఫీ గురువు తన శిష్యులతో కలిసి ఒక గ్రామానికి వెళతాడు. ఆ గ్రామ ప్రజలకి సూఫీ మతం గురించి కానీ, సూఫీ గురువుల గురించి కానీ ఏమీ తెలియదు. వీరు మాములుగా భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఎవరూ వారికి బిక్ష వేయరు. సాయంత్రం వరకూ బిక్షాటన చేసినా తినటానికి ఏమీ దొరకదు.

Content: సూఫీ గురువు శిష్యులతో ఆ రాత్రి గ్రామం సరిహద్దులో విశ్రమిస్తాడు. అందరూ ఆకలితోనే పడుకుంటారు.

Page 33

Content: రెండవరోజు వీరంతా ఆ తరువాత ఉన్న గ్రామానికి వెళతారు. ఆ గ్రామంలో వారికి సుఫీమతం అంటే ఇష్టం ఉండదు. దాంతో వారు భిక్షవేయరు సరికదా వీరిని తిట్టి పంపించి వేస్తారు. ఆ రాత్రి కూడా గురువుగారు తన శిష్యులతో గ్రామం బయట ఆకలితోనే నిద్రపోతారు.

Content: మూడవరోజు వారంతా ఆ తరువాత గ్రామంలోనికి వెళతారు. ఆ గ్రామంలో వారు సుఫీ మతం అంటే అసలు ఇష్టం ఉండదు. దాంతో వారు గురువుగారిని, ఆయన శిష్యులని కర్రలతో బెదిరించి ఊరు బయటకి తరిమివేస్తారు. అందరూ ఆ గ్రామం దాటి బయటకి వచ్చేస్తారు.

Content: ఆ రోజు రాత్రి ఎప్పటిలాగానే సుఫీ గురువు గుడ్డపరచి, దాని మీద కూర్చొని, ప్రార్థన చేసి భగవంతునికి కృతజ్ఞతలు తెలియచేస్తాడు.

Content: ఇదంతా గమనించిన శిష్యులకి చాలా కోపం వస్తుంది. అసలు గురువుగారు దేవుడికి ఎందుకు కృతజ్ఞతలు చెబుతున్నారో వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు కోపంగా గురువు గారితో, “గురుదేవా! మనకి గత మూడు రోజుల నుండి భోజనం లేదు. ఈ రోజు అయితే కర్రలతో కొట్టబోయారు. మనని భయపెట్టి ఊరునుంచి తరిమివేసారు. మనకి ఏమి మంచి జరిగింది అని మీరు దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నారు? మనం ఆకలితో ఉన్నందుకు కృతజ్ఞతలు చెబుతున్నారా? అని కోపంగా అడుగుతారు.”

Content: గురువుగారికి వాళ్ళు కోపం అర్థమయింది. ఆయన వాళ్ళు వైపు చూసి చిన్నగా నవ్వుతూ ఇలా అంటాడు. “మీరు మూడురోజుల ఆకలి గురించి మాట్లాడుతున్నారు. మరి గత ముప్ఫై సంవత్సరాలుగా మీరు చేస్తున్న భోజనానికి భగవంతునికి కృతజ్ఞత చెప్పాలి కదా! ఆ విషయం మరిచిపోయారా?”

Content: ఆయన ఇంకా ఇలా అంటాడు “మీకు ప్రార్థన అంటే తెలిసింది ఇదే. మీరు ఒక్క విషయం గురించి మాత్రమే ఆలోచించుతారు. అది, ఏమైనా పొందినప్పుడు మాత్రమే కృతజ్ఞత చెప్పాలి అని కానీ నేను భగవంతునికి చెప్పే కృతజ్ఞత అది కాదు. నేను ఎంతో పొందాను అని చెప్పేది కృతజ్ఞత కాదు. నా ప్రార్థన, నా కృతజ్ఞత అనేవి నా అంతరంగపు లోతుల నుంచి పొంగి ప్రవహించే ఆనందం, ప్రేమ. నేను కేవలం వాటిని మాత్రమే వ్యక్తం చేస్తున్నాను. దీనికి ఎంపికలు ఉండవు. కేవలం నా నుంచి పొంగి ప్రవహించే భక్తి, ప్రేమ భావాలే నా ఈ ప్రార్థన”

Content: మీలో కృతజ్ఞతా భావం పొంగి ప్రవహించుతున్నప్పుడు, కృతజ్ఞత తెలియచేయటం అనేది బాధ్యతగా ఉండదు. ఏదో జరిగింది కాబట్టి మర్యాద కోసం చెప్పే మాటలుగా అనిపించదు. అటువంటివారి జీవితమే కృతజ్ఞతతో నిండి ఉంటుంది. అలా కృతజ్ఞత ఉన్నప్పుడు వారు ధ్యానస్థితిలో ఉంటారు. ఎందుకంటే మనం, మన అంతరంగం కృతజ్ఞతతో నిండటయితే మనలో అహంకారం, అదే విధంగా మనస్సు అనే వాటికి స్థానం ఉండదు. ఎప్పుడయితే ఆ రెండూ మనలో ఉండవో మనం ధ్యానస్థితిలో ఉంటాం. అదే మనం చేరగల అత్యున్నతమయిన స్థితి.

Content: పూజ, ప్రార్థన అనేవి ఒక పని కాదు: మనం భగవంతుడిని ప్రేమతో, భక్తితో ప్రార్థించాలి. కానీ చాలా మంది దానిని యాంత్రికంగా, అదేకొక డ్యూటీ లేదా బాధ్యత అన్నట్టు చేస్తారు. పూజ అయిపోగానే, హమ్మయ్య అయిపోయిందిలే అని

Page 34

Content: అనుకుంటాము. కొంతమంది గుడిలో విగ్రహాలకి బిందెడు పాలతో అభిషేకం చేస్తాం అని అంటారు. కొందరు గుడి చుట్టూ 108 సార్లు 21 రోజులు ప్రదక్షణ చేస్తాం అంటారు. కొందరు, కొన్ని స్తోత్రాలని 10 రోజులు 21 రోజులు తేదా 10,000 సార్లు చదివామో అని అంటారు. ఇవన్నీ దేనికి చేస్తారు. అలా చేయటం వలన వారికి భగవంతుని మీద భక్తి తేదా భయం అనే భావాలు తప్ప వారికి భగవంతునితో సాన్నిహిత్యం ఏర్పడదు. నిజంగా ఆలోచించితే ఇదంతా వ్యాపార వ్యవహారంలా ఉంటుంది.

Content: కొంతమంది పూజకి అస్నీ ఇచ్చి తమ పేరు గోత్రం అడ్రస్ అన్నీ చెప్పి వారికి ఏమికావాలో కూడా స్పష్టంగా చెబుతారు. అప్పుడు భగవంతుడు వారికి ఇచ్చే వరాలు కచ్చితంగా ఉండి, వారి కరెక్ట్ అడ్రస్‌కి వస్తాయి అని నమ్మకం. అంటే వీరి ఉద్దేశం భగవంతుడికి మనకి ఏమి ఇవ్వలో, ఏది అవసరమో తెలియదు అని నమ్మకం. భగవంతుడు అంతేనే మేధావి. భగవంతునికి తెలియనది ఈ ప్రపంచంలో ఏదీ ఉండదు. మన గురించి ఈ జన్మ మాత్రమే కాదు, మన పూర్వ జన్మలు, మన రాబోయే జన్మలు దేవుడికి స్పష్టంగా తెలుసు. మన గురించి మనకంటే దేవుడికే బాగా తెలుసు.

Content: కానీ తెలివిగలవాళ్ళం మనమే అనుకునే వారి వ్యవహారాలు, వారి పూజలు, ప్రార్థనలు ఎలా వ్యాపారంలా ఉంటాయో పరమహంస నిత్యానంద ఒక చిన్న కథలో వివరిస్తారు.

Content: ఒక చిన్న కథ :

Content: దేవుడే వ్యాపారంలో భాగస్వామి అయితే?

Content: ఒక చిన్న పట్టణంలో ముగ్గురు వ్యాపారస్తులు ఉంటారు. వారికి చాలా పూర్తిగా ఉంటుంది. ఏం ఉద్యోగం చేయాలా అని చాలా ఆలోచించుతారు. వారి ఉద్దేశం ఏమిటి అంటే, త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించాలి. అలా తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి అంటే వ్యాపారమే సరియైన పద్దతి అని నిర్ణయించుకుంటారు.

Content: కొంత ఆలోచించి, వాథించి మాట్లాడి చివరిగా ముగ్గరూ వాటాదారులుగా ఉండి వ్యాపారం చేయాలి అని నిర్ణయించుతారు.

Content: అప్పుడు వారిలో ఒక వ్యక్తి "మనం ముగ్గురం వాటాదారులమంటే బాగుండదు. మనకి మరొక వాటాదారుడు ఉంటే బాగుంటుంది" అని అంటాడు. వారు మరలా చాలా తర్జన బర్జన పడతారు. వారికి ఏకాభిప్రాయం కుదరదు. చివరికి వారిలో రెండో వ్యక్తి ఇలా అంటాడు "మనకి బయట వ్యక్తులు ఎవరూ వద్దు. మనం ముగ్గురం, నాలుగవ భాగస్వామిగా దేవుడిని పెట్టుకుందాము. అప్పుడు మనకి ఎవరితో గొడవలు ఉండవు, దేవుడే మన భాగస్వామి కాబట్టి మన వ్యాపారం చాలా బాగుంటుంది" అని అంటాడు.

Content: మిగిలిన ఇద్దరూ చాలా సంతోపడతారు. అప్పుడు వారిలో మూడవ వ్యక్తి "ఇది చాలా మంచి సలహా మనం దేవుడికి కూడా మన లాభాలలో కొంత భాగం ఇద్దాము" అంటాడు

Content: అందరూ ఒప్పుకుంటారు. ఆ ముగ్గరు స్నేహితులు, దేవుడిని కూడా భాగస్వామిగా చేసి, చాలా ధైర్యంగా వ్యాపారం మొదలు పెడతారు. సంవత్సరం అయ్యేటప్పటికి వారికి చాలా లాభాలు వస్తాయి. వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. సంవత్సరం చివరలో అందరూ లాభాలు పంచుకొనే సమయం వస్తుంది.

Page 35

Content: ఇప్పుడు అసలు సమస్య ప్రారంభమవుతుంది. సమస్య ఏమిటి అంటే దేవుడికి లాభాలలో వాటా ఎంత ఇవ్వాలి, అది ఎలా నిర్ణయించాలి. వారికి లాభాలు చూస్తే చాలా ఎక్కువగా వచ్చాయి. స్నేహితులు చాలా సేపు ఆలోచించి చాలా మార్గాలని పద్దతులని చర్చించుతారు. చివరగా మొదటి వ్యక్తి ఇలా అంటాడు. "సరే, నేను ఒక పద్దతి చెబుతాను. ఇక్కడ ఒక సర్కిల్ గీద్దాము. మనకి వచ్చిన డబ్బు అంతా దాని మీద పోద్దాము. ఆ సున్నాలో పడిన డబ్బు దేవుడికి ఇద్దాము. బయటపడిన డబ్బు మనం పంచుకుందాము" ఈ సలహా మిగతా ఇద్దరికీ అంతగా నచ్చదు. వాళ్ళు ఏం మాట్లాడరు. అప్పుడు రెండవ వ్యక్తి ముందుకు వచ్చి ఇలా అంటాడు " ఒక పెద్ద వృత్తాన్ని గీద్దాము. మనకి వచ్చిన డబ్బుని అందులో వేద్దాము. వృత్తం లోపల పడిన డబ్బు మనం తీసుకుందాము. బయటపడిన డబ్బు దేవుడికి ఇద్దాము", అంటాడు. ఆ సలహా కూడా అంతగా నచ్చదు వాళ్ళకి.

Content: అప్పుడు మూడవ వ్యక్తి, "నేనోక సలహా ఇస్తాను. ముందు నామోట వినండి. భగవంతుడు ఎక్కడ ఉంటాడు కదా. మనం డబ్బు మొత్తం పైకి విసరుదాము. దేవుడు తనకు ఎంత డబ్బు కావాలో అంత తీసుకొని మిగతాది మనకి ఇస్తాడు. అలా క్రింద పడిన డబ్బు మనం పంచుకుందాం అంటాడు. ఈ సలహా అందరికీ నచ్చుతుంది.

Content: మనం ఇలానే ప్రవర్తిస్తాము. భగవంతుడిని వరాలు అడిగే సమయంలో నేను కోరుకున్నది జరిగితే నీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెబుతాము. కోరిక తీరగానే దేవుడిని మర్చిపోతాం. తిరిగి ఇంకొక కోరిక రాగానే మళ్ళీ దేవుడితో బేరాలు మొదలు పెడతాము. ఇదే మనం చూపించే భక్తి. అందుకే అంటాను, భక్తి అంటే కృతజ్ఞతా, ప్రేమ అంటే కాని వ్యవహారాలు కాదు. దానిని భక్తి అనరు.

Content: పోలిక విత్తనం : అసూయ ఆ చెట్టుకు కాసే ఫలం : మనం మన జీవితంలో చాలా భాగం. ఎదుటివారితో లేదా ఇతరులతో పోల్చుకోవటంలో గడుపుతూంటాము. మనకి తెలిసే విధంగా కొంత, మన అచేతన స్థితిలో కొంత మనం నిరంతరం పోల్చుకుంటూ ఉంటాము. మన మైండ్ ఈ పోల్చుకొనే కార్యక్రమంలో ఎంతగా మునిగిపోయిందంటే, మనం అసలు సత్యాన్ని ఆ విధంగా చూడకుండా కేవలం పోలికతో మాత్రమే చూస్తాము. దీనివలన మనం మన జీవితంలో నాణ్యతని కోల్పోతున్నాము. అసలు జీవితాన్ని యధాతధంగా చూడలేకపోతున్నాము.

Content: పరమహంస నిత్యానంద ఒక చక్రని విషయాన్ని చెబుతారు. మీరు ఎదుటివారిని చూసి కొంత విషయాన్ని కొత్త సంగతులని, తెలియని జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. అంతవరకు మాత్రమే మీరు ఎదుటివారిలో చూడగాలి. అది మంచి పద్దతి. ఇటువంటి దృక్పధం వలన మీరు అభివృద్ధి చెందుతారు. అలా కాకుండా ఎదుటివారు ఇలా చేసారు కాబట్టి నేను కూడా.... ఇలా చేస్తాను. ఇలా ఆలోచించితే మనం జీవితంలో ఏదీ సాధించలేము.

Content: అసలు అందరూ ఎందుకు నిరంతరం ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీకు మీరు అసలు సత్యాన్ని చూడలేరు.

Page 36

Content: అంటే ఏమిటో తెలియదు. మీ లోపల ఉన్న అద్భుతమయిన శక్తి కూడా తెలియదు.మీలోని గొప్పశక్తిని మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీలోని శక్తియుక్తులని ఎప్పుడయితే తెలుసుకుంటారో అప్పుడు మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది. ఎప్పుడైతే మిమ్మలని మీరు నమ్ముతారో ఇక ఎదుటివారితో పోల్చుకోవలసిన అవసరం ఉండదు.

Content: మీ ఏకాగ్రత, మీ దృష్టి మీ మీద లేకపోవటం కూడా ఒక కారణం. మీరు మీతో ఉండగలిగే స్థితిని పొందితే మీరు ఎవరితోనూ పోల్చుకోరు. మీకు మీరు చాలు అని అనుకోగలిగితే, మీతో మీరు ఉండగలిగితే ఎదుటి వారితో పోల్చుకునే అవసరం మీకురాదు.

Content: ఈ ప్రపంచంలో ప్రతీ వ్యక్తి భగవంతుని సృష్టి. భగవంతుడు తనలోని దివ్యశక్తిని అద్భుత మేధస్సున కలిపి ఈ ప్రపంచంలోనికి మనం ఏ లక్షణంతో పంపబడ్డామో ఆ లక్ష్యం సాధించేందుకు అనువుగా మనని తయారుచేస్తాడు. అందుకే ప్రతి మనిషి ఒక ప్రత్యేకతని కలిగి ఉంటాడు. ఎవరి ప్రత్యేకత వారిది. నేను ప్రత్యేక వ్యక్తిని అని అనుకోలేని మనిషి తనని ఎదుటివారితో పోల్చుకుంటాడు. ప్రతి వ్యక్తీ ప్రత్యేకమైనప్పుడు ఇక పోల్చటానికి ఏముంటుంది. గులాబీ పూవు, మల్లెపూవుతో ఏవిధంగా పోల్చుకుంటుంది. ఈ సత్యాన్ని తెలుసుకుంటే మనం ఎదుటి వారితో పోల్చుకోవటం మానేస్తాము. నేను ప్రత్యేక వ్యక్తిని, నా ప్రత్యేకత నాది అనుకున్నవారు అసలు ఎవరితోనూ పోల్చుకోరు.

Content: ఎదుటి వారితో పోల్చుకుంటే నష్టం ఏమిటి?

Content: మీరు జాగృతంగా గమనిస్తే, మన జీవితంలో సగభాగం ఇతరులతో పోల్చుకోవటం వల్లనే గడిచిపోతుంది. మనం మన కోసం ఉపయోగించే శక్తిలో 60% ఎదుటివారి అభివృద్ధిని లెక్కలు కట్టటానికి, మనం వారితో పోలిస్తే ఎక్కడ ఉన్నమో లెక్క కట్టటానికి ఉపయోగిస్తాము. ఒక్క క్షణం ఆలోచించండి. ఆ అరవైశాతం శక్తిని కూడా మన అభివృద్ధికే ఉపయోగించగలిగితే మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో, మనలో ఎంత శాంతి ఆనందం ఉంటాయో ఊహించండి.

Content: ఒక చిన్న కథ :

Content: ఒక వ్యక్తి 1000 మీటర్ల పరుగుపందెంలో పరిగెడుతుంటాడు. 250 మీటర్లు పరిగెత్తాక ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాడు. అతను అందరికంటే ముందు ఉంటాడు. మరలా 500 మీటర్లు పరిగెత్తాక ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాడు. అతనే ముందు ఉంటాడు. అలాగే 750 మీటర్లు తరువాత వెనక్కి చూస్తే అతనే ముందు ఉంటాడు. చివరికి అతను గెలుస్తాడు.

Content: ఆ వ్యక్తి అసలు వెనక్కి తిరగకunda, తన పూర్తి శక్తిని కేవలం తన లక్ష్యం వైపు మాత్రమే ఉంచి ఉంటే బహుశా అతను ప్రపంచ రికార్డు సాధించి ఉండేవాడు.

Content: ఎవరి ప్రత్యేకత వారిది. ఎవరి జీవిత లక్ష్యం వారిది. అటువంటప్పుడు ఎదుటివారితో పోల్చుకొని మనం ఏమి అర్థం చేసుకోగలం. వారి ఆధారంగా మనం ఏమి సాధించగలం.

Content: ఎదుటివారితో పోల్చుకుంటే నష్టం ఏమిటి?

Content: ఎదుటివారితో పోల్చుకుంటే మనకి మిగిలేది వ్యధ, మానసిక కుంగుబాటు అంతే. మనం అంతకంటే

Page 37

Content: ఇంకా గొప్పవారము కాగలిగి ఉండి కూడా పోల్చుకుంటూ మన చిన్న పరిధిలో ఉండి పోతున్నాము. ఎదటి వారితో పోల్చుకుంటూ, వారిలా మనం పనులు చేశేమి, మహా సాధించగలిగే వారి స్థితిని చేరగలం. కానీ మన ప్రత్యేక శక్తియుక్తులని, మన లక్ష్యం వైపు ఉపయోగించి ఉంటే మనం ఇంకా గొప్పవారము అయి ఉండే వారం కదా!

Content: ఉదాహరణకి : బిల్‌గేట్స్ ఎవరితోనైనా పోల్చుకొని ఉంటే బహుశ ఒక కంపెనీకి మేనేజర్ అయి ఉండేవాడు అంతే. ఐ.ఎన్.ఎస్.టీన్ లేదా న్యూటన్ ఒకరితో పోల్చుకొని ఉంటే యూనివర్సిటీ ప్రొఫెసర్ అయి ఉండేవారు. పోల్చుకోవటం అనే విషయాన్ని వదిలివేస్తే మనం స్వేచ్ఛగా, ఆనందంగా మన పని మనం పూర్తి ఏకాగ్రతతో చేసి మంచి ఫలితాలు సాధించగలం. అప్పుడు మన జీవితం అద్భుతంగా, తృప్తిగా ఉంటుంది.

Content: మరొక చిన్న కథ : ఒక అందమైన చిన్ని రాజ్యానికి ఒక రాజు ఉంటాడు. ఆయన ఎప్పుడూ దిగులుగా, అశాంతిగా, అసంతృప్తితో ఉండేవాడు. ఆయన మంత్రులకి కారణం తెలియదు. ఆయన దిగులుగా ఉండవలసిన పరిస్థితులు ఆ రాజ్యంలో లేవు. ఆ దేశ ప్రజలు మంచివారు. దేశంలో అందరూ ధనవంతులు. దేశానికి పెద్దగా శతృభయం లేదు. రాజుగారి కోటుపులో అందరూ సమర్ధులే. మరి రాజుగారి అసంతృప్తి, దిగులుకి కారణం ఎవరికీ తెలియదు. ఆయనని ఎప్పుడూ ఆనందంగా ఉండటం ఎవరూ చూడలేదు.

Content: రాజు దిగులుకి కారణం ఏమిటంటే: ఆయన ప్రతి కణం తన ప్రక్కనే ఉన్న రాజు గురించే ఆలోచిస్తాడు. ఎప్పుడూ ఆ రాజుతో ఆ రాజ్యంతో పోల్చుకుంటూ ఉంటాడు. ఆ రాజ్యాన్ని చూసి అసూయతో మండిపోతుంటాడు. అతనికి ఆ రాజు తనకంటే గొప్పవాడు అనే భావం చాలా ఎక్కువగా ఉంటుంది. దానితో ఆ రాజ్యం మీద ఆ రాజుమీద ద్వేషం పెరుగుతుంది. కానీ ఆ రాజ్యాన్ని ఏమీ చేయలేడు. కారణం, ఆ రాజ్యం తన రాజ్యానికంటే చాలా రెట్లు పెద్దది. ఆ రాజు ఈయన కంటే చాలా ధనవంతుడు. చాలా మంచి వాడని, తెలివైనవాడని పేరు ఉంది. కాబట్టి ఆ రాజుని, రాజ్యాన్ని ఏమీ చేయలేననే దిగులు, అతనిని చూస్తే కలిగే అసూయతో ఆ రాజు కుంగిపోతుంటాడు.

Content: ఒక రోజు ఆయన వాళ్ళ కులగురువు యొక్క ఆశ్రమానికి వెళ్ళతాడు. గురువుగారు రాజుని కుశల ప్రశ్నలు అడిగిన తరువాత ఆశ్రమానికి వచ్చిన కారణం అడుగుతాడు. అప్పుడు రాజు తన మనస్సులోని బాధని చెప్పి గురువుగారితో ఇలా అంటాడు, “గురుదేవా! మీ దగ్గర అద్భుతమయిన మహిమలు, గొప్ప మంత్రాలు ఉంటాయి కదా! నాకు ఏదైనా ఒక మంత్రాన్ని నేర్పించండి. దాని మహిమతో నేను నా ప్రక్కనే ఉన్న రాజుని ఓడించి ఆ రాజ్యాన్ని సాధించుతాను. దయచేసి నాకు ఈ సహాయం చేసి నాలోని దుఃఖాన్ని, వేదనని తొలగించండి!” అని ప్రార్థించుతాడు.

Content: రాజుగారు చెప్పినదంతా చాలా ఓపికగా విని, రాజుతో, “రాజా! ఈప్రక్కన పూలతోటలో చక్కని గులాబీ మొక్క ఉంది, దాని ప్రక్కనే ఒక కానగ చెట్టు ఉంది. వాటిని జాగ్రత్తగా గమనించు. అవి నీకు కావలసిన విషయాలని నేర్పించుతాయి” అని అంటారు గురువు గారు

Page 38

Content: గురువు గారు చెప్పిన విధంగా రాజు తోటలో ఉన్న గులాబి చెట్టు దగ్గరకి వెళతాడు. గులాబి చెట్టు ప్రక్కనే ఉన్నకానగ చెట్టుని చాలాసేపు గమనించుతాడు. కానీ అతనికి ఏమీ అర్థం కాదు. కొంచెం‌సేపు అలా వాటిని చూసి గురువుగారి కుటీరానికి తిరిగి వస్తాడు.

Content: గురువుగారితో రాజు ఇలా అంటాడు "గురుదేవా! ఆ చెట్టుని చూసాను కానీ నాకు ఏమీ అర్థం కాలేదు. అవి నాకు ఏమి నేర్పించుతాయి?" అని అంటాడు.

Content: అప్పుడు గురువుగారు రాజుని తీసుకొని ఆ చెట్టు దగ్గరకి వస్తాడు. ఈ గులాబి మొక్క కానగ చెట్టు చాలా కాలం నుంచి ఇలా ప్రక్కప్రక్కనే ఉన్నాయి. కానగ చెట్టు ఏనాడు తాను గులాబి మొక్కలా ఉండాలి అని కోరుకోలేదు. అదే విధంగా గులాబి మొక్క ఎప్పుడు తాను కానగ మొక్కలా ఉండాలి అని ఆశించలేదు. అవి వాటి బాధ్యతలని నెరవేర్చుతూ ఆనందంగా, హాయిగా పెరిగి పెద్దవవుతున్నాయి.

Content: అదే గనక ఒక మనిషి కానగ చెట్టు స్థానంలో ఉండి ఉంటే అతను నిరంతరం ఆ గులాబి చెట్టు వైపు చూస్తూ, దాని అందంతో తనని తాను పోల్చుకుంటూ అసూయతో రగిలిపోయేవాడు. తోటలోనికి వచ్చిన ప్రతి వ్యక్తి గులాబి మొక్క దగ్గరకే వచ్చి, దాని అందానికి ఆనందిస్తూ ఆ పూలని మాత్రమే కోసుకుంటూ ఉంటే అది చూసి మరింత కుంగిపోయేవాడు. తనకి ఉన్న శక్తిని మొత్తం ఇలా పోల్చుకుని బాధపడటానికే ఉపయోగించేవాడు.

Content: అదే విధంగా గులాబి మొక్క స్థానంలో మనిషి ఉండి ఉంటే, అతను తన ప్రక్కనే బలంగా ఎత్తుగా, పెద్దగా ఉన్న కానగ చెట్టుని చూసి దానితో తనని తాను పోల్చుకుని బాధపడేవాడు. తోటలోనికి ఎవరు వచ్చినా అందరూ నవ్వే విసిగిపోతారు. వాళ్ళు కోసిన పూలని హృదయపైదుపెట్టుకుంటారు. నవ్వు ఒక క్షణం ప్రశాంతంగా ఉండవేయరు. నా బృతకే ఇటువంటిది. అదే కానగ చెట్టు దగ్గరకి ఎవరురారు. దానిని ఎవరూ బాధించరు. దాని ప్రశాంతతని పాడుచేయరు. అది చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. కానగ ఎంత అదృష్టవంతురాలు అని ఇంకాస్త బాధపడేవాడు.

Content: కానీ రాజా! ఈ మొక్కలు ఏ మాత్రం తన ప్రక్కవాటి మీద దృష్టి పెట్టి ఉండి ఉంటే అవి ఇంత అందంగా, బలంగా పెరిగవు కదా! నీకు ఉన్న శక్తియుక్తులని నీతెలివి తేటలని, నీ సమయాన్ని కేవలం నీ రాజ్యం మీద మాత్రమే పెడితే నీ దేశం మరింత అభివృద్ధి అవుతుంది. నీవు ఆనందంగా తృప్తిగా జీవించగలవు కదా! ఇదే నేను నీకు ఇచ్చే మహిమగల మంత్రం. ఈ మంత్రాన్ని పాటిస్తే త్వరలోనే నీవు చాలా గొప్ప ధనవంతుడిగా అవుతావు, నీ దేశాన్ని స్వర్గంగా తీర్చిదిద్దగలుగుతావు అని అంటాడు.

Content: ఈ ప్రపంచంలో ఏదీ నీది కాదు : ఏదీ శాశ్వతం కాదు

Content: ఈ భూమి మీద ఉన్న ప్రాణులు అన్నింటిలోనూ మనిషి అత్యంత తెలివితేటలు కలిగిన ప్రాణి అని అంటారు. కానీ అంత మేధస్సు కలిగిన మనిషి అత్యంత సామాన్యుడైనది, ప్రతి నిత్యం తన కళ్ళముందు నిలబడి ఉన్న సత్యాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నాడు. ఆ సత్యం " ఈ ప్రపంచంలో ఏదీ తనది కాదు. ఏదీ శాశ్వతం కాదు. మనిషి ఎంత మహాసాహ్రాజ్యాలు పొందినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా, కొంతకాలం వాటికి సంరక్షకుడిగా ఉండి, వాటిని తిరిగి సర్వాంతర్యామికి అప్పచెప్పి వెళ్ళిపోవలసినదే.

Page 39

Content: ఒక్క నిముషం జాగ్రత్తగా ఆలోచించండి. మన చుట్టుప్రక్కల ఉన్న ఈ స్థలాలు, ఇళ్ళు, పొలాలు వీటికోసం ఎంతమంది రాజులు ఎందరిని చంపి వుంటారో, ఎందరు జమిందారులు, భూస్వాములు ఎంతమందికి అన్యాయం చేసి ఉంటారో. కేవలం కొద్దికాలం వాటికి సంరక్షకులుగా ఉండటం కోసం వాళ్ళు ఎన్ని దారుణాలు చేసారో, నిరంతరం ఆ అపరాధ భావంతో ఎంత అశాంతిగా బ్రతికి ఉంటారో మనం ఊహించగలం.

Content: సంపాదించిన ఆస్తులు కాపాడుకోవటంలో మరొకరకమయిన క్రోధకి గురిఅవుతారు. శత్రురాజు ఏ క్షణాన తన రాజ్యం మీదకి వస్తాడో అని, తన భూమిని ఆక్రమిస్తాడో అనే భయంతో ఎన్ని రాత్రులు నిద్రలేకుండా గడిపిపుంటాడో. కష్టపడి సంపాదించిన ఆస్తులని కాపాడుకోవటంలో భోజనం చేయికుండా ఎన్ని రోజులు గడిపి ఉంటాడో. పరిగెత్తి, పరిగెత్తి సంపాదించిన ఆస్తికి కాపాలా కాస్తూ అవ్యయాలమయిన జీవితాన్ని జీవించటం మర్చిపోయారు. జీవిత కాలంతో కనీసం ఒక్క రోజయిన విరామంగా నిలబడి, తను సంపాదించిన ఆస్తిని కానీ, భగవంతుడు తనకి ఇచ్చిన వరాలని కాని తృప్తిగా చూసుకోని, వాటిని ఆనందంగా అనుభవించి ఉండడు. ఎందుకంటే అలా నిలబడితే తన సంపాదన ఆగిపోతుందని భయం. మరణించే వరకూ పరుగుపెట్టటమే కాని నిలబడి తృప్తిగా ఆనందించటానికి భయం. అలా చేస్తే ఆ తరువాత మరొకటి సంపాదించలేము అని భయం.

Content: ఒక చిన్న కథ :

Content: ఒక రైతు ఏదో కొన్ని కారణాల వలన తనకున్న కొద్దిపాటి పొలాన్ని పోగొట్టుకుంటాడు. అతను చాలా పేదస్థితికి వెళ్ళిపోతాడు. ఏమీ చేయలేని స్థితిలో “భగవంతుడా నీవే నాకు దిక్కు” అని మనస్పూర్తిగా భగవంతుడిన శరణు వేడతాడు. ఆతని ప్రార్థనని ఆలకించిన భగవంతుడు ప్రత్యక్షమై, ఎప్పికావాలో కోరుకోమని అడుగుతాడు.

Content: రైతు పరమాసనందభరితుడై, భగవంతుడికి నమస్కరిస్తూ, “దేవాది దేవా! కరుణామూర్తి! ఈ పేదవాడి మీద దయ చూపించవా! నీకు వేల వేల కృతజ్ఞతలు. స్వామీ! నాకు కొంచం భూమి ఇప్పించితే అందులో వ్యవసాయం చేసుకొని నేను నాకుటుంబం హాయిగా ఉంటాము ” అని పదే పదే ప్రార్థించుతాడు.

Content: భగవంతుడు చాలా అందమయిన చిరునవ్వు నవ్వి “తధాస్తు! నీకు ఎంత భూమి కావాలో అంత తీసుకో” అంటాడు.

Content: రైతు కొంచం అయోమయంగా చూస్తాడు. అప్పుడు భగవంతుడు, “రేపు సూర్యోదయం కాగానే నీవు కాలినడకన సూర్యాస్తమయం వరకూ ఎంత దూరం నడిస్తే ఆ భూమి అంతా నీ సొంతమవుతుంది” అని దేవుడు మాయం అవుతాడు. రైతు ఆనందానికి అవధులు ఉండవు. ఎప్పుడు తెల్లవారుతుందా అని చూస్తూ ఉంటాడు.

Content: మర్నాడు సూర్యోదయం కాగానే రైతు నడవటం మొదలు పెడతాడు. అలా కొన్ని గంటలు నడిచాక అతను పోగొట్టుకున్న భూమిని సంపాదిస్తాడు. ఇప్పుడు అతనిలో ఆశ మొదలవుతుంది. అప్పుడు అతను, “అదేమిటి, నేను ఎందుకు నడుస్తూ టైం అంతా వృధా చేస్తున్నాను. పరిగెడితే ఇంకా చాలా భూమిని సంపాదించవచ్చు కదా!” అని అనుకొని పరిగెడటం మొదలు పెడతాడు.

Content: అలా మధ్యాహ్నం వరకూ పరిగెడతాడు. విపరీతమయిన దాహం వేస్తుంది. కానీ మంచినీళ్ళు తాగటానికి ఆగితే కొంత భూమి పోతుందేమో అని భయపడి అలాగే పరిగెడతాడు. మరికొంత సేపటికి ఆకలి, నీరసం

Page 40

Content: ఎక్కువ అయిపోతాయి. అయినా లేని ఓపికని తెచ్చుకొని పరిగెడుతుంటాడు. ఇంకా నీరసం వచ్చి పరిగెత్తలేకపోతాడు. అయినా తనకి తాను ఇలా చెప్పుకుంటాడు, “ఈ రోజు ఏమయినా సరే నేను ఒకక్షణం కూడా వృధా చేయను. ఒక్కరోజు మరే పనీ చేయను. మంచినీళ్ళు, ఆహారం ఏమీ తీసుకోను. ఒక నిముషం కూడా విశ్రాంతి తీసుకోను. నేను ఇంకా చాలా భూమిని చుట్టబెట్టాలి. దానికి అధికారిని కావాలి” అని పరిగెడుతుంటాడు. అలా సూర్యాస్తమయం అయ్యే సమయానికి పరిగెత్తి పరిగెత్తి కిందపడి చనిపోతాడు. పరిగెత్తి పరిగెత్తి సంపాదించిన భూమిని ఒకక్షణం కూడా తృప్తిగా చూసుకోలేదు. అత్యాశకి పోయి అమూల్యమయిన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. మనసందరం కూడా ఇంచుమించు అదే స్థితిలో ఉన్నాము. ఎప్పుడూ పరిగెత్తటమే. ఎందుకు పరిగెడుతున్నాము? ఎక్కడికి? ఏమి సాధించటానికి ఈ ఆతృత? ఒక్క క్షణం నిలబడి భగవంతుడు మనికి ఇచ్చిన ఎన్నో అద్భుతవరాలని అనుభవించి తృప్తిపడటం లేదు. ఎంతసేపూ ఆ తరువాత ఏమిటి? ఇంకా ఏమిటి అనుకోపటమే. ఇలా పరిగెత్తటం ఎంత అమాయకత్వమో కదా! ప్రకృతిలో మరే ప్రాణి ఇలా జీవితాన్ని జీవించటం మనం పరిగెత్తటం లేదు. ఏవీ అమాయకంగా జీవితాన్ని బలిపెట్టి ఆస్తులు కూడబెట్టటం లేదు. అవి అందమయిన ఈ ప్రపంచంలో, ప్రకృతిలో ఒక భాగంగా జీవిస్తాయి. ప్రతి నిముషం అత్యంత ఆనందంగా సంబరాలు చేసుకుంటాయి. ప్రతి క్షణం ఒక ఉత్సవంలా జీవిస్తాయి. కేవలం ఆనందం తప్పా మరే భావం లేకుండా చనిపోతాయి. కేవలం మనిషి మాత్రమే నిత్యం వ్యధలు, బాధ, కోపం, నిరాశ, అసంతృప్తి, కుంగుబాటుతనం, అపరాధభావం వీటితో జీవిస్తూ జీవితం అంటే ఉత్సాహం అని, జీవితంలో ప్రతిక్షణం ఒక పందెం లాగా జీవించాలనే విసయాన్ని పరిచోత్సాహంతో జీవితాన్ని నిరాశతో లాగుతున్నాడు. అది ఎలా ఉంటుందంటే మరణాన్ని వాయిదా వేస్తున్నటే ఉంటుంది, కానీ మనిషి జీవిస్తున్నట్టుగా ఉండదు.

Content: ఎప్పడయితే మనం ఇది నాది, నేను దీనిని పొందాలి, నేను దీనికి అధికారిని అవ్వాలి అనే భావనని వదిలిపెడతామో అప్పుడు మనం శాశ్వతమయిన ఆనందాన్ని పొందగలుగుతాము. జీవితం అనేది ఎంత అందంగా, ఎంత అద్భుతంగా ఉంటుందో, ఆ స్వేచ్ఛలోని ఆనందం ఎంత మధురంగా ఉంటుందో అనుభవించగలుగుతాము. అప్పుడు మనం పొందే ఆనందం ఎన్ని కోట్లు ఆస్తి అయినా మనకి ఇవ్వలేదు. ఎప్పడయితే నాది అనే దానిని వదిలివేస్తామో, జీవితం తేలికగా, స్వేచ్ఛగా అందంగా ఉంటుంది. ప్రతీ క్షణం ఒక ఉత్సవంలా జీవితాన్ని గడపవచ్చు.

Content: మీ అంతరంగంలో ఎన్నో గాయాలు ఉన్నాయి. అవి మీలోని కోపం, అసూయ, అసంతృప్తి, అత్యాశ, అశాంతి, మానసిక ఒత్తిడి అనే వాటి ద్వారా ఏర్పడ్డాయి. అదే విధంగా మీరు ఇతరులతో పోల్చుకుంటూ, వాళ్ళు పరిగెడుతున్నారు కాబట్టి మీరూ పరిగెడుతున్నారు. ఆ విధంగా ఇతరుల ద్వారా, సమాజం ద్వారా ఏర్పడిన గాయాలు మరికొన్ని ఇన్ని గాయాలు అంతరంగం నిండా ఉన్నప్పుడు మీకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది. ఈ గాయాలని మాన్పగల దివ్య మంత్రం ఒకటి ఉంది, అది ఈ ప్రపంచంలో ఏదీ నా సొంతం కాదు ప్రతిదీ భగవంతునికి వదిలివేయవలసినదే. ఏదీ శాశ్వతం కాదు. నేను, నాది అనేది కేవలం నా అమాయికత్వం " అని తెలుసుకోవటమే దివ్యమంత్రం. అది గొప్ప మందులా పనిచేసి గాయాలన్నింటినీ ఒక్క క్షణంలో మాన్పగలుగుతుంది. అప్పుడు మీ అంతరంగం అద్భుతమయిన ఆనందం, తృప్తి, శాంతితో నిండిపోతుంది.

Page 41

Content: ఆ అనుభూతిని ఆ పరమానందాన్ని ఒక్కసారి అనుభవించినా చాలు, దాని గొప్పదనం మీకు అర్థమవుతుంది. మీరు మీతో ఉండగలగటం నేర్చుకోవాలి. మీరు మీ మీద ఏకాగ్రతని నిలిపి, మీతో ఉండగలిగితే వి|శాంతిగా, విరామంగా ఉండగలుగుతారు. అప్పుడు మీకు నిజంగా ఏమి కావాలో తెలుస్తుంది. అప్పుడు మీరు సరియైన నిర్ణయాలు చేయగలుగుతారు. అనవసరంగా పరుగులు పెట్టరు.

Content: ఒక చిన్న కథ : ఒక యోగిశ్వరుడు - అలెగ్జాండరు : అలెగ్జాండరు గ్రీకుదేశానికి రాజు. అతడు యువకుడు. గొప్ప యోధుడు. అతనికి ప్రపంచాన్ని గెలవాలి, ప్రపంచానికి చ|క్రవర్తిని కావాలి అనే కోరిక కలిగింది. వెంటనే పెద్ద సైన్యాన్ని తీసుకొని తూర్పుదిశగా ఒక్కొక్క రాజ్యాన్ని జయించుతూ వస్తాడు. చివరగా అతను భారతదేశం చేరతాడు. భారతదేశపు సరిహద్దులలోని రాజులని జయించి తన ప్రతినిధులని ఉంచుతాడు.

Content: అతను భారతదేశపు సంస్కృతి, సంప్రదాయాలు, విజ్ఞానము చూసి ఆశ్చర్యపోతాడు. వారి వైభవానికి కారణం వారికి ఉన్న వేదాలు, జ్ఞానోదయమయిన యోగిశ్వరులు అని తెలుసుకుంటాడు. అతనికి ఆ విజ్ఞానాన్ని తన దేశానికి తీసుకువెళ్ళాలి అనే కోరిక కలుగుతుంది.

Content: అలెగ్జాండర్ తనతో భారతదేశం నుంచి జ్ఞానోదయం అయిన యోగిని అలాగే వేదాలని తీసుకు వెళ్ళాలి అని అనుకుంటాడు. వాళ్ళ సహాయంతో తన దేశాన్ని బాగా అభివృద్ధి చేయగలను అని నిర్ణయించుకుంటాడు. అతను అనుకోకుండా ఒక జ్ఞానోదయమయిన యోగిని కలుస్తాడు.

Content: అలెగ్జాండర్, యోగిశ్వరుని చూసి చాలా సంతోషపడతాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, “దయచేసి మీరు నాతో మా దేశానికి రండి” అని ఆహ్వానించుతాడు.అలెగ్జాండర్ ఆహ్వానానికి యోగిశ్వరుడు నవ్వి, “ నేను రాను. నాకు ఎక్కడికీ రావాలని లేదు. నేను ఇక్కడే ఉంటాను” అని అంటాడు. అప్పుడు అలెగ్జాండరు, “మీరు అలా అనవద్దు. మీరు మా దేశానికి రండి. మీరు అక్కడికి వస్తే మీకు గొప్ప రాజభవనాన్ని ఇస్తాను. మీరు ఇక్కడ కేవలం ఒక బిక్షగానిలా ఉన్నారు. మీకు కట్టుకోవటానికి సరియైన బట్టలు కూడా లేవు. మీరు మా దేశానికి వస్తే మీకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను. దయచేసి నాతో మా దేశానికి రండి” అని అంటాడు.

Content: అప్పుడు యోగి నవ్వి, “ నేను రాను. నేను ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నాను. నాకు ఎక్కడికీ వెళ్ళాలని లేదు” అంటాడు.

Content: అప్పుడు ఏమయి ఉంటుందో మీకుతెలుసు : అలెగ్జాండరు ఒక చక్రవర్తి, యోధుడు, బాగా తెలివైనవాడు. అతను ముందుగా యోగికి ఆశలు చూపించి ఆధీనం చేసుకోవాలి అని అనుకుంటాడు. అది పని చేయలేదు ఇప్పుడు భయపెట్టి తనతో తీసుకువెళ్ళాలి అని అనుకుంటాడు. అప్పుడు తన కత్తిని బయటికి తీసి “ నీవు నాతో రాకపోతే నిన్ను చంపేస్తాను” అంటాడు అలెగ్జాండరు.

Content: అలెగ్జాండరుని, అతని కత్తిని చూసి మరింత నవ్వతాడు ఆయోగి. ఒక మామూలు వ్యక్తి, ఒక సన్యాసి గొప్ప చక్రవర్తిని, అతని కత్తిని చూసి నవ్వటం అంటే సామాన్య విషయం కాదు. రాజు ఏమి చేసినా అడిగేవారు ఉండరు తక్కువ వాడ! నీవు అబద్దాలకొరవి అంటాడు.”

Page 42

Content: గౌప్ప యోధుడయిన అలెగ్జాండరు, జీవితంలో మొదటిసారి భయపడతాడు. అతను యోగిని చూస్తూ, "నీకు భయం వేయటం లేదా?" అని అడుగుతాడు.

Content: అప్పుడు యోగి, "నీవు నన్ను ఎప్పటికీ చంపలేవు. నీవు నా ఈ శరీరాన్ని నాశనం చేయగలవేమో కాని నన్ను మాత్రం ఏమీ చేయలేవు" అంటాడు.

Content: ఆ యోగికి ఆ ధైర్యం, తనపై తనకి ఆ నమ్మకం అతని అనుభవం ద్వారా వచ్చాయి. ఆధ్యాత్మిక అనుభవం అతనిని ఆ విధంగా నిలబెట్టాయి.

Content: అలెగ్జాండరు ఆశ్చర్యపోతాడు. ఆ యోగిశ్వరుడి వైపు చూస్తూ "నీవు ఇంత ధైర్యంగా ఎలా ఉండగలిగావు?" అని అడుగుతాడు.

Content: అప్పుడు యోగి అలెగ్జాండర్ని, "నీవు భారతదేశానికి ఎందుకు వచ్చావు" అని అడుగుతాడు. భారతదేశాన్ని జయించటానికి వచ్చాను అని అలెగ్జాండరు జవాబు ఇస్తాడు.

Content: 'ఆ తరువాత ఏమి చేస్తావు', అని యోగి ప్రశ్నిస్తాడు. మరొక దేశాన్ని జయించుతాను అని జవాబు ఇస్తాడు అలెగ్జాండరు.

Content: "ఆ తరువాత?" అని అడుగుతాడు యోగి.

Content: "హాయిగా విశ్రాంతిగా ఉంటూ ఆనందంగా ఉంటాను", అంటాడు అలెగ్జాండరు. అప్పుడు యోగి, “ ఓ తెలివితక్కువ వాడా! నేను ప్రస్తుతం అదే స్థితిలో ఆనందంగా ఉన్నాను” అంటాడు.

Content: అలెగ్జాండరుకు తాను ఎంత మూర్ఖుడో, ఎంత తెలివిహీనుడో అర్థమయింది. తాను ప్రయాణాన్ని జయించాడు కానీ అపూర్వమయిన ఆనందాన్ని అదృష్టమయిన జీవితాన్ని పోగొట్టుకున్నాను అని తెలుసుకున్నాడు. ఈ రాజ్యాలు, గెలుపు తనతో రావు అని తెలుసుకున్నాడు. అందుకే అతను తన మంత్రులతో ఈ విధంగా చెబుతాడు.

Content: "నేను మరణించాక, నా పార్థివ శరీరాన్ని తీసుకు వెళ్ళేటప్పుడు నా చేతులు బయటికి పెట్టండి. ప్రజలందరికీ, అలెగ్జాండర్ అంతటివాడు కూడా మరణించాక తనతో ఏమీ తీసుకువెళ్ళటం లేదు అని తెలుసుకోవాలి. ఇది నా కోరిక".

Content: ఈ కథలో మనకి మూడు విషయాలు అర్థమవుతాయి. జ్ఞానోదయమయిన యోగిశ్వరులలో ధైర్యం, నమ్మకం ఋజువుగా కనిపిస్తాయి. ప్రపంచంలోని విషయాల వెనుక పరిగెత్తటం వలన ఉపయోగం లేదు.

Content: విశ్రాంతిగా ఉంటూ జీవితాన్ని ప్రతి క్షణం ఆనందంగా గడపగలగాలి. ఆ యోగిశ్వరుడికి ఏమీ లేవు కాని గొప్ప పరమానందంలో ఉంటూ జీవితాన్ని ఉత్సవంగా గడువుతున్నాడు.

Content: మన ఈ ప్రపంచంలో ఎంత సంపాదించినా, మనతో ఏమీ తీసుకువెళ్ళము. మీ కీర్తి ప్రతిష్టలు, ఆస్తి అంతస్తులు ఏవే మీరు తీసుకువెళ్ళలేరు. ఈ ప్రపంచమంతా మిమ్మలను గొప్ప చక్రవర్తి అని అభిమానించి ఆరాధించినా దానిని మీతో తీసుకువెళ్ళలేరు. మీరు ఖాళీ చేతులతోనే వెళతారు. సంపాదించినది మొత్తం తిరిగి ఆ సర్వాంతర్యామికి వదిలి మరీ వెళతారు.

Page 43

Content: భగవంతుడికి కృతజ్ఞతతో పూజించాలి, ప్రేమతో దరి చేరాలి.

Content: భగవంతుడు, దేవుడు మరే పేరుతో పిలిచినా సరే, ఆయన సర్వాంతర్యామి. ఆయన విశ్వశక్తి, అత్యుత్తమ అత్యున్నత చేతనస్థితి. ఆ విశ్వశక్తే ప్రతి మనిషిలోనూ ప్రతి ప్రాణిలోనూ జీవశక్తిగా ఉంటుంది. అందుకే ప్రతి ప్రాణి దేవుని రూపమే. భగవంతుడు సర్వశక్తి సంపన్నుడు. ఆయన మహోదారవి, కరుణామూర్తి ప్రేమమూర్తి.

Content: అటువంటి భగవంతుని మనం భయం, భక్తిపేరుతో దూరం చేసుకోకూడదు. గౌరవం అనే భావంతోఎక్కడో పైన పెట్టి మనం దూరం వెళ్ళి పోకూడదు. ఆయనని కృతజ్ఞతతో, ప్రేమతో పూజించాలి. భగవంతునితో ఉండే బంధుత్వం, సంబంధమే అన్ని సంబంధ బాంధవ్యాలలోనికి ఉత్తమోత్తమయినది. ఆయనే అన్ని రకాల బంధుత్వాలు.

Content: కష్టకాలంలో రక్షణ ఇచ్చే తండ్రి ఆ దేవుడే. మానసికంగా బలహీనులమయినప్పుడు తన ఒడిలో లాలించే తల్లి ప్రేమ ఆ భగవంతుడే. ఒక ప్రేమికునిగా, ఒక ప్రియునిగా ఆటలాడి ఆనందపరచే ప్రేమశక్తి ఆ దేవదేవడే. ఒక స్నేహితునిగా ఆదరించినా, గురువుగా మంచిమార్గంలో పెట్టినా, ఆ శక్తి ఆ భగవంతుడే.

Content: మనం ఏ బంధుత్వంతో దగ్గరయితే మనని అలా ఆదరిస్తాడు. ఏమే లేదు! దేవా నాపల్లకాడు. నీవే దిక్కు అని ఆయన పాదాల శరణు వేడితే, తన హృదయానికి హత్తుకునే గొప్ప బంధువు, యజమాని అన్నీ ఆయనే.

Content: కానీ ఆయనని మన నుంచి వేరే చేసే ఒక శక్తివంతమయిన అంశం మనలో ఉన్నది. అదే మనలోని అహంకారం. కొందరిలో అహంకారం స్పష్టంగా కనిపిస్తుంది. కొందరిలో వారికే తెలియకుండా అహంకారం ఉంటుంది. ఎవరైతే అహంకారాన్ని హృదయంగా తృప్తిపరుస్తారో, ఎవరిలో అయితే అహంకారం అనే అసలు ఉంటుందో, ఎవరైతే అహంకారంతోనే పూర్తి అమాయకత్వంతో ఉంటారో వారికి భగవంతుడు చాలా దగ్గర చుట్టము. తెలిసి గాని తెలియక గాని అహంకారంతో ఉండి, ఆ భగవంతునికి ఎన్ని పూజలు, ఎన్ని యాగాలు ఎన్ని అభిషేకాలు చేసినా వ్యర్థం. ఆయన కోసం అహం తప్పా అన్ని సన్యసించి కలోరా తపస్సు చేసినా ఆయనదొరకడు. అందుకే ఆయనని భక్త సులభుడు అంటారు కాని జ్ఞాన సులభుడు అనరు. ఈ విషయాన్ని వివరిస్తూ పరమహంస ఒక చిన్నది చక్కని కథని చెబుతారు.

Content: చిన్నకథ :

Content: గోపికలు - రుషులు :

Content: శ్రీ కృష్ణుడు జన్మించి, పెరిగి పెద్దవాడయిన గోకులం అనబడే బృందావనం చాలా అందమైన పల్లె. అక్కడి గోపాలురు, గోపికలు అమాయకమయిన పల్లె ప్రజలు. గోవులని మేపుతూ ఆ పాలు పెరుగులే వారి ఆస్తిపాస్తులుగా జీవించే సామాన్యులు.

Content: బృందావనానికి కొంచం దూరంలో ఉండే అరణ్యంలో చాలా మంది ఋషుల తపస్సు చేసుకుంటూ నిరంతరం ధ్యానస్థితిలో ఉండేవారు. వారికి అవసరమయిన పళ్ళూ, పాలు గోకులంలోని గోపాలురు, గోపికలు భక్తితో ఇస్తుండేవారు.

Content: శ్రీకృష్ణుడు జన్మించాక గోకులంలోని స్త్రీ పురుషులకీ, పిల్లలకీ పెద్దలకీ నిరంతరం శ్రీకృష్ణుడు ధ్యాసే ఉండేది. వారు ఏమాత్రం సమయం దొరికినా శ్రీకృష్ణుని సన్నిధికి చేరేవారు. ఆ పరంధాముని సన్నిధిలో,

Page 44

Content: ఆయన సమక్షంలో అంతలేని పరమానందాన్ని పొందేవారు. ఆయన ఉన్న పరిసరాలలో ఉండి, అద్భుతమయిన ఆధ్యాత్మిక అనుభవాలు పొందేవారు. శ్రీకృష్ణుడు చెలిమిలో నిరంతరం ఆనంద పారవశ్యంలో మునిగి ఉండేవారు. వారు కృష్ణుని తప్ప మిగతా విషయాలన్ని మరిచిపోయారు. వారి జీవితం, ధ్యేయం, సుఖం, దుఃఖం, సంతోషం, ఉత్సాహం, సర్వం శ్రీకృష్ణుడే, శ్రీ కృష్ణుని ప్రేమలో, ఆయన ఆటపాటల లీలలలో వారు ప్రపంచాన్నే మరిచిపోయారు.

Content: ఈ క్రమంలో రోజులు గడచే కొద్దీ వారు రుషులకి చేసే మర్యాదలలో లోటు వస్తుండేది. వారు క్రమంగా రుషుల దగ్గరకి వెళ్ళటం తగ్గించారు. గోకుల వాసుల నిర్లక్ష్యం మహా జ్ఞానులు, తపో సంపన్నులు ఆయన రుషులకి కోపం తెప్పించింది.

Content: విషయం ఏమిటో తెలసుకొని గోపాలురుకి, గోపికలకి బుద్ధి చెప్పాలని రుషులు గోకులానికి వస్తారు. వారికి ఎక్కడా జన సమూహాలు కనిపించచు. వారు ఇంకా ముందుకి వెళితే అక్కడ కొంతమంది గోపికలు కనిపిస్తారు.

Content: వారు రుషులని చూడగానే భక్తి మర్యాదలతో వారికి సమస్కరించుతారు. వారి భక్తిని పట్టించుకోకుండా, రుషులు గోకులవాసుల నిర్లక్ష్యానికి వారి అగ్రహాన్ని వెల్లడిస్తారు. వారు కోపంతో “మీ గోకులవాసులు మమ్మలని నిర్లక్ష్యం చేస్తున్నారు. మాకు తగిన గౌరవ మర్యాదలని ఇవ్వటం లేదు. మాకు కోపం వస్తే మీరు తగిన ఫలితాలు అనుభవిస్తారు” అని గట్టిగా చెబుతారు.

Content: కాని గోపికలు, వారి కోపానికి, వారి మాటలకి అసలు భయపడరు. గోపికల ధైర్యానికి రుషుల ఆశ్చర్యపోతారు. “మేము ఎవరో మా గొప్పదనం ఏమిటో మీకు తెలుసా” అని వారిని హుంకరిస్తూ అడుగుతారు. గోపికలు తెలియదు అంటారు.

Content: “మేము రుషులము. అది వులలో నిరంతరం తపోదీక్షలో ఉంటాము. మేము వేదవేదాంగాలు చదివిన జ్ఞానులం” అంటారు. అప్పుడు గోపికలు వారివైపు ఆశ్చర్యంగా చూస్తూ “మహాత్ములారా! తపస్సు అంటే ఏమి చేస్తారు” అని అమాయకంగా అడుగుతారు.

Content: వారి అమాయకత్వానికి, అజ్ఞానానికి రుషుల జాలి పడి, వారితో ఇలా అంటారు, “మేము నిరంతరం ఆ భగవంతుని ధ్యాసలో ఉంటాము. ఆ దేవదేవుని పాదలపై ధ్యానం చేస్తుంటాము”.

Content: “అలా ఎందుకు చేస్తారు?” ఇంకా అమాయకంగా ప్రశ్నిస్తారు గోపికలు. గోపికలని చూస్తూ, “అలా తపస్సు చేస్తే భగవంతుడు మాకు దర్శనాన్ని ఇస్తాడు. మాకు ఆత్మసాక్షాత్కారం కలిగించి జ్ఞానోదయమయ్యేలా చేస్తాడు. ఆ భగవందనుగ్రహం కోసం, భగవత్ సాక్షాత్కారం కోసం ఎన్నో జన్మలుగా ఎందరో మునులు తపస్సు చేస్తున్నారు. అయినా లోకజ్ఞానం లేని అమాయకులయిన మీకు ఈవిషయాలు అర్థం కావు. మీ వారందరూ ఎక్కడ. వారికి మేము వచ్చిన విషయం తెలియచేయండి” అంటారు.

Content: “మహాత్ములయిన తపోదనులారా! మీరు భగవంతుని కోసం అరణ్యాలలో తపస్సు చేస్తున్నారు. భగవదనుగ్రహం కోసం ఎన్నో గ్రంథాలు చదివి గొప్ప జ్ఞానాన్ని పొందారు. చాలా గొప్పవిషయం ఇది. కానీ అక్షరజ్ఞానం లేని మా గోకులవాసులం భగవంతునితో ఆడుకొంటున్నాము. మీరు అలా యమునానది ఒడ్డు

Page 45

Content: వెళితే అక్కడ భగవంతునితో ఆడుతూ,పాడుతూ, నాట్యాలు చేస్తూ పరమానందపు పారవశ్యంలో మునిగి ఉన్న మా గోకుల వాసులు కనిపిస్తారు. ఆ ఆనంద పారవశ్యంలో మైమరచి మావారు మిమ్మలని గమనించకపోతే దయచేసి క్షమించండి" అంటూ వినయంగా, అమాయకంగా చెబుతారు గోపికలు

Content: ఎవరైతే పరిపూర్ణంగా ఆ భగవంతుని ఆధీనులవుతారో భగవంతుడు వారికి సొంతమవుతాడు. అక్షర జ్ఞానం, లోక జ్ఞానం అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం కూడా లేని గోకులవాసులకి భగవంతునికి మధ్య నిలబడే జ్ఞానం, హేతువాదం, శాస్త్రీయత, అహంకారం, మేధస్సు ఇలాంటి అడ్డుగోడలు ఉండవు. వారికి సంపూర్ణంగా నమ్మటం సంపూర్ణంగా ఆధీసులై ప్రేమించటమే తెలుసు. అందుకే భగవంతుడు వారితో నాట్యం చేసాడు. పాటలు పాడాడు. చక్కని ఆటలు ఆడుకున్నాడు. గోకులం వారికి కృష్ణుడితో వాదించటం రాదు, ప్రశ్నలు అడగటం తెలియదు. కేవలం ప్రేమించటమే తెలుసు అందుకే వారు ధన్యులు.

Content: భగవంతునికి ఆధీనులవటం అంటే ఏమిటి?

Content: భగవంతునికి ఆధీనమవటం అనేది నిబంధనలతో ఉండకూడదు. అది సంపూర్ణంగా జరగాలి. అందులో 'అయితే' 'కానీ' వంటివి ఉండకూడదు. నీవు నా ఈ కోరిక తీరిస్తే నేను నీకు ఆధీనమవుతాను లేదా మరొక దేవుడిని చూసుకుంటాను అనే పద్ధతి భక్తి కాదు, వ్యాపారం. స్పష్టంగా అర్థం చేసుకోండి. భగవంతుడు అంటే మేధస్సు. ఆయనకి సమస్తం తెలుసు. మనం అడిగేవి అడగకోయేవి కూడా తెలుసు. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే మనం చేసే ప్రార్థనలలో గొప్ప మార్పు వస్తుంది.

Content: భగవంతునికి ఆధీనులవటం అనేది మూడు విధాలుగా ఉంటుంది.

Content: మొదటి రకం ఆధీనత అనేది మన మేధస్సుని ఆధీనపరచటం. ఇది సులభమే. విశ్వశక్తి, భగవంతుడు అనేది చాలా గొప్పశక్తి. ఆ మేధస్సు మన మేధస్సు కంటే గొప్పది అని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆశక్తికి మనం మన ఆధీనపరుస్తాం. అంటే తెలివితేటల దశలో ఆధీనులవుతాము. అప్పుడు నిర్ణయాలు భగవంతునికి వదలగలుతాము.ఆ తరువాత ఆధీనత భావాత్మక దశలో జరిగేది. అటువంటివారు భగవంతుని స్మరించగానే కరిగిపోతారు. అలా అనుకోగానే 'ప్రేమ కృతజ్ఞతా భావం వారిలోంచి పొంగి ప్రవహిస్తుంది. కళ్ళ నుండి నీరు ప్రవాహంలా వస్తుంది. అప్పుడు వారు భక్తులుగా మారిపోతారు. ఈ సందర్భంలో రామకృష్ణ పరమహంస ఈవిధంగా చెబుతారు, "మీరు భగవంతుని కానీ గురుదేవుని కానీ స్మరించుకోగానే మీ కళ్ళలో నీరువస్తే, స్పష్టంగా తెలుసుకోండి. ఇది మీకు చివరి జన్మ అని, మీరు స్వేచ్ఛని పొందటానికి సిద్ధంగా ఉన్నారు అని"

Content: ఇక మూడవదశ స్పర్శేంద్రియాలని ఆధీనపరిచే దశ, ఇది చివరి దశ. రామకృష్ణ పరమహంస చెప్పిన స్వేచ్ఛని రెండవ దశలో పొందలేము. ఆ స్వేచ్ఛ ఈ దశలో పొందగలం. ఈ దశలో మనం మన స్పర్శేంద్రియాలని ఆయనకి ఆధీన పరుస్తాము. ఇదే సంపూర్ణ ఆధీనత. ఇది నిబంధనలు లేని అప్రయత్నంగా, సహజంగా జరిగే ఆధీసత.

Content: కృష్ణార్జునుల కథ :

Content: మహాభారతంలో వ్యాసమహర్షి శ్రీ కృష్ణుడు, అర్జునునికి గురించి ఒక చక్కని సంఘటనని వివరిస్తారు. ఒక రోజు సాయంత్రం సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడు అలా నడచి వెళుతుంటారు. వారు ఇద్దరూ మంచి

Page 46

Content: స్నేహితులు, బంధువులు దగ్గర దగ్గర ఒక వయస్సు వారు, చిన్నతనంలో కలసి ఆడుకున్నవారు. అంతే కాదు అర్జునుడు శ్రీ కృష్ణుని భక్తుడు. నిజానికి వారి మధ్య ఉన్న బంధం భగవంతుడు, భక్తుడు మాత్రమే.

Content: అలా నడుస్తూ ఉండగా ఆకస్మాత్‌గా కృష్ణుడు అక్కడ చెట్టు మీద ఉన్న ఒక కాకిని చూపిస్తూ, "అర్జునా! ఆ ఆకుపచ్చని కాకిని చూసావా?" అంటాడు.

Content: అప్పుడు అర్జునుడు, "అవును కృష్ణా! నేను ఆ ఆకుపచ్చని కాకిని చూసాను" అంటాడు. వాళ్ళు ఇంకా కొంచం ముందుకు వెళ్ళాక, శ్రీకృష్ణుడు మరొక కాకిని చూపించి, "అర్జునా! ఆ సల్లని కాకిని చూడు" అంటాడు. అప్పుడు అర్జునుడు, "కృష్ణా! నేను సల్లని కాకిని చూసాను" అంటాడు. కృష్ణుడు అర్జునిని వైపు తిరిగి, "అర్జునా! నీవు మూర్ఖుడివిగా ఉన్నావు. నేను నిన్ను తెలివైనవాడివి అని అనుకున్నాను. కాకి ఎలా ఆకుపచ్చగా ఉంటుంది? మొదటి నేను చూపించిన కాకి సల్లగా ఉన్నప్పుడు నీవుఎలా దానిని ఆకుపచ్చ కాకి అని అన్నావు? నీవు నన్ను ఆనందపరచాలని అలా అన్నావా?" అని అడుగుతాడు.

Content: అప్పుడు అర్జునుడు, "కృష్ణా! నీవు చూపించి, ఆకుపచ్చ కాకి అన్నప్పుడు నాకు ఆకుపచ్చని కాకి కనిపించింది. నేను ఏమి చేస్తాను. నేను అప్పుడు సల్లటి కాకిని చూడలేకపోయాను. నా కళ్ళు నా స్పర్శేంద్రియాలు నన్ను మోసం చేసాయి" అని జవాబు ఇస్తారు.

Content: అర్జునని స్పర్శేంద్రియాలు ఆయనని మోసం చేయలేదు. అవి భగవంతునికి ఆధీనమయిపోయాయి. ఒక్కసారి ఆ స్థితికి చేరితే ఇక వెనక్కి వచ్చే ప్రసక్తి ఉండదు. ఇదే సంపూర్ణమయిన ఆధీనత అంటే.

Content: కృష్ణుడు భగవద్గీతలో ఇలా చెబుతాడు, "మీరు నా ఆదేశాలనుతే మీకు నేను స్థాను ఇస్తాను" అని ఆయనని చేరటానికి మనం పూర్తి ఆధీనులమయిపోవాలి. మన స్పర్శేంద్రియాలని ఆధీనపరచాలి. మన చేతనస్థితి, మన తెలుసుకునే తత్వం సర్వం ఆయనే అయిండాలి. అప్పుడే మనం భగవంతుణ్ణి చేరగలం.

Content: నిజమయిన భక్తుడు భగవంతుని సందేశానికి దాసుడవుతాడు కానీ రూపానికి కాదు :

Content: నన్ను చాలామంది ఒక ప్రశ్న అడుగుతుంటారు. అది మతం పేరిట, ఆధ్యాత్మిక పేరు మీద లేదా భగవంతుని పేరు మీద ప్రపంచమంతా ఎందుకు ఇంత హింస జరుగుతుంది? ఎందుకు ఇన్ని పోరాటాలు జరుగుతాయి, అని.

Content: ముందుగా మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఇదంతా ఆధ్యాత్మికత కాదు. అలాగే ఇది ఏమతం యొక్క ఉద్దేశం కాదు. ఎన్నో సంవత్సరాలుగా అవతార పురుషుల, యోగీశ్వరులూ అంతిమ సత్యమయిన భగవంతుడిని గురించి చెప్పే సత్యం ఒక్కటే. అయితే ఆ సత్యాన్ని చెప్పే భాష, పద్దతి, మార్గం కాలానుగుణంగా, అప్పటి పరిస్థితులని బట్టి మారుతూంటాయి. అయితే ఇక్కడ జరిగే పోరపాటు ఏమిటంటే భక్తులు, అనుచరులు గురువులు చెప్పే మాటలు సందేశాలను పట్టించుకోకుండా వారి రూపానికి వారి పేరుకి ప్రాముఖ్యాన్ని ఇస్తారు.

Content: గీతలోని సందేశాన్ని వదిలివేసి కృష్ణుణ్ణి, అతని మురళిని, నెమలిపించాన్ని పట్టుకొని వేలాడితే వచ్చే ఫలితమే హింస. ఇది ఏ కాలానికైనా వర్తిస్తుంది.

Content: అలాకాకుండా శ్రీకృష్ణని సందేశాన్ని గ్రహించి ఆయన రూపానికి, పేరుకి ప్రాముఖ్యాన్ని ఇవ్వనప్పుడు వాళ్ళు నిజమయిన కృష్ణ భక్తులవుతారు. అటువంటివారు కృష్ణ ప్రేమని, శ్రీకృష్ణుని సేవా మార్గాన్ని ప్రపంచమంతా

Page 47

Content: వెదజల్లగుతారు. ఒక చిన్న కథ: వారణాసిలో శ్రీకృష్ణుని భక్తుడు : నేను మీకు వారణాసిలో నివసించే ఒక భక్తుని కథ చెబుతాను. అతను గొప్ప కృష్ణ భక్తుడు. అతని దగ్గర భగవద్గీత పుస్తకం ఉంది. ఆదే ఆయన సర్వస్వం, అదే అతని సర్వసంపద. అతనికి ఎటువంటి ఆస్తులు లేవు.

Content: శ్రీ కృష్ణ భక్తుడు ప్రతి రోజూ గంగానదిలో స్నానం చేసి ఒడ్డునే ఉన్న తన పూరిపాక దగ్గర ఉన్న చెట్టు క్రింద కూర్చొని ఆ గీతనిచదివేవాడు. శ్రీకృష్ణుని సందేశమయిన భగవద్గీతని అతను అత్యంత భక్తి పారవశ్యంతో చదివేవాడు. అలాగే కూర్చొని రోజంతా కృష్ణుని ధ్యానం చేసేవాడు. అతను నిరంతరం శ్రీకృష్ణుని భక్తి పారవశ్యంలో ఉండేవాడు. అతని ధ్యానం, ధ్యాస సర్వస్వం కృష్ణమయమే. అతను శ్రీకృష్ణుని చేతనస్థితిలో తనకు తానులీనమై తాను అనే విషయాన్ని మరిచిపోయే వాడు.

Content: ఆ భక్తుడి సంగతి ఆ ఊరివారందరికీ తెలుసు. అందరూ ఆయనని ఎంతో గౌరవంతో, భక్తితో ఆదరించేవారు. భారతదేశం, ఇక్కడి ప్రజలు ఈ విషయంలో ఎంతో గొప్పవారు. ఎవరైనా ఒక వ్యక్తి ఎటువంటి పనీపాట చేయకుండా, ఏ చెట్టుక్రింద అయినా కూర్చొని భక్తిపారవశ్యంలో ఉన్నా లేదా ధ్యానం చేసుకుంటూ ఉన్నా ఎవరూ వారి నిష్ఠలతని భంగపరచరు. వారే ఆ వ్యక్తి బాగోగులు చూసుకుంటారు. అదే మరే దేశంలో అయినా అయితే అటువంటివారిని తీసుకెళ్ళి జైళ్ళలోనో లేదా ఏదయినా శ్మశాన్లలో వేస్తారు.

Content: ఇలా ఉండగా, ఒక రోజు ఒక భిక్షగాడు అతని దగ్గరకి వచ్చి “స్వామీ! దయచేసి ఏమయినా ఇవ్వండి. నేను భోజనంచేసి మూడు రోజులు అయింది అని దీనంగా అడుగుతాడు”.

Content: ఆ భక్తునికి ఏమిచేయాలో తెలియదు. అతనే ఒక భిక్షగాడు. అతనికి ఉన్న ఏకైక ఆస్తి భగవద్గీత. ఆ సమయంలో భిక్షగాడు వచ్చి తాను మూడురోజుల నుంచీ ఏమీ తినలేదు అని అనగానే, భక్తుడు చాలా బాధపడతాడు. అతను తన పాకలో వెతుకుతాడు. ఆయనకి భగవద్గీత తప్పా ఏమీ కనిపించదు. ఆ పుస్తకమే అతని దైవం, అతని సర్వస్వం.

Content: ఆకస్మాత్‌గా ఆ భక్తుడు ధైర్యాన్ని తెచ్చుకొని,ఆ పుస్తకాన్ని చేతో పట్టుకొని, “అయ్యా! నా దగ్గర ఏమీ లేదు, ఈ పుస్తకం నీకు నేను ఇచ్చాను అని చెప్పి ఎవరికైనా అమ్ముకో. ఊరిలో చాలామందికి నేసంటే గౌరవభావం ఉంది. ఎవరైనా నీకు డబ్బులు ఇచ్చి ఈ పుస్తకాన్ని కొసక్కుంటారు. ఆ డబ్బులతో నీవు ఆకలి తీర్చుకో,” అని చెప్పి పుస్తకాన్ని ఆ భిక్షగాడికి ఇస్తాడు.

Content: భిక్షగాడు ఆ పుస్తకాన్ని తీసుకువెళ్ళిపోతాడు. మర్నాడు ఆ భక్తుడు గీత చదివే సమయంలో ఇలా అనుకుంటాడు, “శ్రీకృష్ణా నేను నీ మాటలని నిలబెట్టటానికి నీ మాటలని ఇచ్చివేసాను” అని

Content: ఇతను నిజమయిన భక్తుడు. అతను సత్యాన్ని చూడగలిగాడు. ఆ సత్యాన్ని అనుభవించాడు. ఆ అనుభూతులని వెల్లడి చేయగలిగాడు. అతను శ్రీకృష్ణుని ప్రేమని, సేవా మార్గాన్ని భక్తిని అందరికీ తెలియచేయగలిగాడు.

Page 48

Content: ఇటువంటి భక్తులు ఉన్నప్పుడు గొడవలు, పోరాటాలు హింసలు జరగవు. అలా కాకుండా గీతలోని సందేశాన్ని వదలి గీతనో, కృష్ణుణ్ణో పట్టుకొని వేలాడినప్పుడే సమస్యలు వచ్చేది.

Page 49

Content: Our Nithyananda Meditation Academies (NMA)

Content: INDIA:

Content: Nithyananda Dhyanapeetam

Content: Nithyanandapuri

Content: Kallugopahalli, Mysore Road, Bidadi

Content: Bangalore - 562 109

Content: Karnataka, INDIA

Content: Phone: 91 +80 65591844 / 27202084

Content: Fax: 91 +80 7288207

Content: Email: [email protected]

Content: URL: www.nithyananda.org

Content: Nithyananda Dhyanapeetam

Content: Sri Ananda Rajarajeshwari Temple,

Content: Nithyananda Giri

Content: Pashambanda Sathamrai Village, Shamshabad Mandal

Content: Rangareddy District

Content: Andhra Pradesh - 501 218, INDIA

Content: Ph.: +91 93470 65288

Content: E-mail: [email protected]

Content: Nithyananda Dhyanapeetam

Content: HYDERABAD CENTRE,

Content: Cell : 93910 35463

Content: Nithyananda Dhyanapeetam

Content: VISKHAPATNAM CENTRE

Content: Viskhapatnam District, Andhra Pradesh, INDIA

Content: Nithyananda Dhyanapeetam

Content: ELURU CENTRE,

Content: West Godavari District, Andhra Pradesh - 534 003, INDIA

Content: Ph : 08812 - 250712, Cell : 94908 26692

Content: Nithyananda Dhyanapeetam

Content: BHIMAVARAM CENTRE,

Content: West Godavari District, Andhra Pradesh, INDIA

Content: Ph : 9912144429, 99498 33599

Page 50

Content: మనలో ప్రతి ఒక్కరూ నిరంతరం వెతికేది ఆనందం కోసమే. ఆది జీవితంలో, అధికారంలోకి సంబంధించిన ఆందోళనలతో మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చిన్న సం

Content: ఘటన ద్వారా మనసు వెతికేడి కేవలం ఆనందం కోసమే. అయితే మనకు ఆ విషయం తెలియదు.

Content: మనం ఎంత అభిరుడి సాధించినా, ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించినా, ఎన్ని అత్యుత్తమ అవార్డులు పొందినా, ఎంత ధనశ్రర్మ సంపాదించినా, ఎంత పేరు ప్రతిష్టలు

Content: లు పొందినా చివరికి మనలో హుషారు పొర్తదుతుంది. ఆనందం ఉండదు. ఎందుకు?

Content: ఎందుకు మన సంతోషం తాత్కాలికంగా, పరిచలంగా ఉంటుంది? ఎందుకు

Content: మనం ఒక్కటికే శాశ్వతంగా ఆనందస్థితిలో ఉండలేకపోతున్నాము?

Content: ఎంత విశాలమయిన ప్రపంచం, ఇన్ని రకాల వస్తువులు, సౌథ్యాలు,విలాసాలు,

Content: ఐశ్వర్యం, చదువు, జ్ఞానం, మేధస్సు.... ఎందుకు మనసని శాశ్వత ఆనందస్థిలో

Content: ఉండలేకపోతున్నాము?

Content: Ebook ISBN:

Content: 979-8-88572-943-7

Content: నిత్యానంద ధ్యానపీఠం

Content: శ్రీ ఆనందేశ్వరి దేవాలయం

Content: పాశంబండ, సాతంరాయ్ విలేజ్,

Content: షంషాబాద్. రంగారెడ్డి జిల్లా. ఫోన్ : 93470 65288, 98665 00350

Content: www.nithyananda.org